20, ఆగస్టు 2016, శనివారం

సమస్య - 2121 (దోమల్ గుట్టిన రాత్రి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"దోమల్  గుట్టిన రాత్రి జీవితము నిర్దోషంబు నారోగ్యమున్"
లేదా...
"దోమల్ గుట్టినను రేయి దోషరహితమే"

60 కామెంట్‌లు:

 1. చీమల్ బెట్టిన పుట్టలు
  భామల్ పరుగిడుతు వచ్చి భగ్నము జేయన్
  లేమల్ విసిరిన వలకట
  దోమల్ గుట్టినను రేయి దోష రహితమే

  రిప్లయితొలగించు
 2. భామల్ చెంతన జేరిమోద మలరింపంగా మదిన్ మైకమున్
  సీమల్ నిండిన భార తీయ వనితల్ సేమంబు గాగంధముల్
  క్రీముల్ వ్రాయగ నాగరీక మనుచున్ క్రేంకారమున్ జేయగన్
  దోమల్ గుట్టిన రాత్రి జీవితము నిర్దోషంబు నారోగ్యమున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగుంది. అభినందనలు.
   అలరింపంగన్.. అనండి. 'నాగరికము' సాధువు, 'నాగరీకం' అనరాదు.

   తొలగించు
  2. భామల్ చెంతన జేరిమోద మలరింపంగన్ మదిన్ మైకమున్
   సీమల్ నిండిన భార తీయ వనితల్ సేమంబు గాగంధముల్
   క్రీముల్ వ్రాయగ సోయగంబ నుచుతా క్రేంకారమున్ జేయగన్
   దోమల్ గుట్టిన రాత్రి జీవితము నిర్దోషంబు నారోగ్యమున్

   తొలగించు

 3. రేతిరి కలలో శ్రీ జ్యులరీస్ కనబడితేను :)

  ఓ మాదిరి నిదురైనను
  భామా మణులు కలయందు భారీ నగలన్
  తాము ధరించి కనబడిన
  దోమల్ గుట్టినను రేయి దోషరహితమే :)

  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగుంది. అభినందనలు.
   ఈ 'జిలేబీ' పురుషుడా? స్త్రీయా? అన్న సందేహం కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇలాంటి పద్యాలు మీరు స్త్రీయే అన్న విషయాన్ని రూఢి చేస్తున్నవి. :-)

   తొలగించు
 4. క్షేమం బన్నది సందియంబు గద దాక్షిణ్యంబు లేకుండగా
  దోమల్ గుట్టిన రాత్రి, జీవితము నిర్దోషంబు నారోగ్యమున్
  ధూమంబుం బ్రసరింప జేయుఫణితిం దోరంబు గానప్పుడున్
  భూమిన్ వానిని బారద్రోలుట సదా పొందంగ సౌఖ్యంబులన్.
  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 5. క్రొవ్విడి వేంకట రాజారావు గారి పూరణ....

  క్షేమమ్ము నిచ్చుచుండియు
  దోమల్ గుట్టిన చెడుపును దొలగించెడు మం
  దో మరి పూతల్ గలిగిన
  దోమల్ గుట్టినను రేయు దోషరహితమే.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 6. భామల్ సరసోక్తులచే
  ప్రేమల్ చూపుచు గడపగ ప్రీతిగ రాత్రిన్
  కాముని కనుసైగలలో
  దోమల్ గుట్టిననురేయి దోషరహితమే

  రిప్లయితొలగించు
 7. మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  భామాలింగన వర్షిత
  ప్రేమ సుధా రస ధారా వీథి చరింపన్
  చీమలునీగలు నల్లులు
  దోమల్ గుట్టినను రేయి దోషరహితమే !!


  లక్కయింటి సందర్భంలో శ్రీ కృష్ణుని హిత బోధ


  ఏమీ నిద్దుర ? కార్యశూరులకు నిద్రే రాదు , రారాదికన్ ,
  దోమల్ గుట్టిన రాత్రి జీవితము నిర్దోషంబు , నారోగ్యమున్ ,
  భీమా ! యింటికి నొక్క దారి యిది , యన్వేషించి సాధించు వే..
  రే మార్గమ్మని బోధజేసె హితుడై శ్రీకృష్ణుడాత్మీయుడై !!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మైలవరపు మురళీకృష్ణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణ రెండవ పాదంలో 'ధారా' అన్నచోట గణదోషం. సవరించండి. 'ప్రేమ సుధారసము చిలుకు వీథి చరింపన్' అంటే ఎలా ఉంటుంది?

