మన దేశమ్మది కోశమయ్య భువిలో మాన్యంబుగా వేదవా క్కునకున్, ధర్మపథమ్ము నన్ మెలయ నిగ్గుల్దేల్చు పాశమ్ము బో వ నరుల్ జీవిత మందు నిమ్మళము గా భాసిల్ల! కాపాడు కొ మ్మ నమస్సున్నిడి దేశ మాతకు నిటన్ మాన్పించి నాశమ్ములన్ !
కోశము సర్వసంపదలకున్ భరతావని సంతతమ్ము, నా దేశము సస్య శోభితము, ధీర జనాళికి పుట్టినిల్లు, యే నాశము లేదు సంస్కృతికి, నాకము మానవ జాతి కెప్పుడున్, పాశముముక్తి పొందుటకు, భవ్యము విశ్వపు శాంతికాంతకున్
నినాద మిద్ది దేశ మున్ సనీడ గాను నిల్పుమా వినాశ మేల పాశ మేల విశ్వ మెల్ల నీదయా ! సనాతనమ్ము భావ మెల్ల సాగరమ్ము, నీదు దే శ నాడి కోశమయ్య, మేలు జన్మ భూమి నీదయా !
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం నేటి అంశము :: దత్తపది ఇచ్చిన పదాలు :: దేశము కోశము పాశము నాశము విషయము :: దేశభక్తిని ప్రబోధిస్తూ పద్యరచన. ఛందస్సు :: ఏ ఛందస్సు లోనైనా పద్యం వ్రాయవచ్చు. సందర్భం : మన భారతదేశం దివ్యమైనది. సాధువులకు సంతులకు నిలయమైనటువంటిది. వేదములతో విరాజిల్లునటువంటిది. అమోఘమైన వేదాంత తత్వాన్ని బోధించేటటువంటిది. ఆదర్శవంతమైన కుటుంబ వ్యవస్థను ఆచరించే విషయంలో ఒక ధర్మ పాశమును కలిగియున్నటువంటిది. పరిణామ క్రమంలో మన భారతదేశ ధర్మం ఎటువంటి వినాశనమును పొందనటువంటిది. మన దేశం పూర్వ వైభవంతో విశ్వగురువు కావాలనే మన ఆశ తప్పక ఫలించి తీరుతుంది అంటూ నేటి గణతంత్ర దినోత్సవంలో దేశభక్తి పూర్వకంగా నేను పలుకుతున్నాను అని విశదీకరించే సందర్భం.
*దేశము* భారతమ్ము మన దేశము , దివ్యము , సాధు రాశికిన్ *కోశము* , వేద భాసిత , మకుంఠిత తత్వ ప్రబోధకమ్ము నౌ, *పాశము* ధర్మ బద్ధ మగు భవ్య కుటుంబ విధాన మందు , నే *నాశము* నంద బోదు పరిణామము లందున , విశ్వకీర్తి యం *దాశ ఫలించు నంచు గణతంత్ర దినోత్సవ* మందు బల్కెదన్.* *కోట రాజశేఖర్ నెల్లూరు.* (26.01.2018)
దేశము న న్ని రంగ ము ల దీక్ష గ వృద్ది యో నర్ప బూని యే కోశ ము హాని చేయ గల కుట్రలు పన్ను ట మానగా వలె న్ నాశమొ నర్చిస్వార్థ ము ను నవ్య పథం బు న సాగు గా వలె న్ పాశము తోడ కట్ట వలె భారత మం ద వి నీతి చర్య ల న్
అమ్మా! జిలేబీ! వృత్త రచనలో నాకున్న అష్టకష్టాలు మీ బోటి సహజ కవులకు అర్థం కావు.
