27, జనవరి 2011, గురువారం

సమస్యా పూరణం - 209 (కొడుకునకున్ వేనవేలు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కొడుకునకున్ వేనవేలు కూఁతున కొకటే!

28 కామెంట్‌లు:

  1. గోలి హనుమచ్ఛాస్త్రి

    పడి ఫీజులు కట్టెదమిక
    కొడుకునకున్ వేనవేలు,కూతునకొకటే
    బడి చాలును ఊరక చె
    ప్పెడు చదువను మాట నేడు వీడగవలెగా.

    రిప్లయితొలగించండి
  2. హనుమచ్ఛాస్త్రి గారూ,
    మంచి పూరణ పంపించారు. అభినందనలు.
    "బడి"కి బదులు "పడి" అని టైపయింది.

    రిప్లయితొలగించండి
  3. బుడిబుడి తడబడు నడకల
    కొడుకునకున్ వేనవేలు,కూతునకొకటే
    పడిగా లక్షల ముద్దుల
    నిడువరె తలిదండ్రులు తమ ఇరుపాపలకున్

    రిప్లయితొలగించండి
  4. పడుకొని నింగిని జూపుచు
    కొడుకేమో తారలడిగె కూతురు చంద్రున్
    నడుగగ ఇచ్చెద నంటిని
    కొడుకునకున్ వేనవేలు కూఁతున కొకటే!

    రిప్లయితొలగించండి
  5. సనత్ శ్రీపతి గారి పూరణ బహు చక్కగా ఉన్నది.
    అందరూ ఎవరికి వారే చదువరులని సంతసింపఁజేస్తున్నారు.
    అందులో ఒకరి పద్యం అబ్బురపరుస్తుంది భావప్రకటనలో.
    ఇలా రాయటం అభ్యంతరకరమైతే మీరు నా వ్యాఖ్యను తొలగించవచ్చు.

    రిప్లయితొలగించండి
  6. అడుగగ ఫీజుల కిచ్చితి
    కొడుకునకున్ వేనవేలు; కూఁతున కొకటే
    బిడియము, అడగదు ఏమీ;
    వెడలెద నేనే బడికిని వివరము లడుగన్.

    రిప్లయితొలగించండి
  7. శంకరయ్యగారూ.. కష్టపడి,ఇష్టపడి,పడి పడీ ఫీజులు కడతారనే అర్థంలొ 'పడి ' అని వాడాను.మీసవరణ బాగుంది.ధన్యవాదములు.

    గోలి.హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  8. పడిఫీజులు కట్టెదమిక బదులుగా పడిపడి ఫీజులు కట్టెద అని మార్చితే సరిపోతుందనుకుంటాను
    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  9. మందాకిని గారు, మీ పేరులానే మీ వ్యాఖ్య నిర్మలం. సనత్ గారి పూరణ బహుచక్కగా ఉంది. సందేహం లేదు. మీ వ్యాఖ్యలో తొలగించే దోషమేదీ లేదు.

    రిప్లయితొలగించండి
  10. ఒడిదుడుకులు, చెడునడతల
    కొడుకునకున్ వేనవేలు ! కూతున కొకటే
    ధృడ సంకల్పము కనబడె
    చెడుతో తలబడు , యతండచేతను డయ్యెన్!

    రిప్లయితొలగించండి
  11. రవి గారూ,
    కొడుకు కంటే బడ్డకే ఎక్కువ ఇస్తూ చేసిన పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    సనత్ శ్రీపతి గారూ,
    నిర్మొహమాటంగా చెప్తున్నాను. మీ పూరణ ఉత్తమంగా ఉంది. ఎంత చక్కని భావన? చాలా బాగుంది. అభినందనలు.

    మందాకిని గారూ,
    మీరు నిరభ్యంతరంగా మీ వ్యాఖ్యలను బ్లాగులో ప్రకటించ వచ్చు. గుణదోష విచారణ చేసే హక్కు నా బ్లాగులో అందరికీ ఉంది. చర్చలకూ అవకాశం ఉంది.

    హరి గారూ,
    అత్యుత్తమమైన పూరణ. "కూతున కొకటే బిడియము". ఎంత బాగుంది మీ కల్పన! అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ కూడ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    (తలబడు + అతండు) అన్నప్పుడు యడాగమం రాదు. "తలబడ నతండు" అంటే సరి. లేక "చెడుతో తలబడుట; యత డచేతను డయ్యెన్." అన్నా సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  12. నిండు మనసుతో అభినందించిన మందాకినిగారికీ, ఆదరించిన రవిగారికీ, ప్రోత్సహించిన గురువుగారికీ నమస్సుమాంజలి.

    - సనత్ కుమార్ శ్రీపతి

    రిప్లయితొలగించండి
  13. వడివడిగనూడెఁ కురులవి
    కొడుకునకు విడువక తండ్రి క్రోమోజోముల్,
    విడిచె సుత వంశ నామము,
    కొడుకునకున్ వేనవేలు కూఁతున కొకటే!

    వివరణ: తండ్రికి బట్ట తల ఉంటే కొడుకుకు ఖచ్చితముగా వస్తుంది, కాని కూతురికి రాదు. కాబట్టి జీన్సు వలన కొడుకుకు వేలకు వేలు తల వెట్రుకలు ఊడిపోతే, కూతురికి మాత్రము ఒక్క ఇంటి పేరే మారుతుంది.