   తొలగించు
  2. గణ దోషం గమనించలేదు.. మన్నించండి.. సూచన బాగుంది..మరో రకంగా.. సవరణ..

   భామాలింగన వర్షిత
   ప్రేమ సుధా రస మనోజ్ఞ వీథి చరింపన్
   చీమలునీగలు నల్లులు
   దోమల్ గుట్టినను రేయి దోషరహితమే !!

   తొలగించు
  3. మురళీకృష్ణ గారు మీరు వర్ణించిన పారవశ్య మోహావేశ స్థితిలో బాధారాహిత్యము కావచ్చును గాని దోష రహితము కాక పోవచ్చును!

   తొలగించు
  4. పోచిరాజు కామేశ్వరరావు గారికి నమస్సులు..
   రసధారలో మశక బాధారాహిత్యమే..యిక పారవశ్యమోహావేశం ప్రతిపద్యమునకు ఉంటుంది..
   మీ అభిమానానికి ధన్యవాదములు.. కాని అది గణ స్ఖాలిత్యమే..

   తొలగించు
  5. మురళీకృష్ణ గారు నమస్సులు. హాస్యర్థమై యన్నాను.అంతే. సమస్యా పూరణలలోయిలాంటివి సహజమే.

   తొలగించు
  6. పోచిరాజు కామేశ్వరరావు గారికి నమస్సులు..
   రసధారలో మశక బాధారాహిత్యమే..యిక పారవశ్యమోహావేశం ప్రతిపద్యమునకు ఉంటుంది..
   మీ అభిమానానికి ధన్యవాదములు.. కాని అది గణ స్ఖాలిత్యమే..

   తొలగించు
 8. ఆమము "డెంగీ" వచ్చును
  దోమల్ గుట్టినను, రేయి దోష రహితమే
  సేమము కనులకు వెన్నెల
  లున్ మరి రిక్కలను జూడ రోదసి లోనన్!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. శిష్ట్లా శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   చివరిపాదంలో 'లున్ మరి= లున్మరి' అయి ప్రాసదోషం. 'వెన్నెల। లే మరి రోదసి పథమున రిక్కల జూడన్' అందామా?

   తొలగించు
  2. ధన్యవాదములు బాగుందండి మీ సవరణ

   తొలగించు
  3. గురువుగారూ...వేరే విధంగా సవరించాను:

   ఆమము "డెంగీ" వచ్చును
   దోమల్ గుట్టినను, రేయి దోష రహితమే
   సేమము కనులకు రాత్రీ
   ధామంబున రిక్కలగన తాపము దీరున్!

   తొలగించు
  4. శర్మ గారూ,
   సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 9. ఏమని యంటిరి సామీ !
  దోమలు గుట్టినను రేయి దోష రహితమే ,
  యా మాటలు మీవేనా ?
  నేమో మఱి రాదు నిదుర యెప్పుడు నాకున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   'మీవేనా। యేమో మఱి...' అనండి.

   తొలగించు
 10. శ్రామికుడు నిదుర లేవడు
  దోమలు గుట్టినను రేయి, దోషరహితమే
  చీమల పుట్టలఁద్రవ్వుట
  పాముల బారిపడకుండ పాపలఁగావన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 11. రామా! నిద్రచెడున్ సుమా గృహమునన్ రావమ్ముతో నిత్యమున్
  దోమల్ గుట్టిన రాత్రి జీవితము, నిర్దోషంబు నారోగ్యమున్
  క్షేమంబున్ కలిగించు సుమ్మ సతమున్ గేహమ్ము, శౌచమ్ముతో
  భామారత్నతతుల్ చరించ రహితో, వాసమ్ము కాపాడుచున్

  రిప్లయితొలగించు
 12. సేమముగ నిదుర బట్టదు
  దోమల్ గుట్టినను రేయి, దోషరహితమే
  దోమలు రాలేని యినుప
  ఫ్రేముల నేర్పాటు జేయ వేశ్మము లందున్!!!

