29, ఏప్రిల్ 2018, ఆదివారం

సమస్య - 2664 (శ్రీరాముఁడు శివునిఁ జంపె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"శ్రీరాముఁడు శివునిఁ జంపె సీతకు సుతుఁడై"
(లేదా...)
"శ్రీరాముండు త్రినేత్రుఁ జంపెను గదా సీతమ్మకుం బుత్రుఁడై"
(గోటేటి శివరామకృష్ణ గారికి ధన్యవాదాలతో...)

133 కామెంట్‌లు:

  1. మైలవరపు వారి పూరణ

    "శ్రీరాముండు త్రినేత్రుఁ జంపెను గదా సీతమ్మకుం బుత్రుఁడై"
    ఔరా ! కర్ణకఠోరవాక్యమిది ! మద్యంబెంత సేవించితో !
    మా రాముండును శంకరుండును సదా మాన్యుల్ , సమస్యార్థమై
    వారిన్ జంపుట పాపహేతువగు నే వారింతునీరీతులన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఔరా ! వాక్యములెన్ని లేవు ? ధరలో నర్ధాంతరానంద గం...
      భీరోదారఛలోక్తిరూపములు ??., సాధ్వీజాతినిందోక్తులున్
      శ్రీరామేశులమారణార్థములె సూచింపన్ సమస్యావళిన్
      ఘోరాఘబంగు పల్కినన్ వినిన మాకున్ మీకు , యానందమె...
      ట్లౌ ? రమ్యంబగు పూరణంబెటులు సాధ్యమ్మౌ ? ఫలంబేమిటో
      మీరాశించినదిట్టి వాక్యముల ? స్వామీ ! మీకు కైమోడ్చెదన్
      నేరంబున్ బొనరించువాడు మరి దానిన్ మెచ్చువాడున్ మహా
      క్రూరుల్ గారె ? గణమ్ము ప్రాస యతులన్ గూర్పంగ పద్యమ్మొకో ?
      సారించున్ కవి దృష్టి పూరణకు , భాస్వద్భావముల్ దోపగా
      పూరింపన్ రమణీయపద్యసుమముల్ బుష్పించు , గంధమ్ములున్
      తోరంబై మకరంద బిందు
      మధురోక్తుల్ నింపి పద్యమ్ములన్
      భారత్యంఘ్రిసమర్పణమ్ము సలుపన్ భద్రమ్ము చేకూరెడిన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

    2. మైలవరపు వారి శార్దూలము
      విన్నకోట నరసరాయల వారి 'పలుకుల్లా' :)
      వుంది

      అద్బుతం

      జిలేబి

      తొలగించండి
    3. అధిక్షేపాత్మకమైన మైలవరపు వారి పూరణ, పద్యం అద్భుతంగా ఉన్నవి. వారికి అభినందనలు.
      మిత్రులు సమస్య లంపిన
      నాత్రమ్మున స్వీకరించి తవి ప్రకటింపన్
      బాత్రుఁడ నిందకు, వాణీ
      పుత్రుఁడవయ మైలవరపు మురళీకృష్ణా!

      తొలగించండి
    4. కంది వారికి వందనములు..

      మీరేదోసము జేయలేదొరులు పంపింపన్ సమస్యావళిన్
      వారింపన్ దగు వీలులేక ప్రచురింపన్ జూచువారింతియే !
      భారమ్మయ్యె మనమ్ము జూడగనె ప్రాభాతంపు వేళన్ మహో...
      దారా ! శంకర ! మిత్ర ! నొచ్చుకొనరాదయ్యా ! నమోవాకముల్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    5. దత్త సమస్య పరికింప శబ్ద సమూహమే కాని నిశ్చితార్థ వాక్యము కాదు.
      దానిని యోగ్యము నర్థవంతపు వాక్యముగా మార్చు నేర్పును దిలకించుట కీయఁ బడునని నా యభిప్రాయము.
      అధిక్షేపణయు నొక విధమైన పూరణమే.
      ఈ ప్రక్రియ సమస్యాపూరణ పర్యంతమే గ్రహించ దగును. అన్యథా భావించ దగదు.

      తొలగించండి


    6. ఆరాటంబదియేల మైలవరపయ్యా!యిర్వురున్నొక్కరే
      శ్రీరాముండు, త్రినేత్రుఁ, ! జంపెనుకదా, సీతమ్మకుం బుత్రుఁడై
      స్వారాట్వైరిని దుర్జయున్ కుశుడు నిస్వార్థమ్ముగానేలెన
      య్యా రాజ్యంబు కుశస్థలిన్నిలిపెనయ్యా!యింద్రుడిన్కొల్చెనే!