గణాలు, యతులు, ప్రాసలు, వేళ్ల మీద లెక్క పెట్టుకుంటూ, ప్రతి పదానికీ గుణింతం, అర్థం వగైరాల కోసం నిఘంటు శోధన చేస్తూ, యడాగమ నుగామములనబడు లంకిణి, శింకిణీలనూ; సంధులూ, సమాసాలూ అనబడు తాడకి, శూర్పణఖలను తప్పించుకుంటూ, హమ్మయ్య అనుకొనే లోపల అన్వయం అనబడు రావణాసురుని ఎదురుకొంటూ... ముచ్చటగా మూడు గంటలు పడుతుంది నాకు. ఈలోపల మీరు ముప్ఫై పద్యాలు వ్రాయ గలరు.
జిలేబీ గారూ, మీ నాల్గవ పూరణ నాణ్యంగా ఉన్నది. అభినందనలు. ***** బ్లాగులో ఛందోభాషణను కూడా ప్రారంభించారన్నమాట! (నా అనుమతి లేకుండానే... హన్నా!) తప్పు లేదు.. కానీయండి. సంతోషమే!
కోశము నెల్లకొల్లగొని గోతులు దీసిన తిన్న ఇంటికే నాశము తప్ప దెప్పుడును, నాదని భారత భూమి యంతటన్ పాశము లల్లిజూడుమిల, పావన నెయ్యము పల్లవించగన్ దేశము వృద్ధిబొందుటకు తేకువ నింపిన, జన్మధన్యమౌ!!! పాశముల వలను జిక్కుచు కోశము పై దృష్టి పెట్టి కొల్లగొనంగన్ నాశము తప్పదు, భారత దేశమునకు వన్నె తెచ్చు తెరువను గనుమా!!!
వెంకటేశ్ ప్రసాద్ గారూ, మీ పంచచామరం బాగున్నది. ఇది సంస్కృత భాషలో ఉన్నది కనుక యతి ప్రాసల ఇబ్బంది లేదు. అయితే నాకు సంస్కృత పాండిత్యం శూన్యం కనుక ఇందలి వ్యాకరణాంశాలను చెప్పలేను.
గురువు గారికి నమస్సులు నాసందేశమువినుడీ శ్రీ సంహిత పాశముదార శ్రీశ్రీ లవియున్ నీసంకుల సంకోశం నా సంగతినందునే వినాశము కొరకే! నీ నా అనే బేధమున్న దేశము నాశనమగునని భావము తో వ్రాసినాను.
..........దత్తపది దేశము.. కోశము.. పాశము.. నాశము ఈ పదాలతో దేశభక్తి. ~~~~~~~ సందర్భం: ప్రభుత్వం దోషుల (నేరస్థుల) పాలిట యమపాశంలా ప్రవర్తించాలి. లేకపోతే సమాజంలో శాంతి నాశన మౌతుంది. కోశంలోని ధనాన్ని తగినంత వెచ్చించి శాంతిని పరిరక్షించాలి. ~~~~~ దేశము యొక్క ప్రభుత యమ పాశము కావలయు దోష పాళికి, లేదేన్ నాశము గాదె ప్రశాంతత! కోశము వెచ్చించి శాంతి కూర్పగ వలయున్
దేశమన మట్టి కాదుర!
రిప్లయితొలగించండికోశము నందాశ వీడి క్రోధము విడుమా!
నాశము చేయుచు స్వార్ధము
పాశము వేయుము పగలకు పాపము సుమ్మీ!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది అభినందనలు.
కోశము చక్కజేసికొని కూర్మిగ నందరు గూడియుండగా;
రిప్లయితొలగించండిపాశము చుట్టుముట్టి నవభారతమాతకు సేవజేయుచున్;
నాశము నందగా మకిలి నాణ్యత నల్గడ మోసులెత్తగా;
దేశముకంటె మించినది దీక్షగ జూచిన నేదిలేదురా
\
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిమన దేశమ్మది కోశమయ్య భువిలో మాన్యంబుగా వేదవా
క్కునకున్, ధర్మపథమ్ము నన్ మెలయ నిగ్గుల్దేల్చు పాశమ్ము బో
వ నరుల్ జీవిత మందు నిమ్మళము గా భాసిల్ల! కాపాడు కొ
మ్మ నమస్సున్నిడి దేశ మాతకు నిటన్ మాన్పించి నాశమ్ములన్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దేశమును ప్రేమించగ మది
రిప్లయితొలగించండికోశము నందుండి కొన్ని కోర్కెలు మరువన్
పాశము లనువీడి ముందుకు
నాశము లేకుండ రక్ష నవలోక మిలన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి, మూడవ పాదాలలో గణదోషం. "దేశముఁ బ్రేమించగమది... పాశములను విడి ముందుకు..." అనండి.
