22, డిసెంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2553 (తెలుఁగుఁ జదువువారు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"తెలుఁగుఁ జదువువారు దేహి యనరె"
(లేదా...)
"తెలుఁగుఁ బఠించువారలిక దేహి యటంచును జేయిఁ జాపరే"
(ఈ సమస్యను పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు)

118 కామెంట్‌లు:

  1. కవుల కావ్య వనము కాంతులు విరియంగ
    ధరణి పులక రించి తనరు మదిని
    భాష తీయ దనము బహురీతు లనుగ్రోలి
    తెలుఁగుఁ జదువు వారు దేహి యనరె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      పద్యం అద్భుతంగా ఉంది. కాని ఎవరిని దేహి అంటారో స్పష్టంగా చెప్పలేదు.

      తొలగించండి
    2. అంతటి వరము కోరేది భగవంతుడిననేది సృష్టమని నా అభిప్రాయం. ఆర్యులేమంటారో?

      తొలగించండి
    3. కవుల కావ్య వనము కాంతులు విరియంగ
      ధరణి పులక రించి తనరు మదిని
      భాష తీయ దనము వాగ్దేవి కృపయని
      తెలుఁగుఁ జదువు వారు దేహి యనరె

      తొలగించండి
  2. "ఇవ్వు"మనరె తెలుగు నిష్టముగ పలుకుచు
    తెలుగు జదువువారు,"దేహి" యనరె
    సంస్కృతమును జదువు ఛాత్రులు దేవుని
    మ్రోల మ్రొక్కువేళ మోకరిల్లి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "..నిష్టముగ బలికి" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా!సవరించెదను!నమోనమః!

      తొలగించండి
    3. "ఇవ్వు"మనరె తెలుగు నిష్టముగబలికి
      తెలుగు జదువువారు,"దేహి"యనరె
      సంస్కృతమును జదువు ఛాత్రులు దేవుని
      మ్రోల మ్రొక్కువేళ మోకరిల్లి!

      తొలగించండి
  3. కడుపు కాలినపుడు కందలుండి మనకు
    రోస మొచ్చినపుడు సీసములును
    చంక లెగరు వేయ చంపకములు నుండ
    తెలుఁగుఁ జదువువారు దేహి యనరె :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      బాగున్నది మీ పద్యం. మరి ఇన్ని ఉండి ఎందుకు దేహి అంటారో స్పష్టంగా చెప్పలేదు.
      'వచ్చి'ని 'ఒచ్చి' అనరాదు. "రోస మొందినపుడు" అనండి.

      తొలగించండి
    2. "సార్!

      "అనరె" అనే పదము "అనరే" కి abbreviation గా తీసుకున్నాను...

      తొలగించండి
  4. "తెలుగు బటించువారలిక దేహి యటంచును జేయి జాపరే!
    నలుగుటలేమొ తప్పవిక; నమ్ముడు మాదగు మాటలింక;"నం
    చలసట లేక వాగిరదె యర్భకధూర్తులు కొంతమంది;యా
    మలయసమీరతుల్యుడగు మాన్యుని నమ్ముడు "చంద్రశేఖరున్".

    "

    రిప్లయితొలగించండి
  5. దక్షత తెలియంగ "ద"కునేత్వమిచ్చియు
    హల్లు "హ"కును గుడిని నద్ది, కలిపి
    చదువమని పలికిన సరిగ సరసముగ
    తెలుఁగుఁ జదువువారు "దేహి" యనరె||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మంచి పూరణ సత్యనారాయణగారూ!
      లాకేత్వమియ్య నేరడు
      దాకును కొమ్మియ్యడట్టి దాత
      పద్యం గుర్తొచ్చింది!

      పద్యం పూర్తి పాఠము తెలియదు. ఎవరికైనా తెలిస్తే తెలుప ప్రార్ధన!

