జిలేబీ గారూ, మీ ప్రయత్నం ప్రశంసనీయం. శశివదనలో శివ పదాన్ని సాధించడం బాగుంది కాని 'అమవస శశివదన' అన్న ప్రయోగం సమ్మతం కాదు. అలాగే 'భవహరముగ+ఒనరించిన' అన్నపుడు యడాగమం రాదు. 'భవహరముగ నొనరించిన' అనండి.
అమావాస్య నాటి చంద్రుని ముఖం (నల్లని) లా ఉన్నవాడు అన్న అర్థం లో రాసానండీ
బహుశా ప్రయోగం మొదటి సారేమో (అరవం లో ఇట్లాంటిదేదో చదివానేమో అట్లా వచ్చేసింది బెంగాలి బంకిం (చంద్ర) లా - హాఫ్ మూన్ అని చెప్పొచ్చు క్రూకెడ్ అని కూడా చెప్పొచ్చు :)
మడిపల్లి రాజకుమార్ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. 'గోపికాళి చిత్తహరణ..' అనండి, లేదా 'గోపికా చిత్త హరణ! శ్రీ గోపబాల' అనండి.
ఆర్యావామనరూపంలో బలినిమూడుగులడుక్కున్నాడు. అది వడుగు.బాల రూపమే. ఈ సారి కృష్ణుడై అడుగాలంటే వెన్నకై గోపికలనడగాలి.ఇష్టంలేక చోర కళ నుపయోగించి నవ వామనుడైనాడీరోజున మనదైవం. మనకింత వెన్న మనమడుగక ముందే యిస్తాడని ఆశిద్దాం.
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పూరణ ఉత్తమంగా ఉంది. 'భవరాజ్యపహర' అన్నచోట సందేహం... భవరాజ్య ప(=అధిపతిని/అధిపత్యాన్ని) హరించువాడని నేను అర్థం చేసుకున్నాను. మీరేమంటారు? భవరాజ్యాహర.. అన్నా సరిపోతుందనుకుంటాను.
కామేశ్వర రావు గారూ, మీ ప్రయోగం సాధువే. ఆ దిశగా నేను ఆలోచించలేదు. వివరణకు ధన్యవాదాలు. **** సుమలత గారూ, భయంకర వాయువు (సుడిగాలి) యొక్క రవము (శబ్దం) కలిగిన తృణావర్తునకు మోక్షాన్ని ఇచ్చినవాడా! అని భావం.
శ్యామల రావు గారూ, ధన్యవాదాలు! ఎత్తుగీతి లేకపోవడంతో సీసపద్య లక్షణాన్ని అన్వయించి చూడలేదు. నాలుగు పాదాలుండే సరికి ఇదేదో దేశిచ్చందమనుకున్నాను. మరి వ్రాసిన మురళీకృష్ణ గారు 'వచన' మంటున్నారు?
శ్రీ కృష్ణ పరమాత్మ అవతరించిన శ్రావణ బహుళ అష్టమి శ్రీ కృష్ణుడు భూమిపై పుట్టింది మొదలు అష్ట సంఖ్యకు ఆదరణ శ్రీకృష్ణావతారం ఎనిమిదవ అవతారం స్వామి జన్మించినది ఎనిమిదవ నెలలో శ్రీకృష్ణుడు పుట్టినది అష్టమి ఎనిమిదవ తిధి కృష్ణసావర్ణ మన్వంతరం ఎనిమిదవదే (గురువు గారు నమస్తే శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇది పద్యం కాదు వచనం )
భవహరణ దుఃఖ భంజన
రిప్లయితొలగించండిస్తవనీయ గుణాలవాల దాక్షిణ్యనిధీ
నవనీత రాశివరప్రద
నవ వామనరుద్రమిత్ర ననుగను కృష్ణా
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నవ వామన!' అని సంబోధించారు. కృష్ణావతార సమయానికి వామనావతారం చాల పాతబడింది కదా!
రిప్లయితొలగించండికృష్ణం వందే జగద్గురుమ్ !
అమవసి శశివదన ! మురా
రి మహిని భవహరముగ యొనరించిన వనమా
లి! మరిమరి కొలుతు మయ్యా
సుమగురు ద్రఢిమను గనంగ శుభముల బడయన్
జిలేబి
బాగుంది, శశివదనలో "శివ " పదాన్నిరికించారు.
తొలగించండిఅమవసి శశి అంటే ?
