6, ఆగస్టు 2016, శనివారం

సమస్య - 2107 (వరుణదేవుఁడు కరుణించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

వరుణదేవుఁడు కరుణించెఁ గరువు వచ్చె.
లేదా...
వానదేవుఁడు చూపఁగా దయ వచ్చెఁ గాటక మెల్లడన్.

77 కామెంట్‌లు:

  1. వసుధ పులకించి తరియించె వరమ టంచు
    వరుణ దేవుఁడు కరుణించెఁ ,గరువు వచ్చె
    నధిక వర్షము గురియంగ నదుపు దప్పి
    పంట చేలన్ని మునిగిన వింట రాక

    రిప్లయితొలగించండి
  2. కానలోపలి తక్షకుండును కావ నింద్రుడె యుండగన్
    కాననంబది ఖాండవంబును కాల్చశక్యమె యగ్నికిన్
    కాన క్రీడికి వాని జోడికి కార్ముకమ్ములు కోరగన్
    వానదేవుఁడు చూపఁగా దయ వచ్చెఁ గాటక మెల్లడన్!!

    (వానదేవుఁడు అగ్ని కోరికపై దయతో ఖాండవ దహనములో కృష్ణార్జునులకు ఆయుధములివ్వగా, అగ్ని దహించగా ఇక ఆ ప్రాంతమెల్లడన్ కాటకము వచ్చెనని భావము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిగురు సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తాక్షకాహిని' అంటే అన్వయం బాగుంటుందేమో?

      తొలగించండి
  3. శ్రీగురుభ్యోనమః

    చేను పండదు,గొంతులెండెను చిత్తగింపుము మా మొరల్
    కాననైతిమి నీటి జాడలు కమ్మనౌ జల మీయడే
    వానదేవుఁడు, చూపఁగా దయ వచ్చెఁ గాటక మెల్లడన్
    మానసంబున ధైర్యమించుక మాకొసంగుము మారుతీ
    వానరోత్తమ వాయునందన వందనంబుల జేయుదున్

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సేద్యమున నీళ్లు దొరకక సేదగొనిన
      పల్లెటూల్ల నెల్ల వదిలి పట్టణమున
      వరుణదేవుఁడు కరుణించెఁ, గరువు వచ్చె
      నధిక వర్షము నిచటనూ, నచట గూడ!

      తొలగించండి
    2. పాణితోడను నాటు నెప్పుడు ప్రాణదేవత మొక్కలన్
      మానవత్వము జూపి వాయువు మక్కుడాపిన మెచ్చినన్
      వానదేవుఁడు చూపఁగా దయ, వచ్చెఁ గాటక మెల్లడన్
      కానరాదు, నిరాశ నిస్పృహ కళ్ళ ముంగిట లేనిచో
      మానవాళికి మెప్పుపొందిన మంచి రోజులు వచ్చెనన్

      తొలగించండి
    3. పొలిమేర మల్లేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ చివర 'ఇచటను' అంటే సరి! దీర్ఘం అవసరం లేదు.

      తొలగించండి


  5. వరుణదేవుఁడు కరుణించె, గరువు వచ్చె
    ననుకొనిన దినములు మారి నలరె పాడి
    పంటలు! జనులకు కలిగె పాటు పడిన
    కష్టములకు తగుఫలము గద జిలేబి !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మారి యలరె' అనండి.

      తొలగించండి
  6. ఎల్ల నదులింకె, సస్యంబు లెండిపోయె
    పసులకైనను గ్రాసంపు పరక లేని
    సరణి వర్ణించె వ్యంగ్యాన సరసు డొకడు
    వరుణదేవుడు కరుణించె గరువు వచ్చె.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
  7. కోర్కి కనుకూలమౌ వృష్టి కురిసి యపుడు
    సస్యముల వృద్ధి హర్షాన జరుగుచుండ
    ధరణి కంపించె, కృములన్ని దాడిచేసె
    వరుణదేవుడు కరుణించె, కరువు వచ్చె.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. కానరాదొక మేఘమైనను కష్టకాలము వచ్చెరా
    చేనులన్నియునెండిపోయెను చింతలే మిగిలేనురా
    దీనమీస్థితి కష్టముల్ కడదీర్చగాతను రాడికన్
    వానదేవుఁడు చూపఁగా దయ - వచ్చెఁ గాటక మెల్లడన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. కాననయ్యె సమాజమందున కన్నుగానని స్వార్థముల్
    మానుచుండిరి యాత్మధర్మము మానవాళి, ధరిత్రియున్
    దానిచేత వికాసహీనత దాల్చె, యాగ్రహ మిప్పుడా
    వానదేవుడు చూప గాదయ, వచ్చె గాటక మెల్లెడన్.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
      '...దాల్చె నాగ్రహ...' అనండి.

