విట్టుబాబు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'తెలిసి+ఉన్న' అన్నపుడు యడాగమం వస్తుంది. అక్కడ "సర్వమును దెలిసినవాడు..." అనండి. అలాగే "తెలియక యననిక" అనండి.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2575 సమస్య :: *సర్వజ్ఞుం డని కీర్తిఁ బొందెను గదా చంద్రుండు సచ్ఛీలుడై.* తారాప్రియుడైన చంద్రుడు గొప్ప శీలము గలవాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: చంద్రుడు అత్రి మహర్షికి పతివ్రత యగు అనసూయకు జన్మించినవాడు. అమృతాన్ని భుజించే దేవతలకు ఆహారాన్నందించే అమృతకిరణుడు. విష్ణుమూర్తికి ఎడమ కన్నుగా ప్రకాశించేవాడు. అమృతం త్రాగినవాడు. అందరిలో గొప్పవాడు. బుధునికి తండ్రి. సౌజన్యమూర్తి అని భావించి అతనిని గొప్పగా తన తలపై ధరించాడు గౌరీశుడు సర్వజ్ఞుడు ఐన శివుడు. కాబట్టి మహాదేవుని మన్ననలను అందుకొన్న చంద్రుడు మంచివాడే అని సమర్థించి చెప్పే సందర్భం
అయ్యా !శివుడు చంద్రుని నెత్తిన పెట్టుకున్నది చంద్రుడు మంచివాడనో లేదా చేద్దవాదనో కాదు దక్షుడు ఇచ్చన శాపం బాపుకోనడానికి అతడు శివుని గురించితప్పస్సు చేసాడు శివుడు ప్రసన్నుడై అతని శాపం తీర్చగాలవాడు ఒక్క శివుడే కాబట్టి కనీసం కొన్నిరోజులైనా అతడు క్షీణించకుండా ఉండడానికి అతనిని తలపై పెట్టుకున్నాడు.
పాండురంగారెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. కాని పూరణ భావం బోధపడలేదు. వివరించండి. 'ధర్మము'ను 'ధరుమము' అన్నారు. అక్కడ "సర్వసుధర్మముల నెరిగి" ఆనండి.
సందర్భం: శర్వుడు (శివుడు) రాత్రీ పగలూ ఎప్పుడూ కనిపించడు. కాబట్టి... కాని వాడు.. అనగా చూడడానికి వీలు కాని వాడు. చంద్రుడు రాత్రి వేళనైనా కనిపిస్తాడు. కాబట్టి... ఐన వాడు. అనగా చూడడానికి వీలైన వాడు. ----------------- శర్వు డెపుడుఁ గనిపించడు;
శర్వరినైనఁ గనిపించు శశి; చూడగ వీ,
లుర్వరను కాని వాడౌ
సర్వజ్ఞుం; డైన వాడు చంద్రుడు సుమ్మీ!
శర్వరి= రాత్రి ............ ...... మరొక పూరణం:
సందర్భం: "సర్వ" అంటే ఒక లావుపాటి పాత్ర (మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాల మాండలికం.. చిన్న బిందె.. అని కూడ). "కాసండి" అని కూడ అంటారు. "చంద్రు" డనే వాడు ఒక వంటవాడు. సర్వ.. ఎక్క డున్న దని ఎవరో అడిగితే సర్వజ్ఞుడు (సర్వ గురించి తెలిసినవాడు) చంద్రుడే.. అన్నా డొకడు. -------- "సర్వ" యొకానొక పాత్రగ
ఓర్వక యాంధ్రుల పాలనల్
రిప్లయితొలగించండినేర్వక యవినీతి నిండు నేతల పలుకుల్
పూర్వపు గ్రంధములు చదివి
సర్వజ్ఞుండైనవాఁడు చంద్రుఁడె సుమ్మీ!
* నేర్వక కపటమ్ము నిండు నేతల పలుకుల్
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండికెసియార్ విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పాలన' అనండి. లేకుంటే గణదోషం.