      తొలగించండి
    7. కామేశ్వర రావు గారూ,
      ధన్యవాదాలు!
      *******
      జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    8. శ్రీ కామేశ్వరరావు గారితో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను.సమస్యాపూరణ ఒక ప్రహేళికా హేల.ఆక్షేపణను కూడా ఒక పూరణగానే భావిద్దాము.In my view this programme has been spotlessly clean!

      తొలగించండి
    9. నీరున్ ద్రావడు , మద్యమే కుడుచు , దానిన్ ద్రావి పెన్మత్తునన్
      నీరేజమ్ములు గ్రుంకబోవుటకు ముందే తాను నిద్రించెడున్ !
      మా రంగయ్య , కలల్ గనున్ , కలవరింతన్ పల్కెనీరీతిగన్
      శ్రీరాముండు త్రినేత్రుఁ జంపెను గదా సీతమ్మకుం బుత్రుఁడై !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

    10. సోమపానము పుచ్చుకున్న రంగడి కలలోనే అట్లా కనిపించేడా !


      నారాయణ ! నారాయణ!

      జిలేబి

      తొలగించండి
  2. ఆరావణు జంపెనెవరు?
    ఏరిని పెండ్లాడెనుసతి? ఎటులవ మరునిన్?
    ఏరీతి బట్టె తురగము?
    శ్రీరాముఁడు; శివునిఁ ; జంపె; సీతకు సుతుఁడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సార్!
      సమస్యను పంపిన శ్రీ గోటేటి శివరామకృష్ణ గారి కంద, శార్దూల, పూరణలు చూడవలెనని కుతూహలముగనున్నది.

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      శివరామకృష్ణ గారు పంపిన సమస్య "శ్రీరాముండు త్రినేత్రు వేడెను గదా సీతమ్మకుం బుత్రుఁడై".
      'వేడెను'ను 'చంపెను'గా మార్చిన పాపకర్ముడను నేను.

      తొలగించండి
    3. 🙏🙏🙏

      "న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ | అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూపః శివోహం శివోహం |"

      తొలగించండి
    4. "వేడెను" లో సమస్యయే లేదు."చంపెను" పదముతో కదా యిది సమస్యా రూపాన్ని సంతరించుకున్నది !
      "కుశుడు శ్రీరామునకు పెద్ద కొడుకు కదర"
      ఇది పేలవమైన సమస్య కాని సమస్య కదా !

      తొలగించండి
  3. సమస్య : -
    "శ్రీరాముఁడు శివునిఁ జంపె సీతకు సుతుఁడై"

    కందము*

    శ్రీ రామాయణమన్నను
    భారత మన్నను తెలియని బాలలు నేడున్
    మారుపులతో పలికెదరు
    శ్రీరాముఁడు శివునిఁ జంపె సీతకు సుతుఁడై
    ..............✍చక్రి

    రిప్లయితొలగించండి

  4. శరణు శరణు సహకార శకార జిలేబి!



    రార! శకారుడ! నేర్పుమ
    యా రామాయణమనన్ సయాటల చెప్పెన్
    "చారంబందున బుట్టెన్
    శ్రీరాముఁడు శివునిఁ జంపె సీతకు సుతుఁడై"

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. పారా వారము దాటుచు
    శ్రీరాముఁడు , శివుని జంపె సీతకు సుతుఁడై
    ఔరా యెవరా తనయుడు
    ఆరా వణుకంటె గబ్బి హాహా వినగన్

    గబ్బి = ఘటికుడు , ధీరుడు . వగైర వగైరా

    రిప్లయితొలగించండి


  6. పేరాయెన్ శివరామకృష్ణ! తగునా వేవేళ గోటేరుతో
    మారామున్ భళి దున్ని కైపదముగన్ మార్చన్! జిలేబీయమే!
    యోరోరీ! కవిరాట్! సయోధ్యయవదే!యోక్త్రంబదెద్దానితో
    శ్రీరాముండు త్రినేత్రుఁ జంపెను గదా సీతమ్మకుం బుత్రుఁడై?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమ్మా జిలేబీ,
      ఈ దూషణలకు పాత్రుడను నేనే. ఎందుకంటే పాపం శివరామకృష్ణ గారు 'త్రినేత్రు వేడెను' అంటే నేను 'త్రినేత్రుఁ జంపెను' అని మార్చాను.

      తొలగించండి

    2. కంది వారు సమస్యను పరిష్కరించేసా మీకు అపవాదిక రాదు
      శ్రీరాముని అహమున్ చంపెను లవుడు :)


      జిలేబి

      తొలగించండి
    3. నిజం ! ఇది పూరణయే కానీ ఆక్షేపణ కాదు !
      " కల్లు ద్రావితివా?"; "పిచ్చెక్కెనా ?" అన్న పూరణలన్నో గతంలో మన బ్లాగులో రాలేదా ?అటువంటిదే యిదీ!

