30, నవంబర్ 2017, గురువారం

సమస్య - 2533 (గౌరికిఁ గేశవుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్"
(లేదా...)
"గౌరికిఁ గేశవుండు పతి గావలె శంకరుఁ డన్న గావలెన్"
(శతావధాని పోకూరి కాశీపతి పూరించిన సమస్య)

97 కామెంట్‌లు:

  1. నారికి నారికి నడుమ ము
    రారియె నెపుడున్ భళిభళి రమణీయముగా...
    వారికి వీరికి సిరికియు
    గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్!

    భర్త = విశ్వంభరుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      పద్యం బాగున్నది. కాని పూరణలోని భావం బోధపడలేదు.
      "మురారియె యెపుడు న్... సిరికిని.." అనండి.

      తొలగించండి
    2. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః|
      వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ||

      గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్|
      ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్|

      తొలగించండి
    3. "నారీ నారీ నడుమ మురారీ..."
      నా చిన్నప్పటి పాట సార్..

      తొలగించండి
  2. 1)
    మారాంతకుఁ డెవరికిఁ బతి?
    శ్రీరమణికి మగఁ డెవండు? సీతాసతికిన్
    శ్రీరాముం డేమి యగును?
    గౌరికిఁ; గేశవుఁడు; భర్త గావలె నెన్నన్.
    2)
    మారాంతకుండు పతి గద
    గౌరికిఁ; గేశవుఁడు భర్త గావలె నెన్నన్
    శ్రీరమణికి; నా నలువయె
    భారతికిన్ మగఁడు; రతికి స్వామి మదనుఁడే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకరయ్య గారు! మీ రెండు క్రమాలంకార పూరణలు చాల చక్కగా వచ్చనవి.అభినందనలు !!!!!!!!
      👍👍👍👍👍👍👌👌👌👌👌👌

      తొలగించండి
    2. మాస్టరు..చక్కని పూరణ ద్వయం అందించారు. బాగున్నవి.

      తొలగించండి
    3. అమ్మణ్ణికి శంకరుండగణిత వరుండే!!
      నమస్సులతో!!

      తొలగించండి
  3. ఏరికి పెనిమిటి శివుడౌ?
    నారాధింప దగినట్టి యమలాబ్ధిజయౌ
    నారీమణి యిందిరకున్;
    గౌరికి ; గేశవుడు భర్త గావలె నెన్నన్.

    రిప్లయితొలగించండి
  4. వారాశిని గ్రుంగిన ఘన
    భూరాశిని పైకినెత్తి బ్రోవగదానే
    వారాహరూపు దాల్చగ
    గౌరికి గేశవుడు భర్తగావలె నెన్నన్

    గౌరి భూమి

    గారాబుపట్టి జలధికి
    పేరున శ్రీలనుగలిగిన పెన్నిధి జనులన్
    మారామున బ్రోచెడు వర
    గౌరికి గేశవుడు భర్తగావలె నెన్నన్

    గౌరి తెల్లనిది లక్ష్మీదేవి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      'గౌరీ' శబ్దానికి ఉన్న అర్థాంతరాలతో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  5. దారుణ దైత్యుడు భూమిని
    వారిధిఁగలుప, వనమాలి వాత్సల్యమునన్
    వారించె వరాహంబై
    గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్న

    గౌరి = భూమి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దారుణ దైత్యుడు భూమిని
      వారిధిఁగలుప, వనమాలి వాత్సల్యమునన్
      వారించె వరాహంబై
      గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్

      గౌరి = భూమి

      తొలగించండి
    2. సత్యనారాయణ గారూ,
      గౌరి శబ్దానికి ఉన్న అర్థాంతరంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. ధీరకు,నుజ్జ్వలసుగుణా
    ధారకు,గోలాసురేంద్రదమనకు,విమల
    క్షీరసముద్రజకు,యశో
    గౌరికి గేశవుడు భర్త గావలె నెన్నన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      యశోగౌరితో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  7. పౌరుషము పొంగి పొరలగ
    ఘోరమగు తపము జేసి కోరగ వరమున్
    నారా యణుండ తలచగ
    గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్

    "నువ్వు నల్లగా ఉన్నావు " అని శివుడు అన్నందుకు రోషముతో పార్వతి అగ్నిలో దూకి తపము జేసిన సందర్భము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నారాయణునే తలచిన గౌరికి..." అంటే అన్వయం చక్కగా కుదురుతుంది.

