21, ఏప్రిల్ 2018, శనివారం

సమస్య - 2657 (రాక్షసు లెల్లరుఁ జదివిరి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాక్షసు లెల్లరుఁ జదివిరి రామాయణమున్"
(లేదా...)
"రక్షస్సంఘ మహో పఠించెను గదా రామాయణంబున్ దమిన్"

127 వ్యాఖ్యలు:


  1. మా కాలపు జిలేబి రంగనాయకమ్మ గారి వ్రాలు గ :)

    సాక్షిగ మీరూ మేమూ
    వీక్షించితిమయ కవివర విరివిగనౌ విష
    వృక్షముగ జిలేబి పలుక
    రాక్షసు లెల్లరుఁ జదివిరి రామాయణమున్!

    జిలేబి

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు


    1. సాక్షిగ కవివరు లెల్లరు
      వీక్షింపన్, నాయకమ్మ విషవృక్షముగా
      కక్షల్గట్టి లిఖింపన్
      రాక్షసు లెల్లరుఁ జదివిరి రామాయణమున్!

      జిలేబి

      తొలగించు
    2. జిలేబీ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'మీరూ మేమూ' అనడం వ్యావహారికం. "మీరును మేమును" అనండి.

      తొలగించు

    3. మొదటి పూరణ లో రెండవ పాదం ఆఖరులో లఘువయ్యె :)


      జిలేబి

      తొలగించు
    4. అది మీ తప్పు కాదు...సాఫ్టువేరుది లెండి

      తొలగించు

    5. జీపీయెస్ వారు అంతే అంతే ! మా తప్పు కాదు :)

      ఇవ్వేళ్టి ఆక్రోశవాణి విశేషంబులెద్ది ?


      జిలేబి

      తొలగించు
    6. "విరివిగ విషపున్ । వృక్షము..." అందామా?

      తొలగించు
    7. జిలేబీ గారూ:

      స్తుతమతి యైన శంకరులు సూచనలెవ్విధి ప్రాప్తినొందిరో...

      తొలగించు

    8. కంది వారు ఏపదాన్నైనా లఘు గురువులుగా మార్చేయ గల సమర్థులు !


      నెనరుల్

      జిలేబి

      తొలగించు
  2. మైలవరపు వారి పూరణ

    కక్షావిష్టులు దుష్టవర్తనులు సంఘద్రోహులౌ నేతల...
    ధ్యక్షస్థానములందునుండి సభలందన్యాయహింసావళిన్
    దీక్షన్ ద్రుంచెదమంచు బల్క , గని దానిన్ పత్రికల్ వ్రాసెడిన్
    రక్షస్సంఘ మహో పఠించెను గదా రామాయణంబున్ దమిన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించు
    2. కుక్షిస్థంబగు కర్కశత్వమిట ., రక్షోజాతివాసమ్ము ప్ర...
      త్యక్షమ్మౌ నరకమ్ము , భక్తిఁగొని దివ్యత్వమ్ము సాధింపగా
      రక్షోపాయము రామనామమని తీర్మానించి , శ్రద్ధాళులై
      రక్షస్సంఘమహో పఠించెను గదా రామాయణంబున్ దమిన్ !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించు
  3. రక్షణ కొరకై దనుజుల
    వీక్షించి విభీషణుండు విశ్రుతమతియై
    దక్షత నాజ్ఞాపింపగ
    రాక్షసు లెల్లరు జదివిరి రామాయణమున్.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. బాపూజీ గారూ:

      మీరు కూడా శంకరాభరణం వ్హాట్సప్ సముదాయములో చేరితే బహు బాగుంటుందండీ. చాలా మంది కవులూ అవధానులూ మీ పూరణలను చదివి మీకు మిత్రులవుతారు...వారి పూరణలను చదివి ఆనందించే అవకాశం మీకూ ఉంటుంది...

