4, ఆగస్టు 2016, గురువారం

సమస్య - 2105 (మరుభూమిన్ లభియించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మరుభూమిన్ లభియించుఁ గాదె విలసన్మాణిక్య రత్నావళుల్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు. 
లేదా...
"మరుభూమిని దొరకు గాదె మాణిక్యమ్ముల్"

87 కామెంట్‌లు:

  1. శరనిధి గర్భము నందున
    పరిమిత మనుమాట లేక ప్రవాళాము లెన్నో
    తరుణము వెదకెడి కవులకు
    మరుభూమిని దొరకుగాదె మాణిక్యమ్ముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవపాదంలో 'ప్రవాళము లెన్నో' అన్నచోట గణదోషం. 'పగడము లెన్నో' అనండి.

      తొలగించండి


  2. అరుదగు ప్రవక్త మహ్మదు
    కరవాలముతో యెడారి గాడ్పుల మార్చెన్
    పరమాత్మమార్గము తెలిపె!
    మరుభూమిని దొరకు గాదె మాణిక్యమ్ముల్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. స్థిరచిత్తంబును, సత్ప్రయత్న, మవనిన్ సేవించు భావంబుతో
    నరు లెవ్వారలు స్వార్థదూరు లగుచున్ నానాప్రదేశంబులం
    దరుసం బందుచు సంచరింతు రనిశం బవ్వారి కవ్వేళ బ
    ల్మరు భూమిన్ లభియించు గాదె విలసన్మాణిక్య రత్నావళుల్.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
  4. నిరతానందముతో బ్రయత్నపరులై, నిష్ఠాగరిష్ఠాత్ములై,
    ధరణీచక్రము నుద్ధరించు పనిలో ధన్యత్వముం గోరు నా
    గురులం జేరరె దీక్షబూని యటకే కోరంగ శిష్యోత్తముల్
    మరుభూమిన్ లభియించు గాదె విలసన్మాణిక్య రత్నావళుల్.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  5. ప్రవాస ఆంధ్రులకు "మనబడి" తెలుగు నేర్పే మంచి ఉద్దేశ్యమును ప్రశంసిస్తూ ...
    మరుగున పడకుండ, తెలుగు
    మెఱుగుకు "మనబడి" వ్యవస్థ మెరిసె జగతినన్
    వరముగ లిటువంటివి పలు
    మరు భూమిని దొరకుగాదె మాణిక్యమ్ముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొలిమేర మల్లేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మెఱుగుకు' అనరాదు. 'మెఱుగునకు' సాధువు. అలాగే 'జగతినన్' అనారాదు. 'జగితినిన్/జగతిలో' అనండి. ఆ పాదాన్ని 'మెఱుగునకు మనబడి సంస్థ మెరిసె జగతిలో' అందామా?

      తొలగించండి
    2. ధన్యవాదములు సరిచేసి నందుకు గురువు గారు

      తొలగించండి
  6. సురలే మెచ్చగ శారదా సుతులు తాసోభిల్ల పాండిత్యమున్
    వరమీ యంగది గంతముల్ వెలయు ప్రవాహంబు గాదే నిలన్
    ధరణీ మాతయె ప్రీతిగా కవనముల్ తాదాత్మ్యమున్ చెందగా
    మరుభూమిన్ లభియించుఁ గాదె విలసన్మాణిక్య రత్నావళుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      శోభిల్ల.. సోభిల్ల అయింది. రెండవపాదంలో 'ప్రవాహంబు' అన్నచోట గణదోషం. '...గాదే యిలన్' అనాలి.

      తొలగించండి
  7. తరులు గిరులు వసియించెడి
    ధరయం దలరారు ఖనిజ ధాతు యుతంబై
    వరముల నిడు వనమౌచు న
    మరు భూమిని దొరకుగాదె మాణిక్యమ్ముల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      మరుభూమిని ధాతువు లమరు భూమిగా మార్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. విరబూసిన నందమ్మును
    మురిపించెడు నటనతోడ ముద్దులగుమ్మల్
    తెరపై చిందించగ గ్లా
    మరు భూమిని దొరకుఁ గాదె మాణిక్యమ్ముల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విరబూసిన యందమ్మును' అనండి.

