11, ఆగస్టు 2016, గురువారం

సమస్య - 2112 (పద్యము కాలకూటవిష...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"పద్యము కాలకూటవిషభాండము గాదె కవిత్వవేదికిన్"
లేదా...
"పద్దియము కాలకూటంపు ముద్ద గాదె"

78 కామెంట్‌లు:



  1. విద్దె గా నిచ్చు కైపుల విధవిధమగు
    పద్దియము, కాలకూటంపు ముద్ద గాదె
    కవుల గళమునందు నిలచి కష్ట ములను
    కలుగ జేయ ,తెలుసుకొని కవిగ వెలుగు

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. భావుకత మెండు మనసుకు బాధ కలుగు
    నూహ లందున దేలుచు మోహ పడగ
    కవుల హృదయాలు పలురీతి కలత బెట్టు
    పద్దియము కాలకూటంపు ముద్ద గాదె.

    రిప్లయితొలగించండి
  3. మద్యము ద్రావువానివిధి మానవకోటిని దిట్టుచుండి, యే
    విద్యయు సౌఖ్యహీనమని విస్తృతరీతిని దుష్టభావ సం
    పాద్యముగా కవిత్వమును పల్కగ బూనిన నెల్లవేళలన్
    పద్యము కాలకూటవిషభాండము గాదె కవిత్వవేదికిన్.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ..వాని వలె అంటే బాగుంటుందింకా. 'యే విద్యయు'తో అన్వయ‌ం కుదరటం‌లేదు కాబట్టి సద్విద్యలు అనండి. పూనిన బదులు పూనెడు అని ఉండాలి. పద్యం బాగుంది. ధారాశుధ్ధి బాగుంది.

      తొలగించండి
  4. గురువుగారూ నిన్నటి పూరణ.

    రాముఁడు భక్తుడైన నొక రాజు యయాతిని జంపబూనినన్
    రాముని బంటునౌ హనుమ రాజుని గావగ పోరసల్పగా
    నీమము వీడె రాముడవనీపతినిన్ కడ తేర్చకుండగన్
    రాముఁడు ధర్మమున్ జెఱచె రాజులు యోగులు సంతసింపఁగన్

    రిప్లయితొలగించండి
  5. పద్య మాధుర్య మెరిగెడు విద్యయున్న
    అమృత ధారగ నలరించు నవని జనుల
    పద్దియము,కాలకూటంపు ముద్ద గాదె
    మనుజులను నాశమొనరించు మద్యమదియె!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్వయం? చివరిపాదం వలన ఇబ్బంది. కాబట్టి మనుజులను నాశమొనరించ పనవెనేని అనండి. బాగుంటుందప్పుడు.

      తొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులు!

    వ్యాకరణ సూత్రములు, శయ్య, పాకములు, న
    లంకృతులు, శబ్ద పరిచితు, లింకఁ గావ్య
    పఠన మెఱుఁగనివాఁడైన వచనకవికిఁ
    బద్దియము కాలకూటంపు ముద్ద గాదె?

    రిప్లయితొలగించండి
  7. పద్దియముకాలకూటంపుముద్దగాదె
    వాణి!రెండునువేర్వేరుపనులజేయు
    కాలకూటంపువిషమదికాలుజేర్చు
    పద్దియంబదిచదువగబ్రమదమిచ్చు

    రిప్లయితొలగించండి
  8. ఒద్దికను లేని పదముల నద్దుకొని ని
    బద్ధతయు లేక సూత్ర విశుద్ధిలేక
    నర్థ రహితంబుగా జెప్ప వ్యర్థ మగుత
    పద్దియము కాలకూటంపు ముద్ద గాదె!

    రిప్లయితొలగించండి
  9. పద్యము వ్రాయగోరు ఘన పండితు కైనను గష్టమే సుమా
    పద్యమునందు సంది యతి ప్రాసగణాది సమాస కూర్పులున్
    పద్యము లోన వ్యాకరణ భాషయు భావమె రుంగు వారికిన్
    పద్యము కాలకూటవిషభాండము గాదె కవిత్వవేదికిన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పండితు కైనను కాదు పండితునకైనను అన్నది సాధురూపం. సంధిలో వత్తుపోయింది! సమాసకూర్పు -సమాసపుకూర్పు అనే సాధువు. చివరిపాదాల్లో వైరుద్యం భావమెరిగినవారికి పద్యం విషం‌కాదు కదా. మరింత జాగ్రత్తగా ప్రయత్నించాలి.