      తొలగించండి
    2. ఆర్యా!
      ధన్యవాదములు.
      కాననయ్యె సమాజమందున కన్నుగానని స్వార్థముల్
      మానుచుండిరి యాత్మధర్మము మానవాళి, ధరిత్రియున్
      దానిచేత వికాసహీనత దాల్చె, నాగ్రహ మిప్పుడా
      వానదేవుడు చూప గాదయ, వచ్చె గాటక మెల్లెడన్.

      తొలగించండి
  10. కుండ బోతగ వర్షాలు గురియు క తన
    వరుణ దేవుడు కరుణించె ,గరువువచ్చె
    వాన లనునవి పడకన భరణి యందు
    మొలవ దాయెను గడ్డియు ముఖ్య ముగను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగుంది.
      వానలు కురిసినందున వరుణదేవుడు కరుణించాడా? వరుణదేవుడు కరుణించినందున వానలు కురిసాయా? 'కుండపోతగ వర్షాలు గురియుటకును వానదేవుడు కరుణించె..' అంటే బాగుంటుందేమో? అలాగే 'పడకను వసుధయందు..' అనండి.

      తొలగించండి
    2. అన్నట్టు సుబ్బారావు గారూ,
      రేపు మియాపూర్‍కు వస్తున్నారా?

      తొలగించండి
  11. నిరుడు వర్షధారల తోడ నేల తడిసె
    వరుణదేవుడు కరుణించె;కరువు వచ్చె
    నేడు చూడంగ విత్తును నాట లేక
    నన్నదాతల గుండె లవిసె నవని యందు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరిపాదంలో గణదోషం. '..లేక। యన్నదాత గుండె లవిసె..' అనండి.

      తొలగించండి
  12. వానల కురిపించె, ప్రజల వాంఛ దీర్చి
    వరుణ దేవుడు కరుణించె! గరువు వచ్చె
    నిపుడు క్షామపు మాటున నిధులను దిన
    దలచిన యధికారులకు, నేతలకు నౌర!

    రిప్లయితొలగించండి
  13. సంతు లేదని యొక యింతి వంతఁ జెంది
    పంతమూని పూజించె దిక్పాలకులను
    సంతసంబున వేగ సుదంతి నంత
    వరుణదేవుఁడు కరుణించెఁ, గరువు వచ్చె.
    [కరువు=గర్భము]

    మత్తకోకిల:
    వే నశించెను బంటలన్నియు వెల్లువాయెనె యప్పులున్
    వాని దీర్పగ దారి లేకను బంటభూముల నమ్మగం
    గోనకోనల నీరు నిండగ ఘోరమయ్యెను, మెండుగన్
    వానదేవుఁడు చూపఁగా దయ, వచ్చెఁ గాటక మెల్లడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  14. ఆతపము సహియింపక నార్తి నొంద
    నల్ప పీడన మేర్పడె నధిక వర్ష
    పాతమున వరదలు వచ్చె,బాపుటకును
    వరుణదేవుడు కరుణించె గరువు వచ్చె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { పోయిన యేడు వాన లేక గి౦జ కూడ ప౦డ లేదు . ఈ యేడు ధాన్యము తూ చెడు కాటకముతో " కా టా " తో త్రాసుతో వణిజులు గ్రామమన చేరిరి }
    …………………………………………………………


    వానదేవుడు రాడయెన్ - గతవత్సరమ్మున

    ................ బొత్తి గా |

    కానిపి౦చదు గి౦జ యైనను గ్రామ మ౦దున |
    ...................... నేడికన్

    వాన దేవుడు చూడగా దయ , వచ్చె c

    ........... గా ట క || మెల్లెడన్

    తూ నుచన్ - ఫల ధాన్య మె౦తయు

    ............... తోషమ౦దిరి వర్తకుల్

    { రాడయె = రాడాయె ; నేడిక = ఈ యేడు ; కాటకము = కాటా , ధాన్యము తూ చెడు నొక పెద్ద త్రా సు ;
    వచ్చె c గాటకము = గ్రామము లోనికి కాటా
    వచ్చినది ; తూ నుచు = తూ న్చు ; తూ నుచన్ = తూ న్చన్ = తూ కము వేయ ; ఫలము = చేనులో ప౦డిన ప౦ట ; }
    .ె ె

    రిప్లయితొలగించండి
  16. వానలన్ కురిపించ నెంచుచు వారిదమ్ముకు మార్గమున్
    వాన దేవుడు చూపగా దయ వచ్చె! గాటక మెల్లడన్
    కాన రాదని బాధనొందిరి క్షామమడ్డుగ నుంచగన్
    బూని సొమ్ముల చేసుకో దలబోసినట్టి నరాధముల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వారిదమ్మునకు... అనాలి.

