24, ఆగస్టు 2016, బుధవారం

సమస్య - 2125 (నీరు చాలక దీపము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"నీరు చాలక దీపము లారిపోయె"
(ఆకాశవాణి వారి సమస్య)
"నీరము లేక దీపములు నిక్కముగాఁ గొడిగట్టెఁ జూడుమా"

104 కామెంట్‌లు:

 1. పంట పొలముల పైరులు వాడి పోయె
  నీరు చాలక; దీపము లారిపోయె
  గాలి వానకు, గూలెను సాలము లట
  నూరు వాడల చీకట్లు చేరె నపుడు!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. శిష్ట్లా శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   అట అన్నది కళ. కనుక 'సాలము లట। యూరువాడల...' అనండి.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “అట” ఆవల, అచ్చట యను యర్థములో దృతాంతముగ ఆంధ్రశబ్దరత్నాకరము, వావిళ్ల నిఘంటువు లలో కనపడు చున్నది.
   “అంత నట నక్కుమారుం,డెంతయుఁ గరుణమ్ము దోఁప నేడ్చుచునుండన్." నిర్వ.౨,ఆ. ౫౮. అని ఉదాహరణ కూడా యున్నది. పరిశీలించ గోర్తాను.

   తొలగించు
  3. కామేశ్వర రావు గారూ,
   మన మిత్రులు అర్థానుస్వారాలను ఉపయోగించకపోవడం వల్ల అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అఁట, అట రెండు రూపాలున్నవి. నేను 'సాలములు కూలిన వఁట (వృత్తాంతాన్ని తెలియజేయడం)' అన్న అర్థాన్ని గ్రహించాను. మీరు 'అట (అక్కడ అనే అర్థంలో ద్రుతాంతం) సాలములు కూలినవి' అన్న అర్థాన్ని గ్రహించారు.
   స్పందించినందుకు ధన్యవాదాలు!

   తొలగించు
  4. గురువు లిద్దరికీ నమస్సులు. మంచి సూచనలిచ్చారు. ధన్యవాదములు. నేను... అక్కడ..అనే యుద్దేశ్యములో వాడాను.


   తొలగించు
  5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.ధన్యవాదములు

   తొలగించు
 2. క్రొవ్విడి వెంకట రాజారావు

  పుష్కరాభిషేకములకు పుణ్యధార
  నంపి జలవిద్యుత్తు నిలుపు నాధనందు
  నీటి జాడ గుర్తించక నినుచు నుండ
  నీరు చాలక దీపములారిపోయె

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
   మంచి విషయాన్ని ఎంచుకున్నారు పూరణకు. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. '...నంపి జలవిద్యు దుత్పత్తి నాపినారు' అందామా?
   మూడవ పాదంలో 'నినుచు'...?

   తొలగించు
  2. శ్రీ శంకరయ్య గురువుగారికి నమస్కారములు. పొరబాటున ఒక అక్షరము ఎక్కువైనట్టుయింది. మీరన్నట్లు మార్చి మరల పద్యాన్ని ఇలా ఉంచుతున్నాను. ఎలాఉందో తెలియజేయగలరు. నినుచు= అతిశయించు
   పద్యం:
   నీటి జాడ గుర్తించక నెట్టుకొనుచు
   పుష్కరాభిషేకములకు పుణ్యధార
   నంపి జలవిద్యుదుత్పత్తి నాపినారు
   నీరు చాలక దీపములారిపోయె

   (నెట్టుకొనుచు= అతిశయిస్తూ)

   తొలగించు
  3. రాజారావు గారూ,
   సవరించిన మీ పూరణ అన్ని విధాల బాగున్నది. అభినందనలు.

   తొలగించు
  4. రాజారావు గారి పూరణ చాలా బాగుంది. అభినందనలు.

