26, ఆగస్టు 2016, శుక్రవారం

సమస్య - 2126 (కలలం గాంచెడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కలలు గనెడి శిలలు పలుకగలవు"
(దూరదర్శన్ వారి సమస్య)
లేదా...
"కలలం గాంచెడు గండశైలములు పల్కంగల్గు స్పష్టమ్ముగన్"

105 కామెంట్‌లు:

  1. గుండెనంత ప్రేమ మెండుగా కల్గిన
    కంట తడిని దాచె కష్ట మందు
    మాటరాని తండ్రి మదిని తెరచి జూడు
    కలలు గనెడి శిలలు పలుకగలవు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొలిమేర మల్లేశ్వర రావు గారూ,
      ఆర్ద్రమైన భావంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. శ్రీగురుభ్యోనమః

    జలధిన్ దాగిన మేరుపుత్రు డమితాశ్చర్యంబునన్ గాంచుచున్
    శిలలన్ నిండిన రూపమున్ విడచి తా సేవింపగా నెంచుచున్
    పలికెన్ మారుతి సంతసించునటులన్ వాగ్దానమున్ పొందదగా
    కలలం గాంచెడు గండశైలములు పల్కంగల్గు స్పష్టమ్ముగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శ్రీపతిశాస్త్రి గారు మైనాకుడు మేరు దౌహిత్రుడు కద. మేరు పుత్రిక మేనక (హిమవంతుని భార్య) కొడుకు. మేనకాత్మజుడు కావున మైనాకుడు.
      నేను "మేరుపుత్రగిరీశాయ నమః " అను వేంకటేశుని అష్టోత్తర శత నామావళి లోని పదమున కర్థము వెదకు చున్నాను మేరుపుత్రు డెవరాయని.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      మేరు పుత్రుడు మైనాకుడనడం దోషమే.
      ఈ క్రింది విషయం మీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడండి....
      సప్తగిరుల్లో ప్రధానమైనది శేషాద్రి. విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట. కొంతసేపు వారిమధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదన ఎటూ తెగకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకొనేందుకు ఓ మార్గం చెప్పారు. మేరు పర్వత భాగమైన ఆనందశిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా, ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి. పోటీప్రకారం ఆదిశేషుడు ఆనందశిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత వాయువు ఏంచేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగ ఎత్తి చూశాడు. ఇంకేం! పట్టుసడలింది. క్షణమాత్రకాలంలో వాయువు ఆనందశిఖరాన్ని కదిలించి స్వర్ణముఖీ నదీ తీరాన దించాడట. అదే శేషాచలమని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.
      మేరు పర్వత భాగ (సంతాన) మైన ఆనందశిఖరానికి అధిపతి... అని అర్థం చెప్పుకొనవచ్చునా?

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అద్భుతమైన వివరణ నిచ్చి నా యన్వేషణా వృత్తమును స్పష్ట పరచినారు. శేషాద్రియని యనుకున్నాను కాని మూలము తెలియక యవస్థ పడితిని. శతసహస్రాధిక నమఃపూర్వక ధన్యవాదములు.
      విష్ణు లోకమున నున్న క్రీడాద్రిని తీసుకు వచ్చి వేంకటాచలము వద్ద నుంచమని గరుత్మంతుని వేడగా నతడట్లు చేసెను.

      ఒక పర్వత రాజమున కన్వయమగు నట్లు వ్రాసిన పద్యమును తిలకించ గోర్తాను.