      తొలగించండి
    3. ఆ పద్యము అళయ సింగరార్య విరచిత "సంస్కృతాంధ్రచాటువులు"గ్రంథము నుండేమోనని అనిపిస్తున్నది. చూచి చెబుతాను.

      తొలగించండి
    4. "చేకొని రాయని బాచడు
      కాకాలు గుణించు పిన్నకాలము నాడే
      ‘ లా’ కేత్వమీయనేరడు
      ‘ దా’ కును కొమ్మీయ డట్టి ధన్యుడు కలడే”


      http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/april15/sahityamlo_chatuvulu.html

      తొలగించండి
    5. చాలచాల ధన్యవాదములన్నయ్యా! రాయని భాస్కరమంత్రిని పరిచయం చేసినందుకు!
      నెల్లూరు రెడ్లు గొప్పదాతలు!యెవరో రెడ్డిగారు పోయినప్పుడు ఆయన్ని పొగుడుతూ ఈ పాదము వ్రాశారు.నాకు చాలనచ్చి గుర్తుండి పోయింది!

      తొలగించండి
    6. రాయని భాస్కరునిపై మరొక చాటువు.... (ఎప్పుడో చిన్నప్పుడు కంఠస్థం చేసింది!)

      "సరి బేసై రిపుడేల భాస్కరులు భాషానాథ?" "శిష్యా! వసుం
      ధర నందొక్కఁడు మంత్రి యెయ్యె" "వినుకొండన్ రామయామాత్య భా
      స్కరుఁడో?" "యౌ" "నయితే సహస్రకరశాఖ ల్లే" "వవే యున్నవే
      తిరమై దానముఁ జేయుచో రిపుల హేతిన్ వ్రేయుచో వ్రాయుచో"

      తొలగించండి


  6. అలుక వలదయ కవి ! యమ్మహనీయుడు
    తెలుఁగుఁ జదువువారు దేహి యన, రె
    పరెప మనుచు వెతలు పడనీయకన్ జేసె
    భళి తెలుగు మహా సభ నెఱ వేర్చి!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  7. తెలుఁగుఁ బఠించువారలిక దేహి యటంచును జేయిఁ జాప, రే
    తల సమయంబులో వెతల తామిక కష్టము చెంద నీయకన్
    తెలుగు మహా సభన్ జరిపి తేజము నింపెను చంద్ర శేఖరుం
    డలుక యదేల నీకు కవి! రాధనమున్ గొను మయ్య శంకరా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. ఘనత తోడ వ్రాయు కావ్యములెన్నియో
    తెలుగు చదువు వారు , దేహి యనరె
    యన్య భాష వారు నమలు పరచినచో
    తెలుగు యంగి యనుచు సెలవు నిడిన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తెలుగు+అంగి' అన్నపుడు యడాగమం రాదు. "తెలుగె యంగి" అనండి.

      తొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    తెలుగన పాలకుండ., కడు తీయని చక్కెర సంస్కృతంబు ., ని...
    ర్మలముగ మేళవించి, రసమాధురులన్ గొన , శబ్దపుష్టి వే...
    వెలుగుల వెల్గు తెల్గు కనువిందగు., భారతిఁ జేరి మ్రొక్కుచున్
    తెలుఁగుఁ బఠించువారలిక *దేహి* యటంచును జేయిఁ జాపరే !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      తెలుగు పాలలో గీర్వాణ శర్కర... ఇక రసమాధురికి, శబ్దపుష్టికి కొదవెక్కడ? ఎంతటి పండితుడైనా వాణీదేవిని దేహి అనవలసిందే కదా! అత్యద్భుతమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. అధ్భుతమైన పద్యరాజము! లలిత రసాలసాల నవపల్లవ కోమల తెలుగు! మీ పద్యరచనా శైలి పోతనవలె లలితంగా ఉంటుంది!నమోనమః!

