22, జనవరి 2011, శనివారం

సమస్యా పూరణం - 204 (రవి కెందుకు నీకు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
రవి కెందుకు నీకు తరుణి రాతిరి వేళన్.

66 కామెంట్‌లు:

  1. నవలోకపు అభిరుచులను
    అవగాహన చేసికొమ్ము అతివా చూడన్
    చవకే నైటీ; చీరయు
    రవికెందుకు నీకు తరుణి రాతిరి వేళన్?

    రిప్లయితొలగించండి
  2. కవయిత్రి! భూషణంబులు
    రవి కెందుకు? నీకు తరుణి రాతిరి వేళన్
    కవనోత్సాహంబేలనె?
    కవి కానని వైభవముఁ రవి గాంచుట వలదే?

    రిప్లయితొలగించండి
  3. మూర్తి గారు అద్భుతం!

    రెండవపాదం చివర - "గుందన బొమ్మా!" అంటే బావుంటుందని నా ఊహ.

    రిప్లయితొలగించండి
  4. హరి గారూ శభాషు. చాలా బాగుంది మీ పూరణ. స్పీడు కూడా కొట్టేసారు.

    రవిగారూ రవి,కవి మీరే అయినప్పుడు మీకు కనిపించనిది ఏముంటుంది?
    బ్రహ్మాడంగా ఉంది మీ పూరణ . ఈ దినము మేమంతా మీ నామ స్మరణ చేస్తాము.

    రిప్లయితొలగించండి
  5. రవిగారూ మీ సూచన బాగుంది. మా పెరటిలో పున్నమి చంద్రుడిని చూస్తూ సరదాగా వ్రాసాను. మరి బొమ్మ చంద్రబింబముతో ఆగిపోయింది!

    రిప్లయితొలగించండి
  6. యువతీ కాశ్మీరమ్మిది,
    ధవళమ్మగు మంచు గురియు, తనువులు వణుకున్,
    పవలును కావలె రగ్గులు,
    రవికెందుకు నీకు తరుణి రాతిరి వేళన్!

    రిప్లయితొలగించండి
  7. సమస్యను ,హరి గారి పూరణను ఒకే సారి చూసాను .పూరణ చాలా బాగుంది .మూర్తిగారి పూరణా బాగుంది .నేను మొదట రవిగారి లాగే సమస్యను రెండు భాగాలుగా చేసి పూరిద్దా మనుకొన్నాను .ఇంతలోనే రవిగారు ఆ పని చాలా అందంగా చేసారు .నేను వెంటనే కాశ్మీరు కెళ్ళాను. రవి గారి పూరణ ఇలా ఉంటే బావుండు ననిపించింది దొర్లిన గణ దోషం గూడా పోతుంది.
    " కవి గనియెడు దానిని రవి గాంచుట వలదే !"

    రిప్లయితొలగించండి
  8. పీతాంబర్ గారు: మీ నామధేయానికి (ఇంటి పేరుతో సహా) తగిన పూరణ. కానివ్వండి. :))

    "కవి కానని సొగసుల రవి గాంచుట వలదే?" - ఇది నేను రాసుకున్న పూరణండి. టైపించేప్పుడు "సొగసుల" - అనడానికి భయపడి వైభవము గా మార్చాను.దాంతో గణభంగం. విభవము గా మారుస్తున్నానండి.

    కవయిత్రి! భూషణంబులు
    రవి కెందుకు? నీకు తరుణి రాతిరి వేళన్
    కవనోత్సాహంబేలనె?
    కవి కానని విభవముఁ రవి గాంచుట వలదే?

    రిప్లయితొలగించండి
  9. @ హరి,
    @ రవి,
    @ గన్నవరపు నరసింహ మూర్తి,
    @ మంద పీతాంబర్
    అందరి పూరణలు ఉత్తమంగా ఉన్నాయి. పరస్పర విశ్లేషణలు, ప్రశంసలతో నాకు శ్రమ తగ్గిస్తున్నారు. అంతా నిర్దోషంగా వ్రాస్తున్నందున సవరించే శ్రమను కూడ తప్పిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు.
    మిస్సన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. రవి గారు నా పేరుపై పూరణ చేయుమన్నారు. పూరణకు పాత్రమైన పేరు కాదుగాని ,నా జన్మ నక్షత్రము ఉత్తర ,అందులో నాల్గవ పాదం " టే,టొ ,పా ,పీ." అలా జన్మ నామం "పీతాంబరుడు" అయింది .కృష్ణునికి గల పేర్లలో ఇదిగుడా ఒకటి కాబట్టి ,అరుదుగా ఉంటుందని మా తండ్రి శ్రీ మంద రాజన్న గారు భావించి అదే పేరును పెట్టారట! నా అన్ని రికార్డ్స్ లలో M .Pithamber గానే ఉంది . మీరు కోరి నందులకు ఈ పద్యం.మంద అనునది ఇంటి పేరు

    మరి జన్మనామ మిదెనట!
    హరినామములలొ యొకటని అనెనట తండ్రే!
    సరి, పీతాంబరుడనిరట!
    పరిపరి విధముల పలువురు పిలిచిరి నన్నున్!

    రిప్లయితొలగించండి
  11. పీతాంబర్ గారు,

    మీరు పొరబడ్డారని నాకనిపిస్తుంది.