      శేష నగాధివాసరత శీఘ్ర వృషాక్షిసుగోచరా సదా
      తోషిత నాధఖాతతట తోయజనేత్ర సుమేరుపుత్ర సం
      తోషద శైలనాధ లస దుత్తమ విష్ణు సదాభిధాన సం
      భాషణ భవ్యపుష్పచయ వందిత మారుత వేంకటేశ్వరా

      [నామాలు: శేషాద్రి నిలయాయ; వృషదృగ్గోచరాయ; సరస్స్వామి తటీజుషే (నాధఖాతము= స్వామి పుష్కరణి); మేరుపుత్రగిరీశాయ; విష్ణవే; వాయుస్తుతాయ ]

      తొలగించండి
    5. కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    6. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.ధన్యవాదములు. ఇది నేను తిరిగి వ్రాస్తున్న (పూర్వము వ్రాసినదిప్పుడలభ్యమైనది.) “వేంకటేశ్వరా” శతకములోనిది. ఇంతవరకు 40 పద్యముల వరకు వ్రాసితిని.

      తొలగించండి
    7. శ్రీ కామేశ్వరరావు గారికి, గురువు గారికి నమస్సులు. ఒక పాత నిఘంటువులో మేరువు ఆన్న పదానికి హేమాద్రి అని ఉండగా నేను హిమాద్రి గా పొరబడి తప్పుగా వ్రాసినాను. క్షమించ ప్రార్థన. సవరించిన పద్యమును పరిశీలింప ప్రార్థన.

      జలధిన్ దాగిన శీతశైలసుతు డాశ్చర్యంబునన్ గాంచుచున్
      శిలలన్ నిండిన రూపమున్ విడచి తా సేవింపగా నెంచుచున్
      పలికెన్ మారుతి సంతసించునటులన్ వాగ్దానమున్ పొందదగా
      కలలన్ గాంచెడు గండశైలములు పల్కంగల్గు స్పష్టమ్ముగన్

      తొలగించండి
  3. ఇలలో మానవ జన్మ బుద్బుదము గా నీక్షించి కాలంపు వే
    యలలన్నాపగలేని భావనలవే యంతంబుగాన్ వేచి తా
    మెలమిన్ శాశ్వత రీతి నీతి నిలుపన్ మేలంచు శిల్పప్రభన్
    కలలం గాంచెడు గండశైలములు పల్కంగల్గు స్పష్టంబుగన్

    రిప్లయితొలగించండి
  4. పలుకు కులుకనెంచె భావన కరువయ్యె
    భాష మాధ్యమంబు బట్టె గాని
    జాతికొక్క భాష జాలదు యులినంటి
    కలలు గనెడు శిలలు పలుక గలవు
    కలలు గనెడి శిలలు పలుక గలవు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా వారూ,
      మీ రెండవ పూరణ బాగుంది.
      '...జాలదు+ఉలినంటి' అన్నపుడు యడాగమం రాదు. 'సరిపడ దులినంటి...' అందామా?

      తొలగించండి


  5. అమర శిల్పి చేత నమరమై వెలుగొందు
    కలలు గనెడి శిలలు పలుక గలవు
    పలుక గలవు కవుల పదపొందికల మేలు
    కూర్పులు కలకాల కొత్త పలుకు!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కలకాల కొత్త...' అనడం దుష్టసమాసం. 'కూర్పులు నిరతమ్ము క్రొత్తపలుకు' అందామా?

      తొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు :

    దైవ సేవ కొరకు తీరుగా సుప్తిలో
    కలలు గనెడి శిలలు పలుక గలవు
    ననుచు నిద్ర జెందు యపవారకము లెంచి
    శివుని రూపు నొకటి శిల్పి నిలిపె.

    (అపవారకము= శిల;- శిలలు నిద్ర పోతాయట. నిద్రలో ఉన్నప్పుడు శిలలు తేలికగా బరువు లేకుండా ఉంటాయని శిల్పులు వాట్లకై అన్వేషించి తెచ్చిశిల్పాలను చెక్కుతారట. ఆ భావనను మన సమస్యాపూరణకు దగ్గరగా ఉండే విధంగా కొద్దిగా మార్చి అన్వయించడానికి ప్రయత్నం చేసాను.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...గలవు+అనుచు=గల వనుచు' అవుతుంది. అక్కడ నుగాగమం కాని, నగాగమం కాని రావు. '..గల వ।టంచు...' అనండి. అలగే 'నిద్ర జెందు నపవారకము..' అనండి.