      🙏🙏🙏

      తొలగించు
    2. రాక్షసవైరి చరిత్రను
      లక్షణమగు బడులలోన లంకలొ తొలుతన్
      దక్షుండు విభీషణుడిడ
      రాక్షసు లెల్లరు జదివిరి రామాయణమున్

      అంజయ్య గౌడ్

      తొలగించు
    3. బాపూజీ గారూ,
      విభీషణు డాజ్ఞాపించగా రాక్షసులు రామాయణాన్ని చదివారన్న మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      శాస్త్రి గారు చెప్పినట్లు మీ వాట్సప్ నెం. ఇస్తే మిమ్మల్ని 'శంకరాభరణం' వాట్సప్ సమూహంలో చేరుస్తాను.
      *****
      అంజన్న గారి పూరణ బాగున్నది. రాక్షసుల బడులలో రామాయణాన్ని విభీషణుడు పాఠ్యాంశంగా చేశాడనడం బాగుంది.
      'లంకలొ' అని 'లో' ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.

      తొలగించు
    4. చాల ప్రశస్తమైన యోచన బాపూజీ గారూ!
      👏🏻💐🙏🏻

      తొలగించు
    5. విభీషణోపదిష్టులైన దానవులు... నమోనమః 👏🤞🏻🙏

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించు
    6. చక్కని పూరణ. అభినందనలు.

      వీరబ్రహ్మేంద్రాచార్య.

      తొలగించు
    7. మిత్రులకు ధన్యవాదాలండీ! చాలా సంతోషం. నా whatsapp number +1 972 948 5253

      తొలగించు
  4. రక్షించుచు సంస్కృతమును,
    భక్షించుచు పృచ్ఛకులను బహువిధములుగా
    శిక్షించంగను, కవితా
    రాక్షసు లెల్లరుఁ జదివిరి రామాయణమున్

    ప్రత్యుత్తరంతొలగించు


  5. మోక్షంబున్గన విశ్వనాథుడట రామున్కల్పవృక్షంబనెన్
    కక్షల్గట్టుచు నాయకమ్మయు వురేయ్ కార్కశ్యమూర్తీ యనెన్
    సాక్షాత్కారము చేసుకున్న దెవరో ? సాధింప సత్సంఘమున్,
    రక్షస్సంఘ మహో పఠించెను గదా రామాయణంబున్ దమిన్!


    జిలేబి

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. జిలేబీ గారూ,
      చక్కని పూరణ. అభినందనలు.
      రెండవ పాదాన్ని "కక్ష ల్గట్టుచు రంగనాయకి యొరేయ్ కాఠిన్యమూర్తీ యనెన్" అనండి.

      తొలగించు

    2. విట్టు బాబుగారు

      మహా బలిపీఠం - వేదంలో యేముంది :)


      జిలేబి

      తొలగించు
  6. సాక్షాద్వాక్కాంతాసుతు-
    లక్షరముఖు-లద్భుతకవు-లవధాన మహా
    దీక్షా పరతంత్రులు, కవి
    రాక్షసులెల్లరుఁజదివిరి రామాయణమున్

    ప్రత్యుత్తరంతొలగించు
  7. మోక్షమంద వచ్చిరి,రావణాదులు చచ్చిరి
    సీతనదిగొ తెచ్చిరి ,లోకులెల్లరు మెచ్చిరి
    శిష్టులె కాదు దుష్టులును పఠింప జాలినన్
    రాక్షసులెల్లరు జదివిరి,రామాయణమున్

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. రమేశ్ గారూ,
      మీ భావానికి నా పద్యరూపం....

      మోక్షము నందెను రావణుఁ
      డక్షీణానందమున నరాధిపునకుఁ దా
      మా క్షితి తనయ నొసంగిరి,
      రాక్షసు లెల్లరుఁ జదివిరి రామాయణమున్.

      తొలగించు

  8. Ramayana and project management :)


    సాక్షీభూతుడు రామచంద్రు కథలోసాధ్యమ్ము మేనేజుమెం
    టూ,క్షంతవ్యము నేర్వ మేలుగయనన్ టూకించి మోడీ భళా
    దక్షత్వమ్మునుపెంచుకొమ్మనగ మేధాజీవులున్నాయకుల్,
    "రక్షస్సంఘ" మహో పఠించెను గదా రామాయణంబున్ దమిన్

    జిలేబి

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. జిలేబీ గారూ,
      మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
      'మేనేజిమెంటూ' అనడం ఒక్కటే పానకంలో పుడకల ఉంది. "మేనేజిమెం।టే క్షంతవ్యము నేర్వ మేలగు నంటం చీక్షించి..." అందామా?