    నా ఉద్దేశంలొ రవిగారు చెప్పింది మీరు ముందు రాసిన పద్యంలొ మీపేరు, ఇంటిపేరు కూడా ధ్వనిస్తున్నాయని. మీరు పద్యంలొ "రగ్గు" అని వాడారు కదా, మందమైన వస్త్రము అని అర్థం చెప్పుకుంటే మీపేరే గదా.

    రిప్లయితొలగించండి
  12. హరి గారు ,ఔను నిజమే , ఎంతైనా మంద బుద్ది గదా!

    రిప్లయితొలగించండి
  13. ఈరోజు ఛలోక్తులూ, చమత్కారాలూ బహు చక్కగా పండాయి.
    అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. దివిటీల వెలుగులేలా
    రవి? కెందుకు నీకు తరుణి రాతిరి వేళన్
    నవ కుంద రదన ధవళ-
    ఛ్ఛవులుండగ, దీప కళిక? చనుమిక చాలున్.

    రిప్లయితొలగించండి
  15. 'దంత్య చ జ' లు యే టైపు ఉపకరణి లోనైనా లభిస్తాయేమో మిత్రులెవరైనా చెప్పగలరా?

    రిప్లయితొలగించండి
  16. అందరికీ వందనములు.
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి!

    మిస్సన్న మహాశయా !
    ఆంధ్ర భారతి నిఘంటు శోధన కీబోర్డు మ్యాపింగ్ @
    " http://www.andhrabharati.com/dictionary/
    index.php "
    అయినా ఈ రోజుల్లో
    అవి (ౘ ,ౙ) ఎంతవరకూ
    అవసరం???

    రిప్లయితొలగించండి
  17. రవి కిశోర్ గారూ ధన్యవాదాలు. ఆ కీబోర్దును యెలా వాడాలో తెలియడం లేదు.
    అయినా ప్రయత్నిస్తాను. ఏమీ లేదు, జల్లెడ, చదరము, చదువు వంటి పదాలను దంత్య
    చ జ లను వాడకుండా వ్రాయాలంటే అసౌకర్యంగా ఉంటోంది.

    రిప్లయితొలగించండి
  18. రవి గారి సూచన మేరకు :

    రవివర్మ కుంచె యాడగఁ
    గువలయములు గన్ను లయ్యెఁ గుందన బొమ్మా!
    చెవి,ముక్కు,దాటి సాగదె
    రవి కెందుకు? నీకు తరుణి రాతిరి వేళన్ !!!


    పీతాంబర్ గారూ మీకు మీ నాన్నగారు చక్కని పేరు పెట్టారు. మీ పేరు చూచి నప్పుడు ఆ విష్ణువు అలా కనిపిస్తున్నాడు. మీ నాన్నగారికి ధన్యవాదములు.
    మిస్సన్నగారూ, చక్కని పూరణ.మీ దంత్య 'చ ''జ 'లకు మరో 10-15 సంవత్సరాల వరకు నా విషయములో ఢోకా లేదు. ఆ తర్వాత కట్టుడు పళ్ళు యెలా ఉఛ్ఛరిస్తాయో తెలియదు!
    వసంత కిశోర్ జీ పరమాణు సందేశములు పంపించాను. అందలేదా ? పోనీ నాకు మీరు ఓ 'హలో' పంపించండి.

    రిప్లయితొలగించండి
  19. నవయుగపు నళినాక్షులు
    ధవళపు కలువల ద్యుతి తనువులు మెరయన్
    అవిరళముగ కవి విరుపులు
    రవికెందుకు నీకు తరుణి రాతిరి వేళన్ ?
    ------------------------
    దివినుంచి భువికి గాంచిన
    కువలయ కువకువలు కొలువై యుండన్ !
    దివిజుల పదముల వ్రాలగ
    రవికెందుకు నీకు తరుణి రాతిరి వేళన్ ?

    రిప్లయితొలగించండి
  20. పవలే కనిపించెడి ఆ
    రవి కెందుకు? నీకు తరుణి రాతిరి వేళన్
    నవమి శశి యొలుకు వెన్నెల
    కువకువలో చుంబనములు కురిపించినచో !

    రిప్లయితొలగించండి
  21. ఎప్పుడైతే అర్ధరాత్రి కూడా స్త్రీ స్వేచ్చగా తిరుగగలుగుతుందో అప్పుడు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని గాంధీగారు అన్నారు. స్వాతంత్ర్యం వచ్చేసి అరవైయ్యేళ్లైపోయినిది కానీ గాంధీగారి మాట మాత్రం వర్కవుట్ అవటం లేదు. అర్ధరాత్రి కాదుకదా పట్ట పగలు కూడా స్త్రీ స్వేచ్చగా తిరుగేకాలం కాదిది. అందుకే ఆ అపఖ్యాతి సూర్యుడికి మాత్రం ఎందుకు? పగలు తిరిగితే కదా రాత్రి కూడా తిరుగగలగాలి అనే కంపేరిజన్. అసలు పగలే తిరుగనీయ్యని పరిస్థితుల్ని పెట్టేస్తే పోలే అనిపించే నేటి సమాజానికి ప్రతిబింబమే నా పూరణ

    భువిలో చెడ్డ యశస్సది
    రవికెందుకు? నీకు తరుణి రాతిరి వేళన్ ?
    రవి చంద్రులలో తేడా
    చివరకు "స్త్రీ స్వేచ్చ" లోనె చెరిగెను! గనుమా!

