వివరమెరుంగకన్ బలుకు వేదములన్ పస లేదటంచు, మా నవులకు వర్ణ మేల యని నవ్యత జూపు కవిత్వమందు , వి ప్లవమె శరణ్యమంచనును వ్రాతల , చిత్తమునందు నొల్లకన్ కవి తల లేని భావములు కైతల కెక్కు బ్రశంసనీయమై
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2574 సమస్య :: *కవితల లేని భావములు కైతల కెక్కెఁ బ్రశంసనీయమై.* కవితలలో లేని భావాలు కవితలలో నికి చేరినాయి అనేది ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: కవి అనే పేరు రాక్షసులకు గురువైన శుక్రాచార్యునికి ఉంది. బృహస్పతి శుక్రుని వేషంలో రాగా రాక్షసులు అతడే తమ అసలైన గురువనుకొని అతనికి సేవ చేసి శుక్రాచారియొక్క శాపానికి గురియయ్యారు. శిష్యుడుగా ఉన్న కచుని రాక్షసులు చంపి దహించగా వచ్చిన బూడిదతో కలసియున్న సురను త్రాగి తన తప్పు తెలిసికొని శుక్రుడు సురాపానమును మానుకొన్నాడు. వామనమూర్తికి బలిచక్రవర్తి ఇచ్చే మూడడుగుల భూదానాన్ని అడ్డుకొనేందుకు ఈగ గా మారిన శుక్రాచారి ఒక కన్ను పోగొట్టుకొని ఒంటి కన్ను గల వాడయ్యాడు. ఇలా కవి (శుక్రునియొక్క) యొక్క తలలో లేనివి అనుకోనివి ఎన్నో జరిగినాయి. కవితలలో ప్రశంసింపబడ్డాయి అని విశదీకరించే సందర్భం.
కవి యను పేర దానవుల గాచెడి శుక్రుడు శాప మిచ్చె దా నవులకు , తాను ద్రాగు సుర నాశన కారణ మంచు మానె , మా ధవునికి దానభంగమును దాను దలంపగ కన్ను బోయెగా , కవి తల లోన లేని వగు కార్యములే జరిగెన్ , దలంప నా *కవి తల లేని భావములు కైతల కెక్కెఁ బ్రశంసనీయమై.* *కోట రాజశేఖర్ నెల్లూరు.* (19.01.2018)
ప్రవిమలమాననీయులుగబ్రస్తుతినొందుచుశంకరార్యులీ కవులకుమార్గదర్శిగనుకమ్మనిభావములందజేయగా నవకవులెల్లనుల్లసమునందుచుబూరణసేయువేళలన్ *కవి తల లేని భావములు కైతల కెక్కెఁ బ్రశంసనీయమై
కామేశ్వర రావు గారూ, మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. ముఖ్యంగా రెండవ పూరణలో అవాల్మికాలను ప్రస్తావించి సమస్యను పరిష్కరించిన తీరు ఉత్తమోత్తమం. అభినందనలు. మొదటి పూరణలో 'హృదహంబు = హృత్ + అహంబు' అని మీ భావనయా? లేక 'హృదయంబు'కు టైపాటా?
..............సమస్య కవి తల లేని భావములు కైతల కెక్కెఁ బ్రశంసనీయమై
సందర్భం: పోతన భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టాన్ని వ్రాస్తూ అల వైకుంఠ పురంబులో... అని వ్రాసి గోదావరికి స్నాన సంధ్యలకై వెళ్ళాడట! శ్రీ రామచంద్రుడు పోతన రూపంలో వచ్చి పోతన కూతురి నడిగి యిప్పించుకొని ఆ గ్రంథములో.. "నగరిలో నా మూల సౌధంబు.." అంటూ పూర్తి పద్యాన్ని వ్రాసి వెళ్ళాడట! తిరిగి వచ్చి చూచిన పోతన ఆశ్చర్య పోయాడట! కవి తలలో లేని భావాలు కైతలలో కెక్కడం అంటే ఇదే కదా!