   తొలగించు
 3. బీడు వారెను గుండెల పేద రికము
  మ్రోడు వారిన ధ్రుమములు మూగ వోయె
  నీరు చాలక,దీపము లారి పోయె
  బ్రతుకు బండిని లాగించ మెతుకు లేక

  రిప్లయితొలగించు
 4. పైరు లెండెను క్షేత్రాల సౌరు లుడిగె
  నీరు చాలక, దీపము లారిపోయె
  తైలహీనము లయి శంకరాలయమున
  ధరణి నీజంట జీవనాధారము గద.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 5. నీరముగల్ప బేరము వినీతుడు గానుగ నూన్చి ధాన్యపున్
  సారమె దీసి ముద్దగొని చక్కని దివ్వెల బూన్చ జూచె పో
  నీరము నూనె గల్వవను నీతిని బెంచిన నేమి వచ్చె నా
  నీరము లేక దీపములు నిక్కముగా గొడగట్టె జూడుమా

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   భావంలో కొంత స్పష్టత లోపించినా పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 6. పంచ భూత ప్రపంచంబు బరగనందు
  నీరు వలె మారి శ్రేయస్సు నింప వలయు
  గర్వ కాఠిన్య జనతయే గనదు దీప్తి
  నీరు చాలక దీపములారిపోయె

  రిప్లయితొలగించు
 7. అమ్మ యన నచ్చతెలుగున యవ్వ సుమ్మి
  మిజ్జు కమలను జూచుక మిడిసి పడుచు
  వరుడు చేకొనె కాంత యవ్వవ్వ గాగ
  అమ్మకాతడు మగడయ్యె నక్కజముగ
  Ms,Kamala మిజ్ కమల.వివాహ స్థాయి తెలియదు.Mrs, శ్రీమతి మిసిజ్ ఈనాడు వాడడం నామోషీ.

  రిప్లయితొలగించు


 8. పంట లెండెను రైతన్న బతుకు చితికె
  నీరు చాలక, దీపము లారిపోయె
  జీవనము సరిలేకయు, చిద్ర మయ్యె
  బతుకు కన్నీరు మున్నీరు పసిమి బోవ

  జిలేబి

  రిప్లయితొలగించు
 9. మిరపపైరున బెట్టెగా మించి లక్ష
  రైతు కష్టించి పనిజేసె రాత్రి,పగలు
  ఎన్ని మందులగొట్టిన నేమి, యెండె
  నీరు చాలక, దీపము లారిపోయె.

  రిప్లయితొలగించు
 10. పంట పొలములు బూర్తిగా వాడి పోయె
  నీరు చాలక, దీపము లారి పోయె
  బట్ట బయటన వెలిగించ బ వన మునకు
  ముందు జాగ్రత్త యవసర మందఱకును

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పొలములు పూర్తిగా' అనండి. అక్కడ సరళాదేశానికి అవకాశం లేదు.

   తొలగించు
 11. నీటి విద్యుత్తు సాధించె పాటి గాను
  సాగు నీటిని యందించె చల్లగాను
  అవసరాలను తిర్చగా అడుగు బట్ట
  నీరు చాలక దీపము లారి పోయె
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నీటిని నందించె' అనండి.

   తొలగించు
 12. పంట లెండెను బోరున పడిన కొద్ది
  నీరు చాలక; దీపము లారిపోయె
  ప్రమిదలో గల తైలము వట్టి పోవ.
  భుక్తి లేమికి తొడయె భక్తి యనగ

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 13. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  శ్రీ గిరి జలాశయ౦బు తరిగెను | కనుక