      తొలగించండి
    2. Thank you sir, Editedpoem.
      విరబూసిన యందమ్మును
      మురిపించెడు నటనతోడ ముద్దులగుమ్మల్
      తెరపై చిందించగ గ్లా
      మరు భూమిని దొరకుఁ గాదె మాణిక్యమ్ముల్!

      తొలగించండి
    3. వేంకట సుబ్బ సహదేవుడు గారు
      "తెరపైన ధగద్ధిగల న
      మరు భూమిని దొరకుఁ గాదె మాణిక్యమ్ముల్!"
      అన్న యింకా బాగుంటుందేమో కదా

      తొలగించండి
    4. ధన్యవాదములు.మీ ప్రకారము సవరించిన పూరణ
      విరబూసిన యందమ్మును
      మురిపించెడు నటనతోడ ముద్దులగుమ్మల్
      తెరపైన ధగద్ధిగల న
      మరు భూమిని దొరకుఁ గాదె మాణిక్యమ్ముల్!

      తొలగించండి
    5. కాక పోతే అన్వయం సరిగా కుదరలేదనిపించింది.ఓ మారు పరిశీలించ ప్రార్థన.

      తొలగించండి
    6. కాక పోతే అన్వయం సరిగా కుదరలేదనిపించింది.ఓ మారు పరిశీలించ ప్రార్థన.

      తొలగించండి
    7. అవునండి యాయనుమానముమనసులోయున్న మీ "గ్లామరు" పదానికి తెలుగు పదము సూచించాను.గ్లామరుభూమి:థగథ్థిగలన్-అమరు భూమి.(తళుకుబెళుకు)

      తొలగించండి
    8. సమ్యగన్వయార్థము యీ విధముగా సవరించిన బాగుండుననుకుంటాను.పరిశీలించండి.

      విరబూసిన యందమ్మున
      మురిపించుచు నటనలాడ ముద్దులగుమ్మల్
      తెరపైన ధగద్ధిగల న
      మరు భూమిని దొరకుఁ గాదె మాణిక్యమ్ముల్!

      తొలగించండి
    9. ధన్యవాదములు సర్. నా సవరణను పరిశీలించ మనవి.
      విరబూసిన యందమ్మున
      మురిపించగ నటనతోడ ముద్దులగుమ్మల్,
      తెరపైన ధగద్ధిగల న
      మరు భూమిని దొరకుఁ గాదె మాణిక్యమ్ముల్!

      తొలగించండి
  9. పరమార్థంబిదెయంచు కర్షకుడు సంభావించి సుక్షేత్రమున్
    ధర సేద్యంబును సల్పుచుండుగద సంధానించి త్యాగమ్ము-తాన్
    వరమై శ్రీహరి దీవనల్ గురియ దీవ్యత్కాంతి శోభిల్ల-పా
    మరు భూమిన్ లభియించుగాదె విలసన్మాణిక్య రత్నావళుల్.

    సురుచిర విశేష కవితల
    పరమార్థము వెల్వరించి పాండిత్యమునన్
    వర కవులు పెక్కుమంది-య
    మరు భూమిని దొరకుగాదె మాణిక్యమ్ముల్.

    నిరతము సధర్మ నిష్ఠయె
    వరమని భావించు దైవభక్తునికెపుడున్
    తరియింపజేయు సుతులయి
    మరుభూమినిదొరకుగాదె మాణిక్యమ్ముల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. అరకొర బ్రతుకుల వారి కొ
    మరు లయ్యే యస్ లగుటను మది తలబోయన్
    భరతావని గర్వ పడగ
    మరుభూమిని దొరకు గాదె మాణిక్యమ్ముల్!