అల్లసాని పెద్దన్న గారినుద్దేశ్యించి తెనాలి రామకృష్ణ కవి ఈ పద్యం చెప్పాడంటారు కదా. దాన్నుంచి ప్రేరణేమో !
తొలగించండిఎమి తిని సెపితివి కపితము
.............................
............................l
అమవస నిసి యన్న మాట నలసని పెదనా !!
జిలేబీ గారూ,
తొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయం.
శశివదనలో శివ పదాన్ని సాధించడం బాగుంది కాని 'అమవస శశివదన' అన్న ప్రయోగం సమ్మతం కాదు. అలాగే 'భవహరముగ+ఒనరించిన' అన్నపుడు యడాగమం రాదు. 'భవహరముగ నొనరించిన' అనండి.
విన్నకోట నరసింహారావు గారూ,
తొలగించండిస్పందించినందుకు ధన్యవాదాలు.
తొలగించండిధన్యవాదాలాండీ
అమావాస్య నాటి చంద్రుని ముఖం (నల్లని) లా ఉన్నవాడు అన్న అర్థం లో రాసానండీ
బహుశా ప్రయోగం మొదటి సారేమో (అరవం లో ఇట్లాంటిదేదో చదివానేమో అట్లా వచ్చేసింది బెంగాలి బంకిం (చంద్ర) లా - హాఫ్ మూన్ అని చెప్పొచ్చు క్రూకెడ్ అని కూడా చెప్పొచ్చు :)
నెనర్లు
జిలేబి
కమల నాభ! వరాహ! శంఖ చక్ర ఖడ్గ
రిప్లయితొలగించండిచాప ప్రహరణ ధర! కృష్ణ! చారు ద్రష్ట!
దేవకీ సుత! శ్రీ వాసుదేవ! కమల
నయన! శివ ప్రదాయక! వందనమ్ము నీకు
మాజేటి సుమలత గారూ,
తొలగించండిబహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ బాగుంది.
'చక్ర' అన్నచోట గణదోషం. అలాగే శంఖం ప్రహరణం కాదు కదా! 'శంఖ కర! ఖడ్గ...' అందామా?
చతుర్-ఆయుధములు : సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి) 2002
తొలగించండి(శ్రీ మహావిష్ణువు ఆయుధములు) 1. శంఖము, 2. చక్రము, 3. గద, 4. పద్మము.
పంచ-ఆయుధములు : సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి) 2002
(విష్ణువు ఆయుధములు) 1. శంఖము (పాంచజన్యము), 2. చక్రము (సుదర్శనము), 3. గద (కౌమోదకి), 4. ఖడ్గము (నందకము), 5. చాపము (శార్‌ఙ్గము). [అమరకోశము 1-18-128]
ధన్యవాదములు గురువు గారు. పైన ఇచ్చినది చూసి వ్రాసినాను.
కమల నాభ! వరాహ! శంఖ గద ఖడ్గ
చాప ప్రహరణ ధర! కృష్ణ! చారు ద్రష్ట!
దేవకీ సుత! శ్రీ వాసుదేవ! కమల
నయన! శివ ప్రదాయక! నమో నారసింహ!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రిప్లయితొలగించండిభవహర ! శారద పూర్ణ శ...
శివదన ! వరయోగిబృందచిత్తాభరణా !
నవనీతచోర ! మధుహర !
స్తవములు కాళీయరుద్రతాండవ కృష్ణా !!
అశివహరుండు భక్త'భవ'హారుడనంతుడు నద్వితీయుడున్
తొలగించండిశ'శివ'దనుండు కేశవుడు శాశ్వతుడచ్యుతుడప్రమేయుడున్ ,
సశర సుశంఖచక్రవరశార్ఙ్గమనో'హర'మూర్తి కృష్ణుడున్
పశుగణపాలకుండతడు వైరుల పాలిట 'రుద్ర' మూర్తియే!!
మైలవరపు మురళీ కృష్ణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.
శివము! యదుకుల వార్ధి శ*శి!వ* నమాలి
రిప్లయితొలగించండిగోపికా చిత్త *హర*ణ! గోపబాల!
భక్తసుల*భ!వ*రద!కృష్ణ! వాసుదేవ!
తండ్రి!నినుఁగాక సరి కో*రు ద్ర* వ్యమేది?
గిరిధర! శుభ శశివదన! హరి!యదుకుల
తొలగించండిమకుటమణి!మురహర!ఘన!మధువిశసన!
భవతరణ!గరుడ గమన! పశుగణ పతి!
