భారత దేశమ్ము భళి మాతృభూమి యౌ ......భారతీయులు నాకు బంధుగణము పలురీతులను సంపదల నొప్పు నాదేశ ......వారసత్వము గర్వ కారణమ్ము దీని యర్హత కయి పూనుకొందును సదా ......నిజముగా ప్రేమింతు నీ ధరిత్రి నా తల్లిదండ్రుల నా గురు వృద్ధుల ......గౌరవింతును సదా కల్ల కాదు
నడచుకొందును మర్యాద నందరి యెడ ప్రజల పట్లను దేశమ్ము పట్ల నేను సేవ జేసెడి వాంఛను జెంది యుందు వారి శ్రేయోభి వృద్ధులే కారణమ్ము నాదు సంతోష మున కిది నా ప్రతిజ్ఞ.
.ఆ.వె:కర్మభూమి మనది ధర్మ భూమియునిదే తాపసులకు నిదియె త్రాణ యయ్యె వేద విద్య లలర వెలసె మందిరములు మునులు తపము చేసి ముక్తి గనిరి.
.ఆ.వె:దానవుండు తాను దైత్యబుద్ధిని జూపి దాచె సంద్రమందు ధరణి నపుడు పొత్రి రూప మంది పుడమిని కాపాడి ధవుడు నయ్యె తాను ధాత్రి కచట. .ఆ.వె:శిష్ట జనులకాచి దుష్టల శిక్షింప నవతరించె నిలను హరియు తాను రామజన్మ భూమి రమణీయమైనది ధర్మభూమి మరియు కర్మ భూమి.
.ఆ.వె:వసుధ పులకరించు వానల్లు కురియంగ పసిడి పంట లిడుచు పరవశించు మూడు కాలములను ముచ్చటగ గురియ జీవ కోటి వెలుగు చేవ నంది
హ.వేం.స.నా.మూర్తి గారు పవిత్ర గంగా తరంగ ప్రవాహ సరణి మీ కవితోత్పలముతో భారతమాతను నుతియించి రబీంద్రనాథ ఠాగూర్ మహాశయుని గుర్తుకు తెచ్చారు. మనఃపూర్వకాభినందనలు.
"కారముతోడ వెల్గునది గావున తన్మయతంగని యెల్లవేళన్." అనిన గణాధికమై యసంపూర్తిగా వదిలినట్లు సంశయము కలుగుచున్నది. "కారముతోడ వెల్గునది గావునఁ బూజ్యము యెల్లవేళలన్" అని పూర్తి చేసిన బాగుండునని భావిస్తాను.
ఆర్యా! కామేశ్వరరావు గారు, ధన్యవాదములు. గణాధిక్యతను గుర్తించలేక పోయాను. క్షంతవ్యుడను. తెలియబరచి సవరించినందుకు ధన్యవాదములు. అయితే "పూజ్యము యెల్లవేళలన్" అను విధముగా యడాగమము యుక్తము కాదేమో కనుక దానిని "కారముతోడ వెల్గునది గావున మోక్షద మెల్లరీతులన్" అను విధముగా సవరించుచున్నాను. ధన్యవాదములు.
గురువుగారూ ధన్యవాదములు మీ అడ్రస్ తెలియజేస్తే మానాన్న గారు వ్రాసిన గ్రంధాలు పంపుతాను మీలాంటి వారి సన్నిధిలో ఆ గ్రంధాలు ఉన్నచో ఆయన ప్రతిభ వెలుగు చూస్తుందని నా నమ్మకం -రామకృష్ణ
రామకృష్ణ గారూ, సంతోషం! తప్పక పంపించండి. చదివి నా స్పందనను తెలియజేస్తాను. అవసరమైతే బ్లాగులో ప్రకటిస్తాను. నా చిరునామా... కంది శంకరయ్య, 11-27-100, మడేలయ్య గుడి దగ్గర, కొత్తవాడ, వరంగల్ - 506002. ఫోన్ : 8886058976.
