10, మే 2020, ఆదివారం

సమస్య - 3365

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పలికిన నిందలు మధురసుభాషితము లగున్"
(లేదా...)
"పలికిన నిందలెల్లను సుభాషితముల్ గలిగించు క్షేమమున్"

111 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    చిలిపివి మాటలన్ విడక చిందులు త్రొక్కుచు రాత్రిప్రొద్దుటన్
    బలుపగు బుద్ధి మాంద్యమున బంగరు నిండిన బంగళాలలో
    కులుకుచు రాహులన్న కడు కుందుచు తిట్టుచు మోడివర్యునిన్
    పలికిన నిందలెల్లను సుభాషితముల్ గలిగించు క్షేమమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సరదా పూరణ వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నది. మోడీని తిట్టే ప్రతిపక్షాలు పరోక్షంగా అతనికి ప్రాచుర్యాన్ని తెస్తున్నాయి. బాగుంది పూరణ. అభినందనలు.

      తొలగించండి
  2. అందరికీ నమస్సులు 🙏😄

    *కం||*

    విలువౌ ప్రమాణములనే
    తెలుపుచు చక్కగ మరచిన, దెప్పుచు పతితో
    యలిగిన సతియే ముద్దుగ
    *"పలికిన నిందలు మధురసుభాషితము లగున్"!!*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వలపులు మీర నాథునికి వండగ బిర్యని నుల్లిపాయతో...
    జులుమును జూపి బ్రాహ్మణపు సుద్దులు పల్కగ, త్రోసి బైటకున్
    తలుపులు మూసి నవ్వగను
    దండిగ నత్తయ జుత్తుపీకుచున్
    పలికిన నిందలెల్లను సుభాషితముల్ గలిగించు క్షేమమున్

    రిప్లయితొలగించండి
  4. చెలిమిని నటించుశత్రువు
    పలుకును తీయటి కబుర్లు పడగొట్టుటకున్
    నిలువున వారిని నమ్మిన
    పలికిన నిందలు మధురసుభాషితము లగున్.

    రిప్లయితొలగించండి
  5. విలువగు చదువును వదలుచు
    తులువ తనంబున దిరుగుచు ద్రుళ్ళెదవేలా?
    పలుచనగాదే పరువని
    పలికిన నిందలు మధుర సుభాషితము లగున్

    వలువలు నగలను గనమిట
    వలచితినని వెంటబడుచు పత్నిగగొనెనే!
    కలలన్ని కల్లలయెనని
    పలికిన నిందలు మధుర సుభాషితము లగున్

    ఒలికిన పాలకుండలును నుట్టినిగొట్టిన నానవాళ్ళతో
    తలుపుల వెన్కదాగుచును తల్లిని యారడిబెట్టు కృష్ణునిన్
    నిలునిలు చోరశూర నిను నిక్కము గట్టెద నేడిటంచు దా
    బలికిన నిందలెల్లను సుభాషితముల్ గలిగించు క్షేమమున్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బలిమిని శత్రుసేనలను భండనమందున గెల్వజాలకే
      కలగి తిరోగమించి తనగ్రామము నింటిని జేరబోవగా
      కులసతి మంచమడ్డునిడి గోళమునీరు హరిద్రమిచ్చుచున్
      పలికిన నిందలెల్లను సుభాషితముల్ గలిగించు క్షేమమున్

      తొలగించండి
    2. మీ నాలుగు పూరణలు వైవిధ్యంగా చక్కగా ఉన్నవి. అభినందనలు.
      'తల్లిని నారడి బెట్టు' అనండి.

      తొలగించండి
    3. ధన్యోస్మి గురుదేవా,నమస్సులు!సవరిస్తాను!

      తొలగించండి
  6. కం//
    కలతెరుగువాని ముంగిట
    విడదీయు పగగొనువాడు విజ్ఞత లేకన్ !
    నడవడికయు సరిలేదని
    పలికిన నిందలు, మధురసుభాషితము లగున్ !!