      తొలగించండి
  7. కనులు తెలుపు భాష కలకలమును రేపు
    కలలు గనెడి శిలలు పలుక గలవు
    మనిషి మదిని మెండు మాలిన్యము లునిండ
    బ్రమ్మ కైన తరమె నెమ్మి కనగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      బ్రమ్మ శబ్దం లేదు. బమ్మ, బొమ్మ సాధువులు.

      తొలగించండి
  8. రాళ్ళు రాగ మొలికి రాగాల సృజియించు
    శిల్పి చేయి నొదిగి శిల్పములగు
    చరిత జూపి క్రాంతి భరితమై నిదురించి
    కలలు గనెడి శిలలు పలుక గలవు!

    రిప్లయితొలగించండి
  9. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    నాటి కళల నెల్ల నేటికిన్ దలచుచు

    కలలు గనెడు శిలలు పలుకరి౦చు |

    హ౦పి వచ్చి పోవు యాత్రిక జనులకు ,

    కృష్ణరాయవిభుని కీర్తి చాటు |

    రిప్లయితొలగించండి
  10. కలలు గనుచు వాని కాలమ్ము కెదురీది
    ఫలమునందవలెను పట్టుబట్టి
    శిల్పి హస్త ఘాతశీఘ్రత రూపొందు
    కలలు గనెడి శిలలు పలుక గలవు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కాలమ్ముకు' అనరాదు. 'కాలాని కెదురీది...' అనండి.

      తొలగించండి
  11. చెలువారాధ్యుడు రాజుభోజుడిలలో సింహాసనంబెక్కగా
    చెలువంబొప్పెడు సాలభంజికలు వాసింజెప్పె చిత్రంబుగన్
    విలువల్గల్గిన విక్రమార్కుని యశో విఖ్యాత చారిత్రముల్
    కలలం గాంచెడు గండశైలములు పల్కంగల్గు స్పష్టమ్ముగన్

    చెలువారాధ్యుడు స్త్రీలచే ఆరాధించబడినవాడు అంటే అందగాడు అని నా భావము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చెలువ అన్నది తెలుగుమాట, ఆరాధ్య శబ్దం సంస్కృతం. కాబట్టి ఇలా చెలువారాధ్యుడు అని సమాసం చేయరాదండి.

      తొలగించండి
    2. శ్యామలరావు గారూ నమస్సులు. చెలువుండాతడు పరిశీలించ ప్రార్థన.

      తొలగించండి
    3. చెలువుండాతడు అన్నది నిర్దోషమైన సమాసమే. కాని అతడు చెలువుడు అన్నప్పుడు 'ఎవరికి అతడు చెలువుడు' అన్నది కూడా పద్యంలో అన్వయించాలండి.

      చెలువారాధ్యుడు అని సమాసం చేయరాదండి అన్నప్పుడు ఎందుకలా చేయకూడదో స్పష్టంగానే చెప్పాను. మీకూ అభ్యంతరం కాలేదు. మరెవరూ వివరణ అడుగలేదు. కాని కలహప్రియత్వం కలవారు మాత్రం వరూధిని బ్లాగులో చెలువారాధ్యుడనెనురా కలకలములను చెలరేపు కామింటొచ్చెన్ అంటూ అకటావికటం పద్యం ఒకటి వాక్రుచ్చారు! ఇలాంటి కలహప్రియుల ఉద్దేశం నన్ను శంకరాభరణం బ్లాగుకు దూరం చేయాలని తప్ప మరేమీ కాదు. కనీసభాషాజ్ఞానం లేకో లేనట్లు నటించటానికో తింగరిప్రశ్నలతో దాడులు చేస్తే వాళ్ళ అజ్ఞతకు నవ్వుకోవటం తప్ప మరేమీ చేయలేం.