      తొలగించు

  9. కం
    రాక్షస చిత్తపు నేతలు

    భక్షించిరి ప్రజల ధనము;ప్రాచితమునకై

    దీక్షలు బూనుచు మరి యీ

    రాక్షసులెల్లరు జదివిరి రామాయణమున్

    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘ వనపర్తి☘

    ప్రత్యుత్తరంతొలగించు
  10. సుక్షేమముగా నుండిరి
    రాక్షసు లెల్లరుఁ, జదివిరి రామాయణమున్
    దక్షత తోడ కుశలవులు
    శిక్షణ వాల్మీకి యిడగ, చెన్నగు స్వరమున్

    ప్రత్యుత్తరంతొలగించు
  11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2657
    సమస్య :: *రక్షస్సంఘ మహో పఠించెను గదా రామాయణంబున్ దమిన్.*
    రాక్షసులు రామాయణాన్ని చదివినారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: ఇచ్చిన మాట ప్రకారం వసుదేవుడు మొదట తనకు పుట్టిన బిడ్డను చంపమని కంసునికి ఇవ్వబోగా వద్దులే అని అంటాడు కంసుడు. క్రమంగా కొంతమంది కొడుకులు పుట్టిన తరువాత నారదుడు వచ్చి ఓ కంసుడా! నీవు కాలనేమి అనే రాక్షసుడివి. గడచిపోయిన త్రేతాయుగంలో విష్ణువు శ్రీ రాముడుగా పుట్టి రాక్షస సంహారం చేసినాడు. ఈ ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడుగా వచ్చి మిమ్ము చంపుతాడు అని చెప్పగా కంసుడు భయపడ్డాడు. అప్పుడు తమకు శత్రువుగా ఉండిన శ్రీరాముని పరాక్రమ మెంతో తెలికోవాలనే కుతూహలంతో కంసునికి అనుచరులైన రాక్షసు లందఱూ రామాయణాన్ని చదివినారు అని విశదీకరించే సందర్భం.

    రక్షించెన్ గద సాధులోకమును శ్రీ రాముండు , శౌర్యమ్మునన్
    శిక్షించెన్ గద రాక్షసాళి , నిపుడున్ శ్రీ కృష్ణుడై వచ్చెడిన్
    వీక్షింపుం , డని నారదుండు బలుకన్ , భీతిల్లె కంసుం , డటన్
    *రక్షస్సంఘ మహో పఠించెను గదా రామాయణంబున్ దమిన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (21-4-2018)

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. విలక్షణమైన ఊహ! అద్భుతం శ్రీ రాజశేఖర్ గారూ!

      తొలగించు
    2. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించు
    3. అధ్భుతమైన పూరణ కోటావారూ
      🙏🏻💐

      తొలగించు
    4. నాపై అభిమానంతో ఈ రోజు నా పద్యమును గొప్పగా ప్రశంసించిన కవి పండితులగు
      శ్రీ చిటితోటి నిజయకుమార్ గారికి,
      గురువరేణ్యులు శ్రీ కంది శంకరయ్య గారికి, సహృదయులు శ్రీ ps విట్టు బాబు గారికి హృదయపూర్వక ప్రణామాలు.

      తొలగించు

    5. ఆహా! కంసుని సంఘం చేత చదివించేరే !అదురహో!


      అవధానులవశ్యముగా
      నవధానులెగద జిలేబి, నాధము తో లా
      గి వశము జేయ నెవరయిన
      రవమ్ముగ చదువుదురమ్మ రామాయణమున్ :)


      జిలేబి

      తొలగించు
    6. నేటి నా సమస్యాపూరణ పద్యానికి
      శ్రీ చిటితోటి విజయకుమార్ గారి
      అనువాదం (సంస్కృత శ్లోకం)

      రరక్ష సాధూన్ దనుజాన్ శిశిక్షే
      రామోఽధునాఽఽస్తేత్విహ కృష్ణరూపే
      శ్రుతే సురర్షేర్వచనే చ కంసే
      రక్షోగణా రామకథాం పఠన్తి

      తొలగించు
    7. నేటి నా పద్యమును పద్యరూపంలో ప్రశంసించిన సహృదయులు శ్రీయుతులు జిలేబి గారికి హృదయపూర్వక ప్రణామాలు.