      తొలగించండి
  7. ఓరీ యెవ్వారు బలికె,
    శ్రీ రాముడు శివుని జంపె సీతకు సుతుడై
    మారుని కోర్కెను దీర్పన్,
    రారా యనికవి బలికె ను రౌద్రము తోడన్

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా సత్యనారాయణ
    భారత సీతకు పుత్రులు
    తీరా నిలువడ్డదార్ల(నిలువునామం,రామానుజం;అడ్డదార్లు,మూడు అడ్డ నామాలవారు)వీరంగములే
    పోర!నిరాకారమె మేల్
    శ్రీ రాముడు శివుని జంపె సీతకు సుతుడై!

    రిప్లయితొలగించండి
  9. కవిమిత్రులకు మనవి...
    శివరామకృష్ణ గారు పంపిన సమస్య "శ్రీరాముండు త్రినేత్రు వేడెను గదా సీతమ్మకుం బుత్రుఁడై".
    'వేడెను'ను 'చంపెను'గా మార్చిన పాపకర్ముడను నేను. దూషణలకు నేను, భూషణలకు శివరామకృష్ణ గారు పాత్రులం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దూషణ లేలకొ గురువర
      భాషణమది భావయుక్త పద్యము కొఱకై!
      వేషము లెన్నియొ గలవు సు
      భాషితముల గూర్చుటకును బాపము కాదే!!
      🙏🏻

      తొలగించండి
  10. 'వేడెను' పదమును మార్చితిఁ
    బాడి యనక 'చంపె' ననుచుఁ బాపము నాదే
    వేడుకొనెద మన్నింపగ
    నే డెందరి దూషణలకుఁ నేఁ బాత్రుఁడనో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ రామేశ్వరమందున
      శ్రీరాముఁడు శివుని వేడె; సీతకు సుతుఁడై
      నోరూరగ పాడె నుతులు
      శ్రీరాముని యెదుట లవుడు శ్రీకరముంగన్

      తొలగించండి
    2. మైలవరపు మహాశయుని సవరణతో:

      ఆ రామేశ్వరమందున
      శ్రీరాముఁడు శివుని వేడె; సీతకు సుతుఁడై
      నోరూరగ పాడె నుతులు
      శ్రీరాముని యెదుట లవుడు చిత్తములలరన్

      తొలగించండి

    3. ఆర్యా!మాస్టరు గారూ! నమస్సులు. మనిషిని చంపిని వానికి శిక్షలు ఉంటాయి....ఉరి శిక్ష వేసి మనిషిని చంపిన న్యాయమూర్తికి శిక్ష ఉంటుందా...మీది శిక్షణ ...మీరు శిక్షకులు...మీరు పాపం చేశాననే భావం రానీయ నవసరములేదు అని నా అభిప్రాయము. ఇది సమస్య ...ఎలా ఉన్నా తేలికగా తీసుకొని పూరించి ఆ తప్పుడు భావన ఇందులో లేదని నిరూపించాలి...సమస్య అంతా మంచిగా ఉంటే ఇక సమస్య ఏముంది. మిత్రులు గమనింతురు గాక.

      తొలగించండి
    4. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    5. హనుమచ్ఛాస్త్రి గారూ,
      నమస్సులు, ధన్యవాదాలు!

      తొలగించండి
  11. ఆ రవి కులాన్వయు డెవడు?
    గౌరెవరిసతేమి జేసె కర్ణుని నరుడా
    పోరుఁ లవుడెట్లు పుట్టెను
    శ్రీ రాముడు శివుని జంపె సీతకు సుతుడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      'గౌరి + ఎవరి' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. "పోరున లవుడెటు పుట్టెను" అనండి.

      తొలగించండి
  12. ధీరోదాత్తతఁగొల్చెను
    శ్రీరాముడు శివుని:జంపె సీతకు సుతుడై,
    గారాల మరది లక్ష్మణు
    డా రాజును మేఘనాధు నతి రుద్రుండై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సీతకు సుతప్రాయుడై అని మీ భావనయా?

      తొలగించండి
  13. డా.పిట్టాసత్యనారాయణ
    భారతీయ సాహితీ సృజనకబ్బురపడి ఒక బ్రిటిషర్ ఇలా అన్నాడని నా బాల్యంలో నొక ప్రాథమిక పాఠశాల గురువు అన్నాడు. అప్పుడు మనదేశం వారి స్వాధీనంలోనే యుండెను.
    భా(Bah!)రా, భారత మెన్ని మల్పులొ యదో భాండంబునం సంద్రమౌ(విస్తు పోయి అనే ఆశ్చర్యార్థకము,భా)
    మీ వ్రాతల్ సరి రామ గాథలగు మీ మేధన్ గనన్ చిత్రమౌ!
    లేరా మాకు బ్రబంధకారు లదరన్ లిప్తన్ యుగాల్జేయరే?
    శ్రీరాముండు త్రినేత్రు జంపెనుగదా సీతమ్మకున్ బుత్రుడై(ఆంగ్లేలేయులకు తెలియదు, పాపమ్)
    యీరే యీ సృజనాళి గ్రంథముల మే మివ్వంగ మా దీవులన్(బ్రిటిష్ దీవులను)

