12, ఆగస్టు 2016, శుక్రవారం

సమస్య - 2113 (తల్లికిఁ దండ్రికిన్ దగఁ బ్రదక్షిణ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తల్లికిఁ దండ్రికిన్ దగఁ బ్రదక్షిణ సేయఁగరాదు సంతుకున్"
లేదా...
"తగదు ప్రదక్షిణము సేయఁ దలిదండ్రులకున్"

55 వ్యాఖ్యలు:

 1. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మగువల నెగ్గాడంగం
   దగదు, ప్రదక్షిణము సేయ దలిదండ్రులకున్
   యుగముల పాపంబు దొలగు
   నగణితమగు పుణ్యఫల సమాగమ మందున్!

   తొలగించు
 2. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తెగువ నెపుడు దూషించుట
   తగదు, ప్రదక్షిణము సేయఁ దలిదండ్రులకున్
   తగు పుణ్యములు కలుగునే,
   సుగుణము లెన్నడును నేర్పి సుఖములు జూపెన్.

   తొలగించు
  2. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
  3. శిష్ట్లావారి పద్యానికే కొద్దిగా మార్పులు చేసినట్లుంది. కాని కలుగునే ఏమిటి? చివరిపాదం సరిగా రాలేదు అక్షరాల అమరింపు గణబంధంలో అన్నట్లుంది.

   తొలగించు

 3. జీవన గతిలో ఊరికే గొప్పల కోసము తగదు దండాలు


  నగరపు జీవన గతినిన్
  తగదు ప్రదక్షిణము సేయఁ దలిదండ్రులకున్
  సుగమముగా వారికి జీ
  వగర్ర కలిగించవలెను వార్ధక్యమునన్

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తగదు అన్నమాటకు చాలదు అన్న అర్థం‌ ఉంటే ఈ‌పద్యం ఒప్పుగా ఉండేది. కాని అలా లేదు కదా. అందుచేత మొదటిపాదాన్ని వగపించు మ్రొక్కుబడిగా అంటే బాగుంటుంది. జీవగర్ర అన్నమాట సమయోచితం. మంచిపద్యం.

   తొలగించు
 4. పగవారిని తిరస్క రించుట
  తగదు,ప్రదక్షిణము సేయఁ దలిదండ్రులకున్
  భగవంతుడు మనగణపతి నే
  రుగగణ నాయకు డయ్యె రుద్రుని కృపతోన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పగవారిని తిరస్క రించుట తగదు అన్న ఉటంకింపుకీ మిగిలిన పద్యానికీ ఏమీ పొంతన లేదు. గమనించండి. పద్యంలోని విషయాల మధ్య అన్వయం‌ కుదరాలి ప్రత్యక్షం గానో పరోక్షం గానో.

   తొలగించు
 5. కంసుని ఊహగా నా ఊహ.

  చెల్లికి నష్టమమ్మునను చేటొనరించెడు బిడ్డ పుట్టెనా
  మెల్లగ జంపి వేసెదను మించెడు ప్రేమము లమ్మ నాన్నకున్
  చెల్లిని చూడ నిద్దరిని జేసెద బంధితులన్ పరైషులౌ
  తల్లికి దండ్రికిన్ దగ బ్రదక్షిణ జేయగరాదు సంతుకున్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఇతరులనే ప్రేమించే తల్లికి దండ్రికిన్ దగ బ్రదక్షిణ జేయగరాదు సంతుకున్ అని కంసుడు భావించాడనటం‌ బాగుంది. కాని నష్టమమ్మునను పరైషులు బోధపడటం లేదు.

   తొలగించు
  2. చెల్లికిన్ అష్టమమ్మునన్ : చెల్లికి అష్టమ గర్భమున
   పరైషులు : పరులబాగు యందు కోరిక గలవారు

   అని నా భావమండీ.

   తొలగించు
 6. తల్లికిదండ్రికిన్దగబ్రదక్షిణసేయగరాదుసంతుకు
  న్నల్లదెయొప్పునేరమణ! యావిధమౌపలుకంగనీకిట
  న్దల్లియుదండ్రియున్మనకుదైవములీభువినౌటయెప్పుడు
  న్నుల్లముసంతసించగనునొప్పునుజేయబ్రదక్షిణంబునున్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అల్లదె? (ప్రాసాయాసం) ఆవిధమౌపలుకంగ (ఆవిధిగన్ పలుకంగ అనవచ్చు) సంతసించగను నొప్పును - ఒప్పదు! సంతసించగ నొప్పును అనేదే సాదువు. బ్రదక్షిణంబునున్ బాగోదు బ్రదక్షిణంబులున్ అనండి. పద్యాన్ని మరలా చిత్రిక పట్టండి.

