కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అరిషడ్వర్గమ్ము హితము నందించు సదా"
లేదా...
"అరిషడ్వర్గము మానవాళికి హితం బందించు నెల్లప్పుడున్"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అరిషడ్వర్గమ్ము హితము నందించు సదా"
లేదా...
"అరిషడ్వర్గము మానవాళికి హితం బందించు నెల్లప్పుడున్"
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమరులుగొనక నహమించక
మురినులిమి కసివిడి లోభమోహ మడచుచున్
పెరిమను గూడుచు నుండగ
అరిషడ్వర్గమ్ము హితము నందించు సదా!
క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండివిరలిన్ తక్కువ జేయుచున్ పగటు నావేశాది గర్వోన్నతిన్
వరుసన్ మానుచు మోహలోభములు సంప్రస్థానమున్ పొందకున్
హరిపై చిత్తము నిల్పుచున్ గొలువ మాయాదేహ చింతల్ జనెన్
అరిషడ్వర్గము మానవాళికి హితంబందించు నెల్లప్పుడున్ .
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మరణించు దనుక దుర్విధి
రిప్లయితొలగించండిసిరిసంపదలను గడించి చెలగుట కంటెన్
ధరణీతలమున వీతపు
నరిషడ్వర్గమ్ము హితము నందించు సదా
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండినరుల కహితము తెలుసుకొను
నరిషడ్వర్గమ్ము, హితము నందించు సదా
హరినామ జపతపంబులు,
శరణా గతిమార్గమౌను శంకరుని గనన్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తెలుసుకొను। మరిషడ్వర్గమ్ము...' అనండి.
నెర నెన్నాళ్ళుగ యుద్ధముల్ జగతినిన్నేపారె కామాదులున్
రిప్లయితొలగించండిసరి నొక్కొక్కటి సాధనన్ మడిసినన్ శాంతిప్రభల్ మించు నీ
పరమార్థంబు వసింపగా నరిచయంబాలంబనంబాయె నా
అరిషడ్వర్గము మానవాళికి హితం బందించు నెల్లప్పుడున్
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బరిదెగి కామాదులతో
రిప్లయితొలగించండిజరిగిన కాళింగ సమర జాడలుగని యా
పరమార్థ మరసె శాంతిని
అరిషడ్వర్గమ్ము హితము నందించు సదా
పిట్టా వారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
కరమౌ కోరిక లుద్భవించి హృదిలో కాలుష్యమున్ పెంచెడిన్
రిప్లయితొలగించండినిరతమ్మున్ నిజ మానసమ్ముసరియౌ నిష్టన్ నియంత్రించకన్
మరణమ్మొందుట తథ్యమౌనుగద యిమ్మహిన్ సదా వీతపు
న్నరిషడ్వర్గము మానవాళికిహితంబందించు నెల్లప్పుడున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
దురవస్థలపాల్జేయును
రిప్లయితొలగించండిఅరిషడ్వర్గమ్ము, హితము నందించు సదా
హరినామమంత్రమొక్కటె
పరిరక్షించుచుజనులకు భద్రములనిడున్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చేయును అరి' అని విసంధిగా వ్రాశారు. 'పాల్జేయదె యరిషడ్వర్గమ్ము...' అందామా?
ధరపై వెతలిచ్చును గద
రిప్లయితొలగించండినరిషడ్వర్గమ్ము, హితమునందించుగదా
పరుల కొనర్చెడి సేవలు
వరములుగా ఫలములొసగు భవ్యంబవగన్!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గద యరిషడ్వర్గమ్ము' అనండి. అలాగే 'భవ్యం బగుచున్' అనండి.
నా రెండవ పూరణము:
రిప్లయితొలగించండిఅరయన్ మానవ సంఘమందు నివియే యౌన్నత్యమున్ బాపుగా
నరిషడ్వర్గము, మానవాళికి హితంబందించు నెల్లప్పుడున్
పరిసేవన్ దగజేయ దోచునిట ప్రాభాత ప్రభాహేలలా
దరిచేరంగను సాగుమింక నిట నీదౌ మార్గమున్నెంచుకన్!
