13, జనవరి 2011, గురువారం

సమస్యా పూరణం - 196 (వచ్చె సంక్రాంతి లక్ష్మి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
వచ్చె సంక్రాంతి లక్ష్మి యే మిచ్చు మనకు?

12 కామెంట్‌లు:

  1. వత్సరమ్మున కొకసారి వచ్చు లక్ష్మి
    పంటలన్నియు చెడ, పెట్టె కంట నీరు ,
    రెక్క లూడిన పక్షిలా బిక్క బోయి
    వచ్చె సంక్రాంతి లక్ష్మి! యేమిచ్చు మనకు?

    రిప్లయితొలగించండి
  2. వచ్చె సంక్రాంతి లక్ష్మి యే - మిచ్చు మనకు ?
    లడ్డు ,సున్నుండ,బూరె,గా - రె,లరిసెల్లు !
    ప్రపితృ కార్యాలు,పరమాన్న- పాయసములు !
    నూత్న వస్త్రాలు!బస్తాలు - నిండు గాదె !

    కోడి పందేలు!పేకాట !- కుమ్ములాట(లు) !
    కొత్త సినిమాలు !ముచ్చట్లు!- కొన్ని యలరు !
    గంగి రెద్దుల నాట్యమ్ము - గడప ముందు !
    పర్వ దినములు యుత్సాహ - భరిత మొందు!

    తీపి గారెలు ! మనుమలు - తాత గార్లు !
    కొత్త కోడళ్ళ , యల్లుళ్ళ , - కులుకు యలుక (లు)!
    కలుసు కొందురు , నందరు - కుదురు గాను !
    మిగుల నానంద , మోదముల్ - మింటి కెగయ !

    రిప్లయితొలగించండి
  3. బియ్యమును కొంద మనుకున్న భయ్యమయ్యె
    కూరగాయల కొనుమాట నేరమయ్యె
    ఉల్లిపాయల ధరజూడ ఉట్టి పైన
    వచ్చె సంక్రాంతి లక్ష్మి యే మిచ్చె మనకు?

    రిప్లయితొలగించండి
  4. క్షమించాలి గురువు గారూ ! ఒక్క గడి,ప్రహేళిక మోడరేషన్ లొ ఉంచితె చాలు.ఎందుకంటే జవాబు తెలిసి పోయాక రాయలేంకదా ! సమస్యలు మాత్రం ముందె ఉండాలి ఒకరివి ఇంకొకరు చదివి ఇనుమడించిన ఉత్సాహంతొ పోటీ గా రాస్తారు గనుక . నేను మాత్రం అందరివి చదివాకే రాస్తాను. [ నాకు చేతగాక ] దయచేసి అన్యధా భావించ వలదని మనవి.పొర బాటైతె క్షంతవ్యు రాలిని .

    అందరికి సంక్రాంతి శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  5. శంకరార్యా !
    0 వ్యాఖ్యలు
    చూపిస్తూ
    blog
    వెల వెల బోతూ ఉంది.

    తొందరగా మాయ
    తెర
    తొలగించండి.

    రిప్లయితొలగించండి
  6. 'వచ్చె సంక్రాంతి లక్ష్మి యే మిచ్చు మనకు
    నీదు నాన్న'న భర్తతో నీరజాక్షి
    'జీవితాంతము మీ సేవ చేయ నిచ్చె
    నన్ను' కానుక మీరిండు నాన్న కనెను.

    రిప్లయితొలగించండి
  7. నమస్కారములు గురువు గారు ! " ఇంత పెద్ద పనిష్ మెంటా ? ఎన్ని సమస్యా పూరణలు దాగి ఉన్నాయొ ,అందరు నన్ను ఎంత గా తిట్టు కుంటు న్నారో ? అసలు నేనెలా రాయాలో ? ? ?
    నేనే మని అడిగాను " గడి,ప్రహేళిక ,జవాబులు మాత్రమె దాచి ఉంచి మిగిలిన వన్ని [ సమస్యా పూరణలు అన్నీ } ప్రచు రించ మని అడిగాను ఈ అక్క మీద అలిగి ఇంత పెద్ద శిక్షా ? ? ? అమ్మో భరించ లేను.దయ చేసి ఇవన్నీ ప్రచు రంచుము పరమేశా ? ?