రిప్లయితొలగించండిపర్వము తెలుగు మహాసభ!
గర్వము కొంతయును లేదు! గౌరవ మిచ్చెన్
హర్వుగ గురువుల కెల్లన్,
సర్వజ్ఞుండైనవాఁడు చంద్రుఁడె సుమ్మీ !
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గర్వమ్మించుక తోడుత
రిప్లయితొలగించండిశర్వుని తలపై నిలువగ చక్కని నగయై
సర్వాంతర్యామి చెలిమి
సర్వజ్ఞుండైనవాడు చంద్రుడె సుమ్మీ!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూర్వము శపించె గణపతి
రిప్లయితొలగించండిగర్వముతో నవ్వగ హిమకరుని;భపతికిన్
సర్వము దెలియదు,కాడే
సర్వజ్ఞుండైనవాఁడు చంద్రుఁడె సుమ్మీ !
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిసర్వజ్ఞ నామధేయము శర్వునకే....
కాని... వ్యాకరణ పరంగా .. సర్వం జానాతి ఇతి సర్వజ్ఞః...
సర్వమ్మున్ గమనించునింద్రియములౌ చక్షుద్వయమ్మంబికా...
శర్వశ్రీహరినేత్రరూపుడనగా చంద్రుడు , జూచుంగదా
యుర్విన్ సాగు సమస్త కార్యములఁ దా యోచింపగా ! *వ్యాకృతిన్*
సర్వజ్ఞుండని కీర్తిఁ బొందెను గదా చంద్రుండు సచ్ఛీలుఁడై !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
సర్వము నాకే తెలుసని
రిప్లయితొలగించండిగర్వము తో మి డు కు వాడు కనబడ డెందు న్
నేర్వ్గ గ పాలన కిటుకుల
సర్వజ్నుoడైన వాడు చంద్రుడు సుమ్మీ
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపర్వంబద్ది! మహాసభన్ గురువులన్ ప్రార్థించి పద్యంబులన్
సర్వోత్కృష్టముగా తెలుంగు పలుకుల్ జవ్వాదులన్నద్దుచున్
గర్వంబెంతయు లేక గౌరవముతో కాల్మొక్కగానీతడే
సర్వజ్ఞుండని కీర్తిఁ బొందెను గదా చంద్రుండు సచ్ఛీలుఁడై
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమీ పరిశీలనా పలుకులు ఓహో!!
తొలగించండిఏమైనా ఆతని భాషాభిమానం, గురుభక్తి ప్రశంసనీయం. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు.
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివిట్టుగారికి కందివారికి
నమో నమః
జిలేబి
సర్వజ్ఞుండన చూడుము
రిప్లయితొలగించండిసర్వము తెలిసున్నవాడు సతతము నిలలో
సర్వము తెలియక నననిక
"సర్వజ్ఞుండైనవాఁడు చంద్రుఁడె సుమ్మీ"
ఇర్వురు చంద్రులు నిచ్చట
తొలగించండిపర్వంబుగ జేసిరి పరిపాలన యనుచున్
వార్వారల జనులందురు
"సర్వజ్ఞుండైనవాఁడు చంద్రుఁడె సుమ్మీ"
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'తెలిసి+ఉన్న' అన్నపుడు యడాగమం వస్తుంది. అక్కడ "సర్వమును దెలిసినవాడు..." అనండి. అలాగే "తెలియక యననిక" అనండి.
🙏🙏
తొలగించండిగర్వంబించుక లేక రాముని హృదిన్ గారాబు జామాతగా
రిప్లయితొలగించండిసర్వమ్మాంధ్రులకున్ సుభిక్ష
సుగతిన్ సంతుష్టమొందించుచు
న్నుర్విన్నంతటినిన్ కుదించి పలుకున్నొక్కంటి జాలమ్మునన్
సర్వజ్ఞుండని కీర్తిఁ బొందెను గదా చంద్రుండు సచ్ఛీలుఁడై :)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండినారా వారిని ప్రస్తావించిన మీ రెండవ పూరణ చక్కగా ఉన్నది. మీ నిష్పక్షపాతాన్ని ప్రకటిస్తున్నది. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండిగారాబు జామాత?
