20, డిసెంబర్ 2017, బుధవారం

సమస్య - 2551 (దమయంతినిఁ బెండ్లియాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"దమయంతినిఁ బెండ్లియాడె ధర్మసుతుఁ డొగిన్"

68 కామెంట్‌లు:

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

అమలుడు, ధర్మము తోడ
న్నమరుల దూతగ చరించె నద్భుత రీతిన్;
కమనీయ హృదయుడు, నలుడు,
దమయంతినిఁ బెండ్లియాడె, ధర్మసుతుఁ డొగిన్

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

(క్రమాలంకారం)
"సుమధురవచనుడు నిషధుం
డమలుం డెవ్వరి వివాహమాడెను చెపుమా ?
కమలనయన ద్రౌపదినో?"
"దమయంతిని;బెండ్లియాడె ధర్మసుతు డొగిన్."

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
pks kumar చెప్పారు...

అక్క గారు ధర్మ రాజు కుంతిని?????

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుమధుర సుందరుడు నలుడు
దమయంతినిఁ బెండ్లియాడె , ధర్మ సుతుఁ డొగిన్
రమణీయ ద్రుపద తనయని
సమతా భావమును దలచి సతిగా పొందెన్

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

మైలవరపువారి పూరణ

సుమతిని ద్రుపదతనూజను
క్షమాగుణమునందు జనకజాతను , ననురా..
గమున గన భీమరాట్సుత
దమయంతినిఁ బెండ్లియాడె ధర్మసుతుఁ డొగిన్ !

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

Kr rajeshwar rao చెప్పారు...

కమనీయ హృదయు డు నలు డు
దమయంతి ని పెండ్లి యాడె ;ధర్మ సు తు డో గి న్
విమలాత్మ జ ద్రుప దు సు త న్
ద మ కం బు న పెండ్లి యాడె తల్లి యె కోర న్

Zilebi చెప్పారు...



కమలనయనుండు నలుడౌ
దమయంతినిఁ బెండ్లియాడె; ధర్మసుతుఁ డొగిన్
కమలముఖి ద్రౌపదిని పెం
డ్లముగ బడసెగద జనని దురాయిగ సుదతీ !


ಜಿಲೇಬಿ

Kota Rajasekhar చెప్పారు...

గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
సమస్యాపూరణ :: నేటి సమస్య

*దమయంతినిఁ బెండ్లియాడె ధర్మసుతుఁ డొగిన్.*

సందర్భం :: శమము దమము అనే గుణముల పోలికలో దమయంతితో సమానురాలైన ద్రౌపదిని ధర్మరాజు పెండ్లాడిన సందర్భం.

రమణిని , పాంచాలిని , సతి ,
నమలను , ద్రౌపదిని , సుందరాంగిని , కృష్ణన్ ,
శమ దమ గుణముల పోలిక
*దమయంతిని పెండ్లియాడె ధర్మసుతు డొగిన్.*
కోట రాజశేఖర్ నెల్లూరు. (20.12.2017)

pks kumar చెప్పారు...

నమతుడు!,వగలాడు!నలుడు
దమయంతినిఁ బెండ్లియాడె, ధర్మసుతుఁ డొగిన్
సుముఖము తో దృపద మగని
కొమరితను వరించె దల్లి కోర్కెను దీర్చన్

A.Satyanarayana Reddy చెప్పారు...

కమనీయముగ నిషదపతి
దమయంతినిఁ బెండ్లియాడె, ధర్మసుతుఁ డొగిన్
విమలమగు మనసుతోడను
కమలనయన యాజ్ఞసేని కరమును బట్టెన్

gurram.jana@gmail.com చెప్పారు...

కమనీయమ్ముగ నలుడే
దమయంతిని బెండ్లియాడె;ధర్మ సుతుడొగిన్
తమకైదూళ్ళే చాలని
సమయోచితముగ నుడివెను సంధి కొరకునై.

gurram.jana@gmail.com చెప్పారు...

