12, మే 2020, మంగళవారం

సమస్య - 3367

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ"
(లేదా...)
"భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

69 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    ముక్తిని కోరకే వలచి ప్రొద్దున రాతిరి సత్యభామలన్
    శక్తికి మించి ప్రేమనిడి సంబర మొందుచు కర్చుజేయుచున్
    రక్తిని తాళజాలకయె రంభల వోలెడు పత్నులందులన్
    భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  2. *నేనిచ్చిన సమస్యని అంగీకరించిన శ్రీమాన్ శంకరార్యులకు వేవేల వందనములతో ..* 🙏🙏🙇‍♂️🙇‍♂️

    నా పూరణ ప్రయత్నం...

    *కం||*

    శక్తిని మించిన పూజలు
    ముక్తి కొరకు జేయుచుండ, మూర్ఖుల వలె దు
    ర్భక్తి ని గల స్వాములపై
    *"భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ"*!!

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏😊🙏😊🙏

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    యుక్తియె లేక కొద్దిగను యోధుల మంచును విఱ్ఱవీగుచున్
    శక్తిని మించి పోరుచును చంకలు కొట్టుచు, రాజకీయమున్
    రక్తియె హెచ్చి పొంగగను, రంగుల రాట్నపు నాధిపత్యమున్
    భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  4. భక్తిగ గుడికట్టించెను
    తక్తును గోల్పోయెరామ దాసుడు తానే
    భక్తులకుమోక్షమే గురి
    భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ

    తక్తు-సింహాసనం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్యదేశ్యాన్ని వాడినా మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  5. నక్తములను బాటించుచు
    యుక్తాయుక్తముల నెంచు యోచనలేకే
    సూక్తులను వినని మూఢపు
    భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ!

    నక్తము = కార్తీకమాస ఉపవాసం

    భుక్తిని రక్తినిన్ పరమపూజ్యము లంచును కామమోహులై
    శక్తిని యుక్తినిన్ గలిపి సంపదలెన్నియొ కూడగట్టు నా
    సక్తిని మాయయోగులను సద్గురులంచును నాశ్రయించెడిన్
    భక్తియె మీరగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  6. భక్తిగ.చిత్తము శుద్దిగ
    శక్తికొ లదిపూజసేసి శరణం కోరఁవె
    ముక్తికని ప్రదర్శించెడి
    భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "భక్తిగను చిత్తశుద్ధిగ... శరణంబనవే" అనండి.

      తొలగించండి
    2. నమస్కారం గురువుగారు!

      భక్తిగను చిత్తశుద్దిగ
      శక్తికొ లదిపూజసేసి శరణం బనవే!
      ముక్తికని ప్రదర్శించెడి
      భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ

      తొలగించండి
  7. నా పూరణ ఉ.మా.
    **********

    భక్తుల పేర్మి గాచి భవ వారధి దాటగ జేయు రామునిన్

    భక్తి భజించి సంతతము వాసిగ నా విభు మందిరమ్ము నా

    సక్తిగ గట్టి యేగె చెరసాలకు సద్గుణ రామదాసయో!

    భక్తియె మీఱగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్


    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి


  8. రక్తియె మేలు సదాశివ!
    భక్తుడు కన్నప్ప గాధ బాగుగ తెలిపెన్
    ముక్తిని గోరుట మూర్ఖత!
    భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  9. కందోత్పల :)


    అనుమానము వలదు! వచిం
    తును భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్
    జనులెల్లవారికిన్! భ
    క్తుని గాధల చదువు! రక్తి కొంతయు గలదే ?


    జిలేబి

    రిప్లయితొలగించండి


  10. వ్యక్తము! చెప్పెదన్ వినుము! ధ్యానము ధ్యానమటంచు మూఢులై
    ముక్తిని కోరు వారల ప్రమోదము చూచితివా? సదాశివా
    శక్తిని నిమ్మ నాకనుచు చాల ప్రలాపము లేను! చూడగా
    భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. మైలవరపు వారి పూరణ

    ప్రహ్లాదునితో.. గురువులు👇

    శక్తినొసంగు వాడతడె శౌరియె., సత్యమె., కాని బాలకా!
    యుక్తి గ్రహింపురా ! హితము నొప్పని వారికి జెప్పరాదురా!
    రక్తిగ నాన్న దేవుడనరా! హరినొల్లని తండ్రి ముందు త...
    ద్భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్ !

