11, మే 2020, సోమవారం

సమస్య - 3366

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మోక్షార్థికి వలయు మద్యమును చౌర్యంబున్"
(లేదా...)
"మోక్షముఁ గోరువారలకు ముఖ్యము చౌర్యము మద్యపానముల్"

97 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    చక్షుల కింపుగా తనరి చల్లని మాటల మభ్యపెట్టుచున్
    రక్షణ కోరి చేరుచును లాఘవ మొప్పుచు జాయలౌచు భల్
    రాక్షసులైన నారులవి రమ్యపు కోర్కెలు తీర్చజాలకే
    మోక్షముఁ గోరువారలకు ముఖ్యము చౌర్యము మద్యపానముల్

    రిప్లయితొలగించండి
  2. *అందరికీ నమస్సులు ..*🙏🙏

    *70-75% పెంచిన మద్యం రేటుని దృష్టిలో ఉంచుకుని సరదాగా ఓ నిజం..*😊

    *కం||*

    రక్షించెడి వారెవ్వరు
    వీక్షించగ పెగ్గు రేటు విపరీతంబై
    శిక్షలకున్ సిద్ధమనెడి
    *"మోక్షార్థికి వలయు మద్యమును చౌర్యంబున్"*!!

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏😊🙏😊🙏

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    దీక్షను బూని చేయుటకు దేశపు సేవలు లోకులెల్లరిన్
    కుక్షుల నింపి వేడుకను కోడుల మేకల కుర్మ తోడుతన్
    లక్షలు పంచి వోట్లకును లాభము నొందగ రాజనీతినిన్
    మోక్షముఁ గోరువారలకు ముఖ్యము చౌర్యము మద్యపానముల్

    మోక్షము = కైవల్యము

    రిప్లయితొలగించండి
  4. (ముక్తులు - అముక్తులు )
    అక్షయమైన శ్రద్ధయును
    నంత మెరుంగని నమ్మకంబునున్
    మోక్షము గోరువారలకు
    ముఖ్యము ;చౌర్యము మద్యపానముల్
    రాక్షసమైన భావముల
    రాతుల గుండెల కర్కశాళికిన్
    బక్షములౌచు బల్మిమెయి
    పాడగు బావుల గూల్చు పాశముల్ .
    (పక్షములు -తోడులు ;బల్మిమెయి -బలవంతముగా )

    రిప్లయితొలగించండి


  5. సాక్షాత్కారపు చింతన
    మోక్షార్థికి వలయు, మద్యమును చౌర్యంబున్
    సాక్షాత్తతనికి కీడౌ
    భిక్షార్థిగ నిలువ మేలు విశ్వపుని కెడన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులు!

    భక్షకులై కుటుంబమును బాధలపాలొనరించి తాము బల్
    శిక్షలువేయుచున్ వ్యసన శీలురునై బహు రోగయుక్తులై
    రక్షణ నీయలేక ప్రచురమ్మగు మంచి వ్యవస్థనుండియున్
    మోక్షముఁ గోరువారలకు ముఖ్యము చౌర్యము మద్యపానముల్!

    రిప్లయితొలగించండి


  7. హముని సమాశ్వాసంబచ
    లము మోక్షముఁ గోరువారలకు ముఖ్యము; చౌ
    ర్యము మద్యపానముల్ నీ
    మము తప్పుటయగు చెడును సమస్థితియె సుమీ


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి

    2. కోతి చేతికి చిక్కిన కొత్త పూమాల ఉత్పలమాల కందాట :)

      తొలగించండి
    3. ప్రశస్తం, ప్రశంసనీయమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి


  8. భిక్షము కోరగావలయు విశ్వపు డాతని ముంగిలిన్ సదా
    వీక్షణ మెప్పుడౌననుచు వేంకటనాథుని చూచు కార్యమే
    మోక్షముఁ గోరువారలకు ముఖ్యము; చౌర్యము మద్యపానముల్
    తీక్షణమైన కీడు నిడు త్రిప్పట జేర్చును జన్మజన్మలన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. దక్షిణదిఙ్ముఖ శివకృప
      మోక్షార్థికి వలయు, మద్యమును చౌర్యంబున్
      దక్షిణదిక్పతి నారక
      శిక్షాకారకములవు సుశీలపులేమిన్!

      తొలగించండి
    3. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. కం//
    రక్షించు రామ నామము
    మోక్షార్థికి వలయు, మద్యమును చౌర్యంబున్ !
    బిక్షముగొను యీశునకున్
    దక్షత గల్గును సరికొను ధరణీ పతికిన్ !!