    రిప్లయితొలగించండి
  11. వర దేవార్చిత తర్పితాత్మ ఘనకూపారప్రకాశమ్ము భీ
    కర కాంతార మహీధరప్రకర విఖ్యాతాభి భాతిన్ నిరం
    తర కోపారుణ నేత్ర భీషణ మృగాధ్యక్షాది సత్త్వాళి గ్రు
    మ్మరు భూమిన్ లభియించుఁ గాదె విలసన్మాణిక్య రత్నావళుల్


    నర నారాయణు లాదిగ
    గురు వాల్మీకియు శుక జనకులును కలిని శం
    కరులు నర రత్నముల్! వే
    మరు భూమిని దొరకు గాదె మాణిక్యమ్ముల్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  12. పరికింపన్ లభియించుగాదె సిరులున్ ప్రజ్ఞానిధివ్రాతలున్
    కురిపించున్ నవధాన్య సంపదలు సంక్షోభంబులన్ బాపగాన్
    సరియౌనే మరి సౌరిశాఖిగణముల్ సంధించి శోధించ వే
    మరు, భూమిన్ లభియించుఁ గాదె విలసన్మాణిక్య రత్నావళుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. సురలు వసించు ప్రదేశము
    పరిభాసిల్లును సతతము పలుకాంతులతో
    నిరతమ్ము దేవతలు క్ర
    మ్మరు భూమిని దొరుకుగాదె మాణిక్యమ్ముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'క్రమ్మరు' కాదు 'క్రుమ్మరు' అని ఉండాలి.

      తొలగించండి
  14. కురుసంగ్రామంబుజరుగ
    నరుడేయుద్దమునువీడిధనువునువీడన్
    హరియేగీతనుజెప్పుట
    మరుభూమినిదొరుకుగాదెమాణిక్యంబుల్

    మొదటపంపినదానిలొఒక గణముటైపాటుకావునమరలపంపినాను

    రిప్లయితొలగించండి
  15. సిరివెన్నెల్ గురిపించు పాటలకుఁ దా శ్రీకారమున్ జుట్టుచున్
    తరువాతన్నెవరంచు నెంచఁదగు సీతారామ శాస్త్రు,ల్నవో
    విరుపుల్లో దరువే ప్రధానముగ దేవిశ్రీ ప్రవర్థించ, గ్రా
    మరుభూమిన్ లభియించుగాదె విలసద్మాణిక్యరత్నావళుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొంత భావ సందిగ్ధత ఉంది.

      తొలగించండి
  16. నిరతము క్షేత్రము నందున
    కరిససమును జేయునట్టి కమతీడులకున్
    వరమౌ ధాన్యమ్ముల్ వే
    మరు భూమిని దొరకు గాదె మాణిక్యమ్ముల్!!!

    కరిససము= వ్యవసాయము

    రిప్లయితొలగించండి
  17. అరయఁగ నెముకల భస్మము
    మరు భూమిని దొరకు గాదె, మాణిక్యమ్ముల్
    విరివిగ దొరకును జలధిని
    తరతర ములనుండి యచట తళుకుల దోడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మరుభూమి అంటే శ్మశానం అనే అర్థంలో చెప్పినట్టున్నారు.

      తొలగించండి
  18. . మరుభూమంచును లెక్కజేయకను సామాన్యుండు భావించ?యీ
    తరుణంబందున శాస్త్రవేత్తలట సంధర్శించి శోదించగా?
    మరుభూమిన్ లభియించు గాదెవిలసన్మాణిక్య రత్నావళుల్
    వరముల్ నిండిన మాతృభూమి మన సర్వస్వంబు జేకూర్చుగా|
    2.నరులకు నుపయోగంబుగ
    మరుభూమిని దొరుకుగాదె|మాణిక్యమ్ముల్
    అరుదుగ లక్ష్మికటాక్షము
    కరుణించిన కనక వృష్టి గనుపించుగదా|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      కొన్ని టైపాట్లున్నవి.

      తొలగించండి
  19. భరమున వెదికిన భస్మము
    మరుభూమిని దొరకు గాదె;మాణిక్యమ్ముల్
    తరచితరచి వెదకంగా
    శరనిధియందునె దొరకునుసంశయమేలా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. అరయగ జూచిన ఘనభూ
      ధరములు కేదారములు ముదమగు ఖనిజముల్
      తరువులు కోనలనేకమ
      మరు భూమిన దొరకు గాదె మాణిక్యమ్ముల్

      తొలగించండి
    3. విరించి గారూ,
      'అమరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. శిరమును వంచక రిపువ
    క్బరు నెదిరించెను ప్రతాపు.పటలపు వ్యయమున్
    భరియింపగ.సిరి కృపచే
    మరుభూమిని దొరకు గాదె మాణిక్యమ్ముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. అరయగ నస్థిక లెన్నో

    మరుభూమిని దొరకు గాదె; మాణిక్యమ్ముల్

    విరివిగ లభించు జలధిన్

    పరిశోధించంగ గర్భ భాగంబందున్.