    రిప్లయితొలగించండి
  22. అందరికీ వందనములు.
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి!
    ______________________________________________

    ప్రొద్దున్నే మామూలుగా మా శాంతికి
    " రవికెందుకు నీకు తరుణి రాతిరి వేళన్"
    సమస్యను చూపించి
    దీన్ని రవికెలూ, రమణులూ గురించే కాకుండా
    రవికెలు వేసుకోనివాళ్ళ పరంగా
    అంటే సిగ్గులేనివాళ్ళ పరంగా కూడా పూరించొచ్చు.
    నువ్వే ఏదైనా సలహా చెప్పు అన్నాను.

    పదినిమిషాల తరువాత తనే చెప్పింది
    విదేశీ బాంకుల్లో డబ్బు దాచే వాళ్ల గురించి
    వ్రాయమని.
    (ఈ మధ్య టీవి ల్లోనూ పేపర్ల లోనూ
    వార్తలూ చర్చలూ ఇవే గదా)

    ఔను మరి.
    సిగ్గు లేని వేశ్యా వాటిక లోని స్త్రీలు
    రాత్రేమిటి ? పగలేమిటి ? రవిక ల్లేకుండానే
    సంచరిస్తారు గదా!
    వాళ్ళకూ వీళ్ళకూ తేడా ఏముంది ?????
    అదే ఇది.

    చిత్తగించండి సాములూ !

    01)
    __________________________________________

    కవకవ నవ్విన సిగ్గా ?
    శవమును త్రాగెడు విధమున - సంపద నంతన్
    ద్రవిణా గివమున దాతురె ?
    రవికెందుకు నీకు తరుణి - రాతిరి వేళన్
    (రవి కెందు కధము లకును - రాతిరి పవలున్ !)
    ___________________________________________

    కవకవ = బిగ్గరగా
    శవము = నీళ్ళు (అనే అర్థం లోనే పైన వాడడం జరిగింది)
    (కానీ వీళ్ళుశవాల్ని కూడా పీక్కు తింటారు అనేది అంతరార్థం)
    ద్రవిణా గివము = ధనాగారము = swiss_bank లేక విదేశీ బాంక్
    రవిక = ఆచ్ఛాదనము = దోషమును గప్పుట
    ____________________________________________

    రిప్లయితొలగించండి
  23. మిస్సన్న మహాశయా !
    నేను వసంత కిశోర్ని.

    ఆ కీ బోర్డు సూచిక మాత్రమే.

    అందు సూచించిన విధమున
    మన కీ బోర్డు లోనే type చేసిన
    సదరు అక్షరములు
    ఆ పై నున్న కవాటము(window) నందు
    కనుపించ గలవు.
    వానిని copy చేసి notepad నందు ముద్రించు కొని
    పిమ్మట మన ఇచ్ఛ వచ్చిన చోట వాడు కొన వచ్చును.

    రిప్లయితొలగించండి
  24. 02)
    _______________________________________

    శివముల నవిరత మిచ్చెడు
    కువలయ ధరములు , ధరిత్రి - కుచముల గప్పన్
    అవిరళ వనంబు లుండగ
    రవి కెందుకు నీకు తరుణి రాతిరి వేళన్.
    ________________________________________

    రిప్లయితొలగించండి
  25. మిస్సన్న గారూ,
    కిషోర్ గారు చెప్పిన పధ్ధతి ప్రకారం కీ బోర్డు మీద 'ౘదువు' అని టైపు చెయ్యాలంటే, '~caduvu' అని టైపు చెయ్యాలి.
    కానీ, దీర్ఘం రావాలంటే, '~caaladu' అని టైపు చేస్తే, 'ౘాలదు' అనే వస్తోంది. 'ౙాబిలి' అయినా అంతే.హ్రస్వాలకైతే ఇబ్బంది లేదు.
    ప్రయత్నించి చూడండి,

    రిప్లయితొలగించండి
  26. 03
    _________________________________________

    వివరము సేయక దూడల
    నవికలముగ ననవరతము - నాకలి దీర్చున్
    కవిలాపీనము దాచను
    రవి కెందుకు నీకు తరుణి రాతిరి వేళన్.
    __________________________________________

    రిప్లయితొలగించండి
  27. 04)
    _________________________________________

    పవనము శీతల మాయెను
    నవ వధు,వరుల నడుమ కడు - నవకట మేలా ?
    పవరము పెనగొని యుండగ
    రవి కెందుకు నీకు తరుణి రాతిరి వేళన్.
    _________________________________________

    పవరము = యుద్ధము = శయ్యా యుద్ధము
    _________________________________________

    రిప్లయితొలగించండి
  28. మిత్రులకు మెచ్చుకోళ్ళు :
    _________________________________________

    మూర్తి గారి పూర్ణ - ముత్యమై యలరారు !
    మంద వారి పూర్ణ - మదిని గెల్చు !
    మిగత వారి పూర్ణ - మేరువు దలపించు !
    మిస్స నన్న పూర్ణ - మించు మించు !
    _________________________________________

    పూర్ణ = పూరణ / పూరణలు
    మించు = మెరుపు
    మించు = అతిక్రమించు
    _________________________________________

    రిప్లయితొలగించండి
  29. 05)
    _________________________________________

    పవలును రేయిని సతతము
    సవరణ మొనరించు , పల్లె - శ్రమణలల స్వయం ?
    భువులను గట్ట శకలమౌ
    రవి కెందుకు నీకు తరుణి రాతిరి వేళన్.
    _________________________________________