తొలగించండి😂😂😂
తొలగించండి(మౌర్యవంశస్థాపకుడైన చంద్రగుప్తమహావీరుని గురించి)
రిప్లయితొలగించండిసర్వసమర్ధుడు;మౌర్యుడు;
శర్వుని భక్తుడు;చతురుడు;చంద్రాహ్వయుడున్;
గర్వితశాత్రవఖర్వుడు;
సర్వజ్ఞుండైనవాడు చంద్రుడు సుమ్మీ!
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగర్విత మతి కాడెవ్వడు?
రిప్లయితొలగించండిసర్వులు పులకించు నటుల చల్లదనమునే
యుర్విని గురిపించు నెవడు ?
"సర్వజ్ఞుండైనవాఁడు ; చంద్రుఁడె సుమ్మీ
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
సర్వుల హితమును గోరుచు
రిప్లయితొలగించండిసర్వసమర్ధుడు పవిత్ర సంగమమునకై
ఉర్విన నదులను కలిపెను
సర్వజ్ఞుండైనవాఁడు చంద్రుఁడె సుమ్మీ
శ్రీనాథ్ గారూ,
తొలగించండిఉభయతారకమైన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
సర్వాధిక్యత జూపినుర్వి తలమున్ సంపూర్ణ దేహద్యుతిన్
రిప్లయితొలగించండిపర్వంబై వెలుగొందు వెన్నెల ఝరుల్పంచేటిరారాజుగా
గర్వంబింతయులేక దీధితులచీ
కట్లన్నివారించగా
సర్వజ్ఞుండని గీర్తిబొందెను గదా చంద్రుండు సచ్ఛీలుడై
శ్రీరామారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...జూపి యుర్వి...ఝరుల్ పంచంగ (పంచేటి... వ్యావహారికం)" అనండి.
తీర్వము బెంచక విద్యుత్
రిప్లయితొలగించండిసర్వ హరిమలందు నిడుచు సచివుడు నారా
యుర్వి జనతకు సుఖము నిడె,
"సర్వజ్ఞుండైనవాఁడు చంద్రుఁడె సుమ్మీ
అధికారము చే బట్టిన తర్వాత అధికమైన విద్యుత్ చార్జీలు పెంచక శ్రీ నారా వారు 95% కరెంట్ అంధ్ర రాష్ట్రములో అందించినాడు అతండు ఘనుడు గదా
సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"తీర్వను" అనండి. తీర్వకు ముప్రత్యయం లేదు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2575
సమస్య :: *సర్వజ్ఞుం డని కీర్తిఁ బొందెను గదా చంద్రుండు సచ్ఛీలుడై.*
తారాప్రియుడైన చంద్రుడు గొప్ప శీలము గలవాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: చంద్రుడు అత్రి మహర్షికి పతివ్రత యగు అనసూయకు జన్మించినవాడు. అమృతాన్ని భుజించే దేవతలకు ఆహారాన్నందించే అమృతకిరణుడు. విష్ణుమూర్తికి ఎడమ కన్నుగా ప్రకాశించేవాడు. అమృతం త్రాగినవాడు. అందరిలో గొప్పవాడు. బుధునికి తండ్రి. సౌజన్యమూర్తి అని భావించి అతనిని గొప్పగా తన తలపై ధరించాడు గౌరీశుడు సర్వజ్ఞుడు ఐన శివుడు. కాబట్టి మహాదేవుని మన్ననలను అందుకొన్న చంద్రుడు మంచివాడే అని సమర్థించి చెప్పే సందర్భం
‘’ ఉర్విన్ తా ననసూయ కత్రికి సుతుం , డూహింప నాహారమౌ
సర్వామర్త్యుల , కక్షి విష్ణువున , కాస్వాదించె పీయూషమున్ ,
సర్వ శ్రేష్ఠుడు , తండ్రి యా బుధునికిన్ , సౌజన్యు ‘’ డంచున్ సదా
సర్వోత్కృష్టత వాని దాల్చు తలపై శర్వుండు గౌరీశుడున్
*సర్వజ్ఞుం , డని కీర్తిఁ బొందెను గదా చంద్రుండు సచ్ఛీలుడై.*
*కోట రాజశేఖర్ నెల్లూరు.* (21.01.2018)
అయ్యా !శివుడు చంద్రుని నెత్తిన పెట్టుకున్నది చంద్రుడు మంచివాడనో లేదా చేద్దవాదనో కాదు దక్షుడు ఇచ్చన శాపం బాపుకోనడానికి అతడు శివుని గురించితప్పస్సు చేసాడు శివుడు ప్రసన్నుడై అతని శాపం తీర్చగాలవాడు ఒక్క శివుడే కాబట్టి కనీసం కొన్నిరోజులైనా అతడు క్షీణించకుండా ఉండడానికి అతనిని తలపై పెట్టుకున్నాడు.
తొలగించండిరాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ ఉత్కృష్టంగా ఉన్నది. అభినందనలు.
*****
కృష్ణప్రసాద్ గారూ,
కారణం ఏదైనా ముక్కంటి తలపువ్వుగా ప్రకాశించే అర్హత పొందినాడు కదా!
నా ఉద్దేశం పూరణ పూరించడం గురించి కాదు గురువర్యా ఇతివృత్తం ఏదైనా మూల కధను మార్చకూడదని అంతే
తొలగించండికవిత వలన మూలకధ మారకూడదు పైపెచ్చు అది మనకి విషయాన్ని యదాతధం కా చదువరులకు ఉపయోగపడేలా ఉండాలని నా తాపత్రయం కవి తప్పు చెప్పకూడదు
తొలగించండిఉర్వికి వెలగుల రువ్వుచుఁ
రిప్లయితొలగించండిబర్వముగా పగలు రేయిఁ బంచుచు నేలన్
నిర్విఘ్నమ్ముగ రవితో
సర్వజ్ఞుండైనవాఁడు చంద్రుఁడె సుమ్మీ
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శర్వుడు కాదో బుద్ధుడె
రిప్లయితొలగించండిసర్వజ్ఞుండైన వాడు, చంద్రుడు సుమ్మీ
శర్వుని దృక్కై తొడవై
సర్వులకు సుభగ సుధాంశు జాలంబొసగున్
విజయ కుమార్ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఉర్విన చంద్రుడు గలడే!
రిప్లయితొలగించండిగర్వము లేకన సహజపు జ్ఞానసుగుణముల్
చర్విత చరణాo బుధుడగు
సర్వజ్ఞుo డైన వాడు చంద్రుడే సుమ్మీ
గురువు గారికి నమస్సులు.
వెంకట నారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఉర్విని... లేకయె" అనండి. 'చర్విత చరణాంబుధుడు'... ?
గర్వము లేదొక్కింతయు
రిప్లయితొలగించండినుర్విని తన ప్రజలు మిగులనున్నతి పొందన్
సర్వమ్మునొసగుయేలిక
సర్వజ్ఞుo డైన వాడు 'చంద్రుడే' సుమ్మీ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉర్వి జనులు తమ బాధల
రిప్లయితొలగించండినోర్వగ లేకున్న, ముదమునొందినఁ దనతో
సర్వము చెప్పుకొనుటచే
సర్వజ్ఞుండైనవాఁడు చంద్రుఁడె సుమ్మీ
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పర్వంబున్ తిథులున్ ఘనంబున గనన్ పంచాంగమున్ మూలమై
రిప్లయితొలగించండిసర్వావస్థలలో చరించి యగువున్ సాధిక్యమున్ ద్రోలగా
యుర్విన్ సజ్జనులందరున్ పొగడగా ఓహోయని న్నాతనిన్
"సర్వజ్ఞుండని కీర్తిఁ బొందెను గదా చంద్రుండు సచ్ఛీలుఁడై"
అగువు = చీకటి, రాహువు
తొలగించండివిట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...ద్రోలగా। నుర్విన్...పొగడగా నోహో యటం చాతనిన్" అనండి.
