పిట్టా సత్యనారాయణ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. మొదటి పూరణలో 'ధర్మ సంచయనములున్'...'సంచయములున్'కు టైపాటు. సంచయనములున్ + ఆర్భాటము అన్నపుడు యడాగమం రాదు. మిన్నంటు+అహంభవము అన్నపుడు సంధి లేదు. బాధితుల్+ఇచ్చు అన్నపుడు యడాగమం రాదు. రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం.
గ్రామ్య భారతీయ రమ్య గోక్షీరముల్ కుత్సిత మతులైన కొందరకట కల్మషంబులందుఁ గలుపుచు నమ్మెడు పాల వలన నష్టమే లభించు" తప్పును క్షమించ ప్రార్థన.మరింత శ్రద్ధ తో వ్రాయ యత్నిస్తాను
మురళీకృష్ణ గారు మనోహరమైన పూరణ. అభినందనలు. “చాలుంజాలు” ; “మదింగీడెంచి” అన్న బాగుండునని నా యభిప్రాయము. “మూర్ఖపుఁ బంత మింతయు” అన్న శైలికి భంగ ముండదు కద. పరిశీలించండి. అఖండ యతి వేశారు తప్పు లేదు.
శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమస్సులు.. మీ సూచనలు శిరోధార్యాలు.. అయితే చదువరుల సౌలభ్యం కొరకు అలా వ్రాయుట.. నిజానికి ద్రుతసంధి చేయాల్సిందే.. మీరన్నట్లు "మూర్ఖపుఁబంతమింతయు పాఠాంతరం బాగుంది.. ధన్యవాదములు.. మీ మురళీకృష్ణ
కంది శంకరయ్య గారూ ! నమస్కారము. నా పద్యంలో రెండవ పాదంలో గల లోపమును నేను గానీ, మీరూ గానీ ఇతరులు గానీ గుర్తించినట్టు లేదు.12వ అక్షరం (గురువు) లోపిస్తున్నది. "నీ పుట్టొందుటే' అనియన వచ్చునా? తెలుప గలరు
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదంలో యతి తప్పింది. '..గానరాదు+అరయన్=గానరా దరయన్' అవుతుంది. అక్కడ నుగాగమం రాదు. 'గానరా దరసినన్' అనండి.
పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు. నేను మొదట కీర్తి క్షయంబౌను అనే వ్రాశాను. కానీ అది ఏక సమాసం కాదేమో అని చిన్న సందేహం కలగడంతో కీర్తిన్ అని మార్పు చేశాను.
కలసి యున్న చాలు కలతలు లేకుండ
రిప్లయితొలగించండికలుగు సుఖ మటంచు కలిమి యనగ
ధనము గలిగె నేని దారులు వేరౌను
పాల వలన నష్టమే లభించు
అక్కయ్యా,
తొలగించండిపద్యం వరకు సలక్షణంగా ఉంది. కాని పూరణ సమర్థంగా ఉన్నట్టు లేదు. మీరు 'పాల'ను ఏ అర్థంతో గ్రహించారు?
భాగము పాలు పంచుకొను .పాండవులు భాగము కదా అడిగారు .అలా అనుకుని రాసాను .పొరబడితే ఏముంది ? ఇంతే సంగతులు
తొలగించండిరాజేశ్వరి అక్క గారి పద్యంలో మూడవ పాదం ఈ విధంగా ఉంటే బాగుంటుందేమో అక్క గారు, శంకరయ్య గారుపరిశీలించాలి.
తొలగించండి" పాలు పాలనుచును భాగాలు కోరిన "
భాగం అనే అర్థంలో 'పాలు వలన' అవుతుంది. 'పాల వలన' కాదు.
తొలగించండినమస్కారములు
తొలగించండిఅవును నేనే పొరబడ్డాను .పాలు " అంటేనే భాగము " అని అర్ధం కదా .గురువులు, మరియు జనార్ధన రావుగారు .క్షమించాలి
అయ్యో ! అంత మాటెందుకు అక్క గారు ! మనమందరం నిరంతర విద్యార్థులమే కదా !
తొలగించండిdhanya vaadamulu
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు :
రిప్లయితొలగించండివెన్నుని దయవలన వెలసిన బిడ్డని
తీరు తెన్నులేక తెలివి రాని
విధము బెంచు జుండు వీఁకనీయని మురి
పాల వలన నష్టమే లభించు.