భవ హర మౌ నటంచు కవి వర్యుడు పోతన వ్రాయ బూనె భా గవత గజేంద్ర మోక్షమున కమ్మని పద్యము.. కొంత వ్రాసి గో దవరకు నేగె.. నంత గుణ ధాముడు రాముడు వచ్చి వ్రాసెడిన్.. కవి తల లేని భావములు కైతల కెక్కెఁ బ్రశంసనీయమై..
..............సమస్య కవి తల లేని భావములు కైతల కెక్కెఁ బ్రశంసనీయమై
సందర్భం: "కవిని గనుక ఏదో కొంత పద్యాన్ని వ్రాసి తోచక అక్కడ పెట్టి గోదావరి కేగినాను. వచ్చేలోపల శ్రీ రాముడే వచ్చి విచిత్రంగా పద్య మంతా వ్రాసి వెళ్ళాడు చూశావా!" అన్నాడు పోతన. అప్పుడు నేను "ఇందులో వింత ఏముందండీ! మీ లాంటి మహానుభావులకు అది చెల్లుతుంది.(మాకు కాదు గదా!)" అన్నాను. కవి తలలో లేని భావాలు కైతలలో కెక్కడం అందునా ప్రశంసింపబడడం అంటే ఇదే కదా!
"కవినయి కొంత వ్రాసితిని, గౌతమి కేగితి, వచ్చునంతలో వివరముగా లిఖించె నట వింతగ రాముడు వింటివా!" యనన్.. "అవు నది మీకె చెల్లినది" యంటిని పోతనతోడ.. వింతయే కవి తల లేని భావములు కైతల కెక్కెఁ బ్రశంసనీయమై
రవిగాననిచో గాంచును
రిప్లయితొలగించండికవిగద వాగ్దేవి కరుణ కంజుని కృపతో
భువిలో దివిలో గుహలో
కవి తలలో లేని తలఁపు కైతల కెక్కెన్!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిచక్కని పూరణతో శుభారంభం చేశారు. అభినందనలు.
🙏
తొలగించండి
రిప్లయితొలగించండిజవనాశ్వపు కందంబున
పువుబోడి జిలేబి పద్య పూరణ జేయన్,
సువిశాలపు ఛందంబున
కవితలలో లేని తలఁపు, కై, తల కెక్కెన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఅవియున్నివియున్నొకటే !
చవిగొను గద్యంబు పద్య ఛందంబొకటే !
కువకువ లాడుచు మజ, పద
కవితలలో, లేని తలఁపు, కైతల కెక్కెన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దివిలో దేవత లందరు
రిప్లయితొలగించండిభువిలో లేనట్టి వింత భోగము లందున్
చవిగొని సరసము లాడుచు
కవితలలో లేని తలఁపు కైతల కెక్కెన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఅవసర మైన తావు జన వాహిని మన్నన గాన మేలుగన్
సవరణ జేసి పాద ముల చక్కగ గట్టి చమత్కరించుచున్
కవకవ లాడ జేయ గడ గట్టుచు పూరణ తేగడల్గనన్
కవితల, లేని భావములు, కైతల కెక్కెఁ బ్రశంసనీయమై!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(జగ్గకవికి రాజు మీద కోపం వచ్చి "చంద్రరేఖా విలాసం" చంద్రరేఖావిలాపం అయింది .)
రిప్లయితొలగించండిచవి మీరన్ జగ్గడనెడి
కవి చంద్రరేఖ పయి కృతి కమ్రపురీతి
న్నవముగ వ్రాసియు ,నలుగగ
గవి తలలో లేని తలపు కైతల కెక్కెన్ .
బాపూజీ గారూ,
తొలగించండిజగ్గకవి ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నట్టు 'చంద్రరేఖా విలాపం' పిడియఫ్ దొరుకుతుందా?
తొలగించండిచంద్ర రేఖా విలాపము :) ఎన్జాయ్ మాడి :)
https://archive.org/details/in.ernet.dli.2015.394303
జిలేబి
నా వద్ద పీడీఎఫ్ లేదండీ !