    రిప్లయితొలగించండి
  7. బలిమినిఁ బొందునుఁ గోరెడు
    ఖలు రావణ కీచకాది కాంతా కామాం
    ధులకా సీతాది సతులు
    పలికిన నిందలు మధురసుభాషితము లగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అలిగిన యాటవెలఁదులు వి
      టులతోఁ గాపట్యమునఁ గడుధనాపేక్షన్
      బులిపించుచు నర్మముగాఁ
      బలికిన నిందలు మధురసుభాషితము లగున్

      తొలగించండి
    2. కలుగఁదగు గీడు సూటిగ
      పలికిన నిందలు! మధురసుభాషితము లగున్
      పొలుపుగ వ్యంగ్యాలాపన
      ములనొనరింపగ జనులకు మోదకరముగన్!

      తొలగించండి
    3. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. (తాను చేసిన పతిదానవ్రతమహిమవలన మాధవుడు సత్యభామాధవుడైనాడని
    రుక్మిణి జాంబవతి కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణలకిక విరహమే
    దిక్కని మురిసిపోతున్న సాత్రాజితి )
    "వలపుల సంకెలన్ సుజన
    వందితు కృష్ణుని బందిచేసితిన్ ;
    కలలను గూడ సాగవిక
    గర్వపు రుక్మిణి పెత్తనంబులున్ ;
    లలనల సప్తకమ్మునకు
    లభ్యుడుగా " డని పొంగు సత్యవౌ
    పలికిన నిందలెల్లను సు
    భాషితముల్ ; గలిగించు సౌఖ్యముల్ .

    రిప్లయితొలగించండి
  9. చం॥
    అలసత నొందు బాలకుడె యన్న ము నొల్లక పారిపోవగా

    తలిగని వెంటనే నతని తప్పక పట్టుచు బుజ్జగించగన్

    కిలకిల నవ్వుచున్ తినక కేకలు వేయగ నమ్మ యప్పుడున్

    పలికిన నిందలెల్లను సుభాషితముల్ గలిగించు క్షేమమున్

    రిప్లయితొలగించండి

  10. మెలివెట్టుచు కృష్ణుని చెవి
    తలోదరి యశోద పలుక తల్లికి జూపెన్
    తెలియగ విశ్వమె దానని
    పలికిన నిందలు మధురసుభాషితము లగున్


    రిప్లయితొలగించండి


  11. చిలిపిగ నా దుప్పట్లో
    నలకల కొలికి గుస గుసల నడుమ వయారం
    బుల గీచి గీచి విడువక
    పలికిన నిందలు మధురసుభాషితము లగున్



    నారదా!
    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. అలఘుయశో విభూషితుల కార్యుల కన్నివిధాల సంఘమే
    యిలను గుటుంబమంచు మది నింపగు భావము దాల్చువారికిన్
    దులువలు స్వార్థచిత్తమున దుర్మదమూని యహంకరించుచున్
    బలికిన నిందలెల్లను సుభాషితముల్ గలిగించు క్షేమమున్.

    రిప్లయితొలగించండి


  13. ఇచ్చిన చంపకమాల పాదమెక్కడే జిలేబి‌ :)



    అలకల కొలికి జిలేబి క
    నులు పలికిన నిందలెల్లను సుభాషితముల్
    గలిగించు క్షేమమున్ జిలి
    బిలివోవు మధురిమలలర పిరియము తోడై !



    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. పలువిధముల ప్రార్థించిన
    పలుకనియీశ్వరునిదలచిభక్తుడువేడ్కన్
    అలుకగ నిందా స్తుతులను
    పలికిన నిందలు మధురసుభాషితము లగున్"

    రిప్లయితొలగించండి
  15. బలపము పట్టిన పిల్లలు
    కలముయుపట్టిన, కదులని కవులకవితయున్
    తెలుపుచు మంచిగ గురువుయు
    పలికిన నిందలు మధురసుభాషితము లగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కలమును... కదలని... గురువును' అనండి.