      తొలగించండి
  10. పద్యముకాలకూటవిషభాండముగాదెకవిత్వవేదికన్
    విద్యనునేర్వనట్టియవివేకులబల్కులుగావెయయ్యదిన్
    పద్యమెయౌనుగానమృతభాండమునారయచింతయేలకో
    విద్య!యెరుంగుమాయిదియవేవురునమ్మినసత్యమేసుమీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇలాంటి పొరపాటు తరచూ చూస్తున్నాను. మొదటి పాదంతో‌ మిగిలిన భాగానికి అతుకేది?
      మాటలు పొదిగే ప్రయాసగా వచ్చింది పద్యం. చాలానే తప్పులున్నాయి పరిశీలనగా చూచుకోండి.

      తొలగించండి
  11. కంద పద్యము దలచంగ కడుభయంబు
    చంపకోత్పల మాలలు సరిగ రావు
    రాయ వలెనన్న కోరికె; రాదు యేమి
    పద్దియము కాలకూటంపు ముద్ద గాదె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరిగా రావు అనటంలోని సుభగత్వం సరిగ అంటే రాలేదు చూచారా? సాధ్యపడవు అనేయండి.
      రాదు +‌ ఏమి -> రాదేమి కాకతప్పదు కదా. అందుచేత వ్రాయ లేను అనేయండి.
      అన్నట్లు కోరికె అని తెగ్గొడితే అందం కొంచెం పోయింది కదా? కోరికే అనాలి లేకుంటే‌ గణమూ‌ చెడింది! బహుశః ఇది typo.
      మంచి ప్రయత్నం. ఇంచుమించు బాగా వచ్చినట్లే.

      తొలగించండి
  12. నవరస భరితము సకల నవ్యతలకు
    తావు కవియును స్వేచ్ఛదో తారచించు
    పద్దియము:కాలకూటంపు ముద్ద గాదె
    పద్యమన్న దెలియ నట్టి పామరునకు!

    2.కవుల కరమునందున గల కలము చేత
    బూని వ్రాయగలండతి చక్క నైన
    పద్దియము:కాలకూటంపు ముద్ద గాదె
    మద్యమును త్రాగి తిరిగెడి మనిషి కిలను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటి పద్యంలో. రెండవపాదం చిత్రిక పట్టాలి. మంచిపూరణ అవుతుంది.
      రెందవ పద్యంలో. కవులు అన్నారు కాబట్టి కరములందున అనాలండి. మళ్ళా కలము అన్నది కూడా ఏకవచనం. మార్చాలి. కవి తన కరమందున్నట్టి కలము చేత అనండి. చివరిపాదాలకు వచ్చేసరికి అతకలేదు - సమర్థనా లేదు. సరిగా కిట్టలేదండి.

      తొలగించండి
  13. హృద్యమ మైన పద్యమ సహింపగ రాదన తేటతెల్లమే,
    సద్య మొనర్చు ఘాతుకము సత్కవి సింహము ధర్మనిష్ఠులం
    దాద్యుడు నుద్యమించి త్రుటి నారిట “తా”నిడ శస్త్రతుల్యమై
    పద్యము కాలకూటవిషభాండము గాదె, కవిత్వవేదికిన్


    శమీక పుత్రుడు శృంగి పరీక్షిన్నరేంద్రుని శపియించు సందర్భమున పోతనామాత్యుని పద్యము:
    ఓడక వింటి కోపున మృతోరగముం గొనివచ్చి మాఱు మా
    టాడక యున్న మజ్జనకు నంసతలంబునఁ బెట్టి దుర్మద
    క్రీడఁ జరించు రాజు హరకేశవు లడ్డిన నైనఁ జచ్చుఁ బో
    యేడవనాడు తక్షకఫణీంద్ర విషానల హేతి సంహతిన్

    యేడవనాడు తక్షకఫణీంద్ర: ఆరవ యక్షరము “త"!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెద్ద కవిని యంచు దలచి హద్దు లేక
      తద్ద వికృత శబ్దమ్ముల సద్దు సేయు
      నిద్దుర చెరుపుటకు గాక ముద్దియ కట
      పద్దియము కాలకూటంపు ముద్ద గాదె

      తొలగించండి
    2. విషాక్షరములను ప్రస్తావించారు. ఆరవది తకారం‌కాకూడదు నిజమే. అది పద్యం మొత్తం‌మీద నియమం. ఏపాదానికి ఆపాదానికి వర్తించదు. నాలుగవపాదంలో 6వది భేషుగ్గా తకారం కావచ్చును. ఇకపోతే‌ విషాక్షరయుక్తమైన పద్యం‌ కవిత్వవేదికే కాదు ఎవరికైనా చెరుపు చేయగలదు. వినేవాడికి కవిత్వం తెలియాలని లేదు.

