23, జనవరి 2011, ఆదివారం

సమస్యా పూరణం - 205 (సాఫ్టువేరు మగని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
సాఫ్టువేరు మగని జాడఁ గనరె!

35 కామెంట్‌లు:

  1. షిఫ్టు డ్యూటి యనుచు సాఫ్టుగా జెప్పును
    సరస మాడు మంటె సైటు జూచు
    రేయి బవలు దిరుగు రేసుగుఱ్ఱమురీతి
    సాఫ్టు వేరు మగని జాడ గనిరె

    రిప్లయితొలగించండి
  2. పగలు రాత్రి లేక ప్రాజెక్టు పనులంటు
    మాట మంతి లేక మనసు గలిపి
    అయిపు లేక వెడలె అంకోపరినిబట్టి
    సాఫ్టువేరు మగని జాడఁ గనరె!

    రిప్లయితొలగించండి
  3. డబ్బు డబ్బటంచు డాలర్ల కోసమై,
    ఇల్లు కనడు ఇంటి ఇంతి కనడు.
    సైటు సైటు వెదకి సైటు వచ్చెను నాకు
    సాఫ్టు వేరు మగని జాడ గనరె!

    రిప్లయితొలగించండి
  4. పగలురేయిఁ దనకు పనియొక్క ధ్యాసయే
    తిండితిప్పలునవి కొండకెక్కె
    ఆదివారమైన ఆఫీసు విడువని
    సాఫ్టువేరు మగని జాడఁ గనరె!

    రిప్లయితొలగించండి
  5. నా పూరణలో గణ దోషం దొర్లినట్టు గమనించి ఈ విధంగా సవరించాను

    షిఫ్టు వేళ లనుచు సాఫ్టుగా జెప్పును
    సరస మాడు మనగ సైటు జూచు
    రేయి బవలు పరుగె రేసుగుఱ్ఱమురీతి
    సాఫ్టు వేరు మగని జాడ గనిరె

    పోస్ట్ చేసిన దానిని బ్లాగు నుండి ఎలా తొలగించ వచ్చోసూచించ గలరు

    రిప్లయితొలగించండి
  6. ఆర్కుటందు తప్ప అసలు కంపడడయ్యె,
    మెయిలు లందు మాట హొయలు గురియు,
    లాలన గురిపించు లాపుటాపున",మైక్రొ
    సాఫ్టు వేరు"మగని జాడ గనరె!

    రిప్లయితొలగించండి
  7. మంచి వరుడు వలెను మా ముద్దు బిడ్డకు
    స్టేట్సు నందు జాబు! సేలరీయొ
    లక్ష డాల రులగు! లక్షణమౌ సంస్థ!
    సాఫ్టువేరు! మగని జాడఁ గనరె!

    బ్రైడు గ్రూము వలయు బ్రైటగు బేబీకి
    'సాఫ్టు వేరు' డైన చాలు తనకు!
    నేటి తరుణులట్లు నెఱజాణ గాదులే,
    సాఫ్టు! వేరు! మగని జాడఁ గనరె!

    రిప్లయితొలగించండి
  8. మహాశయులారా ! తెలుగు లిపిలో వ్రాసుకో గలుగు తున్నాము. ఇంకా సులభ మైన పద్ధతులొస్తాయి. మన లిపిని యిక్కడ అమెరికాలో చూపిస్తే అంతా చాలా అందమైన లిపి అంటారు. మాట్లాడుతే అర్ధము కాకపోయినా వినడానికి బాగుంటుందంటారు. తెలుగు మనము గర్వించ వలసిన భాష. పదజాలముంది. ఎంత వంట బడితే అంత అంటుకొంటుంది.

    రిప్లయితొలగించండి
  9. మూర్తిగారి మాట నాకు నచ్చింది. ఇలా రాసుకునే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం.