      తొలగించండి


  16. పిలిచిన మాటలాడక గుభిల్లున తాకుచు పైరగాలి వా
    తులివలె మార్పునొందు! కనుదోయిని ద్రిప్పును వేగిరమ్ముగా
    జిలిబిలి వోవు వేళ! యిక చీల్చుచు గట్టిగ కత్తికోతలన్
    పలికిన నిందలెల్లను సుభాషితముల్ గలిగించు క్షేమమున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. చెలగుచు గోపబాలురను చెంతనెజేర్చుక వీధులందునన్
    చిలిపిగ కృష్ణుడివ్విధినజేయగ, పిల్లలు పాలకేడ్వ నా
    వులకడ క్రేపు గుఱ్ఱలను పొందులకిడ్వగ గోప కాంతలే
    పలికిన నిందలెల్లను సుభాషితముల్ గలిగించు క్షేమమున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విధిని.. పొందులకై విడ...' అనండి.

      తొలగించండి
    2. ప్రారంభ ప్రయాస.

      ధన్యవాదములు. సరి చేసెదను.

      తొలగించండి
  18. మైలవరపు వారి పూరణ


    పార్వతి... మేనాదేవితో👇

    తలపులనిండినాడు., .,
    మమతామయమూర్తిగ శంకరుండు., నే
    వలచినవాడు.,నేత్రమున వహ్నిని దాల్చిన పన్నగంపు భూ...
    షల ధరియించినన్ జనని! చక్కగ దోచును నాకు., నీవుగా
    పలికిన నిందలెల్లను సుభాషితముల్ గలిగించు క్షేమమున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరో పూరణ 🙏


      పలికిన మంచిమాట పశుపక్షిగణమ్ములు మెచ్చు., నీవు ని...
      ష్ఫలముగ నింద జేయగ విషాదము గూర్చును., మానవాళికిన్
      పలుకులకేమి లోటు ?తులువా! నిను గాల్చకయున్నె నీవుగా
      పలికిన నిందలెల్లను.,! సుభాషితముల్ గలిగించు క్షేమమున్!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  19. తులువల చేరి చదువకను 
    పలు చెడు కార్యముల జేసి పరువును తీయ
    న్విలువలు మరచిన వానిని   
    పలికిన నిందలు మధురసుభాషితము లగున్

    రిప్లయితొలగించండి
  20. పలువురు నుతియించు కరణి
    చెలువపు వర్తన యె నీకు శ్రేయంబగు నం
    చలుకను బూనియు తనపిత
    పలికిన నిందలు మధుర సుభాషిత ము లగున్

    రిప్లయితొలగించండి
  21. వలపులు విసిరెడుసత్యకు
    చెలికత్తెయుకృష్ణపైనచెప్పుడు మాటల్
    పలుకగ,కోపంబునతను
    పలికిన నిందలు మధురసుభాషితము లగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తను' అన్నది సాధువు కాదు. "తా బలికిన.." అనండి.

      తొలగించండి
  22. పలువురు సత్యసాధకులు బల్కిరి సత్యము భావికోసమై
    తెలియగ రామతత్త్వమును దెల్పిన నిందల బంధిఖాన, స
    ద్విలసిత సత్యభామయును దెల్పిన నిష్ఠుర భావదీప్తీతో
    పలికిన నిందలెల్లను సుభాషితముల్ గలిగించు క్షేమమున్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  23. కలలో నైనను కఠినపు
    తలపులు కలుగని గురుండు తప్పని సరియై
    పిలిచెను శిష్యుని కటువుగ-
    పలికిన నిందలు మధుర సుభాషితములగున్

    రిప్లయితొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  25. రిప్లయిలు
    1. పలు తీపి పొగడ్తలొసగు
      ఎలమికి మీరి సరియైన నిరవుఁ గొలుపు మం
      గళముం గోరి కటువుగా
      పలికిన నిందలు మధుర సుభాషితములగున్.