  వేశ్మము = ఇల్లు

  ఏమాయ జేయునోమరి
  ప్రేమించెడు చెలి సరసన ప్రియముగ నుండన్
  యేమయినను భాధించవు
  దోమల్ గుట్టిన నురేయి దోషరహితమే!!!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   '... నుండ| న్నేమయినను... ' అనండి.

   తొలగించు
 13. సామాన్యంబె తలంప సుప్తసుఖ విశ్రాంత్యాది సౌఖ్యంబులున్
  వామాక్షద్వయ నేనెరుంగుదును నిర్ద్వంద్వమ్ము ప్రావీణ్యులన్
  భామల్ కన్యలుమాభిధానులను తల్పశ్రేష్టముల్ రాగ మో
  దోమల్ గుట్టిన రాత్రి జీవితము నిర్దోషంబు నారోగ్యమున్

  [రాగమోద + ఉమల్ =రాగమోదోమల్ ; ప్రేమచేసంతోషితులైన ఉమా నామధేయులు]


  ఈమహిఁ బరికింపగఁ దరు
  ణీ మణులట రౌద్ర భద్ర నేత్రులు ఘనులే
  వేమరు నిద్ర చెరచు మగ
  దోమల్ గుట్టినను రేయి దోషరహితమే

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ఉమా నామధేయలైన కన్యలు 'కుట్టడం' ?

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఉమాభిదానులు (ప్రావీణ్యులు) దూది పరుపులు ( తల్పశ్రేష్టములు) కుట్టిన రాత్రిజీవితము నిర్దోషమని నా భావము.

   తొలగించు
  3. ఉమాభిధానులు.. రాగ మోద ఉమలై కుట్టినా బాధారాహిత్యమే.. మంచి విఱుపు పూరణకు మెఱుపునిచ్చింది.. అభినందనలండీ..

   తొలగించు
  4. ధన్యవాదములండి. ఇక్కడ యుమలు మంచి వారే పాపము కుట్టరు. పరుపులే కుట్టెదరు. ఆ పరుపులు మీద పడుకుంటే దోషము లేదు సుఖమే!

   తొలగించు
  5. ఉమాభిధానులు.. రాగ మోద ఉమలై కుట్టినా బాధారాహిత్యమే.. మంచి విఱుపు పూరణకు మెఱుపునిచ్చింది.. అభినందనలండీ..

   తొలగించు


 14. మామా వాకిట పండబో దగదు లే మా యూరిలో దోమ లౌ
  సేమంబౌ మరి లోన యన్న ననె తా చిర్నవ్వుతో నల్లుడా
  యేమా మాటలు రక్తపోటు నయమౌ నించక్కగా పాడుతూ
  దోమల్ గుట్టిన రాత్రి జీవితము నిర్దోషంబు నారోగ్యమున్"

  ( మా మామ గారు ఇలానే అనే వారు. ఆయన దోమల నివారణకు మందులు గాని, పంకాలు గానీ వాడే వారు కాదు. దోమలను చంపెయ్యడం వల్లనే ఈ రోజుల్లో జనాలకి రక్తపోటు ఎక్కువ అవుతోంది. అవి కుట్టి దాన్ని నియంత్రించేవి అనే వారు. ఆయన దోమలు కుడుతున్నా హాయిగా నిద్ర పోయేవారు.)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   ముందుగా మీ మామ గారికి వందనాలు.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 15. నీమముగా ప్రతి రోజును

  క్రీములు, నూనెల నలమి శరీరము నంతన్

  సేమముగా నుందుమెపుడు

  దోమల్ గుట్టినను రేయి దోషరహితమే.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పిన్నక నాగేశ్వరరావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   అన్నట్టు... మీ పుస్తకం 'కవితామంజూష' ఉత్తర భాగం 'సమస్యాపూరణలు' నాకెంతో ఉపయోగ పడుతున్నది. అందులోని కొన్ని సమస్యలను ఇప్పటికే బ్లాగులో ఇచ్చాను కూడా. ధన్యవాదాలు.

