కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కవి సన్మాన మని చెప్పఁగా భీతిల్లెన్"
లేదా...
"కవి సన్మానము సేతుమంచుఁ బలుకం గంపించె భీతాత్ముఁడై"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కవి సన్మాన మని చెప్పఁగా భీతిల్లెన్"
లేదా...
"కవి సన్మానము సేతుమంచుఁ బలుకం గంపించె భీతాత్ముఁడై"
గురువు గారికి నమస్కారములు కందపాదమైతే గణదోషమేమో చూడండి .
రిప్లయితొలగించండిసవరించానండీ... ధన్యవాదాలు.
తొలగించండి(పుత్తడి బొమ్మ సినిమాలో, సుత్తి వీరభద్రరావుకు ఏనుగును బహుమానముగా ఇచ్చే సంఘటనాధారముగా....)
రిప్లయితొలగించండికవితల్ పాడుచు సుత్తి వేయు కవియే కాంగారుఁ జెందంగ వా
ని వెతల్ తీరగ హస్తి కానుకన మన్నింపంగ నానా వ్యథల్
చవి జూసెన్ కద సుత్తి వీర వరుడే జంధ్యాల చిత్రంబునన్
కవిసన్మానము సేతుమంచుఁ బలుకం గంపించె భీతాత్ముఁడై!!
జిగురు సత్యనారాయణ గారూ,
తొలగించండిహాస్యరస స్ఫోరకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కంగారు.. కాంగారు అని టైపయింది.
రిప్లయితొలగించండిబిరుదు పేరు చూసి భయపడిన కవి :)
అవసరమవసరముగను బి
లువనంపి తమరికి నేడు "లుబ్ధప్రతిభా
కవివరు" డను బిరుదులతో
కవిసన్మాన మని జెప్పఁగా భీతిల్లెన్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిపూరణలోని దోషాన్ని సవరించినందుకు ధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అని చెప్పఁగా' అన్నపుడు సరళాదేశం రాదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[నేనును సుత్తి వీరభద్రుని కరి సన్మానమునే గ్రహించి వ్రాసితిని]
కవి కావ్యమ్ముల వ్రాయఁగాను, ప్రజలున్ గాంక్షించి సన్మానమున్
జవియౌ రీతినిఁ జేయఁబూని, కవినిం జక్కంగఁ జేరంగ, మున్
గవి సుత్తీశుఁడు గొన్నయట్టి "కరి సత్కారమ్ము" నూహించియున్,
"కవి సన్మానము సేతు" మంచుఁ బలుకం, గంపించె భీతాత్ముఁడై!
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పవనా !సన్మానంబును
రిప్లయితొలగించండినవిరళముగజేయుచుండ్రి యచ్చట గనుమా
కవిగా జేతురు నీకును
కవిసన్మానమని చెప్ప గాభీతిల్లె న్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణలో భావం స్పష్టంగా లేదు. వివరించండి.
"సవినయమున నే బలుకుదు
రిప్లయితొలగించండికవితల జదివితి సభలన గడగడ, వినుమా
అవి యన్నియు కాపీలే!"
కవి సన్మానమని చెప్పఁగా భీతిల్లెన్
(సన్మానం లో ఎక్కడ మళ్ళీ కవిత్వం చెప్పమంటారో అని భయపడ్డ ఓ కాపీ-కవి
వద్దని పలికిన పలుకులు)
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
అవినీతు యశఃకాము న
రిప్లయితొలగించండిపవిత్రు నింకఁ బొగడంగ వలెనని యొక స
త్కవి చింతాక్రాంతు డగుచుఁ
గవి సన్మాన మని చెప్పఁగా భీతిల్లెన్
అవనీ జాత కవీశ్వరోత్తముడ వయ్యా యంచుఁ గీర్తించుచుం
జివరం గప్ప భుజాగ్ర సీమలను కౌశేయోత్తరీయంబునున్
వివశత్వంబునఁ బోవగా వలెను దా వెచ్చంబు లెట్లో యనం
గవి సన్మానము సేతుమంచుఁ బలుకం గంపించె భీతాత్ముఁడై
పోచిరాజు కామేశ్వరరావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నవరసములు చిలికించుచు
రిప్లయితొలగించండికవనము వినిపించగ కవి , గానము సలుపన్
యువతరము గేలి సేయుచు
కవి సన్మాన మని చెప్పఁగా భీతిల్లెన్
శవ సాహిత్య పిశాచ నాట్య గతులే సర్వం సహాయంచునున్
కవనం బంచని, తోడుగా యువతయున్ కాంక్షించగా గంతులన్
కవి సన్మానము సేతుమంచుఁ బలుకం గంపించె భీతాత్ముఁడై
కవి సామ్రాట్టును బోలు నట్టి కవి యీ కాలంపు వారిన్గనన్
నిన్నటి సమస్యకు నా పూరణలు
ఆకసమునుండి యంఋవులద్భుతముగ
కురియ జేయగ పంటలు నరుల కొసగ
వరుణదేవుఁడు కరుణించెఁ; గరువు వచ్చె
పంటలు సునామి కి నశించి మంట గలియ
మౌని వర్యులు పండితాఢ్యులు మంత్రముల్ పఠియించగా
పూని యాగములెన్నొ జేయగ భూరి పంటలు పండవే!
