15, జనవరి 2011, శనివారం

ప్రహేళిక - 40

`శంకరాభరణం` బ్లాగు మిత్రులకు, అభిమానులకు, ఆంధ్ర భాషాభిమానులకు
మకర సంక్రమణ పర్వదిన శుభాకాంక్షలు.
ఈ పండుగ ఏది?
తే.గీ.
సిరుల తల్లి, మండూకము, శృంగజంబు,
కామదూతి, శౌర్యము, క్రియాకారము లవి
త్ర్యక్షర పదంబు, లందు మధ్యాక్షరములఁ
జూడఁ దెలిసెడి పండుగ జాడఁ గనుఁడు.

స్లిప్పులు -
సిరుల తల్లి - లక్ష్మికి గల పువ్వు వంటి పేరు
శృంగజము - బాణం
కామదూతి - పాతతరం సినీనటి పేరు. మంచి మనసులు చిత్రంలో అక్కినేని చెల్లెలు.
శౌర్యము - విక్రమం, అంతిమం పదాలలో మొదటి రెండక్షరాల కలయిక
క్రియాకారము - శపథం
ఇప్పుడు చెప్పండి ఆ పండుగ ఏదో?
షరా మామూలే -
దయచేసి సమాధానాలను క్రింది చిరునామాకు మెయిల్ చెయ్యండి.
shankarkandi@gmail.com

5 కామెంట్‌లు:

  1. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మరీ ఇంత స్పీడా? అభినందనలు.
    మీరు 100% సరిగా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  2. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
    అభినందనలు. మీరు 100% కరెక్ట్!

    మైథిలీ రాం గారూ,
    మీరు 80% కరెక్ట్. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    సరియైన సమాధానం చెప్పారు. అభినందనలు.

    "శిరాకదంబం" రావు గారూ,
    ధన్యవాదాలు. మీకు కూడ సంక్రాంతి శుభకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  5. గురువుగారూ ప్రహేళిక-౩౮ మా జవాబులపై మీరెందుకు వ్యాఖ్యానించ లేదు? ఎదురు చూస్తున్నాము.

    రిప్లయితొలగించండి