15, మే 2020, శుక్రవారం

సమస్య - 3369

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు"
(లేదా...)
"త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్"
(విట్టుబాబు సౌజన్యంతో)

111 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    దాగుడు మూతలాడకయె దగ్గగ తుమ్మక గోలపెట్టకే
    బాగుల నోగులన్ గనక బాగుగ మూయుచు రెండు కన్నులన్
    రోగములన్ని మాపుటకు రొప్పుచు రోయక గంగ తీర్థమున్
    త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్

    రిప్లయితొలగించండి
  2. అందరికీ నమస్సులు 🙏🙏

    *వృత్తములో సమస్యాపూరణం నా మొదటి ప్రయత్నం ..*

    *ఉ మా*

    రోగము మీరగన్ జనుల యోగము లన్నియు మారగన్ మరే
    భోగము లన్నియున్ విడిచి నోపిక తగ్గగ భారమై నిలన్
    త్యాగము జేయఁకన్ మధువు త్రాగుచు దూరము నుండకన్ సదా
    *"త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🙏🙏😞

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ప్రథమ ప్రయత్నం ప్రశంసనీయం.
      మొదటి రెండు పాదాలలో యతి తప్పింది. 'చేయక, ఉండక' అన్నవి కళలు, ద్రుతాంతాలు కావు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారు ..🙏🙏

      మీ ఆశీస్సులు, ప్రోత్సాహమే ఈ ప్రయత్నానికి ఇంధనం గురువు గారు..🙇‍♂️🙇‍♂️

      సవరించే ప్రయత్నం చేస్తాను 🙅‍♂️

      *అన్వయం కుదిరినదా గురూజీ* 🙏

      తొలగించండి
    3. మీరు చివరికి ఏమి త్రాగాలని వివరించారు.. దానిని బట్టి అన్వయం కుదిరిందో లేదో చెప్పవచ్చు

      తొలగించండి
    4. గురువులకు నమస్సులు 🙏🙏

      సవరణ యత్నము 🙇‍♂️🙅‍♂️

      రోగము మీరగన్ జనుల రోజులు యన్నియు మారగన్ తధా
      భోగము లన్నియున్ విడిచి భోరున నేడ్చుచు భూమిపై నహో
      త్యాగము లొప్పకన్ మధువు త్రాగుచునుండు సతమ్ము! నిద్దియే
      *"త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్"*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      😊🙏

      తొలగించండి
  3. శ్రీమాత్రేనమః 



    సాగుచు పోవలెన్ విరుల శాఖలు తెల్గుల వెల్గు నింపుచున్
    మోగవలెన్ స్వనంబు మధుమోహన భావము పల్కినట్లుగా   
    త్రాగుము భక్తి భావముల తత్వపురీతిని దివ్యరీతిగన్   
    త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
    తాగవలెన్ మరంద సుధధారలు నిండిన తేనియల్ సదా 


    కస్తూరి శివశంకర్ 

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ఖగపతి తెచ్చిన అమృతము:

    భోగము లందునన్ మనసు బొత్తిగ జారగ శోకమందునన్
    రాగము నందునన్ హృదిని రచ్చను జేయు వియోగమందునన్
    రోగము రొచ్చులందునను లొంగక వంగక ధూమ్రపత్రమున్
    త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్

    రిప్లయితొలగించండి
  5. మల్లి సిరిపురం శ్రీశైలం,
    తే.గీ//
    దేవి కృపను బొందిన తాను తేజముగను
    తల్లిదండ్రులు దీవించ మెల్లిగాను !
    పాలు,పెరుగులను గలిపి ప్రాయమందు
    త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు !!

    రిప్లయితొలగించండి
  6. వాగుచుతాగుబోతులువివాదముసల్పుచు పాత్రికేయుకున్
    "త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి, ధార్మికోత్తముల్"
    వేగముగాకరోనయిలవృద్ధిఁగనంగనుమార్గమైనదే
    సాగుటఘోరమౌననివిశాలవిమర్శలు చేసెటీవిలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాఘపాదివారముదివ్యమైనదెపుడు
      నోర్మిసూర్యనమస్కారముత్తమగతిఁ
      దీర్చితదనంతరముభక్తిఁదీర్థమింత
      "త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు"

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. ( భాగవతం - బాగవుతాం )
    భోగములన్నిటిన్ విడచి
    పుణ్యుడు పోతన రామునాజ్ఞతో
    నాగని దీక్షబట్టి తడి
    యారని కన్నుల నాంధ్రజాతికిన్
    వేగమె యందజేసె గద
    ప్రీతిగ భాగవతామృతమ్మునే ;
    త్రాగెడివాడె శిష్టుడని
    త్రాగుచు జెప్పిరి ధార్మికోత్తముల్ .