తొలగించండిధన్యవాదాలు జిలేబీ గారూ !
తొలగించండిపై లింకు లో నుండి పీడీయెఫ్ డౌన్లోడ్ చేసుకొనవచ్చును
జిలేబి
కవనము వ్రాసెడు తరుణము
రిప్లయితొలగించండినవలామణి యొకతి యచట నవ్వుచు నిలువన్
రవళించెను నవ్య పథము
కవి తలలో లేని తలపు కైతల కెక్కెన్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిరవి సరసీరుహమ్ములకు రాగము , చంద్రచకోర బంధమున్
కవితల చెప్పి మెప్పుగొన గల్గిరి , మా కవులే విరించులై !
యవిరళ సాహితీ రసమయమ్ము జగమ్ము పథమ్ము మాకు., నే
కవి తలలేని భావములు కైతల కెక్కెఁ బ్రశంసనీయమై??
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅవిరళ సాహితీ రసమయమ్ము జగమ్ము పథమ్ము మాకు !
వాహ్ ! మైలవరపు వారు నమో నమః!
జిలేబి
శ్రీ జిలేబీ గారికి శాస్త్రి గారికి ధన్యవాదాలు.. నమోనమః 🙏
తొలగించండి...మైలవరపు మురళీకృష్ణ
బాలకృష్ణుని వర్ణనమున బమ్మెర పోతనామాత్యుడు పులకించి , స్వయముగా దర్శించి , వ్యాసప్రోక్తమును విస్తరించి.. రచించిన సందర్భంగా....
తొలగించండిరవి కిరణము సోకగనే
నవకమలము విరిసి మురిసినట్టులు కృష్ణున్
దవిలిన పోతన మది ముని....
కవితలలో లేని తలపు కైతలకెక్కెన్ !
( మదిన్... అని అన్వయం)
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
వివరమెరుంగకన్ బలుకు వేదములన్ పస లేదటంచు, మా
రిప్లయితొలగించండినవులకు వర్ణ మేల యని నవ్యత జూపు కవిత్వమందు , వి
ప్లవమె శరణ్యమంచనును వ్రాతల , చిత్తమునందు నొల్లకన్
కవి తల లేని భావములు కైతల కెక్కు బ్రశంసనీయమై
ధనుకొండ వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎరుంగక.. అక ప్రత్యయాంత అవ్యయం కళ కదా! "వివర మెరుంగకే బలుకు..." అంటే ఎలా ఉంటుంది?
ప్ర విమల పుటూ హ మె ద ల గ
రిప్లయితొలగించండిజ వ మున ఛందంబు గాగ చ వు లూ రించే
నవనవలాడెడు భావము
కవి తలలో లేని తలపు కైతలకేక్కే న్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఊరించే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ "చవు లూరింపన్" అందామా?
రిప్లయితొలగించండిభువిలో నుండదు నెక్కడ
కవి తలలో లేని తలుపు, కైతల కెక్కె
న్నవిలే వివిలే వనకను,
కవి కను గద నెప్పుడు రవి గానని చోటున్!
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘వనపర్తి☘
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2574
సమస్య :: *కవితల లేని భావములు కైతల కెక్కెఁ బ్రశంసనీయమై.*
కవితలలో లేని భావాలు కవితలలో నికి చేరినాయి అనేది ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: కవి అనే పేరు రాక్షసులకు గురువైన శుక్రాచార్యునికి ఉంది. బృహస్పతి శుక్రుని వేషంలో రాగా రాక్షసులు అతడే తమ అసలైన గురువనుకొని అతనికి సేవ చేసి శుక్రాచారియొక్క శాపానికి గురియయ్యారు. శిష్యుడుగా ఉన్న కచుని రాక్షసులు చంపి దహించగా వచ్చిన బూడిదతో కలసియున్న సురను త్రాగి తన తప్పు తెలిసికొని శుక్రుడు సురాపానమును మానుకొన్నాడు. వామనమూర్తికి బలిచక్రవర్తి ఇచ్చే మూడడుగుల భూదానాన్ని అడ్డుకొనేందుకు ఈగ గా మారిన శుక్రాచారి ఒక కన్ను పోగొట్టుకొని ఒంటి కన్ను గల వాడయ్యాడు. ఇలా కవి (శుక్రునియొక్క) యొక్క తలలో లేనివి అనుకోనివి ఎన్నో జరిగినాయి. కవితలలో ప్రశంసింపబడ్డాయి అని విశదీకరించే సందర్భం.
