7, అక్టోబర్ 2018, ఆదివారం

సమస్య - 2810 (భార్యలు మువురు...)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భార్యలు మువురు శ్రీరామభద్రునకును"
(లేదా...)
"భార్యలు మువ్వు రా పరమపావనుఁడౌ రఘురామమూర్తికిన్"
(ఒక అవధానంలో వీర రాఘవాచార్యులు గారు పూరించిన సమస్య
డా. అనంత్ మూగి గారికి ధన్యవాదాలతో)

56 కామెంట్‌లు:

  1. మైలవరపు వారి పూరణ

    ధైర్యముతోడ విల్విరవ దక్కెను మైథిలి , ధర్మపాలనా
    కార్యరతిన్ లభించె నొకకాంత వసుంధర , స్వీయశౌర్యగాం...
    భీర్యజనానురంజకత వే వరియించెను కీర్తికాంత , యీ
    భార్యలు మువ్వు రా పరమపావనుఁడౌ రఘురామమూర్తికిన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మురళీకృష్ణ గారు నిత్యైకపత్నీ వ్రతునకు భార్యాత్రయమును ధర్మ బద్ధముగా సమర్పించిన మీ ప్రజ్ఞాపాటవ మమోఘము. అభినందనలు. వసుంధర తత్సమము కాబట్టి స్వీయ తో ర లఘువే యని నా యభిమతము కూడా.

      తొలగించండి
    2. గురుతుల్యులు శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి ప్రణామములు.. ధన్యోऽస్మి 🙏🙏🙏

      మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    3. ఇలాంటి సమస్య 16 జనవరి 2018 నాడు ఇవ్వబడినది... అప్పటి నా పూరణ... 👇

      సూర్య కులైకభూషణుడు , సుందరరూపుడు , ధైర్య శౌర్య గాం...
      భీర్యగుణోన్నతుండచట విల్లును ద్రుంచి , వరించి సీతఁ దా 
      భార్యగ , చేరినంత గడపన్ గని మోదముతో నయోధ్యరా.... 
      డ్భార్యలు మువ్వురారతులు పట్టిరి పావన రామమూర్తికిన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  2. ఏక పత్నీవ్రతుండగు నేలికౌచు
    నంతరంగ మందు వెలిసె నతివలరయ...
    శౌర్యమును వీర్యము మరియు ధైర్య మంచు
    భార్యలు మువురు శ్రీరామభద్రునకును

    రిప్లయితొలగించండి
  3. తలకు స్నానము చేయించె తల్లి యొకతి,
    జడను వేసి పూలు దునిమె జనని యొకతి,
    నన్నమును బెట్టె నోటిలో నమ్మ యొకతి,
    కలసి ప్రేమ పంచెను ముద్దు గ దశరదుని
    భార్యలు మువ్వురు శ్రీరామ భద్రునకును

    రిప్లయితొలగించండి


  4. (విజయాభిరాముడై అయోధ్యకు వచ్చిన పెద్దకొడుకు రామయ్యకు తల్లుల నీరాజనం.)

    ఘోరరణమందు రావణు గూల్చివైచి
    వీరసౌమిత్రి హనుమలు వెంటనుండ
    నవ్వుపువ్వుల సీతమ్మ రువ్వుచుండ
    పొరలుచుండిన వాత్సల్యభరము తోడ
    తరలి జయహారతిచ్చిరి దశరథేశు
    భార్యలు మువురు శ్రీరామభద్రునకును .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జయహారతి ఇచ్చుటకు విధవ రాళ్ళు పనికి రారు అనకుంటాను మిత్రమా

      తొలగించండి
  5. జన్మదినోత్సవంబున సంతసమున
    వత్సలతమీర దరిజేరి బహుళగతుల
    వరుస దీవెన లొసగిరి పంక్తిరథుని
    భార్యలు మువురు శ్రీరామభద్రునకును.

    రిప్లయితొలగించండి
  6. ఆగ్రహించిన గురువర్యు డడుగ నపుడు
    ఛాత్రు డిట్లాడె నొకరుడు సర్వగతుల
    భీతి జెందుచు తడబడి వేగముగను
    భార్యలు మువురు శ్రీరామభద్రునకును.

