కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై"
(ఒక అవధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య)
లేదా...
"భర్తను బయటకుఁ దరిమె భరతనారి"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై"
(ఒక అవధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య)
లేదా...
"భర్తను బయటకుఁ దరిమె భరతనారి"
వర్తన బాగులేని పతి వద్దని తాఁ జన పుట్టినింటికిన్
రిప్లయితొలగించండివర్తకుడైన భర్త తన భార్యను తోడ్కొన వచ్చినంతనే
పూర్తిగ మారిపోతివన బొత్తిగ నమ్మనటంచు చెప్పి యా
భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మారిపోతినన' అని ఉండాలనుకుంటాను.
ధూర్త విదేశసంఘములు ద్రోహము సేయగ, భారతాంబ స
రిప్లయితొలగించండిత్కీర్తినిఁ గాచి నిల్పు ధృడదీక్షను బూనియె, యుద్ధమందు గ్రీ
ష్మర్తుగతార్కతీక్ష్ణనిజశస్త్రముతోన్ రిపుసైన్యముఖ్య భూ
భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై.
ఊకదంపుడు గారూ,
తొలగించండిఅద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
నర్తన శాలయం దుగన వంటల వాడగు భీమసే నుడున్
రిప్లయితొలగించండిశక్తియు నుక్తియున్ గలిగి శౌర్యము పొంగిన జూపజాలకన్
రిక్తపు హస్తమున్ మణిగ రింగులు వారుచు మూగవోయినన్
భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
మొదటిపాదంలో యతి తప్పింది. 'నర్తనశాలయందు గనినన్ దగ వంటలవాడు భీముడున్' అందామా?
భావం బాగుందండీ.. 3,4 పాదాల్లో ప్రాసాక్షరం సరి చూడండి..
తొలగించండిమురళీకృష్ణ గారూ,
తొలగించండిధన్యవాదాలు. నేను గమనించలేదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఅక్కయ్య గారు మీ పద్యానికి నా పూరణ:
తొలగించండినర్తన శాలయందు గనినం దగ వంటలవాడు భీముడున్
గుర్తిడు శంకమూలమున క్రుద్ధము పొంగిన జూపజాలక
న్నార్తిని హస్తముల్ నలుప నాపతిఁ జూచుచు మూగవోయినన్
భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై
సవరణ:
తొలగించండికామేశ్వరరావు గారూ,
తొలగించండిధన్యవాదాలు.
భావం బాగుందండీ.. 3,4 పాదాల్లో ప్రాసాక్షరం సరి చూడండి..
తొలగించండినమస్కారములు
తొలగించండిదోషాన్ని వివరించిన మురళీకృష్ణ గారికీ, పూరణజేసిన పోచిరాజు కామేశ్వర రావు గారికీ ,గురువు గారికీ అందరికీ ధన్య వాదములు. మర్చిపోయాను .అసలు ప్రాసాక్షరాన్ని గుర్తించలేదు .
రిప్లయితొలగించండిఇంటి పట్టుగ జేసెద యింతి గాను
నేను వంటను, నయ్యరో నీవు సంత
కేగి కూరగా యలు తెమ్ము కేజి యనుచు
భర్తను బయటకుఁ దరిమె భరతనారి
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
'..జేసెద నింతిగాను' అనండి.
కర్తవు గావె సైన్యమున కార్గిలు యుద్ధము జర్గుచుండ నో
రిప్లయితొలగించండిగర్తను దాగి విక్రమ విహారమునన్ రిపు మానప్రాణసం
హర్తగ మారకన్ బ్రతుకె హాయియటంచిలు జేర జీరె నా
భర్తను బైటకున్ దరిమె భారత నారి కళాప్రపూర్ణయై
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
రెండవపాదంలో యతి తప్పింది. 'ఒక'ను 'ఓ' అనరాదు కదా!
నాగరికత పెరగినదను నట్టి వేళ
రిప్లయితొలగించండిపోరు భుజబల గరిమయె భూరి హితవు?
సైనకుడు వడి తడబడి సాకు జెప్ప
భర్తను బయటకు దరిమె భరతనారి
పిట్టా వారూ,
తొలగించండిపూరణ బాగుంది.