ఉర్విన్ గల్గిన వారలెల్లరకు తానొప్పారగా వెన్నెలల్
రిప్లయితొలగించండిపర్వమ్మై పులకింప నిచ్చును,సుధల్ పంచున్ కళామూర్తియై
దుర్వారమ్మగు ప్రేమనొజ్జ సతిదే దోషమ్ముయోచింపగన్
సర్వజ్ఞుండని గీర్తిబొందెను గదా చంద్రుండు సచ్ఛీలుడై
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉర్వీతలమును గాంచుచు
రిప్లయితొలగించండిగర్వంబిసుమంత లేక గ్రహణములున్నన్
సర్వుల మెప్పును బొందెడు
సర్వజ్ఞుండైనవాడు చంద్రుడె సుమ్మీ!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉర్విని గురువును మించిన
రిప్లయితొలగించండిసర్వజ్ఞుడు లేడనంచు సాష్టాంగముతో
గర్వము లేక ప్రణమిల్లిన
సర్వజ్ఞుండైన వాడు చంద్రుడె సుమ్మీ.
ఉర్విని పదిలము జేయుచు
రిప్లయితొలగించండిసర్వేశుడు బ్రోచుచుండ జడలో పువ్వై
సర్వము నెఱగుచు తాఁ గడు
సర్వజ్ఞుండైనవాడు చంద్రుడె సుమ్మీ
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"లేడటంచు..." అనండి. మూడవ పాదంలో గణదోషం. "గర్వము విడి ప్రణమిల్లిన" అనండి.
ఓర్వక రాత్రికి చీకటి
రిప్లయితొలగించండిగర్వంగా చేరరాగ గమనించియు తా
శర్వుని చే తిరుగుట తో
సర్వజ్ఞుండైన వాఁడు చంద్రుడు సుమ్మీ!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గర్వంగా' అనడం వ్యావహారికం. "గర్వముగా" అనండి.
ఇర్వురుచంద్రులుదమతమ
రిప్లయితొలగించండియుర్వినిబాలించుదెరగుజూడగదెలిసెన్
వారలసర్వఙ్ఞత్వము
సర్వఙ్ఞుండైనవాడుచంద్రుడెసుమ్మీ
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పదాల మధ్య వ్యవధానాన్ని పాటించండి.
సర్వావయములఁ శీర్షము
రిప్లయితొలగించండిసర్వోత్తమమైనదనుచు శాస్త్రము దెలుపన్
శర్వుని శిరమంటి దిరిగి
సర్వజ్ఞుండైనవాఁడు చంద్రుఁడె సుమ్మీ
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శర్వుని లోనను గను మం
రిప్లయితొలగించండితర్వర్తిగ దోచునతడు తరుణీ నీ యా
త్మోర్విని శుచి గల యాతడు
సర్వజ్ఞుండైన వాఁడు చంద్రుఁడె సుమ్మీ.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఖర్వాధిక సత్తారక
రిప్లయితొలగించండిపర్వ పతి నిశాకరుండు పాథోధి మహా
పర్వద కల్హార మన
స్సర్వజ్ఞుండైనవాఁడు చంద్రుఁడె సుమ్మీ
[పర్వము సమూహము; పర్వద = పండుగ నొసంగు వాఁడు]
దుర్వారాగ్రహ తప్త దక్షపతి యాతుఙ్గీ పతిన్ రోహిణీ
గర్వోద్రిక్తు శపింప వేడఁగనె సత్కారుణ్య మేపారగన్
సర్వావస్థలఁ బ్రీతి తోడ నిజ శీర్షంబందు నిల్పెన్ సుమీ
సర్వజ్ఞుండని కీర్తిఁ బొందెను గదా చంద్రుండు సచ్ఛీలుఁడై
[సర్వజ్ఞుఁడు = శంకరుఁ డు]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండి👏👏👏
తొలగించండిమీ శార్దూలం నాకు సిమ్హస్వప్నమైనది.
