చాలా బాగుంది సార్, ఒక సందేహం. రాఘవుడనగా రఘుకుల తిలకుడు అని వ్యుత్పత్యర్ధం కలదు. మరి జామదగ్ని రాఘవుడెలా అవుతాడు. కాలక్రమణికను అనుసరించి చూస్తే, పరశురాముడు రఘుమహారాజు కన్నా పూర్వజుడు. సాధారణంగా చిన్నవారి పేరు ఎంత గొప్పదైనా, పెద్దవారి పేరు తొనే పిలుస్తారు. ఉదా:- గంగ సుతుడు గాంగేయుడు, రాముని సోదరుడు రామానుజుడు, కుంతీ సుతుడు కౌంతెయుడు. ఎక్కడా కూడా చిన్నవారి పేరు తో పెద్దవారిని పిలవటం జరగలేదు. ఒకసారి వివరించండి.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2571 సమస్య :: *రాఘవ నీ కుఠారమును ప్రార్థన జేసెద నిష్ట సిద్ధికిన్.* ఓ రామా! నా కోరికలు సిద్ధించేందుకు నీ గొడ్డలిని శరణు వేడుతున్నాను అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధార్థం. సందర్భం :: ఓ రఘురామా! నీ నామాన్ని పరమ శివుడు జపిస్తూ ఉంటాడు. నీ నామము రమ్యము పవిత్రము పుణ్యప్రదము అయి విరాజిల్లే మంత్రము. ఘోరమైన పాపము అనే అడవిని గొడ్డలివలె నరికివేయగలిగినది. కాబట్టి నా కోరికలు సిద్ధించేందుకోసం నీ నామాన్ని శరణు వేడుతున్నాను అని శ్రీరామ భక్తుడు పలికే సందర్భం.
శ్రీరామారావు గారూ, మీ పద్యం బాగున్నది. కాని పూరణ సమర్థమైనట్లు లేదు. 'శ్రోణి' ఏ అర్థంలో ప్రయోగించారు? "రీతిని విలాసములందున నాశ్రయించగా" అనండి. 'నీ చెట్టు' అంటే?
ఇంద్ర నందనుండైన కాకి సీతను బాధించి రామ విముక్త బ్రహ్మాస్త్ర విద్రావితుఁడై తిరిగి వచ్చి రాముని వేఁడుకొను సందర్భము:
ఈ ఘన శీల భాసితను నివ్వసు ధాత్మజ జానకీ సతిన్ శ్లాఘన యుక్త కాంతను నసహ్యపు రీతినిఁ జీరితిన్ మహా మోఘము నీదు శక్తి కన మూర్ఖు క్షమింపుమ, నేర కిచ్చితిన్ రాఘవ నీకు ఠార మును, బ్రార్థనఁ జేసెద నిష్టసిద్ధికిన్
శ్రీహర్ష గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'రామనిన్'? ***** భాస్కరమ్మ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** కామేశ్వర రావు గారూ, మీ రెండు పూరణలు అత్యద్భుతంగా ఉన్నవి. అభినందనలు. ***** వెంకట రాజారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** వరప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మిస్సన్న గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. ***** సహదేవుడు గారూ, మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు. ***** గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు. ***** జనార్దన రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సీతాదేవి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా రెండవ పూరణలో విరుపు ప్రశంసనీయం. అభినందనలు. "నామమే యార్తి బాప" అనండి. 'రావణాసుర పరాజిత' అంటే రావణాసురునిచే ఓడింపబడినవాడు అన్న అర్థం వస్తుంది. ***** చేపూరి వారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'క్షత్రియులే' అన్నపుడు 'క్ష' గురువై గణదోషం. సమాసంలో ఉత్తరపదాద్యక్షరం రేఫసంయుక్తమైనపుడు పూర్వపదాంతాక్షరం లఘువు కాని, గురువు కాని అవుతుంది. పదం మధ్యలో ఉంటే కాదు. ***** డా. ఉమాదేవి గారూ, మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు. "నామ మిలను..." అనండి. మూడవ పూరణ మూడవ పాదంలో గణదోషం. "భవబంధముల నెల్ల" అనండి. ***** సహదేవుడు గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
