16, ఆగస్టు 2016, మంగళవారం

సమస్య - 2117 (రతినిఁ బెండ్లాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రతినిఁ బెండ్లాడె వారిజసుతుఁడు నిజము"
(ఆకాశవాణి వారి సమస్య)
లేదా...
"రతిని వివాహమాడెనఁట బ్రహ్మ నిజమ్మిది నమ్ము మిత్రమా"

74 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      ధన్యవాదాలు! సవరించాను.

      తొలగించండి
    2. నమ్మశక్యము గానిది బొమ్మనడత
      సృష్టిఁ జేసిన వాడైన దృష్టి మార్చి
      మోహవశమున భారతిఁ బుత్రిక నను
      రతినిఁ బెండ్లాడె వారిజసుతుఁడు నిజము

      తొలగించండి
    3. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    పద్మగర్భుడు బ్రహ్మ శబ్దార్థరూప
    యైన సితవర్ణ శోభయై యలరుచున్న
    భారతిని దివ్య వాసరా వాస గుణ ని..
    రతిని బెండ్లాడె వారిజసుతుడు నిజము !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు మురళీకృష్ణ గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      అద్భుతమైన పూరణతో బ్లాగులో అడుగు పెట్టారు. సంతోషం! అభినందనలు.

      తొలగించండి
    2. సాహితీమిత్రులకు వందనములు..అందరం కలసి యథాశక్తి సాహితీ సేద్యం చేసి రసవంతమైన మధుర పద్యఫలాలను ఆస్వాదిద్దాం..

      తొలగించండి
  3. మన్మధుడనబడునొకడుమైధిలిసుత
    రతినిబెండ్లాడెవారిజసుతుడునిజము
    వ్యాసవిరచితరచనలకాద్యుడవని
    కాదె?దెలుపుడుమీరలుగవివరేణ్య!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్య సుబ్బారావు గారూ,
      మీ పూరణ కొంత గందరగోళంగా ఉంది. రతి మైథిలి సుత ఎలా అయింది?

      తొలగించండి
    2. శoకరయ్యగాారికినమస్కాారములతో......ఈరతీమన్మధులులౌౌకికనాామధేయులు

      తొలగించండి
    3. వారిజ అనే ఆవిడ కొడుకు మన్మథుడనేవాడు మైథిలి అనే ఆవిడ కూతురు రతిని పళ్ళాడాడు. సరే! బాగుంది. కాని మూడవపాదానికి అన్వయం?

      తొలగించండి
  4. అతులిత మాధురీస్వనము లందరి వాక్కులలోన నింపగా
    సతతము వాగ్విలాసముల సంతసమొప్పగ నుండు దేవి వౌ
    శ్రుతి లయ తాళముల్ గమక శోభలు సృష్టివిపంచి నొప్ప భా
    రతిని వివాహ మాడెనట బ్రహ్మ నిజమ్మిది నమ్ము మిత్రమా.

    రిప్లయితొలగించండి

  5. ప్రతి నిమేషము పనిజేసి ప్రగతి గనుచు
    అతి కొలది కాలమానము నందు అలసి
    సొలసి మానస పుత్రిక సొబగు బ్రాహ్మి
    రతినిఁ బెండ్లాడె వారిజసుతుఁడు నిజము

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఇక్కడ రతి శబ్దానికి అనురాగముతో, అనురక్తితో అనే అర్థం స్వీకరించాలి.

      తొలగించండి
  6. మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    అతులిత వేదవాఙ్మయ విహాయస పూర్ణ శశాంక , సాహితీ
    సిత శతపత్ర పీఠి , కవిశేఖర మానసరాజహంస , మో..
    దిత మృదు వైణికాస్వన , సుధీ రసనాగ్ర నివాస, వాణి, భా...
    రతిని వివాహమాడెనట బ్రహ్మ నిజమ్మిది నమ్ము మిత్రమా !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మురళీకృష్ణ గారూ మీ పూరణ భారతి పదపంకజముల చెంత సుమనోహర పరీమళాలను వెదజల్లే సుమరాజమై యలరారుతోంది.

      తొలగించండి
    2. మురళీకృష్ణ గారూ,
      మిస్సన్న గారు చెప్పినట్లు మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    3. మైలవరపు మురళీకృష్ణ గారు మనోహరమైన పూరణ చేశారు. మీ వాక్పటిమ శ్లాఘనీయము. . అబినందనలు.

