5, ఆగస్టు 2016, శుక్రవారం

సమస్య - 2106 (సత్య మింక కవనము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"సత్య మింక కవనము నిస్సత్త్వ మయ్య"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.
లేదా...
"కవనం బయ్యెను లుప్తసత్త్వ మది శ్లాఘ్యంబౌట బొంకే సుమా"

67 కామెంట్‌లు:


  1. సత్య మింకక, వనము నిస్సత్త్వ మయ్య !
    సత్య మింక కవనము! నిస్సత్త్వ మయ్య
    సత్య మింక కవనము నిస్సత్త్వ మయ్య !
    సత్యమిది తెలిపిరి కంది శంకరయ్య !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. నిస్సత్వమగు నసత్యము

      సత్య మింకక, వనము నిస్సత్త్వ మయ్య !
      సత్య మింక కవనము! నిస్సత్వమగు న
      సత్య మింక కవనము నిస్సత్త్వ మయ్య !
      సత్యమిది తెలిపిరి కంది శంకరయ్య !

      మొదటి వాక్యం లో వనము - సమూహము

      సత్యమింకక - సత్యము యింకక ( యింకుట - సత్యము స్థిరము కాకబోతే )

      జిలేబి

      తొలగించండి
    2. ఇంకక వనము, ఇంక వనము అన్న విభాగం ప్రశంసనీయం. కాని భావం సుబోధకంగా లేదు.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. బతుకు తెరువునకు తెలుగు భాష వదిలి
      భావ మెరుగక జనులకు భార మయ్యె,
      కవుల కాదరణ కరువై కలత చెందు
      సత్య మింక కవనము నిస్సత్త్వ మయ్య

      తొలగించండి
    2. పొలిమేర మల్లేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. తెలుగు భాషకు పట్టెను తెగులు మెండు
    వేద భాగము లన్నియు వాద మయ్యె
    సాప్టు వేరుకు బానిస షిప్టు లందు
    సత్య మింక కవనము నిస్సత్త్వ మయ్య

    రిప్లయితొలగించండి
  4. అవురా! యెంతటి దుస్థితుల్ గలిగె నీయాంధ్రావనిం జూడగా
    నవజాతంబగు బిడ్డకైన విధిగా నవ్వుల్, సమస్తార్థముల్
    స్తవనీయంబని యెంతు రాంగ్లఫణితిం దానింక నస్మాకమౌ
    కవనం బయ్యెను లుప్తసత్త్వ మది శ్లాఘ్యంబౌట బొంకే సుమా!
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
  5. విషయ సంక్రమణార్థంబు విస్తృతముగ
    పలురకంబుల నవ్యంపు పద్ధతులిల
    ననిశ మాకర్షణీయంబు లగుచునుండ
    సత్య మింక కవనము నిస్సత్త్వమయ్య
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. ఉపశమన మివ్వ జాలక, నుల్లములను
    దాకి యార్ద్రత నిడలేని దగునె కవిత?
    చేతనత్త్వము లేనట్టి వ్రాతలందు
    సత్యమింక, కవనము నిస్సత్త్వమయ్య!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '.. జాలక యుల్లములను' అనండి.

      తొలగించండి
  7. శ్రవణా నందము జేయుచున్ కవులు తాశ్రావ్యంబుగా పద్యముల్
    నవనీ తమ్మగు కావ్యముల్ మదిని యానందిం పగావ్రా సిన
    న్నవనిన్ జూడగ నాంగ్లభా షయన నానందం బుగాలీ నమౌ
    కవనం బయ్యెను లుప్తసత్త్వ మది శ్లాఘ్యంబౌట బొంకేసుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది.
      కొంత అన్వయలోపం ఉంది. తాను ద్రుతం లోపించి తా అవుతుంది. కానీ తాము... తా కాదు.

      తొలగించండి
  8. జవసత్త్వంబు నొసంగు మూలికల వృక్షవ్రాతలుప్తంబులై
    నవలావణ్యపు సోయగంబుల నదీనాట్యంబు లుప్తంబులై
    శ్రవణానందము జేయుపక్షుల కిలారవప్రశస్తంబు లే
    క, వనం బయ్యెను లుప్తసత్త్వ మది శ్లాఘ్యంబౌట బొంకే సుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ యీరోజు మీరేదో పరధ్యానములో వ్రాసినట్లున్నారు.
      "జవసత్త్వములు" ద్వంద్వ సమాసము బహువచనము కద.
      నాట్యంబు: ఏకవచనము; లుప్తంబులు:బహువచనము.
      "కిలారవప్ర" లో గణదోషము. "కిలారావప్ర" అనవచ్చు.
      "కిలకిల" ధ్వన్యనుకరణ పదము. "కిల" యని లుప్తమయిన యర్థభేదము.