.............సమస్య రాఘవా! నీ కుఠారమున్ ప్రస్తుతింతు ============================== సందర్భం: రామ చంద్రా! పరశురాముని పరశువు(గండ్రగొడ్డలి) క్షత్రియు లనే వనాన్ని మాత్రమే నరికివేసింది. నీ పరశువు మాత్రం రాక్షసు లనే వృక్షాలను ఛేదించడమే కాకుండా లంకా పుర మనే వనాన్ని కూడ దహనం చేసింది. భార్గవ రాముని గొడ్డలికి ప్రాణ ముందో లేదో గాని నీ పరశువు మాత్రం ప్రాణం కలిగినది సుమా! అంతే కాదు. లోక మంతటికీ ప్రాణం పోసే ప్రా ణదేవుడే తానై వుంది. ఇంతకూ రామ ప్రభూ! నీ పరశువు ఏది అంటావా! *ఆంజనేయ స్వామియే!* ఆ పరశువుకు తనంతతాను నిర్ణయం తీసుకొనే శక్తి కూడ వుంది మరి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ పరశురామునిదైన పరశువు క్షత్రియ వనమును ఛేదించి వాసి గాంచె- నీదైన పరశు వౌరా దనుజ మహీజ ఛేదనంబును నొనర్చినది గాక స్వర్ణ లంకా పుర వనమును సైతము చేసి మించెనట భస్మీపటలము భార్గవ రాముని పరశువు ప్రాణంబు కలిగినదో కాదొ! కాని నీదు పరశువు కున్నది ప్రాణంబు, ప్రాణమే నా! ప్రాణ దేవుడైనదియు తానె-
పరశురామ సమాన! నీ పరశు వనగ పవన సుతు డొప్పు, ధర్మ నిర్వహణమందు స్వీయ నిర్ణయాత్మక బుద్ధిచేత నలరు- రాఘవా! నీ కుఠారమున్ బ్రస్తుతింతు
వచనం వ్రాసే అలవాటు ఉంది. కవనాన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేసుకుంటున్నాను.ఈ చందనవనానికి వచ్చానుగా. ఛందమూ వస్తుంది. అందాకా ఇలాగే మాటసాయమివ్వండి. ధన్యవాదాలు....
నిన్ను దలచగ పాపముల్ మన్నునంటు
రిప్లయితొలగించండినీదు నామమె గొడ్డలి నిజముగాను
నన్ను బ్రోవుము! మ్రొక్కెద పన్నుగాను...
రాఘవా నీ కుఠారమున్ బ్రస్తుతింతు!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిపాపసమూహానికి కుఠారమైన రామనామాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
తొలగించండిశతావధాని జి. మెట్టురామ శర్మ గారి పూరణ....
రిప్లయితొలగించండిలాఘవ మొప్ప తాటకను లాస్యపు టాస్యముతోడఁ గూల్చితే
యా ఘన రావణాసురుని నగ్నిమదస్త్రముతోడఁ గాల్చితే
రాఘవ! నీదు బాణము కరమ్ము ప్రశస్తము గాదె భూరి ఘో
రాఘ వనీ కుఠారమును ప్రార్థనఁ జేసెద నిష్టసిద్ధికిన్.
రిప్లయితొలగించండిఅంఘ్రి పంబున నినుకొని యాడు పక్షు
ల కిలకిలలకు కొదవగలదయ ?నేటి
హరిమలన్ శ్యామలీయమై యలరుచుండె!
రాఘవా నీ కుఠారమున్ బ్రస్తుతింతు!
కుఠారము - చెట్టు
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమన్నించాలి... మీ పూరణ అర్థం కాలేదు.
హరిమల, శ్యామలీయము...?
తొలగించండికూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం;
నేటి కాలం లో మన శ్యామలీయమై పంచ దశ లోక అంఘ్రిపంబున రామనామ మధురాక్షరాన్ని జపిస్తున్నారు. రాఘవా నీ కుఠారమున్ బ్రస్తుతింతు!
జిలేబి
బాగుంది. _/\_
తొలగించండిజోలేబీ గారూ, ఇక్కడ శంకరాభరణంలో శ్యామలీయం ప్రస్తావన దేనికండీ, భలేవారే. పద్యంలో ఆన్వయం సంగతి అటుంచి అసలు శ్యామలీయం ఏమిటో శంకరాభరణవిహరణశీలకవీంద్ర లోకానికి ఏమీ బోధపడదు కదా. ఇక్కడివారిలో శ్యామలీయం ముఖం చూసేవారే ఆరుదు కదా. మీరుతప్ప మరెవరూ ఉండకపోవచ్చును.
తొలగించండినీదు కార్యమున్నెరవేర్చు నెపము తోడ
రిప్లయితొలగించండిలంక కేగి నచ్చోట తా లలన గాంచి
దనుజ రాశిని దునుమాడె హనుమ యతడె
రాఘవా నీ కుఠారమున్ బ్రస్తుతింతు
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"లంక కేగి యచ్చోట..." అనండి.