    రిప్లయితొలగించండి
  11. దీక్షగధర్మాచరణము
    రక్షధనాగారమునకురాష్ట్రమునందున్
    రక్షభటులులేకపెరుగు
    "మోక్షార్థికి వలయు, మద్యమును ,చౌర్యంబున్"

    (క్రమాలంకారము)


    తక్షణధర్మరక్షణమిలధైర్యముసల్పుటెబుద్ధి కాదగున్
    "మోక్షముఁ గోరువారలకు ము
    ఖ్యము, చౌర్యము మద్యపానముల్"
    లక్షణమైచెలంగుచువిలాసముఁబేరిటనాశమొందిటన్
    శిక్షణనిచ్చిసద్గతినిచేరఁబ్రభుత్వముసంస్కరింపదే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తక్షణ ధర్మరక్షణమిలధైర్యమునిల్పగబుద్ధిఁగల్గుటే

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తత్క్షణము' అన్నది సరైన పదం.

      తొలగించండి
    3. దక్షతధర్మరక్షణమిలతత్క్షణమేసమకట్టులక్ష్యమే
      "మోక్షముఁ గోరువారలకు ము
      ఖ్యము, చౌర్యము మద్యపానముల్"
      లక్షణమైచెలంగుచువిలాసముఁబేరిటనాశమొందిటన్
      శిక్షణనిచ్చిసద్గతినిచేరఁబ్రభుత్వముసంస్కరింపదే

      తొలగించండి
  12. అక్షర సత్యమీ విషయ మాతడు "తాను గిరీశ వంశ్యుడన్,
    దక్షుడ నన్నిటన్, పొగను ద్రాగగ జెప్పెను గాదె పూర్వ, మా
    దీక్షను దాల్చువా రిచట దీనిని నమ్ముడ టంచు బల్కె నౌ
    న్మోక్షము గోరువారలకు ముఖ్యము చౌర్యము మద్యపానముల్.

    రిప్లయితొలగించండి
  13. చక్షువుల నీళ్ళునిండెను
    భక్షణ కొరకయి కొనుటకు
    పైకము లేదే
    తక్షణమింక కరోనా
    మోక్షార్థికి వలయు మద్యమును చౌర్యంబున్

    రిప్లయితొలగించండి
  14. దీక్షగభగవద్ధ్యానము
    మోక్షార్థికి వలయు, మద్యమును చౌర్యంబున్
    రాక్షసనైజమును విడచు
    దక్షతగలవాడెభువినిదనరుయశమునన్

    రిప్లయితొలగించండి
  15. శిక్షింపుచు సజ్జనులను
    భక్షింపుచు మాంసహార వంటలనెపుడున్
    తక్షణము స్త్రీలు, నా యతి
    మోక్షార్థికి వలయు మద్యమును చౌర్యంబున్

    అతిమోక్షము-విరజాజి,నవమల్లిక

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మాంసాహార' మనాలి. అయినా మాంసాహార వంటలు... దుష్టసమాసం.

      తొలగించండి
  16. మైలవరపు వారి పూరణ

    దీక్షగ భక్తితో హరి నుతించి ఘనుల్ వరముక్తి గోర., మా..
    కీ క్షణమాత్రమైన సుఖమే రుచి యందురు ధూర్తులిద్ధరన్!
    శిక్షల మ్రగ్గి ఛిద్రమయి., శీలనివాసధనాదికాళికిన్
    మోక్షముఁ గోరువారలకు ముఖ్యము చౌర్యము మద్యపానముల్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  17. భక్షించగ తేరెవ్వరు 
    శిక్షకు లెవ్వరును లేరు శిక్షింపంగా 
    కుక్షియె సర్వస్వంబను    
    మోక్షార్థికి వలయు మద్యమును చౌర్యంబున్

    రిప్లయితొలగించండి
  18. రక్షాకవచము'మద్యము
    చక్షువుచేదోచుకొనగ చౌర్యంబనగన్,
    రక్షాకవచంబుజదువ
    మోక్షార్థికి వలయు మద్యమును చౌర్యంబున్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  19. అక్షధరుని కృపఁ బొందుటె
    లక్షము గలవాడనని విరాగిని యనుచున్
    లక్షల నాశించు కపట
    మోక్షార్థికి వలయు మద్యమును చౌర్యంబున్

    రిప్లయితొలగించండి
  20. అక్షయ మైన తపంబది
    మోక్షార్థికి వలయు : మద్యమును చౌర్యంబు న్
    కుక్షికి తృప్తి నొసంగున్
    దక్షులు కానట్టి కుజన తతులకు సతమున్

    రిప్లయితొలగించండి
  21. రిప్లయిలు
    1. ఆక్షేపణ రహితముగా
      వీక్షించు కుటుంబమున్నఁ, వీతచరితుడై
      శిక్షా భయభీతుల పరి
      మోక్షార్థికి వలయు మద్యమును చౌర్యంబున్.