      తొలగించండి
    2. పౌరుషము పొంగి పొరలగ
      ఘోరమగు తపము జేసి కోరగ వరమున్
      నారా యణునే తలచిన
      గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్

      తొలగించండి
  8. మారె పదంబులించుక ప్రమాదముఁగూర్చుచు త్రాగు మత్తు లో-
    గౌరికి కేశవుండు పతిఁగావలె శంకరుడన్నఁగావలెన్.
    జారిన మత్తునన్ పలికె జాగృత మానసుడైనవాడహో
    గౌరికి భర్త శంకరుడు,కావలె కేశవుడన్న మిన్నయై

    రిప్లయితొలగించండి


  9. భైరవుడు పెనిమిటి గదా
    గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్
    హీరమునకున్, జిలేబీ,
    సారసగర్భుడు మగండు శారద కమ్మా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. భైరవుడు పెనిమిటి గదా
      గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్
      హీరకు గదా, జిలేబీ,
      సారసగర్భుడు మగండు శారద కమ్మా!

      జిలేబి

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  10. శ్రీరమకున్ మగండు, సయి శ్రీకరమై, యనడన్న, తీరుగన్
    గౌరికిఁ, గేశవుండు, పతి గావలె శంకరుఁ డన్న! గావలెన్
    సారస గర్భుడున్ ధవుడు శారదకున్ వినుడన్న! గావలెన్
    మారుడు యింటియాతడు సుమా‌ రతికిన్!భళి కైపదంబయెన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      పద్యం బాగున్నది. మొదటి రెండు పాదాలలో అన్వయం బోధపడలేదు.

      తొలగించండి
  11. మైలవరపు వారి పూరణలు

    నేరిచి యిట్లనెఁ జెల్లెలు
    గౌరికిఁ గేశవుడు " భర్త గావలె నెన్నన్
    గౌరీ ! నీకు మహేశుడె .,
    తారకవధ జేయగలుగు తనయుడు కలుగన్ !! "

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


    తారక ఘోర రాక్షసవధన్ మదినెంచి వచించెనేమొ ? యీ
    గౌరికిఁ గేశవుండు *పతి గావలె శంకరుఁ* డన్న గావలెన్ !
    నారదుడైన మౌనులయినన్ సురలైనను ధిక్కరింతురే ?
    సారసనాభు వాక్యమన శాసనమప్రతిహన్యమానమౌ !!

    ( అన్నన్... అనినచో )

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా
    కలిమియు లేమియు గనగన్
    సరి జంటయె సాగరథము సామాన్యులకున్
    జర సోంచో కవివర్యా
    గౌరికి శివుడు భర్త గావలె నెన్నన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జర సోంచో" అన్నచోట "పరికింపుము" అనవచ్చు కదా!

      తొలగించండి
  13. నారాయణు డను నాతడు
    చేరంగను బిలిచి పలికె చెల్లెలి తోడన్
    మీరకు నీ మాటను మా
    గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      లౌకికాంశంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. డా.పిట్టా
    గౌరమ్మను బెట్టిరి యతి
    గౌరవ ముప్పొంగ తెలుగు గడపన యువతుల్
    వరుడెవరన తడబడిరా
    "గౌరికి శివుడు భర్త గావలె నెన్నన్"

    రిప్లయితొలగించండి
  15. భైరవుడే ప్రాణవిభుడు
    గౌరికిఁ, గేశవుఁడు భర్త గావలె నెన్నన్
    మారునితల్లి కమలకున్
    సారసగర్భు ప్రియ పత్ని శారద సుమ్మూ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సుమ్మా/ సుమ్మీ' అనండి. 'సుమ్మూ' అనడం సాధువు కాదు.