  నీరు చాలక దీపము లారి పోయె |

  నన్ని య౦త్రముల్ పనిచేయ కాగి పోయె |

  నిలిచె విద్యు దుత్పాద | మ౦ధీ మయ మయె

  ధరణి , మానవ జీవన స్త౦భనమున |

  జలదమా ! నీవు కరుగుమా జాలితోడ |

  { ఉత్పాదము = ఉత్పాదనము = పుట్టుక ,ఉత్పత్తి . అ౦ధీమయము = అ౦ధకారమయము . }

  రిప్లయితొలగించు
 14. తారక రాము జేలు గన ధాన్యము బూర్తిగ డొల్లు వోయెనే
  నీరము లేక ,దీపములు నిక్కముగా గొడి గట్టె జూడుమా
  పూరగగుందె లో జమురు పోయక పోవుట చేతనే సుమా
  యూరక వెల్గుమన్న యవి యోపునె వెల్గగ బండితోత్తమా

  రిప్లయితొలగించు
 15. ముదిత లెల్లరు దీపావళి దినమునను
  సదమలాత్ములై యాటల సంద డించఁ
  దమకమున గాన రెవ్వరు తైల మయ్యె
  నీరు, చాలక దీపము లారిపోయె

  [నీరు = అల్పము]


  తోరపు సంతసమ్మునను దోయజ నేత్రులు సంభ్రమమ్ము లే
  పారగ నొక్క చోట సుమవాటిక నుంచిరి దివ్వె లింపుగన్
  వారిజనేత్ర కన్గొనుము బారులు తీరిన ,నూనె జూడగా
  నీరము లేక, దీపములు నిక్కముగాఁ గొడిగట్టెఁ జూడుమా

  [చూడగాన్ +ఈరము = చూడగానీరము; ఈరము = దట్టముగ]

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   అర్థ వైవిద్యంతో, అనన్యసాధ్యమైన విరుపుతో మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.ధన్యవాదములు

   తొలగించు
 16. పచ్చచీరను గట్టిన పడతి వోలె
  నుండు క్షేత్రాలు జూడగ నెండిపోయె
  నీరు చాలక, దీపము లారిపోయె
  జీవనమ్మును సాగించు చేవలేక!!!

  రిప్లయితొలగించు
 17. నీరము ,వెల్గు, గాలి,భువి,నింగియు నెంచగ పంచభూతముల్
  నీరమునందు నిప్పుయును నిప్పును రేపగ గాలి,గాలిలో
  తీరుగనుండు ప్రాణమను దీపము వెల్గును తోయముండగన్
  నీరము లేక, దీపములు నిక్కముగాఁ గొడిగట్టెఁ జూడుమా

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. గురువుగారూ నమస్సులు. అద్భుతమైన పూరణ. అభినందనలు.

   తొలగించు
  2. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నిప్పును' అనడం సాధువు, 'నిప్పుయును' అనరాదు. అక్కడ 'నిప్పు మఱి నిప్పును...' అందామా?

   తొలగించు
  3. గురుదేవులకు నమస్సులు ,మీసూచన మేరకు సవరించిన పద్యము
   నీరము ,వెల్గు, గాలి,భువి,నింగియు నెంచగ పంచభూతముల్
   నీరమునందు నిప్పుమరి నిప్పును రేపగ గాలి,గాలిలో
   తీరుగనుండు ప్రాణమను దీపము వెల్గును తోయముండగన్
   నీరము లేక, దీపములు నిక్కముగాఁ గొడిగట్టెఁ జూడుమా

   తొలగించు
 18. పంటపొలములు నెల్లను వాడిపోయె
  నీరు చాలక దీపము లారిపోయె
  విద్యుదుత్పత్తి యును తగ్గె విశ్వ మందు
  కాలమహిమ యటంచును గాంచ వలయు

  రిప్లయితొలగించు

 19. దంతముల గోరి చంపుచు దారుణముగ
  వారముల వనులందున జేరి బ్రదుక
  నీరు చాలకదీపము లారిపోయె
  విపిన గృహముల నక్కట వేనవేలు.

  వారము=ఏనుగు. చాలకదీపములు=ఏనుగు లనే దీపములు. విపినగృహములు=అడవు లనే ఇళ్లు.