      తొలగించండి
    3. మైలవరపు వారి మరొక పూరణ


      కల్వకుంట్ల వారి గంభీర వచనమ్ము..
      లాలకింపలేదె ! అతివ ! నమ్ము !
      వెలుగు జిలుగులొలుకు తెలగాణదేశాన
      తెలుగు ! జదువువారు దేహియనరె !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    4. మైలవరపు వారూ,
      మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    5. శ్రీహర్ష గారి స్పందన


      🙏

      *పలికిన మీదునోట వడి పాన్కము పోసెదనయ్య కృష్ణుడా!*
      *చిలికిన మీదు చేతులకు సేమము కల్గు వధాన వర్యుడా*
      *తెలుగున సంస్కృతాన తమ తేజము జూడగ సవ్యసాచిదే*
      *తలతును కొంత మాకదియె దానము జేసిన పుణ్యమబ్బదా!

      *🙏

      తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

      తొలగించండి
    6. మైలవరపు వారి మరొక పూరణ

      They = వారలు (దే)
      He = అతడు (హి)

      *వారలతడటండ్రు* వరుసగా తీయగా
      తెలుఁగు జదువువారు ! *దే.. హి*.. యనరె
      యాంగ్లమాధ్యముమున అరకొర నేర్చుచో !
      మాతృభాష పంచు మధురసుధలు !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  10. సంఘ హితము గోరి సామాన్యులు ను మెచ్చ
    పెక్కు గ్రంధ ము ల ను మిక్కుట ముగ
    రచన జేయ గోరు ర సి కావ తం సు లౌ
    తెలుగు జదు వు వారు దేహి యన రె

    రిప్లయితొలగించండి
  11. చదువులమ్మ కెన్న సంతతి యగుగాన.
    పద్యవిద్యలందు ప్రగతిగాంచి.
    నలువరాణిని చరణంబుల పట్టచు.
    తెలుగుఁజదువువారు దేహియనరె

    రిప్లయితొలగించండి
  12. ఆంగ్లభాషయందు వ్యామోహమున జేసి
    తండ్రి యెక్క డిట్లు తనయునకును
    పలుకుచుండు నెప్పు డిలలోన సత్పుత్ర!
    తెలుఁగుఁ జదువువారు దేహి యనరె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురుమూర్తి ఆచారి
      ,,,,,,, ,,,,,,

      శ్రీమతి సీతాదేవి గారు మీ పద్యము ఉన్నతమై అలరించు చున్నది

      తొలగించండి
  13. పలికెను పోతనార్యుడట పావన భావన కృష్ణమూర్తి లీ
    లలను వికాసమొందగ విలాసము నిండుచు మానసమ్ములన్
    తెలుగు పఠించు వారలిక దేహి యటంచును జేయి జాపరే
    సులభము ముక్తిగోరిపురుషోత్తము ముంగిట మోకరిల్లుచున్

    రిప్లయితొలగించండి
  14. ఆ.వె.
    జిలుగులనమెరికనుఁ జేయిపట్టినడిగి,
    నేను ఘనుడనాంగ్లమ్మును నేర్చినాడ
    "తెలుఁగుఁ జదువువారు దేహి యనరె"
    యనుచు నిందించు వారిది యల్పబుద్ధి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విశ్వనాథ శర్మ గారూ,
      ఆటవెలది సమస్యకు తేటగీతి వ్రాశారు. సరే... తేటగీతిగానే చూద్దాం.
      మొదటి పాదంలో యతి తప్పింది. "జిలుగుల నమెరిక నడిగి చేయిపట్టి" అనండి. మూడవ పాదంలో గణదోషం. "తివిరి తెలుఁగుఁ జదువువారు దేహి యనరె" అంటే సరి!