      తొలగించండి
    4. శ్యామలరావు గారూ, మీ వంటి పెద్దల మార్గదర్శకత్వం మా వంటి వారికి నిత్యావశ్యకము. మీ మాట శిరోధార్యము. దయచేసి అటువంటి వారి విమర్శలను పట్టించుకోకుండా మాకు మీ అమూల్యమైన సలహాలను ఇస్తూ ఉండమని ప్రార్థన.

      చెలువుడు అంటే అందగాడు అనిఇక్కడ అన్వయం సరిపోతుందేమో తెలియజేయ మనవి.

      తొలగించండి
    5. ఫణి కుమార్ గారు "చెలువంబారగ" అన్న బాగుంటుందేమో చూడండి.

      తొలగించండి
    6. ఫణి కుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      శ్యామలీయం గారి వ్యాఖ్యను గౌరవించి స్వీకరించినందుకు సంతోషం. పండితులు, పెద్దలు, అనుభవజ్ఞులు ఇచ్చే సూచనలను సహృదయంతో స్వీకరించే సంస్కారాన్ని అలవరచుకున్నపుడే మన రచనారీతిని మెరుగు పరచుకొనగలం.
      *******
      శ్యామల రావు గారూ,
      ఎవరో ఎక్కడో ఏదో అన్నారని మీరు నొచ్చుకోవద్దు. ఫలాలనిచ్చే చెట్లకే రాతి దెబ్బలు. దూషణ, భూషణ, తిరస్కారాలకు అతీతమైన స్థితప్రజ్ఞతను అలవరచుకొన్నపుడే ప్రశాంతత! మనం చేస్తున్న పనిలో దోషం లేనప్పుడు చేసుకుంటూ పోవడమే. ఏదైనా పని చేస్తున్నపుడు మెచ్చేవాళ్ళతో పాటు దూషించేవాళ్ళూ ఉంటారు.
      మీ జ్ఞానం, అనుభవం శంకరాభరణం బ్లాగులోని ఔత్సాహికులకు అవసరం...

      తొలగించండి
  12. గాఢనిద్రలోనకనునటమనుజుడు
    కలలుగనెడిశిలలుబలుకగలవు
    పలుకుశిలలుగానిబరగనన్నియుగావు
    మేలుజాతిశిలలుబలుకునార్య!

    రిప్లయితొలగించండి
  13. చక్రవర్తి నగుదు విక్రమరూపినై
    నాట్య భంగిమలను నాతినగుదు
    పండితుండనగుదు పలురీతులంచును
    కలలుగనెడు శిలలు పలుక గలవు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తలపుల్ జూచిన భీకరంబగును సంతాపంబులంగూర్పగా
      కలతల్ రేపగ క్రౌర్యమార్గముల దుష్కార్యంబులంజేయగా
      నిలలోబెక్కురు శైలసదృశులు దుర్నీతిన్ వినోదించుచున్
      కలలం గాంచెడు, గండశైలములు పల్కంగల్గు స్పష్టమ్ముగన్.

      తొలగించండి
    2. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  14. సుహితుడైనట్టి శిల్పిని చూడగానె
    కలలు గనెడుశిలలు పలుకగలవు
    యోగ్యమైన శిల్పము తన భాగ్యమనుచు
    చెక్కు బొమ్మల నాతడు చక్కగాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సమస్య పాదం ఆటవెలది అయితే మీరు తేటగీతి వ్రాశారు. 'కలలు గనెడు శిలలు పలుకగలవు నిజము' అనండి.