మరళీకృష్ణ గారు! సధ్యఃస్ఫూర్తితో మీరు జేసిన పూరణ ప్రశంసనీయము. 1971లో ఇంగ్లీషు గ్రామర్ లో నేర్చుకున్న ఒక అంశం గుర్తుకు వచ్చింది. I like the Shakespeare of India = I like Kalidasa.{Kalidasa is called the Shakespeare of India} అభినందనలు!!!

seethadevi gurram చెప్పారు...

సముడా సమవర్తిసుతుకు
శమదమముల,సాధువాది, సరసతతోడ
న్నమలిన చరితుడు నలుడా
దమయంతిని బెండ్లియాడె,ధర్మసుతుడొగిన్ !!

ధర్మసుతుడు = ధర్మాత్ముడు

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

సుమతిఁ గులధర్మపత్నిగ
తమ తల్లిని గౌరవించి ద్రౌపది నొప్పన్
కొమరార నామెలో గని
దమయంతినిఁ బెండ్లియాడె ధర్మసుతుఁ డొగిన్

gurumoorthy చెప్పారు...

గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,

విమలచరితుడు నలనృపతి

దమయంతిని బెండ్లియాడె | ధర్మసుతు డొగిన్

రమణిన్ ద్రోవదినిన్ వివ

హము జేసుకొనె గద జనని యానతి గొనుచున్

పంచరత్నం వెంకట నారాయణ రావు చెప్పారు...

గురువు గారికి నమస్సులు.
సమయోచితముగ నలుడు
దమయంతిని పెండ్లియాడె,ధర్మసుతు డొగిన్
తమకున్ రాజ్యము సమమున
విమలమతినపం చుమున్ రవి యునిచ్చు శుభముల్

వీటూరి భాస్కరమ్మ చెప్పారు...

ప్రమదముగ స్వయంవరమున
క్రమమున బెండ్లాడె నలుడు కాంతామణియౌ
విమలాంగి ద్రౌపదిని తా
దమయంతినిఁ, బెండ్లియాడె ధర్మసుతుఁ డొగిన్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

క్రమముగ సురలను మెప్పిం
చి మహారాజు నిషధ ధవ శేఖరుఁడు పరా
క్రమ నలుఁడు వీరసేనుని,
దమయంతినిఁ బెండ్లియాడె, ధర్మసుతుఁ డొగిన్

[ధర్మసుతుఁడు = న్యాయమైన కొడుకు/ ఔరస పుత్రుఁడు]

విరించి చెప్పారు...

సుమనోహర మూర్తి నలుడు
దమయంతినిఁ బెండ్లియాడె, ధర్మసుతుఁ డొగిన్
రమణి ద్రుపద తనయఁ మరియు
ప్రమోదమున దేవికలను బరిణయ మాడెన్.

కంది శంకరయ్య చెప్పారు...

ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నలుడు 'ధర్మసుతు' డెట్లా అయ్యాడో చిన్న వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది.
పోచిరాజు కామేశ్వర రావు గారి పూరణను ఒకసారి పరిశీలించండి.

కంది శంకరయ్య చెప్పారు...

బాపూజీ గారూ,
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

అక్కయ్యా,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినండనలు.
'తనయను' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మైలవరపు వారూ,
మీ పూరణ ప్రశస్తంగా, ఔత్సాహక పద్యకవులకు మార్గదర్శకంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

రాజేశ్వర రావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"విమలాత్మ ద్రుపదుని సుతన్" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

జిలేబీ గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కమలనయనుండగు నలుడు' అనండి.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏🙏🙏

seethadevi gurram చెప్పారు...

సముడు సమవర్తి సుతునకు గా చదువ ప్రార్ధన!

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

పోచిరాజు వారి ప్రావీణ్యం నాకెక్కడిది సార్! "ధర్మము" అనే పదాన్ని మొదటి పాదంలో వాడాను కదా, సరిపోతుందనుకున్నాను. ఏదో ఒకటి, అర్ధరాత్రి కిట్టింపు :)

కంది శంకరయ్య చెప్పారు...

కోట రాజశేఖర్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

పూసపాటి వారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ద్రుపదనృపుని' అంటే బాగుంటుందేమో?

