27, మే 2020, బుధవారం

సమస్య - 3381

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్"
(లేదా...)
"చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్"
(ఈ సమస్యను పంపిన వజ్జల రంగాచార్య గారికి ధన్యవాదాలు)

89 కామెంట్‌లు:

  1. నాడు చిరుత తనమందున
    చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్
    నేడు ముదితనము నందున
    వాడకుమన వాడినాడ వాడనిదానిన్

    రిప్లయితొలగించండి

  2. నడిరేయి సరదా పూరణ:

    మోడి ఉవాచ (నాతో రహస్యముగా):

    తోడుగ నెక్కి కాప్టరును దొంగల చూపున జాలమందునన్
    వేడుక మీర చూచి కడు వేదన లిచ్చిన గాలివాననున్...
    పోడిమి మీర పోవగను ముద్దుల కొల్కత; నా ముఖమ్మునున్
    చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్

    కాప్టరు = helicopter

    రిప్లయితొలగించండి


  3. బోడి జిలేబీ సొంపుల
    తోడు భళి నాట్యమాడె దూకుడు తాళం
    బేడున! రికార్డు డాన్సుల
    చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      రెండవ పాదంలో గణభంగం. "భళిర నాట్యమాడె" అంటే సరి!

      తొలగించండి
  4. 27.05.2020
    అందరికీ నమస్సులు 🙏

    నా పూరణ ..

    *కం||*

    వేడుక కాదుగ గ్రహణము
    చూడకు నువు తొందరపడి చూపులు బోవున్
    తేడా జేయును గదయని
    *"చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్"!!*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 27.05.2020
      అందరికీ నమస్సులు 🙏🙏

      *కం||*

      వేడుక కాదుగ బెండ్లన
      చూడకు నువు చూపులనుచు చుక్కలు నెదురౌ
      మోడౌ నీ జీవితమని
      *"చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్"!!*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      😊😀😊😀😊

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి.
      రెండింటిలోను 'నువు' అనడం సాధువు కాదు. "చూడవలదు" అనండి.

      తొలగించండి


  5. కందోత్పల

    కనులార్పక నాట్యపు పొల
    తిని చూడనిదానిఁ జూచితిని చూడకు మ
    న్నను దొంగచాటుగన్ కిసు
    కున నవ్వుచు చూచె నన్ను గువ్వల‌ చెన్నా


    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. చూడగ చూడగాను తన‌ సొంపులె కిక్కును చేర్చెనయ్య! పూ
    బోడి రికార్డు డాన్సులను పూతలపట్టున కన్నులార్పకన్
    చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్,
    వాడిగ నవ్వె జూచి నను పాటల కైపుల తో జిలేబియే


    సెన్సారు కత్తెర పడునా :)

    జిలేబి

    రిప్లయితొలగించండి


  7. వాడు సుమా లేడోయీ
    చూడకుమనఁ జూచినాఁడఁ ! జూడనిదానిన్
    లేడనుచు చెప్పు టేలా
    తోడు కలడతడు జిలేబి తొందర పడకే!


    నాస్తికత్వమేలా!నాస్తికత్వం మేలా ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కనపడని చెయ్యేదో నడుపుతుంది నాటకం.. ఆ నాటకంలో నువ్వు నేను కీలుబొమ్మలం.
      బాగుంది మీ పూరణ.

      తొలగించండి

  8. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వేడుక మీర మెచ్చగను పెండిలి యాడిన క్రొత్త రాత్రులన్,
    మాడిన మోముతో వధువు మండుచు తిట్టుచు మొట్టుచుండగా
    పోడిమి స్వప్నమందునను ముద్దుల మాధురి, జీవనమ్మునన్
    చూడనిదానిఁ, జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్

    మాధురి = మాధురి దీక్షిత్

    రిప్లయితొలగించండి
  9. క్రీడాస్పూర్తినిదెలుపగ
    గోడకుఁగన్నులనుమూసిగోప్యతనిలుపన్,
    వీడుచునియమమునచ్చట
    చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    వాడినపూల, వెండ్రుకల., వాడికటారిని., కల్లుముంత., వ్రే...
    లాడుచునున్న పుఱ్రె., దగులంబడు కట్టెల నిమ్మకాయలన్
    చూడగ భీతిగల్గెడిని., క్షుద్రమతార్చన ముందునెన్నడున్
    చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఇన్ని చూచారు ఆ తరువాత శాకిని‌ ఢాకిని‌ వచ్చే రా లేదా చూచారా లేదా :)

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ బీభత్సరస ప్రపూర్ణం. ప్రశస్తంగా ఉన్నది.