దేశము ప్రేమించగ మది
తొలగించండికోశము నందుండి కొన్ని కోర్కెలు మరువన్
పాశము లనువిడి ముందుకు
నాశము లేకుండ రక్ష నవలోక మిలన్
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిదేశము నాదటంచు నినదించుచునుండుము , విచ్చు నీ మనః
కోశము , స్నేహబంధమనుకూలమునౌనిక , భ్రాతృభావమన్
పాశము దార్ఢ్యమౌను ! మన భారతమాతయు మెచ్చునింకపై
నాశము జేయ నెవ్వరికినైన తరంబె ! జయోऽస్తు! సోదరా !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
దేశము దైవరూపమగు ధేను సమానము, నార్షవిద్యకున్
తొలగించండికోశము , సర్వసంపదలకున్ నిలయమ్మగు రత్నగర్భ , యీ
పాశము మాతృపుత్రఘన బంధము , పెక్కురుచీల్చ జూచినన్
నాశము లేనిదై నిలుచు , నా జనయిత్రికి వందనంబిదే !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. వారికి అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమన దేశము కోశమయా
జినుగుల పాశమ్మును విడజిమ్మగ నరుడా !
మనవులు చెప్పితి నాశము
మన రీతియు గాదు సూవె మహిలో సఖుడా !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోశము సర్వసంపదలకున్ భరతావని సంతతమ్ము, నా
రిప్లయితొలగించండిదేశము సస్య శోభితము, ధీర జనాళికి పుట్టినిల్లు, యే
నాశము లేదు సంస్కృతికి, నాకము మానవ జాతి కెప్పుడున్,
పాశముముక్తి పొందుటకు, భవ్యము విశ్వపు శాంతికాంతకున్
చక్కని పూరణ సత్యనారాయణగారూ! అభినందనలు!!
తొలగించండిధన్యవాదములమ్మా.
తొలగించండిఅన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు ధన్యవాదములు.
తొలగించండిపరుల పాలనా పాశము వ్రక్కజేసి
రిప్లయితొలగించండిస్వార్ధనాశన మొనరించి సంతసమున
హృదయకోశము నాశలు హెచ్చరిల్ల
దేశమంతట జరుపుమా దివ్యదినము!!
గురుదేవులకు , కవిమిత్రులందరికీ భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండినినాద మిద్ది దేశ మున్ సనీడ గాను నిల్పుమా
వినాశ మేల పాశ మేల విశ్వ మెల్ల నీదయా !
సనాతనమ్ము భావ మెల్ల సాగరమ్ము, నీదు దే
శ నాడి కోశమయ్య, మేలు జన్మ భూమి నీదయా !
జిలేబి
శార్దూలమ్మును వ్రాసెదన్ విడువుమా...
తొలగించండి
తొలగించండిశార్దూలము రాయక బోతే జిలేబి యెట్లా అగున్ దత్తపదికి :)
చీర్స్
జిలేబి
బహు బాగున్నది జిలేబీ వారూ!
తొలగించండిఓ చిన్న శంక 😀
ఈ పద్యానికి నామధేయం
తొలగించండిజిలేబి "పంచచామర"మ్ము చిత్ర మయ్య జూడగన్
చీర్స్
జిలేబి
జిలేబి
సార్, నిన్ను పంచచామరం అని అడిగితే solved example ఇచ్చినందుకు ధన్యవాదాలు...