హరిణాభ మృదు వచో భరిత ధన్యవాదములు.
తొలగించండినిర్వృతిఁ బొందును రయమున
రిప్లయితొలగించండిసర్వజ్ఞుండైనవాఁడు, చంద్రుఁడె సుమ్మీ
దుర్వారపు కామముతో
గుర్విణిఁ జేసి గురు సతినిఁ గొమరుని కనియెన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సర్వోత్కృష్టంబగు నా
రిప్లయితొలగించండిశర్వుని శిరమందు నిలచె చలువలఱేడే
పూర్వపు పాపంబు తొలగి
"సర్వజ్ఞుండైనవాఁడు చంద్రుఁడె సుమ్మీ"
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉర్విన్ శాంతియు సామరస్యములతో నుత్సాహ భూయిష్ఠులై
రిప్లయితొలగించండిగర్వంబొందక హింసవీడుమని వక్కాణించె బుద్ధుండు తాఁ
సర్వజ్ఞుండని కీర్తిఁ బొందెను గదా, చంద్రుండు సచ్ఛీలుఁడై
సర్వజ్ఞోత్తమ శీర్షమందు నిలిచెన్ చంచత్ప్రభా పూర్ణుఁడై.
సర్వజ్ఞ శబ్దము ఈశ్వరునకు మరియు బుద్ధునకు........
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
గర్వోద్వేగ విహీన సత్వగుణియై , కారుణ్య సాకారియై ,
సర్వాదిత్య నుతాంచితుండు నయి , భాస్వంతాన్వయ శ్రేష్ఠుడై ,
గీర్వాణాహిత దర్పభేదియయి , సత్కీర్తి స్వరూపుండునై ,
నిర్వా చ్యోన్నతుడై , చెలంగె గద క్షోణిన్ రామచంద్రుం | డికన్ ,
సర్వఙ్ఞుం డని కీర్తి నొందెను గదా చంద్రుండు సఛ్ఛీలుడై ! ! !
{ గీర్వాణ + అహితుడు = సురవైరి ; నిర్వాచ్య + ఉన్నతుడు =
నిర్వచింపదగిన ఔన్నత్యము గలవాడు }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
కం:-
రిప్లయితొలగించండిసర్వధరుమంబులనెరిగి
నుర్విజనుల నోము నిభ్యుఁడొడికపు నెరవున్
సర్వమునెఱుక పరచదగు
సర్వజ్ఞుండైనవాఁడు చంద్రుఁడె సుమ్మీ !!!
@ మీ పాండురంగడు*
౨౧/౦౧/౨౦౧౮
పాండురంగారెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు. కాని పూరణ భావం బోధపడలేదు. వివరించండి.
'ధర్మము'ను 'ధరుమము' అన్నారు. అక్కడ "సర్వసుధర్మముల నెరిగి" ఆనండి.
దుర్వారము నింద బడసె
రిప్లయితొలగించండిసర్వజ్ఞుండైనవాఁడు! చంద్రుఁడె సుమ్మీ!
పార్వతి తనయుని గాంచిన
సర్వాంతర్యామికైన శాపము తాకెన్ ౹౹
రఘురామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కం:-
రిప్లయితొలగించండిసర్వసుధర్మములనెరిగి
నుర్విజనుల నోము నిభ్యుఁడొడికపు నెరవున్
సర్వమునెఱుక పరచదగు
సర్వజ్ఞుండైనవాఁడు చంద్రుఁడె సుమ్మీ !!!