క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిదేహ పుష్టి గలుగు దినము సేవింపగా
పాల వలన, నష్టమే లభించు
గడ్డ పెరుగు నెయ్యి కలుపుకున్న, మనకు
తిండి యన, జిలేబి తీపి వలయు :)
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆలున్ బిల్లలధర్మసంచయనములున్ యార్భాటముల్ బేరుకై
రిప్లయితొలగించండిమేలున్ జేయని స్వార్థ భావన తతుల్ మిన్నంటహంభావమున్
కాలంబెల్ల వృథా యొనర్చ గడగంగా బాధితుల్ యిచ్చు శా
పాలే కారణమన్ని నష్టములకున్ భద్రమ్ము ధుర్యోధనా
ఆలకింజైముల నన్నియు నిచ్చుచు
రిప్లయితొలగించండిపాలుదీయుమిషల బ్రాపు నరయ
బాలబాలికలకు బంచెడి విషము నా
పాలవలన నష్టమే లభించు
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి.
మొదటి పూరణలో 'ధర్మ సంచయనములున్'...'సంచయములున్'కు టైపాటు. సంచయనములున్ + ఆర్భాటము అన్నపుడు యడాగమం రాదు. మిన్నంటు+అహంభవము అన్నపుడు సంధి లేదు. బాధితుల్+ఇచ్చు అన్నపుడు యడాగమం రాదు.
రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం.
గ్రామ్య భారతీయ రమ్య గోక్షీరముల్
రిప్లయితొలగించండికుత్సిత మతులైన కొందరకట
కల్మషంబులందుఁ గలుప నట్ఠి
పాల వలన నష్టమే లభించు"
యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. '...గలుపుచుండగ నట్టి' అనండి.
గ్రామ్య భారతీయ రమ్య గోక్షీరముల్
తొలగించండికుత్సిత మతులైన కొందరకట
కల్మషంబులందుఁ గలుపుచు నమ్మెడు
పాల వలన నష్టమే లభించు"
తప్పును క్షమించ ప్రార్థన.మరింత శ్రద్ధ తో వ్రాయ యత్నిస్తాను
మూర్తి గారూ,
తొలగించండిసవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
నగవు తోడ జగము నాకట్టు గొనవచ్చు
రిప్లయితొలగించండిపరుష వాక్కు జేత వైరమెదుగు
శమము వలన మేలు సమకూరు గాని కో
పాల వలన నష్టమే లభించు.
పియెస్సార్ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఆకట్టుకొనవచ్చు' అనండి. అక్కడ 'గొనవచ్చు' అనరాదు.
గురువుగారికి ధన్యవాదములు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు :
రిప్లయితొలగించండిఆలస్యంబది లేదు రీతియగు జాడన్ పాండవుల్కీవు వే
రాలాపమ్ములు లేక భాగములు వారాశించిన నట్లిచ్ఛుచో
చాలున్ వారికి నెంతయున్, మదము మాత్సర్యమ్ము పోద్రోలు కో
పాలే కారణమన్ని నష్టములకున్ భద్రమ్ము దుర్యోధనా!
రాజారావు గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
'పాండవుల్కీవు'...?
శ్రీ శంకరయ్య గురువు గారికి నమస్కారములు.
తొలగించండిపాండవుల్కీవు = పాండవులకు నీవు - అన్న అర్ధంలో వ్రాసాను. దోషమైతే మరోలా పూర్తిచేస్తాను. తెలియజేయవలసినది.
అది దోషమే! సవరించండి.
తొలగించండిగురువుగారు మార్చిన పద్యాన్ని పరిశీలించండి -
తొలగించండిఆలస్యంబుగ గాక పాండవుల రాజ్యా0సమ్ము దీటెంచి వే
రాలాపమ్ములు లేక భాగములు వారాశించి నట్లిచ్ఛుచో
చాలున్ వారికి నెంతయున్ మదము మాత్సర్యమ్ము పోద్రోలు కో
పాలే కారణమన్ని నష్టములకున్ భద్రమ్ము దుర్యోధనా!
సవరించిన పూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండిటైప్ దోషాలున్నవి.
పాలవలననష్టమేలభించుననుట
రిప్లయితొలగించండియొప్పుకాదుమనకుతప్పకుండ
మేలుగలుగజేయుబలమునిచ్చునికను
దెలివితేటలబ్బుధైర్యమిచ్చు
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చాలున్ చాలు వినాశహేతు సమరోత్సాహమ్ము , శాంతిప్రభా..
రిప్లయితొలగించండిమూలమ్మైనది సంధిమార్గము జనామోదమ్ము
యోచించు , నీ..
కేలా? మూర్ఖమునైన పంతము , మదిన్ కీడెంచి
మేలెంచు , కో...
