5, జనవరి 2011, బుధవారం

సమస్యా పూరణం - 190 (అమృతపానమ్ము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె.

33 కామెంట్‌లు:

  1. షార్టు మెస్సేజి లోతాను స్మార్టు యనుచు
    అసలు మోబైలు మాటలే నమృత మనుచు
    బైకు నడుపు వేళ 'నమృతపాన' మంద
    అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె.

    రిప్లయితొలగించండి
  2. ధర్మ మార్గము దప్పని ధార్మికులకు,
    సత్య సారము దెలిసిన తాత్వికులకు,
    తుచ్చులౌదుష్టులకు హరి ,యిచ్చెనిత్య
    అమృత పానమ్ము,మరణమ్ము నందజేసె!

    రిప్లయితొలగించండి
  3. నమస్కారములు
    జ్యొతి గారు
    నా వంతు గురు దక్షణ 2000 జమ ఐందొ లెదొ కొంచం తెలుప గలరు

    రిప్లయితొలగించండి
  4. విష్ణు భక్తి తోడ సురలు వినుతి కెక్కి
    క్షీర సాగర మథనాన జేసె వారు
    అమృతపానమ్ము, మరణమ్ము నందఁ జేసె
    దనుజులకు హరి ద్వేషము తరచి చూడ!!

    రిప్లయితొలగించండి
  5. శంకరయ్య గారూ,
    గుణదోష విచారణచేయమని మనవి.

    వరమిడినదేవుఁశిరమున కరమునిడ న
    సురుడు సాగి;మోహినిఁగాంచ-మరశరావ
    లంబనోప్సితాధరమృదుబింబవిలస
    దమృతపానమ్ము, మరణమ్ము నందఁ జేసె

    రిప్లయితొలగించండి
  6. శంకరయ్య గారూ,
    గుణదోష విచారణచేయమని మనవి.

    వరమిడినదేవుఁశిరమున కరమునిడ న
    సురుడు సాగి;మోహినిఁగాంచ-మరశరావ
    లంబనేప్సితాధరమృదుబింబవిలస
    దమృతపానమ్ము, మరణమ్ము నందఁ జేసె

    [మరశర-అవలంబన-ఈప్సిత-అధర-మృదు-బింబ-విలసత్]

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు.మరియు అభినందనలు.
    అందరి పూరణలూ పూర్ణ కుంభముల వలె స్వాగతించు చున్నవి.

    హరీజీ!
    mobile మాటల్నే అమృతం జేశారే!!! superb!!!

    పీతాంబర ధరా! మీ అమృతం - హరినామ స్మరణేనా!
    మంచిగా నున్నది.

    అయ్యా! జి .ఎస్.జీ !పేరులో జిగురుంచుకొని, సమస్యను విరక్కొట్టారు.బాగుంది.

    ఊకదంపుడు గారు!చాలా పెద్ద సమాసం వేసి సమస్యను
    పొడి పొడి చేసేసారు.super!

    మూర్తిగారూ! పొగ నమృతం చేసేసి మాకు(smokers)
    గుబులు కలిగిస్తున్నారు.
    బహుత్ అచ్ఛీ!(భూవి-typo లా ఉంది ?కాదా?)

    రిప్లయితొలగించండి
  8. 01)
    ____________________________________________

    అవతారిక :

    దేవ దానవు లిరువురు - ద్వేష మొదలి
    క్షీర సాగర మధనమ్ము - జేయు వేళ
    గరళ ,వృక్ష, లక్ష్మీ, రాజ, - గజము, గోవు
    లుద్భవించెను సంతోష - ముప్ప తిల్ల !

    అమృత భాండము! వెనువెంట - హరియు గూడ
    జనన మొందెను , మోహంబు - జగతి మునుగ
    సుదతి యై , సురాసురులకు - చోద్య మొదవ
    పంచ , నమృత మిరువురికి - వరుస గాను !