    రిప్లయితొలగించండి
  7. ధైర్యముతోడ చెప్పెదను ధర్మమె రూపముగా చరించి స
    త్కార్యములందు నిత్యమును గర్మఠుడై విలసిల్లియున్నవా
    డార్యుడు సీతకన్న నొక యన్య నెరుంగనివాడు తానిలన్
    భార్యలు మువ్వురా పరమపావనుఁడౌ రఘురామమూర్తికిన్?

    రిప్లయితొలగించండి
  8. పంక్తి రధునికి తనయుడు పరమ సాధు
    తల్లి దండ్రుల పలుకులు పొల్లు బోక
    తనకు దీవెన లందించ తండ్రి కనగ
    భార్యలు మువురు , శ్రీరామ భద్రు నకును

    రిప్లయితొలగించండి
  9. భువనగిరిలో ఐతగోని వెంకటేశ్వర్లు గారి అష్టావధానంలో సంచాలకుడుగా పాల్గొనడానికి వెళ్తున్నాను. మీ పూరణలపై వెంటవెంట స్పందించలేక పోవచ్చు. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  10. ఎవరు జూచిన నిటులనె యెరుక పరచె
    నవ్యముగ జెప్ప నేముండె నాకు నింక
    సీతయు వసుధయు యశము, చిత్ర మేమి?
    *"భార్యలు మువురు శ్రీరామభద్రునకును"*
    సవతు లిద్దరు సీతకు సాధ్వి కయ్యొ??

    చివరిది కోడూరి శేషఫణిశర్మ గారి తగిలింపు
    🙏🏻

    రిప్లయితొలగించండి
  11. శౌర్య ధర్మ ము ల కు తోడు సత్య దీక్ష
    లను సదా విడువక నుండు రఘు కులపు
    తిలకు డై వెలసిన మహా ధీయు తు నకు
    భార్య లు మువు రు శ్రీరామ భద్రునకు ను

    రిప్లయితొలగించండి
  12. సీత,భువనైక మాత,లక్ష్మీ విలాసి,
    భార్య యొక్కతె రాముకున్ ప్రవిలముగ-
    చెప్ప దగునొక్కొ వేరుగా చింతఁగూర్ప
    భార్యలు మువురు శ్రీరామ భద్రునకును?

    రిప్లయితొలగించండి
  13. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2810
    సమస్య :: భార్యలు మువ్వురు రా పరమ పావనుడౌ రఘురామ మూర్తికిన్.
    సందర్భం :: శ్రీరామచంద్రమూర్తి రావణాసుర సంహారం తరువాత సీతాసమేతుడై అయోధ్యకు విచ్చేయగా అయోధ్యలో ఉన్నవారందరూ పరమానందంతో స్వాగతం పలికినారు. ఆ అయోధ్య రామునికి భక్తితో హారతులు పట్టినారు. ఆ సమయంలో ఊర్మిళ నామధేయం గల లక్ష్మణుని భార్య, మాండవి నామధేయం గల భరతుని భార్య, శ్రుతకీర్తి నామధేయం గల శత్రుఘ్నుని భార్య (అలా క్రమంగా తమ్ముల భార్యలు ముగ్గురూ) పరమ పావనుడైన ఆ రఘురామ మూర్తికి హారతు లిచ్చినారు అని విశదీకరించే సందర్భం.

    భార్యగ శత్రుఘాతకుని ప్రక్కన దా శ్రుతకీర్తి వెల్గెడిన్,
    భార్యగ వెల్గె లక్ష్మణుని ప్రక్కన నూర్మిళ త్యాగశీలగన్,
    భార్యగ వెల్గెగా భరతనారిగ మాండవి, హారతిచ్చి రా
    భార్యలు మువ్వురు రా పరమ పావనుడౌ రఘురామ మూర్తికిన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (7-9-2018)

    రిప్లయితొలగించండి
  14. ధర్మ పాలకుం డైనట్టి దశరథునకు
    భార్యలు మువురు శ్రీరామ భద్రునకును
    శివుని ధనువెత్తి చేకొన్న సీత యనెడి
    జనక రాజతనూజయౌ జానకొకతె.