    రిప్లయితొలగించండి
  30. కవి మిత్రు లందరికీ వందనాలు.
    అందరి పూరణలు ఒకదాని కంటె మరొకటి మనోహరంగా ఉంటూ అలరిస్తున్నాయి. క్రమ క్రమంగా `మన` బ్లాగు మిత్రులకు చర్చావేదికగా పరిణమిస్తున్నందుకు మహదానందంగా ఉంది.
    వీకీ పీడియా మీటింగ్ వెళ్తూ, సమయాభావం వల్ల మిత్రుల పూరణలను సమీక్షించలేక పోతున్నాను. మీటింగు నుండి వచ్చాక చూస్తాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  31. హానీమూన్ పై వెళ్లిన నూతన దంపతులను దృష్టిలో పెట్టుకొని నే పూరించిన పూరణ లొ మూడవ పాదమును మొదట యిలా వ్రాసుకొని
    "యువకుడు కౌగిట నుండగ"
    బావుండదేమో ననుకొని అలా పూరించాను.ఇతర పూరణలు చూసిన తదుపరి ,అలా ఉన్నా తప్పు లేదనిపిస్తుంది .

    రిప్లయితొలగించండి
  32. పీతాంబర్ గారూ అలా అయితేనే పద్యం చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  33. పీతాంబర్ గారూ అలా అయితేనే పద్యం చాలా బాగుంది.
    అంటే "యువకుని కౌగిట నుండగ" అని.

    రిప్లయితొలగించండి
  34. వసంత కిషోర్ గారూ క్రమంగా మీ పద గుంఫన నరసింహ మూర్తి గారికి వలెనే
    చాలా జటిలమై నాబోటి భాషా పరిఙ్ఞానం తక్కువ గలవారికి కొరుకంబడుట లేదాయె.

    రిప్లయితొలగించండి
  35. విద్యా సాగర్ గారూ ధన్య వాదాలు.
    అయినా ఈ విషయంలో మా ఇంటికి వెళ్ళాక పరిశోధించాలి.
    ప్రస్తుతం బెంగుళూరులో ఉన్నాను.

    రిప్లయితొలగించండి
  36. నరసింహ మూర్తి గారూ వైద్యులకసాధ్యం ఏముంది?
    లింగ భేదాలనే పరస్పరం మార్చి పారేస్తున్నారు.
    మీ ఉచ్చారణ కే ఢోకా ఉండదు

    రిప్లయితొలగించండి
  37. మిత్రు లందరికీ
    వందన
    అభినందన
    ధన్యవాదములు.

    మిస్సన్న మహాశయా !

    నా వయసు 59.
    ఎప్పుడో 50 సంవత్సరముల పూర్వము
    అదీ 1, 2 లేక మహా అయితే 3 వ తరగతి
    వాచకములలో తప్ప
    (పూర్వ కవుల పునర్ముద్రిత గ్రంధాలూ,నిఘంటువులూ మినహాయిస్తే)
    ఇతరత్రా ఎన్నడూ , ఎచ్చటా
    మీ రడిగిన యక్షరముల
    చూచిన , వినిన గుర్తు లేదు.
    వ్రాయ వలసిన అవసరమూ కలుగలేదు.

    అవి ఏనాడో కనుమరుగై పోయినవి.

    ఇప్పుడు ఏ పుస్తకమునందు గాని
    పేపరునందు గాని వానిని చూప గలరా ??????

    రిప్లయితొలగించండి
  38. శ ,ష, స లనే సరిగ్గా ఉచ్ఛరించలేని ఈ రోజుల్లో

    (ర) కూ, (ఱ) కూ తేడా తెలుసు కొన గలుగు వారెవ్వరు!

    అవి యన్నియు ఒకే యక్షరముగానే పలకబడు చున్నవి.

    అంతవరకెందుకు ?

    బాద, భాద , భాధ, బాధ

    పై నాలుగు పదాలలో ఏది సరియైనదో వెంటనే చెప్పుడు !

    రిప్లయితొలగించండి
  39. చూశారా మరి !!!
    సాయ శక్తులా / శాయ సక్తులా
    ఏది సరి.

    ఏ నిఘంటువునో ఆశ్రయించ వలసిందే

    అరసున్న అవరసరమేంటో చెప్పండి
    (నా కైతే నిఝంగా తెలియదు.గురువుగారిని
    అడుగుదామని ఎప్పటి నుండో అనుకుంటూ అశ్రద్ధ చేస్తున్నాను.

    అసలు అనుస్వారం లేకుండా పని జరుగదా ?

    కంటిమి / కన్‌టిమి------
    సంతోషం / సమ్‌తోషమ్

    ఏదీ ఉచ్ఛారణలో తేడా చూపించండి!

    రిప్లయితొలగించండి
  40. నేనేదో తెలుగు భాషా ద్రోహి ననుకుంటున్నారా కాదు
    ఎంతమాత్రం కాదు కాదు కాదు.

    తెలుగు భాషా వీర వీర వీరాభి మానిని నేను.

    సరిగ్గా చెప్పాలంటే కర్ణుడి మీద కుంతీ దేవి కెంత ప్రేమ ఉందో
    దానికి మించిన ప్రేమ నాకు తెలుగు భాష మీద ఉంది.

    కాని ప్రస్తుత పరిస్థితులూ
    దేశ కాల మానా వస్థలను పరిగణన లోనికి తీసుకుంటే
    ఈ ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి.

