21, మే 2020, గురువారం

సమస్య - 3375

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"యమ మహిషాగమనమున భయంపడఁ దగునా"
(లేదా...)
"యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్"

90 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    "పాపము శమించు..."

    కుములుచు కుందుచున్ విసిగి కొట్టుకు చావగ భాజపాయులే
    కమలము వాడిపోవగను కాంగ్రెసు వేడికి దేశమంటతన్
    సమయము రాగ రాహులుడు చక్కగ నేలగ భారతావనిన్
    యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్?

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    "కలికాలం మన గ్రహచారం"

    కుములుచు పుణ్యజీవులట కుందుచు నుండగ నాకమందునన్
    తిమిరము పారద్రోలుచును తియ్యగ భానుడు ప్రజ్వలించగన్
    విమలపు రౌరవమ్మునట విందులు జేయగ పాపులెల్లరున్
    యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. కట్టు కథ:

      నరకానికీ స్వర్గానికీ మధ్యను గోడ ఉండినది. స్వర్గములో ఏసీ ఉండుటందున చల్లగా హాయిగా ఉండినది. నరకములో మంటలు ఉండుటందున విపరీతమైన వేడిమి ఉండినది.

      అందువలన నరక వాసులు గోడలో పెద్ద రంధ్రమును తొలిచి దానిలోనుండి వచ్చిన చల్ల గాలిని ఆస్వాదిస్తుండేవారు. నరకపు మంటల వేడిమి రంధ్రము ద్వారా చొచ్చుకొని స్వర్గవాసులు భరింపజాలని వేడికి గురి అయ్యారు.

      అందువలన స్వర్గ వాసులు ఆ రంధ్రమును పూడిచేవారు...వెను వెంటనే నరక వాసులు మరలా రంధ్రము తొలిచేవారు.

      ఇక భరింపలేక స్వర్గ వాసులు నరక జీవులను భయపెట్ట దలచారు:

      "మీ మీద ఇక సుప్రీము కోర్టులో కేసు వేస్తాము జాగ్రత్త!"

      "ఓ! లక్షణముగా వేయండి. లాయరులందరు మా వేపే ఉన్నారు కదా! హిహ్హిహ్హిహ్హిహ్హీ!"

      తొలగించండి
    2. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
      లైయర్(లాయర్)లంతా నరకానికే పోతారన్నమాట!

      తొలగించండి
  3. అందరికీ నమస్సులు 🙏

    నా పూరణ ప్రయత్నం..

    *చం మా*

    గమనములేలనోయని దిగాలుగ కార్మికులూళ్ళు బోవగా
    సమమగు రీతినన్ నెవరు సాయముజేయగ రారులే యనిన్
    తమదగు శైలిలో వెడలు దారిని కాయుచు దూతలన్ గనన్
    *"యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కార్మికు లూళ్ళ కేగగా" అనండి. 'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙇

      సవరణతో

      గమనములేలనోయని దిగాలుగ కార్మికులూళ్ళ కేగగా
      సమమగు రీతినన్ నెవరు సాయముజేయగ రారులే యనిన్
      తమదగు శైలిలో వెడలు దారిని కాయుచు దూతలన్ గనన్
      *"యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్"*
      🙇

      తొలగించండి
  4. సమరమునన్ దునుమవలెన్
    ఉమ కాళిగ వాని రక్త మొప్పుచు గ్రోలన్
    సమయంబిదియే మరి యా
    యమ మహిషాగమనమున భయంపడఁ దగునా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...దునుమవలయు। నుమ..." అనండి.

      తొలగించండి
  5. (మహిషాసురుని దండయాత్రకు భయపడుతున్న యమధర్మరాజుతో దేవేంద్రుడు )
    సమయము జూచి జీవులను
    జచ్చిన మీదట వేగ నీదు సం
    యమనికి దెచ్చి వారలకు
    యాతనశిక్షల నెన్నొవైచుచున్
    గుములగజేయు దండధర !
    కూరిమి మిత్రవరేణ్య!నీవునున్
    యమ!మహిషాగమంబున భ
    యంబును బొందగనొప్పు నెవ్విధిన్ ?
    (సంయమని -యముని రాజధాని;యాతనశిక్షలు -కఠినశిక్షలు;కుములగజేయు -తపింపజేయు )

    రిప్లయితొలగించండి
  6. కం//
    సుమనసులప్రార్ధన విని
    సమరము జేయంగనెంచి సంతసపడుచున్ !
    సమయుజ్జీయగు కాళిక
    యమ మహిషాగమనమున భయంపడఁ దగునా !!