      తొలగించండి
  16. డా.పిట్టా
    శౌరికి లక్ష్మినిన్ గలిపి చక్కని జంటగ నెన్న గాథలన్
    నెరి నిటు మల్పి జూతమని నేరుపుతో కథ నల్లె నొక్క డ
    త్తరి నది హారి పోర్టరు1కథా యనిపించెను కాళ్ళు లేక2 నా
    "గౌరికి కేశవుండు పతి గావలె శంకరుడన్న గావలెన్"!
    (1.విచిత్రంగా వెలుగు లోనికి వచ్చిన ఆంగ్ల కథా రచయిత.2.కథకు కాళ్ళుండవు.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      ఒకటవ, చివరి పాదాలు ఉత్పలమాలగా రెండవ, మూడవ పాదాలు చంపకమాలగా వ్రాశారు. వెలుగులోనికి వచ్చిన ఆంగ్ల రచయిత్రి జె.కె. రోలింగ్. ఆమె సృష్టించిన పాత్ర హారీ పోటర్.

      తొలగించండి
  17. శతావధాని పోకూరి కాశీపతి పూరణ....

    వారణవైరి యే సతికి వాహనమౌ? సిరికిన్ విభుం డెవం?
    డారయ వాణికిన్ జలరుహాసనుఁ డేమియు గావలెన్? ఫణిన్
    హారముగా నెవండు గొనె? నా హలి కృష్ణున కేమి కావలెన్?
    గౌరికిఁ; గేశవుండు; పతి గావలె; శంకరుఁ; డన్న గావలెన్.

    ('అవధాన విద్యాసర్వస్వము' గ్రంథం నుండి)

    రిప్లయితొలగించండి
  18. క్రమాలం కా ర oలో
    ఆ ర య హరుడె వరి కి పతి ?
    క్షీరాభ్ది తనయ ను సతి గ చే కొని రెవరో ?
    మారు డు రతి కేమగు నో ?
    గౌరి కి 'కేశవు డు 'భర్త గా వలె నె న్న న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. హీరోకి బట్టతల, మన
    దారిక చిన్నది, పురుష వదనమెపుడు శ్రుం
    గారమిడు జుట్టు యుండిన,
    గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్

    గౌరి = సమర్త ఆడని స్త్రీ , కేశవుడు = అందమైన జుట్ట గలవాడు.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జుట్టు+ఉండిన = జుట్టుండిన' అవుతుంది. యడాగమం రాదు. "జుట్టు గలిగిన" అనండి.

      తొలగించండి
  20. గౌరియన భూమి యర్థము
    వేరొకటిగ గలదు జూడ వివరింపంగా
    నీరీతిగ యనుకొనుమిక
    గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      అర్థంతరాన్ని ఆశ్రయించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. వారుడు పతిగద సతతము
    గౌరికి, గేశవుడు భర్త గావలెనెన్నన్
    నారాయణికి,తెలియదా
    భారతి వల్లభుడెపుడును బ్రహ్మయే జూడన్

    రిప్లయితొలగించండి


  22. సరిచేసినది సరియో ?


    శ్రీరమకున్ మగండతడు, శ్రీయుత యగ్రజుడాయె తీరుగన్
    గౌరికిఁ, గేశవుండు; పతి గావలె శంకరుఁ డన్న! గావలెన్
    సారస గర్భుడున్ ధవుడు శారదకున్ వినుడన్న! గావలెన్
    మారుడు యింటియాతడు సుమా‌ రతికిన్!భళి కైపదంబయెన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. భైరవుడే పెనిమిటియౌ
    గౌరికి ; గేశవుడు భర్త గావలె నెన్నన్
    క్షీర సముద్రు తనయకున్;
    భారతి కెన్నగ నలువయె పతియౌను గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  24. డా ఎన్.వి.ఎన్.చారి 9866610429
    పోరడు వ్రాసెనీ విధిని బోర్డున మెల్లన సుద్దముక్కతో
    "గౌరికిఁ గేశవుండు పతి గావలె శంకరు డన్నగావలెన్"
    సారది(సార్+అది) మార్చగా కదలి సక్రమ రీతిని నేర్పె నేర్పునన్
    గౌరికి శంకరుండు పతి గౌరికి శ్రీహరి యన్న గావలెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చారి గారూ,
      చమత్కారంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బోర్డు, సారు' అన్న అన్యదేశ్యాలను ప్రయోగించారు. (సమస్యా పూరణలో అదేమంత తప్పు కాదు లెండి!)