      వారించకుండా చూస్తూ కూర్చునే కుటుంబసభ్యులుండి, చరిత్రహీనుడై, శిక్ష పట్ల భయభీతులు వదులుకున్నవానికే మద్యపానముతో కూడిన దొంగతనము తగును.

      పరిమోక్షార్థి=వదలుకున్నవాడు.

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. ఉత్పలమాల
    మోక్షము ప్రాణముల్ విడువ పొందెదరంచు వినంగఁ బల్కిరే
    భక్షణ గూర్చెడున్ గొలువు పాతిక దాటినఁ జిక్కదన్నటుల్
    తక్షణ భుక్తికై ధనముఁ ద్రాగుచు మత్తునఁ దూలి కూలుటన్
    మోక్షముఁ గోరువారలకు ముఖ్యము చౌర్యము మద్యపానముల్

    రిప్లయితొలగించండి
  23. అందరికీ నమస్సులు 🙏

    మరో పూరణ యత్నం 😊

    *కం||*

    కక్షను గట్టె కరోనా
    శిక్షగ మద్యము వలదనె సిత్రమె గదరా
    దీక్షగ త్రాగగ దలచిన
    *"మోక్షార్థికి వలయు మద్యమును చౌర్యంబున్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌹🙏🌹🙏

    రిప్లయితొలగించండి


  24. మద్యమే ఎకానమీ నరుడా :)


    రక్షణ పరమాత్మయగున్
    మోక్షార్థికి; వలయు మద్యమును చౌర్యంబున్
    రక్షణగా ప్రభుతకు ! తను
    నైక్షవపు దుకాణముల జనాళికి తెరిచెన్ !



    జిలేబి

    రిప్లయితొలగించండి
  25. తీక్షంబైన విరాగము
    మోక్షార్థికి వలయు; మద్యమును,చౌర్యంబున్
    దీక్షంబూని విడిచి,నిట
    లాక్షున్ భక్తి గొలువగ వలయు రేపవలున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తీక్ష్ణము' అన్నది సాధువు. 'తీక్షము'?

      తొలగించండి

  26. ఉ॥
    అక్షయ భక్తిభావమున నక్షరదేవతఁ బూజచేసి రు

    ద్రాక్షల లెక్కబెట్టుచును ధ్యానము చేసెడి దైవచింతయే

    మోక్షముఁ గోరు వారలకు ముఖ్యము; చౌర్యము మద్యపానముల్

    కుక్షికి మాంసముల్ దినును గ్రోలును చేయును దాన వాత్ముడే..

    రిప్లయితొలగించండి
  27. దీక్షా ధారణ నియమము
    మోక్షార్థికి వలయు; మద్యమును చౌర్యంబున్
    లక్షణములు దుష్టులకు, వి
    చక్షణయే దెరుచు జ్ఞాన చక్షువులొప్పున్

    రిప్లయితొలగించండి
  28. అక్షీణంబగుభక్తియె
    మోక్షార్ధికివలయు,మద్యమునుచౌర్యంబున్
    శిక్షకునర్హతయగుచును
    భిక్షకునిగజేయునెపుడుపృధివినివానిన్

    రిప్లయితొలగించండి
  29. లక్షణమైన జీవితము రచ్చను జేయకు త్రావి మద్యమున్
    శిక్షలు చాలు నీ సతికి చిందిన బాష్పము లాలి కంట నీ
    కే క్షతి కాయకష్ట మొకటే గతి మానుట, లేమి నుంచి స
    న్మోక్షముఁ గోరువారలకు, ముఖ్యము చౌర్యము మద్యపానముల్.

    రిప్లయితొలగించండి
  30. అక్షయమైనభక్తియునునార్ద్రతగూడీనమానసంబునే
    మోక్షముగోరువారలకుముఖ్యము,చౌర్యముమద్యపానముల్
    శిక్షకునర్హమైమిగులజేటునుగూర్చుచుభ్రష్జుజేయగా
    గక్షలుగూడపెంచియునుగాపురుషుండనిదూరముందురే

    రిప్లయితొలగించండి
  31. భక్షణ యే స్వర్గమనుచు లక్షల సిరిదోచుకొనుచు రక్షక భటులన్ దక్షత నణచెడి నకిలీ మోక్షార్థికి వలయు మద్యమును చౌర్యంబున్

    రిప్లయితొలగించండి
  32. భక్షణయే స్వర్గమనుచు
    లక్షల సిరిదోచుకొనుచు రక్షక భటులన్
    దక్షత నణచెడి నకిలీ
    మోక్షార్థికి వలయు మద్యమును చౌర్యంబున్

    రిప్లయితొలగించండి
  33. అక్షయ మౌవరమ్ములవి యడ్గక నిత్యము వీడకుండ గా
    దీక్షగ రామనామము నుతించుచు సాధన జేయుటే కదా
    మోక్షముఁ గోరువారలకు ముఖ్యము, చౌర్యము మద్యపానముల్
    భక్షణ జేయ మాంసమది పాపులు తప్పుగ నెంచ బోరులే.