    రిప్లయితొలగించండి
  7. భ్రమయని యెరింగి జగతిని
    విమల మనంబున నిరతము విశ్వేశ్వరు దా
    నమకాదుల నర్చించిన
    యమ మహిషాగమనమున భయంపడ దగునా?

    అమలిన భక్తిభావమున నంబరకేశుని నమ్మికొల్వగా
    నిముసము నాలసింపకను నిశ్చలభక్తికి నీలకంఠుడే
    సముచితరీతి బాలకుని శాశ్వతవాసిగ నిశ్చయింప నా
    యమ మహిషాగమంబున భయంబును నొందగనొప్పు నెవ్విధిన్ ?

    రిప్లయితొలగించండి


  8. యమునా తీరమున నడక
    ను మొదలు కొని హాయి హాయనుకొనుచు బోవం
    గ మొగదల దారి లో ఓ
    యమ! మహిషాగమనమున భయంపడఁ దగునా!


    మార్నింగు వాక్ వేళాయె :)

    జిలేబి

    రిప్లయితొలగించండి


  9. కందా చంప్స్ :)



    జగడము చేయను వరలుకొ
    నగ యమ, మహిషాగమంబున భయంబును బొం
    దఁగ నొప్పు నెవ్విధిన్ ము
    ద్దుగుమ్మ, పదపద జిలేబి దువ్వాడు పతిన్



    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. సుమనసభక్తిగీతములసుందరవేదికతీర్చిదిద్ది,స
    క్రమముగనిత్యజీవనముకమ్రఫలమ్ములరాజసమ్మున
    న్నమకము,చంద్రశేఖరునినామపుగీతములాలపింపసం
    యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్"
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సంయమ' అన్నది సంబోధనమా? 'సంయమి' అన్న సంబోధన సాధువని కంజర్ల రామాచార్య గారు చెప్పారు. నేనూ ఆ సంబోధనతోనే ముందు పూరణ చేసి, వారి హెచ్చరికతో మార్చుకున్నాను.

      తొలగించండి
    2. సంయమ అంటే ఇక్కడ బంధనము పాశము
      లాలపింప పక్కన, ఎలాఉంటుంది?

      తొలగించండి


  11. అమరెను తాత రాతను భయానక దుర్భర జీవితమ్ము నీ
    సమరము తాళలేనిక ప్రశాంతత కావలె దీర్ఘనిద్రకై
    సమయము తక్కువాయె సఖి శ్వాసయు బోయెను‌ సన్నగాను నా
    యమ, మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. ద్వైపాయన సరస్సులో దాగిన సుయోధనునితో ధర్మరాజు భాషణ:

    అమితాభిమాన ధనివీ
    వు! మడుగులోదూరితివి! నవుకొనరె జనులు
    త్తమయోధుడు కౌరవమణి
    యమ మహిషాగమనమున భయంపడఁ దగునా!

    రిప్లయితొలగించండి
  13. తమతమ వాహనములపై
    యమరులు కదులుటను గాంచి యముడును వచ్చెన్
    హిమవంతుని సుత పెండ్లికి
    యమ మహిషాగమనమున భయంపడఁ దగునా

    రిప్లయితొలగించండి

  14. అమృతము గ్రోల దేవతల కాయువు గల్గును స్వర్గ లోకమున్

    క్షమన వసించు మర్త్యులకు చచ్చుట పుట్టుట తప్పకుండునే

    సమయము వచ్చినప్పుడును సమ్మతి ముఖ్యము భ్రాంతి వీడియే

    యమ మహిషాగమంబున భయంబును బొందగ నొప్పు నెవ్విధిన్?

