23, ఆగస్టు 2016, మంగళవారం

సమస్య - 2124 (కన్యాదన మొనర్చినన్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కన్యాదాన మొనర్చినన్ నరకమే కల్గున్ గదా దాతకున్"
లేదా...
"కన్యాదానమ్ము సేయఁ గలుగు నరకమే"

69 కామెంట్‌లు:

  1. కన్యాశుల్కము గోరి బాలికలకున్ కళ్యాణమున్ జేతురే
    యన్యాయమ్ము బహిష్కరించవలెనీ యాచారమున్ డబ్బు ప్రా
    ధాన్యమ్మై తన కూతురిన్ వయసులో తాతయ్య యౌ వానికిన్
    కన్యాదాన మొనర్చినన్ నరకమే కల్గున్ గదా దాతకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని పద్యంలోని విషయానికి కాలదోషం పట్టింది. ఇప్పుడు కన్యాశుల్కా లెక్కడ? వరవిక్రయాలే కదా! మీ పద్యాన్ని కందుకూరి వారి లేదా గురజాడ వారి మాటగానో చెప్తే బాగుంటుంది. 'ధన్యుండౌ గురజాడ చెప్పె నిటులన్ దా నాటకప్రక్రియన్" అన్న పాదాన్ని పద్య ప్రారంభంలో కాని, చివర కాని చేరిస్తే బాగుంటుందని నా సూచన.

      తొలగించండి
    2. ఈ సూచన మీ కొక్కరికే కాదు, కన్యాశుల్కాన్ని ప్రస్తావించిన, ప్రస్తావించబోయే మిత్రు లందరికీ!

      తొలగించండి
    3. కన్యాశుల్కం ఇప్పుడు లేదనుకున్నాను. తప్పే! జిలేబీ గారి పూరణ చూశాక 'అరబ్బులకు అమ్మాయిలను అమ్ముకొనే తల్లిదండ్రులు' గుర్తుకు వచ్చారు. ఈ సమస్య అమ్మాయిల నిష్పత్తి చాలా తక్కువగా ఉన్న రాజస్థాన్ తదితర ప్రాంతాల్లోను ఉన్నట్టు విన్నాను.

      తొలగించండి
    4. చంద్రమౌళి గారు బాగున్నది మీ పూరణ. నరకము దాతకు కలుగుతుందో కలుగదో కాని కన్యకు తప్పక కలుగుతుంది.

      తొలగించండి
    5. గురువు గారూ సమాజంలోని మార్పును మీరు గమనిస్తూంటే కన్యాశల్కం మళ్లా వచ్చే సూచనలు పుష్కలంగా కనుపిస్తున్నాయి. చాలా వర్గాల్లో మధ్య తరగతి ఆదాయం ఉన్న అబ్బాయిలకి అమ్మాయిల్ని వ్వడానికి ముందుకు రావడంలేదు. అబ్బాయిలు అమ్మాయిల నిచ్చేవాళ్ళు లేక అవస్థలు పడుతున్నారు. ఇది నిజం.

      తొలగించండి
    6. గురువు గారూ సమాజంలోని మార్పును మీరు గమనిస్తూంటే కన్యాశల్కం మళ్లా వచ్చే సూచనలు పుష్కలంగా కనుపిస్తున్నాయి. చాలా వర్గాల్లో మధ్య తరగతి ఆదాయం ఉన్న అబ్బాయిలకి అమ్మాయిల్ని వ్వడానికి ముందుకు రావడంలేదు. అబ్బాయిలు అమ్మాయిల నిచ్చేవాళ్ళు లేక అవస్థలు పడుతున్నారు. ఇది నిజం.

      తొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు

    " ధన్యత కూడిన వాడని
    కన్యను వృధ్ధుకు బలిమిగ కైవడి లేకన్
    అన్యాయమ్మగు విధమున
    కన్యాదానము సేయ గలుగు నరకమే "

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లేకన్ అన్యాయ'మని పద్యం మధ్యలో అచ్చులు రాకుండా చూడండి. అక్కడ 'లేక। న్నన్యాయమ్మగు..' అనండి.