    రిప్లయితొలగించండి


  15. ఆర్య పుత్రులకు వివాహమౌత చనిరి
    భార్యలు మువురు, శ్రీరామభద్రునకు ను
    నుపుల దీర్చి పెండ్లికొడుకును పరిణయము
    నకు తయారుచేయ, జిలేబి, నదరుపెట్టి !


    జిలేబి

    రిప్లయితొలగించండి


  16. కంది వారి ఆకాశవాణి :)
    లంకె

    http://varudhini.blogspot.com/2018/10/blog-post_6.html



    జిలేబి

    రిప్లయితొలగించండి


  17. శౌర్యపు రూపు డాతడగు చక్కటి పంక్తిరథుండు సేవితల్
    భార్యలు మువ్వు రా పరమపావనుఁడౌ రఘురామమూర్తికిన్
    ధైర్యము నుగ్గుబాలగ, నుదారత,బాధ్యతలెల్ల నేర్పగన్
    స్థైర్యము తోడు భద్రునిగ ధామముగానిల నిల్చెనాతడే


    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. భార్యయొక్కతె మఱియునుబాణమొకటె
    రామచంద్రునకునెఱుగుమా,మరదల!
    సాహసంబునుధైర్యమువీర్యములవి
    భార్యలుమువురుశ్రీరామభద్రునకును
    ననగనొప్పునుబూరింపనార్య!యిదియు

    రిప్లయితొలగించండి
  19. సౌర్య పరాక్రమంబులును చక్కని రూపము మందహాసమున్
    ధైర్యము సాహసమ్ముఁ గల ధర్మపరుండు వివాహమాడి తా
    భార్యను గూడివచ్చెనని స్వాగతమున్ ఘటియించిరి పంక్తిరథున్
    *"భార్యలు మువ్వు రా పరమపావనుఁడౌ రఘురామమూర్తికిన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరణ:
      సౌర్య పరాక్రమంబులును చక్కని రూపము మందహాసమున్
      ధైర్యము సాహసమ్ముఁ గల ధర్మపరుండు వివాహమాడి తా
      భార్యను గూడివచ్చెనని స్వాగతమిచ్చిరి కోసలేశుకౌ
      *"భార్యలు మువ్వు రా పరమపావనుఁడౌ రఘురామమూర్తికిన్"*

      తొలగించండి
    2. సవరణ :
      శౌర్య పరాక్రమంబులునుఁ జక్కని రూపము మందహాసమున్
      ధైర్యము సాహసమ్ముఁ గల ధర్మపరుండు వివాహమాడి తా
      భార్యను గూడివచ్చెనని స్వాగతమిచ్చిరి కోసలేశుకౌ
      *"భార్యలు మువ్వు రా పరమపావనుఁడౌ రఘురామమూర్తికిన్"*

      తొలగించండి
    3. సూర్యనారాయణ గారు “కోసలేశ స ద్భార్య లనిన బాగుండునేమో?

      తొలగించండి
  20. దుష్ట రావణు నాజిలో దునిమి పిదప
    వంది తుండై పురమునకు వచ్చువేళ
    స్వాగతము పలికిరి గద పంక్తి రథుని
    భార్యలు మువురు శ్రీరామభద్రునకును

    రిప్లయితొలగించండి
  21. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    =========================
    భార్యలు మువ్వురా పరమపావనుడౌ
    రఘురామమూర్తికిన్
    =========================
    పరమ పావనుడైన శ్రీరామచంద్ర
    మూర్తికి ముగ్గురు భార్యలని చెప్పటంలో
    అసంబద్దతె ఇచట సమస్య
    ==========================
    సమస్యా పూరణం - 276
    ==================

    నగుమోమున ఇనకుల సోముడు-
    ఎగు భుజమ్ములుగ ధీరుడు రాముడు
    మగటిమిగ మెరిసె మరుల ఱేడు-
    ముగ్దమోహనాకారుడదె చూడు
    దీవించిరి దశరథుని భార్యలు-
    మువ్వురా పరమపావనుడౌ
    రఘురామమూర్తికిన్ తల్లుల-
    ప్రేమ పొంద ప్రేమాస్పదుడౌ

