31, జనవరి 2018, బుధవారం

న్యస్తాక్షరి - 50 (గ్ర-హ-ణ-ము)

అంశము - చంద్రగ్రహణము.
ఛందస్సు- తేటగీతి (లేదా) ఆటవెలది.
న్యస్తాక్షరములు... 
అన్ని పాదాల చివరి అక్షరాలు వరుసగా "గ్ర - హ - ణ - ము" ఉండాలి.

30, జనవరి 2018, మంగళవారం

సమస్య - 2583 (బూతు పురాణమ్ముఁ జదువ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"బూతు పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్"
(లేదా...)
"బూతు పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్"

29, జనవరి 2018, సోమవారం

సమస్య - 2582 (దుఃఖమే స్త్రీల కెల్లప్డు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు"
(లేదా...)
"దుఃఖమె స్త్రీల కెల్లపుడు తుష్టినిఁ బుష్టిని శాంతి నిచ్చెడిన్"

28, జనవరి 2018, ఆదివారం

గజ బంధ సీసములో శ్రీహరి ప్రార్ధన


సీ:       
పచ్చ వలువదారి! పచ్చ విలుతునయ్య! పద్మినీ వల్లభా! పద్మ గర్భ !
శ్రీనాధ!,శ్రీకరా!,శ్రీజాని!,శ్రీ వరా!,శ్రీ కాంత!,శ్రీపతి!శ్రీనివాస!
విశ్వంభర!విరించి!విరజా!విశాలాక్ష!విక్రమా!విశ్వాత్మ!విశ్వ రూప!
మధుజిత్తు!మరునయ్య! మాధవా! మాపతీ!కమలాక్ష!కపిలుడా! కంబుపాణి!
తే:      
గరుడ వాహనా! కేశవా !కైటభారి!
జన్మకీలా!జనార్ధనా! చక్ర పాణి!
అంబు జోదరా!అచ్యుతా!అజిత! రమ్ము
రమ్ము, వేగాన కుంభికి  రక్ష నిమ్ము         

చదువు పధ్ధతి : 
తొండము దగ్గ్గిర (పచ్చ )తో మొదలు బెట్టాలి  పద్మ గర్భ తర్వాత చెవి దగ్గిర  (శ్రీ ) తో కలిపి పదాలు  చదువుకోవాలి  తర్వాత వీపు  పై నున్న  (వి)  తోటి  తర్వాత వరుసగా  (మ) తోటి  (మా) తోటి  (క)తోటి పదాలు కలిపి చదువుకొని  కాళ్ళ వద్ద నుంచి మొదలుకొని  మొసలి వద్ద  గల  కాలి లో  (రక్ష నిమ్ము) తో ముగించాలి

కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 

సమస్య - 2581 (కీచకుఁ డైనట్టి గురువు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్"
(లేదా...)
"కీచకుఁ డైన సద్గురువు కీర్తి గడించు ధరిత్రిలోపలన్"

27, జనవరి 2018, శనివారం

సమస్య - 2580 (బైబిలులో ఖురానుఁ గని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"బైబిలుఁ బరికించి వ్రాసె భాగవతమ్మున్"
(లేదా...)
"బైబిలులో ఖురానుఁ గని భాగవతంబు రచించె నింపుగన్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో దమ్మన్నగారి ప్రసాద్ గారు ఇచ్చిన సమస్య)

26, జనవరి 2018, శుక్రవారం

దత్తపది - 133 (దేశము-కోశము-పాశము-నాశము)


దేశము - కోశము - పాశము - నాశము
పై పదాలను ఉపయోగిస్తూ
దేశభక్తిని ప్రబోధిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

25, జనవరి 2018, గురువారం

ఆహ్వానం!


సమస్య - 2579 (అనుమా వినుమా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్" (ఛందోగోపనము)
(లేదా...)
"అనుమా వినుమా స్తవనీయ సత్కథల్" (ఛందోగోపనము)
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో గౌరీభట్ల బాలముకుంద శర్మ గారు ఇచ్చిన సమస్య)

24, జనవరి 2018, బుధవారం

దినకర స్తుతి బంధ సీసము


సీ:
(పూ)షుడు!(స)విత! తపుడు!(పా)సి!కిరణుడు! చీక(టి)గొంగ!దివాకరుండు!
రవి!(వా)తి!మిత్రుడు!రాకుడు!రోహిత్తు!హ(రి)వాహనుడు!మంధి!హర్త!భువుడు!
పాధి!(ది)వామణి!పద్మినీ కాంతుడు!కమలాప్తుడు!(న)గుడు!కంజహితుడు!
వినుమాని(క)ము!అవి!వెలుగుల దొ(ర)!సూరి!కపి!అంశు హ(స్తు)డు!కర్మసాక్షి!
తే:
జ్యోతిషాంప(తి)!గోపతి!జ్యోతి!ఖ(ర)మ
రీచి!గగన మణి!తిమిరారి!(ధ)రణుడు!ఖ
చరుడు!కీసుడు!సత(ము )విజయము గూర్చి
జనతకు సుఖమునిచ్చును ఘనత తోడ

రధ బంధ సీసములో దినకర స్తుతి . పసుపు పచ్చ రంగు గల మధ్య నిలువు వరుస లో “పూసపాటి వారి దినకర స్తుతి రధము “ అన్న వాక్యము బంధించ బడినది (బ్రాకెట్ లో ఉన్న అక్షరములు కలిపి చదువు కోవలెను)
కవి 
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

సమస్య - 2578 (ధారణ లేనివాఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"ధారణ లేని కవియె యవధానిగ నెగడున్"
(లేదా...)
"ధారణ లేనివాఁడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో డా. వడ్డూరి ఆంజనేయులు గారు ఇచ్చిన సమస్య)

దినకర రధ బంధ సీసములో సూర్య ప్రార్ధన


కాశి! కపి! వెలుగురా! శీరకుడు! త్విట్ప
తి!సవిత! ధత్రుడు! దేవమణి! త
పనుడు! ధన్వంతరి! భానుడు! తర్షుడు!
పాధుడు! దినమణి! భాముడు! రవి!
నెలజోడు! గగనమణి! చలిదాయా! మిన్ను
మానికము! అవి! కమలధర! హరి!
కర్తారి! వినుమానికము! దిన నాధుడు!
కర్మసాక్షి! ఇనుడు! కనికరించ
వలెను, ఖమణి  కాచు కలకాలము, బలము,
ఆరోగ్యము ,యశము, అంతు లేని
సంపదల నీయవలెను, భాసంతుడు! ఉద
రది! గవాంపతి! సప్తాశ్వరధుడు, కిరణ
మాలి, నీరజ బంధుడు, మంధి, యెల్ల
కాలము  కనుపాపల వోలె గాచ వలయు.

కాకరా    అనగా సూరీడు   మధ్య గడిలో   బంధించ బడిన  పాదము
 (కాకరా  సతతము నన్ను కనికరించు)
శ్రీ వల్లభ వఝుల అప్పల నరసింహ మూర్తి గారి స్పూర్తితో...
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

23, జనవరి 2018, మంగళవారం

సమస్య - 2577 (ఖరమార్గంబున సాగుమా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"ఖరపథంబు సౌఖ్యకారకంబు"
(లేదా...)
"ఖరమార్గంబున సాగుమా కలుగు సౌఖ్యశ్రీలు నీ కెప్పుడున్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో సుశర్మ గారు ఇచ్చిన సమస్య)

22, జనవరి 2018, సోమవారం

సమస్య - 2576 (సంహారంబును జేసెదన్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"సంహరింతును జగమున శాంతి నిలుప"
(లేదా...)
"సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్"
ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో అమరవాది రాజశేఖర శర్మ (అరాశ) గారు ఇచ్చిన సమస్య

21, జనవరి 2018, ఆదివారం

సమస్య - 2575 (సర్వజ్ఞుండైనవాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"సర్వజ్ఞుండైనవాఁడు చంద్రుఁడె సుమ్మీ"
(లేదా...)
"సర్వజ్ఞుండని కీర్తిఁ బొందెను గదా చంద్రుండు సచ్ఛీలుఁడై"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో హరినాథ శర్మ గారు ఇచ్చిన సమస్య)

20, జనవరి 2018, శనివారం

దత్తపది - 132 (కన్ను-చెన్ను-పన్ను-దన్ను)

కన్ను - చెన్ను - పన్ను - దన్ను
పై పదాలను ఉపయోగిస్తూ
హనుమంతుని వర్ణిస్తూ / స్తుతిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో గిరిజారమణ శర్మ గారు ఇచ్చిన దత్తపది)

19, జనవరి 2018, శుక్రవారం

సమస్య - 2574 (కవి తలలో లేని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కవి తలలో లేని తలఁపు కైతల కెక్కెన్"
(లేదా...)
"కవి తలలేని భావములు కైతల కెక్కెఁ బ్రశంసనీయమై"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో ఘట్టి కృష్ణమూర్తి గారు ఇచ్చిన సమస్య)

18, జనవరి 2018, గురువారం

సమస్య - 2573 (పడతియె శాంతి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు"
(లేదా...)
"పడతియె శాంతిసౌఖ్యముల భంగ మొనర్పఁగఁ గారణం బగున్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో ఇచ్చిన సమస్య... కొద్ది మార్పుతో)

17, జనవరి 2018, బుధవారం

సమస్య - 2573 (రణ మాధారము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రణమే యవధానమందు రహి మంగళమౌ"
(లేదా...)
"రణ మాధారము మంగళంబు లిడఁగా రమ్యావధానంబునన్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో పోచనపెద్ది సుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన సమస్య)

16, జనవరి 2018, మంగళవారం

సమస్య - 2572 (భార్యలు మువ్వు రారతులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రామునకు మువ్వురు సతు లారతు లొసఁగిరి"
(లేదా...)
"భార్యలు మువ్వు రారతులు పట్టిరి పావన రామమూర్తికిన్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో లలితా పరమేశ్వరి గారు ఇచ్చిన సమస్య)

15, జనవరి 2018, సోమవారం

సమస్య - 2571 (రాఘవ నీ కుఠారమును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రాఘవా నీ కుఠారమున్ బ్రస్తుతింతు"
(లేదా...)
"రాఘవ నీ కుఠారమును బ్రార్థనఁ జేసెద నిష్టసిద్ధికిన్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో ఆముదాల మురళి గారు ఇచ్చిన సమస్య)

14, జనవరి 2018, ఆదివారం

నిషిద్ధాక్షరి - 40


కవిమిత్రులారా,
అంశము - సంక్రాంతి సంబరములు
నిషిద్ధాక్షరములు - శ-ష-స.
ఛందస్సు - మీ ఇష్టము.

13, జనవరి 2018, శనివారం

సమస్య - 2570 (హరి తత్వమ్మును మెచ్చి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"నాస్తికుఁడు హరితత్వము నమ్మి మురిసె"
(లేదా...)
"హరి తత్వమ్మును మెచ్చి నాస్తికుఁడు బ్రహ్మానందమున్ జెందెరా"
(శతావధానంలో గుండు మధుసూదన్ గారు అడిగిన నరాల రామారెడ్డి గారి సమస్య)

12, జనవరి 2018, శుక్రవారం

సమస్య - 2569 (చోరుఁడు పూజ్యుఁడాయె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"చోరుండే పూజ్యుఁడయ్యెఁ జోద్యము గాదే"
(లేదా...)
"చోరుఁడె పూజ్యుఁడాయెఁ గద చోద్యముగాగ నిలాతలంబునన్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో పి. సరళ గారు ఇచ్చిన సమస్య)

11, జనవరి 2018, గురువారం

సమస్య - 2568 (మాన్యుఁడు గానివాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్"
(లేదా...)
"మాన్యుఁడు గానివాఁడు సభ మన్నన లందె నదేమి చిత్రమో"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో రామమోహన శర్మ గారు ఇచ్చిన సమస్య)

10, జనవరి 2018, బుధవారం

నా రాజమండ్రి ప్రయాణం....

ఈరోజు రాజమండ్రికి బయలుదేరుతున్నాను. 
రేపు కీ.శే. శ్రీ కెంబాయి తిమ్మాజీ రావు గారి ద్వాదశదిన కర్మలో పాల్గొంటాను. 
ఎల్లుండి ద్రాక్షారామం, పిఠాపురం దేవాలయాలను దర్శించుకొని ఆరాత్రి రాజమండ్రిలో రైలెక్కి తిరుగుప్రయాణం.
కవిమిత్రు లెవరినైనా కలిసే అవకాశం ఉందా?

దత్తపది - 131 (నిండుగ-పండుగ-మెండుగ-దండిగ)

నిండుగ - పండుగ - మెండుగ - దండిగ
పై పదాలను ఉపయోగిస్తూ
అవధాన వైభవాన్ని వివరిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో రమాదేవి గారు ఇచ్చిన దత్తపది)

9, జనవరి 2018, మంగళవారం

సమస్య - 2567 (తర్షము దీరలేదు గద...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"తర్షమది తీరదఁట త్రాగ ద్రాక్ష రసము"
(లేదా...)
"తర్షము దీరలేదు గద ద్రాక్ష రసమ్మును ద్రాగి చూచినన్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో సామ లక్ష్మారెడ్డి గారు ఇచ్చిన సమస్య)

8, జనవరి 2018, సోమవారం

సమస్య - 2566 (దుఃఖ మెఱిఁగినవానికే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు"
(లేదా...)
"దుఃఖ మెఱుంగువానికె యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో ప్రమోద్ కుమార్ గారు ఇచ్చిన సమస్య)

7, జనవరి 2018, ఆదివారం

సమస్య - 2565 (పద్యము వ్రాయువాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పద్యమ్మును వ్రాయువాఁడు పాతకమందున్"
(లేదా...)
"పద్యము వ్రాయువాఁడు చెడి పాతక మందును సత్కవీశ్వరా"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో మద్దూరి రామమూర్తి గారు ఇచ్చిన సమస్య)

6, జనవరి 2018, శనివారం

సమస్య - 2564 (భాగవతంబు వ్రాసె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"భాగవతమును నన్నయభట్టు వ్రాసె"
(లేదా...)
"భాగవతంబు వ్రాసె నల ప్రాజ్ఞుఁడు నన్నయభట్టు తెన్గునన్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో ఓంప్రకాశ్ గారు ఇచ్చిన సమస్య)

5, జనవరి 2018, శుక్రవారం

ఆహ్వానం!

నమస్కారం,
మా నాన్నగారైన శ్రీ కెంబాయి వెంకట తిమ్మాజీరావు గారు 31.12.2017 సాయంత్రం 6.30 నిమిషములకు స్వర్గస్తులైనారు. తదుపరి కార్యక్రమములు అనగా ధర్మోదకాలు, వైకుంఠ సమారాధనలు, 9.1.2018 మరియు 11.1.2018 న రాజమండ్రి లోని కంభాలవారి సత్రము, గోదావరి గట్టున   జరుపబడును.  
ఇట్లు 
భవదీయులు,
కెంబాయి శ్రీనివాసరావు, ఉమారాణి , 
కెంబాయి వెంకట రామారావు, శశికుమారి 
9441285627 
9963614449 
9868060638

దత్తపది - 130 (నది-మది-పది-గది)

నది - మది - పది - గది
పై పదాలను ఉపయోగిస్తూ
గురుశిష్య సంబంధాన్ని వివరిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో శివరామకృష్ణ గారు ఇచ్చిన దత్తపది)

4, జనవరి 2018, గురువారం

సమస్య - 2563 (రుచిమంతంబగు కోడిమాంసము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కోడిమాంసమ్ము హితము యోగులకుఁ దినఁగ"
(లేదా...)
"రుచిమంతంబగు కోడిమాంసమది యారోగ్యంబు సన్యాసికిన్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో మింగవరపు పవన్ కుమార్ గారు ఇచ్చిన సమస్య)

3, జనవరి 2018, బుధవారం

సమస్య - 2562 (కన్నవారి కన్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కన్నవారి కన్న ఖలులు గలరె"
(లేదా...)
"కన్నవారి కన్న ఖలులు గలరె వెదకి చూచినన్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో కౌండిన్య తిలక్ గారు ఇచ్చిన సమస్య)

2, జనవరి 2018, మంగళవారం

విషాద వార్త!


శ్రీ కెంబాయి తిమ్మాజీ రావు గారి అస్తమయం!

అబ్బరాజు వెంకట రమణ గారు మెసెంజరులో పంపిన సందేశం.....
"శంకరాభరణం గ్రూపు సభ్యులు శ్రీ కెంబాయి తిమ్మాజీరావుగారు నిన్న 31 12 2017 న ఢిల్లీలో స్వర్గస్తులైనారాని చింతించుతూ తెలియచేస్తున్నాను. భార్యావియోగమై వారిని చూడటానికి వెళ్ళి వారి సాహిత్యాభిలాష చూసి వారిని ఇటుపై మళ్ళించటం వారు తమ సమయాన్ని మీతో మీ బ్లాగుతో ఆనందంగా గడపటం జరిగింది."
కవిమిత్రులారా!
శ్రీ కెంబాయి తిమ్మాజీ రావు గారు మన బ్లాగు మిత్రుల్లో వయస్సులో చాలా పెద్దవారు. తొంభై యేళ్ళకు పైబడినవారు. వారు నన్ను "గురువు గారూ!" అని సంబోధించినప్పుడల్లా ఏదో అపరాధభావం నాలో పొడసూపేది.
తమ అద్భుతమైన పూరణలతో మనలను ఇంతకాలం అలరింపజేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళారు. వివాదాలకు దూరంగా ఉండే సౌజన్యమూర్తి వారు.
శంకరాభరణం బ్లాగు ఒక ఆత్మీయుణ్ణి కోల్పోయింది.
వారి ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చుగాక!

సమస్య - 2561 (రావణుఁ బెండ్లియాడినది...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రావణునిఁ బెండ్లియాడె ధరాతనూజ"
(లేదా...)
"రావణుఁ బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో పులికొండ సుబ్బాచారి గారు ఇచ్చిన సమస్య)

1, జనవరి 2018, సోమవారం

న్యస్తాక్షరి - 49 (క్రొ-త్త-సా-లు)

అంశము - నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఛందస్సు- మీ యిష్టం.
న్యస్తాక్షరములు... 
అన్ని పాదాల యతిస్థానాలలో వరుసగా "క్రొ - త్త - సా - లు" ఉండాలి.
(ఈ నియమంతో ఆటవెలది, చంపకోత్పలమాలలు వ్రాయడం కుదరదని గమనించండి)