      తొలగించండి
  3. అన్యాయము గకన్న బిడ్డను
    ధన్యత పేరున బ్రమపడి దౌర్బల్యము నన్
    వన్యమృగ మంటి వరునికి
    కన్యా దానమ్ము సేయఁ గలుగు నరకమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      పూరణ బాగున్నది.
      మొదటి పాదంలో గణదోషం. 'అన్యాయమ్ముగ బిడ్డను' అనండి. 'వంటి'ని అంటి అన్నారు. 'వన్యమృగనిభుడు వరునికి' అందామా?

      తొలగించండి

  4. అరబ్బులకి అమ్ముడు బోతున్న అమ్మాయిలు

    కన్యా శుల్కము గైకొని
    కన్యాదానమ్ము సేయఁ గలుగు నరకమే
    అన్యుల కమ్ముడు బోవగ
    శూన్యంబగు జీవనంబు శోభయు లేకన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. ధన్యత్వంబును బొందగల్గు నిలలో తన్వంగినా లక్ష్మిగా
    కన్యాదాన మొనర్చినన్, నరకమే కల్గున్ గదా దాతకున్
    అన్యాదత్త మొనర్చి గోవుని పునర్దానంబు తా జేయగా
    వన్యప్రాణిగ మారె చూడ నృగ భూపాలుండు దానంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      వైవస్వత మనువు పుత్రుని ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దాతకు। న్నన్యాదత్త...' అనండి.

      తొలగించండి
  6. ధన్యంబయ్యెను జీవితమ్మనుచు తా దానంబు గా కన్నియన్
    పుణ్యాత్ముండని వృద్ధమానవునికిన్ ప్రోయాలుగా పంపగా
    నన్యాయంబుగ నామెభర్త మృతితో నాకాలునిన్ చేరగన్
    కన్యాదాన మొనర్చినన్ నరకమే కల్గున్ గదా దాతకున్
    అన్యాయంబని తల్చకుండగనుస్వీయాత్మోధ్బవన్ పంపగన్
    సన్యాసాశ్రమమందునున్న యతికిన్ సాధ్వీమణిన్ జేయుచున్
    మన్యంబందున నామె జీవితములో మాధుర్యమున్ వీడగన్
    కన్యాదాన మొనర్చినన్ నరకమే కల్గున్ గదా దాతకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. అన్యున్నర్థవిహీనుజేయు గడనల్ ఆర్భాటముల్ మానవున్
    ధన్యున్ జేసెడి పుణ్యముల్ భృశలు వేదాల్బల్కు ఉక్తుల్సుమీ
    విన్యస్తన్ దగ నిర్వదేళ్ళ పడుచున్ వే జేయు దానంబదే
    కన్యాదాన మొనర్చినన్ నరకమే గల్గున్గదా దాతకున్

    రిప్లయితొలగించండి
  8. వన్యమృగంబే వరుడిట
    కన్యను బెండ్లాడ వయసు కవ్వించు దశన్
    అన్యోన్య గడన వరకగు
    కన్యాదానంబుజేయ గలుగు నరకమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      పద్యంలో అచ్చులు రాకుండా జాగ్రత్త పడండి.

      తొలగించండి
  9. మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    అన్యాయార్జిత వస్తు గేహ ధన దుష్టాచార దుర్నీతుడై
    కన్యా ప్రౌఢ వివేచనా రహిత దుష్కామాంధ దుర్వృత్తుడై
    ధన్యత్వమ్మును గోరి యంత్యదశలో ధర్మాత్ముడై యాగమున్
    కన్యాదానమొనర్చినన్ నరకమే కల్గున్ కదా దాతకున్ !!

    రిప్లయితొలగించండి
  10. ధన్యం బొందును వాని జీవితము ప్రాప్తంబౌనుగా పుణ్యమున్
    కన్యాదాన మొనర్చినన్, నరకమున్
    కల్గున్ గదా దాతకున్
    మాన్యుం డవ్వని యల్లునిం బడయ సేమంబందగా లేడిక
    న్నన్యాయంబులు మెండుగా గలుగు ప్రేమాస్వాదనం బందకన్!