      తొలగించండి
  7. సాహితీమిత్రులులందరికీ నమశ్శతమందారాలు.. ఈ శంకరాభరణాన్ని ఈ రోజే గమనించాను.. పద్యాలపై ఆసక్తి తో రెండు పూరణలు పంపించాను.. దోష గుణ విచారణ నిరభ్యంతరం.. ఆస్వాదించమని మనవి..

    మీ మురళీకృష్ణ

    రిప్లయితొలగించండి
  8. శ్రీ కంది శంకరయ్య గారికి నమస్సులు.. పోస్ట్ చెయ్యడం క్రొత్త.. అందుచే పుననర్ముద్రింపబడినవి తొలగించుచబడినవి. మన్నించండి..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మురళీకృష్ణ గారూ,
      క్రొత్తగా పోస్ట్ చేస్తున్నపుడు ఇటువంటి తడబాటు సహజమే! పరవాలేదు.

      తొలగించండి
  9. కరమున కచ్ఛపీరవ సుగానము వాదన జేసి రంజిలన్
    వరమయి వాక్కులందలరి భాగ్యము నిచ్చెడి మంజులాంగినిన్
    సరసన జేర్చి సంఘటిల సంశయమున్
    విడనాడి యొప్ప భా
    రతిని వివాహమాడెనట బ్రహ్మ నిజమ్మిది నమ్ము మిత్రమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. అవునండి మన్నించాలి..తొందరలో గమనించలేదు

      తొలగించండి
    3. ప్రాస సవరించిన పద్యము:

      హితమయి కచ్ఛపీ రవ రహిన్ వెలయించుచు వాద మొప్పగన్
      సిత కమలంబులం దొనరి సేమ
      మెరింగి జగత్తునంతటన్
      సతతము బ్రోచు వాణిగని
      సంశయమున్ విడనాడి యొప్ప భా
      రతిని వివాహమాడెనట బ్రహ్మ
      నిజమ్మిది నమ్ము మిత్రమా!

      తొలగించండి
    4. తొందరలో శిష్ట్లా వారు, అస్వస్థత వల్ల నేనూ ప్రాసదోషాన్ని గమనించలేదు.

      తొలగించండి
    5. శర్మ గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    6. ధన్యవాదములు గురువు గారూ మీరు సరయిన పరీక్షలుచేయించుకొని తగిన మందులు వాడండి....ఆలస్యము చేయవద్దు...

      తొలగించండి
  10. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఆంధ్ర భాషా ప్రాభవ కాంక్షమాణాభిమాన చేతస్కులు నౌత్సాహిక కవిచయ ప్రోత్సాహక మానసులునై నిస్వార్థ నిరపేక్ష హృదయులునై పద్మావతీ శ్రీనివాసమును మనోహర ధారావాహికగ ప్రచురించిన మీ మహోన్నత వ్యక్తిత్వమునకు శత సహస్రాధిక కృతజ్ఞతాభివందనములు.
    సప్తాంబోధిపరీతమైన భూవలయ ప్రజానీకమును, విశేషించి మన కవిపుంగవ కుటుంబములను కరుణా కటాక్ష వీక్షణములతో తరింప జేయవలెనని సర్వాంతర్యామియైన పద్మావతీ శ్రీనివాసుని వేడుకొంటున్నాను.
    ఈ ద్విపద కావ్యము లోని గుణములను స్వీకరించి దోషములున్న తెలియ పరచవలెనని కోరుకుంటున్నాను.
    భవదీయుడు
    పోచిరాజు కామేశ్వర రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ కావ్య ప్రచురణను ఒక బాధ్యతగానే భావించాను. మీ రచనను పదుగురికి పరిచయం చేసే అదృష్టాన్ని కలిగించారు. మీకు నేనే ధన్యవాదాలు తెలుపుకోవాలి.

      తొలగించండి
    2. పద్మావతీ శ్రీనివాసం ద్విపద రమణీయముగా నున్నది.. శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారు పరిపూర్ణ శ్రీనివాస కృపా సంపన్నులు.. వారు మరిన్ని కృతి సుకృతాలతో శ్రీ పదార్చన చేయగలరని అభిలషిస్తూ.. మురళీకృష్ణ

      తొలగించండి
    3. మురళీకృష్ణ గారు మీరు ప్రచురించిన తర్వాత బాక్ బటను నొక్కిన తిరిగి ప్రచురణ మగును

      తొలగించండి
    4. కామేశ్వర రావుగారూ మీ పద్మావతీశ్రీనివాసం అద్భుతమైన ద్విపద కావ్యంగా అలరారుతోంది.
      సాధారణంగా నారికేళ పాకంలో సాగే మీ పద్యరచన (నా బోంట్లకు మాత్రమే నారికేళపాకం) ఈ ద్విపద కావ్యంలో అలతి పదాలతో సులభ బోధకంగా కథనానికి ప్రాథాన్యత నిస్తూ చక్కగా సాగింది. అమ్మవారు, అయ్యవారు మీ కావ్యకుసుమార్చనతో పులకించి ఉంటారు.