    రిప్లయితొలగించండి
  8. పథ్యమందునచారుయెపైత్యరసము
    బలమునందించపిల్లలు పాలు పెరుగు
    తేజ మిచ్చెడినుదయముతేనెరసము,
    త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చారు+ఎ' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  9. రాగమయాత్ముడైన రఘురాముడు జంకక తండ్రి మాటకై
    త్యాగము చేసి రాజ్యము మహాటవులం జను ధర్మమూర్తి స
    ర్వాగమ కీర్తితుం డతని యద్భుత సచ్చరితామృతం బిలన్

    ద్రాగెడివాడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్.

    రిప్లయితొలగించండి
  10. వేదమంత్రోక్త సంభార విధిని దేవ
    సవన మొనరించి వేల్పులు సంతసింప
    సోమరస హవ్యమిడి తాను సుష్టు దాని
    త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు

    రిప్లయితొలగించండి
  11. త్రాగె రామరసంబు నా త్యాగరాజు
    నిలిపి హృదయాన శ్రీ రాము నిష్ఠతోడ
    పాప చింతన బాపంగ భక్తి సుధను
    త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు.

    రిప్లయితొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    భోగవిలాససంజనితమోహదవాగ్నికి తోయవృష్టియై
    రాగమదాంధకారఘనరాశికి మధ్యదినార్కరశ్మియై
    వే గతి మార్చు దివ్యనిధి విష్ణుకథామృతమండ్రు! దానినే
    త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్".!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  13. రామనామమెంతో రుచిరా కందాటవెలది


    అరయగ రాముని నామ
    మ్మె రుచి, వలయు మనకనుచు సుమీ జన్నపుగా
    పరి, త్రాగువాఁడె శిష్టుఁడ
    నిరి ధర్మవిదులు జిలేబి నీవున్ గొనుమా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. భోగభాగ్యాలు రాఘవున్స్వాగతించ
    రామనామానహనుమయేరోమరోమ
    మందుబలవిక్రమశ్రీలనందెసుధను
    త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు

    రిప్లయితొలగించండి
  15. ఇలపయిన నీదినంబుల నిల్లునడుపు
    టందున యొడుదుడుకులెదురైన గూడ
    నన్ని సమయములందున నొక్కరీతి
    త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు

    త్రాగు = మ్రింగు

    రిప్లయితొలగించండి


  16. కందోత్పల !


    సురుచిరము! రామనామమ
    డర త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁజె
    ప్పిరి ధార్మికోత్తముల్ రం
    డి రాఘవుని కొలువ త్వరపడి సుజనులారా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. భోగమనిత్యమంచురఘుభూవరునామసుధారసంబుచే
    భోగులుయోగులైరిభువిపోతనక్షేత్రయరామదాసులున్
    భాగవతాత్మసారరసభావమధూళినహర్నిహంబులన్
    ద్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్

    రిప్లయితొలగించండి
  18. రాగము తోడుతన్ సతము రాముని మానసమందు నమ్ముచున్
    యేగిరి స్వర్గమున్ ప్రభలు హెచ్చిల, సాధ్యమె మర్వనాతనిన్
    త్యాగయ మార్గమున్విడక త్రాగుము రామరసాయనంబునే
    త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నమ్ముచున్+ఏగిరి' అన్నపుడు యడాగమం రాదు. "నమ్మి తా మేగిరి..." అనండి.

      తొలగించండి
  19. పూజకు తగువాడు పూజింప బడవలె 
    వ్యర్థులకును పూజ వ్యర్ధమె యగుగాన 
    మనసులో మరువక మహిత రామామృతమ్  
    త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్యాపాదం తేటగీతి. మీరు ఆటవెలది వ్రాసారు. "రామామృతమ్' అని హలంతంగా వ్రాయరాదు.