కవి యను పేర దానవుల గాచెడి శుక్రుడు శాప మిచ్చె దా
నవులకు , తాను ద్రాగు సుర నాశన కారణ మంచు మానె , మా
ధవునికి దానభంగమును దాను దలంపగ కన్ను బోయెగా ,
కవి తల లోన లేని వగు కార్యములే జరిగెన్ , దలంప నా
*కవి తల లేని భావములు కైతల కెక్కెఁ బ్రశంసనీయమై.*
*కోట రాజశేఖర్ నెల్లూరు.* (19.01.2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
కువలయనేత్రుడు నేనుగు
రిప్లయితొలగించండినవలీలగ బ్రోచురీతి నక్కజపడగన్
సవివరముగ వ్రాసిజనగ
కవి తలలోలేని తలపు కైతలకెక్కెన్
గజేంద్రమోక్షములోని కొన్నిపద్యాలను, సిరికింజెప్పడు వంటివి ఆ మహావిష్ణువే వచ్చివ్రాసి వెళ్ళాడని ప్రతీతి!🙏🙏🙏
తొలగించండిసీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కువలయనేత్రుం డేనుగు..." అనండి.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!
తొలగించండికువలయ నేత్రుండేనుగు
తొలగించండినవలీలగ బ్రోచురీతి నక్కజపడగన్
సవివరముగ వ్రాసిజనగ
కవి తలలోలేని తలపు కైతలకెక్కెన్
అవధానమున కవి యొకడు
రిప్లయితొలగించండిఅవిరళముగ కవితలల్లి యలరించు తరి
న్నెవియో కల్పన లడుగగ
"కవి తలలో లేని తలఁపు కైతల కెక్కెన్"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కవియొకం। డవిరళముగ..." అనండి.
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిరవి గాంచని చోటులను
కవిగాంచునుకద!సరసుల కావ్యం బుదుకున్
చవులూ రించున్ .ధారా
కవితలలోలేని తలపు కైతల కెక్కెన్.
వెంకట నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. "చోటులనే" అనండి. 'కావ్యం బుదుకున్'...?
గురువు గారికి ధన్యవాద నమోవాకములు. కావ్యా
తొలగించండిగణకున్ లేదా కావ్యా రసికున్ అనిన సరిపోవునని వినమ్రంగా తెలుపుతున్నాను.
భువనవిజయ సభలోపల
రిప్లయితొలగించండికవిశ్రేష్ఠులు కొలువుదీర కవి పోషకుడే
చవులూరగ పదములిడిన
"కవి తలలో లేని తలఁపు కైతల కెక్కెన్"
కవులే కద కారణముల్
రిప్లయితొలగించండికవులందరు కామరూప కవితలు యల్లన్
కవులే ప్రేరణ నివ్వగ
"కవి తలలో లేని తలఁపు కైతల కెక్కెన్"
తొలగించండిఅదురహో విట్టుబాబు గారు
జిలేబి
ధన్యవాదాలండీ జిలేబీగారూ..
తొలగించండిఇన్నాళ్ళకు మీ తీపి స్పందన పోందగలిగే పద్యం రాయగలిగానన్నమాట..ధన్యోస్మి!! :-))
కవి తలలో భావములవె
రిప్లయితొలగించండికవితలలో ప్రోది జేయ గడుసరి తలపుల్
కవి తలలో విరిసి మరో
"కవి తలలో లేని తలఁపు కైతల కెక్కెన్"
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో "కవితల నల్లన్" అనండి.
మూడవ పూరణలో "మరొక" అనండి.
