కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్"
(ఆకాశవాణి వారి సమస్య)
లేదా...
"నిదురించినవాఁడు కీర్తినే గడియించున్"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్"
(ఆకాశవాణి వారి సమస్య)
లేదా...
"నిదురించినవాఁడు కీర్తినే గడియించున్"
రిప్లయితొలగించండిమదిని పరమునందు నిలిపి
నిదురించినవాఁడు కీర్తినే గడియించున్
కుదురుగ యోగము జేయుచు
బెదురక జీవితము గడుప పెరుగును సుఖముల్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముద్దుల బాలకృష్ణు నగుమోమును జూచిన సంతసంబగున్
రిప్లయితొలగించండిపెద్దలు పిన్నలున్ గొలుచు భేదము లేకయె వాని రూపమున్
హద్దులు లేకయే చిలిపి యల్లరి జేసి యశోద చెంగటన్
నిద్దుర పోవువాడు ధరణిన్ ఘనకీర్తిగడించి మించెడిన్.
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు.
తొలగించండికం. కదనములో సింహము వలె
ఎదిరించిన శత్రు మూకలెందరినైన
న్నదుముచును రిపుల గుండెల
నిదురించెడి వాడు కీర్తినే గడియించున్.
సుద్దుల జెప్పువారె బలు సోకుల పోకడలున్నవారె పో
రిప్లయితొలగించండిహద్దులు మీరి నీతికిల హంతకులై చరియించువారె నా
గద్దరి రాక్షసప్రముఖ గౌరవ మందెడు వారి గుండెలన్
నిద్దుర పోవువాడు ధరణిన్ ఘన కీర్తి గడించి మించెడిన్
కుదురుగ నారోగ్యంబను
రిప్లయితొలగించండిపదిలపు భాగ్యంబుకన్న పరమిల గలదే
నిదురకు నోచక దీనుడె
నిదురించినవాడు కీర్తినే గడియించున్
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు :
రిప్లయితొలగించండి1. కొదవడు రీతుల జనతను
సదమద పరచిన దనుజుల చమరిన హరియే
మది విరతికి కలశాబ్ధిన్
నిదురించిన వాడు, కీర్తినే గడించున్.
2. ఉదధిన ధర్మము నెంచుచు
ముదముగ నీతిని నిలుపుచు మాధవ భజనల్
హృదయంగమముగ జేయుచు
నిదురించిన వాడు కీర్తినే గడియించున్
క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'ఉదధిని' అనండి.
శ్రీ క్రొవ్విడి వెంకట రాజారావు గారి రెండు పద్యములు బాగున్నవి. రెండవ పద్యం రెండవ పాదంలో యతి మైత్రిని ఒక మారు సరి జూడ గలరు.
తొలగించండి-గుఱ్ఱం జనార్దన రావు
శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు. మీరు సూచించిన రీతి ' ఉదధిన ' కు బదులు ' ఉదధిని ' అని మారుస్తాను.
తొలగించండిశ్రీ గుర్రం జనార్ధనరావు గారికి నమస్కారములు. మీ పరిశీలనకు కృతజ్ఞతలు. పొరబాటైంది. ' మాధవ ' కు బదులు ' మురహరి ' అని మారుస్తాను.
ఇప్పుడు: పద్యం మరొకసారి-
ఉదధిని ధర్మము నెంచుచు
ముదముగ నీతిని నిలుపుచు మురహరి భజనల్
హృదయంగమముగ జేయుచు
నిదురించిన వాడు కీర్తినే గడించున్
అదనును కని తన దండుకు
రిప్లయితొలగించండిముదమునుకలిగించి శత్రు మూకలపైనన్
కదనముననురికి మదిలో
నిదురించెడు వాడుకీర్తినే గడియించున్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సదమల హృదయుడు జగతిని
రిప్లయితొలగించండిదొరకుట సులభమ్ము గాదు దొరతన మందున్
పదవులు దక్కిన చాలని
నిదురించిన వాఁడు కీర్తినే గడియించున్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపద్య పదబంధం బాగుంది.. రెండవ పాదంలోని ప్రాసను సరిచేయండి..