    రిప్లయితొలగించండి
  15. తమక మదేలనోయి! బహు దర్పము జూపెద వేలనోయి నీ
    భ్రమలను వీడు మోనరుడ! బాహు బలంబును బుద్ధివైభవం
    బమరిన నేమి తప్పదిట నంతము గాంచుట లెంతవారికిన్
    యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్.

    రిప్లయితొలగించండి
  16. యము డల కింకరున్ బిలిచి యాయువు దీరినఁ వారిఁ దెమ్ము సం
    యమనికిఁ, గాని శ్రీహరిపదాబ్జనిరంతరభక్తిసక్తసం
    యమివరుఁ శ్రేష్ఠుఁ జేరకు, తదానయనాధ్వము వాని పుణ్యలో
    కము పరమై పునర్జననకారిణి కాదు, యటన్న నేలనో
    యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్?.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'సంయమివరుఁశ్రేష్ఠు..' ఇక్కడ అర్ధానుస్వారం టైపాటు.

      తొలగించండి
  17. మైలవరపు వారి పూరణ


    🙏చంద్రశేఖరమాశ్రయే మమ
    కిం కరిష్యతి వై యమః🙏💐🌹

    అమలినరత్నసానువు శరాసనమై, హరి బాణమై, భుజం..
    గము గుణమై రథాంగములుగాన్ రవిచంద్రులు., వేదముల్ తురం...
    గములన నొప్ప దివ్యరథకాంతి వెలుంగు బురారినెంచుచో
    యమమహిషాగమంబున భ
    యంబును బొందగనొప్పు నెవ్విధిన్ ?

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  18. అమలులు తప్పేచేయరు
    తమ పనులనుదేవదేవు తలచుచు చేయన్
    యమ, నియమపాలనంబున
    యమ మహిషాగమనమున భయంపడఁ దగునా.

    రిప్లయితొలగించండి
  19. మమకార మేమి లేక భ 
    యమొకింతయు లేక చేయు యవినీతికినై    
    కుములగ నేలా నేడిటు   
    యమ మహిషాగమనమున భయంపడఁ దగునా!   

    రిప్లయితొలగించండి
  20. యమ నియామానుసారిగ ననంతునిఁ గూర్చి తపంబుఁ జేయు ధ్యే
    యముఁ దలఁ దాల్చి యివ్విధి భయంకరమౌ వనిఁ జేరి స్వీయ కా
    యము గృశియింపగా పులులనైన గణింపని యోగి! నీకు న్యా
    యమ? మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్?

    రిప్లయితొలగించండి
  21. అందరికీ నమస్సులు 🙏

    *కం*

    అమరుల మైనను చెల్లును
    సమరమునకు సిద్ధమనెడి సైనిక వీరుల్
    తమ మరణము నెరుగగ నా
    *"యమ మహిషాగమనమున భయంపడఁ దగునా"*?

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏

    రిప్లయితొలగించండి
  22. సముచితపూజలు జేయగ
    సమరమునకుసిద్ధపడునుశంకరయమతోన్
    యమపాశంబునుజేగొని
    యమ మహిషాగమనమున భయంపడఁ దగునా

    రిప్లయితొలగించండి
  23. విమలము నైనదో? తనువు పేర్మి నిరంతర మందగించునే?
    క్రమముగ పాదముల్ మొదలుగా సిగ నొప్పెడు దాక భూషలన్
    ప్రముదముతోడఁ దీర్చిన విభాసిలునే? క్షణ నశ్వరీయకా
    యమ! మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  24. సమరము జేయుచుసైన్యము
    అమరముగా మిగిలిదేశకాపరులయ్యున్
    యమపాశమునేపాటిది?
    యమ మహిషాగమనమున భయంపడఁ దగునా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సైన్యం బమరముగా..' అనండి. రెండవ పాదంలో యతి తప్పినట్టున్నది.

      తొలగించండి
  25. తమరు సలుపునది వ్యవసా
    యమ ! మహిషాగమనమున భయంపడఁ దగునా !
    కమతమున సాయమిచ్చు జ
    త మహిష సంతానమేగద భయప డకుమా

    రిప్లయితొలగించండి
  26. సుమనోహర జీవిత మని

    భ్రమపడి యుండక మరణములే వదలదు మనలన్
    ప్రమదము న నెదు ర్కొ న వలె
    మహి షా గమనము న భయం పడ దగు నా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. "మరణమె" అనండి.