      తొలగించండి
    5. పూరుషులబ్ధినుండి తమ పుణ్యము వచ్చునటన్న సూక్తినిన్
      కోరియొ కోరకో యఘపు కుంపటి నెత్తిన మోసి లేమికిన్
      కారకుడాతడేయనుచు గద్దరి చేష్టల జేసి యిద్ధరిన్
      కారణమేమిలేక నిజ కాంతుని దూరరె కాంతలెల్లరున్

      తొలగించండి
  11. సితవికసిత పద్మనివాసి చిన్మయ వద
    న సరసీరుహలోచన జ్ఞాన సార
    పరిమళ విలాస సముచిత భాసుర నవభా
    రతిని పెండ్లాడె వారిజ సుతుడు నిజము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      మూడవపాదం చివర భా వల్ల గణదోషం. 'భాసుర గుణ। రతిని బెండ్లాడె...' అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. అవునండి.గమనించలేదు. మీరు చెప్పినట్లు "భాసుర గుణ-రతిని. బాగుంది. ధన్యవాదములండి.

      తొలగించండి
  12. సతతము లోకవాసులకు జ్ఞానమొసంగగ నెంచి బ్రహ్మ భా
    రతిని సృజించి మోహమనురక్తిని బొందియు మాయజేత సం
    హతిని తుషాగ్ని జ్వాలల దహించియు వేరొక దేహమంది భా
    రతిని వివాహమాడెనఁట బ్రహ్మ నిజమ్మిది నమ్ము మిత్రమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      ఒకే వాక్యంలో 'భారతి' పునరుక్తమయింది. 'తృష'ను 'తుష' అన్నట్టున్నారు. అగ్నిజ్వాల లన్నపుడు గ్ని గురువై గణదోషం. 'తృషాగ్నికీలల' అనవచ్చు. వేరొక దేహమంది తా । రతిని (అనురక్తితో) అందామా?

      తొలగించండి
    2. సతతము లోకవాసులకు జ్ఞానమొసంగగ నెంచి బ్రహ్మ భా
      రతిని సృజించి మోహమనురక్తిని బొందియు మాయజేత సం
      హతిని తృషాగ్ని కీలల దహించియు వేరొక దేహమంది తా
      రతిని వివాహమాడెనఁట బ్రహ్మ నిజమ్మిది నమ్ము మిత్రమా

      గురువుగారూ మీ సవరణకి ధన్యవాదములు. నేనుఇదివరలో తుషాగ్ని చదివినట్లు గుర్తు. కుమరిలభట్టు విషయంలో అనుకుంటున్నాను. కానీ ఈ విషయంలో తుషాగ్ని అన్వయం కాదేమో.

      తొలగించండి
  13. సత్య లోక నివాసుడు నిత్య సృష్టి
    కార్య భార నిమగ్నుడు కమల నయన
    శారదాసతి భారతి సతత భర్తృ
    రతినిఁ బెండ్లాడె వారిజసుతుఁడు నిజము


    రత జలజాస నాంచిత పరాగ సమన్విత గాత్ర శోభితన్
    సిత మిహికాఘృణిజ్వలిత చిద్విభ వానన చారు మూర్తినిన్
    నుత సురసంఘ తోషిత తనుద్యుతి భాసిత కీరహస్త భా
    రతిని వివాహమాడెనఁట బ్రహ్మ నిజమ్మిది నమ్ము మిత్రమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  14. నవ ప్రజాపతులకు తోడు నారదాది
    జ్ఞానులకు వేద గర్భుడై జన్మ నొసగి
    వాక్పతిగ తా సృజించిన భారతి నను
    రతిని బెండ్లాడె వారిజ సుతుడు నిజము!

    రిప్లయితొలగించండి
  15. కమల సూనుడు మదనుడు విమల మతిని
    రతిని పెండ్లాడె , వారిజ సుతుడు నిజము
    గా వరిం చె కుమార్తెను కరము తృ ప్తి
    అవని , నవనిజ పెండ్లాడె నాది విష్ణు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. తనయుని వలె పెంచెను మాయ ధరణిలోన
    చేర దీసిన వనితయె చేయి పట్ట
    నెంచగ వివరము నెరుగుచు నెమ్మి తోడ
    రతిను బెండ్లాడె వారిజ సుతుడు నిజము.

    2.పసివయసు నందె తల్లిని బాయ గానె
    మత్స్యమొక్కటి మ్రింగంగ మాయ చెంత
    శంబరుని యింట పెరిగుచు చక్కగాను
    రతిని బెండ్లాడె వారిజ సుతుడు నిజము.

    3.మారు రూపము ధరియించి మాయదేవి
    పెంచె బాలుని సుతువోలె ప్రేమ చూప
    నబ్బురపడి మరుడు చిరు నగవు తోడ
    రతిని బెండ్లాడె వారిజ సుతుడు నిజము.

    చం:చతురత తోడ సర్వ జవ సత్వములన్ యిలలోన నా విరిం
    చి,తనయపూర్వ సృష్ఠిని సృజించెను దివ్యము నౌ సుకాంతితో
    మతియు చలించు నందమున మానిని యున్ సృజియించి తాను భా
    రతిని వివాహమాడెనట బ్రహ్మ నిజమ్మిది నమ్ము మిత్రమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మొదటి పూరణలో మీరు లౌకిక వ్యక్తులను ప్రస్తావించినట్టున్నారు. అలాగైతే పూరణ బాగున్నది. మూడవ పాదంలో ఒక లఘువు ఎక్కువయింది. '...నెంచ వివరము...' అనండి.
      రెండవ పూరణలో వారిజ అంటే లక్ష్మి అనీ, ఆమె సుతుడు మన్మథుడు (ప్రద్యుమ్నుడు) అనీ తీసుకున్నారన్నమాట! బాగుంది.
      మూడవ పూరణ బాగున్నది.
      నాల్గవ పూరణ బాగున్నది కాని వృత్తరచనలో కొద్దిగా తడబాటు కనిపిస్తున్నది. 'సత్వములన్+ఇలలోన' అన్నపుడు యడాగమం రాదు. భువిలోన... అందామా?

      తొలగించండి
  17. గురువుగారు క్షమించాలి నిన్నటి పద్యముగూడా పంపుతున్నాను

    స్వాతంత్ర్యోద్యమ యుద్ధమున్ నిరతమున్ సాగించి నాడెల్లరున్
    స్వాతంత్ర్యంబు హరించినట్టి పర రాజ్యాంగ్లేయులన్ దర్మిరే
    స్వాతంత్ర్యంపు ఫలంబులెల్లరిలనాస్వాదించ లేదెన్నగన్
    స్వాతంత్ర్యమ్మున లాభ మందిరి గదా స్వార్థంపు నేతల్ ఘనుల్.

    అతి పరమోన్నతంబయిన యత్భుత జ్ఞానమొసంగు వాణి స
    న్మతుల నొసంగు వాక్జనని సద్గుణ సుందర కోమలాంగి దే
    వతలును మెచ్చి నట్టి జన వందిత యా ధవళాంగి దివ్య భా
    రతిని వివాహమాడెనఁట బ్రహ్మ నిజమ్మిది నమ్ము మిత్రమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'తరుము'ను 'తర్ము' అనడం చింత్యం.
      రెండవపూరణలో వాగ్జనని.. టైపాటు వల్ల వాక్జనని అయినట్టుంది.

      తొలగించండి
  18. సతిపతి బంధమట్లుమనసందునజేర్చును విద్య,బుద్దినే
    శ్రుతిలయ రాగముంచివిన సొంపునునింపెడిశక్తి రూపిణే
    హితమతి బంచి లోకబలహీనత మాన్పెడిదైవమైన భా
    రతిని వివాహ మాడెనట బ్రహ్మ నిజమ్మిది నమ్ముమిత్రమా

    రిప్లయితొలగించండి
  19. భారతి రఘురాముని సుత కోరియుమన
    సిచ్చి చదువు సంధ్యలు గల నచ్చినతడు
    మమత మాధవరావు సమ్మతిని దెలిపి
    రతినిపెండ్లాడె “వారిజ సుతుడు”నిజము {వారిజ=వారికి జనించిన}


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. 'రూపుణి+ఏ' అన్నపుడు 'రూపిణియే' అవుతుంది. వారిజ శబ్దానికి మీరిచ్చిన అర్థం కుదరదు. వారి తెలుగు పదం. దానికి జ చేర్చరాదు.

      తొలగించండి
  20. పతికి దరినుండబోక తా పరుగు లిడుచు
    సంతతమ్మక్షర జ్ఞాన సంపద నిడ
    జనెడి చక్కని పడతి యౌ సతత భర్తృ
    రతినిఁ బెండ్లాడె వారిజసుతుఁడు నిజము

    రిప్లయితొలగించండి
  21. ఎక్కువగా జాతులు ఉపజాతులే వ్రాస్తూ వుండడం వల్ల వృత్తాలనేసరికి తడబాటండి.ఇంతకూ పద్యం కుదిరిందా అన్నయ్యగారూ

    రిప్లయితొలగించండి


  22. పితరుడు పద్మనాభుడట పిల్చుచు జెప్పగ పెద్దకార్యమున్
    మతినిడి మట్టిబొమ్మలకు మంచిగ పల్కుల నద్దిసృష్టి న
    మృతమునుబంచ నాలుకను మీదనె పిల్వగ వచ్చునట్టి భా
    రతిని వివాహమాడెనఁట బ్రహ్మ, నిజమ్మిది నమ్ము మిత్రమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అమృతము' అన్నపుడు అ గురువు కాదు, కనుక గణదోషం.

      తొలగించండి
    2. భూతంబన పూతంబెటు
      మా తంత్రమె మహిత మనెడు మాన్యులు కలినిన్
      వే తంత్రములకు మేలగు
      స్వాతం.............

      తొలగించండి
  23. జన సామాన్యుని వోటు సూటి బలమున్ జాజ్జ్వల్య త్రింశత్ ధృతిన్
    మనజాలందగు రాజకీయ నెపమున్ మౌనంబుగా దాల్చి తా
    ననవద్యంపు పరాభవాలగడచెన్ ఆసారి తా గెల్వ నో
    వనతా రత్నము...................

    రిప్లయితొలగించండి
  24. గతి మతి దప్పి విద్దెలను గాదని కన్నెల బుజ్జగించి వే
    శతుల బ్రయత్నపుం తతుల చక్కని చుక్కలవేటగాడు నో
    శృతిమతి యైన కన్యను విశేషముగాను ప్రలోభపెట్టి బు
    ర్ర తిని వివాహ మాడెనట బ్రహ్మనిజమ్మది నమ్ము మిత్రమా.

    రిప్లయితొలగించండి
  25. శ్రీగురుభ్యోనమః

    కృతినొక హస్తమందు ఘన కీరము వేరొక హస్తమందునన్
    శ్రుతులను బల్కు వీణియను శోభలొసంగెడు శుభ్ర భూషలున్
    సతతము దాల్చు దేవతను సత్కవివర్యుల వాగ్వివేకభా
    రతిని వివాహమాడెనఁట బ్రహ్మ నిజమ్మిది నమ్ము మిత్రమా

    రిప్లయితొలగించండి
  26. పెద్ద రూపమె తండ్రి ద దెద్దియైన
    .కమల. కరమున చిన్నడు గడుసువాడు
    చుట్టు భ్రమియించు తుమ్మెద బట్టి గురు ని
    రతిని బెండ్లాడె వారిజ సుతుడు నిజము

    రిప్లయితొలగించండి
  27. తగునద్దానిని కానిదానిని బలే తర్కాళినిన్ బోధనన్
    తగునమ్మాయని జెప్పి ఉల్లి తనకున్ దప్పెట్లనే ధోరణిన్
    వగలన్నేయుపదేశ మైన సరె నీవాంఛాదిగానున్న లో
    భ గణంబందున నాస్తిరా గురువు విద్వాంసుల్ వినంజెప్పితిన్

    రిప్లయితొలగించండి
  28. సగ సగపు యువక పద్దెము
    లగుపించును శిశువునడక లట్టులె కావే
    పగవారి బోలు. పాఠక.
    భగణంబున గురువు నాస్తిపండితులారా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      పైన వరుసగా మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి


  29. రతిని వివాహమాడినది బ్రహ్మయ కాదుర మూఢమిత్రమా!
    రతిని వివాహమాడినది రౌడిల మిత్రుడు మన్మథుండురా!
    కుతుకముతో సృజించుచును కూడగ గోరుచు చక్కనైన భా
    రతిని వివాహమాడెనఁట బ్రహ్మ నిజమ్మిది నమ్ము మిత్రమా!

    రిప్లయితొలగించండి


  30. అతియె సుమా కథల్! వినకు రా నరసన్న!సుశోభితమ్ముగా
    రతిని వివాహ మాడె మకరాంకుడురా చెలికాడ చూడగా

    నతుకులబొంత కైపదములా కవి రాట్టు చమక్కులౌత!భా
    రతిని వివాహమాడెనఁట బ్రహ్మ నిజమ్మిది నమ్ము మిత్రమా!


    జిలేబి

    రిప్లయితొలగించండి