6, జనవరి 2011, గురువారం

కృతజ్ఞతా పూర్వక నమస్సుమాంజలి

మిత్రులకు, శ్రేయోభిలాషులకు,
కృతజ్ఞతా పూర్వక నమస్సుమాంజలి.
నా విన్నపాన్ని మన్నించి, నా సమస్యను తీర్చి, బ్లాగు నిరాటంకంగా కొనసాగడానికి తమ తమ పరిధులలో ఆర్థిక సహాయం చేసిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు "శంకరాభరణం" సినిమాలో శంకర శాస్త్రి చెప్పినట్లు "శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను".
ఈ సత్కార్యానికి పూనుకొని, బ్లాగు మిత్రులను ప్రోత్సహించి, కార్యభారాన్ని తమ భుజాల కెత్తుకొని నిర్వహించిన హరి గారికి, వలబోజు జ్యోతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
స్పందించి, ఆర్థిక సహకారాన్ని అందించిన సహృదయులు ............
హరి గారు
వలబోజు జ్యోతి గారు
మంద పీతాంబర్ గారు
మిస్సన్న గారు
వసంత్ కిశోర్ గారు
గన్నవరపు నరసింహ మూర్తి గారు
నచికేత్ గారు
మంత్రి ప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు
జిగురు సత్యనారాయణ గారు
మలక్ పేట్ రౌడీ గారు
మైత్రేయి గారు
డా. ఆచార్య ఫణీంద్ర గారు
డా. విష్ణు నందన్ గారు
సనత్ శ్రీపతి గారు
ఊకదంపుడు గారు
రవి గారు
భరద్వాజ్ గారు
నేదునూరి రాజేశ్వరి గారు
పేరు ప్రకటించడానికి ఇష్టపడని అజ్ఞాత దాత పంపింది 15000 రూ.లు.
మొత్తం మీద ఈ "మిష"తో నా అకౌంట్ లోకి చేరిన డబ్బు 32280 రూ.లు.
నా మినిమం అవసరానికి మాగ్జిమం రెట్టింపు!
దేనికొరకు వచ్చిన డబ్బును దానికొరకే వినియోగించాలి కనుక ఈరోజే అన్ని హంగులతో, మంచి కాన్ ఫిగరేషన్ తో సిస్టం (డెస్క్ టాప్) తీసికొని, మిగిలిన డబ్బుతో జ్యోతి గారి సూచన ప్రకారం ప్రింటర్, స్కానర్ తీసుకుంటున్నాను. అప్పటికీ మిగిలితే కొన్ని ఛందో వ్యాకరణ గ్రంథాలు తీసుకొంటాను.
రేపటి నుండి నా బ్లాగు సక్రమంగా కొనసాగుతుంది.
ధన్యవాదాలతో ....
మీ
కంది శంకరయ్య.

6 కామెంట్‌లు:

  1. శంకరార్యా !
    సంతోషం.
    ఇక మన శంకరాభరణం( blog)
    నిరాఘాటంగా
    నిరంతరం
    నిరుపమానంగా
    కొనసాగాలని
    నా కోరిక.

    అందరికీ ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  2. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంగురువారం, జనవరి 06, 2011 5:02:00 PM

    మా ఉత్సాహం ద్విగుణీకృతమయ్యింది
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  3. గురువు గారికి శిష్యులంతా కలిసి ఓ నల్ల బల్లనౌ సుద్దముక్కలను కొనిచ్చారు, చదువుచెప్పమని. ఈ విషయంలో నాయకత్వము వహించి ముందుకొచ్చిన హరి గారికి కార్య నిర్వహణ చేసిన జ్యోతి గారికి అభినందనలు. డా.ఆచార్య ఫణీంద్రలు,సనత్ గారికి, డా.విష్ణు నందన్ మిగిలిన అతిధులకు దాతలకు కృత్జతలు.
    గురువుగారూ ఇందులో మేము మీకు చేసినది ఏమీ లేదు. మాకు మేమే చేసుకొన్నాము.

    రిప్లయితొలగించండి