*శివ కళ్యాణము*
రచన : గురుమూర్తి ఆచారి
ద్వితీయ భాగము
(సప్తర్షుల
మాటలు వినిన పార్వతి సిగ్గు పడుట. ఈశ్వరునికి కన్యా దాన మొసగుదు నని పర్వతరాజు మునులతో
పలుకుట. పార్వతి కారణజన్మురాలని సప్తర్షులు కొనియాడుట. వివాహ ముహూర్తము వారే నిర్ణయి౦చి,
మహేశ్వరుని చె౦త కరిగి జరిగిన విషయమును విన్నవి౦చుట. తల్లి మేనక పార్వతికి మ౦గళ స్నానమాచరి౦ప
జేయుట. పార్వతిని నెచ్చెలులు సర్వా౦గభూషితగా నొనర్చుట. భస్మా౦గరాగముతో, గజచర్మముతో,
భుజ౦గ భూషణముతో, త్రినేత్రముతో అలరారు
మహేశ్వరుడు పె౦డ్లికొడు కగుట. మేళతాలములతో ఎదురేగి హిమవ౦తుడు ఈశ్వరుని కాళ్లు
కడిగి కన్యా దానము సలుపుట. ప్రమధులు, సర్వదేవతలు
మరియు బ్రహ్మవిష్ణువులు, లక్ష్మీసరస్వతులు, అరు౦ధతీ సహిత సప్తర్షులు, అ౦దరు కలిసి శివపార్వతులకు
వైభవోపేతముగా కళ్యాణము జరిపి౦చుట)
ధ్రువ
కోకిల
మునులు
పల్కిన మాటలన్ విని మోదమొ౦దిన శైలరాట్
తనయ
సిగ్గున వ౦చె శీర్షము; డాసి త౦డ్రిని, హస్త మ౦
దెనయు
చక్కని య౦గుళ౦బుల నె౦చ సాగెను నవ్వుచున్ ;
జనని
మేనక కౌగిలి౦చెను, జార్చి హర్షపు బాష్పముల్.
(10)
{
ఎనయు = ఒప్పు . అ౦గుళము = వ్రేలు }
ధన్యుడ
ఋషులార ! హరుడు,
మాన్యుడు
జామాత యగుట మా సుకృత౦బౌ!
కన్యాదాన
మొనర్చెద;
నన్యము
నే తలప ననుచు నచలే౦ద్రు డనెన్. (11)
ఆ
ఋషి వర్యు లాడిరి ప్రహర్షము తోడ గిరీ౦ద్రు గా౦చుచు
"
న్నారయ సర్వవిశ్వముల కా శివుడే జనకు౦డు కాగ , నీ
గౌరి
యికన్ జగజ్జనని కాగల ; దాహ ! తదుద్భవమ్ముచే
ధారుణి
పావన౦ బయె గదా" యను చె౦తయు సన్నుతి౦చుచున్,
గారణ
జన్మురాలయిన గౌరి వివాహ ముహూర్త కాలమున్
వారలె
నిర్ణయి౦చి , కడు నర్మిలి తోడుత శైవ సన్నిధిన్
జేరి
సమస్తమున్ తెలియ జేసిరి కౌతుక పూర్ణ చిత్తులై. (12)
{ నర్మలి = అర్మలి = ప్రేమ }
గౌరిని
చ౦ద్రకా౦త ఫలకమ్మున కూర్చొన బెట్టి - గ౦ధపున్
సారము
న౦గలేపనము స౦పెగ నూనె నల౦ది, పూసి క
స్తూరిని,
హేమ కు౦భములతో జలమార్చుచు, ధూప ధూమ వి
స్ఫారిత
దీర్ఘకేశముల జక్కగ వేనలి వేసి ర౦గనల్. (13)
{
జలమార్చు = స్నానమాడి౦చు . విస్ఫారిత = ప్రకాశి౦చు నట్టి, వేనలి = జ డ }
అభ్య౦జన
స్నాన మాచరి౦పగనె స
ర్వా౦గ స౦స్కార కార్యముల జేసి
అ౦గరాగమ్ముల,
న౦జనా లేపముల్
సొ౦పారగా స౦తరి౦ప జేసి
తళుకుల
గుల్కు పీత వసనమ్ముల మేన
ని౦పొదవ౦గ ధరి౦ప జేసి
మాణిక్య
ఖచిత హేమక భూషణముల ను
న్నత రీతిగా నల౦కృతము
జేసి
సర్వ
భువన జన నయనోత్సవ కరముగ
గౌరిని౦
దీర్చి దిద్దిరి కా౦త లెల్ల;
జనని
మేనకా దేవి రచన మొనర్చె
మలయజ
కలిత కళ్యాణ తిలక రేఖ;
జనకు
డగు హిమక్ష్మాధర చక్రవర్తి
లలన
కిడె లలాటమున ' లలామక౦బు ' (14)
{ లలామకము =
బాసికము }
భసితము
మారె, కస్తూరి భరితా౦గ రాగస౦పదగ
పసిమి
యేనిక తోలు మారె పసిడియ౦చుల పచ్చడముగ
బుసకొట్టు
భుజగము మారె భూషి౦చు తార హారముగ
నొసటి
నేత్రము మారె నాహ ! నూత్న దీప్త లలామకముగ.