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి వారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

జనార్దన రావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధర్మసుతు'నకు అన్వయం?

కంది శంకరయ్య చెప్పారు...

సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ద్రౌపది యొప్పన్' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

గురుమూర్తి గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Sreedhara Rao Machavolu చెప్పారు...

సమతను నెఱపుచు ధర్మము
నమఱగ జేయుచు నలుండె యాద్యుండయ్యెన్
మమకారము విరియ రమణి
దమయంతిని బెండ్లి యాడె ధర్మసుతు డొగిన్!

కంది శంకరయ్య చెప్పారు...

వెంకట నారాయణ గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదం సంతృప్తికరంగా లేదు. "విమలమతిన్ విన్నవించె విజ్ఞుండగుటన్" అందామా?

కంది శంకరయ్య చెప్పారు...

భాస్కరమ్మ గారూ,
మీ పూరణ అన్వయదోషం ఉన్నట్టుంది.

కంది శంకరయ్య చెప్పారు...

కామేశ్వర రావు గారూ,
విశిష్టాన్వయంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

విరించి గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధర్మసుతునకు అన్వయం?

koride vishwanatha sharma చెప్పారు...

"విమలయశుడు నలు డెటులన్
దమయంతినిఁ బెండ్లియాడె?" ధర్మసుతుఁ డొగిన్
"కమనీయమైన నాకథ
ను మునివర ! దెలియగ జెప్ప"నుచు నడి గెనటన్

Sreedhara Rao Machavolu చెప్పారు...

గురువర్యులకు నమస్సులు.ధర్మము నమరింప జేయుట లో ఆద్యుడైన ఇతడు ధర్మ దేవతకు సుతుని వంటి వాడని భావించాను.

Bhagavatula Krishna Rao చెప్పారు...

తమిగొని చేబట్టె నలుడు
దమయంతినిఁ ; బెండ్లియాడె ధర్మసుతుఁ డొగిన్
దమ తల్లి యాజ్ఞ నిడగా
క్రమముగ ననుజులకు తోడ నా ద్రౌపది నే

gurumoorthy చెప్పారు...

గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,

విమలచరితుడు నలనృపతి

దమయంతిని బెండ్లియాడె | ధర్మసుతు డొగిన్

రమణిన్ ద్రోవదినిన్ వివ

హము జేసుకొనె గద జనని యానతి గొనుచున్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

gurumoorthy చెప్పారు...

పై పద్యము తొలగి౦చ ప్రార్థన

పంచరత్నం వెంకట నారాయణ రావు చెప్పారు...

గురువు గారికి వినమ్ర పూర్వక ధన్యవాదములు.సాక్షి పత్రికలో మీరు మోన్నటి రోజు శతావధాన ములో పాల్గొన్న వార్త చాలా సంతోషము కలింగించింది. టీవీ లో కూడా కొంత సేపు 2 నిముషాలు కార్యక్రమం ప్రసారమయినది.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
సుమతిఁ గులధర్మపత్నిగ
తమ తల్లిని గౌరవించి ద్రౌపది యొప్పన్
కొమరార నామెలో గని
దమయంతినిఁ బెండ్లియాడె ధర్మసుతుఁ డొగిన్.

🌸గుండా వేంకట సుబ్బ సహదేవుడు 🌸

Sreedhara Rao Machavolu చెప్పారు...

రమణుడు నిషిధాధిపతియె
దమయంతిని బెండ్లి యాడె! ధర్మ సుతు డొగిన్
కమనీయంబగు నటు లా
యమ ద్రోవదిని మనువాడె యౌవన మొప్పన్!

Unknown చెప్పారు...

. “క్షమనే నమ్మియునలుడట
దమయంతిని పెండ్లియాడె”|”ధర్మసుతు డొగిన్
సమమే స్వయంవరమున
తమతల్లియు నాజ్ఞయందు ద్రౌపది పతియౌ”|

కంది శంకరయ్య చెప్పారు...