      తొలగించండి
  15. తొలుతన్ మ్రొక్కిరి విష్ణు (న్) శేష గరుడాదుల్ మేము నీ యేడు కొం...
    డలమై త్వత్పద సన్నిధానమున నుండన్ జూడుమా యంచు నే
    డిలలో వాటిని జేరగా మనకు బోధించున్ మహాతత్త్వమున్..
    కలలన్ గాంచెడు గండశైలములు పల్కంగల్గు స్పష్టమ్ముగా !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు మురళీకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తొలుతన్ శౌరికి మ్రొక్కి శేష...' అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి

  16. "కలలు గనును శిలలు"కల్లగాదని వింటి

    హంపి క్షేత్రమందు నంటు కొనగ

    సరిగమలను రాతి స్తంభాలు పలికెగా

    కలలు గనెడు శిలలు పలుక గలవు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఈ పురాణ గుర్తుకొచ్చింది, ఎవరు వ్రాస్తారా అని చూస్తున్నా .. బాగున్నది

      తొలగించండి
    3. శంకరయ్య గారూ! మల్లేశ్వరరావు గారూ!
      ధన్యవాదములు.

      తొలగించండి
    4. శంకరయ్య గారూ! మల్లేశ్వరరావు గారూ!
      ధన్యవాదములు.

      తొలగించండి
    5. శంకరయ్య గారూ! మల్లేశ్వరరావు గారూ!
      ధన్యవాదములు.

      తొలగించండి

  17. పలుకున్ మోహనరాగమున్ మురళి గోపాలోష్ఠ సంబద్ధమై!
    లలనల్ కొప్పుల దాల్చునట్టి సుమబాలల్ నవ్వులన్ రువ్వెడున్ !
    ఉలితో జక్కన చెక్క శిల్పములుగా నొళ్లంత తుళ్లింతగా
    కలలన్ గాంచెడు గండశైలములు పల్కంగల్గు స్పష్టమ్ముగా!!

    రిప్లయితొలగించండి
  18. అమర శిల్పి చేత నమరమౌ రూపుకై
    కలలు గనెడు శిలలు పలుక గలవు
    సుత్తి యులిని దాక సుతిమెత్తగా సోకు
    చేతనమ్ము సొంపు చిందుమనగ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అమర రూపమునకై...' అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:

      అమర శిల్పి చేత నమర రూపమునకై
      కలలు గనెడు శిలలు పలుక గలవు
      సుత్తి యులిని దాక సుతిమెత్తగా సోకు
      చేతనమ్ము సొంపు చిందుమనగ.

      తొలగించండి
  19. నిన్నటి దత్తపది పూరణ
    శివమగునట జగములకును
    భవహర మగు. ఫణి ఫణముల పదనటనల రు
    ద్ర విహరణ వినినను గనినను
    అవనిజనులు పరవశమున నభివినుతించన్

    రిప్లయితొలగించండి
  20. ఆనాటి దూరదర్శన్ కేంద్రము సమస్యకు నేను పంపిన పూరణ
    సమస్య ఆటవెలదిలో నుంటే పూరణ కందములో ,ప్రసారములో
    చదివినారు

    ఫలియించును మీప్రేమలు
    జ్వలియించిన మనసులందు జనియించిన కో
    ర్కెలు ఆమని పిలువగనే
    కలలు గనెడి శిలలు పలుక గలవు సరిగమల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      ఈ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
      'కోర్కెలు ఆమని' అని విసంధిగా వ్రాయరాదు కదా! 'కో।ర్కెలు పిలువగనే యామని...' అందామా?