పాలే కారణమన్ని నష్టములకున్ భద్రమ్ము దుర్యోధనా !!
మురళీకృష్ణ గారు మనోహరమైన పూరణ. అభినందనలు.
తొలగించండి“చాలుంజాలు” ; “మదింగీడెంచి” అన్న బాగుండునని నా యభిప్రాయము.
“మూర్ఖపుఁ బంత మింతయు” అన్న శైలికి భంగ ముండదు కద. పరిశీలించండి.
అఖండ యతి వేశారు తప్పు లేదు.
శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమస్సులు.. మీ సూచనలు శిరోధార్యాలు.. అయితే చదువరుల సౌలభ్యం కొరకు అలా వ్రాయుట.. నిజానికి ద్రుతసంధి చేయాల్సిందే.. మీరన్నట్లు "మూర్ఖపుఁబంతమింతయు పాఠాంతరం బాగుంది..
తొలగించండిధన్యవాదములు.. మీ మురళీకృష్ణ
మురళీకృష్ణ గారు గారు మీ సహృదయానికి ధన్యవాదములు.
తొలగించండివయసు హెచ్చినట్లు వన్నె తగ్గునటంచు ,
రిప్లయితొలగించండిబిగువు సడలునంచు వెఱచి, చన్ను..
పాలనీయకున్న పాపకు డబ్బాల
పాలవలన నష్టమే లభించు !!
మైలవరపు మురళీకృష్ణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ విషయమై కామేశ్వర రావు గారి సూచనలను గమనించండి.
స్వార్థపరత తోడ సతతమమేయ పా
రిప్లయితొలగించండిపాలవలన నష్టమేలభించు
మంచి పనులఁజేయు మానవులకు
నొప్పు జరుగు సుమ్మ తప్పకుండ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. 'మంచిపనులఁ జేయు మానవులకు సతము' అందామా?
ప్రహ్లాదునితో హిరణ్యకశిపుడు :
రిప్లయితొలగించండిబాలుడవని దెలుపఁ బ్రహ్లాద వినుమయ్య
సకలమొసఁగు నన్ను సన్నుతించు
శౌరియన్న మనకు వైరియౌ నామ జ
పాల వలన నష్టమే లభించు!?
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇది భారతంలో లేదు. కేవలం, దుర్యోధనుని అంతరాత్మ చెప్పినట్లుగా ఊహించి వ్రాసినది.
రిప్లయితొలగించండిఆలంమ్మందున నెంచిచూడగ బిగిన్ వ్యక్తంబయెన్ వ్యూహ లో
పాలే కారణ మన్ని నష్టములకున్, భద్రమ్ము ధుర్యోధనా
శల్యున్ సారథిగా యొనర్చి, ననిలో సాధించ సాధ్యమ్మ నీ
యుల్లంమ్మందుసతమ్ముమెల్గెడు వృధావ్యూహమ్ము వీడన్ దగున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
'సారిథిగా నొనర్చి యనిలో' అనండి.
శా. ఆలోచించియు ముందుకేగ మనెగా ఆ శౌరి రారాజుతో
రిప్లయితొలగించండిభూలోకమ్మున మానవుండుగను పుట్టొందుటే భాగ్యమౌ
కాలాతీతము గాను కీర్తి బడయన్ కార్యార్థివై సాగు;పా
పాలే కారణ మన్ని నష్టములకున్ భద్రమ్ము దుర్యోధనా !
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కంది శంకరయ్య గారూ ! నమస్కారము.
తొలగించండినా పద్యంలో రెండవ పాదంలో గల లోపమును నేను గానీ, మీరూ గానీ ఇతరులు గానీ గుర్తించినట్టు లేదు.12వ అక్షరం (గురువు) లోపిస్తున్నది. "నీ పుట్టొందుటే' అనియన వచ్చునా? తెలుప గలరు
విషపు చుక్క పాల విరుచు విధమ్మున
రిప్లయితొలగించండిహితము లైన గుణము లెన్ని యున్నఁ
జాల వయ్య యిల నసందర్భ వికృత కో
పాల వలన నష్టమే లభించు
శూలోగ్రాయుధ తేజ గౌతమ ఘనక్షోభుండు సుత్రాముడే
బాలార్కాభ సునీథ శాపహతు డప్పాండుక్షితీశుం డలన్
కాలాగ్నిద్యుతి భార్గవక్షయుడు నక్కర్ణుండు సద్విప్ర శా
పాలే కారణ మన్ని నష్టములకున్ భద్రమ్ము దుర్యోధనా!