      కవిని యంచు బదులు కవిన టంచు అనండి. పూరణ బాగానే ఉందిక్కడ.
      హృద్యమ మైన పద్యమ? హృద్యమైన అనే. పై మాట పద్యము అనా? సద్యమొనర్చు అనటం‌కూడా సరికాదనుకుంటాను.

      తొలగించండి
    3. శ్యామలరావు గారు ధన్యవాదములు. హృద్యమమైన పద్యమే (ఆరింట త ఉన్న) సహింపరానిదని కవిత్వ వేదికి తేటతెల్లమే.
      సద్యము+ఒనర్చు = సద్యమొనర్చు, ( తత్క్షణము చేయును ఘాతుకము)
      పోతన గారు నాల్గవ పాదములో "త" ను యాదృచ్చికముగా గాక యుద్దేశపూర్వకమే పెట్టి యుంటారని నా భావన.
      "కవిన టంచు" బాగున్నది. ధన్యవాదములు.

      తొలగించండి
  14. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { ప్ర హ్లా దు డు " మ౦దార మకర౦ద " అ ౦ టూ ప ద్య ము చ దు వ గా :--
    హ రి ని ను తి ౦ చు నీ ప ద్య ము
    కా ల కూ ట వి ష భా ౦ డ మ ని
    హి ర ణ్య క శి పు డు ని౦ది౦చుట }


    బోధ్యము కాని విద్య గురువుల్ పఠియి౦పగ

    .. .......... జేయ , దైత్య వై

    రుధ్య పరాయణున్ హరిని రోయక యే

    ………… స్తుతియి౦చు నట్టి నీ

    పద్యము = కాలకూట విషభా౦డము కాదె ??

    …………… కవిత్వ వేదికిన్ --

    హృద్య విభూషణ౦బగు మదీయ చరిత్ర ||

    ……………… నుతి౦చుమా సుతా !

    { బోధ్యము కాని = బోధి౦పదగినది కాని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ముందొకసారి మనవి చేసినట్లు సరైన ఉపకరణం వాడండి. పూర్ణానుస్వారాలు బాగోలేవు చూడటానికి. వృత్తాన్ని సీసధోరణిలో‌ ఎందుకు వ్రాయటం? వైరుధ్యపరాయణ, హృద్యవిభూషణం అన్నప్రయోగాలు ఉచితం‌గా అనిపించటం‌ లేదు. పూరణాశయం‌ బాగుంది.

      తొలగించండి
  15. మందునకు గణితములన్నమంట లెసగు
    మేహరోగికి తీపన్న దేహమడరు
    వ్యాకరణమును నేర్వని వానికెపుడు
    పద్దియము కాలకూటంపుముద్ద కాదె?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారు పూజనీయులైన మన గురువుగారిని సత్కరించి సత్కవిత్వాభిమానమును చాటుకొన్నమీరు శ్లాఘనీయులు. మీకు హృదయ పూర్వకాభినందనలు.

      తొలగించండి
    2. సుకవి మిత్రులు కామేశ్వర రావు గారికి ధన్యవాదములు.

      తొలగించండి
    3. పెద్దలు శ్యామలీయం గారికి ధన్యవాదములు

      తొలగించండి
  16. సద్యశమున్ మనోజ్ఞతయు చక్కనిజ్ఞానము సాంఘికోన్నతి
    న్నుద్యమ దీప్తిగా మలచి మోదముగూర్చుచు సంతతంబుగా
    విద్యకుబారమార్థమగు విజ్ఞతగూర్చని సారహీనమౌ
    పద్యము కాలకూట విష భాండముగాదె! కవిత్వ వేదికిన్.

    ముద్దుగ నవరసభావాల్
    ఒద్దికగా గూర్చకుండ నూసరపదముల్
    హద్దులుదెలియక వ్రాసిన
    పద్దియము కలకూటంపు ముద్దగాదె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారు తేటగీతి సమస్యను కందములో పూరించారు. గమనించండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు కామేశ్వరరావుగారు. పొరబడ్డాను.సవరించి వ్రాస్తాను.

