3, ఆగస్టు 2016, బుధవారం

దత్తపది - 95 (నవ్య-భవ్య-దివ్య-సవ్య)

కవిమిత్రులారా,
నవ్య - భవ్య - దివ్య - సవ్య
పై పదాలను ఉపయోగించి
వైద్యవృత్తిని గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.
ఈ దత్తపది అంశాన్ని పంపిన డా. పోచిరాజు రామమోహన రావు గారికి ధన్యవాదాలు.

87 వ్యాఖ్యలు:


 1. సభలో డాక్టర్లెవరూ లేరన్న ధీమాతో :)

  నవ్యమగు భంగి వైద్యుడు
  సవ్యముగా యున్న మీకు జబ్బని మేలౌ
  దివ్యమగు పరీక్షలనుచు
  భవ్యముగను చిత్రములను బాగుగ జూపున్ !

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సవ్యముగా నున్న..' అనండి.
   సభలో డాక్టర్లు లేకపోవడమేం? ఉన్నారండీ!

   తొలగించు
 2. వైద్య విద్యను చదివిన వ్యయము మెండు
  ప్రశ్నముల లీకున ప్రతిభ వ్యర్థమగును
  వాంఛితమ్ము తీరని మది వ్యథను పొందు
  బక్క వారి మనసు బాస వ్యక్తమగునె!!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిగురు సత్యనారాయణ గారూ,
   మీ ప్రతిభకు నమోవాకాలు! అద్భుతంగా ఉంది మీ పూరణ.

   తొలగించు
  2. జిగురు వారూ! అన్నింటిని చీల్చి చెండాడారు...

   తొలగించు
  3. సత్యనారాయణ గారు. నమస్సులు. అద్భుతంగా ఉన్నది మీ పూరణ, నేతితో నింపిన పూర్ణము వలె!!

   తొలగించు

  4. జిగురు వారు పదాలకి కొత్త నగిషీలు చెక్కారు !

   సూపర్

   జిలేబి

   తొలగించు
  5. సత్యనారాయణ గారు విభిన్నార్థములతో పదములను విభజించి యద్భుతమైన పూరణ చేశారు. అభినందనలు.
   "ప్రశ్నలు బయల్పడ ప్రతిభ వ్యర్థమగును" అన్న మహదానందమౌను.

   తొలగించు
  6. సత్యనారాయణ గారికి నమస్సులు. మీ పూరణ చాలా బాగుంది.నేటి పరిస్థితిని అద్భుతంగా చెండాడింది.

   తొలగించు
  7. గురువు గారికి, కవి మిత్రులకు ధన్య వాదములు.
   కామేశ్వర రావు గారి సూచన ప్రకారము సవరించిన పద్యము:

   వైద్య విద్యను చదివిన వ్యయము మెండు
   ప్రశ్నలు బయల్పడ ప్రతిభ వ్యర్థమగును
   వాంఛితమ్ము తీరని మది వ్యథను పొందు
   బక్క వారి మనసు బాస వ్యక్తమగునె!!

   తొలగించు
  8. సత్యనారాయణ గారు మీ విశాల సుహృదయానికి కృతజ్ఞతలు.

   తొలగించు
 3. భవ్యము వైద్యము మనకని
  సవ్యముగా నున్నవాడు సలహా కొఱకై
  నవ్యము నాకీవృత్తని
  దివ్యముగా మందులిచ్చు దేవుని కడకున్

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నవ్యంబై వెలుగొందు పద్ధతులతో నానాప్రకారంబుగా
  భవ్యంబైన చికిత్స చేయబడునో భాగ్యాన్వితుల్! రండిటన్
  దివ్యత్వంబొనగూర్చ, రోగతతులం దీర్చంగ మామార్గమే
  సవ్యంబైన దటండ్రు వైద్యవరులీ సంఘంబునం దంతటన్.
  (హ.వేం.స.నా.మూర్తి)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. కావ్యము వ్రాయురీతి పలు కమ్మని వాక్యములెంచి యెల్లెడన్
  దీవ్యదమోఘభాషణల దెల్పెదరిట్టుల వైద్యశాలలన్
  మీవ్యధదీర్చు కార్యమున మేమిట జూపెడి తీరు మేలికన్
  నవ్యము భవ్యమున్ మరియు నమ్ముడు దివ్యము సవ్యమిద్దియే.
  (హ.వేం.స.నా.మూర్తి)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   ముఖ్యంగా రెండవ పూరణ అద్భుతం.. పద్యాన్ని చదువుతూ 'దత్తపదా లెక్కడ?' అని భావించాను. ఒకే పాదంలో సార్థకంగా చక్కగా ఇమిడ్చారు. నమస్సులు!