మొదటిపాదంలో గణదోషం. 'నాగరికత పెరిగెనను నట్టివేళ' అందామా? టైపు దోషాలున్నవి.
సాంప్రదాయము పేరిట సగము జచ్చి
రిప్లయితొలగించండిసారకై తాళిబొట్టు విశాల బుద్ధి
నర్పణము జేసి ప్రశ్నించె నాగరికుల
భర్తను బయటకుదరిమె భరత నారి
పిట్టా వారూ,
తొలగించండిమీ మూడవ పూరణ బాగున్నది.
'సారకై'...?
వార్తల కెక్కగావలయు వైభవ ముంగని సంఘమందు స
రిప్లయితొలగించండిత్కీర్తిని పొందగావలయు కేవల మింటవ సించు టేల నీ
వర్తనమార్చుకొమ్మనుచు భవ్యహితంబుల యత్నహీనుడౌ
భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై.
హ.వేం.స.నా.మూర్తి
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భూరి పనులను జేసితి భుక్తి కొఱకు
రిప్లయితొలగించండివంట జేయుట తరమౌనె యింట నీకు
బరువు బాద్యత పట్టని పరమ జోగి
భర్తను బయటకుఁ దరిమె భరత నారి .
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధూర్తత తోడ వ్యర్థుడయి తూలెడి తా మగనిన్ సహింపకన్
రిప్లయితొలగించండిభర్తను బైటకున్ దరిమె భారత నారి; కళాప్రపూర్ణయై
వర్తిలి సంఘమందు బహు భావ వికాస ప్రభావ విజ్ఞతన్
కీర్తిని బొందుచున్ వనిత కేరుపు సల్పె సుధీవిధేయతన్!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రిప్లయితొలగించండిఆర్తిగ చంద్రబాబు కడు యత్నముతో నమరావతీ పురిన్
స్ఫూర్తిగ నాకశోభలను భూమి పయిన్ రచియింప నెంచె తా
గర్తపురిన్ , సహాయమిడగా చనుదెంచుమటంచు ద్రోయుచున్
భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై !!
మైలవరపు మురళీకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు గారి పూరణలు.....
రిప్లయితొలగించండి(1). వ్యసనములకు బానిసగుచు వరుసదోడ
అవసధమునంత గుల్ల చేయంగనుండి
తనను పిల్లలను సతము తరుపుజుండు
భర్తను బయటకు దరిమె భారత నారి.
(2). భర్తకు ధైర్యమున్ గలుగు బల్కులు జెప్పుచు ఖడ్గతిక్కనిన్
యెత్తుగ జేయుచున్ యతని గేహిని యుధ్ధముజేయ నంపినన్
భర్తయె పందయై రణము పన్నగలేక గృహమ్ము జేరగా
భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై.
క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి.
టైపు దోషాలు ఎక్కువగా ఉన్నవి. తిక్కనన్+ఎత్తుగ, జేయుదున్+అతని.. అన్నపుడు యడాగమం రాదు.
రెండవ పూరణలో రెండవ పాదంలో ప్రాస భంగ మయింది.
తొలగించండిreMDava padyamulO porabaaTuna praasa dappinadi. daanini ippuDu correct chEstunnaanu. " kkeertiki nettuchun " ani. yettugajEyuchun annadi dayatO teesiveyyaMdi. sree kaMdi SaMkarayya guruvugaari sUchanalanu paaTistaanu.
తొలగించండిపొరబాటును గ్రహించాను. రెండవ పద్యం రెండవ పాదంలో ప్రాస భంగమైనది. దానినిట్లా సరిజేస్తున్నాను. ' కీర్తికి నెత్తుచున్ ' అని. మిస్సన్న గారికి కృతజ్ఞతలు.
తొలగించండిశ్రీ కంది శంకరయ్యగారి సూచనా పాటిస్తాను.
రాజారావు గారూ,
తొలగించండిమీరు నేరుగా బ్లాగులో వ్యాఖ్య పెట్టగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది.
కృతజ్ఞతలు. మొత్తంమీద గురువుగారైన మీసూచనలతో సాధించాను.