   తొలగించు
 7. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మగువలు సిగముడి వేయక
  తగదు ప్రదక్షిణము సేయఁ ; దలిదండ్రులకున్
  భగవత్స్వరూపులను కొని
  తగు రీతిని విలువనీయతగు సంతునకున్

  నిన్నటి సమస్యకు పూరణములు

  గణము యతులును ప్రాసలు గలుగునట్టి
  పద్యమున కైత బలుకుట వరము గాగ
  పామరునకు ఛందస్సును పట్టు వడక
  పద్దియము కాలకూటంపు ముద్ద గాదె

  విద్య సమస్త మానవుల విజ్ఞత నొందగ జేయ , గద్య నై
  వేద్యము కన్నమెండగును వేవురు మెచ్చగ పద్య విద్యయే ;
  సద్యశగామిగా జడుని చక్కని కైతల బల్కు మన్న, నా
  పద్యము కాలకూటవిషభాండము గాదె కవిత్వవేదికిన్"

  మొన్నటి సమస్యకు వైవిధ్యమైన పూరణ

  భూమి పతుల జంపి పరశు
  రాముఁడు ధర్మమును జెఱచె ; రాజులు మెచ్చన్
  భూమిజను వరించు తఱిని
  రాముడు రాజులను బ్రతుక ప్రాణము నిలిపెన్

  ప్రత్యుత్తరంతొలగించు
 9. వగచుచు బాధల బతుకుట
  తగదు, ప్రదక్షిణము సేయ దలిదండ్రులకున్
  తగురీతిన పూజించిన,
  భగవంతుడెదారిజూపు బాధలు తొలగున్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సేయ బదులు ఇక్కడ సేసి అని ఉంటే సరిగా ఉండేది. కాని కుదరదు కదా. కాబట్టి మూడవపాదంలో పూజింపగ అనండి. బాగుంది మొత్తం‌ మీద.

   తొలగించు
 10. తగునేనిట్లుడువంగను
  తగదుబ్రదక్షిణముసేయదలిదండ్రులకు
  న్దగుననినెరుగుటమనవిధి
  పగతురకున్జెప్పవలదువలదనినెపుడున్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పూరణాయాసంగా ఉందనిపిస్తోంది. మొదటి పాదం అర్థం? తగునని+ఎఱుగుట -> తగునని యెఱుగుట అవుతుంది.

   తొలగించు
 11. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. కల్లలనెల్లవేళలనుకాదనకుండగనాడవచ్చునే
  యెల్లలు లేని శాంతమున యింతికి సేవలు జేయవచ్చు రం
  జిల్లుచునత్తమామలనుజేర్చుకొనందగునింటనార్తిమై
  తల్లికి దండ్రికిన్దగ బ్రదక్షిణ సేయగరాదు సంతుకున్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మొదటి మూడు పాదాలు బాగానే వచ్చాయి. కాని సమస్యాపాదాన్ని పద్యంలో అన్వయించటం లేదు కదా? సేయగరాదె అని ఉంటే అన్వయం వచ్చేది. కాని సమస్య మార్చలేం‌ కదా.

   తొలగించు
 13. పగతురకైననుహరి.యీ
  నగుబాటొనగూర్చునట్టినమ్మబల్కుటల్
  జగమున శుభోదయమ్ములె
  తగదు బ్రదక్షిణముసేయదలిదండ్రులకున్

  ప్రత్యుత్తరంతొలగించు
 14. తగవులు పెద్దలతోడుత
  తగదు, ప్రదక్షిణ ము సేయ దలిదండ్రులకున్
  తగిన వి దమ్ముగ సతము క
  లుగు సుఖములు లోకమందు రూఢిగ వినుడీ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. క/లుగు సుఖములు రూఢిగాను లోకేశు దయన్

   తొలగించు
  2. పూరణ ఉచితంగా ఉంది.
   సమస్యాపూరణంలో సరే. కాని దేశి ఛందస్సుల్లో వీలైనంతవరకూ పాదోల్లంఘనం చేయకండి.అది వృత్తాలకే బాగుండే వ్యవహారం.

   తొలగించు
 15. నేటి రెండొవ సమస్యకి పూరణ

  పెల్లుబుకంగ నెవ్వరికి పిన్నలు ప్రేముడి జూపగాదగున్ ?
  గుళ్లను దూరి మూర్తులను కోరెడు తీరుల నేది వంద్యమౌ?
  తల్లిలుదండ్రులున్ క్షితిని దైవ సమానులటంద్రు యేరికిన్ ?
  తల్లికిఁ దండ్రికిన్ /దగఁ బ్రదక్షిణ సేయఁగరాదు/ సంతుకున్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సమస్యను విభజించి చేసిన విధానం‌ బాగుంది. కాని గుళ్ళో మూరులకు ప్రదక్షణ చేయగారాదు అనవచ్చునా?