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండిమీ పంచచామర పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
నిన్న , అనునది నిన్ను గా పడింది. క్షంతవ్యుణ్ణి..
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండినేటి అంశము :: దత్తపది
ఇచ్చిన పదాలు :: దేశము కోశము పాశము నాశము
విషయము :: దేశభక్తిని ప్రబోధిస్తూ పద్యరచన.
ఛందస్సు :: ఏ ఛందస్సు లోనైనా పద్యం వ్రాయవచ్చు.
సందర్భం : మన భారతదేశం దివ్యమైనది. సాధువులకు సంతులకు నిలయమైనటువంటిది. వేదములతో విరాజిల్లునటువంటిది. అమోఘమైన వేదాంత తత్వాన్ని బోధించేటటువంటిది. ఆదర్శవంతమైన కుటుంబ వ్యవస్థను ఆచరించే విషయంలో ఒక ధర్మ పాశమును కలిగియున్నటువంటిది. పరిణామ క్రమంలో మన భారతదేశ ధర్మం ఎటువంటి వినాశనమును పొందనటువంటిది. మన దేశం పూర్వ వైభవంతో విశ్వగురువు కావాలనే మన ఆశ తప్పక ఫలించి తీరుతుంది అంటూ నేటి గణతంత్ర దినోత్సవంలో దేశభక్తి పూర్వకంగా నేను పలుకుతున్నాను అని విశదీకరించే సందర్భం.
*దేశము* భారతమ్ము మన దేశము , దివ్యము , సాధు రాశికిన్
*కోశము* , వేద భాసిత , మకుంఠిత తత్వ ప్రబోధకమ్ము నౌ,
*పాశము* ధర్మ బద్ధ మగు భవ్య కుటుంబ విధాన మందు , నే
*నాశము* నంద బోదు పరిణామము లందున , విశ్వకీర్తి యం
*దాశ ఫలించు నంచు గణతంత్ర దినోత్సవ* మందు బల్కెదన్.*
*కోట రాజశేఖర్ నెల్లూరు.* (26.01.2018)
కోట రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
దేశము న న్ని రంగ ము ల దీక్ష గ వృద్ది యో నర్ప బూని యే
రిప్లయితొలగించండికోశ ము హాని చేయ గల కుట్రలు పన్ను ట మానగా వలె న్
నాశమొ నర్చిస్వార్థ ము ను నవ్య పథం బు న సాగు గా వలె న్
పాశము తోడ కట్ట వలె భారత మం ద వి నీతి చర్య ల న్
రాజేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'యొనర్ప... సాగగా...' టైపాట్లు.
రిప్లయితొలగించండినాదేహంబను జాలమున్ విడుమయా! నాదేశ పాశంబు నీ
దై దారుఢ్యమవన్ వినాశముల నీదౌ కైపులన్ ద్రోలుచున్
వేదమ్మే మన కోశమై ప్రజలకున్ విద్యావిధానమ్ముగా
సాధించన్దగు శాంతి సౌఖ్యము నిలన్ శార్దూలమై నిల్చుచున్!
జిలేబి
కోటా పెట్టుము శంకరా! అరడజన్ కోశమ్ము పద్యమ్ములన్
తొలగించండి
తొలగించండిఇక్కడ కూడా కోటా నా :)
జిలేబి
శార్దూలంబున వేదశక్తి ఘనమౌ సారంబునన్ జూపగన్
తొలగించండిశార్దూలమ్ము జిలేబి వ్రాత కిటులే సాష్టాంగమున్ జేసెదన్
🙏🙏🙏
తొలగించండిఅమ్మా! జిలేబీ! వృత్త రచనలో నాకున్న అష్టకష్టాలు మీ బోటి సహజ కవులకు అర్థం కావు.