      తొలగించండి
  20. భోగభాగ్యాలనే రోసి ముక్తి గోరి
    యనవరతమా పరాత్పరుఁ ధ్యానమందు
    మనసు నిల్పుచు రామనామామృతమును
    త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు

    రిప్లయితొలగించండి
  21. గురువు గారిచ్చుశంకరాభరణపద్య
    పూరణంబునుసొగసుగాపూర్తి జేయ
    "బాగు నున్నద"నుసుధనువారునొసగ,
    త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "బాగుగా నున్నదను సుధన్ వారొసంగ" అనండి.

      తొలగించండి
  22. సాగెను పద్యసేవ్యమదిఁజక్కనిసారపుభారతంబున
    న్వేగముఖచ్చితత్త్వమును,వీడనిధార్మికమూలముల్యన
    న్వాగనుశాసనున్గొలిచిభారతపద్యపుసారమద్యమున్
    ద్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కచ్చితత్వము' అనండి. 'మూలముల్+అనన్' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
    2. సాగెను పద్యసేవ్యమదిఁజక్కనిసారపుభారతంబున
      న్వేగముకచ్చితత్త్వమును,వీడనిధార్మికశక్తిరూపము
      న్వాగనుశాసనున్గొలిచిభారతపద్యపుసారమద్యమున్
      ద్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్
      కొరుప్రోలు రాధాకృష్ణారావు

      తొలగించండి

  23. నా పూరణ. ఉ.మా.
    **** **** **

    భోగము భాగ్యముల్ కనుచు మోహ మొకించుక గాని జెందకే

    త్యాగము జేసి సంతతము దైవపు చింతన సల్పి ధన్యులౌ


    యోగుల బోధనల్ విని మహోన్నత గీత సుధారసమ్మునే

    త్రాగెడివాడె శిష్టుడని త్రాగుచు జెప్పిరి ధార్మికోత్తముల్


    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  24. మంచి చెడుల నెరుంగక మాట లాడు
    త్రాగు వాడె : శిష్టు డనిరి ధర్మ విదులు
    సత్య నిష్టలు పాటించి సౌమ్యు డగుచు
    మంచి మర్యాద తెలిసిన మాన్య వరుని

    రిప్లయితొలగించండి
  25. పేదలకుసహాయ పడుచునాదరముగ
    వ్యసనములకు బానిసకాక, యనవరతము
    తల్లిదండ్రుల చూచుచు తద్దయు నలి
    ధరణి శ్రీరామనామామృతమును ప్రీతి
    త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు

    రిప్లయితొలగించండి

  26. బాగెము వృద్ధియైనపుడు బారులు తీరకు మా మద్యముకై

    వేగము సూర్యతాపమది ప్రేలుచు నుండెను జాగరూకుడై

    సాగుము,స్వచ్ఛమైనదగు చల్లని కొబ్బరి బోండ నీటినిన్

    త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "బారులు తీరకు మద్యమందగా" అందామా?

      తొలగించండి
  27. భోగపు వాడలన్ దిరుగు మూర్ఖుడటంచు ప్రసిద్ధుడైన యా
    భోగియె మారుచున్ సతము ముక్తిపథమ్మును గోరి మద్యమున్
    ద్రాగక నెల్లవేళలను తారక నామ సుధారసమ్మునే
    త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్

    రిప్లయితొలగించండి
  28. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వాసుదేవుని లీలల వన్నెలన్ని
    నెఱుక జేయుచు భక్తిని నెగడ జేసి
    తనరు భాగవతామృత ధారలెల్ల
    త్రాగువాడె శిష్టుడనిరి ధర్మవిదులు.

    రిప్లయితొలగించండి
  29. త్యాగము జేసె స్వామ్యమును తండ్రికి నిచ్చిన మాట కోసమై
    యాగము లెన్నియో సయిచె హాసము మోమును వీడలేదహో
    యీ గతినున్న రాఘవుని యింపితమైన కథా రసంబునన్
    త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్౹౹
    (ఆగము=తప్పు, దుష్కృతము)

    రిప్లయితొలగించండి
  30. భోగములందపేక్ష విడి బుద్దియు దేవునిపై నిమగ్నమై
    వేగమె మోక్షమొంద పరివేదననొందెడి సాధు జీవికిన్
    యోగరహస్యమున్ దెలియుమోయని రాముని నామ మాధురిన్
    త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్

    రిప్లయితొలగించండి
  31. మాతపితలు గోరును బిడ్డ మంచి బ్రగతి,
    సేమము;గురువు దెలుపును చేకొన పథ
    ము,గొని వారి యమృతబోధ,మోదమునను
    త్రాగువాడె శిష్టుడనిరి ధర్మవిదులు.