      తొలగించండి
    2. గురుదేవుల సూచనమేరకు సవరించిన పద్యము
      పద్యము తమకు నచ్చినందుకు ధన్యవాదములు
      ఫలియించును మీప్రేమలు
      జ్వలియించిన మనసులందు జనియించిన కో
      ర్కెలు పిలువగనే యామని
      కలలు గనెడి శిలలు పలుక గలవు సరిగమల్

      తొలగించండి
  21. పుత్ర రూప శత్రువులు కర్క శాత్ములు,
    దారుణ వచనములు మీరి, కంక
    గాత్ర ధారు లెల్ల పిత్రార్జితద్రవ్య
    కలలు గనెడి శిలలు పలుక గలవు

    [కంకము = రాబందు; కల = భాగము]


    విలపింపంగ నిరంతరమ్ము జనులం బీడించు దుష్టుల్ ధరా
    తలమందెప్పుడు చౌర్యవృత్తిఁ జని చిత్తక్షోభ దుర్భాషలం,
    దలలం దీసెడి క్రూరజంతువులు నిత్యంబుగ్ర దుష్కర్మలం
    గలలం గాంచెడు గండశైలములు, పల్కంగల్గు స్పష్టమ్ముగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.ధన్యవాదములు.

      తొలగించండి
  22. లలనా!వింటివెయీగురూత్తమునినాలాపమ్ములన్నీవిట
    న్గలలంగాంచెడుగండశైలములుపల్కంగల్గుస్పష్టమ్ముగ
    న్గలయాయేమిదివాస్తవమ్మమరియేకాలంబునందైనయే
    శిలయున్బల్కుటవింటివేయమలనీజీవాత్మబ్రశ్నించుమా

    రిప్లయితొలగించండి
  23. క్షమింంచంండి.యతికొరకు ఆలాాపము అన్నాాను

    రిప్లయితొలగించండి
  24. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    నాటి కళల నెల్ల నేటికిన్ దలచుచు
    కలలు గనెడు శిలలు పలుకరి౦చు |
    హ౦పి వచ్చి పోవు యాత్రిక జనులకు ,
    కృష్ణరాయవిభుని కీర్తి చాటు |

    { శి ల లు క ల లు క న లే వు మా టా డ లే వు . కా నీ , * జీ వ క ళ * క లి గి
    వి గ్ర హ రూ ప ము లొ ను న్న శి ల లు
    యా త్రి కు ల ను ప లు క రి ౦ చ గ ల వు .

    అవి ఆ నా టి శి ల్ప క ళ త ల చు కొ ని ,,,
    క ల లు కూడా క న గ ల వు }

    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    " తిలకి౦చ౦ గదె ! కృష్ణరాయవిభు కీర్తిన్ ,
    ………………... యాత్రి కా ! నీ " వట౦

    చలరన్ జేసెడు విగ్రహ౦బులు , నికన్ ,
    ………………… సా.రీ.గ.మా.పా.ద.నీ

    పలుకన్ గల్గుచు హ౦పి లోన గల
    …………… సప్తస్త౦భముల్ , నాటి యా

    కళ యెల్లన్ మదిలో తల౦పునకు రాగా ……………… యూహల౦ దేలుచున్

    కలల౦గా౦చెడు గ౦డశైలములు పల్క౦గల్గు
    ………………… స్పష్ట౦బుగా ! ! !

    { రె౦డవపాదములొ యతి , " సా" = స + ఆ
    నాటియాకళ = ఆనాటి ఆ శిల్ప కళ .
    పలుక౦గల్గు స్పష్ట౦బుగా = జీవకళ కలిగిన
    విగ్రహాలు యాత్రికులతోమాటాడగలవు , హ౦పి స్త౦భములు సరిగమలు పలుకగలవు }

    రిప్లయితొలగించండి
  25. ఇలలో నద్భుతమైన శిల్పములు ప్రత్యేకమ్ముగా జెక్కి శో
    ​భల జోడించి సజీవు లన్నటులుగా భావమ్ము గల్గించుచున్
    ​శిలలంజెక్కి స్వరమ్ములన్ బలుకగా ​చిత్రమ్ములన్ చేయగా​
    కలలం గాంచెడు గండశైలములు పల్కంగల్గు స్పష్టమ్ముగన్!

    రిప్లయితొలగించండి
  26. 1.ఉలియు తగుల గానె నుల్లము రంజిల్లి
    శిలయు కూడ మంచి శిల్పమగును
    రాతికట్టడంబె రమణీయమై నొప్పు
    కలలు గనెడి శిలలు పలుక గలవు.