(దశరధుడు రాముని కరుణించమని పరశురామునితో)
రిప్లయితొలగించండిచతురఘనకీర్తి! శితికంఠఛాత్రమూర్తి!
శమితదుర్గర్వరాజేంద్రశత్రుహారి!
జ్వలిత జమదగ్ని పుత్రక! జయము! ప్రణత
రాఘవా! నీ కుఠారమున్ బ్రస్తుతింతు.
బాపూజీ గారూ,
తొలగించండి"ప్రణత రాఘవా!" అంటూ మనోహరమైన పూరణ చెప్పారు. అభినందనలు.
కంది వారు ఉవాచ:
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
ఈ పూరణను చదువగానే సమూహంలో పోస్ట్ చేయాలనుకున్నాను. ఆ పని మీరు చేశారు.
ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిజయము ప్రణత రాఘవా ! అని పరశురాముని కీర్తించడం చాలా బాగుందండీ. శ్రీ బాపూజీ గారూ! ప్రణామాలు. కోట రాజశేఖర్
తొలగించండిచంద్రమౌళి సూర్యనారాయణ గారు ఉవాచ:
తొలగించండిప్రణత రాఘవా! వాహ్..👌👌🙏🏻🙏🏻
మైలవరపు వారు ఉవాచ:
తొలగించండిచక్కని... చిక్కని... సందర్భశుద్ధి.. ధారాశుద్ధి... నిండిన పద్యరత్నం... శ్రీమాన్ జె జె కె బాపూజీ గారికి నమోవాకములు..🙏🙏
మురళీకృష్ణ
శ్రీహర్ష గారు ఉవాచ:
తొలగించండిఅనన్యసామాన్యము🙏
కవిమిత్రులకు పేరుపేరున కృతజ్ఞతాంజలి .
తొలగించండిచాలా బాగుంది సార్, ఒక సందేహం. రాఘవుడనగా రఘుకుల తిలకుడు అని వ్యుత్పత్యర్ధం కలదు. మరి జామదగ్ని రాఘవుడెలా అవుతాడు.
తొలగించండికాలక్రమణికను అనుసరించి చూస్తే, పరశురాముడు రఘుమహారాజు కన్నా పూర్వజుడు.
సాధారణంగా చిన్నవారి పేరు ఎంత గొప్పదైనా, పెద్దవారి పేరు తొనే పిలుస్తారు. ఉదా:- గంగ సుతుడు గాంగేయుడు, రాముని సోదరుడు రామానుజుడు, కుంతీ సుతుడు కౌంతెయుడు. ఎక్కడా కూడా చిన్నవారి పేరు తో పెద్దవారిని పిలవటం జరగలేదు. ఒకసారి వివరించండి.
మాయ లేడని దెలియని మైక మేమొ
రిప్లయితొలగించండిమోస మెరిగిన తదుపరి రోస మంది
రావ ణుతలలు నరికిన రాజు వయ్య
రాఘవా నీ కుఠారమున్ బ్రస్తు తింతు
కుఠారము = గండ్ర గొడ్డలి , చెట్టు .....ఇంక...ఇంకా
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఘోర కిల్బిష విపిన కుఠారమనుచు
రిప్లయితొలగించండిపావని హృదయ నిర్గత స్వరమటంచు
నీదు పావన నామమై నిలిచి నట్టి
రాఘవా నీ కుఠారమున్ బ్రస్తుతింతు
విజయకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కిల్బిష విపిన కుఠారము , పావని హృదయ నిర్గత స్వరము అంటూ రామనామాన్ని ప్రశంసిస్తూ మీరు చేసిన పూరణ మనోజ్ఞమండీ అవధాని విజయకుమార్ గారూ! ప్రణామాలు. కోట రాజశేఖర్
తొలగించండిశ్రీ శంకరయ్య గారికి, శ్రీ రాజశేఖరావధానులకు నా నమోవాకములు
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2571
సమస్య :: *రాఘవ నీ కుఠారమును ప్రార్థన జేసెద నిష్ట సిద్ధికిన్.*
ఓ రామా! నా కోరికలు సిద్ధించేందుకు నీ గొడ్డలిని శరణు వేడుతున్నాను అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధార్థం.
సందర్భం :: ఓ రఘురామా! నీ నామాన్ని పరమ శివుడు జపిస్తూ ఉంటాడు. నీ నామము రమ్యము పవిత్రము పుణ్యప్రదము అయి విరాజిల్లే మంత్రము. ఘోరమైన పాపము అనే అడవిని గొడ్డలివలె నరికివేయగలిగినది. కాబట్టి నా కోరికలు సిద్ధించేందుకోసం నీ నామాన్ని శరణు వేడుతున్నాను అని శ్రీరామ భక్తుడు పలికే సందర్భం.