వానదేవుఁడు చూపఁగా దయ; వచ్చెఁ గాటక మెల్లడన్
హీనులై ధరనుగ్రవాదులు హింస కై తగులెట్టగా
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
'కవిసమ్రాట్టును' అనండి.
నవజామాత యొకండు పండుగకునై నారీసమాయుక్తుడై
రిప్లయితొలగించండిస్తవనీయశ్వశురాలయం బరుగగా స్వశ్యాలకుం డచ్చటన్
భవనాగ్రంబున వృశ్చికాది గణముం బల్మారు చూపించి, నీ
కవి సన్మానము సేతుమంచు బలుకం గంపించె భీతాత్ముడై.
(హ.వేం.స.నా.మూర్తి)
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీకు+అవి అన్న విరుపుతో మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికవి,పండితుడె|నిరాశా
రిప్లయితొలగించండికవి|సన్మానమని చెప్పగా భీతిల్లెన్
వివరణ దెలుపక,సవరణ
కవనములోజెప్పలేక కలతయు జెందెన్ {కవిత్వము వ్రాయగలడు కవి,సభయందుచెప్పబోడు}
2.కవితాశక్తియు లేని డాంభికుని సంకల్పంబు నూహించకన్
కవిసమ్మేళన మందు నెంచుకొని లౌఖ్యంబందునొప్పించగా?
కవిసన్మానము సేతుమంచు బలుకం గంపించె భీతాత్ముడై
అవమానంబగునో యటంచు తననాహ్వానంబు సూచించగన్
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
లౌక్యం బనండి.
మాన్యులు శంకరయ్యగారికి.... వృత్తంలో 3వ పాదంలో పొరపాట్లు దొర్లాయి. మరల వ్రాస్తాను.
రిప్లయితొలగించండికవితావేశమునాపలేక నిది ప్రఖ్యాతంపు భావంబునాన్
జవనాశ్వంబు విధంబునంజెలగి సంచారంబుగావించుచున్
సవియున్సారములేని వ్యర్థ కవితల్ సంధించ వానిన్, సఖా!
కవిసన్మానముసేతుమంచు బలుకం గంపించె భీతాత్ముడై.
పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లేక యిది... అనండి.
సూర్యనారాయణ గారు "చవియున్సారములేని" అనియా మీ యభిమతము? అయినచో నచ్చట సరళాదేశమవుతుందనుకుంటాను. "స" రాదు గదా? "గావించుచుం / జవియున్సారములేని" సాధువనుకుంటాను. పరిశీలించండి.
తొలగించండికామేశ్వరరావుగారు నమస్సులు. చవి పదమే సరియైనది. సవి ఉన్నట్లు భ్రమపడ్డాను. అపుడు సరళాదేశమే. సూచించినందుకు ధన్యవాదములు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిభువిలోనపూర్వరీతిని
రిప్లయితొలగించండికవిలోకము విస్తుజెంద కామేశ్వరుడా!
శ్రవణశుభగముగ చిటికల
కవిసన్మానమనిచెప్పగా భీతిల్లెన్.
పొన్నెకంటి వారూ,
తొలగించండిబాగున్నది మీ పూరణ. అభినందనలు.
కవితాగానము సేయగ
రిప్లయితొలగించండి'కవికోకిల' బిరుదమొసగి కానుకగా మా
వివగరు చిగురుల హారమె
'కవిసన్మాన'మని జెప్పగా భీతిల్లెన్
కవనము సెప్పగ వలె, నా
రిప్లయితొలగించండిశువుగా, సమయోచితముగ సూక్తుల్ వినిపిం
చవలే, నవధానమున ,మీ
కవి,సన్మానమని జెప్పగా భీతిల్లెన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో 'చవలె' అని ఉండాలి. లేకుంటే గణదోషం.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసన్మానము కోరిన కవి వద్దకు,ప్యాకేజీ వివరాలు దెలుప వచ్చిన సన్మాన కర్తలు:
రిప్లయితొలగించండి'కవికోకిళ' పదివేలౌ
'కవిసామ్రాట్టు'నకు లక్ష ఖర్చౌనని, మీ
యవసరము మేర నొసఁగిన
కవిసన్మానమని జెప్పఁగా భీతిల్లెన్!
సన్మానము చేయుదమని కవీశ్వరుని వద్దకు వచ్చిన వారు:
తొలగించండికవి'సంపన్నులు' యోగ్యమౌ బిరుదు మీకందించ మా భాగ్యమౌ
'కవిసమ్మోహన' నెంతురేని యరలక్షౌ! చాలదన్పించినన్
'కవిసామ్రాట్టది' లక్షకున్ రయమె సాకారమ్ము! జాగేల నా
కవిసన్మానము సేతుమంచుఁబలుకం గంపించె భీతాత్ముఁడై!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'కవిసమ్రాట్టు' సాధువు.