    మొదలు పెట్టెను సురలకు - ముందు గాను !
    క్రిష్ణు మాయను గనిపెట్టి - కేతు తోడ
    గలిసె దివిజుల ! రాహువు - కామ రూపి !
    సూర్య చంద్రుల సరసను - సుధను బొంద !

    పూరణ :

    సూచ నొనరించె దెలివిగా - సూర్యు డంత
    పాన మొనరించ బోవునా - పాపి గాంచి
    హరియు నుగ్రత జక్రంబు- హతుని జేయ
    అమృత పానమ్ము మరణమ్ము నంద జేసె!

    _________________________________________

    రిప్లయితొలగించండి
  9. వైనతేయుడు దెచ్చిన భాండ మందు
    చుక్క యొక్కటి ఒలుకగ మొక్క మొలిచె
    బూమిజనములు వ్యసనులై పొగను ద్రావ
    అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె.


    టైపో కాదు సామీ పొరబాటే, సవరించా. మిత్రవర్యా! వసంతా !మీకు యిదివరకు చాలా మంది చెప్పే ఉంటారు. పొగ మంచిది కాదు. కొద్ది మంది అదృష్టవంతులు తప్ప చాలా మంది పొగత్రాగుడుకు మూల్యము చెల్లిస్తారు. ఈ దినమే దయచేసి పొగ త్రాగడము మానీయండి..
    మీరు మామిడి చిగుర్లు నములుతే మాకభ్యంతరము లేదు !

    రిప్లయితొలగించండి
  10. శంకరార్యా!
    స.పూ 181,182,186 మరియు 187 లలో మీ
    వీక్షణకు నోచని నా పద్యముల నొక తూరి
    వీలు కలిగిన యెడల
    వీక్షించి గుణ దోష
    విచారణ చేయుడని
    వినమ్రముగా మీ
    విద్యార్థి
    వసంత కిషోర్
    వినతి.

    రిప్లయితొలగించండి
  11. మూర్తి గారూ! మీ సలహాకు కడుంగడు
    ధన్య వాదములు.
    నలుబది వత్సరముల నుండి యున్న యలవాటు
    యెంత యత్నించిననూ యెడబాయ కున్నది.
    ఐననూ మీ మాట చొప్పున మరల ప్రయత్నించెద.

    ఈ సమయంలో ఒక joke గుర్తుకు వచ్చు చున్నది.
    ఏదైనా ఒక పనిని మనము పదే పదే జేసిన యెడల గొప్పేగదా!

    పూర్వం నా బోటి వాడొకడు
    "సిగరెట్లు మానెయ్యడం పెద్ద బ్రహ్మ విద్యా ఏమిటి???
    నే నిప్పటికి 1000 సార్లు మానేసాను!!!!!"అన్నాడట.
    మళ్ళీ typo (బూమి కాదు సామీ) భూమి

    రిప్లయితొలగించండి
  12. అది భూమి సార్. హెచ్ హా చ్లో పోయింది. సరె బూమి పదము వెదకుతే బ్రౌను వారి నిఘంటువులో ఉంది. అందు వలన అలాగే వదిలి వేసాను. గురువు గారికి పని కలిపిద్దామని. బుద్ధిగా భూమి, పుడమి అని వాడవచ్చు .

    రిప్లయితొలగించండి
  13. మా బండి లేటు.
    అందరి పూరణలూ బహు బాగా ఉన్నాయి.

    కద్రు వాత్మజు లమరులై భద్రముగను
    జగతి నుండగ నెంచిరి చక్క జేసి
    యమృతపానమ్ము, మరణమ్ము నందఁ జేసె
    కాని యుక్తిగ ధీశాలి గరుడు డపుడు.

    రిప్లయితొలగించండి
  14. వైనతేయుడు దెచ్చిన భాండ మందు
    చుక్క యొక్కటి ఒలుకగ మొక్క మొలిచె
    భువిని ప్రజలును వ్యసనులై పొగను ద్రావ
    అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె.

    రిప్లయితొలగించండి
  15. మూర్తిగారూ!
    నేనది typo నే అనుకున్నాను
    అసలు నిఘంటువు చూడాలని కూడా అనిపించలేదు.