హే ఘన నీలదేహ ! స్మరియించు మహేశుడు నీదు నామమున్,
రాఘవ ! నీదు నామము విరాజిలు మంత్రము , పావనమ్ము ధీ
రా! ఘన పుణ్యదాయకము , రమ్యమునౌ స్మరియింతు దాని , ఘో
*రా ఘ వనీ కుఠారమును ప్రార్థన జేసెద నిష్ట సిద్ధికిన్.*
*కోట రాజశేఖర్ నెల్లూరు.* (15.01.2018)
కోట రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
మహేశుడే స్మరియించు పావన పుణ్యదాయక మంత్రంగా రామ నామాన్ని అభివర్ణించిన తీరు మనోజ్ఞం! అద్భుత పూరణ! అభినందనలు శ్రీ రాజశేఖర్ గారూ!
తొలగించండివనవాసములో సీత రామునితో మాట్లాడుతున్న సందర్భము
రిప్లయితొలగించండిఈఘవ శ్రోణిపైప్రకృతినింపుగ మీవనవాసమందునన్
మేఘములావరించెను సమీపముగా చిరు వర్షధారలన్
లాఘవమైనరీతినవిలాసము లందున యాశ్రయించగా
రాఘవ!నీకుఠీరమును బ్రార్ధన జేసెద నిష్టసిద్దికిన్
కుఠారము=చెట్టు
ఈఘనశ్రోణి టైపాటు
రిప్లయితొలగించండిశ్రీరామారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. కాని పూరణ సమర్థమైనట్లు లేదు.
'శ్రోణి' ఏ అర్థంలో ప్రయోగించారు? "రీతిని విలాసములందున నాశ్రయించగా" అనండి. 'నీ చెట్టు' అంటే?
ఈ ఘనశ్రోణి=ఈ భూమి
తొలగించండినీ చెట్టు=ఈ చెట్టు
వర్షం కురుస్తోంది.ఆచెట్టుక్రిందకు వెళ్దాం పద యన్న అర్దంతో రాశాను
ఈ ఘనశ్రోణి=ఈ భూమి
తొలగించండినీ చెట్టు=ఈ చెట్టు
వర్షం కురుస్తోంది.ఆచెట్టుక్రిందకు వెళ్దాం పద యన్న అర్దంతో రాశాను
కవి మిత్రులకు గురువులకు సంక్రమణసుభా కాంక్షలు
రిప్లయితొలగించండికాలి గోరన గొడ్డలే!కత్తరించె
శిలను!శాపముబాపెను!తలచ వింత !
రాఘవా నీకుఠారమున్ బ్రస్తు తింతు
కష్ట నష్టాలు గరిగించు కర్మ బాపు
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాదుదైవంబు లోకేశుడాదిగురువు
రిప్లయితొలగించండిహరుని విల్లంబు విరిచినావటగ నీవు
నిన్ను శిక్షించి పలికింతునీదునోట
రాఘవా! "నీ కుఠారమున్ బ్రస్తుతింతు"
నాదుదైవంబు లోకేశుడాదిగురువు
తొలగించండిహరుని విల్లును విరిచినావటగ నీవు
నిన్ను శిక్షించి పలికింతునీదునోట
రాఘవా! "నీ కుఠారమున్ బ్రస్తుతింతు"
సూర్యనారాయణ గారూ,
తొలగించండిపరశురాముడు రాముని నోట స్వకుఠారస్తుతి చేయిస్తానన్న మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
లాఘవ మొ ప్ప్గరావణుడు లంకకు గైకొని పోయె జానకి న్
రిప్లయితొలగించండిరాఘవుడా జి లో దునిమె రావణున య్యే డ గాంచి రాముని న్
మేఘ సువర్ణ కాంతుల ను మించె డు విష్ణు వు గాగ ప ల్కేనో
రాఘవ నీ కు కు ఠార మును బ్రార్థన జేసె ద నిష్ట సిద్దికి న్
నాలుగవ పాదము లో కు అదనoగా పడింది మన్నించమనవి
తొలగించండిరెండవ పాదము లో రావణుడయ్యేడ గాంచి అని చదవాలి
తొలగించండిరాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీరు 'కుఠారము' శబ్దాన్ని ఏ అర్థంతో ప్రయోగించారు?
గొడ్డలి అర్థం తోనే ప్రయోగము చేశా నండి
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిదుష్ట రాట్చక్ర గర్వ విదూరకమ్ము ! ధర్మసంస్థాపనమున సుదర్శనమ్ము !