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.ధన్యవాదములు.
తొలగించండిఅన్నదమ్ములందురనాప్యాయత తరిగి
రిప్లయితొలగించండిమాట మాట పెరిగి మనసు చెదిరె
అంతరమ్ము హెచ్చు నర్థము లేని కో
పాలవలన నష్టమే లభించు.
2.కొత్త చీర తెచ్చె కూరిము తోపతి
అలక తో వలదనె నతివ తాను
అంతులేని యలక చింతను కూర్చె తా/కో
పాలవలన నష్టమే లభించు.
3.దేహపుష్టి కొరకు ధేనుపాలను పట్ట
చక్కగాను పెరుగు జగతియందు
బద్దకమ్ముతోడ పాపలకిడు డబ్బా
పాలవలన నష్టమే లభించు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కొన్ని టైపు దోషాలున్నవి. '..దమ్ములందుర-..దమ్ములందు, కూరిము-కూరిమి'
ధేనుపాలు అనడం దుష్టసమాసం. 'ధేను దుగ్ధము పట్ట' అనండి. 'డాబ్బా' అన్నచోట గణదోషం. 'డబ్బ పాలు' అనవచ్చు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో యతి తప్పింది. '..గానరాదు+అరయన్=గానరా దరయన్' అవుతుంది. అక్కడ నుగాగమం రాదు. 'గానరా దరసినన్' అనండి.
ఏలావీడవు దుష్టచిత్తుల వినాశేచ్ఛాదులన్నకటా !
తొలగించండిమేలొక్కింతయు గానరాదరసినన్మీ రాజ్యభోగంబులున్
శ్రీలాస్యంబులు వీడు,గానఁ నెరుకంజెందన్వలెన్ దుష్కలా
పాలే కారణమన్ని నష్టములకున్ భద్రమ్ము దుర్యోధనా
గురువు గారూ కృతజ్ఞతలు.ఎదోలా యతి కుదిర్చినాను.మార్చి వ్రాశాను. చిత్తగించండి.
మూర్తి గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూర్తి గారు యీ సవరణ చూడండి.
తొలగించండిఏలావీడవు దుష్టచిత్తుల వినాశేచ్ఛాదులన్నక్కటా !
మేలౌనేయిల నిష్ప్రయోజనముసుమ్మీ రాజ్యభోగంబులన్
శ్రీలాస్యంబులు వీడినేర్చుకొనుమాశీఘ్రంబుగా దుష్కలా
పాలే కారణమన్ని నష్టములకున్ భద్రమ్ము దుర్యోధనా
జాలి యోర్మి లేని చైతన్యమును లేని
రిప్లయితొలగించండిబ్రతుకు వలన మనకు వెతలు మెండు
వైన మెరుగ మిగుల వ్యధలను బెంచు కో
పాల వలన నష్టమే లభించు!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నీలో దుర్మతి యిట్టులేల కలిగెన్ నిత్యంబు ధర్మాత్ములై
రిప్లయితొలగించండియీ లోకంబున సంచరించు ఘనులౌ యీ ధర్మరాజాదులన్
శ్రీలం దోచి వధింప జూచుట కులక్షేమంబె? నీచేయు పా
పాలే కారణ మన్నినష్టములకున్ భద్రమ్ము దుర్యోధనా!
విద్యతోడ సద్వివేకంబు సుతులకు
మంచి వర్తనాన మసలు రీతి
క్షితిని నేర్పనట్టి మితిమీరు నా మురి
పాలవలన నష్టమే లభించు.
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పుట్టె బాలుడనుచు పూతన రాక్షసి
రిప్లయితొలగించండికృష్ణు జంప నెంచు తృష్ణ చేత
బాలునెత్తు కొనుచు పాలుబట్టగ?మురి
పాల వలన నష్టమే లభించు|
2.జాలిన్ జూపుచు ధర్మ మార్గమున రాజ్యంబంతభాగించు| కో
పాలే కారణ మన్ని నష్టములకున్ భద్రమ్ము దుర్యోధనా
మూలం బెంచియు నన్నదమ్ములిట సమ్మొహాన జీవించగా
కాలంబేతగు చింత బాపుగద సౌఖ్యంబౌను గుర్తించుమా {కృష్ణ రాయభారమున కౌరవ సభయందుకృష్ణపలుకులు}
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నా లీలల్ గనలేక నాటి సభలోనన్ సంధి కాదంటివే!