      తొలగించండి
  11. (1964లో విడుదలైన 'ఆత్మబలం' సినిమాలో నాగేశ్వర రావు, బి. సరోజాదేవి ల వానపాట ఆకాలానికి అశ్లీలం. ఆ సినిమా చూడవద్దని మా నాన్నగారి హెచ్చరిక)

    వేడుక 'ఆత్మబలం'లో
    పాడగ 'చిటపట చినుకులు పడుతూ ఉంటే'
    పాడైన వానపాటను
    చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చూడగ నశ్లీలమునై
    పోడిమి మార్చుచు చలించు పొలుపివ్వనిదౌ
    పాడిని గూడిన నృతినిన్
    చూడకుమన జూచినాడ జూడని దానిన్.

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. కీడవు గనులకు! సూటిగ
      చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్
      వేడుక సూర్యగ్రహణము!
      వాడి మసిఁ బులిమిన కాచ ఫలకపుటడ్డున్!

      తొలగించండి
  14. చూడకునటు! నిటురారా
    'పాడె'ను దీసికొని బోవుపలువురు నటుగా
    వేడుక గాదుర నదియును
    చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్

    రిప్లయితొలగించండి
  15. గోడకునావలవైపున
    మేడకలదుగంటినందు మినుకుమిటారిన్
    చూడవలదుపరకాంతల
    చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్

    రిప్లయితొలగించండి
  16. పాడగుదువుబాలక యని
    వేడిరి చూడకు డిటెక్టు వీడియొలనుచున్
    తోడెవ్వరు లేకున్నను
    చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్

    రిప్లయితొలగించండి


  17. పాడెని మోసుకు నల్గురు
    చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్
    చూడ తెలిసె జీవితమే
    క్రీడ! బతుకు నాల్గు మూర్ల కీవాడ సుమీ


    వేదాంతం

    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. వేడుక కద వలదన్నను 
    చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదాని
    న్వీడక నను బాధించెను 
    పాడగు ఈ గ్రహణ దోష బాధై నన్నున్ 

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'బాధ+ఐ' అన్నపుడు సంధి లేదు. "బాధయె" అనండి.

      తొలగించండి


  19. వారుణీ కత :)


    వాడచట తాగె పూటుగ!
    చూడకుమనఁ జూచినాఁడఁ! జూడ నిదానిం
    చాడను కొంటి జిలేబీ
    వాడో పడె బోర్ల! త్రోవ పాన్పుగ మారెన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. కోడెతనమ్ముఁగ్రొత్తచవిఁగోరగనామదిగాంచిపెద్దలా
    వాడియుఁగల్గుప్రేమయిలవద్దనిచెప్పిరిశుద్ధవాక్కులన్
    చేడియసౌకుమార్యమునచిత్తవశీకరణంబుగాగనే
    "చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్"

    రిప్లయితొలగించండి
  21. కేడీలా తిరుగునురా
    పాడలవాటులకు దాసి వనితయె యౌరా!
    ఆడుదటన్ పేరయతో
    చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్

    రిప్లయితొలగించండి
  22. మాడిన వంటలు తినమని
    వేడుకగా మొరపెట్టె నంట ప్రేయసి ముదమున్
    మాడిన బొగ్గులు గాడిని
    చూడకు మనఁ జూచినాఁడఁ జూడని దానిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా! ఆరోగ్యమెలా ఉంది?
      మీ పూరణ బాగున్నది.
      రెండవ పాదంలో గణభంగం. "వేడుక మొరపెట్టె" అనండి.

      తొలగించండి
  23. నీడకు జనిదుకూలము
    జేడియ మార్చుచు ననుగనె చేరువ యందున్
    వ్రీడనముతోడ నన్నున్
    జూడకు మనఁ జూచినాఁడఁ జూడని దానిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'నీడకు జనియు..' అనండి. లేకుంటే గణభంగం.

      తొలగించండి
  24. వేడుకనీకయె కృష్ణా
    చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్
    క్రీడల నాడుచుజలమున
    పాడగ,గోపికలవలువబట్టుకు బోయెన్

    రిప్లయితొలగించండి
  25. చేడియ కన్నుల లోనికిఁ
    జూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్
    లేడి కనుల నీవే నా
    వాడను భావము నొయారి వలపు తెలుపుచున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాడౌదు వాడువారిని
      *జూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్*
      మోడైపోయె బ్రతుకు పెం
      డ్లాడవలసి వచ్చి దాని నయ్యొ హతవిధీ!

      తొలగించండి
  26. వేడుక గూర్చక మనము ల
    పాడొన రించు నని తండ్రి పలుమరు దెలుప న్
    తోడుగ మిత్రుని తో జని
    చూడకు మన జూచి నాడ జూడని దానిన్

    రిప్లయితొలగించండి
  27. 'కూడదు కృష్ణా!మమ్ముల
    చూడకు'మన,'జూచినాడ జూడనిదానిన్,
    చూడనిది నేనిల గలదె,
    వీడుము సర్వము శరణము వేడు'మనె కృపన్.