      తొలగించు
  12. భక్షకులే నేతలుగా
    రక్షకులుగ రూపుమార్చి రధికారముకై
    ప్రక్షాళన చేతుమనుచు
    "రాక్షసు లెల్లరుఁ జదివిరి రామాయణమున్"

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అధికారమునకై' అనడం సాధువు. "మార్చి రధికారముతో" అందామా?

      తొలగించు
    2. ధన్యవాదాలు గురువుగారూ
      🙏🏻

      తొలగించు
  13. దక్షత తో పాలించు చు
    రక్షణ కల్పించి నట్టి రాముని కథ యౌ
    యక్షులు 'కి న్నరు లు నరులు
    రాక్షసు లె ల్లరు జ ది వి రి రామాయణ ము న్

    ప్రత్యుత్తరంతొలగించు
  14. దక్షులు లంకేశునకున్
    కక్షలనేప్రోత్సహించి కలహము బెంచన్
    తక్షణ రక్షకు కలలో
    రాక్షసు లెల్లరు జదివిరి రామాయణమున్

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇక్కడ 'దక్షులు, రక్షకుడు' ఎవరు?

      తొలగించు
  15. మిత్రులందఱకు నమస్సులు!

    శిక్షించెన్ రఘురాముఁడే యసురసంసేవ్యుండునౌ రావణున్
    మోక్షం బిచ్చి, విభీషణున్ దనుజ భూపుం జేయఁ, దత్సేవకుం
    డ్రీక్షింపన్, శరణంబు నిచ్చి, యపుడా శ్రీరాముఁ డేఁగంగఁ, ద
    ద్రక్షస్సంఘ మహో, పఠించెను గదా, రామాయణంబున్ దమిన్!

    ప్రత్యుత్తరంతొలగించు
  16. శిక్షిత దనుజుల గతులను
    వీక్షించి, వెఱపున శరణు వేడుచు రామా!
    రక్షణనీమని మిగిలిన
    రాక్షసులెల్లరు చదివిరి రామాయణమున్

    - శ్రీకాంత్ గడ్డిపాటి

    ప్రత్యుత్తరంతొలగించు
  17. కందం
    రాక్షస రావణు తప్పుల
    లక్షించి, నెదుర హరిఁ, బునరావృతము విడన్
    శిక్షణమా యను రీతిన్
    రాక్షసు లెల్లరుఁ జదివిరి రామాయణమున్!

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించు
    2. గురుదేవులకు ధన్యవాదములతో వారు సూచించిన సవరణతో:

      కందం
      రాక్షస రావణు తప్పుల
      లక్షించి, యెదుర హరిఁ, బునరావృతము విడన్
      శిక్షణమా యను రీతిన్
      రాక్షసు లెల్లరుఁ జదివిరి రామాయణమున్!

      తొలగించు
  18. రక్షించి యడాగమముల
    భక్షించుచు నచ్చుల తన పద్యరచన లో
    శిక్షకు నాజ్ఞను గని కవి
    రాక్షసు లెల్లరుఁ జదివిరి రామాయణమున్

    ప్రత్యుత్తరంతొలగించు
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దీక్షగ రావణు సభలో
    సాక్షాత్కారముగ రామ చరితము నెంచు
    న్నాక్షణమె హనుమ తోడుగ
    రాక్షసులెల్లరు జదివిరి రామాయణమున్

    ప్రత్యుత్తరంతొలగించు
  20. నేటి నా సమస్యాపూరణ పద్యానికి
    శ్రీ చిటితోటి విజయకుమార్ గారి
    అనువాదం (సంస్కృత శ్లోకం)

    రరక్ష సాధూన్ దనుజాన్ శిశిక్షే
    రామోఽధునాఽఽస్తేత్విహ కృష్ణరూపే
    శ్రుతే సురర్షేర్వచనే చ కంసే
    రక్షోగణా రామకథాం పఠన్తి

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. చిటితోటి వారి సంస్కృతానువాదం అద్భుతంగా ఉన్నది. వారికి అభినందనలు.