ధన్యవాదాలు గురువుగారూ🙏
తొలగించండిరవి గాంచని వెల్ల గనును
రిప్లయితొలగించండికవి యని వచియింత్రు బుధులు,గావున భువియే
కవితామయమ్ము గద, నే
కవి, తలలో లేని తలపు కైతలకెక్కెన్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.ఎన్.వి.ఎన్.చారి9866610429
రిప్లయితొలగించండిఅవధానమ్మున నిచ్చిన
సువిధముగానటి సమస్య సులభము గానే
అవధాని విప్పె ప్రాశ్నిక
కవి తలలోన లేని తలపు కైతల కెక్కెన్
చారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..గానట్టి'ని 'గానటి' అన్నారు. "సువిధముగానట్టి ప్రశ్న" అనండి.
అవివేకముతో నుండెడు
రిప్లయితొలగించండికవివరుడా కాళిదాసు కాళిక దయతో
నవరత్నమ్ముల జేరెను
కవి, తలలో లేని తలపు కైతల కెక్కెన్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సువిశాలం బీ జగతియు
రిప్లయితొలగించండినవ నవ మాధుర్య భావనా కలితంబై
స్తవనీయమునై వెలుగు,కు
కవి తలలో లేని తలపు కైతలకెక్కెన్
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిప్రవిమలమాననీయులుగబ్రస్తుతినొందుచుశంకరార్యులీ
రిప్లయితొలగించండికవులకుమార్గదర్శిగనుకమ్మనిభావములందజేయగా
నవకవులెల్లనుల్లసమునందుచుబూరణసేయువేళలన్
*కవి తల లేని భావములు కైతల కెక్కెఁ బ్రశంసనీయమై
భాస్కరమ్మ గారూ,
తొలగించండినన్ను ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అవధానము సల్పగ జను
రిప్లయితొలగించండికవిపుంగవుఁ కొక్క సభను కాముని సతిగా
జవరాలు సంజ్ఞ లిడగా
కవి తలలో లేని తలఁపు కైతల కెక్కెన్
నిన్నటి సమస్యకు నా పూరణ
ఉన్న సంపదలకు తృప్తి నొందబోక
నిరుగు పొరుగున కలవారి నీసడించి
కలిమి లేదని భర్త తో కయ్యమాడు
పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
భువినెల్లవిరిసెవిరులిక
రిప్లయితొలగించండినవిగవిగోకోకిలమ్ములాలాపించెన్
జివురులవసంతమునుగని
కవి తలలో లేని తలపు కైతలకెక్కెన్
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
చవిగొనలేక ఛందము విశాల పథమ్ములంచు పే
రిప్లయితొలగించండిలవము విహీనసారము కూళలప్రియంబు నైనవౌ
కవితలవే రచించగ నొకానొక కాలమునందు పాఠ్యమై
కవి తలలేని భావములు కైతలకెక్కె ప్రశంసనీయమై!
తలలేని =Brainless
కూళలు = మూర్ఖులు
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి, రెండవ పాదాలలలో గణదోషం. "పథమ్ము లటంచు నెంచి పే.....విహీనసారమును కూళలకున్ ప్రియమైన యట్టివౌ" అందామా?
ధన్యవాదములు గురుదేవా! ఈ రోజు అనారోగ్యకారణంగా దోషములు యెక్కువగా దొరలినవి! సవరించెదను!🙏🙏🙏🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిచవిగొనలేక ఛందము విశాల పథమ్ములటంచు నెంచి పే
తొలగించండిలవము విహీనసారము కళారహితమ్ము ప్రియంబు కూళకౌ
కవితలవే రచించగ నొకానొక కాలమునందు పాఠ్యమై
కవి తలలేని భావములు కైతలకెక్కె ప్రశంసనీయమై!