    (గోపికా వస్త్రాపహరణ సందర్భ సంభాషణ)

    రిప్లయితొలగించండి
  28. కూడదు చవితిన చంద్రుని
    చూడుట యనునది తెలిసియు చోద్యము తోడన్ |

    వాడుక తలపక పెద్దలు
    చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్"

    రిప్లయితొలగించండి
  29. కోడెకుదూడబుట్టెననికొందరుఁబల్కిరసత్యవార్తలన్
    దూడకుగొమ్ములొచ్చెననిదుష్టులుబెంచిరినాటివార్తలన్
    వాడిగవేడివేడిగనుబాఱునసభ్యపురీతిమున్నెపుడున్
    చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్"
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  30. శ్రీ లక్ష్మీ నారసింహాయనమః
    మహోదయులకు నమస్సులతో,మేలి వేకువ.

    నేటి సమస్యాపూరణల యత్నం-

    నాడర్ధరాత్రి కేశము
    గూడిన యాబొమ్మపాతి గొంద రచటనే
    గూడగ నన్నావైపుకు
    జూడకు మన జూచినాడ జూడని దానిన్.

    వాడెపుడైన రామకథ వీనుల విందగు దేమికాదనున్
    తోడుగ గొందరాతనికి తొత్తుగ జర్ఛల జేతురట్టి యా
    కూడని వాదముల్ గనకు గూతుర టీవి య నన్ణ్చబూనినే
    చూడని దాని జూచితిని చూడకుమన్నను దొంగచాటుగన్.
    -🌻-

    రిప్లయితొలగించండి
  31. చేడియ వ్రాసి యుత్తరము చేర్చుము ప్రీతుని కంచు నన్ను తా
    వేడగ వల్లె యంచు కడు వేగముఁ జేరగ బోవు వేళ నా
    యాడది వ్రాసెనేమియని హౌసది కల్గగ లేఖ విప్పి నే
    చూడని దానిఁ జూచితిని చూడకు మన్నను దొంగ చాటుగన్.

    రిప్లయితొలగించండి
  32. కుంతీ దేవి మనో వేదన

    ఉ:

    ఈడగు వేళ భావనలు యేదెస నా మది ప్రజ్వరిల్లెనో ?
    కూడగ నేల భాస్కరుడు కోరిక దీర్చగ నప్రయత్నమున్
    వీడగ లేని దుస్థితిది వెన్నడి రాకయె మిన్నకుండునా !
    చూడని దాని జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  33. వాడనివన్నెచిన్నెలతొవావిరియైకనువిందుచేయునా
    చేడియయందచందములు చిత్తమునందు పరిభ్రమించగా
    కూడదటంచుమానసముకోర్కెకు కళ్ళెము వేయబూనినన్
    చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్

    రిప్లయితొలగించండి
  34. వేడుకఁ రాధిక జలకము
    లాడగఁగృష్ణుడుసరసపు లాలనజూపన్
    మోడునుచాటుగఁ జేకొని
    చూడకుమనజూచినాడుజూడనిదానిన్

    రిప్లయితొలగించండి
  35. నమస్తే! ఆర్యా! నేను ఇటీవలే పద్యాలు రాయడము నేర్చుకుంటున్నాను.అగ్రజుల వారి పర్యవేక్షణలో.(లాక్డౌను కాస్త తోడయింది. సమస్యా పూరణ నా ప్రయత్నము.
    వాడల ముద్దుగ తిరిగెడి
    వాడు మన యశోద పిల్ల వాడున్ కాంచెన్
    నేడు చవితి చంద్రుడినే
    చూడకుమన జూచినాడ జూడని దానిన్

    రిప్లయితొలగించండి
  36. వాడల వాడలఁ దిరుగుచు
    దూడల బలిగొను చిఱుతను దుఃఖము తోడన్
    నాఁడు జనులెల్లరు తలఁకు
    చూడకు మనఁ జూచినాఁడఁ జూడనిదానిన్

    [తలఁకుచు + ఊడకు = తలఁకు చూడకు; ఊడు = వదలు]


    చూడుఁడు చూడుఁ డన్న లనఁ జూచెడి వారలఁ జూడ శక్యమే
    చూడకు చూడ కన్న మఱి చూచెడి వారలు సూడ కొల్లలే
    చూడకు మన్నఁ జూచుటయుఁ జూడమి నిక్కము చూడు మన్నచోఁ
    జూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్

    రిప్లయితొలగించండి
  37. ఆడము అంతర్మధనం :

    కందం
    ఆడము నీవుకుఁ దోడై
    వీడుచు భగవంతునాఙ్ఞ వెర్రి పిశాచం
    బాడగ నాపిలుఁ గొని రుచిఁ
    జూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్

    ఈవు అంతర్మధనం :