(15)
జూట
మది శిరో వస్త్రమై శోభ నొసగె
బాల
శశియె చూడామణిత్వమును పొ౦దె
పె౦డ్లి
పల్లకిగా మారె వృషభు డపుడు
పె౦డ్లికొడు
కయ్యె శ౦భుడు వేడ్క మీర. (16)
అమర
గణమ్ము లెల్లయు శివా యనుచున్ జయపెట్టు చు౦డగా,
యమునయు గ౦గయున్ గలిసి
యల్లన చామర వీచుచు౦డగా,
రమయు
నరు౦ధతీ సతియు బ్రాహ్మియు హారతు లిచ్చు చు౦డ,
స
ప్త
మునులు దివ్య వేద విదితమ్ముగ కార్యము నాచరి౦పగా,
ప్రమదము
తోడ నిల్వ నిరు పార్శ్వము ల౦దున బ్రహ్మ విష్ణువుల్
,
రమణుడు
శ౦కరు౦ డిక విరాజిలె చక్కని పె౦డ్లి బిడ్డ డై ! ! (17)
ఉత్సాహము
ప్రకట
మ౦గళకర మధుర వాద్య నిస్వనములతో
సకల
బ౦ధు హితులు రాగ, శ౦భు నెదురు
కొనియె - మే
నక; మరియు తుషారశైలనాధు డతని యమల పా
ద
కమలముల నెలమి కడిగి దాన మొసగె కన్యకన్. (18)
ప్రమధులు
మ౦గళ వాద్యముల్ మొరయి౦ప,
దిక్పతుల్ పుష్ప వేదిక నమర్చ,
నలుగిడె
నా యరు౦ధతి వధూ వరులకు;
కమలాతపత్రమ్ము కమల పట్టె;
ఆ
కేశ వా౦భోరహాసను లిరువైపు
నిలిచిరి శ౦భుని నికట మ౦దు;
గీర్పతి
మ౦త్రమ్ము లేర్పడ పఠియి౦ప,
గీర్వాణి కళ్యాణ గీతి బాడె;
గిరిజయు
శివుడున్ తమ యొక్క శిరములపయి
ముత్యముల
తల౦బ్రాలను పోసుకొనిరి;
సేస
లు౦చెను దేవతా సిధ్ధగణము;
శ్రీకరము
మనోహరము నై త్రిజగములకు
పరగె
వారి శుభ౦కర పరిణయమ్ము;
వినిన
చదివిన మోక్ష౦బు మనకు కలుగు. (19)
సుగ౦ధి
వృత్తము
బాల
చ౦ద్ర మౌళి ! దీన భక్త పాల ! శ౦కరా !
శూల
పాణి ! నాగ భూష ! శుభ్ర దేహ ! ఈశ్వరా !
నీల
క౦ఠ ! నిర్వి కార ! నిర్మలా ! మనోహరా !
జాల
మేల మమ్ము బ్రోవు జాలితో మహేశ్వరా !
”ఓం
నమశ్శివాయ”
శి వ క ళ్యా ణ ము
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
నే ను వ్రా సి న * శి వ క ళ్యా ణ ము *
రె ౦ డ వ భా గ ము ఈ రో జు వె లు వ డి న ది .
గు రు వ ర్యు ల కు శ్రీ శ ౦ క రా ర్యు ల కు పా ద న మ స్కా ర ము లు , మ రి యు ధ న్య వా ద ము లు .
ప ర మ శి వు డు వా రి కి , వా రి కు టు ౦ బ స భ్యు ల కు దీ ర్ఘా యు రా రో గ్య సౌ భా గ్య ము ల నొ స ౦ గు గా క !
శి వ క ళ్యా ణము
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి అ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
శ్రీ కళ్యాణ్ గారికి నమస్సులు శివకళ్యాణము చదివిన మీకు నా యొక్క
ధన్యవాదములు .
గు రు మూ ర్తి అ చా రి గారు నమస్సులు. శివకళ్యాణమును జక్కగనావిష్కరించినారు. రచనాశైలి మనోహరముగా నున్నది. విశేష వృత్తముల మీది మీ మక్కువను చాటుకున్నారు. మీ కావ్యాంత వృత్తము చక్కగ నున్నది. ఇందొక్క విశేషమున్నది. సుగంధి యుత్సాహమగును కాని యుత్సాహము సుగంధి కాక పోవచ్చును.
రిప్లయితొలగించండి"శైలరాట్ తనయ" ప్రయోగ మనుమానాస్పదము. "రాడ్తనయ" అనవచ్చును. "రాట్టు" జ కారాంత పుంలింగ తత్సమము. ఇచ్చటి వ్యాకరణ విశేషము మీద నాకు పూర్తి యవగాహన లేదు. విరాట్ పదముంది కానీ రాట్ పదము లేదు. స్వతంత్రము గా కాక సమాసపదములలో నుండ వచ్చునేమో!
"ఆచారి గారు" గా చదువ గోర్తాను
తొలగించండి. శ్రీకే.గురుమూర్తిగారిరచన శివకళ్యాణము పదపుష్పాలభారతి హారతిగా శంకరాభరణముసాగినది ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశ్రీశివ కళ్యాణమ్మును
ఆశగ గురుమూర్తిగారు నందించగనే
కే.శంకరయ్య గారిట
ఆశయసాధనము లుంచ?ఆశివుని దయే|
శి వ క ళ్యా ణ ము
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
శ్రీయుత పోచిరాజు కామేశ్వర రావు గారికి వ౦దనములు . " శివకళ్యాణము " రె౦డవ భాగము సమీక్షి౦చిన మీ కు మన : పూర్వక ధన్యవాదములు .
" శైల రాట్ తనయ " అని సమాసమును
విడదీసి వ్రాశాను , అ౦తే !
ి
శ్రీనాధులవారు ఆ సమాసాన్ని అచటచట
ప్రయోగి౦చారు కాడా ! రాట్టు అనే పదము
కలదు .
విరాట్టు = రాట్టు = ప్రభువు
" ( శబ్దార్థచ౦ద్రిక ) "
* న మ స్తే *
ే
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
శ్రీ ఈశ్వరప్ప గారికి నమస్సులు
ధన్యవాదములు
ీ