      తొలగించండి
    2. ధన్రవాదములు. పొరబాటును గుర్తించలేదు. మీరన్నట్లు మారుస్తాను.🙏🙏

      తొలగించండి
  15. తేటతెనుగులోన తీయతేనెలు జారు
    భాగవతము జదివి భక్తులంత
    ముదము దేవదేవు మోక్షము గోరుచు
    తెలుగు చదువు వారు దేహి యనరె

    రిప్లయితొలగించండి
  16. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    . సమస్యాపూరణ :: నేటి సమస్య

    *తెలుఁగు బఠించు వార, లిక దేహి యటంచును జేయిఁ జాపరే ?*

    సందర్భము :: తెలుగు చదివే వాళ్లను ప్రశంసించి , వాళ్లను గొప్ప ఉద్యోగాలలో నిలిపి , ప్రతి ప్రాథమిక పాఠశాలలో తెలుగు బోధించేందుకు తప్పనిసరిగా ఒక తెలుగు పండితుని నియమించి , తెలుగు భాషకు పట్టాభిషేకం చేస్తామని వాగ్దానాలు చేసే నేతల యొక్క మాటలు మిన్న చేతలు సున్న. కాబట్టే మన తెలుగు రాష్ట్రంలో పూర్తిగా తెలుగు బోధించే ఓరియంటల్ కళాశాలలు కొన్ని మూతబడ్డాయి. ఇక తెలుగు చదివేవారు దేహి అని చేయి జాపక ఏమి చేస్తారు ? అని ప్రశ్నించే సందర్భం.

    పలికెను తెల్గు నేత యిటు ‘’ పట్టము గట్టెద తెల్గు భాషకే,
    తెలుగు పఠించు వారల నుతింతు , గురూత్తమ కార్య రాశి వా
    రల నియమింతు , సత్య మిక ప్రాథమిక మ్మగు పాఠశాలలన్
    నిలిపెద తెల్గు’’ నంచు , గన నేతల చేతలు సున్న, గావునన్,
    *తెలుగుఁ బఠించు వార, లిక దేహి యటంచును చేయి జాపరే ?*
    కోట రాజశేఖర్ నెల్లూరు. (22.12.2017)

    రిప్లయితొలగించండి
  17. సత్యమును వచించితిరి అవధానిగారూ!నమోనమః!

    రిప్లయితొలగించండి
  18. గురువు గారికి మనస్సులు.
    సకల శాస్త్ర విషయ సారమె రుగుదురు
    తెలుగు జదువు వారు,ద్రోహి యనరె
    నేకళలను సరిగ నేర్వని వారిని.
    విద్య రాని వాడు వింత పశువు!

    రిప్లయితొలగించండి
  19. రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      దేహి యనరె... అన్నదానిని "ద్రోహి యనరె" అన్నారు. దానితో సమస్యయే మారిపోయింది. సవరించండి.

      తొలగించండి
  20. సవరించిన పద్యం


    కోరు వరము లిచ్చు గోవిందుబ్రార్థించి
    వరములిమ్మనంద్రు భక్తితోడ
    తెలుగు జదువువారు, దేహి యనరెజూడ
    సంస్కృతముపఠించు ఛాత్రులంత

    రిప్లయితొలగించండి
  21. విశ్వ భాష లందు విలువైనది తెలుగు
    తెలుగు తీపితీపి తేనెలూరు
    మరల తెలుగు నేల మరుజన్మ నొకపరి
    తెలుగు జదువు వారు దేహి యనరె?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మరుజన్మ నొందగ" అంటే అన్వయం కుదురుతుంది.

      తొలగించండి
    2. ఆర్యా!మీ సూచన సమంజసము గా నున్నది.ధన్యవాదాలు!

      తొలగించండి
  22. అన్నమయ్య పాట నర్థమ్ము నెఱుగంగ
    పదకవితల సుధల నొదవు నచ్చ
    తెలుగు చదువు వారు దేహి యనరె? యో ని
    ఘంటువును వివరముకై తపించి

    రిప్లయితొలగించండి
  23. శక్తి నీయ మనుచు సర్వేశు గొలుచును
    తెలుగు జదువు వారు, దేహి యనరె
    సంస్కృతమును బలుకు చదువరులెల్లరు
    కృపను గోరు వేళ కేలుమోడ్చి…!!!