శర్మ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
పరమానందము, స్వార్థహీనత, సుహృద్భావంబు, సంతృప్తియుం
రిప్లయితొలగించండిబరసేవాగుణ, మీశ్వరార్చనము, సద్వాక్యాను లాపంబులన్
స్థిరతం బూనుచు నంతరంగమును స్వాధీనంబుగా నుంచ నా
యరిషడ్వర్గము మానవాళికి హితం బందించు నెల్లప్పుడున్.
హ.వేం.స.నా.మూర్తి.
పరహితము సాధుశీలము
రిప్లయితొలగించండిసురుచిర వాక్యానువృత్తి శుభకామనయున్
దరహాసము శాంతియు కా
వరిషడ్వర్గమ్ము హితము నందించు సదా.
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
హరియించును సంపదలను
రిప్లయితొలగించండిన రి షడ్వర్గమ్ము ,హితము నందించు సదా
యిరవౌ సజ్జన పొత్తులు
తరతరముల వరకు నెపుడు దధ్యముఁ భువినిన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సజ్జన పొత్తు' అనడం దుష్ట సమాసం. 'సజ్జన సఖ్యము' అనండి.
ధరణిన్ పరిణతిఁ జెందిన
రిప్లయితొలగించండిసరళత్వమె సత్వ గుణము స్వాంతన నీయున్
దరిజేరనీయ బోవకు
మరిషడ్వర్గమ్ము హితము నందించు సదా
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
{ T . V . లో ప్రసార మయిన నా పూరణను
చిరుమార్పులు చేసి మీకు ప౦పిస్తున్నాను }
…………………………………………………………
స్థిరమే స౦పద లెల్లయున్ ? పరజన
……………… శ్రేయ౦బు కా౦క్షి౦చుమా |
పరివర్జి౦పక యున్న , నీ బ్రతుకు
…………… విధ్వస్త౦బు గావి౦చు - నా
యరిషడ్వర్గము | మానవాళికి హిత౦
…………………… బ౦ది౦చు నెల్లప్పుడు
న్నరయన్ గీ త | సమస్త వేదముల
……………… సారా౦శ౦ బదే మిత్రమా !
్
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదరహాసమాన వదనాం
తొలగించండిబురుహా రుచి భాసమాన పుణ్యతర శుభం
కర చిత్త సత్కృ తాపహృ
దరిషడ్వర్గమ్ము హితము నందించు సదా
తరుణం బియ్యది శాంతి కాములకు వే తర్కింప సౌఖ్యార్థులై
ధరణీ వాసుల నెల్ల నేచు కర మంతశ్శత్రు వర్గంబు భీ
కర బాహ్యాగత శత్రు సంచయమునే కాదిద్ధరన్ గెల్చిన
న్నరిషడ్వర్గము మానవాళికి హితం బందించు నెల్లప్పుడున్
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు సర్వశ్రేష్ఠంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.ధన్యవాదములు.
తొలగించండిహరి పాదాబ్జ నిరంతరార్చనము , విశ్వాత్మైక సంబద్ధ సు..
రిప్లయితొలగించండిస్వర సంగీత కళావినోదమును ,దాస్యాలాపనమ్ముల్ , సదా
వరగాథాశ్రవణమ్ము , వందనములున్ పాటించుచో భక్తి మ...
ధ్వరి షడ్వర్గము మానవాళికి హితంబందించునెల్లప్పుడున్ !!
మైలవరపు మురళకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణం ఉత్తమంగా ఉంది. అభినందనలు.
