9, ఆగస్టు 2016, మంగళవారం

సమస్య - 2110 (భారత యోధులన్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"భారత యోధులన్న రిపువాహినికిన్ దృణకల్పులే కదా"
లేదా...
"భరతయోధులు చీమలు పగతురకును"

50 వ్యాఖ్యలు:

 1. భీరుడవైతివో కృపుని భీష్ముని ద్రోణుని కర్ణ శల్యులన్
  పోరున మార్కొనంగ! సరిపోలుదురే మరి నీకునాజిలో
  వారలు? లెమ్ము పార్థ! యిక భండనమందునఁ జూపు తేజమున్
  భారత! యోధులన్న రిపువాహినికిన్ దృణకల్పులే కదా!!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిగురు సత్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 2. మీరుచునుందు రెల్లపుడు మేరలు కాశ్మిరమందు నిత్యముం
  గోరుచునుందు రాహవము కూర్మి యొకింతయు జూపరౌర! య
  వ్వారలు “పాకు సైనికులు” వారియభీష్టము లెంచి చూడగా
  భారత యోధులన్న రిపువాహినికిన్ దృణకల్పులే కదా.
  (హ.వేం.స.నా.మూర్తి)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఒకరు భాగ్యంబు దోచినా రొకరు మతము,
  ఒక్క రీనేల సంస్కృతి నిక్కువముగ
  ఔర! యీతీరు చూడంగ నవగతమగు
  భరతయోధులు చీమలు పగతురకును
  (హ.వేం.స.నా.మూర్తి)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 4. హారతినిచ్చి యుద్ధమునకంపిన చాలదు దేశ సేనలన్
  పోరున శత్రు సేనలను భూమిని కూల్చగ మంచి శస్త్రముల్
  వారికినివ్వకున్న నగుబాటుకు తోడుగ యుద్ధమందునన్
  భారత యోధులన్న రిపువాహినికిన్ దృణకల్పులే కదా"

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   మీ పూరణలో ఆయుధాల కొనుగోళ్ళ కుంభకోణం తొంగి చూచింది. పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 5. ఎవ్వ రాంగ్లమూకల దోలె నిచట నుండి?
  నేవి సంఘటితముగను జీవనమిడు?
  నెవరి మధ్యన వైరంబు భువి నెరుంగ?
  భరత యోధులు; చీమలు; పగతురకును!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శిశ్ట్లా శర్మ గారూ,
   క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...దోలి రిచటినుండి...' అనండి. 'ఇచటనుండి యేవి..' అని కూడ అనండి.

   తొలగించు
  2. సవరణతో:
   ఎవ్వ రాంగ్లమూకల దోలి రిచట నుండి?
   యేవి సంఘటితముగను జీవనమిడు?
   నెవరి మధ్యన వైరంబు భువి నెరుంగ?
   భరత యోధులు; చీమలు; పగతురకును!

   తొలగించు
  3. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
 6. శ్రీగురుభ్యోనమః

  కార్గిల్ యుద్ధములో ఓడిపోయిన పాకిస్తాన్ లో సైనికుల మనోభావము

  వైరి భయంకరుల్ యముని పాశము, చూడగ మృత్యుదేవతే
  భారత యోధులన్న రిపువాహినికిన్,దృణకల్పులే కదా
  వీరలటంచు పోరమని ప్రేరణ జేయుట న్యాయమౌనె మా
  చారుల మాట నమ్మితిమి చచ్చుట తథ్యము గెల్వజాలమే

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్రీపతి శాస్త్రి గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 7. ఘోరతరంపువిక్రముల గుండెలు వ్రీలును సింహరూపులౌ
  భారతయోధులన్న రిపువాహినికిన్, దృణకల్పులే కదా
  సారవిహీనతన్ పరమ సాధువులై రణరంగమందునన్
  దూరమునున్నసైనికులు దుర్మతులౌ యరివీర కోటికిన్.

  సింహ ముఖమును సైతము చీల్చువారు
  భరత యోధులు.చీమలు పగతురకును
  నన్య దేశాలవీరులాహవమునందు.
  శౌర్య మందున మనకిల సాటియెవరు?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 8. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. Dheeratha laarchaneila jagadeika sharadhruthi kaalavaalamai
  Boara najeya vikrama vibhhoothini gaancheda veinu saarathin
  Ghoaramu ! chintha veedumidhugoa yitu joodumu savyasaachi yoa
  Bhaaratha! yoadhulanna ripu vaahinikin 'thruna' ,'kalpu' lei kadhaa!