భువి జనుల బాధ లెల్ల సు
రిప్లయితొలగించండికవి హృదహం బెల్లఁ గలఁచఁ గన్నీ రైనన్
వివరమ్ముగఁ గథయై, యే
కవితల లో లేని, తలఁపు కైతల కెక్కెన్
సువదన నా యహల్య నట చోద్యమ చేసెనె ప్రస్తరమ్ముగన్
శివ ధను వక్కజమ్ముగను జేసెనె భగ్నము సీత సన్నిధి
న్నవరజ లక్ష్మణుండు వని నక్కట గీసెనె రక్ష రేఖనుం
గవి తల లేని భావములు కైతల కెక్కెఁ బ్రశంసనీయమై
[కవి = వాల్మీకి మహర్షి]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి.
ముఖ్యంగా రెండవ పూరణలో అవాల్మికాలను ప్రస్తావించి సమస్యను పరిష్కరించిన తీరు ఉత్తమోత్తమం. అభినందనలు.
మొదటి పూరణలో 'హృదహంబు = హృత్ + అహంబు' అని మీ భావనయా? లేక 'హృదయంబు'కు టైపాటా?
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. హృదయంబని యే వ్రాసితిని. ముద్రణ దోషము గమనించ లేదు. ధన్యవాదములు. సవరించితిని.
తొలగించండిఅవనిని పాలనమ్మునకు హర్హతఁ బొందగ మాయమాటలన్
రిప్లయితొలగించండిప్రవిమలమైన పద్ధతులఁ బల్కిన మేలుఘటిల్లు నంచునో
కవి యెరిగించి, నాకునధికారము దక్కునటంచు వ్రాసె, నా
కవి తలలేని భావములు, కైతల కెక్కెఁ బ్రశంసనీయమై
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పాలనమ్మునకు నర్హత...' అని కదా ఉండాలి?
టైపో జరిగింది. గురువర్యుల సవరణకు ధన్యవాదములు.
తొలగించండికవితలయంతర్జాలము
రిప్లయితొలగించండివివరములవియన్నియుండువిపులముగాగన్
గవితలతలపులమయమే
కవితలలోలేనితలపుకైతలకెక్కెన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భవితకు కాలజ్ఞానము
రిప్లయితొలగించండిఅవలీలగ వీర-బ్రహ్మనందించె గదా|
నవనాగరికులు యెంచని
కవి తలలో లేనితలపు కైతల కేక్కెన్|
2.అవహేళన ప్రశ్నలతో
అవసరమే లేనియట్టి నప్రస్తుతపున్
వివరణ యవధానొసగుట|
కవితలలోని తలపు కైతలకేక్కెన్|
3.వివిధము లైన పద్దతులె విద్య,వివేకము|వేణు వాద్యమే
శ్రవణము కందజేయగల రాగము లెన్నియెదాచినట్లుగా
భవితకు పంటలుంచుటకు బాధ్యతలంటిన వానరాకలా
కవితల లేని భావనలు కైతలకెక్కె బ్రశంస నీయమై|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో "బ్రహ్మ యందించె... నాగరికులు నెంచని..." అనండి.
"స్తుతమతి యైన యాంధ్ర కవి..."
రిప్లయితొలగించండినవరస మాధురీమయ గుణాన్విత ధూపపు కైపులందున
న్నవిరళ మద్యపానపు ఘనమ్మగు మత్తుల మాయలందునన్
చవిగొని వారకాంతల బజారుల రాత్రి పచారులందునన్
కవి తలలేని భావములు కైతల కెక్కెఁ బ్రశంసనీయమై :)
అద్భుతం! కందములకన్న వృత్తములే రసవత్తరముగా వ్రాయగలరు! అభినందనలు!!💐💐💐💐
తొలగించండిసమస్యలో తలలేని చూడగానే కొలకలూరి ఇనాక్ గారి “తలలేనోడు “ పాఠం గుర్తొచ్చింది!
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండి
తొలగించండిఅదిరెనయా ప్రభాకర మహాశయ చంపక మాల మేలుగన్ :)
చీర్స్
జిలేబి
🙏🙏🙏
తొలగించండికుదురుగ చంపకమ్మొకటి కూర్చగ చెమ్టలు కారె దండిగన్ :)
వదలక చేయగా వలెను పట్టును వీడక మీ ప్రయత్నమున్..