ధరణిన్ సర్వులు వాని మాయబడి సంతాపంబునందెంగదా
రిప్లయితొలగించండిస్థిరచిత్తంబును గోలుపోయి పలు సంక్షేమాలు దుస్సాధ్యమై
యరయన్ దివ్య తపోధనాఢ్యులయి మోహంబెల్ల దావీడిన
న్నరిషడ్వర్గము మానవాళికి హితంబందించు నెల్లప్పుడున్.
ధరణిని గీడుంగూర్చును
నరిషడ్వర్గమ్మ, హితమునందించు సదా
దరిజేరకుండ జేయగ
పరమార్థంబెల్ల కలిగి భవ్యతగూర్చున్.
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
అరయన్ గీడును జేయునే నిలను బాహాటమ్ముగా నెప్పుడున్
రిప్లయితొలగించండిఅరిష డ్వర్గము మానవాళికి ,హితంబందించు నెల్లప్పుడు
న్నిరవౌ సజ్జన సాహితీ పరులు తారే బో ధనల్జే యుచు
న్నరి షడ్వర్గము గూరి చి న్మిగుల నాహ్లాదంబు గల్గ న్దగ న్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిస్థిరచిత్తముతో,గెల్వగ
నరిషడ్వర్గమ్ము,హితము నందించు సదా
సిరి సంపద శాంతులతో
మురియుచు లోకస్థులెల్ల మోదము జెందన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కరుణా పూరిత మంతరించి తగు సంకల్పంబు మాన్పించులే
రిప్లయితొలగించండిఅరిషడ్వర్గము | “మానవాళికి హితంబందించు నెల్లప్పుడున్
పరసేవా సహవాస భావనల సంబంధంబు సాధించుటే
హరికిన్ జేసెడి పూజలౌనుగద|నాహ్లాదంబుమీకందుగా”.
2.పరుషము నింపెడి పనులే
అరిషడ్వర్గమ్ము|”హితమునందించు సదా
గురుసేవా బంధమ్మే
స్థిరమని విద్యార్థివైన?సిరిసంపదలే|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గురువు గారికి నమస్కారములు మా అమ్మాయి పెండ్లి వుండడంతో పనుల భారం వలన చాలా రోజులుగా బ్లాగుకు దూరంగా వున్నాను. తిరిగి ఈరోజు నుండి పునఃప్రవేశమొందాను మీ ఆశీస్సులనందించ మనవి
రిప్లయితొలగించండిపరువపు వికార చేష్టల
దరిజేరక నిగ్రహమున తాను చరింపన్
నరుని దృఢచిత్తమె గెలుచు
నరిషడ్వర్గమ్ము, హితము నందించు సదా
తరుణావస్థయె గోరు భోగములకే తా లొంగకన్ ధర్మ మార్గమ్మునన్
చరియింపన్ దృఢచిత్తమున్ గల్గినన్ సంస్కారిగా దిద్దితీర్చున్ సదా
హరి నామ స్మరణమ్ముతోడ నరి సంహారమ్ము గావించ గా గెల్వగ
న్నరిషడ్వర్గము, మానవాళికి హితం బందించు నెల్లప్పుడున్"
విరించి గారూ,
రిప్లయితొలగించండిమీ అమ్మాయి పెళ్ళికి రావాలని నెలల క్రితం అనుకున్నాను. కాని రాలేని పరిస్థితి వచ్చింది.
నూతన దంపతులకు నా శుభాశీస్సులు!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మత్తేభం మూడు పాదాలలో గణదోషం. సవరించండి.
విరించి గారూ అభినందనలు. నూతన దంపతులకు నా శుభాశీస్సులు అందించండి.