    రిప్లయితొలగించండి
  14. సారాయి ని సేవించు చు
    పోరాము oడొ కడు బలి కె పోకిరి యగుచు న్
    ఘోరం బుగ దెలిసె నను చు
    శ్రీరాముడు శివుని జంపె సీత కుసు తు డై

    రిప్లయితొలగించండి
  15. ఆరాధించెను లింగరూపముననే; నారావణున్ రాముడే
    హోరాహోరిని సాగినట్టి యనిలో ;నోహోభళా!యంచనన్
    వీరావేశము తోడ పోరె కుశుడే వీరుండునౌ తండ్రితో ;
    శ్రీరాముండు త్రినేత్రుఁ ; జంపెను గదా ; సీతమ్మకుం బుత్రుఁడై"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      'రూపముననే యా రావణున్' అనండి.

      తొలగించండి


  16. క్షీరాన్నంబును గైకొనంగనొకడౌ! కేదారుడైయొక్కడౌ!
    శ్రీరాముండు! త్రినేత్రుఁ! ; జంపెను గదా, సీతమ్మకుం బుత్రుఁడై,
    శ్రీరామున్నహమున్ కనుల్ తడియవన్ సీతా!హ!సీతాయనన్,
    శ్రీరామాయణసారమున్ లవుడు గోసెక్కించి సైదోడుతో!


    హమ్మయ్య
    కిట్డించాను

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అవన్' అన్న రూపం సాధువు కాదు.

      తొలగించండి
  17. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2664
    సమస్య :: *శ్రీ రాముండు త్రినేత్రు జంపెను గదా సీతమ్మకుం బుత్రుడై.*
    సమస్యలోని విరుద్ధార్థం సులభ గ్రాహ్యం.
    సందర్భం :: కరుణాసముద్రుడు అగు శ్రీ రామచంద్రుడు శిష్టరక్షణ చేశాడు. వీరాధివీరుడుగా దుష్టశిక్షణ చేశాడు. రామేశ్వరంలో దేవేశుని (త్రినేత్రుని) అర్చించినాడు.
    సీతమ్మ పుత్రుడైన కుశుడు శ్రీరాముని వలె అదేవిధంగా బుధులను రక్షించాడు. ఇంద్రునికి శత్రువైనదుర్జయుడు మొదలైన రాక్షస దుష్టులను శిక్షించి సంహరించాడు. దేవేశుని (ఇంద్రుని) కొలిచినాడు.
    కుశుడు రామాంశ సంభూతుడు కాబట్టి తండ్రి వలెనే ధర్మాత్ముడుగా నడచుకొన్నాడు అని విశదీకరించే సందర్భం.

    కారుణ్యమ్మున బ్రోచె శిష్టులను, వీకన్ దుష్టులన్ ద్రుంచెగా,
    ఆ రామేశ్వర మందు శ్రద్ధగను తా నర్చించె దేవేశునిన్
    *శ్రీ రాముండు త్రినేత్రుఁ ; జంపెను గదా సీతమ్మకుం బుత్రుడై*
    వీరుండై కుశు డట్లె దుర్జయుని పృధ్విన్ దుష్టు, రక్షించెగా
    ధీరుండై బుధ రాశి, నింద్రు కొలిచెన్ దేవేశు,రామాంశయై.
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (29-4-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమండీ కోటా వారూ! కాకతాళీయంగా నాకూ, జిలేబీ గారికీ, ఇదే విధమైన ఆలోచన రావడం ఆశ్చర్యం! అద్భుతంగా ఉన్నదండీ మీ పూరణము! అభినందనలు!

      తొలగించండి
    2. హృదయపూర్వక ప్రణామాలండీ
      శ్రీ మధుసూదనరావు గారూ!

      తొలగించండి

    3. సీతాదేవిగారు

      నా ఆలోచన నాదికాదు‌ :) కోటావారి సందర్భం చదివేక రాసిన పద పేర్పిడి :)


      జిలేబి

      తొలగించండి
    4. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    5. సహృదయులు జిలేబి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

      తొలగించండి
    6. గురువర్యులు
      శ్రీ కంది శంకరయ్య గారికి హృదయపూర్వక ప్రణామాలు.

      తొలగించండి

    7. ధన్యవాదాలండీ రాజశేఖర్ గారు ; కలువాయి గురించి చెప్పరే ?

      జిలేబి

      తొలగించండి
    8. కలువాయి గుఱించి తెలిసికొని చెబుతానండీ.