గణాలు, యతులు, ప్రాసలు, వేళ్ల మీద లెక్క పెట్టుకుంటూ, ప్రతి పదానికీ గుణింతం, అర్థం వగైరాల కోసం నిఘంటు శోధన చేస్తూ, యడాగమ నుగామములనబడు లంకిణి, శింకిణీలనూ; సంధులూ, సమాసాలూ అనబడు తాడకి, శూర్పణఖలను తప్పించుకుంటూ, హమ్మయ్య అనుకొనే లోపల అన్వయం అనబడు రావణాసురుని ఎదురుకొంటూ... ముచ్చటగా మూడు గంటలు పడుతుంది నాకు. ఈలోపల మీరు ముప్ఫై పద్యాలు వ్రాయ గలరు.
😂😂😂😂
తొలగించండిహమ్మయ్య! కిట్టించానండి :)
గణముల్లా యతి ప్రాస వేళ్ళ పయినన్ గణ్యంబు గా జేయుచున్
పణితవ్యార్థ యడాగమాదులనటన్ పారించి పూరించి లం
కిణిలున్ శూర్పనఖాది శింకిణుల చెక్కిళ్ళౌ సమాసమ్ములన్
కణికౌ సంధుల చేర్చి వృత్తముగ ప్రాకాశ్యంబు జేయంగ రా
వణుడౌ అన్వయమున్నెదుర్కొనగ మవ్వమ్మూడు గంటల్లగున్ !
ஜிலேபி
👏👏👏
తొలగించండిఛాన్సు దొరికితే పద్యం వ్రాస్తారుగా!!!
🙏🙏🙏
తొలగించండిమూడున్ గంటలు బట్టె వృత్త మొకటిన్ మూర్తీభవించంగ హా!!!
...ప్రభాకర శాస్త్రి
*************************
మూడే గంటల! తక్కువే తలచినన్ ముమ్మూడు మాక్కావలెన్.
...ఆచార్య రాణి సదాశివ మూర్తి
మూడెట్లున్నది పద్యమిట్లు వెలయన్ మున్నూర్ల శంసల్ గొనన్?
...ఆచార్య రాణి సదాశివ మూర్తి
ముప్పైయారులునైన పట్టునొకచో పూరించ పద్యమ్ములన్ !
తొలగించండి...గుండా వేంకట సుబ్బ సహదేవుడు
గంటల్ మూడైన గాని పద్యంబు వ్రాయ మీకె తగున్
తొలగించండితంటాలు పడి ఇపుడు పద్యంబు కూర్చంగ కరువొచ్చెనో
వెంటేసుకొని నిఘంటుగ్రంధమున్ వెదకంగ ఊరడిల్లె
వంటాముదమం గ్రోలినట్లుండె గాని పదగుంభనంబబ్బదాయె
మూడున్ నాకికనింటిలోన సమయమ్మొక్కింత హెచ్చైనచో
తొలగించండి...చంద్రమౌళి సూర్యనారాయణ
జిలేబీ గారూ,
తొలగించండిమీ నాల్గవ పూరణ నాణ్యంగా ఉన్నది. అభినందనలు.
*****
బ్లాగులో ఛందోభాషణను కూడా ప్రారంభించారన్నమాట! (నా అనుమతి లేకుండానే... హన్నా!) తప్పు లేదు.. కానీయండి. సంతోషమే!
👏👏👏
తొలగించండిచార్దూలమ్ములు లేని క్లాసునిచటన్ శార్దూలముల్ మ్రోగెనే
మైలవరపు వారి పూరణ
తొలగించండిమర్దించున్ మిము శంకరుల్ గనగ ప్రేమన్ శాస్త్రి ! మీ చేష్ట సౌ...
హార్దమ్మైనను శంకరాభరణమందందమ్ము చేకూర్చినన్ !
దుర్దాంతప్రతిభాధురంధరులు వారల్ దోసమంచెంచగా
చార్దూలమ్ములు లేని క్లాసునిచటన్ శార్దూలముల్ మ్రోగెనే
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
కంది వారు ఉవాచ:
తొలగించండి👌🏿
జర్దా వేసుకు వచ్చె పంతులని యీ చాటింపు నాకేలనో?