    రిప్లయితొలగించండి
  10. డా.ఆచర్య ఫణీంద్ర గారి నిన్నటి పూరణ చాలా అందంగా ఉంది. మా మధ్యకు వచ్చి మాతో కలిసి పాల్గొన్నందులకు మీకు కృతజ్ఞతలు. సనత్ గారూ మిమ్మలను యిక్కడ కలుసుకోవడము ఆనంద దాయకము.

    అఫ్సర్ గారూ మీ బోటి కవులకు ఆటవెలదులు,తేటగీతులు కందాలు కష్టము కాదు. ఇవి ఒక పంథా. సరదాగా కొన్ని పద్యాలు యిక్కడ వ్రాయమని నా మనవి.

    రిప్లయితొలగించండి
  11. మిత్రులారా

    అ,క,గ,జ్ఞ, చ,జ,ఞ్,ట,డ,,త,ద,న,ప,బ,మ, య,ర,ల,వ,శ,స,ష,హ,ళ,

    పైన ఇరవై నాలుగు అక్షరాలు తీసుకొని వాటికి గుణింతాలు కలిపితే తెలుగు భాషలో అక్షరాల సంఖ్య తగ్గించుకోవచ్చును.

    అ కి కూడా గుణింతము కలిపి ఇ,ఈ,ఉ, అలాగే మిగిలిన అచ్చులను మినహాయించ వచ్చు,లిపిలో.

    క,గ,చ,జ,ట,త, లకు ఢ,ధ ల వలె క్రింద వత్తు గాని, చుక్క గాని తగిలించి వత్తులు పలక వచ్చు. అలాగే న కు వత్తు తగిలిస్తే( ప్రక్కగా) ణ గ పలుక వచ్చు.

    అలాగే స, శ, ష లను ఒకటి ,లేక రెండు అక్షరాలతో మార్చ వచ్చు.

    శ్రీ తిరుమల కృష్ణ దేశికాచార్యులు గారు, మఱి యెందరో మహానుభావులు తెలుగు లిపిని సాఫ్ట్ వేర్ లో తెచ్చారు. శ్రీ దేశికాచార్యుల వంటి భాషా జ్ఞానులు సాఫ్ట్ వేరు విజ్ఞానులకు సాధ్యము యిలాంటి ప్రక్రియలు. ప్రభుత్వము భాషాభిమానులు ధన సహాయము చెయ్యాలేమో.

    రిప్లయితొలగించండి
  12. బగ్గు వెతుకు కాని - బుగ్గను కొఱకడు
    కోడు వ్రాయుఁ గాని - కూడ రాడు
    మౌజు పట్టుఁ గాని - మోజుఁ జూపగ రాడు
    సాఫ్టువేరు మగని జాడఁ గనరె!

    రిప్లయితొలగించండి
  13. సకల జగతి యందు సౌభాగ్య వంతమౌ
    దేశ భాష లందు తెలుగు లెస్స !
    ఇట్టి భాష ఘనత నెక్కింప జంత్రమ్ము
    సాఫ్టువేరు మగని జాఁడ గనరె !!

    ( జంత్రము = యంత్రము )

    రిప్లయితొలగించండి
  14. మిత్రుల పూరణలు బాగున్నాయి.

    దూరపు కొండలు నునుపు !దిగితే గాని లోతు తెలీదు !
    ఆహా మంచి సామెతలు!

    తరుణ వయసు లోన ధనము హెచ్చుగ నిచ్చి
    వెస నొసగుదు రంట వెదకి జాబు
    పిల్లి మార్పు లంట బెంగుళూరు చనగ
    సాఫ్టువేరు వేరు మగని జాడఁ గనరె !

    రిప్లయితొలగించండి
  15. అందరికీ వందనములు.
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి.
    01)
    _______________________________________

    నన్ను మరచె నేడు - నాగరా జతడేమొ
    బావ యగును నాకు - భాగ్య మతడె !
    చూచి మూడు నాళ్ళు - చూడ చక్కని వాడు !
    సాఫ్టు వేరు మగని - జాడ గనరె !
    _______________________________________

    రిప్లయితొలగించండి
  16. ఆమె మృదుల, సరళ, అత్యంత సుకుమారి
    'సాఫ్టు వేరు'! మగని జాడ గనరె
    'హార్డువేరు'! అతడు అత్యంత కఠినుడు,
    బ్రహ్మ కిట్టి కూర్పు భావ్య మాయె!