విశ్వనాథ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదాన్ని ...నమలచరిత! మునివర! తెలియఁగఁ జెప్పు" మనెన్..... అంటే వినసొంపుగా ఉంటుందని నా భావన. ఏమంటారు?

కంది శంకరయ్య చెప్పారు...

కృష్ణారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

గురుమూర్తి గారూ,
మీ పూరణ అన్ని విధాల సరిగానే ఉన్నది కదా! ఎందుకు తొలగించమంటున్నారు?

seethadevi gurram చెప్పారు...

సముడు సమవర్తి సుతునకు సమరవీరు
డౌనలుడు దమయంతిని బెండ్లియాడె;
ధర్మసుతుడొగిన్ వరియించె ద్రౌపదియగు
యాఙ్ఞసేనిని జనయిత్రి యాఙ్ఞమేర

seethadevi gurram చెప్పారు...

ఆర్యా నస్కారములు!!గురువుగారు విశిష్టాన్వయమని చెప్పేవరకూ నాకు అన్వయమర్ధము కాలేదు!నలుని తండ్రి పేరు తెలియకపోవడమే కారణము!
ప్రశస్తమైన పూరణ!మీరు అందులకే సరస్వతీ పుత్రులనదగినవారు!నమస్సులు!

sailaja చెప్పారు...

మమతలు పెనవేయ నలుడు
దమయంతిని బెండ్లియాడె, ధర్మసుతుఁడొగిన్
కమలాక్షి సత్యసంధను
ప్రమదంబుగ కట్టుకొనెను ప్రజనిక కోరన్!!!

ప్రజనిక = తల్లి

కంది శంకరయ్య చెప్పారు...

శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. "స్వయంవరమునన్" అంటే సరి!

కంది శంకరయ్య చెప్పారు...

సీతాదేవి గారూ,
కంద పాద సమస్యకు మీ తేటగీతి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

శైలజ గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...



సముచితముగనిషధపతియు

దమయంతినిఁ బెండ్లియాడె ,ధర్మసుతుఁ డొగిన్

మమతలు మాలల తోడను

సుమ దరహాసముజూపు సుదతిని గనియెన్.

2అమరులు మెచ్చిన నలుడట

దమయంతినిఁ బెండ్లియాడె ,ధర్మసుతుఁ డొగిన్

విమలంబగు మది తోడను

నమ కోరికపై ద్రుపదజ నాలిగ గొనియెన్.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుమధుర సుందరుడు నలుడు
దమయంతినిఁ బెండ్లియాడె , ధర్మ సుతుఁ డొగిన్
రమణీయ ద్రుపద తనయను
సమతా భావమును దలచి సతిగా పొందెన్

seethadevi gurram చెప్పారు...

గురువుగారికి నమస్సులు! ధన్యవాదములు!ఒక పొరపాటు
జరిగినది. రెండవ పాదంలో యతి తప్పింది. సవరించిన పూరణ:

నైషధప్రబంధ వరుడు నలుడు సమర
వీరుడా దమయంతిని బెండ్లియాడె;
ధర్మసుతుడొగిన్ వరియించె ద్రౌపదియగు
యాఙ్ఞసేనిని జనయిత్రి యాఙ్ఞమేర!

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

డా. సీతా దేవి గారు నమస్సులు, ధన్యవాదములు. మహాభారతములో నారణ్య పర్వములో ద్వితీయాశ్వాసములో నలోపాఖ్యానము కలదు. కవిసార్వభౌముని శృంగార నైషధము కూడ నలుని చరిత్రయే.
ఆంధ్రభారతి లో కూడా వివరములను సంక్షిప్తముగా నరయ వచ్చును.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

👏👏👏

Kota Rajasekhar చెప్పారు...

సవరణతో
రమణిని, పాంచాలిని, సతి
నమలను, ద్రౌపదిని, సుందరాంగిని, కృష్ణన్,
శమ దమ గుణ గణ నిర్జిత
దమయంతినిఁ బెండ్లియాడె ధర్మసుతు డొగిన్.
కోట రాజశేఖర్ నెల్లూరు.