   తొలగించు
 16. కల్ల యనంగ రాదు మన కంటికి కన్పడు దైవమూర్తులే
  యుల్లము నందు నిల్పి కర మొప్పుగ సేవలు సేయ నొప్పగుం
  బ్రల్లద మాడగం దగదు భక్తి విహీనత దుష్ట బుద్దినిం
  దల్లికిఁ దండ్రికిన్ దగఁ బ్రదక్షిణ సేయఁగరాదు సంతుకున్


  ఖగరాజ గమను డమరవ
  రగణ సుపూజిత బకారి రయమున పల్కెన్
  భగవంతు డయిన, సుతుఁ గని
  తగదు ప్రదక్షిణము సేయఁ దలిదండ్రులకున్

  ప్రత్యుత్తరంతొలగించు
 17. దిగులుగ వగచెడి వేళను
  నగవులలో నాడి విలసనమ్ముల నుండన్
  సుగముగ నిదురను జెందిన
  తగదు ప్రదక్షిణము సేయ తలిదండ్రులకున్

  ప్రత్యుత్తరంతొలగించు
 18. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  తల్లియు ద౦డ్రియున్ వయసు దాటిన మీదట

  . వారి c బ్రేముడిన్

  జల్లని రీతి c బోషణము సల్పిన జాలు

  . గదయ్య ! యేటికిన్

  దల్లికి ద౦డ్రికిన్ దగ బ్రదక్షిణ | సేయగ

  . రాదు స౦తుకున్

  జెల్లని పూజ | వారి c గడచేరుచు

  . మ౦త్యము న౦దు , చా లికన్ ! !

  ప్రత్యుత్తరంతొలగించు
 19. తగరని యాశ్రమముననిడి
  విగతులగుచు నస్సమాధి వేదికఁ జేర
  న్నొగిరించుచు నాడు సుతులు
  తగదు ప్రదక్షిణలు సేయ తలిదండ్రులకున్!  ప్రత్యుత్తరంతొలగించు
 20. కల్లలనెల్లవేళలనుకాదనకుండగనాడవచ్చునే
  యెల్లలు లేని శాంతమున యింతికి సేవలు జేయవచ్చు రం
  జిల్లుచునత్తమామలనుజేర్చుకొనందగునింటనార్తిమై
  తల్లికి దండ్రికిన్దగ బ్రదక్షిణ సేయగరాదు సంతుకున్

  ప్రత్యుత్తరంతొలగించు
 21. తల్లికిఁ దండ్రికిన్ దగఁ బ్రదక్షిణ సేయఁగ, రాదు సంతుకున్
  ముల్లె, మహోన్నతంబయిన పూజ్యుల దీవన లెల్లకాలమున్
  చల్లని చేయి తాకిడియు సర్వ మనోవ్యథ లన్ హరించు నీ
  యుల్లము సంతసిల్లు ముద మొప్ప ప్రదక్షిణ మాచరించినన్.


  ప్రత్యుత్తరంతొలగించు
 22. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 23. తగవుల తలపుల చేతను
  తగదు ప్రదక్షిణము|”సేయతలిదండ్రులకున్
  తగిన విధంబగుసేవే
  తెగమెచ్చగ వారిమనసు దిగులే దరుగున్|”
  2.పిల్లల,పెద్దలందరిని పెంపుకు మార్గము పార్వతీ పతౌ
  తల్లికి తండ్రికిన్ దగ బ్రదక్షిణ|” సేయగరాదు సంతుకున్
  నెల్లపుడెంచు మోసముల నేర్పుల కూర్పులదుష్ట భావనల్
  నల్లిక మానసాన తగునాశయ సిద్దిగ నేర్పుటెప్పుడున్”.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. చల్లని చూపులన్విమల సంస్క్రతి నల్లన రంగరించినం
  దెల్లమొగాలవారె పరదేవతలంచును నమ్మికొల్చుచున్
  కల్లగు ప్రేమజూపుచును కల్మషమంతయు రూపుగొంచునుం
  దల్లికిదండ్రికిన్దగ బ్రదక్షిణ సేయగరాదు సంతుకున్.

  ప్రత్యుత్తరంతొలగించు
 25. భగవానునురూపంబగు
  జగమందలిమాతపితలు చల్లగజూడన్
  వగచుచు నిర్లిప్తంబుగ
  తగదు ప్రదక్షిణలుసేయ తలిదండ్రులకున్.