కనిమము పరమగురు!ద్రఢిమ నిడర దొర!
మడిపల్లి రాజకుమార్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. 'గోపికాళి చిత్తహరణ..' అనండి, లేదా 'గోపికా చిత్త హరణ! శ్రీ గోపబాల' అనండి.
ధన్యవాదాలు
తొలగించండిఆర్యావామనరూపంలో బలినిమూడుగులడుక్కున్నాడు. అది వడుగు.బాల రూపమే. ఈ సారి కృష్ణుడై అడుగాలంటే వెన్నకై గోపికలనడగాలి.ఇష్టంలేక చోర కళ నుపయోగించి నవ వామనుడైనాడీరోజున మనదైవం. మనకింత వెన్న మనమడుగక ముందే యిస్తాడని ఆశిద్దాం.
రిప్లయితొలగించండిపిట్టా వారూ,
తొలగించండిబాగుంది మీ భావన!
పూర్ణ శశివదనా కృష్ణ! పుణ్య చరిత!
రిప్లయితొలగించండికనులనే కారు ద్రవముగా కరుణ నీకు
అహరహమ్మును నీకునే నంజలింతు
విభవమందగ జేయుమా వెన్నదొంగ!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రియతమ కవి మిత్రులందరికి శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిభవసాగరంబందు బంధాలు బాపంగ
కరములనందించు గురువు నీవె
హరహరయంచును నాక్రోశమందగ
ననురాగమునుజూపు నాత్మ నీవె
రుద్రావతారాన భద్రంబు గల్పించి
సౌఖ్యంబులిచ్చెడు సామి వీవె
శివములనెన్నైన స్థిరముగాబంచెడు
కరుణామయుండగు హరివి నీవె
హరివి హరుడవు గురుడవు హర్త కర్త
గోపకాంతల మనముల కొల్లగొట్టి
సృష్టి నంతను కదిలించు స్రష్టవీవు
చిన్ని కన్నయ్య నిన్ను నే చేరి కొలుతు.
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
తొలగించండిసీసపద్యంలో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
సుగుణ రాశి వరద రాజ సుగమ భావ
రిప్లయితొలగించండినిగమ సన్నుత మధుహర నిర్వికల్ప
జ్ఞాన సంభవ కృష్ణ విజ్ఞాన రూప
ప్రణతు, లందరు నినుగోరు ద్రవిణ మూర్తి!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి అ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రుద్ర నుతా ! హరీ ! కమల లోచన ! కేశవ !
………………… శ్రీ మనో హరా !
భద్ర సహోదరా ! అనఘ ! పా౦డవ మిత్రమ !
………………… దీన భక్త క
ల్ప ద్రుమ ! చక్రపాణి ! భవ పాప విదూర !
……………………… కృపా౦బు రాశి ! వ౦
ద్య ధ్రువ రూప ! వేణు ధర ! యాదవ వ౦శ
………………………… శి రో విభూషణా !
{ వ౦ద్య ధ్రువ రూప = పూజనీయ మైన ,
శాశ్వత మైన స్వరూపము కలవాడా }
ి
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
మురహర భవరాజ్యపహర
రిప్లయితొలగించండిహరాంబుజభవ సురనాధ హలధర శివ భా
సుర వచనార్చిత భీకర
మరుద్రవ తృణారణి పరమపదద కృష్ణా
[తృణ + ఆరణి = తృణారణి : తృణావర్తుడు]
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ ఉత్తమంగా ఉంది.
'భవరాజ్యపహర' అన్నచోట సందేహం... భవరాజ్య ప(=అధిపతిని/అధిపత్యాన్ని) హరించువాడని నేను అర్థం చేసుకున్నాను. మీరేమంటారు? భవరాజ్యాహర.. అన్నా సరిపోతుందనుకుంటాను.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.ధన్యవాదములు. “భవరాజి+అపహర” అని నాయభిమతమండి. సాధువేనా తెలుప గోర్తాను.
తొలగించండిపోచిరాజు కామేశ్వర రావు గారూ, "మరుద్రవ" అంటే ఏమిటండి. తెలియక అడుగుతున్నాను.
తొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ ప్రయోగం సాధువే. ఆ దిశగా నేను ఆలోచించలేదు. వివరణకు ధన్యవాదాలు.
****
సుమలత గారూ,
భయంకర వాయువు (సుడిగాలి) యొక్క రవము (శబ్దం) కలిగిన తృణావర్తునకు మోక్షాన్ని ఇచ్చినవాడా! అని భావం.