  రిప్లయితొలగించు
 20. పంటలన్నియు రయమున వడలిపోయె
  నీరుచాలక, దీపములారిపోయె
  పల్లెలందున రైతులు వలసపోవ
  కూలిదొరకునటంచును కొంపవిడచి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 21. ఏమి చదువులు చదివిరో యెవరి కెరుక
  వృత్తి నైపుణ్య మేలేక విలవిల మని
  వలయ మందుండెడు సమస్య తెలియు ఇంజ
  నీరు చాలక దీపము లారిపోయె!

  రిప్లయితొలగించు
 22. శ్రీగురుభ్యోనమః

  (నీరు కూడా వ్యాపార వస్తువుగా మారిన నేటి కాలములో)

  సారము లేని సస్యములు సాంద్రత లేని పాలు పౌష్ఠికా
  హారము లందకన్ మిగుల యాతన నొందెడు పేద దివ్వెలన్
  ఛోరులవోలె దోచుకొన చోద్యము చూచుచు నుండ త్రాగగా
  నీరము లేక దీపములు నిక్కముగాఁ గొడిగట్టెఁ జూడుమా

  రిప్లయితొలగించు
 23. పైరులున్నెండు స్థితి లోకి వచ్చెనయ్యొ

  నీరు చాలక; దీపము లారి పోయె

  నాపి వేయగ విద్యుత్తు నయ్యధిపతు

  లు సరి చేయగా వచ్చిన లోపములను.

  (నిన్నటి సమస్యకు పూరణము పంపించ వీలుపడక
  ఈ రోజు పంపుచుంటిని. స్వీకరించి పరిశీలించవలసినది
  గా ప్రార్ధన )

  పుణ్యము లభించు నందురు

  కన్యాదానమ్ము సేయ; గలుగు నరకమ్ము

  కన్యాశుల్కము జేకొని

  కన్ను వృద్ధులకు నంటగట్టిన బలిమిన్.

  రిప్లయితొలగించు
 24. (సవరించిన చివరి పాదం )

  కన్యను వృద్ధులకు నంటగట్టిన బలిమిన్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 25. (సవరించిన చివరి పాదం )

  కన్యను వృద్ధులకు నంటగట్టిన బలిమిన్.

  రిప్లయితొలగించు
 26. వారిద పంక్తి లేకను నభమ్మున వైభవ మారె వర్షపుం
  ధారలు లేక నెఱ్ఱెలయి ధాత్రియు శోభలు మాసె నేలలో
  నీరు లభింపకన్ కృషియు నీఱయి కాడయె పల్లె జీవమౌ
  నీరము లేక దీపములు నిక్కముగాఁ గొడిగట్టెఁ జూడుమా.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
  2. భారముహెచ్చెరైతులకు, పల్లెల భావులు వట్టిబోవగా
   నీరములేక, దీపములు నిక్కముగాఁగొడిగట్టెఁజూడు, మా
   హారములేక పల్లెలను, హాలికులేగుచు నుండ పట్టణమ్ముకున్
   వారల కష్టముల్ తొలగి పచ్చని పైరుల కాంచు టెన్నడో?

   తొలగించు
  3. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. 'హాలికు లేగగ పట్టణమ్ములన్' అందామా?

   తొలగించు
 27. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  నీరము లేకయు౦డిన జని౦పదు విద్యు

  ………………… దఖ౦డ శక్తి | యా

  నీరము లేక య౦త్రములు నిల్చె |

  ……………… నికట్టులనే గృహాల లో

  నీరము లేక దీపములు నిక్కముగా

  ………………… గొడిగట్టె జూడుమా |

  నీరము లేక సశ్యములు నీరస మొ౦దె ,

  ……………… తపి౦ప సైరికుల్ |

  నీరదమా ! కృప౦ గనుమ , నీవు

  ………………… ద్రవీభవ మ౦ది కావుమా !