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  26. విలువనెరుంగక సతమిత
    రుల మనసును బాధపెట్టు లుబ్దకుడౌ యా
    ఖలుడా జ్ఞానవిహీనుడు
    పలికిన నిందలు మధురసుభాషితము లగున్

    రిప్లయితొలగించండి
  27. తలిదండ్రులు తమసంతును
    తొలుత నుండియు దరచుగ దూఱుచు నుండన్
    కలవర పోవక నిలుమా
    పలికిన నిందలు మధురసుభాషితము లగున్

    రిప్లయితొలగించండి

  28. * శంకరాభరణం వేదిక *
    10/05/2020 ...ఆదివారం

    సమస్యలు
    ********

    "పలికిన నిందలెల్లను సుభాషితముల్ గలిగించు క్షేమమున్"

    1వ పూరణ. చం.మా.
    **** **** **

    తెలియక నింద మోపగను దెచ్చుచు నా మణి రాజు కిచ్చుచున్

    దెలిపెను నిక్కమేదొ కడు తీరుగ కృష్ణుడె మచ్చ దొల్గగన్!

    కలిగెను భార్య లిర్వురు నఖండ యశస్సులు నా క్షణమ్మునన్

    పలికిన నిందలెల్లను సుభాషితముల్ గలిగించు క్షేమమున్


    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  29. వలదన్న! పరదారాపాహృత పాపాగ్ని ఒడి పట్టగనేల
    ఇలు వాకిలి కాలగ బేలవై చూడగ నేల యనిన తమ్ము
    నా లంకేశుడు బిట్టు పరిభవింప,చేరె రామభద్రు,నమ్మిక
    పలికిన నిందలు మధుర సుభాషితములగు ననుచున్

    రిప్లయితొలగించండి

  30. ఈ నాటి శంకరాభరణము వారి సమస్య

    పలికిన నిందలు మధురసుభాషితము లగున్"

    ఇచ్చిన పాదము కందము

    నా పూరణము సీసములో


    కీచకుని సంభాషణ సైరంధ్రి తో


    వలచితి నేనని పలుకగ “భండుడ”
    వనుచు ఘోరంబుగ ప్రల్లదనము

    మోపితివిగద,నీ ముఖము సుందరముగ
    కలదని నేదెల్ప” కాపురుషుడ”,


    వనుచు యీ నృపతిపై వాగ్ధండ శరములు
    సంధించి, నిడితివి సంత సమును,


    నీనోట (పలికిన నిందలు మధుర సు
    భాషితములగునె)వ్వరికి నైన


    లేత పెదవులు రాల్చిన గూత లెపుడు

    తేనియల వోలె నిడుచుండు తీయదనము,

    రాతి గుండె కరిగెను సైరంధ్రి ననుచు

    రమణి తో కీచకుండనె రమ్య గతిని

    రిప్లయితొలగించండి
  31. కం:
    జిలిబిలి సొగసుల భామిని
    కులుకుచు కౌగిలి బిగించి కూరిమితోడన్
    చిలిపిగ గిచ్చుచు రక్కుచు
    పలికిన నిందలు మధుర సుభాషితము లగున్.



    రిప్లయితొలగించండి
  32. తెలియవు దోసము లితరులు
    దెలుపు వరకు,వ్యధను చెంద దెలివగునా నిం
    దలకు,ననుభవమున దెలియు
    పలికిన నిందలు మధుర సుభాషితములగున్

    రిప్లయితొలగించండి
  33. గురువు గారికి నమస్సులు.
    సలలిత కల్పన కవియే
    పలికిన నిందలు మధుర సుభాషిత ములగున్
    కలితా రసార్ద్ర పద్యము
    విలసిత హాసరసభాష వేగము గూర్చున్.

    రిప్లయితొలగించండి
  34. మలినము లేనిమనంబుయు
    కొలువుచుముదముగ,పతియునుకోరిన విధమున్
    మెలగుచు నుండగ, భర్తయు
    పలికిన నిందలు మధురసుభాషితము లగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మనంబును' అనండి. 'కొలువుచు'?