    రిప్లయితొలగించండి
  41. మొత్తం మన తెలుగు భాషలో అక్షరాలు ఎన్ని?
    16+3+27+10 = 56

    ప్రతీ హల్లుకూ ఒక గుణింతం.--16+3=19
    (దానికి మళ్ళీ ఈపక్కనా ఆ పక్కనా నెత్తిమీదా
    తలకట్లూ తదితరాలు తగిలించడం.)

    అవి గాక ద్విత్వాక్షరాలు =37
    (వీటి నన్నీ [క వత్తూ] వగైరాలు క్రిందే పెట్టాలి)

    ఇంకా సంయుక్తాక్షరాలు.
    (2, 3, 4 --అంటే ఒక అక్షరం క్రింద 3 వత్తులు పెట్టాలి.

    ఇవన్నీ వ్రాయడానికి బానే ఉంటాయి.
    కాని ముద్రణకూ టైపుకూ ఎంత ఇబ్బంది.
    పూర్వం ముద్రణాలయాలను మీరు చూచే ఉంటారు

    ఎన్ని వందల వేల ముద్రలు (సీసపు బిళ్ళలు)
    ఒక పేజీ compose చెయ్యాలంటే ఎంత సమయం పట్టేది ?

    అయినా మనం వ్రాసేది (ఇప్పుడు "రాసేది")అసలు తెలుగేనా ?
    (ఉత్తరం/జాబు వ్రాస్తాం. కొబ్బరి నూనె రాసుకుంటాం)
    మీ సంగతేమో గాని నా వ్రాత("రాత") కోడి కెలికినట్టు ఉంటుంది
    అసలు తెలుగంటే గుండ్రంగా ముత్యాల లాగ ఉండా లని
    చిన్నప్పుడు copy లు వ్రాసే వాళ్ళం గదా !
    ఒక్కసారైనా copy పుస్తకం పైన ముద్రించి ఉన్నట్టు వ్రాసి(రాసి)
    ఎరుగుదుమా???

    రిప్లయితొలగించండి
  42. పాత సంగతి ఒకటి గుర్తొస్తోంది.
    నాకు చిన్నప్పటి నుండీ పద్య రచనపై మక్కువ ఎక్కువ.
    ఎన్నో సార్లు ఏదో వ్రాయడం -తప్పొప్పులు
    తెలియక తెలిపే వాళ్ళు లేక మూల పడెయ్యడం.
    ఒక ప్రక్క బ్రతుకు పోరాటం.(ఇంగ్లీషు లోనే ఏడవాలి)
    విశ్వనాధ సత్యనారాయణ గారు వ్రాసిన
    " విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు "
    అనే పుస్తకం చదివినప్పటి నుండీ ఇంగ్లీషంటే కంపరం ( elargy )
    అయినా తప్పదు. తప్పని సరి. లేకపోతే బ్రతుకు పోరాటం ఆగిపోతుంది.
    కనీసం వెనుక బడి పోతుంది.
    ఒకసారి
    M.A(TELUGU) పూర్తి చేసిన మా బంధువును
    పద్య రచనలో మెళకువలు తెలుసుకోవచ్చు నని

    కంద పద్య లక్షణాలు ఏంటి ?
    అని అడిగితే
    ఏమో ఎవడికి తెలుసు
    అని సమాధానం.
    నాకు తేరుకోడానికి చాలా కాలం పట్టింది

    రిప్లయితొలగించండి
  43. వసంత్ కిషోర్ గారు చెప్పింది బలపరుస్తూ...

    తెలుగుభాషకి తెలుగు భాషని మరింత సరళం చేయాల్సిన అవసరం ఉంది. సరళం ఐన కొద్దీ మరింత ప్రాచుర్యంలోకి వస్తుంది.

    అయితే నాకు మాత్రం జ, ౙ లకు మధ్య కొంత తేడా ఉందని అనిపిస్తుంది. ఇంగ్లీషు వారు కూడా దాన్ని గుర్తించారు కాబట్టే j z లు వారికి ఉన్నాయి. ఇంగ్లీషు పదాలు ఎక్కువగా వాదుతున్న ప్రస్థుత పరిస్థితులలో ఈ అక్షరం అవసరం మళ్ళీ అవసరమైందేమో అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  44. అదీ మన ప్రస్తుత విద్యా వ్యవస్థ.

    ఇంతకంటే ఎక్కువ చర్చ కూడా అనవసరం అనిపిస్తుంటుంది
    విద్యా రంగం దాని తీరు తెన్నులూ చూస్తుంటే.

    నాకున్న పరమాణు వంత పరిఙ్ఞానానికి (తెలుగులో) పునాది
    పూర్వం ఎప్పుడో SSLC వరకూ గురువులూ
    ఇంకా చిన్నప్పుడు తల్లిదండులూ నేర్పిన పాఠాలే.

    మరి ఈ రోజు ఏమిటీ విపరీత పరిస్థితి?
    MA(TELUGU) చదివిన అంటే
    పట్టా పుచ్చుకున్న వాళ్ళు కూడా
    తప్పులు లేకుండా పది వాక్యాలు తెలుగులో
    వ్రాయలేని పరిస్థితి.