  రిప్లయితొలగించు
 28. మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  భారమునయ్యె జీవనము , భద్రతయే కరువయ్యె పంటకున్
  నీరము లేక , దీపములు నిక్కముగా కొడిగట్టె జూడు , మా
  కోరికలారినట్లు , బ్రతుకుల్ తెలవారిన యట్లు ,దేవుడా !!
  నేరమదేమి జేసితిమి ? నేలను నమ్మితిమయ్య
  గావవే !!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. నీరము నుండి యామ్లజనినే విడదీసి ప్రయోగశాలలో
   నేరుపు మీఱ దీపములనే వెలిగింపగ వచ్చు , నీటిలో
   క్షారము గూడియున్న జలసాంద్రత హెచ్చును ,
   శుభ్రమైనదౌ
   నీరము లేక దీపములు నిక్కముగా కొడిగట్టె జూడుమా !!

   తొలగించు
  2. మురళీకృష్ణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 29. కోరిన కోర్కె దీర్చగల కూరిమి రైతుకు నీరెగాన| నా
  ధారితవర్ష ధారలిల తగ్గుట చేత?కరెంటు కోతలే
  నీరములేక|”దీపములు నిక్కముగాగొడి గట్టె|జుడుమా
  ఆరక ముందె నూనె నిడు అందినవత్తులు ముందుజేర్చుమా”.
  2.దేహమంతట నీరె సందేహ మేల?
  గుండె కండగ నిండుగ మెండుగుండు
  రక్తమందున గలసి విరక్తిలేక
  అన్నపానియమే గద నాయువనగ
  కరువు కాటక మందున కల్మషాల
  నీరు|చాలక దీపములారిపోయె {దీపములారుట=చనిపోవుట}  రిప్లయితొలగించు
 30. వానలు కురియక నదులు వాగులింకి
  పోవ విద్యుత్తు కొరవడె! కావ లేని
  కొరతలు కృషీవలుని తాకి కూల్చి వైచె!
  నీరు చాలక దీపము లారి పోయె!
  ('కొరతలు ' అనే దాన్ని విద్యుత్ కోతలు అనే అర్ధంలొ వ్రాశాను.)

  చిన్న మార్పుతో మరొక పద్యం

  వానలు కురియక నదులు వాగులింకి
  పోవ విద్యుత్తు కొరవడె! కావ లేని
  కొరతలు పరిశ్రమల తాకి కుంటు బరచె!
  నీరు చాలక దీపము లారి పోయె!

  రిప్లయితొలగించు
 31. నీరములేకదీపములునిక్కముగాగొడిగట్టెజూడుమా
  సారములేనిమాటలనుసత్కవిశ్రేష్ఠులుబల్కరెప్పుడున్
  వారలవాక్కులేభువినిబార్ధునిమాటగగౌరవించుచున్
  వారినినూనెగామదినిభావనజేయుటయొప్పుగానగున్

  రిప్లయితొలగించు
 32. రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   దారుణమైన... ధారణమైన.. అయినట్టుంది.

   తొలగించు
  2. ధారుణమైన దుస్థితియె దాపురమాయె పొలంబు లెండె నే
   నీరములేక, దీపముల్ నిక్కముగా కొడిగట్టె జూడుమా
   తీరని యప్పు బాధలను తీరని యాకలి
   దీర్చ నెంచి మా
   వారలు రైతు సోదరులు బారులు గట్టిరి
   గల్ఫు నాడుకున్

   తొలగించు
  3. ధారుణమైన దుస్థితియె దాపురమాయె పొలంబు లెండె నే
   నీరములేక, దీపముల్ నిక్కముగా కొడిగట్టె జూడుమా
   తీరని యప్పు బాధలను తీరని యాకలి
   దీర్చ నెంచి మా
   వారలు రైతు సోదరులు బారులు గట్టిరి
   గల్ఫు నాడుకున్