   తొలగించు
  2. హరి వేంకట సత్యనారాయణ మూర్తిగారు .నమస్సులు. అనితర సాధ్యమైన పూరణ. చాల బాగున్నది.

   తొలగించు
  3. ఆర్యులకు ధన్యవాదములు

   తొలగించు
  4. ఆర్యులకు ధన్యవాదములు

   తొలగించు
 6. .భవ్యమనబోకు నత్యాస వైద్యుడుండ
  నలుపు రోగిని ధన వ్యయ మలుపుచేత
  దివ్య మైనట్టి వృత్తికిదిగులుజేర
  సలుపు వైద్యపు మార్గాలు సవ్యమగున?
  2.దివ్యత్వంబగు వైద్య వృత్తియన సందిగ్దంబ?దైవంబగున్|
  నవ్యంబైనవిశేష మార్గముల విన్యాసాల విజ్ఞానమే
  భవ్యంబౌ బహు బద్రతా ప్రతిభ సంబందాలు యెన్నున్న?యే
  నవ్యంబున్ గనుపించ దాశపడు దాసత్వాన వైద్యంబిలన్|

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి.
   మొదటి పూరణలో అన్వయలోపం ఉన్నట్టుంది. భావం బోధపడలేదు.
   రెండవ పూరణలో 'సంబంధమ్ము లెన్నున్న నే..' అనండి.

   తొలగించు
 7. మిత్రులందఱకు నమస్సులు!

  నేఁటి వైద్యం చూడబోతే ఇలా ఉంది...

  నవ్యములైన రుగ్మతలు నాకును వచ్చెనటంచు వైద్యునిన్
  సవ్యముగాఁ బరీక్షలనుఁ జాలఁగఁ జేసియుఁ కారణమ్ములన్
  భవ్యముగాఁ గనుంగొనియు వైద్యముఁ జేయుఁ డటంచుఁ గోరుచో;
  దివ్యముగా నటించుచునుఁ దీరుగఁ దోచెద రయ్య వైద్యులే!

  ప్రత్యుత్తరంతొలగించు

 8. నవ్య రీతుల శాస్త్త్రమ్మునభ్యసించి
  దివ్య వైద్యమ్ము తోడను దిగులు తీర్చి
  సవ్యముగ జేయు రోగుల సంతసమున
  భవ్య చరితులు పుడమిని వైద్యవరులు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ నవ్యమూ దివ్యమూ సవ్యమూ అయిన భవ్య పూరణను అందించారు. బాగుంది. అభినందనలు.

   తొలగించు
 9. నవ్య పథంబుల దొరికెడు
  భవ్యంబగు జ్ఞాన ఫల ప్రభావంబలరన్
  దివ్య మయి వైద్య వృత్తియె
  సవ్యంబుగ సాగుచుండె సంఘము నందున్!

  ప్రత్యుత్తరంతొలగించు
 10. భవ్యతకలుగుటకొరకై
  సవ్యమమగువైద్యమిచ్చిశంభునిగరుణన్
  నవ్యతకనబరచుటకును
  దివ్యంబుగనుండునటులదీర్చెనుగుండెన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సవ్యమ్మగు' అనండి.

   తొలగించు
 11. దేవునికిదియె మరురూపు దివ్య వృత్తి
  పగలు రేయన వ్యత్యాస పరిధి లేక
  సవ్యసాచి యేకాగ్రత సర్వదా ప్ర
  దర్శమయి భవ్య వైద్యుడాతడు వెలయును||

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తంగిరాల రఘురామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ప్రదర్శమయి అన్న ప్రయోగం సాధువు కానట్టుంది. ప్రధానమయి... అందామా?