    "బూమి "-మీరే సరి.

    రిప్లయితొలగించండి
  16. నిఘంటువు (అందులోనూ బ్రౌన్ నిఘంటువు )లో ఉన్నంత మాత్రాన అది సరి అవ్వలసిన అవసరము లేదు. బూమి సాధు ప్రయోగమో కాదో గురువుగారు చెప్పాలి. తెలుగు భాష చాలా జటిల మైనది.

    రిప్లయితొలగించండి
  17. ________________________________________
    02)

    కల్తి సారాయి సీసాల - గాంచి , భ్రమసి !

    మధువు గ్రోలుచు ముదమున - మనుజు లకట !

    తరలు చున్నారు యమ పురి - దరికి వారు !

    అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె.

    ______________________________________

    రిప్లయితొలగించండి
  18. _____________________________________
    03)

    నాడు స్వాతంత్ర్య సమరాంగ - ణమున , వారి

    గుండె లెదురొడ్డి , పిస్తోలు - గుళ్ళ ముందు !

    తరలి పోయిన , అమరుల - త్యాగ నిరతి !

    అమృతపానమ్ము ! మరణమ్ము నందఁ జేసె.
    ____________________________________

    రిప్లయితొలగించండి
  19. ___________________________________
    04)

    నేడు ప్రత్యేక రాష్ట్రము - నీయు డనుచు

    తృణముగా నెంచి , తెలగాణ - ధ్యేయ మనుచు

    ప్రాణ మర్పించు లేలేత - బాలు రకట !

    అమృతపానమ్ము ! మరణమ్ము నందఁ జేసె.
    ___________________________________

    రిప్లయితొలగించండి
  20. __________________________________

    05)

    కన్య లెందరొ , తొందర - కాలు జారి

    పట్టె డన్నము , పిల్లల - పాల కకట !

    బ్రతుకు బండిని , చేబట్టె ! - పడుపు వృత్తి !


    అమృతపానమ్ము ! మరణమ్ము నందఁ జేసె.

    ______________________________________

    రిప్లయితొలగించండి
  21. 06)


    రైతు రక్షణ కరువయ్యె ! - రాక్షసముగ

    సస్య రక్ష నోషధు లను - స్వయము, తానె

    మధువు గ్రోలెడు చందాన - మహిని గ్రోల

    అమృతపానమ్ము ! మరణమ్ము నందఁ జేసె.
    ____________________________________

    మహి = భూమి (పొలము)
    ____________________________________

    రిప్లయితొలగించండి
  22. హమ్మయ్య!
    అయిదారు రోజుల అస్తవ్యస్తతకు తెర పడింది. ఇప్పుడు నా సొంత సిస్టం మీద స్వేచ్ఛగా, నిరాటంకంగా నా బ్లాగును నిర్వహించుకోవచ్చు. ఇందుకు సహకరించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞుణ్ణి.

    రిప్లయితొలగించండి
  23. ____________________________________

    07)

    అపర భగిరథు , డనుపేర - నాంధ్ర భూమి
    ఖ్యాతి గాంచిన , రాజశే -(ఖఖఖఖ.....)ఖరుడు , మ్రింగె
    కోట్లు ! కోట్లాది , కోట్లాది - కోట్ల కోట్లు
    జగతి జలయఙ్ఞ మనుపేర - జాల కోట్లు

    కువలయము నందు కూలెగా !!! - కుక్షి బగుల
    కాలి పోయెను బూడిదై - ఖరువు దయను !
    జనుల మోసమ్ము జేసిన - జారు డంత !
    అమృతపానమ్ము ! మరణమ్ము నందఁ జేసె.

    రిప్లయితొలగించండి
  24. శంకరార్యా !
    శుభోదయం.

    శంకరాభరణం
    శంకలు లేకుండా

    శంకుల జెక్కిన
    శిల్పము వలె
    సుందరముగ

    సర్వాంగ
    శోభిత యై

    సర్వ కాల
    సర్వావస్థ లందునూ

    సర్వ మంగళా
    శంకరుల దయ చేత
    శుభ ప్రథమై

    సదస్యు లందరికీ
    శుభములు గూర్చు గాత!

