5, ఆగస్టు 2016, శుక్రవారం

పద్మావతీ శ్రీనివాసము - 20
పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
పంచమాశ్వాసము (41-60)

మురిపించు నా స్వామి పుష్కరణీ
టి రమా వినోద మండితు డసు రారి                                    40

పురుషోత్తము మురారిఁ బుండరీ కాక్షు
వరతన్వి పరవశత్వము జెందె గాంచి                                  41

వనజాక్షిఁ జూచి యప్పరమాత్ముడును
ఘన మోహ సందీప్త కాంతుడు నయ్యె                              42

మదగజయాన వామకరాభిలాషి
సుదతి స్వసఖిఁ బంపు సుందర నేత్రి                                43

నీదు సన్నిధికిని నీరజాక్షుండు
శ్రీదేవి సన్నిభ సేపట్టు దనయ                                        44

అఖిలాండ విభుజేరి యానందముగను
సుఖియించు నిత్యము సుందర వదన                             45             

చింత వలదు తల్లి చిన్నినా సుతున
కింత శుద్ధాన్నంబు నీయవే యన్న                                 46

ధరణి యన్నమొసంగి తగు గానుక లిడి
యరగె నంతఃపుర మానంద ముగను                               47

అంత నందన చెంత కారాణి యేగి       
కాంతావృతను బ్రీతిగ నడిగె నిట్లు                                     48

తల్లీ పలుకు భవ దంచిత కాంక్ష
తల్లడ పడనేల తల్లినిఁ గంటె                                           49

మాతను వీక్షించి మందస్వరమున
జాత రాగ దళిత చారునేత్రి యనె                                    50

ఆజాను బాహుండు నఖిలాండ విభుడు
తేజో మయుండు ధాత్రీ రక్ష కుండు                                51

భువన మోహనుడు సత్పురుష ప్రియుండు
నవలోకనప్రియు లబ్జ జాదులును                                52

భక్త సులభుడు సర్వవ్యాప కుండ
భక్తాలభుండు దేవతల దేవుండు                                  53

ఆర్త జన వర భక్తాభీష్ట దాత
వర్తిల్లె చిత్త మప్పరమాత్మ యందు                              54

శోధింపు డాతని సురరాజ వంద్యు
నాధీన మయ్యె నా హరియందు మనసు                       55

తనయ మాటలు విని తరలాక్షి భక్త
జన లక్షణములు విశద పరచు మన                           56

అతి గుప్తములు దల్లి యవి సావధాన
మతి విన్ము నుడివెద మాన్యుల ఘనత                       57

చెప్పఁ దొడగె సుత చెన్నుగ నంత
నప్పరమాత్ము భక్తాగ్ర గుణములు                              58

శంఖ చక్రములు భుజద్వయమునను
రింఖద్రజిత నిభరేఖాంకమనగ                                   59

పుండ్రము ధరియింత్రు మురియుచు నుదుట
దండ్రి హరి మది నిత్యమ్ము వేడంగ                           60

2 కామెంట్‌లు:

 1. సవరణలు:
  మదగజయాన వామకరాభిలాషి
  సుదతి స్వసఖిఁ బంపు సుందర నేత్ర 43

  మాతను వీక్షించి మందస్వరమున
  జాత రాగ దళిత చారునేత్ర యనె 50
  రిప్లయితొలగించు