తొలగించండిఇద్ధరలోన సంతతము నెంచి కనుంగొన తెల్లమౌ సుమా!
రిప్లయితొలగించండితద్దయు ప్రేమతో ప్రజల తల్చుచు నిత్యము నప్రమత్తుడై
యుద్ధమునందునన్ తగిన వ్యూహము పన్నుచు శత్రుగుండెలన్
నిద్దుర పోవువాడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెదిన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
అదుమగ జాలడు నిరతము
రిప్లయితొలగించండినిదురించినవాఁడు. కీర్తినే గడియించున్
ముదముగ జేబట్టినపని
చదియక తుదివర కదనుగ సాధింపంగన్
పియెస్సార్ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అదుమగ జాలడు..... దేనిని?
పదిలము గొన జీవితమున
రిప్లయితొలగించండియెద లందున దలచి వలచి యెలమిని గన కో
విదుడై యోగ సుషుప్తిని
నిదురించిన వాడు కీర్తినే గడియించున్!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సదమల కరపద్మముతో
రిప్లయితొలగించండిపద పద్మము దాల్చి వక్త్ర పద్మమునందున్
ముదముగ వటపత్రమ్మున
నిదురించినవాడు కీర్తినే గడియించున్ !!
"అద్దిర ! సామియే శరణమయ్యప ! " యంచును ఘోష బెట్టుచున్
ముద్దుగ "భక్తిభావమను" మూటను నెత్తిన దాల్చి "యిర్ముడిన్ "
వద్దని రాజభోగముల, భక్తుడు రాతిరి ఱాతినేలపై
నిద్దుర పోవువాడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్ !!
మైలవరపు మురళీకృష్ణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
మైలవరపు మురళీకృష్ణ గారు నమస్కారములు. పద్మామనోహరుడు పద్మగర్భుని కన్నతండ్రి యైన పద్మనాభుని విశేషముగా పద్మాకరనాధ తరంగ విలాసితుని పద్మత్రయముతో వర్ణించారు మనోహరముగా!
తొలగించండికదనమునందునరిపులద
రిప్లయితొలగించండిడదడలుబుట్టించిదానుడస్సియుమిగులన్
బదుగురుగనశాశ్వతముగ
నిదురించినవాడుకీర్తినేగడియించున్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముదముగ పరులను నిత్యము
రిప్లయితొలగించండిపదిలము నుంచగ సహాయ పడుచున్ ధరణిన్
యెదలో తృప్తియె నిండగ
నిదురించిన వాడుకీర్తినే గడియించున్
చేపూరి శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధరణిన్+ఎదలో' అన్నపుడు యడాగమం రాదు. 'పడుచున్ ధరలో। నెదలో...' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపదముల కడనుండెడు నరు
తొలగించండినదునుగఁ జూసియు నధర్ము నా కురు సమ్రా
ట్టు దరికి ముందుగ వచ్చిన
నిదురించిన వాడు కీర్తినే గడియించున్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సుద్దులునేర్చి నల్వురును చూడగ గొప్పగ చెప్పుకోవగన్
రిప్లయితొలగించండికద్దగు బుద్ధిగల్గి ఘనకార్యము జేయగ లోకమందునన్
పెద్దలు జెప్పు బాటలను పేర్మిని సాధన తోడ, వీడుచున్
నిద్దుర, పోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చెప్పుకోవగన్' అన్నదానిని 'చెప్ప నెంచియున్' అనండి.
మాస్టరుగారూ! ధన్యవాదములు.
తొలగించండిసుద్దులునేర్చి నల్వురును చూడగ గొప్పగ చెప్పనెంచియున్
కద్దగు బుద్ధిగల్గి ఘనకార్యము జేయగ లోకమందునన్
పెద్దలు జెప్పు బాటలను పేర్మిని సాధన తోడ, వీడుచున్
నిద్దుర, పోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్.