      తొలగించండి
    2. మీ పద్యానికి నా సవరణ:

      జవసత్త్వంబు లొసంగు మూలికల వృక్షవ్రాతలుప్తంబునై
      నవ లావణ్యపు సోయగంబుల నదీనాట్యంబు లుప్తంబునై
      శ్రవణానందతరంగముల్ కిలకిలారావద్విపక్షాళి లే
      క, వనం బయ్యెను లుప్తసత్త్వ మది శ్లాఘ్యంబౌట బొంకే సుమా

      లావణ్యము, సోయగముల లో సూక్ష్మార్థ భేదమున్నదని యట్లే యుంచితిని.

      తొలగించండి
    3. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      వనంపై కవనం చెప్పి చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కామేశ్వర రావు గారి సూచనలను, సవరణలను గమనించండి

      తొలగించండి
  9. అతిశయోక్తి కొక హద్దు యవసరమ్ము
    చెఱువు కలదన్న గుంటైన దొరక వలయు
    కడలి పొంగినదన నట తడియులేని
    సత్య మింక కవనము నిస్సత్త్వమయ్య!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హద్దు+అవసరము' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. 'అతిశయోక్తికి నొక్క హ ద్దవసరమ్ము' అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
      అతిశయోక్తికి నొక్క హద్దవసరమ్ము
      చెఱువు కలదన్న గుంటైన దొరక వలయు
      కడలి పొంగినదన నట తడియులేని
      సత్య మింక కవనము నిస్సత్త్వమయ్య!

      తొలగించండి
  10. రిప్లయిలు
    1. నిత్య చేత నొసంగును నియమ మెరుగ
      సత్య, మింక కవనము, నిస్సత్త్వ మయ్య
      యో! తగినరీతి దానిని చేత గొనక
      వట్టి మాటల పెట్టును పట్టి జూడ!

      తొలగించండి
    2. శిష్ట్లా శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చేతన+ఒసగు' అన్నపుడు సంధి లేదు. 'నిత్య చేతన నొసగును నియమ మెరుగ' అనండి.

      తొలగించండి
  11. సత్య మింకక వనము నిస్సత్త్వ మయ్య
    కాదు గానెప్పటి కినది కమల !యరయ
    కవన మనునది యొకగొప్ప కళయ సుమ్ము
    సత్త్వ మే యది యట్లన సరియ కాదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కాదు కాదెప్పటికి నది..' అనండి.

      తొలగించండి
  12. రిప్లయిలు
    1. గణ సాధనక్రియా గమనులై నిస్సార పదముల నాశ్రయింపంగ నేల
      ధృతి వీడి త్వరపడి యతిసాధనార్థము మతిలేని మాటల పతన మేల
      ప్రాసప్రయాసలఁ బసలేని సుద్దుల ఘోరంపు భావమ్ము గూర్ప నేల
      కవనంపు నెపమున నవమాన ధోరణి వినయమ్ము విలువలు వీడ నేల
      భావ శుద్ధియ కరువైనఁ బద్య మేల
      వ్యర్థ పద సంకులమ్మున కర్థ మేమి
      చిత్త మలరింప నేర్వని వృత్త మేల
      సత్య మింక కవనము నిస్సత్త్వ మయ్య


      స్తవనీయాంశ విశేషభావ యుత శబ్దార్థప్రభా రాశినిన్
      సువిశాలాస్వనితప్రమోద భరసంశోభం గవిత్వమ్మునే
      యవమానింప విచక్షణా రహిత మోహావేశు లెట్లందురో
      కవనం బయ్యెను లుప్తసత్త్వ మది శ్లాఘ్యంబౌట బొంకే సుమా