    ====##$##====

    తాగవె నాలుక రామనామ రసాయనం
    తాగవె నాలుక నామ రామ రసాయనం//తా//

    పాతకముల ఛేదించునదిదియే
    పుణ్యఫలముల నొసగునదిదియే //తా//

    పుట్టుక చావు భయ శోకములకు దూరం
    ఆగమ శాస్త్ర వేదాంతపు సారం //తా//

    బ్రోచిన బ్రహ్మాండంబును కలిగినది
    పాపములను పుణ్యములుగా మార్చునది//తా//

    నిర్మల గురువుల ఆశ్రమ గానం
    శుక శౌనక కౌశిక ముఖ పానం //తా//

    ( సదాశివబ్రహ్మేంద్ర స్వామి కీర్తన )

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం)

    రిప్లయితొలగించండి
  22. భార్యలుమువ్వురాపరమపావనుఁడౌరఘురామమూర్తికిన్
    భార్యయయొక్కతేవినుమబాణమునొక్కటెరామచంద్రుకున్
    భార్యలుమువ్వురేయనినవారలుశౌర్యమువీర్యమున్దగన్
    ధైర్యముగానెఱుంగుమికధీయుతులిట్లనిచెప్పిరేగదా

    రిప్లయితొలగించండి
  23. ధరను ముదమున నేలిన దశరథునకు
    భార్యలు మువురు, శ్రీరామభద్రునకును
    భార్యయొక్కతె తానేక పత్ని వ్రతుడ
    నంగ గొప్ప ఖ్యాతిని పొందె ననవరతము.


    రిప్లయితొలగించండి
  24. రఘుకులపు దశరధమహారాజు యొక్క
    భార్యలు మువురు, శ్రీరామభద్రునకును
    తల్లులయి సేవలొనరించి ధన్యులైరి
    యుత్తములువారు కడుపుణ్యమొందినారు

    రిప్లయితొలగించండి
  25. రిప్లయిలు
    1. వింత నవత రించెఁ బుడమి విష్ణు వెంచి
      దుష్ట శిక్షణ రక్షింప శిష్ట జనులఁ
      బేర్మి తల్లులు, దశరథు ప్రీతి తమపు
      భార్యలు మువురు, శ్రీరామభద్రునకును


      దశరథుని యర్థ సప్త శత భార్యలుతో కూడిన కౌసల్య సుమిత్ర కైకేయులు ముగ్గురు రాముని మాత లని విశదీకరించు సందర్భము:

      భూర్యశ లుత్తమాంగనలు భూభృ దజాత్మజ రమ్య కామితే
      ద్ధార్యలు భామినీ వర శతాధిక సంవృత దేవతా సమా
      నార్యలు సౌమ్య సద్గుణవ దంబలు, పంక్తిర థాభిధాను స
      ద్భార్యలు, మువ్వు రా పరమ పావనుఁడౌ రఘు రామమూర్తికిన్

      తొలగించండి
  26. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ధైర్యముతోడ పూడ్చగను దండిగ గోతులు హైద్రబాదునన్
    శౌర్యముతోడ నెత్తగను శైలము వోలెడి చెత్తగుట్టలన్
    వీర్యమునొంది మాపగను వీధులు కాసెడి కుక్కలన్నిటిన్...
    భార్యలు మువ్వురా పరమ పావనుఁడౌ రఘురామమూర్తికిన్


    గమనిక:
    ఇచ్చట "రఘురామమూర్తి" :👇

    శ్రీ కల్వకుంట్ల తారక రామారావు
    (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి)

    రిప్లయితొలగించండి
  27. దక్షుడైనట్టి రాజగుదశరథునకు
    భార్యలు మువురు!"శ్రీరామ భద్రునకును
    సీతసాధ్వియునొక్కతే నేతయైన!
    ఏకపత్నీవ్రతుండట నెంచిజూడ

    రిప్లయితొలగించండి
  28. ధైర్యము గావలెన్ గన వధానికి, దార్ఢ్యము పృచ్చకాళికిన్
    స్థైర్యము మధ్యవర్తికిని దమ్ముయు సొమ్ములు సంస్థనందునన్
    గార్యసువర్గమందరకు; గల్గ జనించు సమస్య లిట్టివౌ-
    "భార్యలు మువ్వురా పరమ పావనుఁడౌ రఘురామమూర్తికిన్"