  Bharath yoadhulu cheemalu pagathu rakunu
  patti bandhinchu nenthati paamunaina
  Urakalesi ripulu poadhu ruriki yuriki
  'Balamu balagapu gamulaku baliye kaadhe?!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   ఈ ఇంగ్లీషు స్పెల్లింగులతో తెలుగు చదవడం ఇబ్బందిగా ఉంది. భావం అవగాహక కాలేదు. వీలైతే తెలుగులో టైప్ చేసి పంపండి.

   తొలగించు
  2. వారిపద్యములు తెలుగు లిపిలో
   ధీరత లార్చనేల జగదేక శరధ్రుతి కాలవాలమై
   బోర నజేయ విక్రమ విభూతిని గాంచెద వేను సారథిన్
   ఘోరము ! చింత వీడుమిదిగో యిటుఁ జూడుము సవ్యసాచి యో
   భారత! యోధులన్న రిపు వాహినికిన్ “దృణ” ,'కల్పూ లే కధా!

   భరత యోధులు చీమలు పగతు రకును
   పట్టి బంధించు నెంతటి పామునైన
   ఉరకలేసి రిపులు పోదు రురికి యురికి
   'బలము బలగపు గములకు బలియె కాదె?!

   తొలగించు
 10. భాారతయోధులన్నరిపువాాహినికిన్ దృృణకల్పులేకదాా
  యాార్యులునమ్మిరాాపలుకులయ్యవిభాారతవీరులెప్పుడున్
  పౌౌరుషవ0తులేభువినిభాారతమాాతనుగౌౌరవిoతురే
  నేరముగాాదె?యిట్లుడువనీరజ!చెప్పుమనీవయిప్పుడున్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   టైప్ చేయడంలో కొంత ఇబ్బంది పడుతున్నట్టున్నారు.

   తొలగించు
 11. భీరువు పల్కులేనతిగ భీకర మై వినిపించు నంతె, మా
  వీరుల సైనికోత్తముల వీక్షణ మే దడ పుట్టుగుండెలో
  భారత యోధులన్న రిపువాహినికిన్, దృణకల్పులే కదా
  క్రూరుల నేక శత్రువుల గూల్చగ సాహస మున్న వారికిన్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 12. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. యోధులుచీమలుపగతురకును
  భరతయోధులుచీమలుపగతురకును
  శత్రువులరయదోమలుభాారతీయు
  లకునువాారువీరగుదురులక్ష్మి!మరియు
  వీరువాారుగమాారుదురాార్య.భువిని

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 14. కవిమిత్రులకు నమస్కృతులు!
  నిన్న మా అక్కయ్య వాళ్ళ ఊరికి వెళ్ళడం, అక్కడ నెట్వర్క్ లేకపోవడంతో మీ పూరణలను చూడలేకపోయాను. ఈరోజు నిన్నటి పూరణలు సమీక్షించాను. చూడండి..
  ఉదయం నుండి అస్వస్థత. జ్వరం వచ్చే సూచనలు కనిపిస్తున్నవి. చూడాలి... రేపటి వరకు ఎలా ఉంటుందో?

  ప్రత్యుత్తరంతొలగించు
 15. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఇక్కడ మిశ్రమ సమాసమును వాడితిని.
  “అరి- హీన –అరణ-చయము” పన్ను లేని కట్నసముదాయమన్న భావనలో. అరణము తత్సమమనుకొని పొరబడ్డాను. సవరించిన పూరణను తిలకించ గోర్తాను.