(నిజంగానే ఇప్పుడు జర్దా వేసుకొనే వున్నాను!)
😀
శ్రీహర్ష అల్లరి:
తొలగించండిజర్దావేసుకు తాను వచ్చె గురువే సాధించ మాక్లాసునే
సర్దేనయ్యరొ దోవతీని వడి, తా జాడించి బెత్తమ్ము తో
మర్దించేనిక మాదు వీపులను మే మమ్మయ్య!నంజీరగన్
చార్దూలమ్ములు లేని క్లాసునిచటన్ శార్దూలముల్ మ్రోగెనే
క్రీడన్ గూడడు క్లాసులోన మురళీ కృష్ణుండు గుడ్బాయిగా 🌹
తొలగించండి*********************
మురళీకృష్ణ:
లేడీ చర్చలయందటంచు నను నిర్లిప్తుండుగా నెంచి మీ
రాడన్ క్రీడలనన్ని చూచుచును నే హాస్యమ్మునన్ దేలితిన్ !
నేడీ గోలకు మూలకారణమనన్ శ్రీ శాస్త్రియే ! గూడెడిన్
క్రీడన్ .., గూడడు క్లాసులోన మురళీ కృష్ణుండు గుడ్బాయిగా !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
డాఎన్.వి.ఎన్.చారి 9866610429
రిప్లయితొలగించండిదేశము కోసమే ధనము దేహము మానము వీడి భక్తితో
పాశవి కాంగ్లముష్కరుల బంపుచు స్వేచ్ఛ నొసంగ నిప్పుడున్
శ్వాసయు స్వార్థమై తమనివాసపు కోశము నింపు చుండిరే
పాశము తోడగొట్టుచును స్వార్థము నాశము జేయుచుండుమా
చారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దేశమున్ సరిఁజేయుమా సుగతిన్ రయంబున పొందుమా
రిప్లయితొలగించండికోశమున్ కడు నింపుమా మరి కూడఁబెట్టుము పైసలన్
పాశమున్ తగిలింపబోకుము భారతంబున వృద్ధికిన్
నాశమున్ తెెగటార్ప వేడుము నవ్య భారత వీరుడా!!
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ మత్తకోకిలా పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిమన దేశము యీ భువిపై
రిప్లయితొలగించండిఘన కోశము సాధుజీవ గతులను పంచెన్
గనఁ పాశము లలరవలెను
జన నాశము చేయునట్టి జ్ఞానములేలా!
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దేశము+ఈ = దేశమీ' అవుతుంది. యడాగమం రాదు. "మన దేశమ్మీభువిపై" అనండి.
ధన్యవాదములు గురువుగారూ!
తొలగించండి🙏
దేశము గురించి చింతన
రిప్లయితొలగించండికోశము నిత్యము బఠనము, గురువౌ నాశా
పాశము విడి లోని రిపుల
నాశముచే దేశభక్తి ననయున్ గదరా!
***)()(***
ననయు = అంకురించు;పల్లవించు;చిగురించు; పుష్పిచు.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చేయకు నపదేశము నీవు, జోత నిడుము
రిప్లయితొలగించండిదేశ మాత కెపుడు, కూట పాశము బడ
వైచి పంచ కోశములకు వైరు లెపుడు
బాధ నిడు, పవనాశము బడగ క్రింద
వాసమా?నుగ్రవాదము వలదు నీకు,
సోదరా మన జెండాకు మోదమొప్ప
కోటి వందనములు జేయ బోటి పడుము
అపదేశము = మోసము
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కం:-
రిప్లయితొలగించండికోశము పుష్కలమైనను
దేశమ్ము ప్రగతిపథమున దేదీప్యమగున్
కోశమున ప్రేమ పాశము
నాశమయిన సంసృతిఁచెడు నయనాలెదుటన్!!
@ మీ పాండురంగడు*
౨౬/౦౧/౨౦౧౮
మొదటి పాదము న కోశమనగా...బొక్కసము.