తొలగించండికర్తగ దీక్షతో నిలిచె కార్యము లన్నిట దక్షురాలిగా
రిప్లయితొలగించండివర్తనతోడ లోకమున వర్ధిలె నద్భుత మార్గదర్శిగా
కీర్తికి రూపమై జగపు గేహపు దీపముగాను ధ్వంసినీ*
భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై!
*ధ్వంసిని= శనిదేవుని భార్య
పశ్చిమపు హోరుగాలికి వాలపోక
తొలగించండిదేశ సంస్కృతి వల్లరి తీగసాగ
కాంచ పిన్నపెద్దలు కౌగిలించ జూచు
భర్తను బయటకుఁ దరిమె భరతనారి
సవరణ:వాలిపోక
తొలగించండిమడిపల్లి రాజకుమార్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో వల్లి, తీగ.. రెండు ఒకటే కదా!
దేశ సంస్కృతి వల్లరి తేజరిల్ల
తొలగించండిసవరణ బాగుంది. సమాసంలో 'సంస్కృతీ వల్లరి' అనాలి. అన్నా గణదోషం లేదు.
తొలగించండికూర గాయలు దెమ్మని కుసుమ పంపె
రిప్లయితొలగించండిభర్తను బయటకు ,దరిమె భరత నారి
ధూర్తు డొక్కడు వలపుతో దరికి రాగ
స్త్రీలు బ్రాధాన్య మిత్తురు శీలమునకు
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(1)అగ్నిభయము నందు మనసు లగ్నమిడుట
రిప్లయితొలగించండివిలువ యైనట్టి సంపద విసరి వైచి,
తాను ముందుగ బయటకు దారి తీసి,
భర్తను బయటకుఁ దరిమె భరత నారి!
(2)ఝాన్సి పేరైన కోటకు జయము గూర్ప
సకల సైన్యంబు తోడుగా సమరమందు
స్వేచ్ఛ హరియింపఁ జూచెడు మ్లేచ్ఛ రాజ్య
భర్తను బయటకుఁ దరిమె భరతనారి!
(మ్లేచ్ఛరాజ్య భర్త= ఆంగ్ల రాజు)
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఓడి వెనుదిర్గ తిక్కనఁ గూడ దనుచు
రిప్లయితొలగించండితల్లి విరిగిన పాలిచ్చి తప్పు బట్ట
స్నానమాడగ నుంచి మంచములనడ్డు
భర్తను బయటకుఁ దరిమె భరతనారి
(ఖడ్గతిక్కన వృత్తాంతము)
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భ ర్తను బంపె గూరలకు భారతి తానుగ వంట జేయుచున్
రిప్లయితొలగించండిభర్తను బైటకున్, దరిమె భారత నారి కళా ప్రపూర్ణయై
ధూర్తుడు కోరియా సతిని దూరగలోగిలి నాక్షణంబునన్
భర్తను గాక యే యితర పౌరుని జూడరు భారతీ మణుల్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి రెండు పాదాలలో భర్త పదం పునరుక్తమయింది.
దూర్తులు శత్రురాజులు నధోగతిఁ జేయగ నెంచి ఘోర సం
రిప్లయితొలగించండివర్తముఁ బోలు యుద్ధమును వర్తిల జేసిన భీమ భండనా
వర్తన మేల నీకనుచుఁ బన్నుగ బొట్టిడి తా జయార్థియై
భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై
గొప్పలకు బోయి నిత్యము నప్పు జేసి
పప్పు కూడును మరగిన యప్పలమ్మ
అప్పు లిచ్చిన మిత్రుల ముప్పు నెంచి
భర్తను బయటకుఁ దరిమె భరతనారి
పోచిరాజు కామేశ్వరరావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అమ్మనాన్నల యాస్తుల నమ్ముకొనుచు
రిప్లయితొలగించండిసరకుగొనక కుటుంబము, సంతతమ్ము
త్రాగి వీధిలో తిరుగుచు తగవులాడు
భర్తను బయటకుఁదరిమె భరతనారి
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వర్తన మార్చుకొమ్మనుచు భర్తకు నిత్యము చెప్పిచెప్పి యా
రిప్లయితొలగించండిధూర్తుని మార్చలేక మది దుక్కము చిప్పిల నార్తి తోడుతన్
భర్తను బైటకున్ దరిమె భారతనారి, కళాప్రపూర్ణయై
కర్తగమారి ప్రీతిగను కాచుచు బిడ్డల చేసె త్యాగముల్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దుఃఖమును దుక్కము అని శ్రీహరి నిఘంటువు చెప్పినా అది ప్రసిద్ధము కాదు. అక్కడ దుఃఖము అన్నా సరిపోతుంది కదా!