@ మీ పాండురంగడు*
౨౧/౦౧/౨౦౧౮
భావము:-సమస్త ధర్మములు తెలిసి భువిలో జనులనుసంరక్షించు ప్రభువు, యోగ్యమైనటువంటి మార్గమును సంపూర్ణంగా తెలియజేయుదగు పరిపూర్ణుడైనటువంటివాడును చంద్రుడేయగును.
ఇదే భావంతో వ్రాసాను గురూజీ 🙏🙏🙏
పాండురంగారెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సర్వజ్ఞుండగు రామచంద్రు డిలలో సర్వాంతరంగమ్ములన్
రిప్లయితొలగించండిదుర్వారోగ్రమహారిషట్కవితతిన్ దున్మాడు ధ్యానింప నం
తర్వృత్తంబున నుండి వాస్తవము కాదా చూడగా సత్యమే
సర్వజ్ఞుండని కీర్తిఁ బొందెను గదా చంద్రుండు సచ్ఛీలుఁడై.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలు గురువు గారికి.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఅర్వాచీనమ్మైనన్
నిర్వహణమ్మున పెనుపగు నేర్పున రాష్ట్ర
మ్ముర్విన్నెగడగ బఱచెడి
సర్వజ్ఞుండైన వాడు చంద్రుడె సుమ్మీ!
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
...............సమస్య
రిప్లయితొలగించండిసర్వజ్ఞుండైనవాడు చంద్రుడు సుమ్మీ!
సందర్భం: శర్వుడు (శివుడు) రాత్రీ పగలూ ఎప్పుడూ కనిపించడు. కాబట్టి... కాని వాడు.. అనగా చూడడానికి వీలు కాని వాడు.
చంద్రుడు రాత్రి వేళనైనా కనిపిస్తాడు. కాబట్టి... ఐన వాడు. అనగా చూడడానికి వీలైన వాడు.
-----------------
శర్వు డెపుడుఁ గనిపించడు;
శర్వరినైనఁ గనిపించు శశి; చూడగ వీ,
లుర్వరను కాని వాడౌ
సర్వజ్ఞుం; డైన వాడు చంద్రుడు సుమ్మీ!
శర్వరి= రాత్రి
............ ......
మరొక పూరణం:
సందర్భం: "సర్వ" అంటే ఒక లావుపాటి పాత్ర (మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాల మాండలికం.. చిన్న బిందె.. అని కూడ). "కాసండి" అని కూడ అంటారు.
"చంద్రు" డనే వాడు ఒక వంటవాడు. సర్వ.. ఎక్క డున్న దని ఎవరో అడిగితే సర్వజ్ఞుడు (సర్వ గురించి తెలిసినవాడు) చంద్రుడే.. అన్నా డొకడు.
--------
"సర్వ" యొకానొక పాత్రగ
నుర్విఁ గలదు వంటవాడు నొగి "చంద్రుం"డౌ
సర్వ యెది యనగ నొక డనె..
" సర్వజ్ఞుం డైన వాడు చంద్రుడు సుమ్మీ!"
~వెలుదండ సత్యనారాయణ
వెలుదండ వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
మా జిల్లాలోను 'సర్వ' అనే అంటారు. కాని సర్వను జ్ఞతో చేర్చి సమాసం కూర్చవచ్చునా అని సందేహం!
నిన్నటి పూరణ
రిప్లయితొలగించండిఉర్విని వెన్నెల పంచుచు
సర్వులకునుమామయైన జాబిలి నింగిన్
సర్వంబెరిగిన దెవరన
సర్వజ్ఞుండైనవాఁడు చంద్రుఁడె సుమ్మీ
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గర్వంబొందగ గెల్చెనంచు తనివిన్ కవ్వించి నాయుణ్ణి భల్
రిప్లయితొలగించండిపూర్వాపూర్వము లెంచకుండ మమతన్ ముర్పించి లాలించుచున్
పర్వాలేదిక నాకటంచు వడిగా పర్వెత్త దిల్లీకి తా
సర్వజ్ఞుండని కీర్తిఁ బొందెను గదా చంద్రుండు సచ్ఛీలుఁడై...