      తొలగించండి
  25. భైరవుడే వధించి వెస భావజు నక్కసు, భర్తయయ్యె తా
    గౌరికిఁ, గేశవుండు పతి గావలె శంకరుఁ డన్న గావలెన్
    మారుని తల్లి పద్మినికి, మాటలబోటికి సృష్టికర్తయౌ
    సారసగర్భుడే విభుడు చక్కగఁ గాంచుము ముగ్గురయ్యలన్

    రిప్లయితొలగించండి
  26. తీరుగ వెండి కొండ సభతీర్చిన శంభుడు భర్తయౌను తా
    నారయనెల్లవారు ముదమందగ ముందటు దేవదానవుల్
    క్షీరపయోధి జిల్కగను చెన్నుగబుట్టిన లక్ష్మికిన్ గనన్
    గౌరికిఁ గేశవుండు పతి గావలె శంకరు డన్నగావలెన్"

    రిప్లయితొలగించండి
  27. హీరుండు జెప్పె నిటులన్
    గౌరికిఁ, గేశవుఁడు భర్త గావలె నెన్నన్
    క్షీరాబ్ధి సూన లక్ష్మికి
    ధారుణి పోషించఁ గలుఁగ ధరణీ పతియై

    రిప్లయితొలగించండి
  28. కోట రాజశేఖర్ గారి పూరణ

    సందర్భం :: పాలసముద్రంనుండి ఉద్భవించిన లక్ష్మి, మెరుపుతీగవలె విరాజిల్లుతూ, స్వచ్ఛభామినిగా, గౌరవర్ణం కలిగినదియై, ప్రకాశిస్తూ కనిపించగా, గౌరవర్ణంతో ఉన్న, ఆ గౌరిని (ఆ లక్ష్మిని) విష్ణువు వివాహ మాడినాడు. కాబట్టి వరుస కలిపి చూస్తే ఆ గౌరికి (ఆ లక్ష్మికి) కేశవుడు భర్త అవుతాడు. శంకరుడు అన్న అవుతాడు అని సమర్థించి చెప్పే సందర్భం.

    క్షీరసముద్రజాత, విలసిల్లు తటిల్లత, చంద్రకాంతులన్
    మీరెడి *కాంత*, స్వచ్ఛత నమేయగ వర్థిల గౌరవర్ణగా,
    *కోరి వరించె* *లక్ష్మి* ని *వికుంఠనివాసుడు గౌరవర్ణ* నా
    *గౌరికి కేశవుండు పతి గావలె, శంకరు డన్న గావలెన్.*
    {అమరము :: *పీతో గౌరో హరిద్రాభః* *గౌరోఽరుణే సితే పీతే* }

    (గౌరికి అంటే గౌరవర్ణంతో విరాజిల్లే లక్ష్మికి అని భావన)

    *కోట రాజశేఖర్ నెల్లూరు.*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోట రాజశేఖర్ గారూ,
      సమర్ధమూ, అద్భుతమూ అయిన పూరణ మీది. అభినందనలు.

      తొలగించండి
  29. ఆరయ నింపుగ వరుసగ
    నా రుద్రుఁడు శంకరుఁడు మహా దేవుఁ డటన్
    పారావా రాత్మజ కిఁక
    గౌరికిఁ, గేశవుఁడు భర్త గావలె నెన్నన్


    వారిజ సంభవుం డజుఁడు పన్నుగ జన్మ నొసంగె లక్ష్మికిం
    గూరిమి రుద్ర దేవునకు కొందఱు సెప్పఁగ వింటి నిద్ధరన్
    వారిధి ముద్దు బిడ్డకును బద్మకు లబ్ధ మహా దయా లస
    ద్గౌరికిఁ గేశవుండు పతి గావలె శంకరుఁ డన్న గావలెన్