మద్యమును గ్రోలిన నతడు మత్తు నంది
రిప్లయితొలగించండిమగని కొరకు వేచెడి నొక మగువ నింట
జొరబడ, నతని నెఱిగి నా పఱ వధూటి
భర్తను బయటకు తరిమె భరత నారి!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
. శ్రీ కేంబాయితిమ్మాజిరావుగారిపూరణ
రిప్లయితొలగించండిఅనిని తావెన్నుజూప?”తిక్కనకుభార్య
మంచమును,పసుపును,మసలునీరు
మగతనము లేనిమగడని మజ్జనమిడి
భర్తను బయటకు దరిమె భరతనారి.
2.కర్తసృజించు వాడనుచు కర్మఫలంబుగజన్మ నిచ్చుచొ
భర్తభరించు వాడనుచు పాలన పోషణచేయు వాడనిన్
కర్తయు భర్త”మీర”కికకన్నయనంచును తాళిగట్ట?నా
భర్తను బైటకున్దరిమె|భారతనారి కళా ప్రపూర్ణయై|
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి.
మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. రెండవ పూరణలో కొంత అన్వయలోపం ఉన్నట్టుంది. భావం సుగమంగా లేదు.
కట్న మాశించి విలువలు కాలరాయు
రిప్లయితొలగించండికర్కశంబును నమ్మిన కఠినుడనుచు
తెలసి కొన్నట్టి తెలివైన తెలుగుపడచు
భర్తనుబయటకు దరిమె భరతనారి.
2.భర్తను సత్యభామ తగు భాద్యతచేతను దానమివ్వగా
కర్తగ నారదుండొసగు కాంక్షకులోబడి మాయమర్మమున్
వర్తన జేరగా నహము బంచెడి మోహపు మానసంబునన్
భర్తను బైటకున్ దరిమె|భారత నారి కళా ప్రపూర్ణయై|
2.
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కర్తవు నీవు కావనిన గౌరవ మెట్లగు గీత చెప్పెనే
రిప్లయితొలగించండిపూర్తిగ వీడు మాలి నని పొమ్ము విడాకు లవేల వేడ బో
నార్తిని నాకు నింట గల హక్కును వీడ నటంచు ధూర్తుడౌ
భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాగరికత పెరగినదను నట్టి వేళ
రిప్లయితొలగించండిపోరు భుజబల గరిమయె భూరి హితవు?
సైనకుడు వడి తడబడి సాకు జెప్ప
భర్తను బయటకు దరిమె భరతనారి
కర్తవు గావె సైన్యమున కార్గిలు యుద్ధము జర్గుచుండ నో
రిప్లయితొలగించండిగర్తను దాగి విక్రమ విహారమునన్ రిపు మానప్రాణసం
హర్తగ మారకన్ బ్రతుకె హాయియటంచిలు జేర జీరె నా
భర్తను బైటకున్ దరిమె భారత నారి కళాప్రపూర్ణయై
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
దుర్జనుల సహవాసము దోహద పడ
రిప్లయితొలగించండిప్రతి దినము మద్యమున్ గ్రోల పైసలకును
సతిని, పిల్లలన్ హింసించి చావ గొట్టు
భర్తను బయటకు దరిమె భరత నారి.