మరుత్ + రవ = మరుద్రవ (జశ్త్వ సంధి) : వాయుధ్వని తో గూడిన తృణావర్తుడన్న యర్థములో వాడితిని. నా పద్యము సమీక్షించి నందులకు ధన్యవాదములు సుమలత గారు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు.ధన్యవాదములు.
తొలగించండిభవహర శివకర పరమాత్మకృష్ణ !
రిప్లయితొలగించండివారిజ నేత్రుడ వామన రుద్ర !
యటుకులు బెల్లము నర్పింతు నీకు
కాపాడు మమ్ముల గరుణతో సామి !
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిద్విపదలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రుద్ర' అంటే భయంకరుడే.. కాని ఎవరికి అన్నది పేర్కొనలేదు.
మురహర నంద కిశోరా !
రిప్లయితొలగించండికరుణాకర! భవహర !హరి! కామిత దాతా!
నిరుపమ శశివదనా! నీ
దరి జేరితి రుద్ర మిత్ర దయగను కృష్ణా !
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
మిత్రులందఱకు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిహరి! రథాంగపాశి! వనమాలి! రవినేత్ర!
శార్ఙ్గధర! వరాహ! రమేశ! శంఖపాణి!
పద్మనాభ! వరాంగ! సువర్ణవర్ణ!
స్వభు! గరుద్రథరథ! చక్రి! పాహి పాహి!!
(గరుద్రథరథ=[గరుద్రథుఁడు=గరుత్మంతుఁడు] గరుత్మంతుని రథముగా [=వాహనముగా] గలవాఁడా..అనఁగా ఓ విష్ణుమూర్తీ...అని తాత్పర్యము)
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
పాపహర కేశవా శౌరి పాహి పాహి
రిప్లయితొలగించండిసేవకుండ శివముగూర్చు చిన్నికృష్ణ
లేరుద్రుఢిమను నినుమించు వారలెవరు
భవమునుండు ముక్తినిడుము వాసుదేవ
భవము నుండి
తొలగించండిఅన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శివకరుడు| మురళీకృష్ణ| భవితనొసగు|
రిప్లయితొలగించండిహరకుడు ననుకోకు శిరులువరములొసగు|
సంభవ మగుసంస్కారముసాకు నెపుడు
రుద్ర తాండవ హరియె|సుభద్రుడిలకు {శివకరుడు=మంగళకర్త;హరకుడు=దొంగ; }
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మురళీకృష్ణ అన్న ఒక్క సంబోధన ఎందుకు? 'అనుకోకు' అన్నది వ్యావహారికం. సిరులు.. శిరులు అయింది.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
* ప్రి య కా ౦ తా వృ త్త ము *
న .య .న .య .స . గ | య తి = 11 అ "
ఉ దా హ ర ణ =
రయమున నన్నేల యిటకు రావే ప్రియకా౦తా
………………........ .………………………
భవహర ! రుద్రార్చితగుణ ! వ౦శీధర ! శౌరీ !
సవినయ భక్తి౦ గొలిచెద స్వా౦త౦బున , పాలి౦
చవయ | దయారాశి ! వనజ నాభా ! వరదా ! మా
నవ పరిపాలా ! దనుజ వినాశా ! కమలేశా !
ి
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ విశేష వృత్త పూరణ బాగున్నది. అభినందనలు.
శివమగు నీ స్మరణ మెపుడు
రిప్లయితొలగించండిభవ హరణము గాదె! భక్తి బాట నడుప మా
నవునికి జీవన గీతిగ
భువిని యలరు ద్రవ్య మనుచు పొగడెద కృష్ణా!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మానవునకు' అనండి.
శివమెత్తగ భీష్మునిపై
రిప్లయితొలగించండిభవదూరుని జేయు మనుచు బాహులు జాపన్
భవహర తగదని నరుడన
ద్రవియించిన రుద్ర వినుత దండము తండ్రీ!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండి'కుప్పించి యెగసిన కుండలమ్ముల కాంతి...' పద్యాన్ని గుర్తు చేస్తున్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు.
తొలగించండిభవపు పాశములను పారద్రోలుము తండ్రి
రిప్లయితొలగించండిశివము లొసగుమయ్య శ్రీనివాస
మారపిత ముకుంద మురహర గోపాల
రుద్రమిత్ర మాదు రుజలు బాపు.
భక్తితోడ గొలుతు భవబంధములను
పరిహరమొనర్చి కరుణించు పార్థ సఖుడ
శివము కలిగించు దీవించు శ్రీనివాస
రుద్రరూపము బాపుమో భద్రరూప.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండినందుని నందను గన నా
నందము గలుగునుగ మనసు నందున మనకే
అందని రూపము మనమున
నందముగా నగుచు నిలచు నందెదననుచున్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ శుభాకాంక్షల పద్యం బాగున్నది. అభినందనలు.
భవహర ముకుంద మాధవ
రిప్లయితొలగించండిశివమును కలిగించు విభుడ శ్రీహరి కృష్ణా!
భువి రుద్రము కానీయక
భవసాగర మీద మాకు బాసట నిమ్మా!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శివము లొసగుచు పరగెడి చిద్విలాస
రిప్లయితొలగించండిపాప హరణము జేసెడి వాసుదేవ
పీకు భవబంధములూదు వెన్నదొంగ
రోతగు నఘముల నడచు రుద్రమిత్ర
కృష్ణ ననుగావు కరుణతో తృప్తిమీర.
క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. 'పీకు'...?
శ్రీ శంకరయ్య గురువు గారికినమస్కారములు. ఆలస్యముగా బ్లాగు చూసి కాలాతీతమైనదన్న తొందరలో జరిగిన తప్పు. పీకు = పీడించు
తొలగించండిమూడవ పాదం మరల మార్చినపుడు పద్యం :
శివము లొసగుచు పరిగెడి చిద్విలాస!
పాపహరణము జేసెడి వాసుదేవ!
పీకు భవ బంధముల చోపు వెన్నదొంగ!
రోతగు నఘముల నడచు రుద్రమిత్ర!
కృష్ణ! ననుగావు కరుణతో తృప్తిమీర.
(చోపు = పారద్రోలు)
క్షీరవారాశి వసియించు శేషశాయి
రిప్లయితొలగించండిబ్రహ్మనాభ వంశీధర వాసుదేవ
అంజలిడుదును భక్తితో నహరహమ్ము
భద్రముగ జూడుమమ్ముల బ్రహ్మవినుత!!!
శైలజ గారూ,
తొలగించండిమీ విష్ణుస్తుతి బాగున్నది. అభినందనలు.
నారాయణాచ్యుత నారద వినుత మాధవ ముకుంద మురారి ధరను నీదు
రిప్లయితొలగించండినామములన్ నిరతము స్మరణము జేసిన భవ హరమగును నరుడుఅర్జు
నునకు కురుక్షేత్రమున గీత నుపదేశమిచ్చిన అంగజు మించి యంద
ముగలిగి మంగళ మూర్తి దివ్య మనోహర మనసిజ మనోజ రాధ రమణ
వద్దూరి రామకృష్ణ గారూ,
తొలగించండిమీ కృష్ణస్తుతి బాగుంది. అభినందనలు.
ఇది ఏ ఛందం?
తొలగించండిగురుతుపట్ట రాకుండా ఉంది కదా?
తొలగించండిసీసమే నండి. (గురులఘువుల అమరిక మాత్రమే పద్యం ఐపోయిన పక్షంలో)
శ్యామల రావు గారూ,
తొలగించండిధన్యవాదాలు!
ఎత్తుగీతి లేకపోవడంతో సీసపద్య లక్షణాన్ని అన్వయించి చూడలేదు. నాలుగు పాదాలుండే సరికి ఇదేదో దేశిచ్చందమనుకున్నాను. మరి వ్రాసిన మురళీకృష్ణ గారు 'వచన' మంటున్నారు?
శ్రీ కృష్ణ పరమాత్మ అవతరించిన శ్రావణ బహుళ అష్టమి
రిప్లయితొలగించండిశ్రీ కృష్ణుడు భూమిపై పుట్టింది మొదలు అష్ట సంఖ్యకు ఆదరణ
శ్రీకృష్ణావతారం ఎనిమిదవ అవతారం స్వామి జన్మించినది ఎనిమిదవ నెలలో
శ్రీకృష్ణుడు పుట్టినది అష్టమి ఎనిమిదవ తిధి కృష్ణసావర్ణ మన్వంతరం ఎనిమిదవదే
(గురువు గారు నమస్తే శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇది పద్యం కాదు వచనం )
వడ్డూరి వారి తర్కం, లౌక్యం చాలా బాగున్నది. అభినందనలు!
రిప్లయితొలగించండి