  ప్రత్యుత్తరంతొలగించు
 26. జగతిని మూషిక వాహను
  డు గణాధిపతి యగుట గనుడొక పరి మదిలో!
  ఎగతాళిగ తల బోయుట
  తగదు ప్రదక్షిణము సేయ దలి తండ్రులకున్!

  ప్రత్యుత్తరంతొలగించు
 27. పగతుర తోడను కయ్యము
  తగదు;ప్రదక్షణము సేయ దలి దండ్రులకున్
  తగునది సతతంబు హితమొ
  నగూర్చగ కలుగు శుభంబు ననవరతంబున్

  ప్రత్యుత్తరంతొలగించు
 28. తగరని యాశ్రమముననిడి
  విగతులగుచు నస్సమాధి వేదికఁ జేర
  న్నొగిరించుచు నాడు సుతులు
  తగదు ప్రదక్షిణలు సేయ తలిదండ్రులకున్!  ప్రత్యుత్తరంతొలగించు
 29. కందము మొదటి పాదంలో సవరణ. భగవానుని, అని చదువగోరెదను.

  ప్రత్యుత్తరంతొలగించు
 30. ఉల్లము సంతసించునటు లుండక పెద్దతనంబులోన దా
  నెల్ల విధాల సాయపడ కించుకయుం దయ లేక మిమ్ము నే
  నొల్ల నటంచు బోవిడిచి యుర్విజనంబుల మెప్పుకోసమై
  తల్లికి దండ్రికిన్ దగ ప్రదక్షిణ సేయగరాదు సంతుకున్.

  అగణితమగు సద్భక్తియు
  భగవన్నిభులన్న భవ్యభావము మరియున్
  తగినంత శ్రద్ధబూనక
  తగదు ప్రదక్షిణము సేయ తలిదండ్రులకున్.
  (హ.వేం.స.నా.మూర్తి)

  ప్రత్యుత్తరంతొలగించు
 31. పగతురకున్నపకారము

  తగదు; ప్రదక్షిణము సేయ దలిదండ్రులకున్

  భగవంతుని రూపముగా

  నగుపింతురు గాదె పిల్లలందరి కెపుడున్.

  ప్రత్యుత్తరంతొలగించు
 32. పగతురకున్నపకారము

  తగదు; ప్రదక్షిణము సేయ దలిదండ్రులకున్

  భగవంతుని రూపముగా

  నగుపింతురు గాదె పిల్లలందరి కెపుడున్.

  ప్రత్యుత్తరంతొలగించు
 33. కవిమిత్రులకు నమస్కృతులు...
  జ్వరం పూర్తిగా తగ్గలేదు. నిన్నటి కంటె కొద్దిగా ఆరోగ్యం మెరుగయింది. అస్వస్థత వల్ల వైభవంగా ప్రారంభమైన కృష్ణాపుష్కరాల గురించి కాని, వరలక్ష్మీ వ్రత పర్వదినాన్ని కాన్ని బ్లాగులో ప్రస్తావించలేకపోయాను. అందరికీ శుభాకాంక్షలు!
  సన్మిత్రులు, సహృదయులు తాడిగడప శ్యామలరావు (శ్యామలీయం) గారు మిత్రుల పద్యాలను సమీక్షిస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతాంజలి!
  రేపటికి సంపూర్ణంగా కోలుకుంటాననే నమ్మకం ఉంది.. నా ఆరోగ్యం విషయమై సందేశాలు పంపిన మిత్రులకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. వరలక్ష్మీవ్రత, కృష్ణాపుష్కర శుభాకాంక్షలతో
   గురుదేవులకు

   ఆరోగ్యము కుదుటపడిన
   పూరణలు సమీక్షఁ జేయు పురసత్తందున్
   పూరితి విశ్రాంతి గొనుడు
   శారీరక స్వస్తతంద శంకరు దయతో.

   తొలగించు
 34. ఆర్యా!
  నమస్కారములు, ఆరోగ్య పరిరక్షణ విషయంలో శ్రద్ధ వహించగలరు. త్వరగా స్వస్థత చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 35. పగతురకున్నపకారము

  తగదు; ప్రదక్షిణము సేయ దలిదండ్రులకున్

  భగవంతుని రూపముగా

  నగుపింతురు గాదె పిల్లలందరి కెపుడున్.

  ప్రత్యుత్తరంతొలగించు
 36. భగవంతుని దయ మీపై పూర్తిగా ఉంది మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండగలరు సద్గురు సాయినాధుని,ఉమారామలింగే శ్వరుని కృప మీపై గలదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 37. కందము మొదటి పాదంలో సవరణ. భగవానుని, అని చదువగోరెదను.

  ప్రత్యుత్తరంతొలగించు