    రిప్లయితొలగించండి
  22. గురుకృపచే నజ్ణానపు
    తెరలు తొలగి పోవ జ్ణానదీపము వోలెన్
    కురియగ వానలు ఘనముగ
    మరుభూమిని దొరకు గాదె మాణిక్యమ్ముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. అరయగ నస్థిక లెన్నో

    మరుభూమిని దొరకు గాదె; మాణిక్యమ్ముల్

    విరివిగ లభించు జలధిన్

    పరిశోధించంగ గర్భ భాగంబందున్.

    రిప్లయితొలగించండి
  24. అరయగ నస్థిక లెన్నో

    మరుభూమిని దొరకు గాదె; మాణిక్యమ్ముల్

    విరివిగ లభించు జలధిన్

    పరిశోధించంగ గర్భ భాగంబందున్.

    రిప్లయితొలగించండి
  25. శ్రీగురుభ్యోనమః

    వరమే మృత్యువు జీవరాసులకిలన్ వైరాగ్యమే భాగ్యమౌ
    స్థిరమైనట్టి యమర్త్యమేది కలదో దీపించు వారెవ్వరో
    పరమామ్నాయ రహస్య మంత్రపదమున్ వైభోగమున్ కాంచగా
    మరుభూమిన్ లభియించుఁ గాదె విలసన్మాణిక్య రత్నావళుల్"

    రిప్లయితొలగించండి
  26. శ్రీగురుభ్యోనమః

    హరుడా నాగాభరణుడు
    మరపించుచు నాట్యమాడ మణులే రాలన్
    వెరువక శ్రమపడి వెదకిన
    మరుభూమిని దొరకు గాదె మాణిక్యమ్ముల్

    రిప్లయితొలగించండి
  27. శ్రీపతి శాస్త్రి గారూ.... నమస్సులు... చక్కని పూరణలు

    రిప్లయితొలగించండి
  28. శిరముల్ లక్షలు ఖండనంబయె కురుక్షేత్రమ్ములో పోరునన్
    కురురాజిచ్చట దున్నుటన్ వలననీక్షోణిన్ కురుక్షేత్రమం
    దురు పుణ్యస్థలమై విరాజితమునెంతోగొప్పదైనట్టి యీ
    మరుభూమిన్ లభియించుఁ గాదె విలసన్మాణిక్య రత్నావళుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      నిన్న ఖమ్మం పుస్తకావిష్కరణ సభకు వెళ్ళి ప్రయాణంలో ఉండి మీ పూరణను గమనించలేదు. మన్నించండి.
      మీ పూరణలో పద్యం సలక్షణంగా ఉంది. కాని కురుక్షేత్రాన్ని మరుభూమి అని ఏ అర్థంలో ప్రయోగించారు?
      ఈ సమస్యకు వచ్చిన పూరణలలో కొందరు మరుభూమిని శ్మశానంగా భావించారు. నాకు తెలిసినంతవరకు ఎడారి అన్న అర్థ మొక్కటే ఉంది.

      తొలగించండి
    2. మరుభూమి అంటే ఊసరక్షేత్రం లేదా ఎడారి అన్న అర్థమే నండీ. కాని అధికులు ఈ మరుభూమిలో ఉన్న మరు అన్నది చూసి మరణశబ్దంలోనుండి అది వచ్చిందన్న ఆలోచనలో ఉండవచ్చును. కొంతవరకూ నిజమే. కాని ఒక తిరకాసు ఉందిక్కడ. ఏదీ అక్కడ బ్రతకదు అన్న భావమే కాని బ్రతికున్నది అక్కడికి రాదనే భావం ఏమీ లేదు.