    తెలుగు సొబగు లెల్ల తెలుసు కొందురిలను
    తెలుగు జదువువారు, దేహి యనరె
    యాంగ్లమాధ్యమమున నభ్యసించుటజేత
    తెలుగు వారలైన బలుక తెలుగు!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "శక్తి నొసగు మనుచు" ఆనండి.

      తొలగించండి
  24. భంగ్యంతరము (పాదాల క్రమము మార్చి) : విశ్వ భాష లందు విలువైనది తెలుగు
    తెలుగు జదువు వారు దేహి యనరె?
    మరల తెలుగు నేల మరుజన్మ నొకపరి
    తెలుగు తీపితీపి తేనెలూరు.

    రిప్లయితొలగించండి
  25. ఆ.వె.
    తెలుగు చదువుజదివి తెఱగంటిరేడులు
    తెలుగు భాష నెడపె తెల్లబోవ
    తెచ్చిరాంగ్ల భాష తికమకల నడుమ
    తెలుగు జదువువారు దేహి యనరె ?

    @ మీ పాండురంగడు *
    ౨౨/౧౨/౨౦౧౭

    రిప్లయితొలగించండి
  26. లలిత లలితమైన లాస్యంపురీతుల
    కవన సుధలనొల్కు కావ్య రచన
    లలవడంగ పలుకులమ్మని ప్రార్థించి
    తెలుగు జదువువారు దేహి యనరె ?

    రిప్లయితొలగించండి
  27. కొద్దిమందిమాత్రమిధ్ధరణిగలరు
    తెలుగుజదువువారు,దేహియనరె
    భిక్షగోరువారువీధివీధితిరిగి
    కర్మఫలముతప్పదేరికైన

    రిప్లయితొలగించండి
  28. వ్యాస శంకర నిభ పండిత గురుదేవ
    పాద పద్మములకు భక్తి నెఱఁగి
    పటిమ తర సు శబ్ద భావ ప్రవిమలంపుఁ
    దెలుఁగుఁ , జదువువారు, దేహి యనరె

    [చదువు వారు = చదువుకొనెడి వారు]


    ఇల నిఁక జన్మ రాహితికి నెల్లరు నిత్యము నార్తి జెందుచుం
    బలుమఱు మానసమ్మునను బన్నుగఁ గొల్చుచుఁ దన్మయమ్మునన్
    సలలిత మోక్ష మీయ మని శార్ఙ్గి సునామము లెల్లఁ బ్రీతి గొం
    తెలుఁగుఁ బఠించు వార లిఁక దేహి యటంచును జేయిఁ జాపరే

    [గొంతు+ఎలుఁగు = గొంతెలుఁగు; కంఠధ్వని]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమోఘము!మీకు మీరే సాటి!నమోవాకములు!

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. ముఖ్యంగా రెండవ పూరణలోని విరుపులు మెరుపులే! అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      డా. సీతా దేవి గారు నమస్సులు, ధన్యవాదములు.

      తొలగించండి
  29. సీ: పిన్నతనము నందె పెద్దలు నేర్పగా
    నీతి పద్యములైన నేర్చి యుండి
    చాలినంతగనైన సంస్కృతమ్మును నేర్చి
    పంచకావ్యములైన పఠన జేసి
    భారతమ్మును మరి భాగవతమ్మును
    రామాయణముల సారస్య మెరిగి
    ఆధునికకవీంద్రులందు ప్రసిద్ధులౌ
    వారల రీతులన్ భళిగ నెరిగి
    ఆ.వె: విద్య కలిగి యిచ్చు విబుధుడే యుండిన
    తెలుగు చదువు వారు దేహి యనరె !
    విద్య నేర్వనట్టి విద్య నేర్పగ లేని
    పంతులున్న తెలుగు బాగు పడునె !