    2.శిక్షితుండు నైన శిల్పిచేతులందు
    బండరాయికూడ పలుక గలదు
    తరము లెన్నొ మారె తరగని వన్నెతో
    కలలు గనెడి శిలలు పలుక గలవు.

    3.పంటి బిగువుతోడ పనిచేయుచును తండ్రి
    భార్యబిడ్డలనిల బాగపెంచు/బిడ్డ పాపలనిల పెంచుచుండు
    మౌనబాధగనగ మనసు తెలియవచ్చు
    కలలు గనెడి శిలలు పలుక గలవు.
    4.బాటమీద నున్న బండ దైవమగును
    భక్తి తోడ గొల్ల పల్కు చుండు
    జనుల నమ్మకమ్మె జగతిలోన నిజము
    కలలు గనెడి శిలలు పలుక గలవు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ నాల్గు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'రమణీయమై యొప్పు' అనండి.
      రెండవ పూరణ మొదటి పాదంలో 'చేతులందు' అన్నచోట గణదోషం. '..శిల్పి చేతులలోన/చేతుల బడి' అనండి.

      తొలగించండి
  27. ఉలి చేతంగొని యున్నతాశయముతో నుత్సాహముం బూని యా
    జలజాతోద్భవ శంకరాది సుమనస్సంఘంబునుం దల్చి యే
    ఫలమాశించక మూర్తులన్ మలచు నా భాగ్యాఢ్యుడౌ శిల్పికిన్
    కలలం గాంచెడు గండశైలములు పల్కంగల్గు స్పష్టమ్ముగన్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  28. శ్రద్ధబూని నిరత సద్భావసహితుడై
    దేవతార్చనమున దివమురాత్రి
    రచన చేయుచుండు శుచియైన శిల్పికి
    కలలు గనెడి శిలలు పలుకగలవు.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  29. రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో'అమరమేగ' అన్నచోట కదా అనే అర్థంలో గ అనడం సాధువు కాదు. రెండవపాదాన్ని జగణంతో ప్రారంభించడం గణదోషం.
      రెండవ పూరణలో 'ఉలికి నూహ లొసగి...' అనండి. '...గలవు+ఎట్లు' అన్నపుడు యడాగమం రాదు. '..గల వదెట్లు' అనండి.

      తొలగించండి
  30. పిన్నవయసునందె పెనిమిటి మరణింప
    మనసు శిలగ మారె మగువ కపుడు
    బాధ్యతలను దీర్చ బండరాయిగమారె
    కలలు గనెడి శిలలు పలుక గలవు.
    అన్వయం కుదిరిందో లేదో సందేహంగా వుంది

    రిప్లయితొలగించండి
  31. కలలౌనా నిజ మీధరన్? గలలు నిక్కంబౌ నసత్యంబులే
    కలకాలంబు మనంబులో గల మనోకాంక్షాంతమున్గాక యే
    పలురీతుల్ నిదురందు వచ్చుకల దుర్భ్రాంత్యౌ గదాయెట్టులన్
    కలలం గాంచెడు గండశైలములు పల్కంగల్గు స్పష్టమ్ముగన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దుర్భ్రాంతి+ఔ=దుర్భాంతియౌ' అవుతుంది. అక్కడ సంధి లేదు. 'దుర్భ్రాంత్యావహమ్మౌ గదా' అందామా?

      తొలగించండి
  32. విలసత్కాంచన శోభితంబులును వైవిధ్యప్రకారంబుగాన్
    చెలువన్ రాజితవిశ్వకర్మ సృజియించెన్ దీప్తిమంతంబుగాన్
    తులనాతీతవిభాసమౌ మయసభన్ దుర్యోధనుండాడెనే
    "కలలన్ గాంచెడు గండశైలములు పల్కన్ గల్గు స్పష్టమ్ముగాన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  33. శ్రీదర రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  34. శిలల నైన మలచి శిల్పములుగ మార్చి
    రాతి గుండె లందు రాగములను
    మీటు శిల్పి వచ్చి మేలు చేయుననుచు
    కలలు గనెడి శిలలు పలుక గలవు!