      తొలగించు
    2. బ్రహ్మాండంగా ఉన్నదండీ సీవి గారూ మీ సంస్కృతానువాద శ్లోకం! అభినందనలు!

      తొలగించు
    3. శంకరయ్య గారూ, మధుర కవి గారూ! ధన్యవాదాలు.

      తొలగించు
  21. దీక్షయె రూపెత్తిన బల్
    దక్షత గలవాడెటులని దశరథ సుతుడే
    కుక్షింబరు లయినను నా
    "రాక్షసు లెల్లరుఁ జదివిరి రామాయణమున్"

    ప్రత్యుత్తరంతొలగించు
  22. డా.పిట్టాసత్యనారాయణ
    పాక్షిక 'మావో'రచనల
    సాక్షిగ రష్యాయె నాడు సాధించె బ్రజన్
    వీక్షణ బెరుగన్ జనగణ
    రాక్షసులెల్లరు జదివిరి రామాయణమున్ ( democracy or Ramaraajya way of rule)

    ప్రత్యుత్తరంతొలగించు
  23. రాక్షస వంశపు శత్రువు
    రాక్షసుడగు రావణుండ లంకేశుండే
    రక్షకుడే రాము డనుచు
    రాక్షసులెల్లరు జదివిరి రామాయణమున్

    ప్రత్యుత్తరంతొలగించు
  24. శార్దూలవిక్రీడితము
    సాక్షాత్శ్రీ హరి శత్రువంచు మదిలోజాడ్యంబు పీడించగన్
    కక్షల్ దీరుట సాధ్యమే యసురులున్కార్పణ్యమున్ వీడగన్?
    రక్షోపాయమునన్ గతానుభవ నేరమ్ముల్ నిరోధించగన్
    రక్షస్సంఘ మహో పఠించెను గదారామాయణంబున్ దమిన్!

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించు
    2. మొదటి పాద సవరణతో

      శార్దూలవిక్రీడితము
      సాక్షాచ్ఛ్రీ హరి శత్రువంచు మదిలోజాడ్యంబు పీడించగన్
      కక్షల్ దీరుట సాధ్యమే యసురులున్కార్పణ్యమున్ వీడగన్?
      రక్షోపాయమునన్ గతానుభవ నేరమ్ముల్ నిరోధించగన్
      రక్షస్సంఘ మహో పఠించెను గదారామాయణంబున్ దమిన్!

      తొలగించు
  25. అక్షరుని కీర్తి పొగడెను
    రాక్షస పురిని హరి సంప రాయుడు ఘనతన్,
    ప్రేక్ష వికసింప సభలోన్
    రాక్షసు లెల్లరుఁ జదివిరి రామాయణమున్

    ప్రహ్లాదుడు హరినామ స్మరణము చేయునపుడు గురుకులములో చండామార్క సహిత రక్కసులెల్లరు కొలది సేపు అసంకల్పితముగా హరి భజన చేసి నారు. అదే రీతి లంకలో రావణుని ఎదుట హనుమంతుడు రామ కీర్తి పొగడు చుండ బుద్ది గల రాక్షసులు రామాయణమును చదివిరి అని భావన ప్రేక్ష = బుద్ది హరి సంప రాయుడు గాలి కొడుకు

    ప్రత్యుత్తరంతొలగించు
  26. రక్షకుఁడు సాధు జనులకు
    శిక్షకుఁ డఘ కర్ముల కిల శ్రీరాముండే
    యక్షయ గాథ, లయం బవ
    రాక్షసు, లెల్లరుఁ జదివిరి రామాయణమున్


    సాక్షాద్విష్ణు చరిత్ర రావణ వధాసామాన్య కర్మార్థ స
    న్నిక్షిప్తాసదృశావతారిత కథా నిర్ద్వంద్వ చారిత్ర మీ
    కుక్షిస్థాపిత విశ్వు గాథ సకలక్షోణీ జనంబే వినా
    రక్షస్సంఘ మహో పఠించెను గదా రామాయణంబుం దమిన్

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. కామేశ్వరరావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించు
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించు

    3. సాక్షాత్ విష్ణు చరిత్ర రావణ వధ అసామాన్య కర్మ, అర్థ సన్నిక్షిప్త అసదృశ (అసమాన ?) అవతారిత కథ, నిర్ద్వంద్వ చారిత్రము కుక్షి (ఇక్ష్వాకుని కొడుకు
      వి కు పక్షి యొక్క తండ్రి) స్థాపిత విశ్వు (విష్ణువు) గాథ , సకల క్షోణీ (భువి) జనము , వినారక్షస్సంఘము (రాక్షసులు గాని వారు)!