   తొలగించు
  4. ధారుణమైన దుస్థితియె దాపురమాయె పొలంబు లెండె నే
   నీరములేక, దీపముల్ నిక్కముగా కొడిగట్టె జూడుమా
   తీరని యప్పు బాధలను తీరని యాకలి
   దీర్చ నెంచి మా
   వారలు రైతు సోదరులు బారులు గట్టిరి
   గల్ఫు నాడుకున్

   తొలగించు
 33. కలియుగాన నీటితొ వెల్గు కాల జ్ఞాన
  మునను కలికాల మహిమగ ముందుగాను
  ముందు జూపుతో చెప్పెగా మనకు గాన
  నీటి ప్రాజెక్టు లందున నీరు లేక
  పోయిన జల విద్యుత్పుట్టబోదు గాన
  నీరు చాలక దీపము లారిపోయె

  రిప్లయితొలగించు
 34. రామకృష్ణ గారూ,
  మీ పూరణ బాగున్నది.
  'నీటితొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. కాలజ్ఞాన.. అన్నపుడు ల గురువై గణదోషం.

  రిప్లయితొలగించు
 35. నీరము తోడ నే వెలుగునీ కలికాలమునందు దీపముల్
  నీరము నమ్ముకొందురని నీకలి కాలమునందుగాన నీ
  నీరును నిల్వ జేయకను నీరును వ్యర్ధమొ నర్చినా మరిన్
  నీరము లేక దీపములు నిక్కముగాఁ గొడిగట్టెఁ జూడుమా

  రిప్లయితొలగించు
 36. "నిలుచు ప్రాణదీపము గాలి జలము వలన
  వాటి కాలుష్యమే మన ప్రాణహాని"
  యని ప్రయోగమందు నొకడు కనగ దెలిపె
  నీరు చాలక దీపములారి పోయె!


  దయచేసి పూర్వపు సమస్యాపూరణ చూడ మనవి:

  శూన్యమ్మయ్యెను ధర్మరక్షణ కనన్,చోరత్వమే హెచ్చె,సా
  మాన్యమ్మై రిల దొంగపెళ్ళికొమరుల్,మాయమ్మయెన్ మంచి,సౌ
  జన్యమ్మెక్కడ జాడలేని స్థితిలో జామాత వంచించినన్
  కన్యాదాన మొనర్చినన్ నరకమే కల్గున్ గదా దాతకున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మడిపెల్లి రాజకుమార్ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 37. తాన్ సేన్ మేఘ్ రాగము పాడి నీరు లేకనే తాను ముందు వెలిగించిన దీపమును అర్పి వేసె అనే అర్థములో వ్రాసాను, తప్పులుంటే పెద్దలు మన్నించగలరు.

  ధీరము గాను నేరుపున దిక్కులు దద్ధరిలన్ సుకీర్తనా
  సారము దొల్కరింప నట శారద నీరద మొప్పె మల్లికా
  హారము తానుసేను మెడ యందు న వేయుచు నక్భరిట్లనెన్
  "నీరము లేక దీపములు నిక్కముగాఁ గొడిగట్టెఁ జూడుమా"

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సుమలత గారు మంచి యితివృత్తముతో చక్కని పూరణ చేశారు. అభినందనలు. చాలా బాగుంది.
   "సుకీర్తనా సారము దొల్కరింప" నంటూనే నీరము లేక యంటున్నారు. "నర-సింహ-క్షితి మండలేశ్వరుల నెన్నన్‌ వచ్చు ...... రాజ కంఠీరవా" అని పెద్దనామాత్యుడు సింహము నకు దుర్గుణముంది యంటూనే రాజ కంఠీరవా యని సింహము తో పోల్చి నట్లు!
   మరియొక్క విశేషముంది యిక్కడ. "సుకీర్తనాసారము" సమాసము ఒక అర్థములో దుష్ట సమాసము మరియొక అర్థములో (ఆ అర్థము కూడా యిక్కడ అన్వయించ వచ్చు) సాధు సమాసము. మీరే యర్థ ములో వాడారో తెలుప గలరా?
   "అక్బరు" ఒత్తు లేకపోయినా బలవంతుడే!