    (ఎల్లవారికిన్= నీకు.. మాకు.. అందరికీ)

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  12. (ఏ సల్లక్షణమైనా ఉండవలసినంతమాత్రమే ఉండాలి )
    రక్తియు నుండగావలెను
    రాజితజీవనయానమందునన్ ;
    శక్తియు నిండగావలెను
    చల్లని భారతమాత రక్షకై ;
    యుక్తియు పండగావలె న
    యోమయబాధల బాప ; మూర్ఖపుం
    భక్తియె మీరగన్ బ్రతుకు
    భారమగున్ జనులెల్లవారికిన్ .
    (అయోమయబాధలు - కర్కశమైన కష్టములు )

    రిప్లయితొలగించండి
  13. యుక్తము కాదు మద్యమున నున్నతరీతిని వాంఛ బూనుటల్
    వ్యక్తి గతామయంబులను బాపెడి దానిగ దాని నెంచుటల్
    శక్తిని గూర్చునంచు తమ స్వాంతములోనను దానియందిలన్
    భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్

    రిప్లయితొలగించండి

  14. ఉ॥
    భక్తియె ముక్తికిన్ పథము, ప్రాణము నిల్వక దేహంమందు నన్

    శక్తి నశించ వేడె కరి చక్రిని చయ్యన నేగుదెంచియున్

    ముక్తి నొసంగె నమ్మొసలి మోమున కోరల నుండి కాదె? యే

    భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్?

    ... రేసోజు మల్లేశ్వర్

    రిప్లయితొలగించండి
  15. భక్తుడు రామదాసుమునుఁబల్కెను పద్యము బంధిఖానలో
    భక్తుడు త్యాగరాజుయునుభారము నిల్పెను పంచరత్నముల్
    భక్తగ గన్నులన్దునిమెభక్తుడుకన్నడుమూఢభక్తి,తత్
    భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  16. భక్తిని రామదాసు తను పాటుల కోర్చుచు కట్టగా గుడిన్
    తక్తును వీడెగా తుదకు దానిక ద్రవ్యము దోచినాడనిన్
    నక్తము లున్నయైనను సనాతుని వీడరు భక్తులెప్పుడున్
    భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్.

    రిప్లయితొలగించండి
  17. కం//
    ముక్తిని నొసఁగును, గోవుల
    రక్తిని బొందక వధించు రక్కసిమూఁకల్ l
    శుక్తముదిను మూర్ఖుల పై
    భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ ll

    రిప్లయితొలగించండి
  18. యుక్తిగ డబ్బులు దోచగ 
    భక్తులకును తన  భజనల మార్గము చూపున్      
    ముక్తి కొరకు మూఢ భజన  
    భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ  

    రిప్లయితొలగించండి
  19. భక్తులమోసముజేయుచు
    భుక్తికొరకుజనులమాయబుచ్చుస్వాముల్
    ముక్తికి వారినిగొలిచెడు
    భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ

    రిప్లయితొలగించండి
  20. భక్తిన ప్రేమహృదయము,వి
    రక్తియు గావలెను,కాదురా!పేరునకై,
    శక్తికి మించుచు జూపెడు
    భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ.

    రిప్లయితొలగించండి
  21. రిప్లయిలు
    1. సక్తనికామకామవివశాత్ముడు విత్తహరైకశీలి వై
      రక్తికడాంబికార్థసువిరాజితకైతవరూపధారి వై
      భక్తికచిత్తచంచలుడు వ్యాజము నూని ప్రదర్శనార్థమై
      భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్

      కంజర్లరామాచార్య.