      తొలగించండి
    9. మూడవ పాదంలో పృథ్వీ కంటకున్ గాచెగా

      తొలగించండి
  18. ఏరా మాయణముఁ గలదు
    "శ్రీరాముఁడు శివునిఁ జంపె సీతకు సుతుఁడై"
    నోరారా చెప్పుటెటుల
    మారామును చెప్పుమయ్య మా కందివరా!

    మారాము = మర్మము (ఆం.భా)

    రిప్లయితొలగించండి


  19. ఘోరారణ్యము తానమవ్వ సతికిన్ కుందై స్తుతించంగ నా
    శ్రీ రాముండు,త్రినేత్రుఁ, జంపెను గదా, సీతమ్మకుం బుత్రుఁడై,
    శ్రీరామున్నహమున్, కనుల్ తడియవన్ సీతా!హ!సీతాయనన్,
    శ్రీరామాయణ గానమున్ లవుడు గోసెక్కించి సైదోడుతో !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. ఒౌరా! యేమని నుడివిరి?
    శ్రీరాముడు శివునిజంపెసీతకు సుతుడై
    శ్రీరాముడుమాశివుడును
    గారే? యిలనేకరూపుగలిగిన వారల్

    రిప్లయితొలగించండి
  21. ఆరాధించెను భక్తిన్ ;
    వీరుడు రఘుపతి యరులను విక్రమ మొప్పన్;
    శూరుడయి వెలిగె కుశుడే;
    "శ్రీరాముఁడు శివునిఁ; జంపె ;సీతకు సుతుఁడై"

    రిప్లయితొలగించండి


  22. కారున విడిచితి! నెంచెన్
    శ్రీరాముఁడు శివునిఁ , జంపె సీతకు సుతుఁడై
    యా రాముని నహము లవుం
    డా రామకథ గొనుచు కుశుడవ సైదోడున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. క్రొవ్విడి వెంకట రాజారావు:

    క్షారకు డా ఘనసుబ్బడు
    సారాయిని బీల్చి రామచరితము నిటులన్
    భూరిగమ మెక్కి వదరెను
    శ్రీరాముడు శివుని జంపె సీతకు సుతుడై
    (క్షారకుడు= చాకలి; భూరిగమము= గాడిద)

    రిప్లయితొలగించండి
  24. ఆరాధన జేయునెపుడు
    శ్రీరాముడు శివుని; జంపె సీతకు సుతుడై
    ఘోరరణంబున చేవను
    ధీరులనెందరినొ దివ్య దీధితులెసగన్

    సీతా సుతుడు= గాంగేయుడు = భీష్ముడు

    రిప్లయితొలగించండి
  25. ఆరాధన శివుని కొరకు
    ఆరావణుడవతరించె హరునిగయన,ఆ
    హారము సీతమ్మ యొసగగ
    శ్రీ రాముడు శివుని జంపె సీతకు సుతుడై
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాధాకృష్ణ రావు గారూ,
      మీ పూరణ అర్థం కాలేదు. దయచేసి వివరించండి.
      మూడవ పాదంలో గణదోషం.

      తొలగించండి
  26. శివుని ఆరాధన కొరకు శివుని గ మారాలి

    రిప్లయితొలగించండి


  27. తేరిచి రావణు నెంచెన్
    శ్రీరాముడు శివుని; జంపె సీతకు సుతుడై
    ధారాళమ్ముగ నసురుల
    పోరుల సల్పుచు కుశుండు పోరి, జిలేబీ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  28. ఆరవికుల తిలకుడెవడు?
    ఆరాధించు నెవని? హత మార్చెననంగా?
    తీరుగ కుశుడెటు వెలిగెను?
    శ్రీరాముఁడు-శివుని-జంపె- సీతకు సుతుఁడై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ క్రమాలంకార పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  29. కం.
    వారాంతమందున నొకడు
    ఘోరంగా స్ట్రాంగు బీరు గ్రోలుచు పలికెన్
    బారంత గోల చేయుచు
    శ్రీరాముడు శివుని జంపె సీతకు సుతుడై .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఘోరముగా' అనండి.

      తొలగించండి
  30. +919948634619.. వీరబ్రహ్మేంద్రాచార్య.

    మారీచాధము నేరు గూల్చి, రుమకై మారుండు మారొడ్డె నే
    వీరున్, మన్మథు నేమిజేసె హరుఁ, డావిఖ్యాత రామాశ్వముం
    జేరం బట్టెఁ గుశుండు నేరి సుతుఁడై చిన్నారిగా నుండియున్, శ్రీరాముండు, త్రినేత్రుఁ, జంపెనుకదా, సీతమ్మకుం బుత్రుఁడై.

    ముంజంపల్లి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వీరబ్రహ్మేంద్రాచార్య గారి క్రమాలంకార పూరణ అద్భుతంగా ఉన్నది. వారికి అభినందనలు.