    ఉత్పలమాల
    ఆడము జంటగా భువిని హాయిగ సంతస మందుచుంటి నే
    నాడును దైవ సూచనను నైతికమంచును దాటకుంటి, నే
    నోడితి నప్పిశాచపు కుయుక్తికి నాపిలి నోటితో రుచిన్
    జూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్

    రిప్లయితొలగించండి
  38. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  39. చూడనివాటినిజూసియు
    చూడకుమనజూచినాడజూడనిదానిన్
    చూడకుమనిననుజూచెను
    వీడెవడురబాబుచూసెవీడియొవోలెన్

    రిప్లయితొలగించండి
  40. చేడియ తానమా డగను చీరికి గైకొని చూడరాదనిన్
    బోడులు వస్త్రముల్ వదల పోకిరి లాగున నక్కిచూచుటన్
    పాడియు గాదు మానసము పాడగు, వద్దని పెద్దలన్న నే
    చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్.

    రిప్లయితొలగించండి
  41. చూడనిదానిజూచితినిచూడకుమన్ననుదొంగచాటుగన్
    చూడుముసోదరాయికనుచూడ్కులుసంతసమొందగాభళీ
    చూడగరానివైనవిటచూడగదగ్గవియన్నియున్వెసన్
    చూడగదొంగచాటుగనుచోద్యమునౌగదభీతిదేనికిన్

    రిప్లయితొలగించండి
  42. నాడయె సూర్యగ్రహణము
    వేడుకగా నుత్సుకతను భీతియె లేకే
    క్రీడించెడు నీడున నే
    చూడకుమన జూచినాడ జూడనిదానిన్

    వాడుక మీదటన్ మనసు బాసలనన్నిటి వ్రాసియుంచెడిన్
    తోడగు డైరిపుస్తకము దొర్కగ బీరువ లాకరందునన్
    గూఢపుచర్యలన్ వెదకి గుట్టునుదేల్చగ దొంగయింటిలో
    చూడనిదాని జూచితిని చూడకుమన్నను దొంగచాటునన్

    వేడుకగాదు చూచుటకు వెళ్ళుము దూరముగా నటంచునున్
    దోడుగబోవ గాన్పునకు దుఃఖమునందెడు సోదరీమణిన్
    వీడగబల్క వైద్యుడట ప్రేగునుదెంచుకు పుట్టుబిడ్డడిన్
    చూడనిదానిని జూచితిని చూడకుమన్నను దొంగచాటుగా




















    రిప్లయితొలగించండి
  43. కం//
    కీడును తనతోగొని మను
    వాడిన సఖి వెడలుట అనివార్యంబవగన్ !
    పాడైపోయిన గేహము
    చూడకుమనఁ, జూచినాఁడఁ జూడనిదానిన్ !!

    రిప్లయితొలగించండి
  44. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  45. గైడు వసించు చోటునకు క్రన్నన చేరితి సంశయమ్ముతో
    కూడదటంచు రక్షకుడు కోరిన వానిని లక్ష్యపెట్టకన్
    చేడియతోడనాతడట చేరి చరించుచు నుండ, భీతితో
    చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్
    మూడెను నకటంచుమది పొందితి త్రాసము నాక్షణమ్మునన్

    రిప్లయితొలగించండి
  46. ౧.

    చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్"

    పూరణ:

    వేడుచు మ్రొక్క,గణేశున్
    చూడకుమన చవితి చంద్రు చూడక నుండన్
    కూడితి మిత్రుని రాత్రిన
    చూడకుమనఁ జూచినాఁడఁ జూడనిదానిన్!!

    ౨.

    చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్"

    పూరణ:

    వేడుక దీరనాడిరట వేశ్యలు పబ్బుల లోనపాడుచున్
    చేడియ లందరుం గలిసి చేష్టలు దక్కగ, క్రీడ సల్పగన్
    తాడనమందుచున్ నొకచొ, త్రాగిన వారలె తూలుచుండగా
    చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్!!

    రిప్లయితొలగించండి
  47. నర్తనశాలలో భీమునిచేతిలో చావబోతూ

    నేఁడిదె గోచరంబయె వినిర్మల సుందర కాంచనాంగి యీ
    చేడియ ద్రౌపదేయనుచు చిత్తమునందునెఱింగినాఁడ యా
    నాఁడె గ్రహించగల్గినచొ నా దురవస్థ ఘటించకుండునే
    చూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్


    రిప్లయితొలగించండి
  48. పీడగ మారెగా నకట వేదన బెట్టు కరోన నేడిలన్
    వీడక బట్టు నేమరిన వీడకు మింటి నటంచు జెప్పుచున్
    చూడగ బోవనీరు దొలి చూలిని జూడకనుండ లేక మున్
    జూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్

    రిప్లయితొలగించండి