రిప్లయితొలగించండిఅందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభా కాంక్షలు
------------------------------
తెలుగు పలుకుల తల్లిగా వెలుగు లీను
సిరులు పొంగెడి మనభూమి జీవ గడ్డ
మమత పంచెడి ప్రియమైన మాతృ భూమి
కవుల వనమందు విలసిల్లు కావ్య కన్య .
అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిభరత దేశము యభివృద్ధి భవిత గనగ
భాజప సవారి జేయుచు వడివడి గను
తిరిగెడి యశోక చక్రము తీరు గాను
మూడు రంగుల చిత్రము ముచ్చట గను !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
'దేశము+అభివృద్ధి' అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. 'భరతదేశంపు టభివృద్ధి' అనండి.
తీరిన కోర్కెల ఫలమయి
రిప్లయితొలగించండిపోరిన స్వారాజ్య పటిమ పూతంబవగన్
జేరెను సప్తతి వర్షము
భారత మాతకు నిడుదును ప్రణతులు నేడే!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు
నేనుభారతీయుడనౌటనిరతమునిల
రిప్లయితొలగించండిగర్వమొందుదుమరియునుగారవించి
వందనంబులుసేతునుభరతమాత!
యన్నివేళలవిడువకయందుకొనుము
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆచార్యత్రయ నిలయము
రిప్లయితొలగించండిప్రాచీన తర మనుధర్మ పాలిత ధరయే
ప్రాచుర్యము దమశమములఁ
దోచును భారతము స్వర్గ తుల్యముగ నిలన్
పోచిరాజు కామేశ్వరరావు గారూ,
తొలగించండిమీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభారత దేశమ్ము భళి మాతృభూమి యౌ
రిప్లయితొలగించండి......భారతీయులు నాకు బంధుగణము
పలురీతులను సంపదల నొప్పు నాదేశ
......వారసత్వము గర్వ కారణమ్ము
దీని యర్హత కయి పూనుకొందును సదా
......నిజముగా ప్రేమింతు నీ ధరిత్రి
నా తల్లిదండ్రుల నా గురు వృద్ధుల
......గౌరవింతును సదా కల్ల కాదు
నడచుకొందును మర్యాద నందరి యెడ
ప్రజల పట్లను దేశమ్ము పట్ల నేను
సేవ జేసెడి వాంఛను జెంది యుందు
వారి శ్రేయోభి వృద్ధులే కారణమ్ము
నాదు సంతోష మున కిది నా ప్రతిజ్ఞ.
మిస్సన్న గారూ,
తొలగించండిప్రతిజ్ఞను ఛందోబద్ధం చేసిన మీ నైపుణ్యం ప్రశంసనీయం.
రిప్లయితొలగించండి1.ఆ.వె: పుణ్యభూమి మనది పొంగిపొరలు శ్రీలు
కనగ లేరు జనులు కన్ను లుండి
ఆటు పోట్ల నబ్ధి యడలగ భరియింతు
నాక మన్న నిదియె నరుల కెల్ల.
.ఆ.వె:కర్మభూమి మనది ధర్మ భూమియునిదే
తాపసులకు నిదియె త్రాణ యయ్యె
వేద విద్య లలర వెలసె మందిరములు
మునులు తపము చేసి ముక్తి గనిరి.
.ఆ.వె:దానవుండు తాను దైత్యబుద్ధిని జూపి
దాచె సంద్రమందు ధరణి నపుడు
పొత్రి రూప మంది పుడమిని కాపాడి
ధవుడు నయ్యె తాను ధాత్రి కచట.
.ఆ.వె:శిష్ట జనులకాచి దుష్టల శిక్షింప
నవతరించె నిలను హరియు తాను
రామజన్మ భూమి రమణీయమైనది
ధర్మభూమి మరియు కర్మ భూమి.