      తొలగించండి
    3. ముద్దులొలికెడు పదముల మూలబెట్టి
      పండితాళియు మెచ్చెడు పథమువీడి
      సంఘవిద్రోహ కార్యాల చాటిచెప్పు
      పద్దియము కాలకూటంపు ముద్దగాదె.

      తొలగించండి
    4. సారహీనమౌ పద్యము విషభాండమన్న పూరణోద్దేశం‌ బాగుంది. సంఘవిద్రోహ కర్యాన్ని చాటే పద్యమూ అలాంటిదే అన్న పూరణా బాగుంది.

      తొలగించండి
  17. పద్యము పాదభూషణము|పద్యము నింపెడి భావబంధమే
    హృద్యమ మార్గమై మనసు హీనత మాన్పెడి కర్ణ బంధమౌ|
    అద్యయనాన దోషముల నల్లిక కళ్ళకు గానుపించగా?
    పద్యము కాలకూట విష భాండము గాదె కవిత్వ వేదికిన్.
    2.పద్దియము కాల కూటంపు ముద్దగాదె?
    “భావ మాధుర్య మందించు బంధ మదియె|
    గాన గంధర్వ మంతయు కలసి మెలసి
    కంఠమున కదలాడగ కళలు బండు”|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యము పాదభూషణము! అనుచితంగా ఉందండి. పాదభూషితము అనా మీ‌ఉద్దేశం? 'హృద్యమ మార్గమై'? రెండూ సంస్కృతపదాలే కాబట్టి హృద్యమార్గమై అనే అవుతుంది. అద్యయనాన? అధ్యయనము ఉంది కాని అద్యయనము లేదు. చక్కదిద్దండి పద్యాన్ని.
      రెండవపద్యం ప్రశ్నోత్తరరూపమైనా ప్రశ్నోత్తరాలు విడివిడిగా పద్యంలో ఉంచకూడదు అతుకు వేయాలి. కాదు అనో‌ మరొ‌క విధంగానో. చక్కజేయండి.

      తొలగించండి
  18. నవరస భరితము సకల నవ్యతలకు
    తావు కవియును స్వేచ్ఛదో తారచించు
    పద్దియము:కాలకూటంపు ముద్ద గాదె
    పద్యమన్న దెలియ నట్టి పామరునకు!

    2.కవుల కరమునందున గల కలము చేత
    బూని వ్రాయగలండతి చక్క నైన
    పద్దియము:కాలకూటంపు ముద్ద గాదె
    మద్యమును త్రాగి తిరిగెడి మనిషి కిలను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్వేఛ్చతో (దో అని టైపాటు) బదులు స్వేఛ్చమై అంటే బాగుంటుందింకా. పూరణ బాగుంది. అవునూ, ఈ‌ పద్యాలు మరలా రెండవసారి ఎందుకు పంపారు?

      తొలగించండి
  19. సేద్యపుకారణాన తన చిన్నతనంబున జ్ఞానశూన్యతన్
    విద్యనుబాసి వ్రాయగను విస్తృత వ్యాకరణంపుశూన్యమౌ
    పద్యము కాలకూట విషభాండముగాదె- కవిత్వవేదికిం
    జోద్యమనంగరాదు సరసోక్తులు నిండిన పద్యరత్నముల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వ్యాకరణంపుశూన్యమౌ అన్నది సరికాదు. వ్యాకరణాదిహీనతన్ అందామా? మూడుపాదాల్లో ముగిసింది పద్యం. చివరిపాదం విడిగానే ఉండిపోయింది. ఆఖరుపాదాన్ని మొదటిదానిగా మారిస్తే అంతా సరిపోతుంది.