   తొలగించు

 12. నవ్య సేవకు జన్మించినారమనిరి,
  దివ్య హస్తవాసుండగ దిగులు యేల?
  సవ్య మయినట్టి వైద్యము భవ్య కరము
  ఆరు వేలాయె జలుబుకు! అదిరి పడితి!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   హస్తవాసిగ నుండ... అంటే బాగుంటుందేమో?

   తొలగించు
  2. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు. హస్తవాసిగ నుండ.. అంటే బాగుంటుందేమో? 'దిగులు + ఏల' అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

   తొలగించు
 13. నవ్యవిధిన్ వక్షావృత
  భవ్యవిదారణ మొనర్చి వాఁడికటారిన్
  దివ్యముగఁ జేసిరి హృదికి
  సవ్యప్రసరణ నిమిత్త శస్త్రచికిత్సన్
  [భవ్య=ఎముక; కటారి=కత్తి]

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉంది. కాకుంటే కర్తృపదం లోపించింది.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. కర్త యిక్కడ సందర్భానుసారావగతమని భావించాను. సవరించిన పద్యము తిలకించండి.

   నవ్యవిధిన్ వక్షావృత
   భవ్యవిదారణ మొనర్చి వైద్యవరేణ్యుల్
   దివ్యముగఁ జేసిరి హృదికి
   సవ్యప్రసరణ నిమిత్త శస్త్రచికిత్సన్

   తొలగించు
  3. కామేశ్వర రావు గారూ,
   నేనూహించిన సమాధానమే మీనుండి వచ్చింది. సంతోషం! సవరించిన మీ పూరణ చాల బాగుంది. అభినందనలు.

   తొలగించు
 14. నవ్యంబులైన రీతుల
  సవ్యంబుగ రుజలు బాప చక్కని మందున్
  భవ్యముగ వ్రాయ భిషజుడు
  దివ్యంబుగ నయము నయ్యె దీర్ఘపు రుజలున్.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. సీ..దివ్యమూర్తిగ వెల్గి ధిషణజూపుచునిల
  సేవలజేసెడు చిత్తమున్న,
  నవ్యవిజ్ఞానంపు నైపుణ్యముల్జూపి
  రోగముల్బాపెడు యోగియనగ,
  సవ్యమౌచింతనన్ సాంఘికసేవలన్
  నిరతంబుసల్పెడు నేస్తమైన,
  భవ్యభిషక్కుగ ప్రాంజలింగొనుచున్న
  నమరవైద్యుడగును,నమృతమూర్తి
  తే.గీ. యగును,ధన్యుడై విస్తృత యశముబొందు,
  విజ్ఞులెల్లరు గొనియాడ విలువబెరిగి
  విశ్వమెల్లను దానెయై విష్ణువనగ
  వ్యాప్తిజెందును,వృద్ధియౌ వంశమెల్ల.

  దివ్యమైనట్టి సద్వృత్తి ధిషణజూపి,
  నవ్యశాస్త్రానుసారంబు నైతికముగ
  సవ్యమార్గాన రోగులసేవజేయ
  భవ్యమూర్తిగ వెలుగొందు వైద్యుడెపుడు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
 16. సవ్య మార్గాన గుండియ సాగకునికి
  నవ్యహృదయంపుటమరిక నమలుపఱచి
  దివ్యమౌరీతి మానవ జీవితాన
  భవ్యకాంతుల నింపును వైద్యుడనగ.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. నవ్య చికిత్సాజ్ఞానము
  సవ్యముగా సంగ్రహించి సాధన జేయన్
  దివ్యమగు వైద్య సేవయె
  భవ్య మితని హస్తమనుచు ప్రజలు నుతించన్.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. వైద్యుడన వ్యక్తి కాడొక ప్రాణ దాత!
  ప్రతిభ వ్యర్ధము సేయక వైద్య సేవ
  చేయ నది వ్యథలను బాపి చేరువగును,
  బాధితుల కిట దెస వ్యక్త పరచు చుండు!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కవిమిత్రులు శ్రీధరరావు గారూ- దత్తపదిని అన్యార్థంలో వ్రాసిన మీప్రయత్నం శ్లాఘనీయము. అభినందనలు.