ఎద్దున నెక్కి లోకముల నిత్యము పాలన చేయువానినే
రిప్లయితొలగించండిహద్దులు లేక సంతతమిహంబున సౌఖ్యము లిచ్చి భక్తుల
న్నద్దరి జేర్చువాని మది నమ్ముచు చింతలు లేక హాయిగ
న్నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇద్దిపరోపకారమె శరీర మటంచుచు కూర్మిమీర యే
రిప్లయితొలగించండిహద్దులులేకపాటుబడిహాయి గనుండగనార్తులన్ సదా
ముద్దుగకాచువాడునిలమోదమనస్కుడు,వాడెతృప్తిగా
నిద్దురపోవువాడు,ధరణిన్ ఘనకీర్తిగడించిమించెడిన్
చేపూరి శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
'శరీర మటంచును..' అనండి.
పదుగురి హితమ్ము గోరుచు
రిప్లయితొలగించండిసదమలమతితోడ హరికి సన్నుతి లిడుచున్
విదునిగ జనహృదయమ్ముల
నిదురించినవాడు కీర్తినే గడియించున్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సన్నుతు లిడుచున్' అనండి.
హద్దులు దాటకన్నిట మహాద్యుతినిం గన జీవితమ్మునన్
రిప్లయితొలగించండిప్రొద్దును పుచ్చకుండ మది రోయక సంతస మానసమ్ముతో
నొద్దిక నొందుచున్ ఫల మహోదయ మందుచు చింతలేకయు
న్నిద్దుర పోవువాడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్!
శిష్ట్ల శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అద్దిరకృష్ణుడేయతడుహాయిగనచ్చటనవ్వుమోమునన్
రిప్లయితొలగించండినిద్దురపోవువాడు,ధరణిన్ ఘనకీర్తిగడించిమించెడిన్
ముద్దుగశంకరార్యులిటమోదమునొందగగావ్యముల్దగన్
పెద్దలుసంతసించగనుబెక్కులువ్రాసియునేర్పుపెంపునన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మదిలో స్వార్ధము తలపక
రిప్లయితొలగించండిపదుగురు పేర్కొను ప్రభువుగ పాలన సేయన్
నెదురొడ్డు రిపుల గుండెల
నిదురించిన వాడు కీర్తినే గడియించున్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొద్దులు చిన్నబుచ్చఁ గడు మూర్ఖపు సుద్దుల సద్దు సేయకన్
రిప్లయితొలగించండిమిద్దెలు లేక యున్న నిట మీరిన విద్దెలఁ బెద్ద నంచుఁ దా
బద్దును బూని శుద్ధ మతి బద్ధ పదార్పిత వృత్తి గ్రద్దనన్
నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్
కదనములఁ గాలు దువ్వక
పదిమందికి మంచి సేయ పరువున బ్రతుకే
పదిలముగ నుండ సుఖముగ
నిదురించినవాఁడు కీర్తినే గడియించున్
6/4/2016 నాటి పూరణ:
వదలక మది భూతముల మ
హదంచితానురతి పెద్దలందుంచక కిం
చిదగౌరవమ్ము సుఖముగ
నిదురించెడువాఁడు ధారుణిన్ యశమందున్.
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పోచిరాజు కామేశ్వరరావు గారు.. నమస్సులు.. మీ పూరణలు బాగుంటాయండీ.. శైలి కూడా.. కొంచెం నారికేళపాకం కూడా.. అభినందనలు..
తొలగించండిమైలవరపు మురళీకృష్ణ గారు నా పద్యములను సమీక్షించు చున్నందులకు ధన్యవాదములండి. ఉత్పలమాల లో వృత్యను ప్రాసకు ప్రయత్నించితిని.
తొలగించండి"సద్దు సేయుచున్" గా చదువ గోర్తాను
తొలగించండిప్రహేళిక :
రిప్లయితొలగించండికం.చీమల కాళ్ళు లావగు
సామజముల కాళ్ళు మిగుల సన్నంబగుగా !
భామల కాళ్ళు లోకువ
భూమీశా ! జనుల కాళ్ళు భోజన మౌగా !