    రిప్లయితొలగించండి
  17. నరసింహ మూర్తిగారూ! ధన్యవాదాలు.
    మీ పద్యం సమయోచితంగా వన్నెలీనుతోంది.

    రిప్లయితొలగించండి
  18. 02)
    _____________________________________
    చిన్న నాటి నుండి - చెలిమి చేసిన వాడు !
    తోట బావి కాడ - తోడునీడ !
    నిముస మైనా విడచి - నిలువ జాలనివాడు !
    సాఫ్టు వేరు మగని - జాడ గనరె !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  19. 03)
    ______________________________________

    కోతి బొమ్మ జూప - కుదురుగా నుండడు
    కర్ర పట్టి నన్ను - కసరు కొనును !
    ఎందు బోయి నాడొ - ఎరుకలే కున్నాది !
    సాఫ్టు వేరు మగని - జాడ గనరె !
    _______________________________________

    రిప్లయితొలగించండి
  20. 04)
    ______________________________________

    గుడిని ఘంట మ్రోగ - గురుతు వచ్చును వాడు
    గర్వ మసలు లేని - ఘనుడు యతడు !
    కాల మయ్యొ కదిలె - క్షణ మొక్క యుగముగ !
    సాఫ్టు వేరు మగని - జాడ గనరె !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  21. 05)
    ______________________________________

    ఏడ నుండె బావ - ఎదురు చూపులు జూచి !
    కళ్ళు కాయ గాచె - కాన రయ్య !
    మరువ కండి స్వామి - మల్లి నా పేరండి !
    సాఫ్టు వేరు మగని - జాడ గనరె !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  22. 06)
    ______________________________________

    గుర్తు వస్తె చాలు - గుండె నీరౌతాది !
    బావ లేక నేను - బ్రతుక జాల !
    పట్టు కొచ్చిరేని - భాగ్యంబు మీకౌను !
    సాఫ్టు వేరు మగని - జాడ గనరె !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  23. 07)
    ______________________________________

    మరచి పోద మంటె - మరువ లేకున్నాను !
    నిద్ర నైన గాని - నిజము నైన !
    మండి పోతు యుండె - మల్లి గుండెలు నేడు !
    సాఫ్టు వేరు మగని - జాడ గనరె !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  24. 08)
    ______________________________________

    పట్న మెల్లి నాడు - పట్టు బట్టలు తేను !
    భయము కలుగు చుండు - బాధ మెండు !
    బావ ఎక్క డున్న - భద్రము గానుండు !
    సాఫ్టు వేరు మగని - జాడ గనరె !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  25. 09)
    ______________________________________

    పెళ్ళి పనులు మొదలు - వేణుగోపాలుని
    ఆలయము వెలుపలను - అరుగు మీద !
    బిక్క మొగము తోడ - బేజారు పడుతున్న !
    సాఫ్టు వేరు మగని - జాడ గనరె !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  26. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    గణదోషమని సవరించాల్సిందేమీ లేదు. "షిఫ్టు డ్యూటి" అన్నప్పుడు అది సంస్కృత సమాసం కాదు కనుక "ఫ్టు" గురువు కాదు.
    పోస్ట్ చేసిన దానిని తొలగించడం చాలా సులభం. మీ వ్యాఖ్య ప్రచురింపబడ్డ తర్వాత దాని క్రింద ఒక చెత్తబుట్ట బొమ్మ చిన్నగా కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే ఒక విండో వస్తుంది. అందులో "శాశ్వతంగా తొలగించాలా?" అని అడుగుతుంది. అక్కడ టిక్ చేసి "వ్యాఖ్యను తొలగించు" అనేదాన్ని క్లిక్ చేస్తే సరి. మీ వ్యాఖ్య తొలగింపబడుతుంది.