భృగుకులోద్భవ ! ధీరవరగుణ తుల్య
రాఘవా ! నీ కుఠారమున్ ప్రస్తుతింతు !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మాఘవరూపమందు పవి ., మాధవ రూపమునన్ సుదర్శనం...
తొలగించండిబౌ ఘనమౌ త్రిశూలము మహాశివరూపమునందు ., విల్లగున్
రాఘవరూపమందు., భృగురామునికౌను కుఠారమద్ది , దు....
ష్టౌఘుల ద్రుంచు , పేళ్ళు గననన్యములయ్యును వస్తువొక్కటే !
రాఘవ ! నీ కుఠారమును బ్రార్థనఁ జేసెద నిష్టసిద్ధికిన్ !.
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
మందిరమొక శాఖగ వృక్షమలర, వెలసె
రిప్లయితొలగించండినీ గుడిప్రతి గ్రామములోన, నిష్ఠగాను
జనులు పక్షికూతల వోలె జపము చేయ
"రాఘవా! నీ కుఠారమున్ బ్రస్తుతింతు"
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జామదగ్ని !నీకు సముడు రాముడొకడె !
రిప్లయితొలగించండికనగ నాశ్చర్య మౌను నీ కార్య దీక్ష !
యనఘ !యాదిశేషుడు చాల డభినుతింప!
సాహసమున పావని ! మఱి శౌర్యమందు
రాఘవా ! నీ కుఠారమున్ బ్రస్తుతింతు !
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పరశురామ స్తుతి రూపమైన పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పరమ వీర శూర హనుమ పరశువు వలె
రిప్లయితొలగించండిసురవిరోధ గణమ్మును నరికివేసి
చక్కబెట్టె నీ కార్యము చక్కగాను
రాఘవా నీకుఠారమున్ బ్రస్తుతింతు
🌿🌿 🌿ఆకుల శాంతి భూషణ్ 🌺
వనపర్తి
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిజాఘనిరాయుడున్ కలిసె జానకి రాముని లక్ష్మణున్ సదా
శ్లాఘము జేయగన్నతని చల్లని రూక్షపు నీడలో! భళా
రే! ఘన కీర్తి నెల్ల నిల రేబవలున్కొనియాడ గన్ ప్రభో
రాఘవ! నీ కుఠారమును బ్రార్థనఁ జేసెద నిష్టసిద్ధికిన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని రూక్షపు చూపు చల్లగా ఎలా ఉంటుంది?
తొలగించండిరూక్షపు నీడ చల్లగా వుంటుందని :) చూపు ఎట్లా వుంటుందో తెలియదండి :)
జిలేబి
మేఘుని వర్ణమందునను మేధినిపై జనియింఛి నాడ వో
రిప్లయితొలగించండిరాఘవ పేదవారలకు త్రాణముఁ గూర్చగ, నీదుపొందు రా
మా! ఘటియించు మోక్షమును, మాధవ! నిత్యము నీదు నామ, ఘో
రాఘ వనీ కుఠారమును, బ్రార్థనఁ జేసెద నిష్టసిద్ధికిన్
“నామ ఘోరాఘ వనీ కుఠారమును” అద్భుతమైన ప్రయోగము! రెడ్డి గారు అభినందనలు, నమస్సులు.
తొలగించండిపెద్దలు కామేశ్వరరావు గారికి నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండిఅన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
"మాధవ నీ శుభ నామ మిద్ది, ఘో।రాఘ..." అంటే అన్వయం బాగుంటుందని సూచన.
గురువర్యుల సవరణకు ధన్యవాదములు.నమస్సులు.