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వందనములు
    అందరి పూరణలూ
    అందముగా
    అలరించు చున్నవి.
    ______________________________________

    ఎన్ని కష్టాలైనా పడి
    ఎంతో ఇష్టంతో ఎన్ని వేలైనా
    కొడుకుల కోసం బడి పన్నులు(ఫీజులు)
    కట్టే తల్లి దండ్రులు
    కూతురి కోసం కడతారా?
    ఏమంటారు సాములూ !

    01)
    ______________________________________

    ఇడుమలు బడి తలి దండ్రులు
    కడు ప్రియమున బడి పన్నులు - కడుదురు ! నటులే
    ఇడుదురె ? కూతురు కొరకై !
    కొడుకునకున్ వేనవేలు ! - కూఁతున కొకటే!
    ______________________________________

    రిప్లయితొలగించండి
  15. కడతేర్చును కడవరకని
    కొడుకునకున్ వేనవేలు కూఁతున కంటెన్ !
    కోడలిగ పరుల పంచకు
    వేడుకల బరువు గుండెతొ వీడ్కోలిడగన్ !

    రిప్లయితొలగించండి
  16. కూతుర్ని అశ్రద్ధ చేసి మరీ
    వేలకు వేలు తగలేసి
    పెద్ద పెద్ద చదువులు చదివిస్తే
    ఆ కోడుకులు విదేశాల్లో ఉంటూ
    తల్లి దండ్రులకు విషాదం మిగులుస్తున్నారు
    కడ చూపుకు కూడా రాకుండా!

    02)
    ______________________________________

    కడు దూరములోనుండుట
    చెడ చదివిన కొడుకులెల్ల - చిత్రం బయ్యో
    కడ చూపుకు రానోచరు
    కొడుకునకున్ వేన వేలు ?- కూతున కొకటే ?
    _______________________________________

    రిప్లయితొలగించండి
  17. కాష్ఠంలో కాలేటపుడు ఎవరూ నీ వెంట రారుగా !
    అందర్నీ వదలి వెళ్ళ వలసిందే గదా !
    కొడుకులనీ కూతుళ్ళనీ ఎందుకు ఈ తేడాలు???

    03)
    _______________________________________

    ఎడబాయుట తప్పదులే
    కొడుకుల గూతుళ్ళ సతుల !- కువలయమందున్
    కడ కగ్నిని కాలు నపుడు
    కొడుకునకున్ వేన వేలు ?- కూతున కొకటే ?
    ________________________________________

    రిప్లయితొలగించండి
  18. వసంత్ కిషోర్ గారు, కువలయమందున్ - కువలయము అంటే భువి/భూమి అన్న అర్థం ఉందాండి? నాకు తెలిసిన కువలయం - నీలికలువ.

    రిప్లయితొలగించండి
  19. రాజేశ్వరి గారూ,

    (1) పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి
    కోడలు, వేడుక పదాలు సరి కాదు.

    (2) సమస్యలో పదాలను మార్చితే అది పద్యం ఔతుంది కానీ పూరణ కాజాలదు. అసలు కిటుకు ఆ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు అన్నదాని పైనే. కనుక మరల ప్రయత్నించ గలరు.

    కిశోర్ గారూ,
    మీ మొదటి పూరణ బాగున్నది.

    2,3 పద్యాల ఇతివృత్తాలు బానే ఉన్నా, పూరణ సమంజసంగా లేదని నాకనిపిస్తోంది. అన్యధా భావించవద్దు. కొడుకునకున్ వేనవేలు, కూతురికి ఒకటే అన్నవి అక్కడ కిట్టినట్టు అనిపించటం లేదు.

    రిప్లయితొలగించండి
  20. నన్ను ప్రభావితం చేసిన వ్యక్త్యులలో శంకరయ్య గారొకరు. వారికి కృతజ్ఞతా పూర్వక నమస్కృతి నా బ్లాగు టపా లో వీక్షించగలరు. మిగిలిన సాహితీ సోదరబృందమునకుకూడా ఈ లంకెను తెలియ పరచగలరు

    http://raata-geeta.blogspot.com/

    - శ్రీపతి సనత్ కుమార్

    రిప్లయితొలగించండి
  21. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ మూడు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణ రెండవ పాదంలో "పన్నులు" అని జగణం వేసారు. అక్కడ తప్పనిసరిగా నలం కాని, జగణం కాని ఉండాలి కదా! "రుసుములు" అంటే సరి!

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    "కూతున కొకటే" అనేది "కూతున కంటెన్" అయింది.
    సనత్ శ్రీపతి గారి కంద పద్య లక్షణ సంబంధిత వ్యాఖ్య చూడండి.

    రవి గారూ,
    కువలయము అంటే భూమండలము, కలువ అనే అర్థాలున్నాయి. కుజము = భూమినుండి పుట్టినది (చెట్టు), కుధరము = భూమిని ధరించేది (పర్వతం) ఇలా ....

    రిప్లయితొలగించండి
  22. అడిగితి నాడు నెమల్లిన్:
    "కొడుకుకు కనులెన్ని యమ్మ? కూతురు కెన్నౌ?"
    పడిపడి నవ్వుచు నుడివెను:
    "కొడుకునకున్ వేనవేలు కూఁతున కొకటే!"

    రిప్లయితొలగించండి
  23. శాస్త్రి గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. భడవర! పెండ్లెప్పుడనగ
    పడతియె కాంగ్రెసు తనకని పల్కగ బుధుడే...
    కడకిక చెలువురు సోనియ
    కొడుకునకున్ వేనవేలు కూఁతున కొకటే!

    రిప్లయితొలగించండి