తొలగించండి...కంది శంకరయ్య
బదులుగ వచ్చిచేరుగద వాణి కటాక్షముతోడ వృత్తముల్
...అంజయ్య గౌడ్
సదయత వ్రాయు ప్రభాకర శాస్త్రి మహాశయ జంకబోకికన్
తొలగించండి...అంజయ్య గౌడ్
సదయత వ్రాయనొప్పు రవిశాస్త్రి మహాశయ జంకబోకికన్ (రవి = ప్రభాకర)
తొలగించండి...కంది శంకరయ్య
ధూపపు కైపులు.. మద్యపు మత్తులు... వారకాంతల బజారుల పచారులు... భలే భలే పదాలు... శ్రీ ప్రభాకరశాస్త్రి గారూ నమోనమః.. అభినందనలు 🙏👏👏
తొలగించండి...మైలవరపు మురళీకృష్ణ
సదనము శంకరాభరణ మంచిత పుణ్యవిశేషముగా దగన్! 🙏🙏🙏🙏
తొలగించండి
తొలగించండికదనము చేయుమయ్యనిక కార్ముక మున్గొని శాస్త్రివర్యుడా ! :)
జిలేబి
తొలగించండిసదనములో లలంతికగ చంపకమాల జిలేబి యయ్యెనే :)
జిలేబి
స్తుతమతి యైన యాంధ్ర కవి సూరుని (ప్రభాకరుడు) పల్కుల కేల కల్గినో
తొలగించండియతులిత మాధురీ మహిమ?.. హా తెలిసెన్! భువనైక మోహనో
ద్ధత సుకుమార వార వనితా జనితా ఘన తాప హారి సం
తత మధు రాధ రోధిత సుధా రస ధారల గ్రోలుటం జుమీ !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తొలగించండికవితలుజూడనేటివికకావికలైనవిగావుటన్భళా
రిప్లయితొలగించండికవితలలేనిభావములుకైతలకెక్కెబ్రశంసనీయమై
కవితలెయుండగోరుదుసకారణయోగ్యముతోడనెప్పుడు
న్గవివరుశంకరార్యులుసుకైతలువ్రాయుజగధ్ధితంబుగన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నేను కైతలు వ్రాయించేవాడనే కాని వ్రాసేవాడను కాదని గుర్తించండి!
కవితల నల్లెడి ప్రఙ్ఞ యు
రిప్లయితొలగించండికవితావేశము లనునవి కాళిక యొసగన్
జవి గొనియె కాళిదాసిల
కవి తలలో లేని తలపు కైతల కెక్కెన్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి..............సమస్య
కవి తల లేని భావములు
కైతల కెక్కెఁ బ్రశంసనీయమై
సందర్భం: పోతన భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టాన్ని వ్రాస్తూ అల వైకుంఠ పురంబులో... అని వ్రాసి గోదావరికి స్నాన సంధ్యలకై వెళ్ళాడట!
శ్రీ రామచంద్రుడు పోతన రూపంలో వచ్చి పోతన కూతురి నడిగి యిప్పించుకొని ఆ గ్రంథములో.. "నగరిలో నా మూల సౌధంబు.." అంటూ పూర్తి పద్యాన్ని వ్రాసి వెళ్ళాడట!
తిరిగి వచ్చి చూచిన పోతన ఆశ్చర్య పోయాడట! కవి తలలో లేని భావాలు కైతలలో కెక్కడం అంటే ఇదే కదా!
భవ హర మౌ నటంచు కవి
వర్యుడు పోతన వ్రాయ బూనె భా
గవత గజేంద్ర మోక్షమున
కమ్మని పద్యము.. కొంత వ్రాసి గో
దవరకు నేగె.. నంత గుణ
ధాముడు రాముడు వచ్చి వ్రాసెడిన్..
కవి తల లేని భావములు
కైతల కెక్కెఁ బ్రశంసనీయమై..