  భూరి విశాలాశ్రమములు
  ధారాపాతాగతప్రదానములు ఘనో
  దార కరవిహీనాయము
  లూరక భోగములు గల్గు యోగులకు ధరన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కామేశ్వర రావు గారూ,
   సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 16. హారమునందు మార్కొనగ నగ్గలమౌను భయమ్ముచెచ్చెరన్
  భారతయోధులన్న రిపువాహినికిన్, దృణ కల్పులేకదా
  వైరి చమూసమూహములు భాద్యత తోమన సేన డీకొనన్
  భారము మోయు సేనలకు బాసట నిచ్చుట పౌర ధర్మమౌ
  హారముః యుద్ధము

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 17. వారి బలంబు ప్రస్ఫుటము భండన మందు నెదిర్చి పోరగన్
  భీరుకులన్ననొప్పునె యభేధ్యులు పోరున ధర్మ వర్తనుల్
  శూరవరుల్ క్షమాగుణ సుశోభితు లల్పు లనం దలంచగన్
  భారత యోధులన్న రిపువాహినికిన్ దృణకల్పులే కదా


  మాతృ రక్షణ మరువరు మదిని నెపుడు
  యుద్ధ మన్నను వెరవక సిద్ధ మండ్రు
  దుష్ట శత్రు సేనలు నుసి దోమలైన
  భరతయోధులు చీమలు పగతురకును

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 18. దేశరక్షణ కొరకని దీక్ష బూని
  నట్టి వారలు యెవ్వరీ యవనియందు
  ఐకమత్యమునకిట ప్రతీక లెవరు
  భరత జాతి యన్నంతనె భయమెవరికి
  భరతవీరులు,చీమలు పగతురకును.


  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 19. ధీరత జార్చనేల జగదేక శరధృతికాలవాలమై
  బోర నజేయ విక్రమవిభూతిని గాంచెదవేను సారథిన్
  ఘోరము చింత వీడుమిదుగోయిటు జూడుము సవ్యసాచి యో
  భారత. యోధులన్న రపు వాహినికిన్.తృణ.కల్పులేకదా.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
  2. శరధృతి - ఇక్కడ "దృ" వలన "ర" గురువుకాదు. అందువలన భగణభంగమయ్యింది. గమనించండి.

   తొలగించు
 20. ఐకమత్యముగ రిపుల నడ్డు కొనగ
  భరత యోధులు చీమలు! పగతురకు నె
  పుడు భయము కల్గు రీతుల పోరుచుంద్రు!
  దేశ భక్తులు వీరె! సందేహ మేల?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 21. భరతయోధులుచీమలుపగతురకును
  పట్టి బంధించు నెంతటి పామునైన
  ఉరకలేసి రిపులుపోదులురికి యురికి
  బలము.బలగపు గములకుబలియె కాదె.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సత్యనారాయణ గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 22. క్రమాలంకారము
  ధీరులుశత్రుమూకగని దీక్షగ బట్టియు జంపువారలే|? {భారత యోధులన్న}
  ప్రేరణ శక్తి యుక్తులచె భీతిని నింపి విరక్తి బంతురే? {రిపువాహినికిన్}
  శూరతకంటె శాంతి పరిశోధన జేయగ తెల్లవారనన్? {దృణకల్పులేగదా|}
  2.భరత యోధులు చీమల?పగతురకును
  వాటి సామర్థ్య మెంచక పోటిబడకు
  పామునైనను జంపెడి బలముగలవి|
  కత్తి కంటెను శక్తియౌ కలమువోలె|
  వీర వర్యులు గలభూమి విజయ ధనులు|

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 23. దేరక్షణ జేసెడి వీరులెవరు?
  భరతయోధులు, చీమలుపగతురకును
  ననెడి రీతిన కనిపించి యనవరతము
  దేశ మాతనుకాపాడెధీరులయ్య

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్రీనివాసాచార్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 24. బ్రిటిషు వారిని దరిమిన వీరులెవరు?
  పీలకములని వేనిని బిలుతురిలను?
  భరత వీరులన గలుగు భయమెవరికి
  భరతయోధులు, చీమలు, పగతురకును!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 25. దారిని దప్పి దేశమునఁ దప్పుడు రీతుల నాక్రమించి, వ్యా
  పారముఁ జేయవచ్చి తమ వ్యాప్తిని పెంచిన తెల్లవారలన్
  బోర నహింస శాంతులను పూన నిరాయుధులంచుఁ దల్పగన్
  భారత యోధులన్న రిపువాహినికిన్ దృణకల్పులే గదా!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శాంతియు నహింసలన్ దమ శస్త్రములని
   దేశ స్వాతంత్ర్య సమరాన దిగిన మనదు
   భరత యోధులు చీమలు పగతురకును
   వాటి పదునేమొ తెలియుచు వదలు వరకు

   తొలగించు