పైకి కంపించే అర్థం:
చీమల కాళ్ళు లావుగా ఉంటాయంట! ఏనుగుల కాళ్ళు చాలా సన్నగా ఉంటాయంట ! భామల కాళ్ళు లోకువంట ! ( ఎవరికో ? ఎందుకో?) ఓ రాజా ! జనుల కాళ్ళే భోజన మౌతుందిగా ! ( ఇదేమిటో?)
ఓ రాజాస్థానానికి వచ్చిన కవి ఈ చమత్కార పద్యం చెప్పాడు. విన్న వారందరూ తికమక పడ్డారు. ఏమీ బోధ పడలేదు. చివరికి ఆ ఆస్థాన ప్రథాన కవి పండితుడు ఈ విధంగా విడమర్చి చెప్పాడు. రాజు సంతసించి ఇద్దరినీ సత్కరించాడు.
కవి భావన ఇది :
చీమలకు " ఆళ్ళు " చాలా పెద్ద గింజలౌతాయి కదా !అవే ఏనుగుల కైతే వాటి భారీ నోటికి పంటి క్రిందకు కూడా రావు. ఏనుగులకు " ఆళ్ళు" మిగుల సన్నం కాబట్టి. ఇక ఆడువారికి "ఆళ్ళు" దంచి పిండి కొట్టటం చాలా సులువైన పని కా బట్టి భామలకు " ఆళ్ళు" లోకువ.ఇక జనులకు " ఆళ్ళే" ప్రథానాహారం కదా నాడు !.
ఆధారం : గరికిపాటి నరసింహా రావు గారు టీవీ వన్ చానల్ లో నిర్వహిస్తున్న "సాహిత్యంలో హాస్యం " కార్యక్రమం నుండి (271 వ భాగం)
(ఆళ్ళ ధాన్యాన్ని ఆరికలని కూడా అంటారు.)
గుఱ్ఱం జనార్దన్ రావు గారూ,
తొలగించండిమీరు పరిచయం చేసిన చమత్కార పద్యం నాకు క్రొత్త! ధన్యవాదాలు!
ముదముగ తనకున్నంతలొ
రిప్లయితొలగించండిపదుగురికిన్ సాయపడుచు స్వార్ధ రహితుడై
యెదపై కరమిడి హాయిగా
నిదురించిన వాడు కీర్తినే గడియించున్.
మూడవ పాదంలో సవరణ.....
రిప్లయితొలగించండియెదపై కరమిడి హాయిగ
పిన్నక నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉన్నంతలొ అని లో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ఉన్నంతనె అంటే సరి పోతుంది కదా! అలాగే 'హాయిగ' అనండి, లేకుంటే గణభంగం.
ధన్యవాదాలు శంకరయ్య గారూ !
తొలగించండికదలక షణ్మాసమ్ములు
రిప్లయితొలగించండినిదురించెడి వాడు కీర్తినే గడియించున్
పదితలల రావణాసురు
ని దహరుడు కుంభకర్ణు నిద్రకు సముడన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదంలో గణదోషం. 'దహరుడున్..' అనండి.
గురుదేవుల సూచనతో గణ దోషము సవరించిన పద్యము
తొలగించండికదలక షణ్మాసమ్ములు
నిదురించెడి వాడు కీర్తినే గడియించున్
పదితలల రావణాసురు
ని దహరుడున్ కుంభకర్ణు నిద్రకు సముడన్
ముదమందుచు తనదేశపు
రిప్లయితొలగించండిసదమలయశమునకు జేయు సత్కార్యంబౌ
కదనంబున శాశ్వతముగ
నిదురించినవాడు కీర్తినే గడియించున్
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గద్దరిదైన వర్తనము క్రౌర్యము మోసము లీధరాస్థలిన్
రిప్లయితొలగించండివద్దు సహించబో మికను స్వార్థము చెల్లదటంచు నెంతయున్
పెద్దరికాన దుష్టులకు భీతిని గొల్పుచు వారి గుండెలన్
నిద్దురపోవువాడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్.