      తొలగించండి

  22. * శంకరాభరణం వేదిక *
    12/05/2020 ...మంగళవారం

    సమస్యల
    ********

    "భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్"

    నా పూరణ. ఉ.మా.
    **** **** **

    భక్తుల బ్రోవగన్ ప్రభువు పంపగ వచ్చితి మంచు స్వాములే

    రిక్తము జేయగ బ్రతుకు లీలలు జూపుచు నాశ్రమాలలో

    యుక్తిగ దోచి ముంచెదరు; యోచన జేయక యట్టి వారిపై

    భక్తియె మీఱగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్


    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  23. భుక్తము విడి యొక మాసము
    శక్తిని పూజించె నతడు శరణా గతుడై
    శక్తియె హరించె మూఢపు
    భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ

    రిప్లయితొలగించండి
  24. శక్తికి మించిన పనులను
    భక్తిగ నొనరించు శ్రమిక వర్గం బెపుడున్
    భుక్తిని గల్పింపక తమ
    భక్తి పెరిగి నట్టి జనుల బ్రతుకులు బరువౌ

    రిప్లయితొలగించండి
  25. శక్తికి మించిన తలపులు
    నుక్తియు లేనట్టితనమునొండొరులధనా
    సక్తియు కించిత్ కుహనా
    భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ

    రిప్లయితొలగించండి


  26. ఆ.వె:ముక్తినొ సంగెద నంచును
    భక్తుల హృదయములలోని బలహీనతలన్
    యుక్తిగ దోచు ఖలులపై
    *భక్తి పెరిగి నట్టి జనుల బ్రతుకులు బరువౌ.*

    రిప్లయితొలగించండి
  27. భుక్తికిఁ గడచుట కొరకై
    శక్తికిఁ దగ్గట్టి పనుల సలపగ వలె నా
    సక్తిని పనులను జూపక
    భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ

    రిప్లయితొలగించండి
  28. ముక్తికి మార్గమౌననుచు బూజలు దానములంచు జెప్పుచున్
    భక్తుల మోసగించుటయు వర్తకమాయెను నేటి కాలమున్
    శక్తికి మించి దానములసంగతమౌ దగదట్టి మౌఢ్యమున్
    భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  29. భక్తులు జేరిరంట కడు భక్తిని జూపుచు నాశ్రమమ్ములో
    ముక్తి పథమ్ము చూపునని మూర్ఖులు బారులు తీరి రచ్చటన్
    భుక్తము మాని, రద్ది యట భూరిగ పెర్గగ త్రోపులాటలో
    శక్తి విహీనులెల్లరును చచ్చుట గాంచిన వాడు పల్కెనే
    భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  30. రక్తాశ్రువులేరాలును
    భక్తుల కన్నీటి గాథ ప్రతియొక్కరిదీ
    యుక్తి తొ నొసగెడి మోక్షము
    భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ!!

    రిప్లయితొలగించండి
  31. కం:
    భక్తికి పోటీ యేలను?
    భుక్తికి లేకున్నగాని భూరిగధనమున్
    శక్తిమరచివెచ్చించగ
    "భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ"

    కం:
    భక్తినిమనసారకలిగి
    ముక్తికి మార్గము వెతకిన మోదముకలుగున్
    రిక్తంబగునార్భాటపు
    భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ

    రిప్లయితొలగించండి
  32. (కందాన్ని మార్చి తేటగీతీలో.....)
    భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరు
    వౌను మానవ యత్నము నజ్జగింప.
    భక్తి వలన విశ్వాసము, బలము పెరుగ
    వలెను గాని బాధ్యతలను బాయరాదు.