తొలగించండిమీ పద్యమునకు నా సవరణ:
తొలగించండితరుణావస్థయె గోరు భోగముల వ్రేతన్ ధర్మ మార్గమ్మునం
జరియింపన్ దృఢచిత్తభావమన సంస్కారమ్ము జూపింపగన్
హరి నామస్మరణమ్ము తోడ నరి సంహారమ్మునంగెల్వగ
న్నరిషడ్వర్గము, మానవాళికి హితం బందించు నెల్లప్పుడున్"
గురువు గారికి కామేశ్వరరావు గారికి ధన్యవాదములు
తొలగించండిఇంకనూ పరిపూర్తిగా పెండ్లి పని ఒత్తిడి తగ్గకపోవడం చేత ఏకాగ్రతా లుప్తఫలితమనుకుంటాను......సవరించిన కామేశ్వరరావు గారికీ ప్రత్యేక ధన్యవాదములు.
కామేశ్వరరావు గారూ,
తొలగించండిధన్యవాదాలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిశుభాకాంక్షలు
రిప్లయితొలగించండిచాలా సంతోషం గాఉంది విరించి గారు .అమ్మాయిని అల్లుడిగారినీ [నూతన దంపతులను + మీ దంపతులను ] ఆశీర్వదించి సోదరి.
విరించి గారు...నూతన దంపతులకు నా ఆశీస్సులు,శుభాకాంక్షలు అందించ వలసినదిగా కోరుచున్నాను.
రిప్లయితొలగించండిధరలో జయింప మేలగు
రిప్లయితొలగించండినరిషడ్వర్గము,హితము నందించు గదా
కరుణాకరుని సునామ
స్మరణంబొనగూర్చుచుండు మహిలో ప్రజకున్
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
టైపాటు వల్ల వర్గమ్ము.. వర్గము అయింది.
స్థిర బుద్ధిన్ నరుడీ జగమ్మున సదా సేమంబునే గోరుచో
రిప్లయితొలగించండిపరమోత్కృష్ట పదంబు నొందగలుగున్ వర్జింపగా నిత్యము
న్నరిషడ్వర్గము; మానవాళికి హితం బందించు నెల్లప్పుడున్
కరుణా వీక్షణముల్ కృపన్ బరుపు నా కంసారి యశ్రాంతమున్
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
(నిన్న ఎందుకో మీ పూరణ నా దృష్టికి రాలేదు. మన్నించండి!)
పరమార్ధమె ధ్యేయముగా
రిప్లయితొలగించండిధరణిన్ వర్తించుటెంతొ ధర్మంబగునే
దరిజేేర నీయకుండిన
నరిషడ్వర్గమ్ము హితము నందించు సదా !
పిన్నక నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దుఃఖాలకు మూలమైన అరిషడ్వర్గాలు
రిప్లయితొలగించండి1.కామము: ఇది కావాలి అది కావాలి అని తాపత్రయ పడటం,అవసరాలకు మించిన కోరికలు కలిగి ఉండడం
2. క్రోధము : కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుచు ,తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉద్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము.
3.లోభము: కోరికతో తాను సంపాదించుకున్నది ,పొందినది తనకే కావాలని పూచిక పుల్లకూడా అందులోనుండి ఇతరులకు చెందకూడదని దానములు,ధర్మకార్యములు చేయకపోవడము.
4.మోహము : తానూ కోరినది ఖచ్చితముగా తనకే కావాలని ,ఇతరులు పొంద కూడదని అతి వ్యామోహము కలిగి ఉండడము,తాను కోరినది ఇతరులు పొందితే భరించలేక పోవడము.
5.మదము:తాను కోరిన కోరికలన్నీ తీరుటవల్ల తన గొప్పతనమేనని గర్వపడుచూ మరిఎవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్కచేయకపోవడము.
6.మాత్సర్యం : తానూ కలిగిఉన్న సంపదలు ఇతరులకు ఉండకూడదని తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి ఉండడము.
ఈ అరిషడ్వర్గములు శరీరములో చేరి మంచితనాన్ని దొంగిలించి చెడు కర్మలను కలిగించడానికి కారకులగు చున్నారు.అరిషడ్వర్గా లనే ఈ ఆరుగురు దొంగలనుండి జాగ్రత్త వహించితే ముక్తికి మార్గము సులభమవుతుంది .