    రిప్లయితొలగించండి
  25. హరి గారూ,
    మొబైల్ మాటల అమృత పానం మరణకారణమంటూ చెప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    పూరణకు క్రమాలంకారాన్ని వాడిన విధానం బాగుంది. అభినందనలు.
    రెండవ మూడవ పాదాలలో ప్రాసయతి తప్పింది.
    "సత్య సారము దెలిసిన సాధువులకు,
    ముచ్చులౌ దుష్టులకు, హరి యిచ్చె నిత్య" అంటే సరిపోతుంది.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    మీరు దయతో పంపిన ధనం నా అమౌంటులో జమ అయింది. కృతజ్ఞతలు.

    జిగురు సత్యనారాయణ గారూ,
    మీరు పూరించిన విధానం బాగుంది. అభినందనలు.
    "జేసె వారు" కంటే "జేసినారు" బాగుంటుంది కదా!?

    రిప్లయితొలగించండి
  26. ఊకదంపుడు గారూ,
    గుణం - సుదీర్ఘ సమాసాన్ని ప్రయోగిస్తూ మనోహరమైన పద్యం చెప్పారు. అభినందనలు.
    దోషం - "దేవు శిరమున" అన్నప్పుడు మధ్యలో అరసున్నా రాదు. టైపాటా?

    వసంత్ కిశోర్ గారూ,
    కవి మిత్రుల పూరణలలోని ప్రత్యేకతలను, ఔచిత్యాలను ప్రశంసిస్తూ మీ సహృదయతను చాటుకుంటూ, నాకు కొద్దిగా శ్రమను తగ్గిస్తున్నారు. గుణాలను మీరు చెపితే, దోషాలను నేను చెప్పాలన్న మాట! బాగుంది. ధన్యవాదాలు. కీప్ ఇట్ అప్!
    ఇక మీ ఏడు పూరణములను (ఏడుపూ, రణములు కాదండోయ్ :-) ) చదివి ఆనందించాను. విషయ భేదంతో మీ పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో సాగర మధన ఘట్టాన్ని చక్కగా వివరించారు. "ద్వేషము వదలి" అనే అర్థంలో "ద్వేష మొదలి" అనడం గ్రామ్యం. "ద్వేషము విడి" అంటే చాలు. "క్రిష్ణు" అనేది "కృష్ణు"కు టైపాటు అనుకుంటా. "సూచన(న్) + ఒనరించె = సూచన నొనరించె" అవుతుంది. "సూచనను జేసె" అంటే సరి. "హరియు నుగ్రత జక్రంబు- హతుని జేయ" అనడం కంటే "హరియుఁ జక్రాయుధము చేత హతుని జేయ" అంటే ఎలా ఉంటుంది?
    మిగిలిన పూరణలు సామాజికాంశాలతో, ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబిస్తూ చక్కగా నిర్దోషంగా ఉన్నాయి.
    "బ్రతుకు బండిని , చేబట్టె ! - పడుపు వృత్తి !" అన్న పాదాన్ని "బ్రతుకు తెరువుకై పూనిరి పడుపు వృత్తి" అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  27. శంకరార్యా! వందనములు.
    మీ
    చక్కని
    సవరణలతో
    నా
    సమస్యలు(పూరణలు)
    సరి కొత్త
    సొగసును
    సంతరించు కున్నవి
    స్వామీ

    సంతోషం.

    రిప్లయితొలగించండి
  28. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    "ఖగపతి యమృతము తేగా ... " పద్యాన్ని చక్కగా ఉపయోగించుకొని మంచి పూరణ చేసారు. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    నాగులు ద్విజిహ్వులైన కథను గుర్తుకు తెచ్చిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ గత పూరణలను వీలు వెంబడి పరిశీలించి చెప్తాను. ఆలస్యానికి మన్నించండి.

    రిప్లయితొలగించండి