    రిప్లయితొలగించండి
  29. విలయాలంకృత శస్త్రవిద్యలకునుర్విన్ నేతయౌ పార్థుఁడే
    ఫలితంబతయు కృష్ణదేవు కరుణా పాత్రంబటంచు మదిన్
    తలపున్ జేయుచు నేకచక్ర పురిఁ సత్త్వ స్థైర్య సామర్త్య్హముల్
    కలవాఁడే యిలునిల్లుఁ గ్రుమ్మరుచు భిక్షన్ గోరె గ్రామంబునన్

    ధైర్యమనూన సాహస యుదాత్త మహోదయ సత్శుభాంకముల్
    వీర్య సుధర్మ శాస్త్ర గుణ విస్ఫుర లక్షణ దీప్తుడై మహ
    త్కార్యము - రావణాద్యసుర దండన జేయగ నయ్యజాంగజున్
    భార్యలు మువ్వు రా పరమపావనుఁడౌ రఘురామమూర్తికిన్
    సూర్య సమప్రభాకరుని చూడఁగ వచ్చిరి హారతిచ్చుచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారు నేటి మీ పూరణము మనోహరముగా నున్నది.
      చిన్న చిన్న సవరణలు:
      సాహస ముదాత్త; సచ్ఛుభాంకముల్; అయ్యజాంగజు భార్యలులో ద్రుతమున కాస్కారము లేదు. అప్పుడు గణభంగము.
      నిన్నటి పూరణము లో “విలయాలంకృత” సమంజసముగా ననిపించుట లేదు. విలయప్రేరక బాగుంటుందేమో?
      ఫలితంబంతయు, పాత్రంబటంచున్, సామర్థ్యముల్ - ముద్రణ దోషములు.

      తొలగించండి
    2. గురుతుల్యులు శ్రీ కామేశ్వర రావు గారికి,
      హృదయపూర్వక నమస్సుమాంజలులు. మీ సూచనలు / సవరణలు సర్వదా శిరోధార్యమే.
      తగు సూచనలు చేసినదులకు కృతజ్ఞతలు.
      ధన్యోస్మి.

      తొలగించండి
  30. తే: రవికులమున పుట్టిన దశరథునకు భువి
    భార్యలు మువురు, శ్రీరామభద్రునకును
    పంటవలతి పట్టి యొకతె పత్ని సుమ్ము
    ఏకపత్నీవ్రతముఁ జాటె వీకతోడ

    రిప్లయితొలగించండి
  31. డాపిట్టాసత్యనారాయణ
    కాదెమి థిలను గన్నట్టి కాంత సీత
    నాడు నార చీరలలోన నవ్వు సీత
    పరుల మాటలకడవీని బట్టు సీత
    భార్యలు మువురు శ్రీ రామ భద్రునకును

    రిప్లయితొలగించండి
  32. సూర్యకులాన్వయుండు ఘన శూరుడు రాఘవు కన్నతండ్రికిన్
    భార్యలు మువ్వు,రా పరమపావనుఁడౌ రఘురామమూర్తికిన్
    కార్యములందు దాసిగను కమ్మనిభోజనమిచ్చుతల్లి సౌం
    దర్యమునందు రంభనిభ దారణి పుత్రిక సీత యొక్కతే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెడ్డి గారు కులమన్న నన్వయమన్న నొకటియే కదా. సూర్య కులోద్భవుం డని మీ భావ మనుకుంటాను. ధారణి – ముద్రణ దోషము.

      తొలగించండి
  33. డా.పిట్టాసత్యనారాయణ
    కార్యమె మోక్ష సాధనముగామన నామమెమంత్రరాజమై
    శౌర్యముజూప దోడ్పడు నసాధ్యము సాధ్యము జేేయు; మేటి స
    సత్కార్యము హారతిన్నిడగ తామయిరారె త్రిమూర్తి నాతులా
    భార్యలుమువ్వురున్? పరమ పావనుడౌ రఘురామమూర్తికిన్! (వచ్చిరిగదా అని భావము)