      హమ్మయ్య సరియేనాండి పోచిరాజు వారు ?

      జిలేబి      తొలగించు
    4. *కుక్షి - ఇక్ష్వాకుని కొడుకు , వికుక్షుని తండ్రి

      తొలగించు
    5. జిలేబి గారు నమస్సులు. నిజమే కుక్షి వికుక్షు లిక్ష్వాకు వంశస్థులే. కానీ యిక్కడ:
      కుక్షి స్థాపిత విశ్వుఁడు : కడుపు నందు నిలుపబడిన విశ్వము కలవాడు, విష్ణువు.

      తొలగించు

    6. వామ్మో ! ఇంత లోతైన విషయమున్నదన్న మాట !

      చాలా బాగున్నదండీ

      జిలేబి

      తొలగించు
  27. దీక్షగ రావణు స్తుతినే
    రాక్షసు లెల్లరు జదివిరి, రామాయణమున్
    లక్షణముగ సీత వినగ
    వృక్షము నందుండి బలికె విన్నుమనుమడే!!!

    ప్రత్యుత్తరంతొలగించు
  28. ఈక్షితిన రామసేతుకు
    సాక్షికములకొఱకు నతిగచర్చసలుపుచున్
    వీక్షణము చేయ పాలక
    రాక్షసులెల్లరు జదివిరి రామాయణమున్

    రాక్షసుడు = అసాధ్యుడు(మూలం-ఆంధ్రభారతి)

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. సీతారామయ్య గారూ,
      రాక్షస శబ్దానికి ఉన్న అన్యార్థంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'క్షితిని' అనండి.

      తొలగించు
    2. సీతారామయ్య గారూ,
      రాక్షస శబ్దానికి ఉన్న అన్యార్థంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'క్షితిని' అనండి.

      తొలగించు
    3. ధన్యవాదములు. శంకరయ్య గారూ

      తొలగించు
  29. అక్షీణంబగు వీరవిక్రమముతో నా దేవతానీకమున్
    శిక్షించెం గద దైత్యలోకపు యశశ్శ్రీ మించగా నుగ్రమై
    యక్షయ్యంబుగ పంక్తికంఠు డతడే యారాధ్యుడౌ నంచు నా
    రక్షస్సంఘ మహో పఠించెను గదా రామాయణంబున్ దమిన్.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. మిస్సన్న గారూ,
      నిజమే. రామాయణంలో రావణుని విజయగాథలూ ఉన్నవి. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించు
    2. ధన్యవాదాలు గురువు గారికి.

      తొలగించు
  30. రక్షించుచు లోకమును సు
    భిక్షమ్మొనరించునని విభీషణు డచటన్
    శిక్షకులకానతివ్వగ
    రాక్షసు లెల్లరు జదివిరి రామాయణమున్

    ప్రత్యుత్తరంతొలగించు
  31. భక్షింతురు నర మాంసము
    రాక్షసులెల్లరు, జదివిరి రామాయణమున్
    రక్షను గోరుచు జనులు సు
    భిక్షమొసగెడు కృతియనుచు విశ్వాసముతో

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, చక్కగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించు
  32. ప్రత్యుత్తరాలు
    1. రక్షించంగను తీసుకొమ్మని మహిన్ రాధస్సు జల్లించుచున్
      శిక్షించంగను భారతావనిని నాక్షేపించి కవ్వించుచున్
      భక్షించంగను లంకవాసుల మహా భాగ్యమ్ము, చీనీయులౌ
      రక్షస్సంఘ మహో పఠించెను గదా రామాయణంబున్ దమిన్

      ...China's Belt & Road Strategy in Sri Lanka

      తొలగించు
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      బాగున్నది మీ పూరణ. అభినందనలు.