      తొలగించండి
  27. రెండవ పాదం లో లే టైపాటు అని తెలుపడ మైనది

    రిప్లయితొలగించండి
  28. గురువు గారికి నమస్సులు.
    సమభావములేకమనిషి
    తమవారినిపలువిధములదండింతురహో
    సమయవినయమేదర్మని
    యమ,మహిషాగమనంబునభయంపడదగునే

    రిప్లయితొలగించండి
  29. గమనపువేగమునను ఖా
    యముచేయుగెలుపును పందె మందున తా ప్రే మముతో కొనె నీపతి యో
    యమ మహిషాగమనమున భయంపడఁ దగునా

    రిప్లయితొలగించండి
  30. క్రమముగ తీరిన విధులను
    శ్రమతో కాయము బడల, నశక్తత తోడన్
    గమనము సాగగ, ముదిమిన
    "యమ మహిషాగమనమున భయంపడఁ దగునా"

    రిప్లయితొలగించండి
  31. గమనము జీవితమంత ని
    యమము గనక పాపములివి యని జూడక నుం
    డి,మరణ మాసన్న మవగ
    యమ మహిషాగమనమున భయంపడ దగునా?

    రిప్లయితొలగించండి
  32. యమనియమాదులు మటుమా
    యమొనర్చును గద మమతల నాశల నిహమున్
    యమివై పరమును గోరక
    యమ మహిషాగమనమున భయంపడఁ దగునా

    రిప్లయితొలగించండి
  33. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ప్రమథాధిపతిని నిచ్చలు
    సుమనస్కుడవై మృకండు సుతునిన్ వలెన్
    క్రమముగ యజించు నీవిటు
    యమ మహిషాగమనమున భయంపడఁదగునా?

    రిప్లయితొలగించండి
  34. అమరుల బృందమే కదిలె నద్రిజ పెండ్లిని గాంచనెంచుచున్
    దమతమ వాహనమ్ముల ముదమ్మున నెక్కి చనంగ గాంచి యా
    యముడును సాగగా దలచె నంబవివాహముఁ జూడగా వడిన్
    యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్.

    రిప్లయితొలగించండి
  35. యమ మహిషాగమనమున భయంపడఁ దగునా"
    యమ నియమమ్ముల తోడను
    సుమనస్కుండై చరింప సోకవు వ్యథలున్
    భ్రమలిక వీడుము మనుజా
    *యమ మహిషాగమనమున భయంపడఁ దగునా"*

    సుమశర హరుడౌ శంకరు
    సముఖమున వసించు వాని సామీప్యమునన్
    కొమరుండుండ మృకండుడు
    *యమ మహిషాగమనమున భయంపడఁ దగునా"*

    రిప్లయితొలగించండి
  36. కమలా!యన్నియుదెలిసియు
    యమమహిషాగమనమునభయంపడదగునా
    గమనముచివరకునదియే
    యమపాశమునడ్డగించహరుడొకడెసుమా

    రిప్లయితొలగించండి
  37. సముచిత రీతి విజృంభిం
    తము వాహనరాజ గాంచఁ దగ్గె నకట వే
    గము మార్కండేయుఁ గదియ
    యమమహిషా! గమనమున భయంపడఁ దగునా


    స మనుజ జంతు కోటికి నశక్యము గాంచఁగ దేవ కోటి నెం
    చ మహిని నెన్నడేని వికచన్నయ నాబ్జము లున్న నేరికిన్
    యమ మహిషమ్ముఁ గాంచ నుసు రక్కట నుండునె బొంది లోపలన్
    యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్

    రిప్లయితొలగించండి
  38. యమమహిషాగమంబునభయంబునుబొందగనొప్పునెవ్విధిన్
    సుమలత!యెందుకీభయముచూడుముపుట్టుటచావుకేగదా
    జమునినిదాటనేరికినిసాధ్యముగాదనినీవెఱుంగవే
    యమునిజయింపయోధుడికయాహరుడేగదచాలునిద్ధరన్

    రిప్లయితొలగించండి
  39. ప్రమదయె పాడిగేదెలను వాసిగ పెంచెధనమ్ము కోసమై
    శ్రమయని యెంచకుండ, కడు చాకిరి సేయుచు నుండు గోష్ఠమున్
    నిముషము వీడకుండ, ననునిత్యము గేదెలతో చరించు నా
    యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్.