    రిప్లయితొలగించండి
  35. క్షమించండి, మార్పుతో రెండవది ప్రచురించ బోయి పొరబాటున మొదటిది తీసెయ్యడం జరిగింది.శిలల మలచి జాతి శిల్పములుగ మార్చి
    రాతి గుండె లందు రాగములను
    మీటు శిల్పి వచ్చి మేలు చేయుననుచు
    కలలు గనెడి శిలలు పలుక గలవు!

    రిప్లయితొలగించండి
  36. .అమర మౌను హంపి యనగ ఆలయాన శిల్పముల్
    ప్రమద|కలలుగనెడిశిలలు పలుకగలవుజూడుమా
    శ్రమకు దగిన ఫలితమిచటశాశ్వితాననిల్పగా?
    అమరియుండు స,రి,గ,మ,లట అంతరంగశైలముల్ {ప్రమద=వనిత}
    2.ఉలికి నూహలొసగి నుత్సాహ బరచిన
    శిల్పి కళలు నిలచి సిద్దబడగ?
    కలలు గనెడి శిలలుపలుక గలవ దెట్లుట్లు?
    పలుకురాతి ప్రతిమ నిలిపినపుడు|
    3శిలలన్ శిల్పియు కల్పనా గతుల విశ్లేషించి చిత్రంబుగా
    నిలుపన్ స్తంబము లెన్నియో గుడికి|నన్వేషించి గొట్టంగనే
    వలితం బందున శబ్ద తాండవమునన్ వర్ణాట మూహించగా?
    కలలంగాంచెడిగండ శైలములు పల్కన్ గల్గు స్పష్టమ్ముగన్ {వలితం=కదలిక బొందిన[వర్ణాటం=సంగీతం]
    శ్రీకంది శంకరయ్యగురువుగారికివందనములతో సవరించినపూరణ

    రిప్లయితొలగించండి
  37. ఆ.వె. పేరు గాంచిన ఘనమైన బేళూరు శిల్పాల
    తీరు గాంచి నంత తెలుపు చరిత
    మనము బెట్టి మనము వినగల్గి ననుచాలు
    కలలు గనెడి శిలలు పలుక గలవు

    రిప్లయితొలగించండి
  38. సవరణ: మొదటి పాదం
    " పేరు గాంచి నట్టి బేళూరు శిల్పాల"

    రిప్లయితొలగించండి
  39. తరచి తరచి మనసు పరికించిన మరుల
    కధలు వినెడి విరులు కదలగలవు
    చరిచి చరిచి తనువు సవరించిన తుదకు
    కలలు గనెడి శిలలు పలుకగలవు

    రిప్లయితొలగించండి
  40. "కలలు గనెడి శిలలు పలుకగలవు"
    ఈ సమస్య కీ.శే. రాళ్లబండి వారు చాలా యేండ్ల క్రితం దూరదర్శనం లో ఇచ్చారండీ. పాదం చదువగానే వారు తలపుకు రావడం చేత చెబుతున్నాను అంతే.

    రిప్లయితొలగించండి
  41. పిలువన్ పల్కరు రాణులిమ్మహిని కౌపీనమ్ము దండంబుతో
    కలలో నైనను నివ్వరే కబళమున్ కాసింత చట్నీయును
    న్నిలలో నీరవ మోడిచూపగనె మాణిక్యాలు నీలాలనున్
    కలలం గాంచెడు గండశైలములు పల్కంగల్గు స్పష్టమ్ముగన్

    రిప్లయితొలగించండి