    రిప్లయితొలగించండి
  30. జిలుగు వరూధినీ సొగసు చిత్రణ పెద్దన పంచ మెచ్చుచున్
    కలికి ధరించి మాల హరి కంఠముజేర్చిన కావ్యమాధురుల్
    విలసిత 'పాండురంగ' కృతి వేడుక! భూషణు శ్లేష చిందులున్
    పులకల నైషధంపు కృతి మోదముఁ గూర్చగ దప్పి దీరకన్
    దెలుఁగుఁ బఠించువారలిక దేహి యటంచును జేయిఁ జాపరే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. 🙏ధన్యోస్మి గురుదేవా 🙏

      శ్రీమైలవరపు వారి అమూల్యమైన సవరణతో

      జిలుగు వరూధినీ ప్రణయ చిత్రణ పెద్దన పంచ మెచ్చుచున్
      కలికి ధరించి మాల హరి కంఠముజేర్చిన కావ్యమాధురుల్
      విలసిత 'పాండురంగ' కృతి వేడుక! భూషణు శ్లేష చిందులున్
      పులకల నైషధంపు కృతి మోదముఁ గూర్చగ దప్పి దీరకన్
      దెలుఁగుఁ బఠించువారలిక దేహి యటంచును జేయిఁ జాపరే?

      ✍️ గుండా వేంకట సుబ్బ సహదేవుడు

      తొలగించండి
  31. తెలుగుమహాసభల్ముగిసెతెల్గుజిలుంగులు
    విశ్వమంతటన్
    వెలుగులజిమ్మెభాషపలువేదికలందుప్రతిధ్వనించుచున్
    తెలుగునుప్రస్తుతింపగనెతీరునెకోర్కెలుకొల్వురానిచో
    తెలుఁగుపఠించువారలికదేహియటంచునుజేయిఁజాపరే

    రిప్లయితొలగించండి
  32. తెలుగు పఠించు వారలికదేహియటంచును జేయి జాపరే
    స్థలమున,భావికాలమున సంస్కృతి సంపద కాలవాలమై
    సలలితమై సుధాసహిత స్వాగత తోరణమై చెలంగు మా
    పలుకుల ధార‌,శారదకు బంగరు వన్నెల చంద్రహారమై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      విరుపుతో విశేషార్థాన్ని సాధించి చక్కని పూరణ చేశారు. అభినందనలు.

      తొలగించండి
  33. పద్యవిద్యలోన ప్రావీణ్యమును బొంద
    ననవరతము మదిని నర్థిగలుగ
    గురువువద్దకేగి కూర్మితోడ నుతించి
    తెలుఁగుఁ జదువువారు, దేహి యనరె?

    రిప్లయితొలగించండి
  34. సలలితమైన తెల్గునకు సమ్మతి పట్టము గట్టెదంచు తా
    తెలుపగ ముఖ్యమంత్రి కడుఁ దెల్లముగా సభలోన, నిచ్చతో
    తెలుఁగుఁ బఠించువారలిక దేహి యటంచును జేయిఁ జాపరే
    విలువగు పండితోత్తముల వీడునకేగి కరమ్ము దీక్షతో

    రిప్లయితొలగించండి
  35. . మాతృభాషయందు మమకారమున్నట్టి
    తెలుగు జదువువారు దేహి యనరె
    అన్యభాష మరియు నాంగ్లమ్ము నేర్వగ
    యిష్టబడరు భాషనష్ట మనుచు|
    2.తెలుగును సంస్కరించుటకు తేజము నింపగ ముఖ్యమంత్రియే
    పలికెను వేదికందున ప్రపంచమహాసభలందు బాల్యమున్
    తెలుగు బఠించువారలిక దేహియటంచును జేయి జాపరే
    తెలిసిన బాలబాలికలు దీప్తిని బెంచనివేరు భాషలున్.


    .

    రిప్లయితొలగించండి
  36. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఘన గుడింతములను కఱప గలుగుదురు
    తెలుగు జదువు వారు; దేహి యనరె
    వాటి కొఱకు నితర భాషలధ్యేతలు?
    తెలుగు వెలుగు గాంచి నిలుగు మోయి!