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      కవిత్వం ఎలా ఉండరాదో చక్కగా వివరిస్తూ, కవిత్వ స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ మంచి పూరణలు చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  13. అవనీగర్భములోని వారినిధు లేహర్షంబు నందించలే
    కవి క్షీణించుచునుండె నౌర! సకలం బత్యుగ్రసంఖ్యాకులౌ
    బువివారింగని, వీరలేమొ నదులన్ పోకార్చుచున్నార లిం
    క వనంబయ్యెను లుప్తసత్త్వ మది శ్లాఘ్యంబౌట బొంకే సుమా.
    (వనము=నీరు)
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  14. గావు కేకలు కూతలే కవన మనుచు
    చక్కనైనట్టి సాహిత్య చంపకమ్ము
    పద్యమనినంత పలువురు పరుగు లిడగ
    సత్య మింక కవనము నిస్సత్త్వ మయ్య

    అవధానమ్మను తెల్గు సంపదయు నత్యాకర్షణీయంబులౌ
    కవనంబుల్గల గ్రంధ రాజములు వీకంజెంది మూలన్ బడన్
    నవ చైతన్య మనంగ రోత గలుగన్నారీతులౌ కూత లే
    కవనం బయ్యెను లుప్తసత్త్వ మది శ్లాఘ్యంబౌట బొంకే సుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.

      తొలగించండి
  15. భావగాంభీర్య నవరసాస్వాదనకిల
    నర్హమై,సార్థకంబయి హ్లాదమిచ్చు
    నట్టిదే సత్కవితయన,నన్యమైన
    సత్యమింక,కవనము నిస్సత్త్వమయ్య.

    సత్యధర్మార్థ సద్భక్తి సాధనంబు
    సవ్యమార్గాన దెలుపక సారహీన
    భావ పదజాలముంజేర్చి భవ్యమన-న
    సత్యమింక కవనము, నిస్సత్త్వమయ్య.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  16. కవనంబన్నది యద్భుతంపుకళ సత్కావ్యామృతంబున్ స్రవిం
    చు,వికాసంబదిపంచుచున్ రసము సుశ్లోకంబు గావింపదే!
    యవినాశంబగు కీర్తిసంపదలు భవ్యంబైనతత్త్వంబు,లే
    క,వనంబయ్యెను లుప్తసత్త్వమది శ్లాఘ్యంబౌట బొంకే సుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      వృత్తంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. సత్య వాక్యాలు సాకెడి నిత్యగురువు
    లాభమాశకు లోభత్వ లక్షణాలు
    గలిగి రచియించు కవనంబు నలుగుచుండ
    సత్యమింక కవనము నిస్సత్త్వమయ్యె|
    2.శ్రవణానందము నింపనట్టిదయి విశ్వాసంబు గోల్పోవగా
    భవితవ్యంబుకు బాధ్యతాయుతపుసంప్రాప్తంబుజేకూరునా?
    కవితాశక్తియు లేని కల్పనల నాకర్షించ శక్యంబటే?
    కవనంబయ్యును లుప్తసత్త్వమది శ్లాఘ్యంబౌట బొంకేసుమా|

    రిప్లయితొలగించండి
  18. చక్కనైన కావ్యంబులు చతికిలబడ
    గావు కేకల గీతాలె ఘనత నొంద
    పద్య రచనంబు లెల్లయు బడలి పోయె
    సత్యమింక కవనము నిస్సత్త్వ మయ్యె.

    రిప్లయితొలగించండి
  19. శ్రీగురుభ్యోనమః

    జవసత్వమ్ము లుడింగిపోయినవి భాషా జ్ఞానమే శూన్యమై
    కవితావేశములెట్లు కల్గునట సంకల్పంబు లేకుండగాన్
    యెవరేమన్నను మానరే మనసునన్ "E"విజ్ఞానమే నిల్వగా
    కవనం బయ్యెను లుప్తసత్త్వ మది శ్లాఘ్యంబౌట బొంకే సుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లేకుండగాన్+ఎవరు' అన్నపుడు యడాగమం రాదు. 'లేకుండగ। న్నెవరేమన్నను...' అందామా?