    రిప్లయితొలగించండి
  45. సరే వాళ్ళ పరిస్థితి వదిలెయ్యండి
    అందరూ కాక పోయినా 90 వంతులు అదే పరిస్థితిలో ఉన్నారు.
    సరే మన సంగతి కొస్తే చిన్నప్పుడు ఇంట్లోనూ
    బడి లోనూ లేకపోతే ఏదైనా
    ప్రతి పదార్థ టీకా తాత్పర్య సహితంగా
    లభ్యమై చదివినవి కాకుండా
    క్రొత్త పద్యం ఏ మహా భారతం నుండో చదివి
    అర్థం చేసుకో గల పరిస్థితి ఉందా ???

    ---తెలుగు పద్యం స్వామీ తెలుగు పద్యం ---
    మనం తెలుగు వాళ్ళ మై ఉండీ,
    చదివి అర్థం చేసుకొనే పరిస్థితి ఉందా ???
    ఖచ్చితంగా మీ సమాధానం " లేదు " అనే
    నాకు తెలుసు.అందరికీ తెలిసిన నగ్న సత్యం.
    మరి ఈ దుస్థితి ఎందుకు దాపురించింది ?
    దానికి కారణం మనమేనా ?
    కాదు .ఎంతమాత్రం కాదు.
    మరేమిటి? విద్యా వ్యవస్థా??
    అది కూడా కాదు(దాని పాత్ర కూడా పరిమితం)
    మరేమిటి ???
    తర తరాల బానిసత్వం
    వందల సంవత్సరాల పరాయి పాలన.
    తదనుగుణంగా జరిగిన మార్పులూ చేర్పులూనూ.

    రిప్లయితొలగించండి
  46. నా పూరణలోని స్వారస్యాన్ని ఎవరైనా గ్రహిస్తారేమో అని చూసాను. ఎవరూ గ్రహించలేదేమో అన్న అనుమానం కలిగి, భావాన్ని వివరిస్తున్నాను.
    ఇది నేను స్త్రీ పరంగా కాకుండా, పురుషుని పరంగా పూరించాను. అంతే కాకుండా నా పూరణలో ‘రవిక‘ ప్రస్తావనే లేదు.
    " నవమినాటి చంద్రుడు ఒలికేటి వెన్నెల రాత్రి వేళ గిలిగింతలలో నీకు, నీ ప్రేయసి ముద్దులు కురిపిస్తుంటే, మధ్యలో ఆ పగలు మాత్రమే కనిపించే సూర్యునికి ఎందుకట (అసూయ)?" అని ఆ శృంగార భాగ్యాన్ని పొందిన పురుషునితో కవి అడుగుతున్నట్టుగా ఆ పద్యాన్ని అల్లడం జరిగింది.

    రిప్లయితొలగించండి
  47. అసలు మీకో విషయం తెలుసా?
    మనం ప్రస్తుతం తెలుగు అనుకుంటున్న భాషలొ
    అచ్చ తెలుగు పదాల శాత మెంత ఉంటుందో ఊహించండి.

    నా దగ్గర
    "అచ్చాంధ్ర నిర్గద్య నిరోష్ఠ ----"
    గ్రంధం ఒకటుండేది.

    అది చదివితే పేజీ కొక్క పదమైనా అర్థమైతే ఒట్టు.

    ఆ లెఖ్ఖన మన ప్రస్తుత తెలుగులో
    ఒక శాతం కూడా అచ్చ తెలుగు లేనట్లే.

    35 శాతం సంస్కృతం
    35 శాతం ఇంగ్లీషు,లేటిన్ , గ్రీకు
    20 శాతం ఉర్దూ , పారశీకం
    09 శాతం ఇతర భాషలూ

    ఇవేమీ statistics మాత్రం కావు
    ఏదో నేను ఊహించి వ్రాస్తున్నది.
    దీని మీద పరిశోధన చేసిన వారెవరైనా ఉంటే
    వాళ్ళు సరియైన సంఖ్యా శాతం చెప్ప గలుగుతారు.

    రిప్లయితొలగించండి
  48. డా.ఆచార్య ఫణీంద్ర గారికి
    వందన శతములు మరియు
    ధన్యవాదములు.
    అయ్యా మీరు చెప్పాక
    కొంచెం అర్థమైంది.

    మా శంకరార్యునికి
    శంకరాభరణం తో బాటూ
    చంద్రవంకను జత చేర్చి నట్లుంది మీ పూరణ.
    ధన్య వాదములు.

    అయ్యా !ఉదయం నుంచీ నా మొత్తు కోలు కూడా ఇదే
    ఒక పద్యం చదివి అర్థం చేసుకోలేని దుస్థితిలో ఉంది
    ఈ రోజు తెలుగు జాతి(ఒక శాతం మినహాయింపుతో)
    అని నా భావన.

    " అబ్బ !!! బావా ! నువ్వెంత అందంగా ఉన్నావో"
    అంటే
    " నా అందానికేం గాని
    నీ కంఠ స్వరం చూడు
    కోకిల కంఠం లా ఉంది!!!!!"

    అని మాటాడు కొన్న
    లొట్టిపిట్టా , గాలిగాడు
    లాంటి వాళ్ళం సార్ !
    మమ్మల్ని మన్నించండి.