తొలగించండినీ ఘన నామమద్ది భవ నీధ్రము ద్రెంచు కుఠారధారనిన్
రిప్లయితొలగించండిరాఘవ!చేతబట్టితిని రాత్రిబవళ్ళును రామ,రామనిన్
మోఘము జేయకీశ్రమను మోక్షమునీయగ వేగరావయా
రాఘవ నీ కుఠారమును బ్రార్థనఁ జేసెద నిష్టసిద్ధికిన్
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
వే ఘనమైనరీతిసతివేడుకచేరగవెంటనంటి తా
రిప్లయితొలగించండినాఘనుడైనలక్ష్మణుడునవ్విధిరాగనుకానకేగవే,
వేఘనులైనపార్ధివులవిక్రమమొప్పగాసంహరించదే
*రా ఘ వ,నీ కుఠారమును ప్రార్థన జేసెద నిష్ట సిద్ధికిన్.*
చెట్టుచాటునదాగియాచెనటియైన
రిప్లయితొలగించండివాలినొకబాణముననేలవాలజేసి
ధర్మమునునిల్పినాడవుధరణియందు
రాఘవా నీకుఠారమున్ బ్రస్తుతింతు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాజ లోకము నెల్ల ధరణి నిరువది
తొలగించండియొక్క మారులు సంపిన యోధ! పరశు
రామ! భూసుర! భార్గవ రామ! విదిత
రాఘవా! నీ కుఠారమున్ బ్రస్తుతింతు
[విదిత రాఘవ = తెలియఁబడిన (విష్ణువని) రాముఁడు కలవాఁడు: పరశు రాముఁడు]
ఇంద్ర నందనుండైన కాకి సీతను బాధించి రామ విముక్త బ్రహ్మాస్త్ర విద్రావితుఁడై తిరిగి వచ్చి రాముని వేఁడుకొను సందర్భము:
ఈ ఘన శీల భాసితను నివ్వసు ధాత్మజ జానకీ సతిన్
శ్లాఘన యుక్త కాంతను నసహ్యపు రీతినిఁ జీరితిన్ మహా
మోఘము నీదు శక్తి కన మూర్ఖు క్షమింపుమ, నేర కిచ్చితిన్
రాఘవ నీకు ఠార మును, బ్రార్థనఁ జేసెద నిష్టసిద్ధికిన్
[ఠారు = ఆకస్మికమైన దెబ్బ; మును = పూర్వము]
న భూతో..., అయ్యా నమశ్శతములు.
తొలగించండిఆర్యా! యధావిధిగా మీకు మీరే సాటి! 🙏🙏🙏🙏🙏🙏🙏
తొలగించండియథావిధిగా!🙏🙏🙏
తొలగించండిశ్రీ మిస్సన్న గారికి, డా. సీతా దేవి గారికి నమస్సులు, ధన్యవాదములు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికార్తవీర్యుని కరములు కత్తిరించ
తీక్ష్ణమౌ వాడి నడరిన దివ్య హేతి
నాని చెలగిన భార్గవా! యజుడవైన
రాఘవా! నీకుఠారము బ్రస్తుతింతు
కవివరులకు మరియు బ్లాగు వీక్షకులకు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలతో..
రిప్లయితొలగించండి==========***=======
రాక్షసతతిని భువిపైన రట్టు జేసి
సాధు సజ్జనావళికెల్ల సంతసమ్ము
లిచ్చి శ్రీకరమ్ముగ నిల్చు నినకులవర!
రాఘవ!నీ కుఠారమున్ బ్రస్తుతింతు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినీఘన వంశవృక్షమును నెమ్మది నెంతు నుతింతు భక్తి
రిప్లయితొలగించండిఘో
రాఘములన్ దహించెడి భవాఖ్యకు దీటు మహానుభావమున్
మోఘుల పుట్టువెన్నని యమోఘ చరిత్రము సాధువృత్తమున్
రాఘవ నీ కుఠారమును బ్రార్థనఁ జేసెద నిష్టసిద్ధికిన్.
కుఠారము = వృక్షము
నాడు లంకపై దండెత్త నడచిపోవ
రిప్లయితొలగించండిశిలల పరశువుగన్ జేసి నలల నరికి
కడలిపై నీదు నామమ్మె గట్టు వైచె
రాఘవా! నీ కుఠారమున్ బ్రస్తుతింతు!!
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
రాఘవ ! కోసలేంద్ర ! రఘురామ ! పయోరుహమిత్ర వంశ వీ
రా ! ఘన నీలదేహ రుచిరా ! ప్రభు ! రాక్షస తప్త లోహ కా
యోఘన మాన ! సన్నుత మహోన్నత సద్గుణ రూప ! దేవ ! ఘో
రాఘ వనీ కుఠార ! మును ప్రార్థన జేసితి నిష్టసిధ్ధికై ! !
{ తప్త లోహకము = వేడి చేసిన ఇనుము ; అయోఘనము =
సమ్మెట ; రాక్షస తప్త లోహక + అయోఘన మాన = రాక్షసు డను
వేడిచేసిన ఇనుము నకు సమ్మెట తో సమాన మైన వాడు }
ఆ ఘనుడైన రాఘవుడె యాలమునన్ చెల రేగినట్టులే
రిప్లయితొలగించండిలాఘవ మొప్పగన్ పరశురామ !ప్రలాపము లేక ద్రుంచితే!
యోఘన బార్గవా!ఖలులు నోటమి జెందగ;శౌర్యమందునన్
"రాఘవ నీ కుఠారమును బ్రార్థనఁ జేసెద నిష్టసిద్ధికిన్"
(ఖలులున్ + ఓటమి ? ; ఖలులు యోటమి ?)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీకోటరాజశేఖరుల వారి సూచనతో
రిప్లయితొలగించండిసవరించిన పూరణ :
తేటగీతి
నాడు లంకపై దండెత్త నడచిపోవ
శిలల పరశువులుగ జేసి యలల నరికి
కడలిపై నీదు నామమ్మె గట్టు వైచె
రాఘవా! నీ కుఠారమున్ బ్రస్తుతింతు!!
శ్రీహర్ష గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రామనిన్'?
*****
భాస్కరమ్మ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అత్యద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
*****
వెంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
*****
సహదేవుడు గారూ,
మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
*****
గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
*****
జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కీర్తనీయము నామమే నార్తిబాప
రిప్లయితొలగించండిశమల పర్వత కులిశము శాంతినిడగ
తలపు మాత్రముననె భవతారకంబు
రాఘవా! నీకుఠారమున్ బ్రస్తుతింతు!
ఓ ఘననీలదేహ! సతమోర్పున మమ్మిల బ్రోవవేల ప్రే
మౌఘమ !భక్తతారక !నమామి సరోజదళాయతాక్ష !ధీ
రా!ఘన రావణాసుర పరాజిత! ప్రేరిత
దుర్విచార ఘో
రాఘ వనీకుఠార!మును ప్రార్ధన జేసెద
నిష్టసిద్ధికై!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమూడవ పాదములో
తొలగించండి“ఘనకీర్తితామర విరాజిత” గా చదువ ప్రార్ధన!
ఈఘనశ్రోణిపై క్షత్రియులే విధమైనటువంటి దుష్టఘో
రిప్లయితొలగించండిరాఘము జేసినారొకొ!ధరాధిపులన్ వధజేయుటాపుమో
లాఘవరీతి,యోగివర లక్షణ భార్గవ!మారురూపమున్
రాఘవ, నీ కుఠారమునుబ్రార్దన జేసెద నిష్టసిద్దికిన్
ఘనశ్రోణి=భూమి
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిశ్రీ రఘువరు నామ మిలని చింత బాపు
రామ శ్రీరామ యనుచున్న రహియు కలుగు
పాపరాశినణచి వేయు వసుధయందు
రాఘవా నీ కుఠారమున్ బ్రస్తుతింతు.
దురితములనుబాపి మదికి తోషమొసగు
రాఘవా నీ కుఠారమున్ బ్రస్తుతింతు
చెడు తలపులనెల్లను ద్రోసి జీవితమున
శాంతి నొసగుచు సతతమ్ము జయము లిమ్ము.
పావనంబైన నామము వసుధయందు
పాపములనెల్ల హరియించి పరమ పథము
చూపు,భవబంధములను బాపు నట్టి
రాఘవా నీ కుఠారమున్ బ్రస్తుతింతు.
జనకుని కరుణాహీనుడై చంపినట్టి
కార్త వీర్యుని వేయైన కరములనట
ఖండన మొనరించి జగతిన్ ఖ్యాతు డైన
రాఘవా నీ కుఠారమున్ బ్రస్తుతింతు.
ఉత్పలమాల
రిప్లయితొలగించండిఓఘములౌచు మర్కటము లూపున, తర్ష తరంగ తీక్షణన్
లాఘవమొప్ప ద్రుంచ తమ రాజిత నామ పరశ్వథమ్ములన్
శ్లాఘమనంగ దీర్చి ఘనశైలములన్నిట బాట వేయఁగన్
రాఘవ! నీ కుఠారమును బ్రార్థనఁ జేసెద నిష్టసిద్ధికిన్.
సీతాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా రెండవ పూరణలో విరుపు ప్రశంసనీయం. అభినందనలు.
"నామమే యార్తి బాప" అనండి.
'రావణాసుర పరాజిత' అంటే రావణాసురునిచే ఓడింపబడినవాడు అన్న అర్థం వస్తుంది.
*****
చేపూరి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'క్షత్రియులే' అన్నపుడు 'క్ష' గురువై గణదోషం. సమాసంలో ఉత్తరపదాద్యక్షరం రేఫసంయుక్తమైనపుడు పూర్వపదాంతాక్షరం లఘువు కాని, గురువు కాని అవుతుంది. పదం మధ్యలో ఉంటే కాదు.
*****
డా. ఉమాదేవి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"నామ మిలను..." అనండి.
మూడవ పూరణ మూడవ పాదంలో గణదోషం. "భవబంధముల నెల్ల" అనండి.