      తొలగించండి
  29. పరికింపన్ మన కృష్ణరాయవిభుడీ భవ్యావనీ నాథుడై
    పరిపాలించగ రత్నముల్ మణులు ప్రోవై యొప్పు నంగళ్ళలో
    సిరులున్ సంపదలున్ చెలంగు వినుమో శ్రీదేవి యింటింట నౌ
    మరుభూమిన్ లభియించుఁ గాదె విలసన్మాణిక్య రత్నావళుల్.

    రిప్లయితొలగించండి
  30. పరమోత్కృష్ట పదంబున న్మసలి సంపాదించినన్ భాగ్యముల్
    నిరతం బద్భుత వేషభూషలను తా నిత్యుండనన్ వెల్గినన్
    కరమున్ దాల్చిన యంగుళీయకమునున్ కాయంబుతోరాదు, యే
    మరుభూమిన్ లభియించుఁ గాదె విలసన్మాణిక్య రత్నావళుల్ ?

    తరగని సంపదల కొఱకు
    ధర , కర్షకులమిత శక్తి ధారగ నిడుచున్
    దొరకొని శ్రమ జేయగ వే
    మరు , భూమిని దొరకు గాదె మాణిక్యమ్ముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి

  31. కామేశ్వర్రావుగారికి ధన్యవాదములు మీరన్నదినిజమే యతితప్పినది
    ఇప్పుడేచూచాను సవరిస్తాను

    రిప్లయితొలగించండి
  32. నరుడే యుద్ధమువదలగ నమ్మెడురీతిన్ అంటేసరిపోతుందా పరిశీలించప్రార్ధన గురువుగారూ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాసాచార్య గారూ యతి సరిపోయింది.కానీ భావము గంభీరముగా లేదు. "నరుడే యుద్దమును వీడ నలగిన మదినిన్" [నలగు = పీడితమగు] అని అర్జునుని విషాదమును తెలియపరచిన బాగుండును.
      "హరియేగీతనుజెప్పెను" అని వాక్యాంతము చేసిన యన్వయము బాగుండును.
      హరియేగీతనుజెప్పుట అన్నప్పుడు "మరుభూమినిదొరుకుటగాదె" అని యుండాలికద.
      సవరణ తో మీ పద్యము:
      కురు సంగ్రామంబు జరుగ
      నరుడే యుద్దమును వీడ నలగిన మదినిన్
      హరియే గీతను జెప్పెను
      మరుభూమిని దొరుకుగాదె మాణిక్యంబుల్

      తొలగించండి
  33. నరుడై పుట్టెను గాద చక్రధరుడౌ నారాయణుండేయిలన్
    పరిరక్షింపగ నెంచి, శ్రీ ధవుని యాపాదాంబుజాలిందు గ్రు
    మ్మరు భూమిన్ లభియించు గాదె విలసన్మాణిక్య రత్నావళుల్
    భరతుండేలిన భాగ్యధాత్రి యిది సౌభాగ్యానికే మిన్నయౌ

    రిప్లయితొలగించండి
  34. వరవిజ్ఞానము నెంచి వస్తు గుణముల్ వన్యాంతరవృక్షముల్
    ధరబెంచే బహు వింత వింత పొదలున్ తత్పాధ కాఠిన్యత
    ల్వరుసన్ శోధనజేసిత్రవ్వ ఖనులన్ లక్షించి సుజ్ఞాని గ్ర
    మ్మరు భూమిన్ లభియించుగాదె విలసన్మాణిక్యరత్నావళుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మొదటి పాదం చివర గణదోషం.
      పెంచే... అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
  35. నరునకదృష్టము లేనిది
    కరమరుదుగ గలుగ దెంత కష్టింపంగం
    వర సరస భాగ్యశాలికి
    మరుభూమిని.............

    రిప్లయితొలగించండి

  36. కరవై యుండగ ఛందమున్ గరపుటన్ కష్టించు శాస్త్రజ్ఞులు
    న్నరరే! ఆంధ్రుడ! శంకరాభరణ సాహాయ్యమ్ము చేకొంచుచున్
    సరసన్నల్లవె పద్యముల్ విరివిగా శార్దూల మత్తేభముల్...
    మరుభూమిన్ లభియించుఁ గాదె విలసన్మాణిక్య రత్నావళుల్!

    రిప్లయితొలగించండి