    రిప్లయితొలగించండి
  34. ఉత్పలమాల
    సూర్యకులాబ్దిచంద్రుడు యశోగణధాముడు పట్టమందెడున్
    కార్యము బ్రహ్మయున్ శివుడు గాంచఁగ రాగ సతీసమేతులై
    యార్యవశిష్టులున్ బిలువ నాశిసు లిచ్చిరి 'శ్రీ' లు గంగయన్
    భార్యలు మువ్వురా పరమపావనుఁడౌ రఘురామమూర్తికిన్

    రిప్లయితొలగించండి
  35. శౌర్యము తోడనా శివుని చాపము ద్రుంచి యయోనిజన్ దగన్
    భార్యగ స్వీకరించి రఘువంశజుడే యటఁ జేరునత్తరిన్
    నార్యుని కిచ్చిరైరి శుభ హారతి పంక్తిరథుండు చెప్పగన్
    భార్యలు మువ్వురా పరమ పావనుఁ డౌ రఘురామ మూర్తికిన్

    రిప్లయితొలగించండి
  36. తేటగీతి
    రామ పట్టాభిషేకము రమ్మనంగ
    బ్రహ్మ శివులు సతులఁగూడి వచ్చియచట
    నాశిసులిడిరి వాణియు, నంబ, గంగ
    భార్యలు మువురు శ్రీరామభద్రునకును

    రిప్లయితొలగించండి
  37. రాజ్య లక్ష్మిని చేపట్టి రాజు గాగ
    పట్ట మనిషిగ సీతమ్మ వరలె ననగ
    భార్య రూపము బంగారు భార్య గాగ
    భార్యలు మువురు శ్రీ రామభద్రునకును
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  38. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    భార్యలు మువురు శ్రీరామభద్రునకును

    సందర్భము: తలంబ్రాలు తలమీద పడగానే జానకిని రామ భద్రుని "భద్రమ" స్తని అత్తలు అనగా కోసలాధీశుని భార్యలు మువ్వురు పలుకుతూ దీవించినారు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    రాలెఁ దలఁబ్రాలు జానకీ బాల తలను..
    "భద్రమ" స్తని యత్తలు పలికి, యిచ్చి
    రంట దీవనల్ శ్రీ కోసలావని పతి
    భార్యలు మువురు శ్రీరామభద్రునకును!

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    7.10.18
    -----------------------------------------------------------
    ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    భార్యలు మువురు శ్రీరామభద్రునకును

    సందర్భము: ఇది సీత స్వగతం. రామునిలోని గుణగణాలను చూచి విస్తుపోయి ఇలా అనుకుంటున్నది.
    శారీరక తపస్సు వాగ్రూపమైన తపస్సు మానసిక తపస్సు అని తపస్సు మూడు రకాలు..
    దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచ మార్జవం
    బ్రహ్మచర్య మహింసా చ శారీరం తప ఉచ్యతే

    అనుద్వేగ కరం వాక్యం సత్యం ప్రియ హితం చ యత్
    స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే

    మనః ప్రసాద సౌమ్యత్వం మౌన మాత్మ వినిగ్రహః
    భావసంశుద్ధి రిత్యేత త్తపో మానస ఉచ్యతే
    అని గీతలో శ్రద్ధా త్రయ విభాగ యోగం చెబుతోంది.
    శారీరకమైన తపస్సులో అహింసా కాంత వరించిం దంటే దాని వెంబడే తక్కిన వన్నీ వచ్చేస్తా యని అనుకోవచ్చు.
    వాఙ్మయీ కాంత అనగానే వాగ్రూపమైన తపస్సులోని అన్ని సద్గుణాలు కలిగి ఉన్నది.
    మనశ్శాంతి ఉన్న దంటే మానసిక తపస్సుకు చెందిన తక్కిన సుగుణాలు కూడా ఉన్నాయి.
    ఈ విధంగా రాముని సకల కళ్యాణ గుణ సంపన్నునిగా సీత దర్శిస్తోంది. తాను గాక అతనికి యింకా ముగ్గురు భార్య లున్నా రని అసుయతో గాక ఆనందంగా చెబుతూ వున్నది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "చెలగి తా నహింసా కాంతఁ జేరదీసె..
    వాఙ్మయీ కాంత వరియించి వచ్చె.. శాంతి
    కాంత తిరమాయెనే! నేను గాక యింక
    భార్యలు మువురు శ్రీరామభద్రునకును"

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    7.10.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి