గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం నేటి అంశము :: న్యస్తాక్షరి యతి స్థానములలో వరుసగా *క్రొ* *త్త* *సా* *లు* అనే అక్షరాలు ఉండాలి.
సందర్భం:: ప్రకృతిలో నూతనమైన మార్పులను తెస్తూ, వసంత ఋతువుతో ప్రారంభమయ్యేదే మన సంవత్సరాది యుగాది ఉగాది. నూతన ఆంగ్ల సంవత్సరాదికి ప్రకృతిలో ఎలాంటి మార్పులూ ఉండవు. కాబట్టి ఈ రోజు నేను నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలను కోరుకొనడం లేదు. నా ఉగాది పండుగను తారాస్థాయిలో జరుపుకొంటాను. నేను విదేశీయ సంస్కృతిలోకి జారిపోను. నాలో మన భారతమాతపై అనురాగాన్ని కలిగియుండి , సారూప్యము కోరుతూ భారతీయతకు మేలు చేకూర్చేందుకు ప్రయత్నిస్తాను అని నేను నిశ్చయించుకొన్న సందర్భం.
కోరన్ నే డిల నాంగ్ల వత్సరములో *క్రొ* త్తన్, శుభాకాంక్షలన్, తారాస్థాయి నుగాది పండుగనె చి *త్త* మ్మందు భావించెదన్, జారన్ బోవ విదేశ సంస్కృతులకై, *సా* రూప్యమున్ గోరి, నా లో రక్తిన్ మన భారతీయతకు మే *లు* న్ గూర్ప యత్నించెదన్. *కోట రాజశేఖర్ నెల్లూరు.* (01.01.2017)
కోట రాజశేఖర్ గారూ, నా అభిప్రాయమూ అదే. వ్యక్తిగతంగా కొన్ని సంవత్సరాలుగా నేనీ ఆంగ్ల వత్సరాది వేడుకలకు (మా మిత్రులు రమ్మన్నా వెళ్ళకుండా) దూరంగా ఉంటున్నాను. మీ అభిప్రాయాలతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. మీ పూరణ ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.
శాంతి భూషణ్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'సకల + అసాధ్యములు = సకలాసాధ్యములు' అవుతుంది. యడాగమం రాదు. అక్కడ "..జేయు నన్ని యసాధ్యములను" అనండి. నిన్న గద్వాలలో మీ తండ్రిగారిని కలిసి ఆత్మీయసంభాషణ జరపడం ఆనందాన్నిచ్చింది.
మీరన్నది నిజమే గురువుగారూ. అయితే చిన్న పిల్లలు అత్తా తాతా అనే వయసులో స్వతహాగా త తా త్త త్త త్తా అని ఉచ్చరిస్తూ ఉండడం సహజం కదా.....ఆ చిట్టి పలుకులను దృష్టిలో ఉంచుకొని అలా పూరించాను ధ్వన్యనుకరణ గా.
ఈరోజు ఉదయం మా వృద్ధాశ్రమంలో గోపి అనే సహవాసి మరణించాడు. కొంతకాలంగా అస్వస్థుడై ఉన్నాడు. నిన్న రాత్రి "నేను రాను. నాకింకా టైముంది. పో" అని కలువరించాడట! మనసంతా వికలమై ఉంది. వీలైతే మీ పద్యాలను సాయంత్రం సమీక్షిస్తాను.
గురువర్యులకు మఱియు కవి మిత్రులందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. గురువులును మిత్రులునునేడు క్రొత్త శకము ధాటిగా దీవనలిడ చిత్తముల లోన సాహితీ వనమ్ము లెదిగి సాధనమున లోకములు మెచ్చ కానుకలు గొన వలయు!
VINAYAKA
రిప్లయితొలగించండిWISH YOU HAPPY NEW YEAR DEAR N NEAR
విష్ యూ హాపి న్యూ ఇయరు డియరు ఎన్నియరు
(మొదటి పాదములో మొదటి అక్షరము రెండవ పాదములో రెండవ ఆక్షరము మూడవ పాదములో మూడవ అక్షరము కలిపి చదువు కోవలెను ) సౌలభ్యత కొరకు అచ్చులు మార్చలేదు.
సీ: (వి) ఘ్నరాజు సతము విఘ్నముల్ బాపుచూ
బు(ష్) కలముగ గీర్తి బొసగు చుండు ,
సిరి(యు)ను విరివిగా కరుణతో కలిమిని
పూన్చిమ(హా)రాజ భోగమొసగు,
కేరువు తో (పి)నా కి ఘనత లనిడున
నంతమ్ము నీకు (న్యూ )నత బొడయక,
ఇక్ష్వాక శ్రేష్టుడు (ఇ)నకుల దిలకుడు
యశమును బెంచి సా(య)ము ను జేయు ,
తిరుమల వాసుడు గ(రు)ణ తో గాచును
గొమారాలు చపలతో గూ(డి) సతము ,
హనుమంతు డిచ్చును ఘన జ(య) మ్మెపుడును ,
సత్య దేవుడొసగు సతము సి(రు)లు,
తే: పలుకు పూ బోడి జేయును జెలిమి (ఎ)ల్ల
కాల ము ,కుబేరు డిచ్చును గడిత చి(న్ని)
దమును, దినకరుడిడు తిన్నదనము,(య)శము
తొడరు సతతము ఘనముగ తుహినక(రు)డు
మొత్తము కలిపి చదువుకున్న “” విష్ యూ హాపి న్యూ ఇయరు డియరు ఎన్నియరు” వచ్చును
బాగున్నది.అభినందనలు!ఫేస్బుక్ కు షేర్ చేద్దామని చూస్తే మీరే పోస్ట్ చేసి ఉన్నారు.
తొలగించండిపూసపాటి వారూ,
తొలగించండినూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న మీ పద్యం బాగున్నది. అభినందనలు.
క్రొత్త యాసలు తెచ్చుచు క్రొత్త యేడు
రిప్లయితొలగించండితరలి వచ్చెను నేడు చిత్తమ్ము లెల్ల
రాగ మయమౌగ, సాలిక సాగుగాక
ప్రాప్త దుర్దిన సంహతి లుప్తమౌగ
విజయకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నైది. అభినందనలు.
గుమ్మపాలను బోలెడి క్రొత్తదారి
రిప్లయితొలగించండిధనికులైనట్టి వారి విత్తమ్ములన్ని
సంఘసౌభాగ్య గతులను సాగుచుండ
లోకమంతట నవినీతి లుప్తమగును .
బాపూజీ గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
కోడ లొండిన వంటలు క్రొత్త రుచులు
రిప్లయితొలగించండితగిన రీతిగ మెలగు నత్తమ్మ యనిన
సరస సల్లాప ములతోన సాగు నంట
లోక మందున యీవింత లుప్త మనిన
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వండిన'ను 'ఒండిన' అన్నారు. అక్కడ "కోడలే వండె వంటలు... సల్లాపములతోడ..." అనండి.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,
గురువు గారికి , మరియు కవి వర్యులకు - కవయిత్రులకు
*** నూతన సంవత్సర శుభాకాంక్షలు ***
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిధన్యవాదాలు!
మంచిని వచించుమెవ్వరి క్రొంచ పఱచ
రిప్లయితొలగించండితలచకన్, పవిత్రముగ చిత్తమును నిలిపి
సంతసముతోడ సంఘము సాగుడయ్య
రూఢిగా ప్రజలకిల మేలు సలుపుచును
క్రొత్త వత్సరమందున క్రొత్త వైన
రిప్లయితొలగించండితలపుల జనుల సేవ లుత్తమ మతిని ప్ర
శాంతితో సలుపుచు నిచ్చ సాగినపుడు
బ్రోచు పద్మనాభుడు తా పలువిదములను
సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కోరు కొన్నవి యిడుగాత! కొత్తసాలు
రిప్లయితొలగించండిమొత్త మంతయు నూడ్చియు చెత్త మరియు
చక్కనైన బాట బ్రదుకు సాగుగాత!
మేలు కలుగంగ కోపతాపాలు లేక.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ, నాల్గవ పాదాలలో ప్రాసయతిని వేసి దత్తాక్షరాలను ప్రాస స్థానంలో వేయడం సంప్రదాయం కాదనుకుంటాను.
శంకరయ్య గారు! 'త్త'మరియు 'లు' అక్షరాలు ప్రాస స్థానాల్లోలో కాక ప్రాసయతి స్థానాల్లో న్యస్థం చేసినానని నాభావన!
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండినేటి అంశము :: న్యస్తాక్షరి
యతి స్థానములలో వరుసగా *క్రొ* *త్త* *సా* *లు* అనే అక్షరాలు ఉండాలి.
సందర్భం:: ప్రకృతిలో నూతనమైన మార్పులను తెస్తూ, వసంత ఋతువుతో ప్రారంభమయ్యేదే మన సంవత్సరాది యుగాది ఉగాది. నూతన ఆంగ్ల సంవత్సరాదికి ప్రకృతిలో ఎలాంటి మార్పులూ ఉండవు. కాబట్టి ఈ రోజు నేను నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలను కోరుకొనడం లేదు. నా ఉగాది పండుగను తారాస్థాయిలో జరుపుకొంటాను. నేను విదేశీయ సంస్కృతిలోకి జారిపోను. నాలో మన భారతమాతపై అనురాగాన్ని కలిగియుండి , సారూప్యము కోరుతూ భారతీయతకు మేలు చేకూర్చేందుకు ప్రయత్నిస్తాను అని నేను నిశ్చయించుకొన్న సందర్భం.
కోరన్ నే డిల నాంగ్ల వత్సరములో *క్రొ* త్తన్, శుభాకాంక్షలన్,
తారాస్థాయి నుగాది పండుగనె చి *త్త* మ్మందు భావించెదన్,
జారన్ బోవ విదేశ సంస్కృతులకై, *సా* రూప్యమున్ గోరి, నా
లో రక్తిన్ మన భారతీయతకు మే *లు* న్ గూర్ప యత్నించెదన్.
*కోట రాజశేఖర్ నెల్లూరు.* (01.01.2017)
కోట రాజశేఖర్ గారూ,
తొలగించండినా అభిప్రాయమూ అదే. వ్యక్తిగతంగా కొన్ని సంవత్సరాలుగా నేనీ ఆంగ్ల వత్సరాది వేడుకలకు (మా మిత్రులు రమ్మన్నా వెళ్ళకుండా) దూరంగా ఉంటున్నాను. మీ అభిప్రాయాలతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను.
మీ పూరణ ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.
కొత్త కోర్కె లు కలుగ గా కొత్త యేడు
రిప్లయితొలగించండితగిన రీతగ తీర్చు నుత్త మము గాగ
సంత సంబు లు నుప్పోoగసాగు గాక
లోక మంద లి కష్టాలు లుప్త మవ గ
lok
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికోటి దేశమ్ములేకమై క్రొవ్వెలుగుల
ధరణి శాంతిని నింప , చిత్తమ్ములందు
సకలజనులును ముదమంద ., సాగి వచ్చె
లోకమునకిదే క్రొత్తసాలు శుభమనరె !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మ్రోలన్ నూతన వత్సరమ్మడుగిడెన్ క్రొవ్వెల్గులన్ జిమ్మి , యం...
తొలగించండిదాలన్ విశ్వమనోహరమ్ముగ నుదాత్తమ్మైన పర్వమ్ముగా !
చాలున్ పంతములీ ప్రపంచమొక ప్రాసాదమ్ము ! లేదెట్టి క...
ల్లోలమ్మున్ ! నిరసింపఁజూచునెడ రాలున్ శాంతిపుష్పమ్ములున్ !
కాలంబిద్దియె *క్రొత్తసాలు* నకు పల్కంగా శుభాకాంక్షలన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
రిప్లయితొలగించండికొపురు గాననెల్లరు వచ్చె కొత్త గాను
తరుణ మమ్మ జిలేబి! యిత్తరుణ మందు
సాధనల జేయ సఫలత సాధ్యమై వె
లుగును సంతోషపు దినములు యతనపడు !
నూతన వత్సర శుభాకాంక్షలతో
జిలేబి
రిప్లయితొలగించండినేటి మాట:)
కొట్టు డయ్య సాలిదియేను కొత్త దన్న,
తన్ని తరుముడు జనుల మొత్తముగ, తెలుగు
జనుల కేల ఫిరంగీల సాలయ, జను
లు కొనియాడ యుగాది పలుగు గలదయ !
జిలేబి
అదరహో జిలేబిగారూ! నేటిమాట ముత్యాల మూట!!
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అందరికీ 2018వ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండికందము:
హియరీజ్ కమింగు సీ న్యూ
ఇయరిన్ ఫ్రంటాఫ్ యు ఫ్రెండ్సు హే టెల్ గ్రీటింగ్స్
ఇయర్సు ఆర్ వైటింగ్, నో
ఫియర్సు, విష్ ఆల్ యు హ్యాపి, బెస్టిన్ ఫ్యూచర్.
తొలగించండిగోలీ వారు :)
హ్యాపీ న్యూయియ రాండీ ?
కౌపీనపు పండగండి కాదిది మనదీ :)
టాపుల్లేపెదరండీ
కోపుల పై మోత నిచ్చి కొట్టుచు జనులున్ :)
నారాయణ నారాయణ :)
జిలేబి
కోపావేశమ్ము వలదు
తొలగించండిశాపమ్ములు పెట్టవలదు శాస్త్రుల కెపుడున్
తాపములు దీర హృదిలో
దీపమ్ములు పెట్ట వలయు దినములు తరుగన్ :)
హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ ఆంగ్ల పద్యం బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు!
మూడవ పాదం మొదటి గణం జగణ మయింది?
కుసృతీభావన వీడుచున్ మనములో కొంగ్రొత్తయాసల్ నిడన్
రిప్లయితొలగించండిదశకంబైన ముదముతో ప్రజల చిత్తమ్మందు నెత్తావులన్
శశి వెన్నెలగ జల్లుచున్ వరలె ప్రాసాదంబువిప్పారుపూ
లు, సదానూతన వత్సరంబు హృదయాలుత్తేజితంబవ్వగా
శ్రీరామారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం ప్రారంభంలో గణదోషం. సవరించండి.
కవి మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు......
రిప్లయితొలగించండికోటి కోర్కెలతో వచ్చె క్రొత్త యేడు
దండిగా నిడు మనకు నుత్తమ ఫలములు
సాధితముజేయు సకల యసాధ్యములను
ప్రాప్తమౌ సుఖములు బాధ లుప్తమగుచు
🌋ఆకులశాంతిభూషణ్🌋
వనపర్తి
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సకల + అసాధ్యములు = సకలాసాధ్యములు' అవుతుంది. యడాగమం రాదు. అక్కడ "..జేయు నన్ని యసాధ్యములను" అనండి.
నిన్న గద్వాలలో మీ తండ్రిగారిని కలిసి ఆత్మీయసంభాషణ జరపడం ఆనందాన్నిచ్చింది.
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిక్రొత్త కోడలి మనసున క్రొత్త వలపు
తరలి వచ్చెను వరద చిత్తరువులగను
సార మతియును సంపద సాధు శీలి
లోక మన్నను పొo దిరి విలు ప్త మగును
వెంకట నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదంలో గణదోషం. "లోక మన్న బొందిరట విలుప్తమగును" అందామా?
పద్యంలో భావం అస్పష్టంగా ఉన్నట్టుంది.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికూర్చి శంకరాభరణము క్రొత్త రీతి
తొలగించండితరతరాల కవివర చిత్తమ్ములలర
శంకరార్యుల సాధన సాగుచుండ
లోకమంతయు సంతసాలు పడయవలె!
క్రొత్త రీతి = WhatsApp, Facebook, etc
నూతన సంవత్సరపు ఉత్తమ ఆకాంక్ష!!అభినందనలు!!
తొలగించండి🙏🙏🙏
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ ఆకాంక్ష ప్రశంసనీయం. బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
🙏🙏🙏
తొలగించండిక్రొమ్మెరుగుల గూర్చదినము క్రొత్తసాలు
రిప్లయితొలగించండిఉత్తమ గతులతోడను చిత్తమలర
శాంతి సౌభాగ్యములగూర్చు సాధనములు
లోక రక్షకుండిడగా కలుగుశుభములు!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో ప్రాసస్థానంలో కాకుండా ప్రాసగా దత్తాక్షరాన్ని వేశారు. "తగిన యుత్తమ గతుల చిత్త మలరగను" అందామా?
ధన్యవాదములు గురుదేవా! నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు!!సవరించెదను !
తొలగించండిwish you a happy new year to all
రిప్లయితొలగించండిwelcome to 2018
కొలువున్ దీర్చవె వైభవమ్ము లెసగన్ క్రొత్తైన వర్షమ్మ నీ
రిప్లయితొలగించండితలపున్ మాకు శుభమ్ములీయునటు చిత్తమ్మెల్ల రంజిల్ల బా
సలు వే దీరగజేసి జీవనములన్ సాగింపగా మాకు మే
లును గూర్పంగదె స్వాగతమ్మిదె రసాలుంచంగరాదే యికన్
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురుదేవులకు శంకరాభరణ సత్కవి మండలికి నంతర్జాల సందర్శకులకు విశ్వ జనానేకమునకు నూత నాంగ్ల వత్స రాభినందన సంయుత శుభాకాంక్షలు!!!
రిప్లయితొలగించండికువల యోదధి కింపగు గ్రొత్తరఁగ పు
డమి జనులకు విజ్ఞాన విత్త మొసఁగు నవ
సమ యరుగుదెంచెను గనుండు సాటి లేని
ద్రవిణము ససులు క్రొత్త సాలువు లొసంగు
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండితే.
రిప్లయితొలగించండికోరిన పిదప యతులను క్రొ త్త సా లు
ఉత్తమమగు పద్యముదెల్ప క్రొత్తగాను
సారమున్న మాటలు రాక సాధనమున
మేలుగ దలచి వ్రాసితి చాలుననుచు
తే.
తొలగించండికోరు కోర్కెలన్నియు దీరఁ క్రొత్త సాలు
విత్తము, సుఖము, సిరులను, నుత్తమముగ
సంపదల నీయగలదు; వేసార వలదు
లోకమున మీ యిడుములెల్ల లుప్త మగును
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కాని కొన్ని దత్తాక్షరాలను ప్రాస స్థానంలో ప్రయోగించారు.
ధన్యవాదాలు గురూజీ
తొలగించండి🙏
క్రొవ్విరు లూయ లూగగను క్రొంజివు రూయల లందు హాయిగా
రిప్లయితొలగించండిదవ్వుల బోసి పాప త త త్త య్యని పల్కుచు నాట లాడగా
జవ్వని పూలతోటను బిసాళిగ చూచుచు నూత్న వర్షమా
రువ్వుచు శోభనమ్ముల తలుక్కున రమ్మిదె స్వాగత మ్మనెన్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ ఉత్పలమాలా పూరణ బాగున్నది. అభినందనలు.
వైవిధ్యంగా పూరించాలన్న మీ ఉత్సాహం ప్రశంసింపదగినదే. కాని 'త త్త య్యని' అన్నపుడు మొదటి 'త' గురువై గణదోషం కదా! ద్విత్వం స్వతహాగా ఉచ్చరింపబడదు.
మీరన్నది నిజమే గురువుగారూ. అయితే చిన్న పిల్లలు అత్తా తాతా అనే వయసులో స్వతహాగా త తా త్త త్త త్తా అని ఉచ్చరిస్తూ ఉండడం సహజం కదా.....ఆ చిట్టి పలుకులను దృష్టిలో ఉంచుకొని అలా పూరించాను ధ్వన్యనుకరణ గా.
తొలగించండికూర్మి నభివృద్ధి రాణించె, *క్రొ*త్తనిండె
రిప్లయితొలగించండితమిని యాశల జిలుగు పొ*త్త*మ్ము వెలిగె
జగతి హర్షాంకురములు సు*సా*ధ్యమయ్యె
లోప రహితమునై విడె *లు*కలుకలను
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలు
తొలగించండిఈరోజు ఉదయం మా వృద్ధాశ్రమంలో గోపి అనే సహవాసి మరణించాడు. కొంతకాలంగా అస్వస్థుడై ఉన్నాడు. నిన్న రాత్రి "నేను రాను. నాకింకా టైముంది. పో" అని కలువరించాడట!
రిప్లయితొలగించండిమనసంతా వికలమై ఉంది. వీలైతే మీ పద్యాలను సాయంత్రం సమీక్షిస్తాను.
గురువుగారికి మరియు నితర కవిమిత్రులకు ఆంగ్ల నూతన వత్సర శుభాభినందనలు.
రిప్లయితొలగించండికోరన్ కోర్కెల దీర్చి జీవితమునన్ క్రొంగొత్త యర్థంబులన్
ధారాపాతముగా ఘటించి నిజ చిత్తస్వానుభావంబునన్
సారెన్ సారెకు భవ్య వైభవములన్ సాధించునట్లౌట యూ
రూరన్ ఖ్యాతి గలుంగ జేసి యిక మేలున్ గూర్చుమా మాకిలన్.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీకందిశంకరయ్యగురువర్యులకు కవులకు కవయిత్రులకునూతనసంవత్సరశుభాకాంక్షలు
రిప్లయితొలగించండి1.1,18.న్వస్తాక్షరి యతిలందు క్రొ,త్త.సా.లునూతనవర్శముపై
కులక జేయును చలి సరి క్రొత్తదనము
తనువు పులకించు?మంచు పెత్తనముచేత|
జనవ రొకటని సంబరాల్ సాగుటేల?
లోకులు శుభకార్యాన తేలుటయు కొరకె|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కూడి యొకచోట నీ నాడు క్రొత్త యేడు
రిప్లయితొలగించండితరలిరా - పొంగి పాడిరుత్తమ పదముల
సరస సంగీత మధురిమ సాగు గతిని
లుడుగు రీతిని గొంతుకలు పలికెనన !
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లుడుగు'...? "సాగెడి గతు। లుడుగు రీతిని..." అనండి.
రిప్లయితొలగించండిక్రొత్త ఆశలు తోవచ్చె క్రొత్త యేడు
విత్తమించుకయును లేక చిత్తమందు
సంకటంబులధికమయ్యె ..సాగుబడియు
లుప్తమవగ నింటను బుట్టె లుకలుకములు
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"క్రొత్త యాశలతో... లుప్త మగుట...లుకలుకలవె" అనండి. (లుకలుకములు అన్న ప్రయోగం లేదు).
భారతీయులనోములపంటగాను
రిప్లయితొలగించండివచ్చెబదునెనిమిదియగువత్సరమ్మ
యాయురారోగ్యసంపదలన్నియిచ్చి
కాచుగావుతమనలనుగరుణతోడ
క్రొత్తవత్సరమందలిక్రొత్తదైన
రిప్లయితొలగించండిదలపుముదమునిచ్చెనుగజిత్తమునకిపుడు
శాంతియుతముగబ్రదుకులుసాగిపోవ
బ్రోవగోరుదునిపుడుపలువిధముగను
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ నూతన సంవత్సర పద్యము, పూరణ బాగున్నవి. అభినందనలు.
గురువర్యులకు మఱియు కవి మిత్రులందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిగురువులును మిత్రులునునేడు క్రొత్త శకము
ధాటిగా దీవనలిడ చిత్తముల లోన
సాహితీ వనమ్ము లెదిగి సాధనమున
లోకములు మెచ్చ కానుకలు గొన వలయు!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
...పూజ్యగురుదేవులకు , కవిమిత్రులందరకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు....
రిప్లయితొలగించండికోర్కె లన్నియు దీర్చగ క్రొత్తగాను
ధరణి జనులకు నూత్న సత్తమములనిడి
శాంతి సౌభాగ్యములనీయ సాలువచ్చె
లోకమంతయు స్వాగతాలు బలికెనయ!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గుర్తెరుగు వత్సరమ్మిది *క్రొ*త్త దేను
రిప్లయితొలగించండిశ్రమ ఫలాపేక్ష రహిత చి*త్త*మున జేయ
సాగ నెంచుము విజయమ్ము *సా*ధ్యమగును
లోకమన్నది నచ్చు వి*లు*వల మెచ్చి
...............��శంకరాభరణం��...............
రిప్లయితొలగించండి..................����♂న్యస్తాక్షరి ����♀..............
క్రొ..త్త...సా..లు.. యతి స్థానాల్లో నిలిపి
నూతన వత్సర శుభాకాంక్షలు..
**************************************
క్రొత్త యేట కలుగుగాక క్రొత్త బలము
సమత మమతలతోడ నుత్తమముగ! నటు
సాగినప్పుడే బ్రతుకులు సార్థకములు..
రగులు పగలెల్ల ప్రేమ వెలుగుల సిగలు
మరొక పూరణము--
కోరికలు తీరి యారగా క్రొత్త యేట
తరుణ శశి శేఖరుండు చిత్తజ రిపుండు,
సాధు రక్షకుండును సారసాక్షుడు హరి
నెనరు గన క్షేమ లాభములునుఁ గలుగుత!
✒~ డా.వెలుదండ సత్యనారాయణ