.ఆ.వె:వసుధ పులకరించు వానల్లు కురియంగ
పసిడి పంట లిడుచు పరవశించు
మూడు కాలములను ముచ్చటగ గురియ
జీవ కోటి వెలుగు చేవ నంది
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
భారతదేశవాసినగు భాగ్యము నాకు లభించె దీనినిన్
రిప్లయితొలగించండికారణ జన్మమంచు బహు గౌరవ చిహ్నముగాగ దల్చెదన్
వీరులు ధీరసత్తములు విజ్ఞవరేణ్యులు మౌని వర్యులున్
చారుగుణాఢ్యులై వెలుగు సాధుజనంబులు దేశభక్తులున్
కోరికమీర సత్యమును కూర్మిధరించుచు సంఘసేవకై
చేరుచునుండు వారలును శ్రేష్ఠులు సంతతసౌమ్యమూర్తులున్
వారును వీరలం చసమభావము చూపని యున్నతోన్నతుల్
సూరిజనంబులున్ పతియె సుమ్మిల దైవము సత్యమంచు సం
స్కారము జూపు సాధ్వులును శాస్త్రము లారును నాల్గువేదముల్
సారభరంబులౌ యుపనిషత్తులు పూర్వకథార్థసంఘముల్
సౌరులు చిందు కావ్యతతి సాధుజనావన దీక్ష లెల్లెడన్
మేరలులేని సఖ్యతలు మేలొనరించెడి శాంతికామనల్
చారుతరంబులైన ఘనశబ్దసుగంధము లందు భాషలున్
స్వైర విచార యోగ్యములు చక్కని సంస్కృతు లద్భుతంపు స
త్కారము జూపు క్షేత్రములు కమ్మని సూక్తులు నిర్మలంబులౌ
నీరము లందజేయుచును నిత్యసుఖంబులు గూర్చు వాహినుల్
పారములేని త్యాగములు భవ్యయశంబుల కాలవాలమీ
ధారుణి మూడువర్ణముల ధన్యత గూర్చు పతాకయుక్త నా
భారతభూమి పుణ్యనిధి భాగ్యనిధానము సర్వదా శుభా
కారముతోడ వెల్గునది గావున తన్మయతంగని యెల్లవేళన్.
అందరికీ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ ఉత్పలమాలిక అద్భుతంగా ఉంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఆర్యా
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
ఆర్యా
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
హ.వేం.స.నా.మూర్తి గారు పవిత్ర గంగా తరంగ ప్రవాహ సరణి మీ కవితోత్పలముతో భారతమాతను నుతియించి రబీంద్రనాథ ఠాగూర్ మహాశయుని గుర్తుకు తెచ్చారు. మనఃపూర్వకాభినందనలు.
తొలగించండి"కారముతోడ వెల్గునది గావున తన్మయతంగని యెల్లవేళన్." అనిన గణాధికమై యసంపూర్తిగా వదిలినట్లు సంశయము కలుగుచున్నది.
"కారముతోడ వెల్గునది గావునఁ బూజ్యము యెల్లవేళలన్" అని పూర్తి చేసిన బాగుండునని భావిస్తాను.
ఆర్యా!
తొలగించండికామేశ్వరరావు గారు, ధన్యవాదములు. గణాధిక్యతను గుర్తించలేక పోయాను. క్షంతవ్యుడను. తెలియబరచి సవరించినందుకు ధన్యవాదములు. అయితే "పూజ్యము యెల్లవేళలన్" అను విధముగా యడాగమము యుక్తము కాదేమో కనుక దానిని
"కారముతోడ వెల్గునది గావున మోక్షద మెల్లరీతులన్" అను విధముగా సవరించుచున్నాను.
ధన్యవాదములు.
అవునండి ఉత్తర పదము విస్మరించాను. మోక్షదము కన్న పూజ్యమె యెల్లవేళలన్ అన్న సమంజసమనుకుంటాను.
తొలగించండిఅలాగేనండి, ధన్యవాదాలు.
తొలగించండిగర్వంబందితి భారతీయుడిగ సంకల్పంబు దైవాజ్ఞగా
రిప్లయితొలగించండిసర్వంబున్ సమకూర్చగా ధరణి విశ్వాసాన జీవింతుగా
నేర్వంబూనిన నాటిసంస్కృతుల సాన్నిధ్యాన సంతోషమౌ|
పర్వంబాయెను భారతీ ప్రతిభ సంబంధమ్ము సర్వస్వమై|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
ఎగసి పడే మువ్వన్నెలు
రిప్లయితొలగించండితెగజెప్పెడు తమ ప్రతీక దేశమ్మంతన్
ద్విగుణీకృతమౌ విధమున్
సగర్వముగ తెలిసి మెలుగ సౌఖ్యము లందున్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
పడే అన్నదాన్ని 'పడెడు' అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం.