    రిప్లయితొలగించండి
  8. పూజ్యనీయులు గురువు గారికి, మిత్రులు శ్రీమతి నేదునూరి రాజేశ్వరి గారికి, శ్రీమతి వలబోజు జ్యోతి గారికి శ్రీ మందా పీతాంబర్ గారు,శ్రీ మిస్సన్న గారు ,శ్రీచంద్రశేఖర్ గారు,శ్రీరవి గారు,శ్రీహరి గారు, శ్రీ మంత్రిప్రగడ బాల సుబ్రమణ్యం గారు,శ్రీ ఊకదంపుడుగారు,శ్రీ నచికేత్ గారు,శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు,డా.విష్ణు నందన్ గారు,శ్రీ జిగురు సత్యన్నారాయణ గారు,శ్రీ నారాయణ గారు,శ్రీ వసంత కిశోర్ గారు శ్రీ ఫణీంద్ర గారు,శ్రీ కోడేహళ్ళి మురళీ మోహన్ గారు, శ్రీ చింతా రామకృష్ణా రావు గారు,డా. ఆచార్య ఫణీంద్ర గారు,శ్రీ నిరంజన్ గారు,శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారులకు మిగిలిన మిత్రులకు వారి వారి కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  9. ఆయు రారోగ్యముల గూడు నభ్యుదయము
    శ్రీలు శుభములు తోడను మేలు యైన
    కవిత పలుకులు చేరిన కలిమి కాదె
    వచ్చె సంక్రాంతి లక్ష్మి యే మిచ్చు మనకు !

    రిప్లయితొలగించండి
  10. కవి మిత్రులారా!
    మీకు కలిగిన అసౌకర్యానికి క్షంతవ్యుణ్ణి.
    ఇంట్లో సిస్టం ఉంది కదా! వెంటవెంటనే వ్యాఖ్యలను చూస్తూ ప్రచురిద్దామనుకున్నాను. కాని ఇంటినిండా బంధువులతో నిన్న బ్లాగు చూసే అవకాశం లేక పోయింది.
    ఈ రోజు మీ వ్యాఖ్యలు చూడగానే మొట్టమొదట చేసిన పని "మాడరేషన్" తొలగించడం.
    నిన్నటి పూరణలపై నా వ్యాఖ్యలను కాసేపయ్యాక తెలుపుతాను.

    రిప్లయితొలగించండి
  11. మంద పీతాంబర్ గారూ,
    ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నది మీ పూరణ. అభినందనలు.

    వసంత్ కిశోర్ గారూ,
    మొత్తం సంక్రాంతి వేడుకలన్నీ మీ పూరణలో ప్రతిఫలించాయి. నోరూరింపజేసి, మనస్సును రంజింప జేసాయి మీ పద్యాలు. అభినందనలు.
    అయితే పానకంలో పుడకల్లా కొన్ని తప్పులు దొర్లాయి.
    మొదటి పద్యం 2, 4 పాదాల్లో, మూడవ పద్యం 1, 3 పాదాల్లో యతి తప్పింది.

    హరి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    మిస్సన్న గారూ,
    వాహ్, అదిరింది మీ పూరణ. పాపం! ఆ అల్లుడు మామకు కానుక ఏమిచ్చాడో కాని మీకు మాత్రం అభినందన మందార మాల.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ముందుగా నాకూ, బ్లాగు మిత్రులకు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు. మీకు కూడ మిత్రులందరి పక్షాన నా శుభాకాంక్షలు!
    చక్కని పూరణ నందించారు. అభినందనలు.
    రెండవ పాదంలో "మేలు + ఐన = మేలైన" అవుతుంది. అక్కడ యడాగమం రాదు.
    "శ్రీలు శుభముల తోడను మేలు గూర్చు" అంటే సరి.

    రిప్లయితొలగించండి