    రిప్లయితొలగించండి
  37. అమ్మభాష కెపుడు నాంగ్లమే సవతియౌ!
    సవతి సంస్కరణలు సాగ నీక
    తెలుగు జదువు వారు !దేహియనరె సంతు
    సవతి ప్రేమ జూప?భవిత యగున!

    రిప్లయితొలగించండి
  38. అమృతమంది నట్టి యక్షరముల లోన
    మలచ బడ్డ కావ్య మదురిమలను
    పఠన సేయ నాంధ్ర భారతిని దలచి
    తెలుగు జదువు వారు దేహి యనరె!

    "తెలుగు జదువు వారు దేహి యనరె" యన
    సందియముల వీడి సకల జనులు
    మాతృ భాష లోనె మాటలాడ దగును!
    అవసరముల కొఱకె యన్య భాష!

    రిప్లయితొలగించండి
  39. తెలివిని మాలి యాంగ్లమను దెయ్యపు బానిసలై, తమంతగా
    పలుకక తీయతేనె యగు భాషను, పిన్నల కిండ్లనైన నా
    సలలితమైన నెన్నుడుల జక్కగ జెప్పక భావి నేర్వగన్
    తెలుఁగుఁ బఠించువారలిక దేహి యటంచును జేయిఁ జాపరే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దయ్యము' సాధువు. 'దెయ్యము' గ్రామ్యం.

      తొలగించండి
  40. పెద్దనార్యుని చదివి ముద్దరాలు వరూధి
    ని వగలు సొబగు కని వివశు లయిన
    తెలుగు జదువు వారు, "దేహి యనరె"యామె
    యధర సుధల గ్రోల నాత్ర పడుచు



    రిప్లయితొలగించండి
  41. ***********
    తెలుగు భాష లోని తీపి గ్రోలి మురిసె
    తెలుగు జదువువారు ; దేహి యనరె
    తెలుగు నేర్పు మనుచు ,తెలుగు కమ్మదనము
    తెలియగ ,పర భాష పలుకు వారు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతి భూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కర్తృపదం 'చదువువారు' బహువచనం, క్రియాపదం 'మురిసె' ఏకవచనం. "తీపి గ్రోలెద రెల్ల। తెలుగు జదువువారు...." అందామా?

      తొలగించండి
  42. ఆ.వె
    మంచి తెలిసి మసలు మాన్యులౌదురిలను
    తెలుఁగుఁ జదువువారు, దేహి యనరె
    జనులు పరుల భాష జదివి పొరుగు దేశ
    మరగి పొట్ట చేత బట్టి మతులు చెడగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగ మల్లేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణదోషం. "...మరిగి పొట్ట కొఱకు మతులు చెడగ" అందామా?

      తొలగించండి
  43. పొరుగు భాష మోజు పెరిగెను జగతిన
    తల్లి భాషజదవ తరిగిపోగ
    మమ్మి డాడియనుచు మనుజులు తిరగాడ
    తెలుగుజదువు వారుదేహియనరె

    రిప్లయితొలగించండి
  44. కలుగగ నెప్పుడాకలియు కందల జాతుల కూరలుండగా
    ఛలమున పూలు తెమ్మనగ చంపకలుత్పల మాలలుండగా
    బలిమికి నౌషధమ్మికను బాలల ప్రౌడుల శాస్త్రముండగా
    తెలుఁగుఁ బఠించువారలిక దేహి యటంచును జేయిఁ జాపరే!

    రిప్లయితొలగించండి
  45. ములుగుచు డబ్బు లేదనుచు పుత్రుని జేయగ పండితుండుగా
    తెలుగు మహాసదస్సులని తెల్గుల నేతలు డప్పుకొట్టగా
    పిలుపులు రాక పండితులు వృత్తులు కోరగ నీసడించగా
    తెలుఁగుఁ బఠించువారలిక దేహి యటంచును జేయిఁ జాపరే!

    రిప్లయితొలగించండి