      తొలగించు
  33. డా.పిట్టా సత్యనారాయణ
    పక్షంబెన్నగ శూద్రుడైన నియమాల్ బాటింప బారుండునౌ
    ద్రాక్షారామము లోని దుష్టులకు నా రక్షాంశయే దేలు నీ
    వీక్షాలంకృతినిన్ విభీషణుడు కాపే(రక్షకుడు)యైన లంకన్ సదా
    రక్షస్సంఘమహో పఠించెనుగదా రామాయణంబున్ దమిన్,

    ప్రత్యుత్తరంతొలగించు
  34. సుక్షత్రీయుడు రామచంద్రుడిల తా సూర్యాన్వయుండై భువిన్
    రక్షింపన్ దనుజాంతకుండగుచు ధర్మస్థాపనన్ జేసె నా
    సాక్షాత్ కేశవు డంచు పాలకుడటన్ శాసింపగా లంకలో
    రక్షస్సంఘమహో పఠించెను గదా రామాయణంబున్ దమిన్.

    ప్రత్యుత్తరంతొలగించు
  35. పాలెం ప్రాచ్య కళాశాల నిలవాలంటే సంతకాలు, ధర్నాలు, వినతులకన్నా ప్రాచీనవిద్యను చదివేలా వేలమందిని చేర్పించడం మంచిదేమో!

    దీక్షాదక్షమహోక్షలక్షితమహా ధీప్రాజ్ఞవిద్వజ్జన
    త్ర్యక్షైశ్శిక్షితఛాత్రపండిత విశాలాంతాకళాశాల ని
    ర్వక్షస్తన్యశిశోరనాధరుదనం బైనట్టి చందంబు సం
    రక్షస్సంఘమహో పఠించెనుగదా! రామాయణంబున్ దమిన్
    పక్షిప్రాగ్గమనేవశుష్కఫలితం బాశానిరాశా వృధా
    శిక్షార్థుల్చదువంగఁజేర్చుడి పురాశేషంబుఁగాపాడగాఁ

    గౌరీభట్ల బాలముకుందశర్మ,
    గోలోకాశ్రమము.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. అక్షర లక్షలు
      భాషాలక్ష్మి పదములన్ అక్షతలు.
      తక్షణ కర్తవ్యములు.
      "పూఁత మెఱుంగులుం" జ్ఞప్తికి వచ్చిన క్షపణ్యువు లేదు.

      తొలగించు
  36. రాక్షస రావణు మరణము
    పక్షము హీనతను తలచి పరుగిడ వారే
    రక్షణ జేయ విభీషణ
    రాక్షసు లెల్లరుఁ జదివిరి రామాయణమున్

    Dr Varalakshmi
    Bangalore

    ప్రత్యుత్తరంతొలగించు
  37. శిక్షకుడు చదువులకు సం
    రక్షణముగ చేతియాభ రణమును చూపన్
    తక్షణమే యాబాలక
    రాక్షసులెల్లరు జదివిరి రామాయణమున్

    శిక్షకుని చేతియాభ రణము = బెత్తం

    గురువర్యా! ప్రాస నియమున్నచోట పైవిధముగా కొన్ని పాదములు లఘువు తోను కొన్ని పాదములు గురువు తోను మొదలు పెట్ట వీలున్నదా? సందేహము తీర్చ గోరెదను

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ప్రాసాక్షరం ద్విత్వ, సంయుక్తాలైనపుడు వాని ముందున్న అక్షరాలు గురువులవుతాయి. గురువైతే చాలు. హ్రస్వ దీర్ఘాలన్న పరిభాష వ్యాకరణానికి సంబంధించినది.
      పద్యము, వాద్యము, హృద్యము, ఖాద్యము.... వర్గము, భార్గవ, దుర్గ, మార్గము... ఇలా ప్రయోగించవచ్చు.