      తొలగించండి
  20. సాధ్యముగాక ఛందమును చక్కగ నేర్చు విధానముల్ సత
    మ్మధ్యయనించు శక్తి తన కబ్బక నిత్యము స్రుక్కువానికిన్,
    పద్యము కాలకూట విష భాండము గాదె? కవిత్వవేదికిన్
    హృద్యపు పద్యలేఖనము హేలయె సుమ్మ తలంచిచూడగన్

    రిప్లయితొలగించండి
  21. శ్రీగురుభ్యోనమః

    విద్య తెరంగు మారినది వీడిరి గ్రాంధిక భాష జూడగా
    నుద్యమ రీతి పాతుకొని హూనము జేసెను తెల్గుభాషనే
    గద్యమునైన బల్కుటకు కష్టము నొందెడు చిత్రసీమలో
    పద్యము కాలకూటవిషభాండము గాదె కవిత్వవేదికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఊహ అస్పష్టతకులోనై నట్లుంది. ' గ్రాంధిక భాష జూడగా నుద్యమ రీతి పాతుకొని' అని మీ‌భావానికి విరుధ్ధంగా పద్యం‌ నడిచిందనిపిస్తోంది! కవిత్వవేదికిన్ అతక్కుండా పోయింది! మరికొంచెం ప్రయత్నించండి.

      తొలగించండి
  22. గణములున్ ప్రాస,యతులు సక్రమముగాను

    యమర జేయుచు వ్రాయ హృద్యంబు తెలుగు

    పద్దియము; కాలకూటంపు ముద్ద గాదె

    గ్రోలగా మద్యము నతిగ రోజు రోజు.

    రిప్లయితొలగించండి
  23. శంకరాభరణ సమితి సత్కవీశు
    లెల్ల విషమ సమస్యల నెన్నదగిన
    రీతి సాధించి పూరించు లీల జూడ
    పద్దియము కాలకూటంపు ముద్ద గాదె

    రిప్లయితొలగించండి
  24. ఛందమనెడు లయను జేరి యందమొసగు
    మేటి పద బంధముల కూర్పు చాటునదియె
    పద్దియము! కాల కూటంపు ముద్ద గాదె
    పదుగురను చేర నేర్వని పద కలయిక!

    రిప్లయితొలగించండి
  25. యతులు కుదరక భావమ్ము సతమతమ్ము!
    పదము సాధువు కాదన్న భంగపాటు!
    నడక సరళము గాదంచు తడబడంగ!
    పద్దియము కాలకూటఁపు ముద్ద గాదె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేంకట సుబ్బ సహదేవుడు గారు మీరు "ప్రచురించు" నొక్కిన తర్వాత "బాక్ యారో" నొక్కుతున్నారేమో అందుకే రెండు మూడు సార్లు వస్తున్నాయి మీ పూరణలు. గమనించండి.

      తొలగించండి
  26. ​వేద్యములైన యంశముల వీడక ధారణ జేసి యుండినన్
    పద్యము కున్న నీమముల పాడిగ వాడుట నెర్గి యుండినన్
    విద్యల నెన్నొ నేర్చిన వివేకము గల్గియు వ్రాయు చుండగా
    ​పద్యము కాలకూటవిషభాండము గాదె కవిత్వవేదికిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎఱిగి బదులు రేఫంతో ఎరిగి అంటే సరే, కాని ఎర్గి అనటం కుదరదండి. వాడు టేఱింగి యుండినన్ అనండి. కాని మీరు చెప్పినభావం సమస్యను పరిష్కరించటం లేదే! వ్రాయుచుండగా బదులు వ్రాయకుండినన్ అనండి - అప్పుడు సరిపోతుంది.

      తొలగించండి
  27. పద్యము వ్రాయబూని యనవద్యముగా కడు యోచనమ్ముతో
    హృద్యముగాను పండితులు పామరులైనను మెచ్చునట్లుగా
    చోద్యము చేయనెంచి పరిశోధన జేయుచు నుండు నప్పుడా
    పద్యము కాలకూట విషభాండము గాదె కవిత్వవేదికిన్!​​

    రిప్లయితొలగించండి
  28. పద్యము వ్రాయబూని యనవద్యముగా కడు యోచనమ్ముతో
    హృద్యముగాను పండితులు పామరులైనను మెచ్చునట్లుగా
    చోద్యము చేయనెంచి పరిశోధన జేయుచు నుండు నప్పుడా
    పద్యము కాలకూట విషభాండము గాదె కవిత్వవేదికిన్!​​

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవపాదంలో హృ - పా మధ్య యతిమైత్రి పొరపాటు. మెచ్చునట్లుగా బదులు మెచ్చగావలెన్ అనండి - లేకుంటే అన్వయం సరిగా లేదు.