      తొలగించండి
    2. గురువుగారికి నమస్సులు. ధన్యవాదములు

      తొలగించండి
  20. ఆడలేక మద్దెల నోడు యన్న యటుల
    పద్యమున్ వ్రాయ లేనట్టి వనటు లెల్ల
    వ్యర్థ భావనములతోడ వాగుచుంద్ర
    సత్య, “మింక కవనము నిస్సత్త్వ మయ్యె”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. గురుదేవులకు నమస్సులు. కవిమిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణ గారి నిన్నటి పూరణ పరిశీలించ ప్రార్థన.
    శిరముల్ లక్షలు ఖండనంబయె కురుక్షేత్రమ్ములో పోరునన్
    కురురాజిచ్చట దున్నుటన్ వలననీక్షోణిన్ కురుక్షేత్రమం
    దురు పుణ్యస్థలమై విరాజితమునెంతోగొప్పదైనట్టి యీ
    మరుభూమిన్ లభియించుఁ గాదె విలసన్మాణిక్య రత్నావళుల్

    రిప్లయితొలగించండి
  22. శ్రవణానందము గల్గు రీతి రఘువంశంబంత కీర్తించుచున్
    నవనీతంబగు హృద్య కావ్యమును ధన్యత్వంబు దా పొందుచున్
    కవిరాజేంద్రుడు వ్రాయురీతి మరి శక్యంబౌన నేడీభువిన్
    కవనం బయ్యెను లుప్తసత్త్వ మది శ్లాఘ్యంబౌట బొంకే సుమా

    రిప్లయితొలగించండి

  23. జవరాలా నను వీడవెన్నడని యే సంకోచమున్ లేక నే
    కవితల్ వ్రాసితినెందరో పొగడ నే గర్వించితిన్ కాని న
    న్నవమానించితివీవు నా వలపు వద్దంచున్ ప్రియా యింక నా
    కవనం బయ్యెను లుప్తసత్త్వ మది శ్లాఘ్యంబౌట బొంకే సుమా
    ( ఈ రోజన్నా ఉత్తీర్ణత సాధించానా మాష్టారూ!)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ ప్రణయకవితా ధోరణిలోనే చక్కని పూరణ చేశారు. అభినందనలు.

      తొలగించండి
  24. మధువు లూరెడు పదముల మధురిమలను
    వీనులకు చేర నీయని వింత రొదల
    తెలుగు సాహిత్య మీనాడు వెలుగు తగ్గి
    సత్యమింక కవనము నిస్సత్త్వ మయ్య!!!


    అన్య బాషల పైనున్న నమిత మోజు
    మాత్రుభాషను లేదేల మహిని జూడ
    తేనె లొలికెడు తెలుగున తీపి గనక
    సత్యమింక కవనము నిస్సత్వ మయ్య!!!

    రిప్లయితొలగించండి
  25. అవనీనాథకుమార! వీర! రఘురామా! తాటకీత్యాది దా
    నవ దుశ్చేష్టల దండకావనము న్యూనం బౌటచే నేడు శు
    ష్క వనంబయ్యెను లుప్తసత్త్వ మది శ్లాఘ్యం బౌట బొంకే సుమా
    భవదీయాస్త్ర మహాగ్ని కీలలను కాల్పంబోక ప్రావేల్పులన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. మిస్సన్న గారు మీ పూరణ చాలా బాగుంది. "తాటకీత్యాది" సంధి పరిశీలనార్హము. “తాటకి” తెలుగు పదము “ఇత్యాది” తత్సమము. అందుచేత సవర్ణదీర్ఘ సంధి వర్తించదు. తాటకికి సంస్కృత పదము “తాటకా” ఆకారాంత స్త్రీలింగము. తాటకేత్యాది సాధువు.

      తొలగించండి
  26. కవనంబున్ సరి గానమున్నెరుపనా కావ్యాళి వీరోక్తులే
    జవసత్వంబులు నాటి వీరులకునీ జాడ్యంపు కూర్పుల్ గన న్
    శవయాత్రాసదృశాలు ధ్యేయరహితోత్సాహంబుపైపైనిదౌ
    కవనంబయ్యెను.లుప్తసత్వమదిశ్లాఘ్యంబౌట బొంకే సుమా
    నిత్యమనుమాట రక్షతి వృక్ష రక్ష.భృత్యననుకూల కాటక మృత్య్వ్దదేల.భత్యమును జీతములగను భవతకెగయ
    సత్యమింకక .వనము నిస్సత్వమయ్యె.

    రిప్లయితొలగించండి
  27. కవియేడీ యిల పోతనార్యు వలె తాకావ్యమ్ము నర్పించడో

    భువిలో సౌఖ్యము లొల్లగా ధనముకై భూపాలక శ్రేణికిన్


    చెవిలో పూవులు పెట్టుచున్ పొగడగా శ్రీమంతు ధీరత్వమున్

    కవనం బయ్యెను లుప్తసత్త్వ మది శ్లాఘ్యంబౌట బొంకే సుమా!

    రిప్లయితొలగించండి