రిప్లయితొలగించండినేలంగూలిరి భీష్మ ద్రోణ రవిజుల్ నేడీ రణాంతస్థలిన్
కీలాలంబున నేడు దాగనిలలో కీర్తిన్ క్షయంబౌను! పా
పాలే కారణ మన్ని నష్టములకున్ భద్రమ్ము దుర్యోధనా!
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఫణి కుమార్ గారు "కీర్తిన్ క్షయంబౌను" అన్వయలోప మనిపించుచున్నది(కీర్తియున్ క్షయంబౌను సాధువు కద). "కీర్తిక్షయంబౌను" అన్న చాలును. గణదోషములేదు.
తొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిధన్యవాదాలు!
పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు. నేను మొదట కీర్తి క్షయంబౌను అనే వ్రాశాను. కానీ అది ఏక సమాసం కాదేమో అని చిన్న సందేహం కలగడంతో కీర్తిన్ అని మార్పు చేశాను.
తొలగించండిమీ సవరణకి ధన్యవాదములు.
కాకి నోట కౌచు కాజేయగా నక్క
రిప్లయితొలగించండికాకి గానగరిమ గడన సేయ
కావు మనెను తాను గంతులతో మురి
పాల వలన నష్టమే లభించు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రక్త పీడనమ్ము రయము నందుకొనును
రిప్లయితొలగించండిగుండె నీరసించు, గుబులు కలుగు
మానసమున! మహిని మనుజుల కోపతా
పాల వలన నష్టమే లభించు!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మనిషి మనిషి నడుమ మమతానురాగముల్
రిప్లయితొలగించండిమాసిపోవ దురభిమాను లగుచు
కచ్చి బూనుచు పొరిపుచ్చు కొను ఘోర పా
పాల వలన నష్టమే లభించు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నీలోరేగిన గర్వరేఖలకు నీ నేస్తంబె సూత్రంబయెన్
రిప్లయితొలగించండిమేలుంగూర్చెదనన్న కర్ణు రథమేమేదిన్ వడింగ్రుంగెగా
కాలంబయ్యదిమూలమౌను గనుమా!కర్మానుసారంబు -శా
పాలే కారణమన్ని నష్టములకున్ భద్రమ్ము దుర్యోధనా!
నియమ నిష్ఠలుంచి నేత్రాలు ముకుళించి
మనసుదెఱచి శివుని మమతనింపి
దోయిలి యిడకుండ ధూర్తత కొంగజ
పాల వలన నష్టమే లభించు.
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఆర్యా. ఇవి పూరణానికి సరిపోతాయేమొ చూడండి
రిప్లయితొలగించండితండ్రి యసంగ్రహత్వమును తా బహు మెచ్చె సుతుండు చూడరే
తండ్రి ధనహీనతన తన తనయు డెదిగె
పాలుంబంచక పట్టణమ్ములయిదున్ ప్రార్ధించినన్నీయకన్,
రిప్లయితొలగించండిచాలు న్నాకుచతుష్టయం బనుచు పెంచంజూడ శత్రుత్వమున్ ,
గూల న్నీకులిఖించెనేమొ విధి సంకోచించు వ్యక్తిత్వ లో
పాలే కారణ మన్ని నష్టములకున్ భద్రమ్ము దుర్యోధనా
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తగ్గునందమనుచు తగ్గవిధము చంటి
రిప్లయితొలగించండిబాలలకును తల్లి ప్రక్కనిడుచు
పాలనీయకున్న పాలిండ్లలోపలి
పాల వలన నష్టమే లభించు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సౌమ్య వర్తనమున సానుకూల పడును
రిప్లయితొలగించండియెన్ని తగవులున్న నెప్పుడైన
పరుష వాక్కు తోడ వచ్చెడు కోపతా
పాల వలన నష్టమే లభించు.
తల్లి దండ్రు లతిగ బిల్లల(బ్రేమించి,
రిప్లయితొలగించండితప్పు_ఒప్పు లేవొ చెప్పకున్న,
భావి జీవితాన వారు తెలియనిలో
పాల వలన నష్టమే లభించు.
విద్వాన్,డాక్టర్, మూలె రామముని రెడ్డి. విశ్రాంత తెలుగు పండితులు.ప్రొద్దుటూరు.7396564549.
పీడ కల:👇
రిప్లయితొలగించండిజాలింగల్గెను నిన్నుజూడ నవురా జంజాట మాయెన్,..దగా
పాలన్నమ్ముచు హాయిహాయి నొకచో పాలించి లాలించగా
కాలం మారుచు నాంధ్రు లెల్లరకటా గాంధీయులైపోవ గా
పాలే కారణ మన్ని నష్టములకున్ భద్రమ్ము దుర్యోధనా!