    రిప్లయితొలగించండి
  32. పరమదుష్టుడనంబడుభరణియందు
    త్రాగువాడె,శిష్టుడనిరిధర్మవిధులు
    స్వార్ధచింతనువిడనాడిపరులకొఱకు
    పాటుపడునట్టిమనుజునిపరమపురుష!

    రిప్లయితొలగించండి
  33. మిత్రులందఱకు నమస్సులు!

    "త్యాగయ రామనామ రసమానియు వెల్గుచు, రామమంత్ర స
    ద్రాగయుతంపుసత్కృతులు వ్రాయుచుఁ బాడుచుఁ బృథ్విలోన వై
    రాగిగ భక్తిఁ దేలెనయ! రామరసామృతమెప్డు భక్తితోఁ

    ద్రాగెడివాఁడె శిష్టుఁ!"డని, త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్!

    రిప్లయితొలగించండి
  34. త్యాగరాజు, గోపన్నలు తనివి తీర
    రామనామ పానామృత రసము త్రాగి
    ముక్తిపొందగా నిరువురు భక్తితోడ
    త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు

    రిప్లయితొలగించండి
  35. తే.గీ
    నిర్మలంబైనమనసుతో నిష్ఠగలిగి
    ఐహికంబైన విషయాలనాశలేక
    మంచి భక్తిభావమునింపు మధురసుధలు
    త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు"

    తే.గీ
    సత్య ధర్మవ్రతముతోడ సాధురసము
    సతత సద్భక్తిహరినామ శాంతిరసము
    రక్ష కలిగించు మధురమౌ రామరసము
    త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు

    రిప్లయితొలగించండి
  36. భోగములందు భావనలు పోవగ నీయక, జీవితమ్మునే
    త్యాగము చేయుచున్ పుడమి యాతన నొందెడు మానవాళికై
    రాగముతోడ సంతతము రామనినామసుధారసమ్మునే
    త్రాగెడువాడు శిష్టుడని త్రాగుచు చెప్పిరి ధార్మికోత్తముల్ అసనారె

    రిప్లయితొలగించండి
  37. తనకుగలదానిలోకొంతదానమొసగ
    కుండనంతయనుభవింపకూడదండ్రు
    దాహమొరులకుదీరిచితానుపిదప
    త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు

    రిప్లయితొలగించండి
  38. !త్రాగెడివాడెశిష్టుడనిత్రాగుచుచెప్పిరిధార్మికోత్తముల్
    ద్రాగెడివాడుశిష్టుడనిధార్మికవేత్తలుసెప్పిరా?మఱిన్
    ద్రాగుచుచెప్పిరేయనుటధర్మమె?చెప్పుడుపండితోత్తమా!
    త్రాగరుగాకద్రాగరిలధార్మికవర్యులుమద్యమెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మఱిన్' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి
  39. భోగములందు భావనలు పోవగ నీయక, జీవితమ్మునే
    త్యాగము చేయుచున్ పుడమి యాతన నొందెడు మానవాళికై
    రాగముతోడ సంతతము రామునినామసుధారసమ్మునే
    త్రాగెడువాడు శిష్టుడని త్రాగుచు చెప్పిరి ధార్మికోత్తముల్

    రిప్లయితొలగించండి
  40. తేటగీతి
    మ్రింగునది విషమె! విభుడె మ్రింగువాడు!!
    మేలని ప్రజకున్ శీఘ్రమె మ్రింగుమనియె
    నమ్మి మంగళ సూత్రమ్ము నగజ గౌరి
    త్రాగువాఁడె శిష్టుఁడనిరి ధర్మవిదులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అబ్బో... "మంగళసూత్రమ్ము నెంత మది నమ్మినదో..." పద్యభావాన్ని అచ్చంగ తేటగీతిలో దింపి మీ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. చాల బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  41. త్రాగకు మద్యమెన్నడును త్రాగిననాయువు తీరిపోవు నీ
    త్రాగుడువల్ల గుల్లయగు తథ్యము దేహమునిల్లు వాకిలుల్
    రోగములెల్లదూరమవ రోయక నిత్యము గోవు క్షీరమున్
    త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్