    అప్పుడప్పుడూ
    వీలై నప్పుడు మా మీద మీ వెన్నెల
    కొంత కురిపించండి.
    అదే మా భాగ్యం.
    మీకు మరోసారి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  49. వసంత మహోదయా! మీ బాధ నాకర్థమయింది.
    మీ సుదీర్ఘమైన వ్యాఖ్యానాన్ని చదివేక కూడ నాకనిపిస్తూన్నది
    ఒకటే. తెలుగు భాషలో కొన్ని, అన్నీ కాకపోయినా, ముఖ్యమైన
    అచ్చులనూ, హల్లులనూ లుప్తం చెయ్యడం దారుణం. ఉదాహరణకు చదువు, చాలు వన్టి
    పదాలను దన్త్య చ ను లుప్తం చెయ్యడం వలన సరిగా ఉచ్చరించ లేక
    నేటి పిల్లలు యెంతోమంది చలము,చాయ వన్టి పదాల లాగ పలుకుతున్నారు.
    ఇది చాలా బాధాకరం. అలాగే ఋషి అనే పదాన్ని రుషి అని వ్రాస్తే యెంత
    బాధగా ఉంటుంది? మనకు పట్టువడనంత మాత్రాన అది భాష లోపం
    కాదు. ద్విత్వాక్షరాలూ, సంయుక్తాక్షరాలూ, అనుస్వారమూ వంటి వేమీ
    తెలుగులో వద్దనుకొంటే ఇక తెలుగును రద్దు చేసేసి అక్షరాలు తక్కువగా
    ఉండే యే అరవ భాషనో ఆశ్రయిస్తే సరిపోతుంది గదా!
    నిరక్షరాస్యులు వారికి చదువనూ వ్రాయనూ రాదని లిపి వద్దంటే
    సహించగలమా? భాషను నేర్చుకోవడం వేరు, దానిలో ప్రావీణ్యత
    సాధించడం వేరు. ప్రావీణ్యత అందరికీ సాధ్యం కాదు.
    భాషను అందరూ నేర్చుకోవడం అత్యవసరం.
    చదువుకోని వారు కూడా చక్కగా ఉచ్చరించే అక్షరాలను భాషలోంచి
    తప్పించెయ్యకూడదు.
    మీ మనోభావాలను గాయపరిస్తే క్షన్తవ్యుడను.

    రిప్లయితొలగించండి
  50. ఆచార్య ఫణీంద్ర గార్కి నమస్కారాలు. మీ పూరణకు ఇచ్చిన వివరణకు ధన్యవాదాలు. మీ పూరణలోని స్వారస్యాన్ని మీ వివరణకు ముందే గ్రహించినానని చెప్పడానికి సంతొషిస్తూన్నాను. పండితుల కవిత్వం, దాని భావమూ యెల్లప్పుడూ అమృతపు వర్షం లాగ మనసులకు ఆహ్లాదాన్ని కలిగిస్తూనే ఉంటాయి.

    రిప్లయితొలగించండి
  51. కిషోర్ గారు బ్లాగులో నేడు తెలుగు భాషతో వీర విహారం చేశారు .భాష సమయానుకూలంగా మారుతూ వుంటుంది .సహజ సౌందర్యం తగ్గకుండా ,ప్రాత,క్రొత్తల మేళవింపుతో సాగి పోయేదే భాష .దీనికి తెలుగు మినహాయింపు కాదు .తెలుగు భాషకు తగిన ప్రాచుర్యాన్ని కలిగించే బాధ్యత ప్రభుత్యం పైనే ఎక్కువగా ఉంది.యిది నా భావన .

    ఆచార్య ఫణింద్ర గారి పూరణ చదివిన ఏదో భిన్నంగా ఉన్నదని పించింది ,వివరించిన తర్వాత గాని పూరణ సౌందర్యం తెలియ లేదు

    మిస్సన్న గారన్నట్లు "యువకుని కౌగిట"నే సరియైనది.

    రిప్లయితొలగించండి
  52. మిస్సన్న మహాశయా !

    అంతంత మాట లొద్దు గాని
    అసలు నేనేదో వ్రాద్దామని మొదలు పెట్టి ఏదేదో వ్రాశాను.
    మనసులో ఉన్న భావనలు ఈ రోజు అనుకో కుండా బయటికి వచ్చేసినై.
    నాకా పనీ పాటూ లేదు.ఈ వేదికొకటి తేరగా దొరికింది.పైసా ఖర్చు లేదు.
    ఇదీ మీ మాటే (మన పైత్యాలన్నీ రాసుకోవచ్చునిక అన్నారొకసారి)
    ఇప్పుడు నా పైత్యం కొంచెం ప్రకోపించింది.అంతే.
    మనసులో భావాల్ని వెలిబుచ్చడం తప్పు కాదు గదా!

    భాషను లుప్తం చెయ్య మని నేనెక్కడా అనలేదే !
    అక్షరాలు ఉంచ మనడానికీ తీసెయ్య మనడానికీ నేనెవర్ని?
    afterall SSLC !!!అర్ హత ఉన్న వాళ్ళు చర్చించి చెయ్య వలసిన పని యది
    అయినా ప్రాచీనులు వాటిని వాడారు గాబట్టి , వాటిని చదూకోడాని కయినా
    వాటిని ఉంచవలసిన అవసరం చాలా ఉంది.
    చూశారా ! ర క్రింద హ వత్తు పెట్టడానికి నా లేఖినిలో వీలుపడక
    అలా ర కారము ప్రక్కన హ వ్రాసి "అర్ హత"అని వ్రాయ వలసి వచ్చింది.

    అసలు నేను చెప్పదలచు కుంది కూడా ఇదే
    -------- ముద్రణా సౌలభ్యం-------------------
    అనుకోకుండా
    అరవభాషను ప్రస్తావించి మీరు కూడా నా దారికే వచ్చారు.
    అసలు ఇది మీరు మొదలు పెట్టిందే key ల గురించి ప్రస్తావించి !