హ.వేం.స.నా.మూర్తి
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిముద్దులమోమువాడు కడు మోహనరూపుడు గోపబాలుడై
సద్దిని మూట గట్టుకొని చల్లని వేళల యాలమందతో
హద్దుల లోని చేలల విహారము జేయుచు యోగదృష్టితో
నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్
శ్రీపతి శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
1కుదురుగ నొకచో కూర్చొని
రిప్లయితొలగించండిమదిలో నెప్పుడు విడువక మాధవు రూపున్
వదలక జపమొనరించుచు
నిదురించిన వాడు కీర్తినే గడియించున్.
2.సదమల మగు మదితో శ్రీ
పదములు దలచుచు నిరతము పరవశ మొందన్
పదుగురు మెచ్చుచు నుండగ
నిదురించిన వాడు కీర్తినే గడి యించున్.
3.మదమున శ్రీహరిఁదిట్టుచు
కదనంబునకు సతతంబు కాలును దువ్వన్
వదలక వానిని చంపుచు
నిదురించిన వాడు కీర్తినే గడియించున్.
4.పదుగురు మెచ్చెడి రీతిని
ముదమును నొసగెడు పలుకులు ముందుగ బల్కన్
యుదధిశయనుండు మెచ్చగ
నిదురించినవాడు కీర్తినే గడియించున్.
5.కదనము నందున వైరుల
హృదయము లందున గుబులును రేకెత్తించన్
నదురుతొ వారట నుండగ
నిదురించిన వాడు కీర్తినే గడియించున్
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ముద్దుగ శేష తల్పమున మోహన రూపుని జూచి లక్ష్మి తా
రిప్లయితొలగించండివద్దకు వచ్చిప్రేమమున పాదము లోత్తుచునుండ హాయిగా
నిద్దురపోవువాఁడు, ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్
జిద్దున జేరి సప్తగిరి సేవలు భక్తులు జేయ నిత్యమున్
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్దతిలేని తెల్లదొర పాలన మార్చెను గాంధి|”శాంతినే
రిప్లయితొలగించండిశ్రద్దగ పంచి పెంచి మన శత్రువు మూకను పారదోలి యున్
సిద్దునివోలె బద్దుడిడు చేతన”? శాశ్విత కీర్తిశేషుడై
నిద్దుర బోవువాడు ధరణిన్ ఘనకీర్తి గడించెడిన్.{చేతన=జ్ఞానము}
2.పదవుల యందున నీతిగ
కదలాడెడి నదులులాగ కాంక్షలుదీర్చే
చదువరి సదాతనుడుగా
నిదురించిన వాడు కీర్తినే గడియించున్. {సదాతనుడు=విష్ణువు}
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నిద్దురరాదుగా యవని నీతిని తప్పిన వారికిన్ ధరన్
రిప్లయితొలగించండినిద్దుర పట్టునట్టులను నిత్యము జోలలు పాడినన్ మరిన్
నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్
నిద్దురపోవలెన్ ధరను నిశ్చల మానస మానవాళి యే
వడ్డూ(ద్దూ)రి రామకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారూ అభినందనలు
తొలగించండిముద్దులు మూటగట్టినటు ముగ్ధమనోహర దివ్య రూపుతో
రిప్లయితొలగించండినద్దిరబన్నయంచు నతి హర్షము తోడను గోపికా సుతున్
ముద్దుమొగంబునున్ దలచి మోదము నందెడు వాడిలన్ సదా
నిద్దుర పోవు వాడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ ముగ్ధమనోహరంగా ఉంది. అభినందనలు.
పీవీ:👇
రిప్లయితొలగించండిముద్దుగ భాషలెన్నియొను పొందుగ పల్కుచు వ్రాయగల్గియున్
సుద్దులు చెప్పకుండగనె చుప్పుగ చేతలు చేసిచూపుచున్
నిద్దుర నాటకమ్మవగ నిందలు మూర్ఖులు మోపుచుండగా
నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్