    రిప్లయితొలగించండి
  40. చం:

    గమనము జూడ కారులను కట్టడిలేకయె సాగు వీధులన్
    సమముగ నన్య సాధనము సందుల బొందుగ బోవుచుండగన్
    భ్రమపడి పాదచారి నడి బాటన చింతన సేయ పూనికన్
    యమ మహిషాగ మంబున భయంబును బొందగ నొప్పు నెవ్విధిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  41. యమి తన నియమము యమమున
    తమకము వదలియు తపమున ధారణ జేయన్
    యమ కింకరులకు భటులకు
    యమ మహిషాగమనమున భయంపడ దగునా

    రిప్లయితొలగించండి
  42. సమరము జేయసిద్ధమని శత్రువులన్ దెగగోసెదన్ పరా
    క్రమమున నన్నుమించెడు శిఖామణులిచ్చ లేరటంచు దా
    ప్రమదల ముంగిటన్ బలుక ప్రల్లదముల్ బహునేర్పు నేడు న్యా
    యమ!మహిషాగమంబున భయంబును నొందగ నొప్పునెవ్విధిన్ ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిముసము తీరికన్ గనక నిత్యము విత్తము నాశ్రయించుచున్
      తమకముతో సతీసుతల దంభముమీరగ సాకువారికిన్
      యమ మహిషాగమంబున భయంబును నొందగనొప్పు; నెవ్విధిన్
      యమభటు లేగుదెంచెదరు యంబుజనాభుని గొల్చుదావునన్ ?

      తొలగించండి
  43. చంపకమాల
    సమయముఁ దీర సూర్యజుడు సాచగ పాశము సత్యవంతుకై
    విమల మనస్క పత్ని యట విజ్ఞత మీరఁగ నాపి పొందెనే
    కొమరుని గోరుచున్ బతిని, గూర్చెనె మామకు భూమి, సాధ్వికిన్
    యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్?

    రిప్లయితొలగించండి
  44. సుమవనమునవిహరించ కు
    సుమసుందరిరత్నమాల సోకుగనేగన్
    సుమ ద్రుమముకడకుజన నా
    యమ మహిషాగమనమున భయంపడఁ దగునా

    రిప్లయితొలగించండి
  45. కందం
    సమయస్ఫూర్తిగ కోరుచు
    సమవర్తినిఁ బడసె పతిని సావిత్రి సుతుం
    డమరన్ మామకు రాజ్యము
    యమ మహిషాగమనమున భయంపడఁ దగునా?

    రిప్లయితొలగించండి
  46. శమమగు జీవితమందున
    రమణీ, సుత, దేహ మోహరంబుల బడక, ని
    త్యము హరిఁ జపించు భక్తుడు
    యమ మహిషాగమనమున భయంపడఁ దగునా?

    రిప్లయితొలగించండి
  47. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  48. 21.5.20
    శ్రీ లక్ష్మీ నారసింహాయనమః
    నమస్సులతో ,శుభోదయం.

    నేటి సమస్యాపూరణ యత్నం-

    సమయగమన నిర్దేశుడు
    అమలిన నియమపు గతీశు డాయన జగమున్
    దమ సీమకభయ మివ్వగ
    యమ మహిషాగమనమునభయంపడ దగునా?

    నేటి రెండవ సమస్యాపూరణ యత్నం-

    విమల మహోన్నతైక సురవేద్యుడుదానవ వంశ సూర్యుడున్
    తపనమనోజ్ఞ చిత్తుడు సదైవకథామృతపాన సంరంభ
    గమన పథీయ భాసురుడు ఖర్వ పు దానవపుత్ర రత్నంబు
    యమ మహిషాగమంబున భయంబును బొందగ నొప్పు నెవ్విధిన్

    రిప్లయితొలగించండి