      తొలగించండి
  17. ప్రాణవాయువునందజేసెడు పాదపమ్ములు గూల్చగన్
    మానవాళికి మంచి జేసెడు మబ్బులెట్టుల క్రమ్మునో
    కాన లన్నియు గొట్టివేయక ఖచ్చితమ్ముగ బెంచినన్
    వానదేవుడు చూపగాదయ, వచ్చె గాటక మెల్లెడన్
    కానిపించక పారిపోవును గ్రామ సీమల నందునన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సీమల యందునన్... అనండి.

      తొలగించండి
  18. కాటకమ్మని వెరచుచున్ మేటి గాను
    జపతపమ్ములు జరుపగన్ జనులు నిరుడు
    వరుణదేవుడు కరుణించె, గరువు వచ్చె
    నిపుడు తల్లడిల్లిరి జనుల్ నీళ్ళు లేక

    చేనులందున పంటలెండవు చెమ్మయారదు ధాత్రిపై
    మానసమ్ములు మోదమొందగ మానవాళికె పండుగౌ
    వానదేవుడు చూపగాదయ, వచ్చె కాటక మెల్లెడన్ 
    కానలన్నియు గొట్టివేయుచు గల్మషమ్మును పెంచగన్ 

    నిన్నటిసమస్య

    "సత్య మింక కవనము నిస్సత్త్వ మయ్య"

    లేదా...
    "కవనం బయ్యెను లుప్తసత్త్వ మది శ్లాఘ్యంబౌట బొంకే సుమా"

    నా పూరణలు

    తెలుగు భాష కాంగ్లమనెడు తెగులు సోకి
    కోటి కైతల తల్లియై కువలయమున
    మిన్నయై వెలుగెడు భాష సున్న యగుట
    సత్యమింక కవనము నిస్సత్త్వ మయ్య

    అవమానించిరిమాతృభాషనిలలో నాంగ్లమ్ముపై మోజుతో
    డవకాశమె మృగ్యమయ్యెను సుమీ యభ్యాసమే లేక, పా
    టవమౌ కావ్యములెన్నియో కనిన శ్రేష్ఠమ్మైన నా భాషయే
    శవమైపోయెను వాస్తవమ్మెఱగుమా ఛందో విధిన్ 
    కవనంబయ్యెను లుప్తసత్త్వమది శ్లాఘంబౌట బొంకేసుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ అన్ని పూరణలు బాగున్నవి. అభినందనలు.
      చివరి పద్యం మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  19. పైరు లెండెడిసమయాన పంటకొరకు
    వరుణ దేవుడు కరుణించె|గరువు వచ్చె
    దాచిధరలను బెంచ?నధర్మ పరులు
    కష్టజీవుల నష్టాలె యిష్టమనుచు|
    2.మానవాళికి మంచిగూర్చగ మార్పుకూర్పుల నేర్పునన్
    వానదేవుడు చూపగా దయ?వచ్చె గాటక మెల్లడన్
    హానిజేసెడి కల్తివిత్తులు నాశగా గొని వేయగా
    దానవత్వపు చీడలన్నియు దాడి జేయగపంటకున్|.

    రిప్లయితొలగించండి
  20. మాదు పూర్వంంపు పుణ్యాన మనసుకరిగి
    వరుణదేవుడు కరుణింంచె, గరవువచ్చె
    వారి దయలేక కర్నూలు ప్రాంంతమంంత
    బీట వారుచు పంంటలు చేటునంందె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సున్నాలు రెండు రెండు ఎందుకు టైపౌతున్నాయి?

      తొలగించండి
    2. శంకరయ్య గారికి నమస్సులు. నా సెల్ ఫోన్ నుండి టైప్(స్వరచక్ర ద్వారా) చేస్తే ఎందుకో అలానే రెండు సున్నాలు వస్తున్నవి. అదే టాబ్ నుండి చేస్తే రావటంలేదు.టాబ్ నుండి వీలు కాకపోతే సగల్ నుండి పంపుతున్నాను.