వివిధంబైన స్వకావ్యరాశి యొక డావిర్భూత మోదంబు తో
రిప్లయితొలగించండినవనిన్ సద్యశమందగోరి కరమం దావేళ తాబూని సా
గువిధిం గొందరు దండధారు లచటన్ గుర్తించి యవ్వాని నో
కవి! సన్మానము సేతుమంచు బలుకం గంపించె భీతాత్ముడై.
(హ.వేం.స.నా.మూర్తి)
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవినీతిపరుడనియెనిటు
రిప్లయితొలగించండికవనమునకు లక్ష కొలది కాసుల నిత్తున్
భువిలో వ్రాసిన,చేతును
కవిసన్మాన మని చెప్పగా భీతిల్లెన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవనమున తన 'తెరవెనుక
రిప్లయితొలగించండికవి 'ని మది తలచి యొకింత కలవరమందన్,
కవిగా తగననుచు వగచి
కవి సన్మానమని జెప్పగా భీతిల్లెన్!
(తన 'తెరవెనుక కవి ' అంటే తను నియమించుకున్న అద్దె కవి, ఆంగ్లంలో 'ఘోస్ట్ రైటర్ ' అనే అర్ధంలో వ్రాశాను.)
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శివకామేశ్వర ప్రోక్తమైన కవితన్ చిత్రంబుదోషంబనన్
రిప్లయితొలగించండికవి నక్కీరుని వంటివారి సభలో కాలాన ధర్మాత్ముడై
కవిరాజొక్కని రాజుఁబిల్చిఁ దగు సత్కారంబు సేయించగన్
కవి సన్మానము సేతుమంచుఁ బలుకం గంపించె భీతాత్ముఁడై
ఫణి కుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవి సన్మానమనుచు నా
రిప్లయితొలగించండికవినే ధనమడుగు వారు కలరని తెలిసెన్
కవికిన్; వారేతెంచియు
కవి సన్మానమని చెప్పగా భీతిల్లెన్.
పిన్నక నాగేశ్వరరావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి" శివశివ యేలను నాకి
ట్లు వరిష్ఠుడ నంచు నిదియ, డుండుకమును నే "
నివి శంకరయ్య పలుకులు
కవి సన్మానమని చెప్పగా భీతిల్లెన్.
అవునా! చాలును! నాకు నీ బిరుదు లేలా నవ్వరే యందరున్?
రిప్లయితొలగించండిఎవరీ వన్నె కనర్హుడైన నను ని ట్లిబ్బందిలో నెట్టినా?
రివి 'కందీశుని' యష్ట దిగ్గజ ప్రశస్తిన్ గూర్చి మోమాటముల్!
కవి సన్మానము సేతుమంచు బలుకం గంపించె భీతాత్ముడై.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండినేను భయపడలేదు కాని ఇబ్బంది పడ్డ విషయం వాస్తవమే. నాకెందుకో వేదిక లెక్కడం మాట్లాడటం అంటే ఇష్టం ఉండదు.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
Bhuvi naadokkate sooti maargamani sadbhuddhin manan jalakan
రిప్లయితొలగించండిEvaraa Maarksani padya vidya gadagan eddeiva paaljeya yoa
ddhavarul taamayi pampi raathani gonan 'Tath-Thath--Thi- dheim'anna naa
Kavi sanmaanamu seithumanchu balukan gampinche bheethaathmudai P.Satyanarayana
కవులని విరసుల కందిన
రిప్లయితొలగించండిఛవి పత్రికలెల్ల జాట జాలిని గను నా
కవియొల్లడు దంభప్రభ
కవిసన్మా నమనిచెప్ప గాభీతిల్లెన్.
భువి నాదొక్కటె సూటివాదమనిసద్బుద్ధిన్ మనం జాలకన్
రిప్లయితొలగించండిఎవడా మార్క్సనియేవగింపుదొరగన్ యెద్దేవ పాల్జేయ యో
ద్ధవరుల్ తామయి పంపిరాతని గొన న్తత్తత్తిదేమన్న నా
కవి.......................
కవులని విరసుల కందిన
ఛవి యని పత్రికలు జాట జాలిని గనెనా
కవియొల్లడు దంభప్రభ
కవి సన్మా.............
కవి.........................................
శంకరాభరణం సమస్య - 2108
రిప్లయితొలగించండి"కవి సన్మానము సేతుమంచుఁ బలుకం గంపించె భీతాత్ముఁడై"
భువిలో సాగెడు ఘోర కృత్యములనున్ ముమ్మారు ఖండించుచున్
స్తవనీయమ్మగు శబ్దరాజములతో శాపాలు ధూపాలతో
నవలల్ వ్రాయుచు మెండుగా మురియుచున్ నర్తించు నత్తయ్యకున్
కవి సన్మానము సేతుమంచుఁ బలుకం గంపించె భీతాత్ముఁడై :)
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)