      తొలగించండి
  35. కలసిమెలసి యందరితో
    విలువలనెరిగి చరియించు విజ్ఞుని కెపుడున్
    కలుగదు కోప మ్మితరులు
    పలికిన నిందలు మధురసుభాషితము లగున్

    రిప్లయితొలగించండి
  36. (రామదాసు నిందా స్తుతి గురించి శ్రీ రాముడు సీతాదేవి తో)
    తలపకుమెన్నడేనియు వ్యధార్తుల మాటలు కర్కశమ్ములౌ
    కలతల బల్కులే యవి యకల్మషమౌ దన మానసమ్ము దా
    పలికిన నిందలెల్లను సుభాషితముల్ గలిగించు క్షేమమున్
    నిలుచును రామదాసు మహనీయ చరిత్రము కీర్తనమ్ములన్

    రిప్లయితొలగించండి
  37. చెలియయు యౌవన వయసున
    చెలికాడుయుతోటితిరుగ,చెవులననందున్
    వలపులు విసరుచు, తనకును
    పలికిన నిందలు మధురసుభాషితము లగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చెలికాడును' అనండి. 'చెవులననందున్'?

      తొలగించండి
  38. ములుకులవోలె గ్రుచ్చెనవి ముచ్చిరి దెచ్చెను గ్రామమధ్యమున్
    బలువురు చూచుచుండ నట పామరు డొక్కడు నోరు జారుచున్
    బలికిన నిందలెల్ల, సుభాషితముల్ గలిగించు క్షేమమున్
    చెలిమరి మేలుగోరుచు వచించెడు మాటలె లోకమందునన్.

    రిప్లయితొలగించండి
  39. సవరణతో

    తలిదండ్రులు తమసంతును
    తొలినుండి యిటుల దరచుగ దూఱుచు నుండన్
    కలవర పోవక నిలుమా
    పలికిన నిందలు మధురసుభాషితము లగున్

    రిప్లయితొలగించండి
  40. విలువలు కోలుపోయెను వివేచన పోయెను దారితప్పెనే
    పలువురు కంటగించె, నపవాదులపాలగు పుత్రుఁ జూచి వ్యా
    కులపడి మందలించి, తమ కోపము దీరగ తల్లిదండ్రులే
    పలికిన నిందలెల్లను సుభాషితముల్ గలిగించు క్షేమమున్౹౹

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పలువురు కంటగించి రపవాదుల..." అనండి.

      తొలగించండి
  41. ఇలగలగురువులుపెద్దలు
    పలికిననిందలుమధురసుభాషితములగున్
    బలుకులదేనెలుగలిగెడు
    ఖలులనుసుమనమ్మరాదుకలియుగమందున్

    రిప్లయితొలగించండి
  42. పలుకని లింగమూర్తిగని పంతముబూనుచు మూఢభక్తితో
    అలుకవహించితిట్ట నభయంబిడిగాచెను భక్త కన్నపన్
    పలికిన నిందలెల్లను సుభాషితముల్ గలిగించు క్షేమమున్
    పలికినపల్కులందుగలభక్తినిదైవముజూచు గావుతన్

    రిప్లయితొలగించండి
  43. కందం
    వలచిన వైరుల జన్మమె
    బలిబంధను వేగఁ జేర్చు పథకమ్మైనన్
    యిలుగగ హరిచేతఁ, జెలఁగి
    పలికిన నిందలు మధురసుభాషితము లగున్

    చంపకమాల
    కలతను బాసి వేగ హరిఁ గైటభవైరి సమీపమందగన్
    వలచిరి ద్వారపాలకులు వైరుల పోకడ మూడుజన్మలన్
    జెలఁగుచు వైరభక్తిఁ బ్రభు చేతులఁ జావగ స్వామి ముందరన్
    పలికిన నిందలెల్లను సుభాషితముల్! గలిగించు క్షేమమున్! !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఐనన్+ఇలుగల' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ మనవి.