      తొలగించండి
  31. ఆరాధించెను భక్తిని
    శ్రీరాముఁడు శివునిఁ, జంపె సీతకు సుతుఁడై
    ఘోరారి వర్గమును గుశుఁ
    డారాటముఁ బాప జనుల కత్యంత ధృతిన్


    ఊరన్మేలుగ నుండు వృక్షములు నేత్రోల్లాస పూర్ణంబుగన్
    ధారాళమ్ముగఁ బండ్ల నీయ విరివిన్ ధాత్రీ జనుల్ మెచ్చగం
    దోరంబై యట పండఁ దాళ ఫలమే తోషమ్ము విప్పారగన్
    శ్రీరాముండు త్రినేత్రుఁ జంపెను గదా సీతమ్మకుం బుత్రుఁడై

    [త్రినేత్రుఁడు = మూడు కన్నులు కల తాటి పండు; సీతమ్మకుఁ బుత్రుఁడు = నాఁగలికి సుతుఁడు, రైతు; నాఁగలిని భుజమునఁ బెట్టు కుంటారు తల్లిని నెత్తిన పెట్టుకున్నట్లు. తాటి పండును గాల్చుకొని తింటారు గ్రామ వాసులు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమైన పూరణ! ఇక్కడ శ్రీరాముడు రైతు పేరనుకోవాలా ఆర్యా! 🙏🙏🙏

      తొలగించండి
    2. అవునండి. శ్రీరామచంద్రుని పేరు పెట్టుకున్న నొకా నొక రైతు. ధన్యవాదములు డా. సీతా దేవి గారు.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. రెండవ పూరణ వైవిధ్యంగా, వర్ధమాన కవులకు మార్గదర్శకంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
    5. శ్రీ పోచిరాజు వారి పద్యాలు మధురసుధలు 👌👏🙏
      మైలవరపు మురళీకృష్ణ అవధాని

      తొలగించండి
    6. కవి వరేణ్యులు మురళీ కృష్ణ గారికి వారి ప్రశంసను దెలిపిన మీకు నా ధన్యవాదములు.

      తొలగించండి
    7. మీ పూరణ చాలా అద్భుతంగా ఉంది .ధన్యవాదములు గురుతుల్యులకు

      తొలగించండి
  32. గారాబమున బుడతనికి
    నేరిమితోడ కతలెన్ని నేర్పిన గూడన్
    పోరని పురాణ మేమన
    శ్రీరాముడు శివుని జంపె సీతకు సుతడై

    రిప్లయితొలగించండి
  33. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తీరుగ నిరతము కొలుచును
    శ్రీరాముడు శివుని; జంపె సీతకు సుతుడై
    పౌరుషమున యాగాశ్వము
    నారయుచున్ కుశుడు రామ యభిజనము ననిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రామ+అభిజనము = రామాభిజనము' అవుతుంది కదా?

      తొలగించండి
    2. నమస్కారములు మరియు కృతజ్ఞతలు గురువు గారికి.

      తొలగించండి
  34. ఆ రావణుఁ జంపె నెవడు
    గౌరి పతిగ గొనె నెవనిని , కందు నెటడచెన్
    పోరిరి లవకుశు లెటులై
    శ్రీరాముఁడు, శివునిఁ, జంపె, సీతకు సుతుఁడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      'సుతుడై' అని ఉన్నది కనుక "పోరెను కుశు డెవ్విధమున" అనండి. 'కందు నెటడచెన్'?

      తొలగించండి
  35. వనచర సమాహముగ వచ్చి చేరెను జలధి అంచుకు
    ఇనకుల సోముడు
    రాళ్ళు రప్పల ఆయుధ మూకలుగా శోభిల్లెను
    బండన భీముడు
    జయము కోరి సైకత లింగముగ నర్చించె
    శ్రీరాముండు త్రినేత్రు
    జంపెను గదా సీతమ్మకుం బుత్రుడై హనుమ
    అదె శేషమన శత్రు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. చేరన్సంద్రపు తీరమున్ప్లవగముల్ చేయూతనివ్వన్నట
      న్నారాళ్లన్దళపమ్ముజేసుకొనగన్నాంత్రమ్ము జేసెన్ గదా
      శ్రీరాముండు, త్రినేత్రుఁ, ! జంపెనుకదా, సీతమ్మకుం బుత్రుఁడై
      వారాశిన్ సయి దాటి రాత్రిచరులన్ ప్రాభంజనుండే భళా

      జిలేబి

      తొలగించండి


  36. ఆరాటంబదియేల మైలవరపయ్యా!యిర్వురున్నొక్కరే
    శ్రీరాముండు, త్రినేత్రుఁ, ! జంపెనుకదా, సీతమ్మకుం బుత్రుఁడై
    స్వారాట్వైరిని దుర్జయున్ కుశుడు! నిస్వార్థమ్ముగా నేలెన
    య్యా రాజ్యంబు కుశస్థలిన్నిలిపెనయ్యా!యింద్రుడిన్కొల్చెనే!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భేష్...జిలేబీ గారూ! కాకతాళీయంగా ఇద్దఱికీ ఒకే విధమైన ఆలోచన రావడం ఆశ్చరం! అద్భుతంగా ఉన్నదండీ మీ పూరణము! అభినందనలు!

      తొలగించండి

    2. గుండువారు

      కోటావారి సందర్బ్గం చదివేక చేసిన పదపేర్పిడి అంతే :) ఇంత కథ కుశుడికున్నదని సత్తెపెమాణము గా తెలియదు :)


      జిలేబి

      తొలగించండి
    3. సహృదయులు శ్రీ జిలేబి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

      తొలగించండి
  37. మైరావణసీత కొడుకు
    తారక రాముని కనిష్టుడగు వాడెపుడున్
    జారిణికై వైరంబున
    శ్రీరాముడు శివునిజంపె సీతకు సుతుడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ భావం అర్థం కాలేదు. వివరించండి.
      రెండవ పాదంలో యతి తప్పింది.

      తొలగించండి
  38. మిత్రులందఱకు నమస్సులు!

    [శ్రీరాముఁడు, దక్షిణేశ్వరమందు సైకత లింగాకారుండైయున్న రామేశ్వరునిఁ బూజించిన మహిమాతిశయముచేత, సీతమ్మకు జ్యేష్ఠ పుత్రుఁడై జన్మించినవాఁడును, రారాజైనవాఁడును నగు కుశుఁ, డింద్రునిఁ బీడించెడి దుర్జయుఁడను రాక్షసుని, భయంకరాజిలో నుగ్రాకృతిఁ దాల్చి, సంహరించిన సందర్భము నిట ననుసంధానించుకొనునది]

    ధారాళంపుఁ దపమ్ముచేఁ గొలువ నిద్రాహారముల్ మాని యా
    శ్రీరాముండు త్రినేత్రుఁ, జంపెను గదా సీతమ్మకుం బుత్రుఁడై,
    రారాజై కుశుఁ డప్డు, తన్మహిమ, దుర్వారాజినిన్ భీకరా
    కారుండై చను దుర్జయున్ మిగుల నుగ్రాక్షుండుగా మాఱియున్!

    రిప్లయితొలగించండి
  39. సవరణతో :
    ఆరాధించెను లింగరూపముననే; యారావణున్ రాముడే
    హోరాహోరిని సాగినట్టి యనిలో ;నోహోభళా!యంచనన్
    వీరావేశము తోడ పోరె కుశుడే వీరుండునౌ తండ్రితో ;
    శ్రీరాముండు త్రినేత్రుఁ ; జంపెను గదా ; సీతమ్మకుం బుత్రుఁడై"

    రిప్లయితొలగించండి


  40. రమేశు వారి భావనకు


    చేరన్సంద్రపు తీరమున్ప్లవగముల్ చేయూతనివ్వన్నట
    న్నారాళ్లన్దళపమ్ము జేసుకొనగన్నాంత్రమ్ము జేసెన్ గదా
    శ్రీరాముండు, త్రినేత్రుఁ, ! జంపెనుకదా, సీతమ్మకుం బుత్రుఁడై
    వారాశిన్ సయి దాటి రాత్రిచరులన్ ప్రాభంజనుండే భళా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      రమేశ్ గారి భావనకు మీ పద్యరూపం చక్కగా ఉన్నది.
      *****
      ఒకప్పుడు జిలేబీ గారి భావాలకు నేను, మిత్రులు పద్యరూపాలనిచ్చేవారు.
      ఇప్పుడు జిలేబీ గారు ఇతరుల భావాలకు పద్యరూపాన్నిస్తున్నారు. సంతోషం!

      తొలగించండి

    2. అదేమో నండీ శార్దూలాన్ని చూస్తేనే జోష్ తన్నుకొచ్చేస్తూందండీ మరీనూ :)

      నెనరుల్స్ ;

      ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నమంతే !

      జిలేబి

      తొలగించండి
  41. గురువు గారికి నమస్కారములు
    రావణుడు శివ భక్తుడు శివునికి పూజ చేయడానికి శివునిగామారాలి
    తరువాత రామునికి భోజనం పెట్టే సీత భోజ్యేషు మాతా
    ఈ భావం రాలేదు అనుకుంటున్నాను
    కొరుప్రోలు రాధాకృష్ణ

    రిప్లయితొలగించండి
  42. 3 వ పాదం
    హారము సీతమ్మ యొసగ .
    అంటే సరి పోతుంది

    రిప్లయితొలగించండి
  43. ఆ రావణు దునిమె నెవరు?
    గౌరియె నెవరిని వరించె,కడతేర్చెననన్?
    ధారుణి రహిగాంచె కుశుడు?
    శ్రీరాముఁడు, శివునిఁ, జంపె, సీతకు సుతుడై!!!

    రిప్లయితొలగించండి
  44. శార్దూలవిక్రీడితము
    ఆరాధించరె తండ్రి చెప్పఁగ సదాచారంపు సంతానమై
    కోరంగన్ సుతులన్ మనమ్మున సదాగుర్తించ దైవమ్ముగా
    శ్రీరాముండు త్రినేత్రుఁ, జంపెను గదా సీతమ్మకుం బుత్రుఁడై 
    పోరాటమ్మున దుర్జయాఖ్యుఁ గుశుఁడున్ బూజించి మాహేశ్వరున్

    రిప్లయితొలగించండి
  45. కందం
    కోరె సుతులుఁ బూజించఁగ 
    శ్రీరాముడు శివునిఁ, జంపె సీతకు సుతుఁడై 
    పోరాటమ్మున దుర్జయు, 
    నారాధనఁ గుశుఁడు వేడి యంగజ వైరిన్

    రిప్లయితొలగించండి


  46.  ఆరాధించుచు కొలిచెను

    శ్రీరాముఁడు శివునిఁ జంపె సీతకు సుతుఁడై

    యారాసుతుడౌ కుశుడట

    నారామమునందు కట్టెనా సౌమిత్రిన్.

    రిప్లయితొలగించండి
  47. *29.4.18*
    ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. ..సమస్య
    శ్రీరాముఁడు శివునిఁ జంపె సీతకు సుతుఁడై

    సందర్భము: శ్రీ రాముడు శివుని నోరార ప్రస్తుతించినాడు. (అంతమాత్రమే)
    కాని సీతారాముల సుతుడైన లవుడు మాత్రం ఆచరణలో చూపించినాడు. సార శివ మనగా శ్రేష్ఠ మైన మంగళము. శివేతరము లనగా మంగళ కరములు కానివి.
    కొందరు అధములకు అలాంటి విషయాలనే ప్రచారం చేయడం చాలా యిష్టం. ప్రజా క్షేమంగురించి ఆలోచించే క్రమంలో లవకుమారుడు అలాంటివాళ్ళను మట్టుపెట్టినాడు.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    నోరారఁ బ్రస్తుతించెను
    శ్రీ రాముడు శివునిఁ.. జంపె సీతకు సుతుడై
    యా రమ్య గుణుడు లవుడును
    సార శి వేతర విషయ ప్రచా రాధములన్

    2 వ పూరణము:

    సందర్భము: శ్రీ రాముడు శివుని నిరంతరము ఆరాధించినాడు. (అంతమాత్రమే)
    కాని సీతారాముల సుతుడైన లవుడు మాత్రం ఆచరణలో చూపించినాడు. సోదరునివలెనే కుశుడుకూడ దేవేంద్రుని శత్రువైన దుర్జయు డనే రాక్షసుని సంహరించినాడు. అతడు ఘోరమైన... శివేతరము లనగా మంగళ కరములు కానివి. అలాంటి వాటిని పనిగట్టుకొని ప్రచారం చేసే వాడు.
    పద్య నిర్మాణంలో సూచన లందించిన సాహితీ మిత్రులు శ్రీ కోట రాజశేఖర్ గారికి ధన్యవాద ప్రసూనములు.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    ఆరాధించెను నిరతము
    శ్రీ రాముడు శివునిఁ.. జంపె సీతకు సుతుడై
    ధీరుడు కుశుడును దుర్జయు..
    ఘోర శి వేతర ప్రచారకుని.. సుర శత్రున్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  48. డా.పిట్టాసత్యనారాయణ
    భారతీయ సాహితీ సృజనకబ్బురపడి ఒక బ్రిటిషర్ ఇలా అన్నాడని నా బాల్యంలో నొక ప్రాథమిక పాఠశాల గురువు అన్నాడు. అప్పుడు మనదేశం వారి స్వాధీనంలోనే యుండెను.
    భా(Bah!)రా, భారత మెన్ని మల్పులొ యదో భాండంబునం సంద్రమౌ(విస్తు పోయి అనే ఆశ్చర్యార్థకము,భా)
    మీ వ్రాతల్ సరి రామ గాథలగు మీ మేధన్ గనన్ చిత్రమౌ!
    లేరా మాకు బ్రబంధకారు లదరన్ లిప్తన్ యుగాల్జేయరే?
    శ్రీరాముండు త్రినేత్రు జంపెనుగదా సీతమ్మకున్ బుత్రుడై(ఆంగ్లేలేయులకు తెలియదు, పాపమ్)
    యీరే యీ సృజనాళి గ్రంథముల మే మివ్వంగ మా దీవులన్(బ్రిటిష్ దీవులను)

    రిప్లయితొలగించండి