*****
సహదేవుడు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిగురుదేవులకు నమస్సులు! అనుమానిస్తూనే వ్రాశానండీ! చాల అపరాధమయింది! మీరూ, శ్రీరామచంద్రులవారూ నన్ను క్షమించాలి! 🙏🙏🙏🙏🙏🙏
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండి.............సమస్య
రాఘవా! నీ కుఠారమున్ ప్రస్తుతింతు
==============================
సందర్భం: రామ చంద్రా! పరశురాముని పరశువు(గండ్రగొడ్డలి) క్షత్రియు లనే వనాన్ని మాత్రమే నరికివేసింది. నీ పరశువు మాత్రం రాక్షసు లనే వృక్షాలను ఛేదించడమే కాకుండా లంకా పుర మనే వనాన్ని కూడ దహనం చేసింది.
భార్గవ రాముని గొడ్డలికి ప్రాణ ముందో లేదో గాని నీ పరశువు మాత్రం ప్రాణం కలిగినది సుమా! అంతే కాదు. లోక మంతటికీ ప్రాణం పోసే ప్రా ణదేవుడే తానై వుంది.
ఇంతకూ రామ ప్రభూ! నీ పరశువు ఏది అంటావా! *ఆంజనేయ స్వామియే!*
ఆ పరశువుకు తనంతతాను నిర్ణయం తీసుకొనే శక్తి కూడ వుంది మరి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
పరశురామునిదైన పరశువు క్షత్రియ
వనమును ఛేదించి వాసి గాంచె-
నీదైన పరశు వౌరా దనుజ మహీజ
ఛేదనంబును నొనర్చినది గాక
స్వర్ణ లంకా పుర వనమును సైతము
చేసి మించెనట భస్మీపటలము
భార్గవ రాముని పరశువు ప్రాణంబు
కలిగినదో కాదొ! కాని నీదు
పరశువు కున్నది ప్రాణంబు, ప్రాణమే
నా! ప్రాణ దేవుడైనదియు తానె-
పరశురామ సమాన! నీ పరశు వనగ
పవన సుతు డొప్పు, ధర్మ నిర్వహణమందు
స్వీయ నిర్ణయాత్మక బుద్ధిచేత నలరు-
రాఘవా! నీ కుఠారమున్ బ్రస్తుతింతు
~వెలుదండ సత్యనారాయణ
వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
భువిజనుల భాగ్యమును భూమిజ సాక్షిగ బెంచి
రిప్లయితొలగించండిమునిసుతుల శాపమును,దనుజ దౌష్ట్యమును ద్రుంచి
దశకంఠుని దమనమును,సహస్రబాహుని మదంబునణచిన
రాఘవా! నీ కుఠారమున్ బ్రస్తుతింతు
కమఠమై నిలువంగ కడలి చిలికిన వేళ
రిప్లయితొలగించండిఖలుల నిర్జించ ఖగ గమనుడై ఎగర
దాసునికి దాసుడై కటాక్ష మొసగే
రాఘవా! నీ కుఠారమున్ బ్రస్తుతింతు
వేంకటేశ్వర ప్రసాద్ గారూ,
తొలగించండిమీకు పద భావ సంపదలున్నాయి. ఛందోబద్ధంగా వ్రాసే ప్రయత్నం చేయండి.
వచనం వ్రాసే అలవాటు ఉంది. కవనాన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేసుకుంటున్నాను.ఈ చందనవనానికి వచ్చానుగా. ఛందమూ వస్తుంది. అందాకా ఇలాగే మాటసాయమివ్వండి. ధన్యవాదాలు....
తొలగించండిఏఘనుడెక్కుపెట్టెనుర యీశివచాపముభంగపర్చనే
రిప్లయితొలగించండిడాఘన శౌరిరాముడని హాయిగసంతసమందుచుందురే
యీఘడియన్ హరించెదను యెవ్వడుభార్గవుసాటివచ్చు,రా
మోఘముపర్తునిన్నెవరు ప్రోచనిగొడ్డలినెత్తబల్కెనా
రాఘవ! నీ కుఠారమును బ్రార్థనఁ జేసెద నిష్టసిద్ధికిన్.
శివరామ కృష్ణప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'హరించెదను+ఎవ్వడు = హరించెద నెవ్వడు' అవుతుంది. యడాగమం రాదు. "హరించెను మరెవ్వడు" ఆనండి. 'రామోఘము పర్తు... ప్రోచని'....?
రాఘవ! నాదు పాతకము రాక్షసి రూపపు వృక్షమాయెరా!
రిప్లయితొలగించండిశ్లాఘము నీదు నామముర! చక్కని గొడ్డలి వంటిదౌనుగా!
లాఘవమే గదా దునుమ లావగు పాపపు శాఖలన్ వడిన్...
రాఘవ! నీ కుఠారమును బ్రార్థనఁ జేసెద నిష్టసిద్ధికిన్