      కందం
      వలచిన వైరుల జన్మమె
      బలిబంధను వేగఁ జేర్చు పథకమ్మైతే
      నిలుగఁగ హరిచేతఁ, జెలఁగి
      పలికిన నిందలు మధురసుభాషితము లగున్

      తొలగించండి
  44. నలినాక్షుఁ గృష్ణు నిత్తఱి
    తలంచి శిశుపాల ఘోర తాపము సెలఁగన్
    లలి గూఢార్థమ్ములు నీ
    పలికిన నిందలు మధురసుభాషితము లగున్


    కలవర మంద నేల సఖ కా వవి శాపము లెంచి చూచినం
    జల మది వీడి చిత్తమునఁ జక్కఁగ నేఁగుమ వీటి కింకఁ దా
    నలిగినఁ గన్న తండ్రి పరమాత్యయ చిత్తత స్వీయ పుత్రుతోఁ
    బలికిన నిందలెల్లను సుభాషితముల్ గలిగించు క్షేమమున్

    రిప్లయితొలగించండి
  45. కలిగినబ్రేమతోడను,ముఖంబునసంతసమొందుచుండుచున్
    బలికిననిందలెల్లనుసుభాషితముల్గలిగించుక్షేమమున్
    బలుకులుదీయగాగలిగిబామరువోలెనుభండనంబుకై
    కలియబడంగవచ్చినబకాసురులన్దునుమాడుటొప్పగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సంతస మొందుచున్ గడున్ బలికిన..." అనండి. 'భండనంబునకై' అనడం సాధువు.

      తొలగించండి
  46. చం:

    పలుకుచు నుండ రావణుడు భ్రష్టగు మాటల నెల్ల వేళలన్
    విలవిల లాడు నట్టులుగ వింతగు చేష్టల రాక్షసత్వమున్
    వలవల బోవు సీత వనవాసము నందున దల్చె నీ గతిన్
    పలికిన నింద లెల్లను శుభాషితముల్ గలిగించు క్షేమమున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  47. తెలుపగ నీకు సంస్కృతిని తేకువ పెద్దలు మందలింతురే
    విలువగు వారి చూచనల పెట్టుము మానస మందునిచ్చతో
    కలఁగకు వారి మాటలకు, కాంచగ నీ యభివృద్ధి గట్టిగా
    పలికిన నిందలెల్లను సుభాషితముల్, గలిగించు క్షేమమున్

    రిప్లయితొలగించండి
  48. మిత్రులందఱకు నమస్సులు!

    [శ్రీమహావిష్ణువును దర్శింపవచ్చిన సనకసనందనాదులు జయవిజయుల కిచ్చిన శాపఫలితముగ, ద్వాపరమున శిశుపాలవధ శుభకరముగఁ బరిణమించిన దనుట]

    జలశయనుండు విష్ణుని వెసం గనవచ్చిన మౌనులంతఁ, గా
    వలి భటు లాపఁగాను, క్రుథఁ బన్చిరి శప్తత! ద్వాపరాన నొం
    డల శిశుపాలుఁడై హరిని నాస్థను వందవు నింద సేయఁగాఁ,
    గలఁగక శాపముక్తికయి కైటభవైరియె సంపె! వాని యా

    పలికిన నిందలెల్లను సుభాషితముల్; గలిగించు క్షేమమున్!

    రిప్లయితొలగించండి

  49. అలుకలు వీడుచు నెనరుల
    తలపులు చిగురించు వేళ తమకము విరియన్
    కులుకులు తొలుకుచు చిలిపిగ
    పలికిన నిందలు మధుర సుభాషితములగున్!

    రిప్లయితొలగించండి
  50. కం.
    ఇలలో దైవము మాదిరి
    విలువలు పెంచే చదువులు విద్యార్థులకున్
    తెలిపే చక్కని గురువులు
    పలికిన నిందలు మధుర సుభాషితములగున్

    గొర్రె రాజేందర్
    సిద్దిపేట

    రిప్లయితొలగించండి