      తొలగించండి
    3. శంకరయ్య గారికి నమస్సులు. నా సెల్ ఫోన్ నుండి టైప్(స్వరచక్ర ద్వారా) చేస్తే ఎందుకో అలానే రెండు సున్నాలు వస్తున్నవి. అదే టాబ్ నుండి చేస్తే రావటంలేదు.టాబ్ నుండి వీలు కాకపోతే సగల్ నుండి పంపుతున్నాను.

      తొలగించండి
  21. గురువు గారికి వందనములు. ' వారిదమ్ముకు మార్గమున్ ' బదులుగా 'వారిదమ్మునకున్ గతిన్ ' అన వచ్చా తెలుప గోరుతాను. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  22. దీనులెల్లరుఁ దల్చి నట్టుల దిక్కుమాలిన కోపమున్
    వానదేవుఁడు చూపఁ గాదయ వచ్చెఁ గాటక మెల్లడన్!
    కానలందున చెట్లు చేమలఁ గాల్చి బొగ్గుల నమ్ముచున్
    'చైన' కంపగ చందనమ్మును సంపదందగఁ గొట్టగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. మిత్రులందఱకు నమస్సులు!

    [దానవ దౌష్ట్యముల నోర్వఁజాలక దేవతలు విష్ణుదేవునిం బ్రార్థింపఁగా, నా దేవదేవుఁడు వర్షముల నాపి, పంట లెండున ట్లొనర్చి, కరువు కాటకములు కలిగించి, రాక్షసులను శక్తిహీనులనుఁగాఁ జేసి, దేవతలఁ గాఁచిన విధము నిట ననుసంధానించుకొనునది]

    దానవుల్ దమ శక్తియుక్తుల దైవహానినిఁ జేయఁగన్;
    వేనవేలుగ దౌష్ట్యముల్ గని, వేల్పు లా హరిఁ జేరియున్,
    దానవోద్ధత మాన్పఁ గోరఁగఁ, దత్క్షణమ్మున నాపియున్

    వాన, దేవుఁడు చూపఁగా దయ, వచ్చెఁ గాటక మెల్లెడన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  24. వరుణ దేవుడు కరుణించె, గరువు వచ్చె
    ననుట చెల్లదు సకలవనాళి చివురు
    లెత్తి పులకరించె, హరిత లీలలిలను
    వెలిసి హాసమొనర్చెను వృక్షజాతి

    రిప్లయితొలగించండి

  25. వరుణ దేవుడు కరుణించె, కరువు వచ్చె
    డి, దినములుకానరావని మదినిదలచి
    రైతు లందరు పొలములన్ లక్షణముగ
    సాగు జేసిరి యెంతెంతొ సంబరమునౌ

    రిప్లయితొలగించండి
  26. రిప్లయిలు
    1. శ్రీనివాసాచార్య గారూ,
      ఎందుకో ఆరోజు మీ పూరణను సమీక్షించడం తప్పిపోయింది. మన్నించండి.
      మీ పూరణ అన్ని విధాల (భావం, లక్షణం) బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  27. వానలన్ కురిపించి ధాత్రికి వారి నిచ్చున దేరయా?
    వానదేవుడు నేమి చేసిన వాన లౌనయ ధాత్రికిన్?
    వానదేవుడు కోపగించిన ప్రాణసంకట మెట్లయెన్?
    వానదేవుడు, చూపగా దయ, వచ్చె గాటక మెల్లెడన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  28. వాన దేవుడు జూపగా దయ వచ్చె , కాటక మెల్లెడన్
    ఆనవాలిసుమంత లేదిక నంతమాయెను నేలపై,
    వాన మిక్కిలి నిండె వాగులు వంక లన్నియు నీటిచే
    మానవాళికి మోదమాయెను మంచి వర్షము గాంచగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  29. పంటలన్ని పుష్కలముగ పండు నట్లు

    కురియ వర్షము దేశానికొక్క దెసను

    వరుణ దేవుడు కరుణించె ; గరువు వచ్చె

    వేరొక దెసను వర్షముల్ వెనుక బడగ

    చిత్రమౌ గద దేవుని చేతలౌర !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
      విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  30. కరువు కాటకలముకల్గి జనులు వాన
    కొరకు చూచు కర్ష క జణాళినికరుణించె
    వరుణ దేవుని కరుణఅధికమైపాడయ్యె చేలు
    వరుణదేవుఁడు కరుణించెఁ గరువు వచ్చె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వద్దూరి రామకృష్ణ గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ ప్రయత్నం ప్రశంసనీయం. మీ పద్యంలో గణ యతి దోషాలున్నవి. మీ పద్యానికి నా సవరణ...