    రిప్లయితొలగించండి
  27. 10)
    ______________________________________

    బావ లేక పోతె - బ్రతికేమి ఫలము !
    నీరు ముట్ట లేను - నిదుర పోను !
    బావ రాక పోతె - బావిలో పడతాను !
    సాఫ్టు వేరు మగని - జాడ గనరె !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  28. హరి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    సోమార్క గారూ,
    "శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం.
    మీ రెండు పూరణలూ నిర్దోషంగా బాగున్నాయి. రెండవ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు. మీ నుండి ఇక క్రమం తప్పని పూరణలను ఆశిస్తున్నాను.

    రవి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    మీ రెండు పూరణలూ ఎప్పటి లాగే విలక్షణంగా ఉండి అలరించాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మన భాషకు లభించే ప్రశంసలకు సంతోషం. లిపికి సంబంధించిన చర్చలో తరువాత పాల్గొంటాను. మీరు పూరణలో చెప్పినట్లు తెలుగు సాఫ్టువేరులను సృష్టించి మనకెంతో మేలు చేసిన, చేస్తున్న "మగళ్ళు" చాలామంది ఉన్నారు. అందరూ అభినందనీయులు. వారికి ధన్యవాదాలు.
    మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.

    అఫ్సర్ గారూ,
    "శంకరాభరణం" మీకు స్వాగతం పలుకుతోంది.

    జిగురు సత్యనారాయణ గారూ,
    ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. వసంత్ కిశోర్ గారూ,
    మీ పూరణల వరదలో కొట్టుకు పోతున్నాను. చాలా ఆనందంగా ఉంది. మీ పది పూరణలూ బాగున్నాయి. ధన్యవాదాలు.
    రెండవ పూరణ మూడవ పాదంలో "నిముసమైన" అనడానికి "నిముసమైనా" అనడం టైపాటే కదా!
    నాల్గవ పూరణ "ఘనుఁడు + అతఁడు = ఘనుఁడతఁడు" అని ఉత్త్వసంధి నిత్యంగా వస్తుంది. యడాగమం రాదు. "ఘనుఁ డతండు" అంటే సరిపోతుంది.
    ఏడవ పూరణ మూడవ పాదంలో "మండిపోతు యుండె"కు బదులు "మండి పోవుచుండె" అంటే బాగుంటుంది.
    పదవ పూరణ మొదటి పాదంలో "బ్రతికేమి ఫలము" అన్నచోట గణదోషం ఉంది. "బ్రతికి ఫల మదేమి" అంటే సరి.
    మొత్తానికి మీ పూరణలన్నీ నండూరి వారి "ఎంకి-నాయుడు బావ"లను గుర్తుకు తెచ్చాయి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  31. శంకరార్యా !
    ధన్యవాదములు !
    మీకు నండూరి వారెలా కనుపించారోగాని

    నేను మల్లీశ్వరి ని తలుచుకుంటూ వ్రాసానది.

    నాగరాజు-మల్లి-పల్లె - పట్నమ్- తోట - బావి
    మొదలైనవన్నీ వాటంతటవే వచ్చి చేరాయి
    వీలైతే మరోసారి చూడండి

    రిప్లయితొలగించండి
  32. వసంత్ కిశోర్ గారూ,
    నిజమే సుమా! మంద బుద్ధిని. నాకెంతో ఇష్టమైన "మల్లీశ్వరి" ఎందుకు తట్టలేదో? వయోభారం ఆలోచనాశక్తిని, జ్ఞాపకశక్తిని తగ్గిస్తుందేమో? ఆ కోణంలో చూచినప్పుడు మీ పద్యాలు మరింత శోభిస్తున్నాయి. మిమ్మల్ని "హర్ట్" చేసి ఉంటే మన్నించండి.

    రిప్లయితొలగించండి