    రిప్లయితొలగించండి
  34. శిక్షణమేసతమిలలో
    మోక్షార్థికి వలయు,మద్యమున్ చౌర్యంబున్
    మక్షను పెంచుచు ఖలులకు
    శిక్షలనేగూర్చుననుట సిద్ధము సుమ్మీ.

    మక్ష:కోపము.

    రిప్లయితొలగించండి
  35. కందం
    నిక్షిప్తముఁ జేసి సిరుల
    కుక్షికి ముప్పూటలఁదిని కుతితీరఁ గురం
    గాక్షుల మరిగిన కపటఁపు
    మోక్షార్థికి వలయు మద్యమును చౌర్యంబున్

    రిప్లయితొలగించండి
  36. కుక్షి లయ భరణముల కవ
    లక్షణములు సుమ్ము భూవలయమున నన ని
    త్యాక్షయ సమ్మాద విభవ
    మోక్షార్థికి వలయు మద్యమును జౌర్యంబున్


    రూక్ష తరైక వర్తన విలోల విహార విలగ్న చిత్తులై
    యక్షయ గాత్ర శుద్ధి కమలాసన దత్త మహా నిజాన్న కో
    శక్షయ రోగ కోటులఁ బ్రచండ గతిం గని సత్వరమ్ముగన్
    మోక్షముఁ గోరువారలకు ముఖ్యము చౌర్యము మద్యపానముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ మొదటి పూరణ ప్రశస్తంగా, రెండవ పూరణ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  37. ఉ:

    దీక్షితు లొక్కనాడు కడు దీక్షగ భాగవతమ్ము జెప్పుచు
    న్నా క్షణమందు జూడ నొక నల్లరి దూరుచు మారురూపమున్
    లక్షణ మైన భావనల లౌక్యము జూపగ నిట్లు దల్చె హే
    మోక్షము గోరు వారలకు ముఖ్యము చౌర్యము మద్య పానముల్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  38. క్రమాలంకార పూరణ..........

    దీక్ష వహించి నిశ్చల మతిన్ పరమేశ్వరతత్వ చింతనా
    పేక్షఁ నిరంతరంబు యర విచ్చిన కన్నుల ధ్యానముద్రయే,
    శిక్షలు మందలింపులును చీత్కరముల్ శమియింపఁజేయవే
    మోక్షముఁ గోరువారలకు ముఖ్యము, చౌర్యము మద్యపానముల్

    రిప్లయితొలగించండి
  39. భక్షణయే స్వర్గమనుచు
    లక్షల సిరిదోచుకొనుచు రక్షక భటులన్
    దక్షత నణచెడి నకిలీ
    మోక్షార్థికి వలయు మద్యమును చౌర్యంబున్

    రిప్లయితొలగించండి
  40. దీక్షయుమానసంబునను దివ్యముభవ్యములైన యోచనల్
    మోక్షముఁ గోరువారలకు ముఖ్యము, చౌర్యము మద్యపానముల్
    దక్షతలేమిమానసముతామసమందునజిక్కి యుండుటల్
    రాక్షసవృత్తులన్ మసలు రావణవారస లక్షణంబులౌ

    రిప్లయితొలగించండి
  41. కుక్షికి నిత్యమున్ కుడుపు క్రుక్కుచు స్వర్గమటంచు నెంచుచున్
    రక్షకులైన వారలను లక్ష్యము చేయక దుష్టచిత్తులై
    లక్షల సొమ్ము దొంగిలుచు క్రౌర్యము తోడుత, దొంగసొమ్ముతో
    మోక్షముఁ గోరువారలకు ముఖ్యము చౌర్యము మద్యపానముల్
    (నాకు తెలిసిన ఒకతను ఉన్నాడు కొబ్బరికాయ కూడా లంచం గానే తీసుకొనేవాడు)

    రిప్లయితొలగించండి
  42. సాక్షిగ సత్పథంబులును
    సాధన వీడని యోగ శక్తియున్
    మోక్షముఁ గోరువారలకు
    ముఖ్యము; చౌర్యము మద్యపానముల్
    దీక్షను ద్రుంచి జీవన ధృ
    తిన్ బెడదారులలోన నిల్పి సం
    వీక్షణ లేక జీవన వి
    వేచనమున్ వికృతంబు జేయునే!

    రిప్లయితొలగించండి
  43. ముక్తికిదగ్గరయౌనట
    భక్తిపెరిగినట్టిజనులబ్రదుకులు,బరువౌ
    భక్తివిహీనులబ్రదుకులు
    ముక్తికిబహుదూరమగుచుమూడింతలుగా

    రిప్లయితొలగించండి