పిన్నక నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కీర్తిని నిల్పి మాతృ భువికిన్ తగు సేవల జేయ బోక, స
రిప్లయితొలగించండిద్వర్తనుడైన వీరునిగ ధర్మము నెంచక, వీగి పారగా ,
వర్తిల వీర సింగమటు వైరులు భీతిలి యోడి నీల్గగా ,
భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కమ్మని తేటతెల్గు నుడికారము పద్యములందుజేర్చె వే
రిప్లయితొలగించండిరమ్మివి సూత్రపుంజములె రావిట నిర్వచనాలుగాని ఛం
దమ్మును సంధి నిర్ణయము దాహరణమ్ముల నేర్వజాలరే
బమ్మెర పోతనార్యుడొక వ్యాకరణమ్మును వ్రాసె దెల్గునన్
ఇమ్మహి భాషను సూత్రము
రిప్లయితొలగించండిఖమ్మున నెరపంగవచ్చు గాని ఋజువులే
కమ్మని పద్యములనుగన
బమ్మెర పోతన్న వ్రాసెవ్యాకరణమ్మున్
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధూర్తుడు క్రూర రాక్షసుడు దుర్గణ శీలుడు పాప భీతి స
రిప్లయితొలగించండిద్వర్తన లేనివాడు పర దారల కామ సుఖాతురుండు
ర్వర్తన లేని సచ్చరితు రాలుగృహమ్మరు గన్ పరాలి దు
ర్భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పాపదూర సద్వర్తన లేనివాడు... 'అనండి.
అతిథులేతెంచి నారని యతివ చింత
రిప్లయితొలగించండినమ్ము చేయుచు సరుకుల నవసరముగ
తెమ్మని పురమాయించుచు తెలివితోడ
భర్తను బయటకు దరిమె భరత నారి.
2.ఇంటిలోని పనుల నెల్ల నింపుగాను
చేసెదనని యడ్డుపడచు చెరుపుచుండ
పిదప సరి జేసు కొననేల మొదటగానె
భర్తను బయటకు దరిమె భరత నారి.
3వ్యసనంబుల పాల్బడి వరుస దప్పి
ఇల్లు గుల్ల చేయదలచ యింతి రోసి
ఇట్టి వాని పొందు చెరచు నెల్లరనని
భర్తను బయటకు దరిమె భరత నారి
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మూడవ పూరణ మొదటి పాదం ప్రారంభంలో గణదోషం. 'వ్యసనములకు పాల్పడి చెడి వరుస దప్పి' అందామా?
తల్లిదండ్రులు తోడుగా తమ్ముడొకడు
రిప్లయితొలగించండివచ్చువేళాయె రైలుకే, తెచ్చుకొరకు
కారు వేసుక బొమ్మని, కదలమనుచు
భర్తను బయటకుదరిమె భరత నారి.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండివచ్చేది తన వాళ్ళు. తరుమదు మరీ? అదే అత్తింటి తరఫు వాళ్ళైతే 'రైల్లో ఇంతదూరం వచ్చినవాళ్ళు ఆటోలో ఇంటికి రాలేరా? మీరెందుకూ వెళ్ళడం?" అనదూ?
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
వర్తన గల్గినట్టి మన వారిజ నేత్రయు రాణి రుద్రమాం
రిప్లయితొలగించండిబార్తిగ సేవ జేసె తన పాలన నెల్లరు సంతసించగన్
ధూర్తుడు యంబదేవు డధిదుర్గము పైనను పోర వైర భూ
భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రుద్రమాంబ+ఆర్తిగ' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. 'ధూర్తుడు+అంబదేవుడు' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. 'వారిజనేత్రయు రుద్రమాంబ తా। నార్తిగ... ధూర్తుడు నంబదేవు...' అనండి.
గురువుగారూ మీ సవరణకి ధన్యవాదముల.
రిప్లయితొలగించండివర్తన గల్గినట్టి మన వారిజ నేత్రయు రుద్రమాంబఁదా
నార్తిగ సేవ జేసె తన నాడిక నెల్లరు సంతసించగన్
ధూర్తుడు నంబదేవు డధిదుర్గము పైనను పోర వైర భూ
భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై
భర్తల మంగళమ్మునకు భార్యలు జేసెడి పూజ నేడురా
రిప్లయితొలగించండిపూర్తిగ నీరజాక్షులది ముద్దుల గుమ్మల పేరటమ్మురా
వార్తలు పంచబోవు భృగువారపు లక్ష్మికి నోమటంచుచున్
భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై :)