కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తండ్రి యసంగ్రహత్వమును దాఁ గడు మెచ్చె సుతుండు చూడరే"
ఈ సమస్యను పంపిన పిట్టా సత్యనారాయణ గారికి ధన్యవాదాలు.
లేదా...
"తండ్రి ధనహీనత కతన తనయుఁ డెదిగె"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తండ్రి యసంగ్రహత్వమును దాఁ గడు మెచ్చె సుతుండు చూడరే"
ఈ సమస్యను పంపిన పిట్టా సత్యనారాయణ గారికి ధన్యవాదాలు.
లేదా...
"తండ్రి ధనహీనత కతన తనయుఁ డెదిగె"
రిప్లయితొలగించండిఅసలు బంగారము స్వయముగా మెరియును
తండ్రి ధనహీనత కతన తనయుఁ డెదిగె
వార సత్వపు సంపద వలదతనికి
తనను తాను ఋజువు జేసు కొనె జిలేబి !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తండ్రికి తండ్రి యిచ్చినది దానము జేసియు కీర్తిగాంచ నా
రిప్లయితొలగించండితండ్రి శ్రమించి యాశ్రమపు స్థాపననన్ బరమార్థ విద్య స
త్పుండ్రము దాల్చి మానవుల భూరి సుసేవల దేల్చ ఖిన్నుడై
తండ్రి యసంగ్రహత్వమును దా గడు మెచ్చె సుతుండు చూడరే
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని ఖిన్నుడై మెచ్చుకొనడం?
క్రొవ్విడి వెంకట రాజారావు :
రిప్లయితొలగించండి1. బుద్థిమంతుడైన కొడుకు పూనికెంచి
తండ్రి కష్టముల్ దీర్చగ తనరు జెంది
విద్యలొంది పదవులొంది విభవ మొందె
తండ్రి ధనహీనత కతన తనయుడెదిగె.
2. తండ్రి ధనహీనత కతన తనయుడెదిగె
కాని వృద్ధులమగు మమ్ము కాచు చుండె
చిన్నతనము నుండి బుధుఁడై చెలఁగినట్టి
కొడుకు గుణవంతుడని దల్లి గుబ్బతిల్లె.
క్రొవ్విడి వెంకట రాజరావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'పూనిక+ఎంచి=పూనిక నెంచి, పూనిక యెంచి' అవుతుంది. అక్కడ 'పూనిక గని' అనండి. 'తనరు జెంది'...?
గురువుగారికి నమస్కారములు. మీ సూచనను పాటిస్తాను.
తొలగించండితనరు జెంది = విజృంభించి ; చెలరేగి - అన్న అర్ధంలో వ్రాసాను. దయతో పరిశీలించండి.
లింకనాఖ్యుడు స్థలమార్పులీన తండ్రి
రిప్లయితొలగించండిగొట్టు కట్టెల కూర్పున గొణగకుండ
శ్రమల దేలి యమేరికా రమను యేలె
తండ్రి ధనహీనతకతన తనయుడెదిగె
పిట్టా వారూ,
తొలగించండిమొదటి రెండు పాదాలలో భావం స్పష్టంగా లేదు. అన్వయలోపం ఉన్నట్టుంది.
ఆర్యా
రిప్లయితొలగించండికృతజ్ఞతలు
గుండ్రముగాను ద్రిప్ప నొక గూటికి జేరునదే సవాలు వే
రిప్లయితొలగించండిలుండ్రిల యాస్తులిచ్చుటకు లోకపు పోకడ గాగ పుత్రుకున్
చండ్రగులాబి పీఠములు స్థాయిని బెంచెడు బంగళాలవే
రండ్రిక నొక్క త్రాగుడుకె రాళ్ళుగ మారును మూర్ఖ పుత్రుచే
తండ్రి సుపుత్రు జేయనొక తప్కెడు గైకొనడింటి యాస్తిగా
తండ్రి యసంగ్రహత్వమును దా గడు మెచ్చు సుతుండు చూడరే
పిట్టా వారూ,
తొలగించండి'ండ్ర' ప్రాసాక్షరం కనుక వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలను లెక్కించడం లేదు. కాని భావం సుగమంగా, సమర్థంగా లేదు.
ధ్యానమును ద్రుంచు నా దూరదర్శనాది
రిప్లయితొలగించండివస్తుజాలము లేవింట వాస్తవముగ
తండ్రి ధనహీనత కతన, తనయు డెదిగె
చదువులను నేర్చి సల్లక్ష్యసాధకుడయి.
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధనవిహీన' అనడం మహతీవాచకం కదా! 'ధనవిహీనుఁ। డైన మిగుల శ్రమను జూపి యతని సుతుఁడు...' అందామా?
పుండ్ర లలాట ధారణము పూనిక జేయుచు శంభు భక్తుడై
రిప్లయితొలగించండికొండ్రను సాగుచేసి కడు గుట్టుగ జీవన యాత్రచేయుచూ
గండ్ర విశేష హృద్యమగు కావ్యము భాగవతంబు వ్రాయగా
తండ్రి యసంగ్రహత్వమును దాఁ గడు మెచ్చె సుతుండు చూడరే
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'యాత్ర చేయుచున్' అనండి.
గురువుగారూ ధన్యవాదములు.
తొలగించండిఅందుకొన లేక పోయె నానంద మెపుడు
రిప్లయితొలగించండితండ్రి, ధనహీనత కతన, తనయు డెదిగె
నట్టి దురవస్థలన్నిటిన్ మట్టుబెట్ట
శ్రమను జతగొని బ్రతుకున ప్రగతి గాంచె!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బహుకుటుంబీకుడై భారంపు సంసార
రిప్లయితొలగించండిసాగరమీదెడి శక్తిలేక
పత్తి పంటకు గిట్టుబాటు ధరయె రాక
యిల్లుగడుచు మార్గమేది లేక
సారె సారెకు వచ్చు చదువుల ఫీజులు
చెల్లింపగా నప్పు జేయలేక
మందులు మాకులు మఱి యెన్నొ పండుగ
లితరంపు ఖర్చు భరింపలేక
సతమతమ్మగు తండ్రి కష్టమ్ము గాంచి
శ్రద్ధతో నేర్పుతో పెద్ద చదువు చదివి
జీవితాంతము తండ్రికి సేవజేసె !!
తండ్రి ధనహీనత కతన తనయుడెదిగె !!
తీండ్ర రవిప్రకాశమతితీక్ష్ణతఁ గాళ్లను గాల్చ , భూమిపై
రిప్లయితొలగించండిగుండ్రముగాఁ జరించి , కొడుకున్ జదివింపగ యాచకుండునై
ఫుండ్రములన్ ధరించెనొక భూసురవర్యుడు జోలెఁబట్టి, యా
తండ్రి యసంగ్రహత్వమును దా కడుమెచ్చె సుతుండు జూడరే !!
మైలవరపు మురళీకృష్ణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఆర్యా.మరొక విడత సమస్యావళిన బరిశీలించ గోరి
రిప్లయితొలగించండిశత్రువు స్వదేహమౌట నది శాపము సుమ్మిల దీర్ఘ జీవికిన్ . లేదా
తన దేహమె శత్రువౌట తథ్యము ధరణిన్
ధన్యవాదాలు!
తొలగించండితండ్రి ధనహీనతకతన తనయుడెదిగె
రిప్లయితొలగించండిమేనమామకు సంపదల్ మించియుంట
భూరివిలసిత సద్గుణ సూరియగుట
సన్నుతింపగ యోగ్యమౌ చరితగలుగ.
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తే.గీ. పేదరిక మందరికిజూడ కాదు ముప్పు
రిప్లయితొలగించండిఆపదలయందె అవకాశ మరయ వలయు
నండ్రు పెద్దవారనియెంచి అధిగమించి
తండ్రి ధనహీన కతన తనయుడెదిగె
అధిగమించు = చదువు (శబ్ద రత్నాకరం)
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పుండ్రముదీర్చిదిద్ది యటు మోసముజేయుచు స్వార్థతత్త్వమే
రిప్లయితొలగించండితీండ్రముగాగ లంచముల దీసుక దుష్టపుహేయమార్గమున్
గండ్రతనాచరించకను గౌరవ ధార్మిక సాధువర్తియౌ
తండ్రి యసంగ్రహత్వమును దా గడు మెచ్చె సుతుండుచూడరే.
పొన్నెకంటి వారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
పూట గడచుట కష్టమై పూట కూళ్లు
రిప్లయితొలగించండిదినుచు;పాఠాలు చెప్పుచు ధనము నొంది
క్రమముగా నున్నతోద్యోగి గాను మారె
తండ్రి ధన హీనత కతన తనయు డెదిగె.
పిన్నక నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పుండ్రము లేని వైష్ణవుడు పూర్ణమనస్కుడు దీన బంధువుం
రిప్లయితొలగించండిదీండ్రపు జన్మదుఃఖములఁ దేరగ నందన దారలింక కో
డండ్రుల కెల్ల పంచి సిరి డంబము నైహిక వాంఛలం దిలం
దండ్రి యసంగ్రహత్వమును దాఁ గడు మెచ్చె సుతుండు చూడరే
జన్మ నిడె మరువకు మరు జన్మ నైన
నెన్న విద్యయ విత్తము కన్న మిన్న
పట్టుదల వహించి చదివి మెట్టు లెక్కి
తండ్రి ధనహీనత కతన తనయుఁ డెదిగె
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'వాంఛలం దిలం దండ్రి...' ఇక్కడ పదవిభాగం ఎలా చేయాలో అర్థం కాలేదు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.ధన్యవాదములు.
తొలగించండిఇక్కడ విశేష పద విభజన లేదండి. 'వాంఛలందు + ఇలన్ = వాంఛలం దిలన్.
ఐహిక వాంచ లందు నసంగ్రహత్వము తండ్రికి నిలలో నని నా భావము.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిడంబమూ యైహిక వాంఛలునూ
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. "పంచ సిరి" యన్న నన్వయము బాగుండుననుకుంటాను.
తొలగించండిఇలన్... ద్రుతాంతంగా కాకుండా అనుస్వారంతో వ్రాయడం వల్ల పొరబడ్డాను. మన్నించండి.
తొలగించండిమాన్యకవి మిత్రులకు
రిప్లయితొలగించండిశంకర గురు బోధ చంపెర నాదుక బాధ
సంకటములు బాపె సద్గతి త్రోవ జూపె
ఇక్కడ ఈ సాంప్రదాయ కీర్తన పల్లవి తోనే ఆగి పోయింది దీని పూర్తి పాఠం సేకరించండి
ఈ శంకరాభరణం గురువు గారికి వర్తింప జేస్తూ పూరిస్తే
శంకర గురు బోధ చంపెర మాదు బాధ
సంకటములు బాపె సత్కవి బాట జూపె. అవుతుంది దీనిని మన గురువు అనుమతి తో పూరిద్దామా ఒక ఘట్టంలో
నమస్కారములు
పిట్టా వారూ,
తొలగించండిదయచేసి అటువంటి ప్రయత్న మేదీ చేయకండి. అందుకు నేను అనర్హుడను.
నాదు తర్వాత క తప్పుగా పడినది
రిప్లయితొలగించండిపౌండ్రవవాసుదేవుఁడు వివాదము రేపుచు తాను విష్ణువం
రిప్లయితొలగించండిచండ్రు గొనుండు స్వర్ణమణి హారములన్నను యాశఁబోక రా
రండ్రు భజింతు కృష్ణుని విలాసమహత్త్వములంచు జెప్పు నా
తండ్రి యసంగ్రహత్వమును దాఁ గడు మెచ్చె సుతుండు చూడరే.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పౌండ్రక'ను 'పౌండ్రవ' అన్నారు.
ధన్యవాదములు గురువుగారు.
తొలగించండిఅది "పౌండ్రక" అని ఉండాల్సింది. పొరపాటు.
ఎక్కడా చదవలేదు కానీ, ఒక సినిమాలో చూసిన గుర్తు ఈ పౌండ్రకవాసుదేవుని గూర్చి.
ధన్యోస్మి.
పౌండ్రక వాసుదేవుడు.....
తొలగించండిభారతంలో కనిపించే పాత్ర. కరూశ దేశం రాజు. కృష్ణుడు కైలాసానికి వెళ్లిన సమయంలో ద్వారకకు వెళ్లి తానే కృష్ణుడునని చెప్పి, సాత్యకి చేతిలో దెబ్బలు తిన్నాడు. తరువాత కాశి రాజును కూడగట్టుకొని ద్వారకపై దాడి చేసినప్పుడు కృష్ణుడి చేతిలో ఉభయులూ పరాజితులైనారు.
కటిక daaridrya
రిప్లయితొలగించండిపుండ్రముదీర్చిదిద్ది యటు మోసముజేయుచు స్వార్థతత్త్వమే
రిప్లయితొలగించండితీండ్రముగాగ లంచముల దీసుక దుష్టపుహేయమార్గమున్
గండ్రతనాచరించకను గౌరవ ధార్మిక సాధువర్తియౌ
తండ్రి యసంగ్రహత్వమును దా గడు మెచ్చె సుతుండుచూడరే.
తండ్రి ధనహీనతకతన తనయుడెదిగె
రిప్లయితొలగించండిమేనమామకు సంపదల్ మించియుంట
భూరివిలసిత సద్గుణ సూరియగుట
సన్నుతింపగ యోగ్యమౌ చరితగలుగ.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
తీ౦డ్రల నన్నిటిన్ మిగుల దీరిచి బోషణ
……………… జేయు వా డిలన్
ద౦డ్రియ || స౦గ్రహత్వమును తా గడు
………………… మెచ్చె సుతు౦డు | చూడరే
మ౦డ్రపు గబ్బయై మగని మాటున చేరి విస౦బు
……………………… జిమ్ముచు
న్నీ౦డ్రము సేయగా దొడగె ని౦టికి వచ్చిన …………………… కోడ లక్కటా
{ తీ౦డ్రలు = కోరికలు . ఈ౦డ్రము సేయు =
బాధ వెట్టు . }
ే
్
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధనమధాందుల యినుప పాదాల క్రింద
రిప్లయితొలగించండినలుగు బానిస బ్రతుకది యలుసుగాగ
తండ్రి ధనహీనత కతన, తనయుఁడెదిగె
చెలఁగి భగవత్ప్రసాదిత తెలివితోడ
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ప్రసాదిత తెలివి' అనడం దుష్టసమాసం. 'చెలగి భగవత్ప్రసాదవిశిష్ట బుద్ధి' అందామా?
గురుదేవులకు ధన్యవాదములు.
తొలగించండిసవరించిన పూరణ:ధనమధాందుల యినుప పాదాల క్రింద
నలుగు బానిస బ్రతుకది యలుసుగాగ
తండ్రి ధనహీనత కతన, తనయుఁడెదిగె
చెలఁగి భగవత్ప్రసాద విశిష్ట బుద్ధి
రిప్లయితొలగించండితండ్రిని భాగ్యహీనుడని తక్కువజేసిన మేనమామతో
తీండ్రపు జూపులన్ బలికె ధీటుగ మల్లన తీవ్రవాక్కులన్
పుండ్రముఖారవిందుడగు పోతన భక్తికి సాటి యేదనెన్
తండ్రి యసంగ్రహత్వమును దాఁ గడు మెచ్చె సుతుండు చూడరే"
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తండ్రి తేనీటినమ్మెడు ధనవిహీను
రిప్లయితొలగించండిడైన, మిగుల శ్రమను జూపి తనయుడేమొ
భరత ఖండమ్ము మెచ్చగ ప్రముఖు డయ్యె
తండ్రి ధనహీనత కతన తనయుఁ డెదిగె"
గురువుగారూ, సవరించినాను. కృతజ్ఞతలు
ప్రత్యుత్తరంతొలగించు
మూర్తి గారూ,
తొలగించండిసంతోషం!
వీలు కాలేదు చదువగ వేణు నక ట
రిప్లయితొలగించండితండ్రి ధనహీన క త న, తనయు డెది గె
దల్లి దండ్రుల పోషణ ,దైవ బలము
లుండుట వలన మంచిగ నున్నతుడుగ
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కటిక దారిద్ర్యమున నిల్లు గడచుచుండె
రిప్లయితొలగించండితండ్రి ధన హీనత కతన,తనయు డెదిగె
పత్రికల్,పాలసంచులు పంచి ధనము
తెచ్చి చదువును సాగించె ధీరుడగుచు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తండ్రి ధన హీనత కతన తనయు డెదిగె
రిప్లయితొలగించండిటివి సమయమునకు నొకపోటీని నిడగ?
గెలిచి డబ్బును సాధించె|విలువలుంచ?
లోటు మాన్పెను సంసార బాటవేసి|
2.తండ్రి యసంగ్ర హత్వమును దాగడుమెచ్చె “సుతుండుచూడరే?
ఎండ్రియు పిల్ల లట్లుగనునెంచగ?మిత్రులు జేయు మంచియే
గండ్రిగ మార్చగా బ్రతుకు” కాంక్షలుదీరెను లాభసాటితో
తండ్రికి కీర్తి వంతుడను దర్పము నందున సంతసంబిడన్ . {గండ్రి=దిట్ట}
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
సంసార బాట... దుష్ట సమాసం.
తీండ్ర గ గొప్పవారిలను దీటలు వారగ దానమీయగన్
రిప్లయితొలగించండిదండ్రి దనంత దా నపుడు దప్పను భావన గల్గి యుంటతో
తండ్రి య సంగ్రహ త్వమును దా గడు మెచ్చె సుతుండు చూడరే
పౌండ్రు ని మంచి శీలతను పౌరుష భావము రంగ రించుటల్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
రెక్కలాడిననె మనకు డొక్క లాడు
రిప్లయితొలగించండిననుచు కొమరుని నడిపించె నతడు! పేద
తనము ప్రతిభను తాక రాదనుచు పలుకు
తండ్రి ధన హీనత కతన తనయు డెదిగె!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కూటికై, చోరుడయి తండ్రి గూర్చ ధనము
రిప్లయితొలగించండిదూరి వికలాంగుడగు పుత్రుడూరి బడిని
మేలు మేధావియై సీమ నేల నేగె;
తండ్రి ధనహీనత కతన తనయుఁ డెదిగె
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కష్టపడి చేసిన కృషిలో నష్ట మొదవ
రిప్లయితొలగించండితండ్రి ధన హీనత కతన తనయు డే దిగె
నాధునికమైన పద్ధతు లనుసరించి
సేద్య మొనరించి అత్యంత బాధ్యతగను
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తండ్రికినికల్గు సంతసంతన తనయుని
రిప్లయితొలగించండితండ్రికి తగిన తనయుడతండని పలు
తావుల పలువురుపొగడ తండ్రిపేరు
తండ్రి ధనహీనత కతన తనయుఁ డెదిగె
వద్దూరి రామకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సంతసంతన'...?
సంతసం (సంతోషం ) తన (తనయొక్క) వడ్డూరి రామకృష్ణ
తొలగించండిరామకృష్ణ గారూ,
తొలగించండిసంతసం అని ముప్రత్యయం స్థానంలో అనుస్వారాన్ని పెట్టి వ్యావహారికంగా వ్రాయరాదు కదా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితండ్రి ధనహీనత కతన తనయుడెది గె-
రిప్లయితొలగించండిలవవలసినను నిజమైన లక్షణముల
చేతనే గాని డబ్బులిచ్చి పని తుచ్ఛ
నరుల వలె యొనరింపుట యెరుగడసలు
నితీశ్ చంద్ర గారూ,
తొలగించండి'శంకరాభరణం' బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
విలక్షణమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..యొనరించుట' అనండి.