      తొలగించు
    2. ధన్యవాదములు శంకరయ్య గారూ🙏🏽

      తొలగించు  38. శిక్షించును రాముడనిరట

    రాక్షసు లెల్లరుఁ ,జదివిరి రామాయణమున్

    దీక్షగ వనిలోఛాత్రులు

    రక్షించెడువాడిల రఘురాముడటంచున్.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "రాము డనిరి" అనండి.

      తొలగించు
  39. దక్షత లున్నను గురువులు
    శిక్షణలో శిష్యులన్న జెరిపెడిగుణమే
    రక్షణమాన్పగబడిలో
    రాక్షసు లెల్లరు జదివిరి రామాయణమున్ (గురువులు)

    ప్రత్యుత్తరంతొలగించు
  40. గురువు గారికి నమస్సులు
    మోక్షం బువచ్చు హరిహర
    దీక్షా బరులకు విలసిత ధీమంతులకున్.
    సూదక్షావధాన ధారణ
    రాక్షసు లెల్లరు జదివిరి రామాయణమున్.

    ప్రత్యుత్తరంతొలగించు
  41. ప్రత్యుత్తరాలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దీక్షాపరులకు' అనండి. 'సుదక్షావధాన' మన్నచోట గణదోషం. "ధీవరులకు సూ। దక్షావధాన ధారణ..." అనండి.

      తొలగించు

  42. .. .సమస్య
    *"రక్షస్సంఘ మహో పఠించెను గదా*
    *రామాయణంబున్ దమిన్*

    సందర్భము: విభీషణుని కుమారుడైన నీలుడు "మన రాజగృహంలో చింతామణి కల్పవృక్షం కామధేనువు లేవు. దేవేంద్రుని జయించి తెస్తా" నన్నాడు. విభీషణుడు "రాముడే నాకు సర్వస్వం. ఆయన దయవల్లనే దేవేంద్రాది దిక్పాలకులు నాకు వశులై వున్నారు." అని...
    "నీ వన్నవి దేవతల నుపాసింపక మానవులకు శక్య మగునవి కావు. గురు శుశ్రూష చేయుము." అన్నాడు.
    నీలుడు శుక్రాచార్యుని పన్నెండేండ్లు సేవించినాడు. ఆతడు పంచవక్త్ర హనుమ న్మంత్రా న్నుపదేశించినాడు. నీలు డెంతో కఠిన దీక్షతో దానిని సాధించగా హనుమంతుడు ప్రత్యక్షమైనాడు.
    "చింతామణ్యాదికం దివ్య
    రత్న జాత మవాప్స్యసి
    చింతామణి మున్నగునవి పొందగలవు. దేవతా రత్నమువంటి "వనసుందరి" అనే యువతిని పొందగలవు. బ్రహ్మ నీవు కోరకున్నా వర మీయగలడు." అని పలికి దీవించినాడు.
    నీలుడు స్వర్గంపై దండెత్తి ఇంద్రుని జయించి చంపబోగా బ్రహ్మ దేవుడు వచ్చి విడిపించినాడు. నీలుని కోరికలు తీర్చినాడు. అత్రిమహర్షి కూతురు వనసుందరి నిన్ను వరించు నన్నాడు. *నీలాద్రి* యని ప్రసిద్ధిగన్న పురుషోత్తమ క్షేత్రంలో (పూరీ) వనసుందరీ సమేతుడవై పూజింప బడుతా వన్నాడు.
    నీలుడు తిరిగివచ్చి విజయోత్సవం ప్రకటించి హనుమ త్ప్రీత్యర్థం రామకథా ప్రదర్శనలు రామాయణ పారాయణలు జరిపించినాడు.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    దక్షుండౌ దనుజేంద్ర సూతి హనుమ
    ద్భక్తుండు గెల్చెన్ సహ
    స్రాక్షున్.. వేలుపు గిడ్డి, దేవమణి, క
    ల్పాగంబులన్ దెచ్చెడిన్..
    సాక్షాద్భర్గుడె కొల్వు డంచు హనుమన్..
    చాటింపు వేయింపగా
    రక్షస్సంఘ మహో పఠించెను గదా
    రామాయణంబున్ దమిన్

    దనుజేంద్ర సూతి= రాక్షసరాజైన విభీషణుని కుమారుడు,నీలుడు

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    ప్రత్యుత్తరంతొలగించు