    [లబ్ధ మహా దయా లస ద్గౌరి = పొండబడిన దయవలన వెలుగు చున్న గౌరి కలది.]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  30. ఆ రుద్రు౦ డెవరికి పతి?
    గౌరికి.కేశవుడు భర్త గావలె నెన్నన్
    క్షేరా౦బుధిజాత సిరికి
    దారిద్ర్య ము బాపి సంపదల నిడు నిధికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  31. నా “శ్రీమదాంధ్ర సుందర కాండ త్రిచత్వారింశ సర్గమున నేటి పద్యములలో నొకటి.

    లంకా నగరం బుండదు
    లంకేశుఁడు మీరు నింక లయ మౌదురు ని
    శ్శంకను నిక్ష్వాకు విభుని
    వంకన్ మీ కకట బద్ధ వైరము గలుగన్

    మూలము:
    నేయమస్తి పురీ లఙ్కా న యూయం న చ రావణః. 5.43.25৷৷
    యస్మాదిక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మనా.

    రిప్లయితొలగించండి
  32. ఊరూర న్నవధానిగ
    పేరొందగ తిరిగి తిరిగి పిచ్చి ముదరగా
    నూరికి చేరి కుకవి యనె
    గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్

    పరమేశ్వరుడే పతియయె
    గౌరికిఁ, గేశవుఁడు భర్త గావలె నెన్నన్
    గోరగ వరమొసగు సిరికి ,
    భారతికా సృష్టికర్త బ్రహ్మయె కాగా

    నిన్నటి సమస్యకు నా పూరణ

    జగడము నందున భీష్ముని
    కగుపించగ నా శిఖండి యస్త్రము వీడెన్
    తగదిట దున్ముట యనె హరి
    పగతుర పాదములఁ బట్టవలె వీరులకున్

    రిప్లయితొలగించండి
  33. తారక,రామునికొడుకే
    గౌరికి కేశవుడు భర్త గావలె నెన్నన్
    మారదు నాయాలోచన
    తీరికచే యన్నదెలిపె దిరుగుచుయింటన్.
    2.కోరిన కోర్కె దీర్చగల కూరిమిగల్గు వరుండు|మంచిదౌ
    కారును గల్గినోడు,మనగౌరియు యూహలదేలువాడు,సం
    స్కారముయున్నవాడు,మమకారమె జీవనసారమైన|”మా
    గౌరికి కేశవుండు పతిగావలె శంకరు డన్నగావలెన్|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "తీరికచే నన్న..., దిరుగుచు నింటన్,... గౌరియు నూహల... సంస్కారము గల్గువాడు..." అనండి.

      తొలగించండి
  34. క్షీర సముద్రమున్ జిలుక చేరి సురాసురు లాదిశేషునిన్
    కూరిమి కవ్వమై పొదివి కొండగ మందరముంచి వెల్వడెన్
    శ్రీరమ నాథు డెవ్వరు కరీషిణి కన్న వచించె ధాత యా
    గౌరికిఁ గేశవుండు పతి గావలె శంకరుఁ డన్న గావలెన్.

    రిప్లయితొలగించండి
  35. గౌరికి కేశవు౦డు పతి గావలె | శ౦కరు డన్న

    .............................. కావలెన్

    శౌరికి | వారి భార్యలు విశాల , సుమిత్రలు |

    ........... .......... వీరలెల్లరున్

    " మీర పురమ్ము " న౦దున సమిష్టి

    ................ కుటు౦బము న౦దు ను౦దు | ర

    వ్వారు సమైకతత్వమున వర్ధిలు చు౦డిరి


    ............................ స౦తస౦బునన్

    రిప్లయితొలగించండి
  36. గురువు గారికి నమస్సులు.
    హరుడే నెవ్వరి పతియగు?
    వరాల లక్ష్మియు నెవరిన్ పతిగా కొలచున్?
    సరసమున వరుసకు వనిత
    గౌరికి గేశవుడు భర్త గావలె నెన్నన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      'హరు డేనాతికి పతియగు' అనండి

      తొలగించండి
  37. ధారుణి బంధముల్ గలుగు దారిని జూడఁగ సోదరుండునౌ
    గౌరికిఁగేశవుఁడు, పతి గావలె శంకరుఁ డన్న గావలెన్
    హీరకు పద్మనాభునికి నింతిగ ! మానవుడూహ జేయగన్
    దీరిన దేవతాగణము దెల్యునె చుట్టరికంబు వేరుగన్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరణతో:

      ధారుణి బంధముల్ గలుగు దారిని జూడఁగ సోదరుండునౌ
      గౌరికిఁగేశవుఁడు, పతి గావలె శంకరుఁ డన్న గావలెన్
      హీరకు పద్మనాభునికి నింతిగ ! మానవుడూహ జేయగన్
      దీరిన దేవతాగణము దెల్పునె చుట్టరికంబు వేరుగన్ !

      తొలగించండి
  38. మైలవరపు వారి పూరణ

    ఒక బుల్లితెర ప్రోగ్రాం లో అందమైన అబద్ధం చెప్పిన వానిని విజేతగా ప్రకటించే సందర్భంగా...

    అవాక్కయ్యారా !

    ఔరా ! మీరలవాక్క..
    య్యారా ! యను స్పర్థయందు నాడి యసత్యం
    బీరీతి గెలిచెనొక్కడు
    గౌరికిఁ గేశవుడు భర్త గావలె నెన్నన్ !!

    😃😃😃😃😃😃
    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  39. Vishwanatha Sharma Koride మారుని సముడున్నతులిత
    వీ‌రున్నఖిలజగములకు వేల్పున్ కృష్ణున్
    గోఱుచు రుక్మిణి దెల్పెన్
    గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      విశ్వనాథ శర్మ గారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  40. మారాంతకుడే పతియట
    గౌరికి, గేశవుడు భర్తగావలె నెన్న
    న్నారమకున్, విధికిన్ సతి
    భారతి, లోకములనేలు వారలు గారే.

    ఘోరతపమ్మొనర్చ సుమకోమలి కోరిక దీర్చనెంచుచున్
    భైరవుడే కదా సతిఁ వివాహము నాడగ భర్తయయ్యె నా
    గౌరికి, గేశవుండే పతి గావలె శంకరు డన్నగావలెన్
    వారిధి నందు బుట్టిన సువర్ణపుకాంతుల పద్మజాక్షికిన్.

    రిప్లయితొలగించండి


  41. వారణవదనుడు తనయుడు

    గౌరికిఁ, గేశవుఁడు భర్త గావలె నెన్నన్

    క్షీరాబ్ధి సుతకు నిరువురు

    నారయ దివిజులె మనలకు నవనీ స్థలిలో.


    మారహరుడే పతియగును

    గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్

    శ్రీరమకు సుతులు వీరికి

    మారుడు మరికరిముఖుండు మనుజా వినుమా!


    నారాయణుడే యన్నయు

    మారపితయనంగ జగతి మాధవుడేగా

    సారసదళ నేత్రికిలను                        

     గౌరికిఁ, గేశవుఁడు భర్త గావలె నెన్నన్

    రిప్లయితొలగించండి

  42. నా ప్రయత్నం : కం.

    మారరిపు వెవరికి ప్రజుడు?
    వారాన్నిధి ప్రియ తనూజ వల్లభుడెవరున్?
    శారదకేమగు వాక్పతి?
    గౌరికిఁ ,గేశవుఁడు, భర్త గావలె నెన్నన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతి భూషణ్ గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర "వల్లభు డెవరో?" అనండి. 'ఎవరున్' అనడం సాధువు కాదు.

      తొలగించండి
  43. దారిని వింటి నేనిచట దండిగ ప్రీతిని నన్నగారటన్
    గౌరికిఁ గేశవుండు; పతి గావలె శంకరుఁ;... డన్న గావలెన్?
    కూరిమి రమ్మురానిచట కోరిక తీరగ హైద్రబాదునన్
    వీరికి వారు వారికిని వీరిట దోస్తులు భాయిభాయిలే!

    రిప్లయితొలగించండి