   తొలగించు
  2. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించు
  3. కవి మిత్రులు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి మరియు గురువు గారికి ధన్యవాదములు.

   తొలగించు
  4. కవి మిత్రులు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి మరియు గురువు గారికి ధన్యవాదములు.

   తొలగించు
 19. దివ్యమైనట్టి వైద్యవృత్తియె తమకిల
  భవ్య భవితకు బంగారు బాటయంచు
  నమ్ముకొనిన వ్యక్తుల కలన్ వమ్ము చేసె
  దుర్మతులకుచేష్టలతోడ తుదకు మిగిలె
  వ్యయము మరియు గన ప్రయాస, వ్యధలు గాదె

  దివ్య మైన చదువు భవ్య భవితనిచ్చు
  విశ్వమందు వేల్పు వెజ్జుడంచు
  నమ్ముకున్న జనులు నవ్యనాగరికులు
  వాసిగాప్రయాస వ్యయము కోర్చు

  ప్రత్యుత్తరంతొలగించు
 20. వైద్యమనునది వ్యయముతో భారమయ్యె
  నవ్య పద్ధతిలో జేయ సవ్యముగను
  భవ్యమైన జీవితమును బడయవచ్చు
  బడుగులకునుచితచికిత్స ఫలితమిచ్చె

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 21. దివ్యంబగువసతులతో
  నవ్యమయినరీతిలోన నాణ్యతతోడన్
  భవ్యంబగు సుస్థతనిడ
  సవ్యంబగు వైద్యమొసగు సత్ఫలితమ్మున్!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 22. ఆస వ్యథను బాపు నాసను కల్గింప
  .....బ్రదుకుపై రోగికి ప్రమద మగును
  వ్యాధి యనిన వ్యథా భరిత మా వ్యాధిని
  ...... నమృతౌషధము చేత నణచ నగును
  అస్వస్థునికి సేవ హరిసేవ యని యెంచు
  ......మనునది వ్యవహార మైన మాట
  అనుభవజ్ఞుండిచ్చు నౌషధ మది వ్యగ్ర
  ......తను బాపి రోగికి ధైర్య మిచ్చు

  సవ్యముగ జ్ఞాన మార్జించి సంఘమునకు
  నవ్యమౌ చికిత్సా విధానముల తోడ
  దివ్యమౌ భావమున నోషధీధరుండు
  భవ్యమౌ సేవ లొనరింప భావ్య మగును.  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మిస్సన్న గారూ,
   దత్త పదాలను స్వార్థం లోను పరార్థం లోను వినియోగిస్తూ చేసిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించు
  2. గురువుగారికి ధన్యవాదములు.

   తొలగించు
 23. ప్రతిభ వ్యర్థమగుచునుండె స్వార్థపరత
  బడుగులు ధన వ్యయముఁగని భయమునొంది
  వ్యయరహిత చికిత్సకొరకై యరుగుచుండ్రి
  పైకమును గొనుటన్నది వ్యసనమాయె
  ప్రభుత యిచ్చిన ప్రతిపైస వ్యయముగాదు

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీరూ సవ్యసాచుల జాబితాలో చేరిపోయారు. సంతోషం!
   అన్యార్థంలో దత్తపదాల ప్రయోగంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 24. శ్రీగురుభ్యోనమః

  నవ్య విధానముల్ కలిగి నాణ్యత హెచ్చగ వైద్య విద్యలే
  దివ్యములాయె రోగులకు, దేవుడు వైద్యుడు, సంతసంబునన్
  భవ్యము గూర్చు నెల్లరకు ప్రాణము నిల్పుచు బాధ దీర్చుచున్
  సవ్యములైన వ్యాధులకు శత్రువనందగు వైద్యశాస్త్రమున్.

  ప్రత్యుత్తరంతొలగించు
 25. నవ్య వైద్యములే యిడు భవ్య గుణము
  దివ్య మంచునె వైద్యులు దినదినమును
  ధనము నపసవ్య ముగ పొంద దలఁచుచుండ
  రోగములు కాక బదులుగా రోగి పోవు

  ప్రత్యుత్తరంతొలగించు
 26. నవ్య రీతుల వైద్యము నంద జేసి,

  సవ్యమైన మందులనిచ్చి, శస్త్ర వైద్య

  మైన దివ్యముగ జరిపి యసువుల నిలు

  ప గల వైద్యుల దేనాడు భవ్య చరిత.