రామకృష్ణ గారూ,
తొలగించండిధన్యవాదాలు!
అరిషడ్వర్గము మానవాళికిలలో అత్యంత దుఃఖానికిన్
రిప్లయితొలగించండిఅరిషడ్వర్గము లారు మానవులకున్ ఆనంద మూలానికిన్
పరితాపానికి హేతువుల్ గనుక యీ ఆర్గున్ త ప్పింకొన్నచో
అరిషడ్వర్గము మానవాళికి హితం బందించు నెల్లప్పుడున్
రామకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దుఃఖానికిన్ అరి... మానవులకున్ ఆనంద... విసంధిగా వ్రాశారు. 'ఆర్గున్ తప్పింకొన్నచో'...?
గురువుగారు నమస్కారములు పద్యం టైపు చేసి save చేసేలోగా సిష్టం స్లో అయ్యి అక్షరాలు మిస్ అవుతున్నాయి గమనించేలోపు ప్రచురణ అవుతోంది
తొలగించండిగురువుగారు నమస్కారములు పద్యం టైపు చేసి save చేసేలోగా సిష్టం స్లో అయ్యి అక్షరాలు మిస్ అవుతున్నాయి గమనించేలోపు ప్రచురణ అవుతోంది
తొలగించండి
రిప్లయితొలగించండిహరిపాదాంబుజములపై
నిరతము దృష్టి నియమించు నిష్ఠాత్ములకున్
దురితంబులఘములు మరియు
నరిషడ్వర్గమ్ము,హితము నందించు సదా"
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కరివరదుడు మొరవిని ఘన
రిప్లయితొలగించండిదురితములన్నితరిమేయు దూరంబులకున్
నరులు నిలిచి తెగనరికిన
అరిషడ్వర్గమ్ము,,హితమునందించు సదా!
చేపూరి శ్రీరామారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తరిమేయు' అనడం దోషం. 'దురితములన్ దరిమివేయు...' అనండి.
నిరతము నితరము దలచక
రిప్లయితొలగించండిసరిగా సారసనయనుని సరసిజ పదమొ
ప్పి రమింప, హరియె దా ద్రుం
చరిషడ్వర్గమ్ము, హితము నందించు సదా!
సుమలత గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హర్తృత్వమ్ము వహించి రాత్రియెడ నాహా వెల్గులన్ జిమ్మె నా
రిప్లయితొలగించండిమార్తాండుడుదయాద్రి, గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలమ్మునన్
స్ఫూర్తిన్ నింపియు జీవకొటికి నికన్ సోముండు రాజూడగన్
కర్తవ్యమ్మును దీర్చి సృష్టి విధులన్ కాపాడు మార్తాండుడున్
ధనికొండ రవిప్రసాద్ గారూ,
తొలగించండిఈ పూరణను పొరపాటున ఇక్కడ పోస్ట్ చేసినట్టున్నారు. ఈనాటి సమీక్షలో మీ పూరణను ప్రస్తావించాను.
శా.హరియించున్ మన మాన ప్రాణములనే ఆరైన ఆశత్రులే
రిప్లయితొలగించండిదరికిన్ జేరగ నీయకుండు ఘనులే తామెంత ధీశాలురో
పరిమార్చంగను లేవు ధీరులనిలన్ పగ్గమ్ములే వేయుచో
అరిషడ్వర్గము మానవాళికి హితం బందించు నెల్లప్పుడున్
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమిత్ షా ఉవాచ:👇
రిప్లయితొలగించండిమరువన్ జాలని చంద్రులిద్దరును మా మాయావతిన్ తోడుగా
సరిలే నిర్వురు యాదవుల్ మమతతో సంధాన మౌచుండగా
పరమోత్సాహము తోడుతన్ మురిసి మాపార్టీ జయించంగ నీ
యరిషడ్వర్గము;..మానవాళికి హితం బందించు నెల్లప్పుడున్