    రిప్లయితొలగించండి
  33. భుక్తిని పొందగన్ పనికి పోవక సోమరియై చరించుచున్
    శక్తిని ఖర్చుపెట్టుచును సంతత దుర్జన సంగడమ్మునన్
    రక్తి నటించుచున్ సతము రామునిపైనను చూపునట్టి దు
    ర్భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  34. భుక్తికి వేయిమార్గములుభూమిని కొందరు ముచ్చుయోగులై
    భక్తినెపంబునన్ జనులపైబడి మాటల మత్తుమందుతో
    యుక్తిగవారిసంపదలనూడ్చుకుబోదురు మూఢమైనయా
    భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  35. ఉ:

    రక్తిని రంగరించి తమ రక్తము నెల్లను ధారబోయుచున్
    ముక్తిని గోరు చందమున మూర్ఖపు పిల్లల పెంపు సేయగన్
    రిక్తపు హస్తముల్ దెలుపు రీతిని యెంచెడు వారియందిలన్
    భక్తియె మీరగన్ బ్రతుకు భారమగున్ జనులెల్ల వారికిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  36. శక్తి కొలందికిఁ జేసెడు
    భుక్తి ప్రద నిత్య కర్మముల రాబడులన్
    దిక్తట సంగత నిజ కర
    భక్తి పెరిగి నట్టి జనుల బ్రతుకులు బరువౌ

    [భక్తి = భాగము; కర భక్తి = కప్పపు భాగము]


    రక్తినిఁ గొల్వ నన్య సుర రాజిని నిత్యము విత్త మందు నా
    సక్తి సెలంగఁ జిత్తమున సంపద లింపుగఁ జేరు భక్తులన్
    ముక్తికి ద్వారమై పుడమి మూర ముకుంద పదారవింద స
    ద్భక్తియె మీఱఁగన్ బ్రతుకు భార మగున్ జను లెల్ల వారికిన్

    రిప్లయితొలగించండి


  37. శక్తికి మించిన ఖర్చులు
    యుక్తము లేకను సలపుచు హోరున పూజల్
    వ్యక్తులు జేతురు,మూఢపు
    "భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ"

    రిప్లయితొలగించండి
  38. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భక్తియెమీఱగన్బ్రతుకుభారమగున్జనులెల్లవారికిన్
      నుక్తపువాక్యమున్సరియయూరికెచెప్పెడుమాటకాదయా
      భక్తుడనంచుకొందరిలబాధలుదీర్చగబూజజేతునీ
      శక్తినిసొమ్మునీయుమనిచాలినమొత్తముదోచుకొందురే

      తొలగించండి
  39. 1.
    కందం
    శక్తికి మించి ధనమ్మున
    ముక్తికనుచు గుడినిఁ గట్టి పోయెను చెరకున్
    భక్తుడు గోపన్న మిగుల
    భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ

    2.భక్తి పేరున ప్రతిదాన్నికి డబ్బు తీసుకుని వెళ్ళు శ్రీమతితో భర్త :

    ఉత్పలమాల
    ముక్తిని గూర్చు యాగమన మొన్ననె నిచ్చితి వేల రూప్యముల్
    శక్తికి మించి భోజన ప్రసాదముఁ బంచఁగ డబ్బు గూర్చితిన్
    సక్తము మీరి కట్టి గుడి సామికి గోపన జైలు పాలయెన్
    భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్ జనులెల్లవారికిన్


    రిప్లయితొలగించండి
  40. వ్యక్తికి శాంతినిదాంతిని
    ముక్తినియిచ్చునదిభక్తిబుద్ధినియరయన్
    శక్తినియుక్తినికూల్చెడి
    "భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ"

    -----ఓలేటి వేంకట బంగారేశ్వరశర్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రక్తినిభార్య,పుత్రులిలరాజిలుమానవసంఘమెల్లకున్
      శక్తినిబుద్ధిదేహములసక్తమొనర్పకవృత్తిగాంచకన్
      ముక్తినియిచ్చుదైవకృప భుక్తినియివ్వదెయంచు మూఢమౌ
      "భక్తియె మీఱఁగన్ బ్రతుకు భారమగున్
      జనులెల్లవారికిన్"

      తొలగించండి
  41. శక్తిని మించిన పూజలు
    యుక్తాయుక్తములు మరచి యుర్విని జేయన్
    భుక్తిని వీడుచు, మూర్ఖపు
    భక్తి పెరిగినట్టి జనుల బ్రతుకులు బరువౌ!!!

    రిప్లయితొలగించండి