    రిప్లయితొలగించండి
  11. ధన్యు లగుదురట పుడమిని
    కన్యాదానమ్ము సేయ, గలుగు నరకమే
    యన్యాయంబుగ నితరుల
    వన్య మృగంబులను బోలె బాధించం గన్

    రిప్లయితొలగించండి
  12. ధన్యంబగుజీవితములు
    కన్యాదానమ్ముచేయ, కలుగు నరకమే
    యన్యాయమ్ముగ దొరకొని
    కన్యాశుల్కము, కుమార్తెఁ గడుముదుక కిడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. సన్యాసికి,ధనమును గొని
    కన్యను వృధ్ధులకు నిచ్చి కల్యాణమ్మున్
    పుణ్యమ్మును జేకూర్చవు
    కన్యాదానమ్ము సేయ కలుగు నరకమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. ధన్యత్వము నొందగలరు
    కన్యాదానమ్ము జేయఁ, గలుగు నరకమే
    యన్యాయంబుగ నిలలో
    కన్యల ప్రాణములదీయు కఠినాత్ములకున్!!!


    కన్యాశుల్కము గైకొని
    అన్యుల పాల్జేయ చిన్ని యమ్మాయిలనే
    ధన్యత నీయదు సరికద
    కన్యాదానమ్ము జేయఁగలుగు నరకమే!!!



    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. అన్యోదార విధాన ధర్షణ ఘనాయత్తప్రబుద్ధుండునున్
      పణ్యాపణ్య వివేక హీనుడు మహా పాపాత్ముడుం గ్రూరుడు
      న్నన్యాయార్జిత విత్తమందు నఘ నాశార్థంబు సంరంభియై
      కన్యా! దాన మొనర్చినన్ నరకమే కల్గున్ గదా దాతకున్


      [న,ణ లకు ప్రాస భారత భాగవతములలో కలదని ప్రయోగించితిని.]


      రక్తము తీసుకోవడము తప్పు కాదు త్రాగడమే తప్పు:

      అన్యాయము గాదిల నసృ
      గన్యాదానమ్ము సేయఁ, గలుగు నరకమే
      యన్యుల రక్తము త్రాగిన
      విన్యాసమ్మున నిడుమల విపరీతముగన్

      [అసృక్+అన్య+ఆదానము= ఆసృగన్యాదానము : తనది కాని రక్తము పుచ్చుకొనుట]

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      కన్యాదానములో పూర్వపదాన్ని సంబోధనగా మార్చి చేసిన మీ మొదటి పూరణ, అసృక్+అన్య+ఆదానము అంటూ విలక్షణమైన పదవిభాగంతో మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  16. కన్యాదాతను కట్నకానుకలకే కార్పించగా నశ్రువుల్ ,
    విన్యాసంబులు జేసి వేవిధములన్ వియ్యాలవారిప్పట
    న్నన్యాయంబుగ నల్కపాన్పులనుచు న్నాశించగా పెన్నిధుల్
    కన్యాదాన మొనర్చినన్ నరకమే కల్గున్ గదా దాతకున్

    రిప్లయితొలగించండి
  17. కన్యాదాన మనంగ మీ రెరుగరే కల్యాణసంధాయియౌ
    నన్యాక్రాంతయు భర్తృవీతయు కదా యాశ్చర్య మీ యన్నువన్
    మాన్యుల్ మీ కెటు లొప్పె నీయ తగునా మా వానికిన్ హేయమౌ
    కన్యాదానమొనర్చినన్ నరకమే కల్గున్ కదా దాతకున్.

    రిప్లయితొలగించండి
  18. మాన్యా బాల్య వివాహము
    లన్యాయం బౌను కాదె హర్షింతు రొకో
    మాన్యత మాయును బాలా
    కన్యాదానమ్ము జేయఁగలుగు నరకమే!