      తొలగించండి
  29. హృద్యమెహాస్యపుష్టియును యూపులుకైపులుత్రాగిత్రుళ్ళుటల్.గద్యపు మోటుకూతకును గంతులువేసినటించునట్టిదు.ర్విద్యలపెంపుకైకవియువీగసుధాకలశంబువంటిదౌ.పద్యమె....
    గద్దరులు తినిత్రాగిదగాలగోరి.ముద్దియలమానభంగాలమోజునరయుహాహహూహూలబెంచుచు నల్లినట్టి.పద్దియము

    రిప్లయితొలగించండి
  30. కవిమిత్రులారా,
    నా జ్వరం మరింత తీవ్రమయింది. ఇప్పుడే హాస్పిటన్ నుండి వచ్చాను. డాక్టరు గారు మరో రెండు రోజులు చూసి, తగ్గకుంటే కొన్ని పరీక్షలు చేయాలన్నారు. మీ పద్యాలను సమీక్షించే ఓపిక ఏమాత్రం లేదు. మన్నించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పరవాలేదు. మీరు మందులు వేసుకొని విశ్రాంతి తీసుకోండి.

      తొలగించండి
    2. మిత్రులు శంకరయ్యగారు,
      ఈ మీటింగు ముగిసిన తరువాత పూరణలను పరిశీలిస్తాను. మీరు బాగా విశ్రాంతి తీసుకోండి. సమీక్షాబాధ్యను నాకు వదిలేసి కొన్నాళ్ళపాటు దయచేసి మీ ఆరోగ్యం పైన పూర్తిదృష్టి సారించ ప్రార్థన.

      తొలగించండి
    3. గురువుగారూ మీ ఆరోగ్యమే మాకు మహద్భాగ్యం. మీరు విశ్రాంతి తీసుకోండి.

      తొలగించండి
    4. శంకరయ్యగారికి .....మీఆరోగ్యము త్వరగా కుదుటపడాలని భగవానుని కోరుకుంటున్నాను.

      తొలగించండి
    5. శంకరయ్యగారికి .....మీఆరోగ్యము త్వరగా కుదుటపడాలని భగవానుని కోరుకుంటున్నాను.

      తొలగించండి
    6. నమస్కారములు
      ముందు మీ ఆరోగ్యము జాగ్రత్త .విశ్రాంతిగా ఉండండి .మనకు ఆత్మీయులు శ్రీ శ్యామలీయంగారు ఉన్నారు. వారు విశ్లేషణ చేస్తున్నారు.మీ ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తూ దీవించి అక్క

      తొలగించండి
    7. గురువుగారు, ఆరోగ్యము తొందరగా కోరుకోవాలని ఆశిస్తున్నాను

      తొలగించండి
  31. హృద్యమెహాస్యపుష్టియును యూపులుకైపులుత్రాగిత్రుళ్ళుటల్.గద్యపు మోటుకూతకును గంతులువేసినటించునట్టిదు.ర్విద్యలపెంపుకైకవియువీగసుధాకలశంబువంటిదౌ.పద్యమె....
    గద్దరులు తినిత్రాగిదగాలగోరి.ముద్దియలమానభంగాలమోజునరయుహాహహూహూలబెంచుచు నల్లినట్టి.పద్దియము

    రిప్లయితొలగించండి
  32. సవరణతో

    పద్యము వ్రాయబూని యనవద్యముగా కడు యోచనమ్ముతో
    పద్యములల్లి పండితులు బామరులెల్లరు మెచ్చగోరుచున్
    చోద్యము చేయనెంచి పరిశోధన జేయుచు నుండు నప్పుడా
    పద్యము కాలకూటవిషభాండము గాదె కవిత్వవేదికిన్!​​

    వేద్యములైన యంశముల వీడక ధారణ జేసి యుండినన్
    పద్యము కున్న నీమముల పాడిగ వాడుటెఱింగి యుండినన్
    విద్యల నెన్నొ నేర్చిన వివేకము గల్గియు వ్రాయ కుండినన్
    పద్యము కాలకూటవిషభాండము గాదె కవిత్వవేదికిన్!

    రిప్లయితొలగించండి
  33. విద్యలు నాంధ్రమందునను వీసపుటెత్తును నేర్వకుండనే
    గద్యము వ్రాయజాలకయె గందర గోళపుటన్వయంబుతో
    హృద్యపు సంస్కృతమ్ము విడి హిందియు నాంగ్లము పూంచుచుండు;...నా
    పద్యము కాలకూటవిషభాండము గాదె కవిత్వవేదికిన్

    రిప్లయితొలగించండి