    రిప్లయితొలగించండి
  53. అందరికీ మనవి
    అయ్యా నా పరిధి చాలా చిన్నది.
    ఇక్కడ నేను వ్రాసేది నాకు తెలిసింది మాత్రమే.
    అందులో సత్యా సత్యాలు ఎంతవరకూ ఉన్నాయో
    అది తెలిసిన వాళ్ళు దయచేసి ఖండనో/ దండనో దయచెయ్యండి
    మోదమో / ఆమోదమో తెల్పండి.

    రిప్లయితొలగించండి
  54. -------------ముద్రణా సౌలభ్యం (ము-సౌ)---------------
    యూరోపియన్ భాషలలొ ఈ ము-సౌ చాలా ఎక్కువ .
    వాళ్ళకు అక్షరాలు చాలా తక్కువ.
    ఇంగ్లీషు వలెనే 30 కి కాస్త అటూ ఇటూ గా వుంటాయి.
    అక్షరాలు గీతలు గీసినట్లు వ్రాయదానికి అనువుగా తేలికగా ఉంటాయి
    అక్షరం ప్రక్క అక్షరం వ్రాయాలే తప్ప
    క్రిందా పైనా వ్రాయనఖ్ఖఱ లేదు.

    ఈ సౌలభ్యం కారణమ్ గానే type meshine కనిపెట్టడం జరిగింది
    వ్రాతపని 100 రెట్లు వేగాన్ని అంది పుచ్చు కుంది.

    ఆ సౌలభ్యమ్ మన భారతీయ భాషలలో కొఱవడడం వల్ల

    అది వచ్చిన ఎన్నో ఏళ్ళకు గాని మన తెలుగులో type mechine రాలేదు

    రిప్లయితొలగించండి
  55. ఆ సౌలభ్యమ్ దక్షిణాది భాషలలో
    ఒక్క అరవ(తమిళ) భాషకు మాత్రమే ఉంది.
    type machine అందుబాటులో కొస్తే వ్రాతపని
    నిఝమ్ గానే 100 రెట్ల వేగాన్ని అందుకుంటుంది.
    అదెప్పుడు అక్షరాలు తక్కువగా ఉన్నప్పుడు.

    ఈ విషయంలో తమిళ భాష దేశం లోని
    అన్ని భాషలకన్నా వేగాన్ని సంతరించుకుంది.

    తమిళ భాషలో అచ్చులు 10
    వర్గాని 2 చొప్పున 5 వర్గులకూ 10
    య మొదలైనవి 10
    ఇంచు మించుగా యూరోపియన్ అక్షరాల వలె 30 కి
    కాస్త అటూ ఇటూ గా ఉంటాయి
    అరసున్న , అనుస్వారము ఉండవు.
    విసర్గ లాంటిది ఉంటుంది గానీ ఎక్కువ అవసర పడదు.
    ఇంకా ముఖ్యంగా అక్షరాలు పక్క పక్కనే వ్రాయాలి తప్ప
    క్రిందా పైనా వ్రాయ నఖ్ఖఱ లేదు.

    దీనితో యూరోపియన్ భాషల లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నట్లయింది.
    అందుకే వాటి వేగానికి సరి సమానంగా పయనిస్తోన్‌ది.

    తమిళంలో క ఖ గ ఘ బదులు ఒకే అక్షరం ఉంటుంది.
    అలాగే అన్ని వర్గులూనూ

    వాళ్ళు
    విక్ర మార్కుడు ----- వ్రాయాలంటే

    విక్‌ర మార్‌కుడు ----- అని వ్రాస్తారు.
    అలాగే అన్నీనూ.పైపెచ్చు
    ఏదీ క్రింద వ్రాయరు పక్కన వ్రాస్తారు

    దీనివల్ల ఎంతో ము-సౌ
    అయ్యా ఇదీ నేను చెప్ప దలచుకుంది.
    ఈ రోజుకిక
    స్వస్తి

    రిప్లయితొలగించండి
  56. కిషోరు మహోదయా! నేను మిమ్మల్ని తప్పు పట్టలేదు. నా పైత్యం నేనూ ప్రకటించాను.
    మనభాషకు అనువైన యంత్రము కనిపెట్ట లేకపోవడము మన భాష తప్పు కాదు.
    నా ఆవేదనను అర్థం చేసుకొన్నారనుకొంటున్నాను. ఈ చర్చను ఇంతటితో ముగిద్దాము.

    రిప్లయితొలగించండి
  57. సవనంబే సంసారము
    ధవుడే నీ దరికిఁజేర తాపమున, తనూ
    భవునకు పాలిచ్చునపుడు
    రవి కెందుకు నీకు తరుణి రాతిరి వేళన్.

    రిప్లయితొలగించండి
  58. కవులకు నిఘంటువుల వే
    ల? విబుధులకు వ్యాకరణము లండగ నేలా?
    దివియలు ఘనముగ నా "భా
    రవి" కెందుకు, నీకు, తరుణి రాతిరి వేళన్?

    రిప్లయితొలగించండి
  59. కవివర! చేతిని క్యాండిలు
    రవి కెందుకు?..నీకు తరుణి రాతిరి వేళన్
    అవసరము టార్చి లైటులు
    చవిగొని నివ్వగ మగనికి చంపను నెలుకన్

    రిప్లయితొలగించండి