   తొలగించు
 16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో కొంత అన్వయలోపం ఉంది. ఏమాత్రం.. అని వ్యావహారికం ప్రయోగించారు.

   తొలగించు
 17. చీమల పుట్టల మధ్యన
  నేమాత్రమొ చోటు దొరుక నిద్రకు వశమై
  పామరుడనె తోలి సంధ్యను
  దోమల్ గుట్టినను రేయి దోషరహితమే

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 18. రిప్లయిలు
  1. ఏమంచున్ వివరింతునా వెతలు నీకీవేళ మిత్రోత్తమా!
   యేమాత్రంబును నిద్రలేక గుడిలో నేనెట్టులున్నానొ యా
   దోమల్ గుట్టిన రాత్రి ,జీవితము నిర్దోషంబు నారోగ్యమున్
   సామాన్యంబుగ నాశనంబునొనరించన్ కారణ ద్మోమలే.   ఏమంచున్ వివరింతునా వెతలు నీకీవేళ మిత్రోత్తమా!
   యేమాత్రంబును నిద్రలేక గుడిలో నేనెట్టులున్నానొ యా
   దోమల్ గుట్టిన రాత్రి ,జీవితము నిర్దోషంబు నారోగ్యమున్
   సామాన్యంబుగ నాశనంబునొనరించన్ కారణ ద్మోమలే.


   తొలగించు
  2. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కారణ ద్మోమలే'...?

   తొలగించు
 19. ప్రేమల్ బెంపుకు శోభనంబెగద?సంప్రీతిన్ ప్రసాదించగా
  దోమల్ గుట్టిన?”రాత్రి జీవితము నిర్దోషంబు”|నారోగ్యమున్
  క్షేమంబుంచు నిరోధకాబలము,నిక్షేపాలు మీకుండగా?
  సామాన్యుండిలలెక్క జేసినచొ?విశ్వంబెట్లువిస్తారమౌ? {ప్రేమనుపెంపు జేయుటకు నాందిసంప్రీతిప్రాసాదించుఆసమయానదోమలు కుట్టినా?నిర్దోషంబు.ఆరోగ్యమేవ్యాధి నిరోధకంఉన్నపుడు.దోమకరచినరోగాలుగలిగిన విశ్వమెట్లువిస్తార మౌతుంది.సవరించిన పూరణ.}
  2.ప్రేమే గుట్టగ మనసును
  దోమల్ గుట్టంగ మనిషి దొసగున బడుటే|
  సామాన్యుడి కలవాటే
  దోమల్ గుట్టినను రేయి దోష రహితమే|


  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణలు బాగున్నవి.
   పెంపునకు అనడం సాధువు. 'ప్రేమే కుట్టగ..' అనండి.

   తొలగించు
 20. కెంబాయితిమ్మాజిరావుగారిపూరణ
  ప్రేమల్బూచిన జంటకాపురములో రేగెన్ వివాదమ్ములున్
  భామల్ భర్తలు వేరు వేరు విధులన్ పాంతున్ ప్రవర్తిల్లుచో?
  సోముండున్ మదమందు దోమ లగుచున్ సొంపార గూర్చెన్ గదా|
  దోమల్ గుట్టిన రాత్రి జీవితము నిర్దోషంబు నారోగ్యమున్.

  రిప్లయితొలగించు
 21. ప్రేమోద్వేగము ప్రజ్వరిల్ల మనసే పెళ్లంటు గీపెట్టగన్
  భామారత్నముతో వివాహమున దాంపత్యాను రాగమ్మునన్
  శ్రీమంతమ్మున సంగమించ మదిలో శృంగార భావాదులన్
  దోమల్ గుట్టిన రాత్రి జీవితము నిర్దోషమ్ము నారోగ్యమున్

  రిప్లయితొలగించు
 22. మామూలౌ శివరాత్రి నాడు విధిగా మారేడు పత్రాలతో
  భామల్ జేయుచునుండ పూజలు,...మహార్భాటంబుగా పూరుషుల్
  జాముల్ జాములు పుణ్య మొందు మనుచున్ జాగార మందున్ శివా!
  దోమల్ గుట్టిన రాత్రి జీవితము నిర్దోషంబు నారోగ్యమున్

  రిప్లయితొలగించు