    రిప్లయితొలగించండి
  19. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    " సన్యాసి వేసము లో నున్న క్రీడికి
    సుభద్ర నిచ్చి వివాహము చేయ తగ " దని
    శ్రీకృష్ణుడు , బలరాముని హెచ్చరి౦చుట
    ………………………………………………………

    సన్యాసి౦ గని , మ౦చి వాడని

    భవత్స్వా౦తమ్ము లో నె౦చి , సౌ

    జన్యశ్రీ ని సుభద్ర నీ దలచ

    నుత్సాహి౦తువే ? యగ్రజా !

    మాన్యామాన్య విచారణా రహిత

    స౦బ౦ధ౦బు వా౦ఛి౦చుచున్ ,

    కన్యాదాన మొనర్చినన్ నరకమే

    కల్లున్ గదా దాతకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారు నమస్సులు. యిప్పుడు “రాట్టు” పద విషయమున వ్యాకరణ విశేషముపై కొంత యవగాహన వచ్చినది.
      "రాట్టు" తత్సమమని చెప్పితిని కద. అది “రాజ్” “జ” కారాంత సంస్కృత పదము నుండి వచ్చినది. ఇందలి “జ్” కఠిన వ్యంజనములు పరమైన లేక యేమియు పరము కానిచో “ట్” గను మృదు వ్యంజనములు పరమైన “డ్” గను మారును. అందుకే ప్రథమైక వచనము “రాట్”.
      క, త లు కఠిన వ్యంజనములు కనుక “మృగరాట్కిశోరము” “ శైలరాట్తనయుడు” సాధువులు.
      “రాడ్తనయుడు” , “రాడ్వంశము” బ్రౌణ్య నిఘంటువు లో కలవు. “వ” మృదు వ్యంజనము కనుక “జ్” “డ్” గా మారి రాడ్వంశ మయినది. “రాడ్తనయుడు” బ్రౌణ్య నిఘంటువు లో కనిపించినను ("డ్" ఆదేశము) చింతనీయమే.
      “మృగరాట్కిశోరము” భాగవతము లో పోతన గారి ప్రయోగము. శ్రీనాధులవారి ప్రయోగములు మీకు వీలయిన తెలుప గోర్తాను.

      తొలగించండి
    2. యాదృచ్ఛికముగ నీ రోజు నేను ప్రయోగించిన “అసృక్” పదము కూడ జ కారాంత నపుంసక పదము “అసృజ్” (రక్తము) నుండి వచ్చినది. యిందలి చివరి “జ్” కఠిన వ్యంజనములు పరమైన లేక యేమియు పరము కానిచో “క్” గను మృదు వ్యంజనములు పరమైన “గ్” గను మారును.
      జ కారాంత “వణిజ్” పదము కూడ యిట్లే. (వణిక్ / వణిగ్ )
      అసృజ్ అసృక్ అయి “అసృక్ + అన్య = అసృగన్య (జశ్త్వ సంధి జరిగి).

      తొలగించండి
    3. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని బలరాముడు సుభద్రను సన్యాసికి ఇచ్చి పెండ్లి చేస్తానన్నట్టు లేదు కదా!

      తొలగించండి
  20. అన్యాయార్జిత నాస్తి పాస్తులిడు విన్యాసాల సారాంశమే
    సన్యాసట్లుగ| “భార్య పిల్లలతొ విశ్వాసాన జీవించకన్
    మాన్యుండంచు విశేష కట్నమిడు ధీమా సొక్కు పెళ్ళందునన్
    కన్యాదానమొనర్చినన్?” నరకమే కల్గున్ గదా దాతకున్.
    2.కన్యాశుల్కము రీతిగ
    కన్యాసుంకమ్ము వరుని కట్నముగాగా?
    కన్యకునన్యాయంబౌ
    కన్యాదానమ్ముసేయ? గలుగు నరకమే|



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'అన్యాయార్జిత' తరువాత నుగాగమం, సన్యాసి+అట్లుగ అన్నపుడు యడాగమం రాకుండా సంధి చేయడం, పిల్లలతొ అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించడం, పెళ్ళి+అందు అన్నపుడు యడాగమం రాకుండా సంధి చేయడం లోపాలు. సవరించండి.