తొలగించండిఎగసి పడెడు మువ్వన్నెలు
తెగజెప్పెడు తమ ప్రతీక దేశమ్మంతన్
ద్విగుణీకృతమౌ విధమున్
సగర్వముగ తెలిసి మెలుగ సౌఖ్యము లందున్
శంకరాభరణం బ్లాగు గురుదేవులు శ్రీ కంది శంకరయ్య గారికి , కవిమిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
రిప్లయితొలగించండివడ్డూరి అచ్యుత రామకవి,స్వాతంత్ర్య సమరయోధులు- భరతమాత
భూరి సస్యఫల ప్రపూర్ణ సంపూర్ణ సౌభాగ్య భాగ్యోపేత భరతమాత
భరతాది సుగుణ సంభరిత పాలిత నిత్యఫలిత పుణ్య వ్రాత భరతమాత
హతపాతక వ్రాత నుతలోక సంఘాత బహువిధాఖ్యాత మా భరతమాత
భరతాది సుగుణ సంభరిత పాలిత నిత్య ఫలిత పుణ్యవ్రాత భరత మాత
హతపాతక వ్రాత నుతలోక సంఘాత బహువిధాఖ్యాత మా భరతమాత
పూర్వ సంచిత భాగ్య భోగ్య సంధాత దుర్భర దుఃఖ నాశ శ్రీ భరతమాత
మహిత విష్ణు పదీపూత భరతమాత
వర మహావీరమాత మా భరతమాత
భవ్యరత్న ప్రసూతి మాభరతమాత
మాతలకు మాత భారతమాత దలతు
స్వాతంత్ర్య సమరోర్వి సత్యాగ్రహంబులు శాసనోల్లంఘనల్ జరిపినాము
అమల జాతీయ గీతాలాపనంబుల బేర్చి యుత్సాహంబు గూర్చినాము
ఇంగ్లీషు వారిపై యేవగింపును బెంచు వరపద్య గేయముల్ వ్రాసినాము
ఇల్లు పిల్లలవీడి ఇంగ్లీషువారిచే చెఱసాల నిడుములు జెందినాము
గుండుదెబ్బల కేదురేగి గుండెలిచ్చి
రక్షక భఠాళి లాఠీల రాటుదేలి
భరతమాత విముక్తికి పాటుబడిన
తొల్లిటి స్వతంత్ర్య వీరయోధులము మేము
రచన :వడ్డూరి అచ్యుతరామ కవి,స్వాతంత్ర్య సమరయోధులు (సమర్పణ వడ్డూరి రామకృష్ణ )
రామకృష్ణ గారూ,
తొలగించండివడ్డూరి అచ్యుతరామ కవి గారి మనోహరమైన ఖండికను వీలైనంత తొందరలో ప్రత్యేకంగా బ్లాగులో పోస్టు చేస్తాను. ధన్యవాదాలు!
గురువుగారూ ధన్యవాదములు మీ అడ్రస్ తెలియజేస్తే మానాన్న గారు వ్రాసిన గ్రంధాలు పంపుతాను మీలాంటి వారి సన్నిధిలో ఆ గ్రంధాలు ఉన్నచో ఆయన ప్రతిభ వెలుగు చూస్తుందని నా నమ్మకం -రామకృష్ణ
తొలగించండిరామకృష్ణ గారూ,
తొలగించండిసంతోషం! తప్పక పంపించండి. చదివి నా స్పందనను తెలియజేస్తాను. అవసరమైతే బ్లాగులో ప్రకటిస్తాను. నా చిరునామా...
కంది శంకరయ్య,
11-27-100, మడేలయ్య గుడి దగ్గర,
కొత్తవాడ,
వరంగల్ - 506002.
ఫోన్ : 8886058976.