    రిప్లయితొలగించండి
  42. శ్రీపతి కథా వితాన వశీకృ తార్త
    చిత్తత నిరవధిక భక్తి సిక్త రక్తి
    హరి పదాంభోజ యుగ చింత నామృతమ్ము
    త్రాగువాఁడె శిష్టుఁ డనిరి ధర్మవిదులు


    ఆఁగక భక్తి యుక్తము మహాధ్వర సంచయ మొప్పు చుండఁగన్
    గోగణ దుగ్ధ మిశ్రితముఁ గూరిమిఁ గూర్చఁగ సంయమీంద్రులే
    జోగుల హోమ కార్యముల సోమరసమ్మును విప్రదత్తముం
    ద్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్

    [ఇక్కడ ధార్మికోత్తము లన వరుణాది దేవతలు]

    రిప్లయితొలగించండి

  43. ఉత్పలమాల
    మాగిన మామిడుల్ తరుల మానెడు తీయని జింటితేనెలన్
    దాగిన రామచంద్రుని సుధామయ నామముఁ దృప్తిఁ గ్రోలుచున్
    సాగుచు దక్షిణాన కపి సాధ్వి కుజంగనెఁ దత్సుధామృతన్
    త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్

    రిప్లయితొలగించండి
  44. ఉ:
    మాగిన పండ్లు దెచ్చియభిమానము మేరకు సారమంతయున్
    వేగమె దీసి దాని రుచి పెంపుకు యాలకు జాజి కాయలున్
    బాగుగ నందు జేర్చి కడుపారగ మావి ఫలారసమ్మునే
    త్రాగెడి వాడె శిష్ఠుడని త్రాగుచు జెప్పిరి ధార్మికోత్తముల్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఫలరసమ్ము' అనడం సాధువు. అక్కడ "కడుపారగ నామ్రఫలామృతమ్మునే" అందామా?

      తొలగించండి
    2. మీ అమూల్య సూచనకు ధన్యవాదాలు.

      తొలగించండి
  45. జాగృతి నొందుచుండి మనజాలక త్రాగిన కాలమందునన్
    వాగెద రెందరోజనులు వావిరిగా చెడుమాటలెన్నియో
    త్రాగిన మైకముండ ననురాగము మెండయి నివ్విధంబుగన్
    త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్

    రిప్లయితొలగించండి
  46. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పాగుగ వాసుదేవుని ప్రభావము లెంచెడి దివ్య లీలలన్
    కూబరమౌనటుల్ ననువు గొల్పెడి రీతిని బోధసేయుటల్
    బాగుగ నాకళించుకొని భాగవతామృత ధారలన్
    త్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "బాగుగ వాసుదేవుని"... టైపాటా?

      తొలగించండి
  47. ISKCON ఆధారంగా:
    ఉ:

    రాగము లీనుచున్ భజన రంగము సేయుచు కృష్ణ చైత్యులున్
    సాగిరి సాధు చింతనము శాంతిని గూర్చగ మానవాళికిన్
    త్యాగమె మూలమంచు బహు తాత్విక రీతులె పానకమ్ముగా
    త్రాగేడి వాడె శిష్టుడని త్రాగుచు జెప్పిరి ధార్మికోత్తముల్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  48. నమస్సులతో,

    నేటి రెండవ సమస్యాపూరణ యత్నం-

    యోగము! ఎన్ని బాధలబడి యోపి సహించుచు తానుసర్వమున్
    చాగము జేయుచుండుసు విశాలహృదాంతర వర్తి కార్తితో
    రాగిగ తల్లిసేవలె మురారి కథామృత మంచు గ్రోలుచున్
    త్రాగెడి వాడె శిష్టుడని త్రాగెడి వారలు జెప్పె ధార్మికుల్

    -🍁-

    రిప్లయితొలగించండి