      తొలగించండి
  21. మాన్యుల్ దేల్పిరి 'కన్య''పెండ్లముగ'ధర్మంబున్ ప్రవర్తించకన
    న్నన్యోన్యంబుగ ప్రీతి లేకను గృహమ్మందున్ వెతల్ బెట్టుచు
    న్నన్యాయార్జిత విత్తమున్ గొనుమటం చార్యున్ ప్రబోధించు తత్
    కన్యాదానమొనర్చినన్ నరకమే కల్గున్ కదా దాతకున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. అన్యాఢ్యాదుల గాంచి పేరు కయి తానప్పెక్కువన్ జెసి సా
    మాన్యుండిచ్చియు కట్నముల్ వరునకున్ మర్యాద యుక్తంబుగన్
    కన్యాదాన మొనర్చినన్ నరకమే కల్గున్ గదా దాతకు
    న్నన్యాయంబు కదా వరుల్ మిగుల కట్నాపేక్షులే నైనచో.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. కన్యను సొమ్ముకు నమ్ముచు
    కన్యాదానమ్మ సేయ కలుగు నరకమే
    కన్యను సురూపున కొసగ
    కన్యాదానఫలమబ్బు ఖచితం బిదియే.

    మాన్యు డగువరునకొసగి
    కన్యాదానము నుచేయ కల్గును సుఖమున్
    కన్యకు శుల్కముగొనుచు
    కన్యాదానమ్ము సేయ కలుగు నరకమే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ మొదటిపాదంలో గణదోషం. 'మాన్యుండగు వరున కొసగి' అనండి.

      తొలగించండి
  24. అన్యుని ప్రేమించితినన
    యన్యాయముఁ జేసితినని యనుకొని పతియే
    పుణ్యమని తగని వానికి
    కన్యాదానమ్ము సేయ కలుగు నరకమే!

    (ఆ మధ్య విన్న వార్త ఆధారంగ: విదేశం నుంచి సతి వేరొకరిని ప్రేమించితినన, అతని కడకు వెళ్లమని పంపగా.స్వదేశము చేరిన ఆమెను ప్రేమించిన వాడు స్వీకరించ రాక పోగ, ఆమె ఆత్మహత్యా ప్రయత్నము చేసి వైద్యశాల పాలైన వృత్తాంతము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రేమించితి నన। నన్యాయము...' అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.
      సవరించిన పద్యం:

      అన్యుని ప్రేమించితినన
      నన్యాయముఁ జేసితినని యనుకొని పతియే
      పుణ్యమని తగని వానికి
      కన్యాదానమ్ము సేయ కలుగు నరకమే!

      తొలగించండి
  25. ప్రగతి గతి తిరోగతి వైపుపరుగులిడగ
    శాస్త్రశోధనల్ ప్రకృతికి శాపమయ్యె
    పదుగురాడిన ధర జెల్లు పథమదొకటి
    ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు

    రిప్లయితొలగించండి
  26. కన్యాదానమనన్ వివాహ విధిలో కళ్యాణ కార్యక్రమం
    కన్యా దానము పొందినావరుడునే కార్యాని కైనన్ తగన్
    కన్యాకా మణి సర్వ బాధ్యత లు న్కాలన్ దగా చేసినా
    కన్యాదాన మొనర్చినన్ నరకమే కల్గున్ గదా దాతకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామకృష్ణ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      మూడవపాదంలో గణదోషం. వ్యావహారిక పద్యాలను యథేచ్ఛగా వినియోగించారు. వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలు కొన్ని ఉన్నవి. మీ పద్యానికి నా సవరణ....
      కన్యాదానమనన్ వివాహవిధిలో కళ్యాణ కార్యంబగున్
      కన్యాదానము పొందినట్టి వరు డేకార్యానికైనన్ దగన్
      కన్యారత్నము సర్వ బాధ్యతలవే కాలన్ దగా చేసినన్
      కన్యాదాన మొనర్చినన్ నరకమే కల్గున్ గదా దాతకున్. (భావ స్పష్టత లేదు)