  ప్రత్యుత్తరంతొలగించు
 27. నవ్య మైనటి వ్యాదులు నంటుకొన్న
  దివ్య మైనట్టి మందులు సవ్యముగను
  నిచ్చి రోగాలు మాన్పితే నిలను వెజ్జు
  భవ్య మైనట్టి కీర్తిని బడయగలడు

  ప్రత్యుత్తరంతొలగించు
 28. ప్రత్యుత్తరాలు
  1. వైద్యుఁడనెడు వాడు....

   సవ్యంపు పలుకరింతల
   భవ్యమ్మగు స్పర్శ తోడ బాధల వినుచున్
   నవ్యముగ వైద్య మొసఁగిన
   దివ్యమ్ముగ రోగి లేచి దిగ్గున నడచున్

   తొలగించు
  2. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 29. భవ్యముగా వెలసెనిచట
  దివ్యోషధశాల ప్రజల దేవుని దయతో
  నవ్యమ్మగు పద్దతిలో
  సవ్యమగు రుగుమతులెల్ల చక్కగ నయమౌ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గుండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'గురుగుమతులు'...? చివరి పాదాన్ని 'సవ్యమ్మగు రుగ్మతలవి చక్కగ నయమౌ' అనండి.

   తొలగించు
  2. దివ్యౌషధశాల అంటే బాగుంటుంది.

   తొలగించు
 30. భవ్యమగు ఆయు విఙ్ఞాన వైద్యులెల్ల
  నవ్య రీతుల రోగుల సవ్యముగ ని
  చయము జేసి దివ్యముగు నౌషధము లీయ
  వైద్య వృత్తి యే జనులకు ప్రియము గూర్చు

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో ప్రాస, చివరి పాదంలో యతి తప్పాయి. సవరించండి.

   తొలగించు
 31. గురువుగారు చరవాణి సరిగాపనిచేయక ఒకేపద్యము రెండుమూడుమారులు ముద్రితమైనది మవ్నించండి

  ప్రత్యుత్తరంతొలగించు
 32. నవ్య రీతుల వైద్యము నంద జేసి,

  సవ్యమైన మందులనిచ్చి, శస్త్ర వైద్య

  మైన దివ్యముగ జరిపి యసువుల నిలు

  ప గల వైద్యుల దేనాడు భవ్య చరిత.

  ప్రత్యుత్తరంతొలగించు
 33. భవ్య వైద్య విద్య బాగుగా పఠియించి
  సవ్య యైన మందు సరిగ నొసగ
  దివ్యమైన మందు దేహాన పనిచేయ
  నలత తగ్గి నమరె నవ్య కాంతి

  ప్రత్యుత్తరంతొలగించు
 34. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ తాజా పూరణ బాగున్నది.
  'సవ్యమైన... తగ్గి యమరె...' అనండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 35. నవ్య జీవన ఋజలకు నాయువిచ్చు
  వైద్యముల్ మూలబడె భవ్య వైద్యత తులె
  సవ్య జీవనగతులపసవ్య.దాద.
  శుంఠ లిత్తురు దివ్యవైకుంఠ యాత్ర.

  ప్రత్యుత్తరంతొలగించు
 36. నవ్య జీవన ఋజలకు నాయువిచ్చు
  వైద్యముల్ మూలబడె భవ్య వైద్యత తులె
  సవ్య జీవనగతులపసవ్య.దాద.
  శుంఠ లిత్తురు దివ్యవైకుంఠ యాత్ర.

  ప్రత్యుత్తరంతొలగించు
 37. నవ్యజీవన ఋజలకు నాయువిచ్చు
  వైద్యముల్మూలబడెనవ్య వైద్య తతులెభవ్య గతులపసవ్య దాదశుంఠలిచ్చెడి మాత్ర
  వైకుంఠ యాత్ర్ర

  ప్రత్యుత్తరంతొలగించు