   తొలగించు
  2. ధన్యవాదములండి. నేను కీర్తన + ఆసారము ( జడివాన/వృష్టి) పాటతోనే వాన కురిపించారు అనే అర్థంలో వ్రాశాను. నేను కూడా అక్బర్ గారిని బలంగా వ్రాశానని గమనించాను. మార్చడానికి బలహీన పడ్డాను. మన్నించగలరు.

   తొలగించు
  3. సుమలత గారూ,
   బాగుంది మీ పూరణ. అభినందనలు.

   తొలగించు
 38. తే.గీ. వర్ష మొక్కింత తగ్గెనీ వత్సరాన
  నిండు కొనె జలాశయము లన్నియును నేడు
  ఎట్లు జల విద్యుదుత్పత్తి ఎంచిజూడ ?
  నీరు చాలక దీపము లారి పోయె.

  రిప్లయితొలగించు
 39. I touched the problem of 'low amniotic fluid' during labour.
  తప్పులుంటే పెద్దలు మన్నించగలరు.

  ప్రసవ వేదన హెచ్చె పడతికి ఉమ్మ
  నీరు చాలక, దీపము లారిపోయె
  జోరు గాలికి, మగడు కమ్జోరు డయ్యె
  గడుసు సావిక ఒసగె పండంటి బిడ్డ

  రిప్లయితొలగించు
 40. రాజేశ్ గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
  మొదటి పాదంలో ర-డ లకు యతి వేశారు. అది సమ్మతం కాదు. కమ్జోరు అనే అన్యదేశ్యం ఎందుకు? మగడు కంగారు పడెను.. అనవచ్చు కదా!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ధన్యవాదము. 'పడతికి' బదులు 'తరుణి' సరిపోవునా గురువు గారు ?

   తొలగించు
  2. ర,డ ల యతి మైత్రి విషయంలో మరొక్క మారు "సులక్షణ సారం" ,"అప్పకవీయం" లను సంప్రదిద్దాము.

   తొలగించు
 41. ప్రసవ వేదన హెచ్చె తరుణికి ఉమ్మ
  నీరు చాలక, దీపము లారిపోయె
  జోరు గాలికి, మగడు బెజారు డయ్యె
  గడుసు సావిక ఒసగె పండంటి బిడ్డ

  రిప్లయితొలగించు
 42. ప్రసవ వేదన హెచ్చెను భామ కుమ్మ
  నీరు చాలక, దీపము లారిపోయె
  జోరు గాలికి, మగడు బెజారు డయ్యె
  గడుసు సావిక ఒసగె పండంటి బిడ్డ

  రిప్లయితొలగించు
 43. కలలుగన్న తల్లి గళము విప్పగ లేక
  శిలగ మిగిలి పోయి చేర శయ్య,
  మాట వచ్చె పెండ్లి మనుమరాలికి జరుగ;
  కలలు గనెడి శిలలు పలుకగలవు

  నిన్నటి దత్తపది పూరణ

  ప్రజకుల సంభవ, మురహర ,
  గజరక్షక, శశివదనుడ, కంసారి, యాదో
  క్షజ, రుద్రరూప, వామన,
  నిజరూపము జూడబోవ నెందును నీవే

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   దత్తపదిలో వ్రజకుల... ప్రజకుల అయింది.

   తొలగించు
 44. నేరము లెన్నొజేయగను నేతలె యోడగ నెన్నికందునన్
  పోరగ డబ్బులిచ్చుచును పోకిరి దేవుని గూడునందునన్
  కారగ నూనె యంతయును,...కాంగ్రెసు వీరుల కాంతలేడ్వ ప
  న్నీరము లేక,...దీపములు నిక్కముగాఁ గొడిగట్టెఁ జూడుమా

  రిప్లయితొలగించు