~వెలుదండ సత్యనారాయణ
రిప్లయితొలగించండి..............సమస్య
కవి తల లేని భావములు
కైతల కెక్కెఁ బ్రశంసనీయమై
సందర్భం: "కవిని గనుక ఏదో కొంత పద్యాన్ని వ్రాసి తోచక అక్కడ పెట్టి గోదావరి కేగినాను.
వచ్చేలోపల శ్రీ రాముడే వచ్చి విచిత్రంగా పద్య మంతా వ్రాసి వెళ్ళాడు చూశావా!"
అన్నాడు పోతన. అప్పుడు నేను "ఇందులో వింత ఏముందండీ! మీ లాంటి మహానుభావులకు అది చెల్లుతుంది.(మాకు కాదు గదా!)" అన్నాను.
కవి తలలో లేని భావాలు కైతలలో కెక్కడం అందునా ప్రశంసింపబడడం అంటే ఇదే కదా!
"కవినయి కొంత వ్రాసితిని,
గౌతమి కేగితి, వచ్చునంతలో
వివరముగా లిఖించె నట
వింతగ రాముడు వింటివా!" యనన్..
"అవు నది మీకె చెల్లినది"
యంటిని పోతనతోడ.. వింతయే
కవి తల లేని భావములు
కైతల కెక్కెఁ బ్రశంసనీయమై
~వెలుదండ సత్యనారాయణ
వెలుదండ వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
సువిమల సాహితీ కుసుమ శుభ్ర సుగంధ మరందమున్ భవ
రిప్లయితొలగించండిత్కవితల నింపు నేర్పు గొను గాటపు దీక్షను బూని పూర్వ స
త్కవుల పథమ్ముననం జనుచు కావ్యము నల్లిన గాని నాటి యా
కవితల లేని భావములు కైతల కెక్కెఁ బ్రశంసనీయమై
కవివర నీదు సేత నను కమ్మని ప్రస్తుతి నొంది ధన్యుడై
కవికులవార్నిధిన్ వెలుగు కల్వలఱేడు గదా కవీశుడౌ.
మిస్సన్న గారు,
తొలగించండిమనోహరమైన పూరణ. చాలా బాగుంది. అభినందనలు.
'పథమ్మునం జనుచు' అని మీరు సూచించిన సవరణ వ్యాఖ్య పొరపాటున తొలగిపోయింది.
ధన్యవాదాలు గురువుగారూ.
తొలగించండిసవినయముగ ప్రకటించెద
రిప్లయితొలగించండినెవరినిప్రేమించియెరుగనేనెన్నడుఁగా
ని విరహ వేదనయనునీ
కవి తలలో లేని తలఁపు కైతల కెక్కెన్
సూర్యనారాయణ గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
ధన్యవాదాలు మాష్టారూ
తొలగించండికందం
రిప్లయితొలగించండిస్తవనీయమ్ముగ వ్రాయఁగ
కవి కెంతకు తోచకున్న కాదంబరినిన్
చివరకు గైకొని నంతన్
కవి తలలో లేని తలఁపుకై తలకెక్కెన్!
1.నవయుగ చక్రవర్తి కవినాయక కోకిల జాషువాయె వే
రిప్లయితొలగించండికవితలు వ్రాసె నవ్యమగు కాంతుల జిమ్మగ కావ్యలోకమే!
భువనము మెచ్చ కావ్యములు పొంగగజేసె ధరన్ *పురాణమౌ*
*కవి తల*లేని భావములు కైతల కెక్కెఁ బ్రశంసనీయమై
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
2. *కవిపోతన పద్యసగము*
*భువనమ్ముల నేలు హరియె పూరించెను భా*
*గవతము నందున,చిత్రము*
*కవి తలలో లేని తలఁపు కైతల కెక్కెన్*
*తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష*
నవనవలాడు యౌవనము నందున తెల్ల గులాబి పూవునున్
రిప్లయితొలగించండికువలయ నేత్ర ముద్దునిడి కూర్చుచు నల్లని వేణినందునన్
భవనము నుండి బైటపడి భళ్ళున నవ్వుచు కన్నుగొట్టగా
కవి తలలేని భావములు కైతల కెక్కెఁ బ్రశంసనీయమై...