      తొలగించండి
  27. శూన్యమ్మయ్యెను ధర్మరక్షణ కనన్,చోరత్వమే హెచ్చె,సా
    మాన్యమ్మై రిల దొంగపెళ్ళికొమరుల్,మాయమ్మయెన్ మంచి,సౌ
    జన్యమ్మెక్కడ జాడలేని స్థితిలో జామాత వంచించినన్
    కన్యాదాన మొనర్చినన్ నరకమే కల్గున్ గదా దాతకున్

    రిప్లయితొలగించండి
  28. శూన్యమ్మయ్యెను ధర్మరక్షణ కనన్,చోరత్వమే హెచ్చె,సా
    మాన్యమ్మై రిల దొంగపెళ్ళికొమరుల్,మాయమ్మయెన్ మంచి,సౌ
    జన్యమ్మెక్కడ జాడలేని స్థితిలో జామాత వంచించినన్
    కన్యాదాన మొనర్చినన్ నరకమే కల్గున్ గదా దాతకున్

    రిప్లయితొలగించండి
  29. శా. మాన్యుండౌ ఘన మైన మేటియగు జామాతన్ గడున్ గోరి ధీ
    శూన్యంబౌ నవివేకి యైన వరునిన్ శోధించి యేదెచ్చియున్
    అన్యాయార్జిత విత్తమెంతొ నిడి యున్నార్భాట మొప్పంగ తా
    కన్యాదాన మొనర్చినన్ నరకమే కల్గున్ గదా దాతకున్.

    రిప్లయితొలగించండి
  30. వినాయక చవితి పర్వ దిన సందర్భంగా సందర్భోచితమైన ఒక సమస్యా పూరణ గురించి ముచ్చటించు కుందాం.
    సమస్య : "గణ చతుర్తి నాడు ఫణి చతుర్తి"
    గణ చతుర్తి = వినాయక చవితి ; ఫణి చతుర్తి= నాగుల చవితి
    వినాయక చవితి నాడే నాగుల చవితి యంట ! దీన్నెలా సమర్థించాలి? జవాబు చూడకుండా కాసేపు మెదడుకు పదును పెట్టి చూడండి!
    ఈ సమస్యను డా.సీ.వీ.సుబ్బన్న శతావధాని అద్భుతంగా పూరించాడు.
    ఒక భర్త భార్యను పుట్టింటిలో దించి వెళ్ళి తిరిగి పిల్చుకు వెళ్ళటానికి చాలా రోజుల తర్వాత వెళ్ళాడు. అప్పుడామె అడిగింది."నన్నిక్కడ దించి నీవెళ్ళి ఎన్ని దినాలయింది?" అని.
    "కంగారెందుకే బంగారూ ! నేడు వినాయక చవితి, నాడు నాగుల చవితి" (పట్టుమని పదినెలలేగా)
    సమస్యా పూరణ :
    ఆ.వె.ఎన్ని దినములాయె నిట నన్ను డించి నీ
    వరిగి ?యనిన బత్ని కనియె భర్త
    నేటి కెన్నగ బదినెలలాయేగా! నేడు
    గణ చతుర్తి,నాడు ఫణి చతుర్తి.
    నేడు గణచతుర్తి - నాడు ఫణి చతుర్తి. అని వాక్య విచ్చిత్తి.
    *******========*******

    రిప్లయితొలగించండి
  31. కన్యాకాంతులు హాయిగా బ్రతుకగా కన్నెమ్మనే మెచ్చురే
    కన్యాదానము క్షౌరమైన తడవున్ కంగారు నీదౌనులే
    ధన్యుండాతడు కన్యలేని పితయే దర్జాగ జీవించడే
    కన్యాదాన మొనర్చినన్ నరకమే కల్గున్ గదా దాతకున్

    రిప్లయితొలగించండి