      కరువు కాటకముల బాధ కలుగ వాన
      కొరకు చూచు కర్షకులపై కరుణ చూపె
      వాన లధికమై చేనులు పాడుబడెను
      వరుణదేవుఁడు కరుణించెఁ గరువు వచ్చె.

      తొలగించండి
    2. రామకృష్ణ గారూ,
      నిరుత్సాహ పడకండి. ప్రారంభంలో ఇలాంటి దోషాలు సహజమే. మీ పద్యరచనను కొనసాగించండి.

      తొలగించండి
    3. గురువు గారికి నమస్కారములు కవిగా కవితలు వ్రాయాలంటే పూర్వజన్మ సుకృతం కావాలి నేను పండిత కుటుంబలో జన్మించాను మా తండ్రిగారు,మా అన్నలు కూడా కవిపండితులే కాని నాకు కవిత్వం అబ్బలేదు మీ శంకరాభరణం బ్లాగు ద్వారా నాప్రయత్నం కొనసాగిస్తున్నాను మీ పర్యవేక్షణలో తినగ తినగ వేము తియ్యనై నట్లు మీ పర్యవేక్షణలో వ్రాయగా వ్రాయగా గణదోషం,యతి దోషాలు,అవే సర్డుబాటుగా అలవోకగా పద్యం నడక సాగుతుంది మీ అభిమానానికి కృతజ్ఞతలు -నమస్కారములతో రామకృష్ణ

      తొలగించండి
  31. వాన దేవుని గోరి కడవలవారి గప్పను దడ్పగన్
    బాననున్ రోల్నింపుధారలు బహుగ మింటికి మంటికిన్
    మీన కర్కట కార్తులా యివి‌. మిన్న గుర్సినవృష్టితో్న్
    వానదేవుడు కరుణ జూపగ వచ్చె కాటక మెల్లెడన్ఠ

    రిప్లయితొలగించండి
  32. యేటికేడెదుర్జూచితి మిప్పటేడు
    యాగమొనరించ కను విప్పుయోగ మబ్బె
    పూడికలుదీయు పుణ్యము బూది పాలు
    బొక్కసాన్నవినీతియే బుగ్గి జేసె

    చెరువు కుంటల గండ్లతో చేటుమూడె
    వరుణ దేవుడు కరుణించె గరువు వచ్చె.

    రిప్లయితొలగించండి
  33. అవినీతిని ఆపకుంటే జరుగబోయే వైనమును తెలుప గోరి కరువు బెదురు చూపడమే ఉద్దేశ్యం.సుభిక్షం కోరడమే సుమండీ. పి.స.నా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  34. ఏడవ ఆగష్టు Friendship Day శుభాకాంక్షలు మన సాహితీ సహచర బృందానికి అందజేయ గలరని...
    పి.‌స.నా విన్నపం

    రిప్లయితొలగించండి
  35. ఏడవ ఆగష్టు Friendship Day శుభాకాంక్షలు మన సాహితీ సహచర బృందానికి అందజేయ గలరని...
    పి.‌స.నా విన్నపం

    రిప్లయితొలగించండి
  36. అవినీతిని ఆపకుంటే జరుగబోయే వైనమును తెలుప గోరి కరువు బెదురు చూపడమే ఉద్దేశ్యం.సుభిక్షం కోరడమే సుమండీ. పి.స.నా

    రిప్లయితొలగించండి
  37. యేటికేడెదుర్జూచితి మిప్పటేడు
    యాగమొనరించ కను విప్పుయోగ మబ్బె
    పూడికలుదీయు పుణ్యము బూది పాలు
    బొక్కసాన్నవినీతియే బుగ్గి జేసె

    చెరువు కుంటల గండ్లతో చేటుమూడె
    వరుణ దేవుడు కరుణించె గరువు వచ్చె.

    రిప్లయితొలగించండి
  38. వాన దేవుని గోరి కడవలవారి గప్పను దడ్పగన్
    బాననున్ రోల్నింపుధారలు బహుగ మింటికి మంటికిన్
    మీన కర్కట కార్తులా యివి‌. మిన్న గుర్సినవృష్టితో్న్
    వానదేవుడు కరుణ జూపగ వచ్చె కాటక మెల్లెడన్ఠ

    రిప్లయితొలగించండి