మూడవ పాదమున కోశమనగా...ఇల్లు.గృహము.
పాండురంగా రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోశము నెల్లకొల్లగొని గోతులు దీసిన తిన్న ఇంటికే
రిప్లయితొలగించండినాశము తప్ప దెప్పుడును, నాదని భారత భూమి యంతటన్
పాశము లల్లిజూడుమిల, పావన నెయ్యము పల్లవించగన్
దేశము వృద్ధిబొందుటకు తేకువ నింపిన, జన్మధన్యమౌ!!!
పాశముల వలను జిక్కుచు
కోశము పై దృష్టి పెట్టి కొల్లగొనంగన్
నాశము తప్పదు, భారత
దేశమునకు వన్నె తెచ్చు తెరువను గనుమా!!!
శైలజ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
దేశము కొరకై బ్రతుకుము
రిప్లయితొలగించండికోశములను జదివి పెంచు గుణసంపదలన్
పాశమునకు వెరవకుమీ
నాశముగొని తెచ్చుకొనకు నమ్మికుజనులన్
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దేశము కొరకై మనమే
రిప్లయితొలగించండికోశమునన్భీతిలేకకూరిమితోడన్
బాశములనువిడనాడుచు
నాశముదలపెట్టకుండనడవగవలయున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిచలిమల పైన సైనికులు శాంతిని జేర్చుచు దేశమున్ సదా
వలయము గావ కోశముగ వర్ధిలె భారత భూమియే ధరా
తలమున వేద సారముల తత్త్వము పాశము వీడ నేర్పుచున్
పలికె వినాశముల్ వలదు; పాడదగున్ భళి కీర్తి చంద్రికన్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ తాజా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఆశయము లుంచి మది నప
రిప్లయితొలగించండిదేశము నుత్కోశముఁ గడతేర్చుచు నాశా
పాశములు వీడఁగ వలె న
నాశము నైన నిజ దేశ నాగరికు లిలన్
[అపదేశము = కపటము; ఉత్కోశము = కోపము; పాశము = సమూహము; అనాశము = తిండి లేమి]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిదేశముకెన్నడున్ యశము దెచ్చెడి సైనికులార జోహరుల్
రిప్లయితొలగించండిపాశము బంధముల్ మరచి బర్వత పంక్తి హిమాంబుపూరపున్
కోశము నందు రేబవలు గూఢత వర్తిలి శత్రుమూకలన్
నాశము జేయుచుంద్రు భువనమ్మున గల్గిరెమీకు సాటిగన్
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమంచి పూరణ. అభినందనలు.
'జోహరుల్' అన్న పదం సాధువు కాదు.
మహాత్మా గాంధీ స్వర్గమునుండి ఉవాచ:
రిప్లయితొలగించండిదేశమ్మందున భక్తి నిల్పి విడుమా ద్వేషమ్ము క్రోధమ్ములన్
కోశమ్మందున రక్తి వీడి కనుమా కోట్లాది దీనార్థులన్
పాశమ్మౌనుర శక్తి; జాతి, మతముల్ పాటించి పీడింపగన్
నాశమ్మే యనురక్తి, ప్రీతి, నిరతమ్ నావారు నీవారనన్...
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ తాజా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏
తొలగించండిదేశము నాదని తలుపక
రిప్లయితొలగించండినాశము కోరెడి జనుండు నావాడై నన్
కోశము నందలి కత్తియె
పాశము త్రెంపును మరువకు భారత యువతా.
శ్రీనాథ్ గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
దేశముఁ బ్రేమించుండే
రిప్లయితొలగించండికోశముననగౌరవమ్ముఁ గూడదు తమరే
పాశములకులొంగకనె వి
నాశముఁ దలపోయువారి నరకంగవలెన్
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
గురుదేవులకు మరియు కవిమిత్రులకు గణతంత్ర దినోత్స శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఉత్పలమాల
దేశము వీరభోజ్యమని దిద్దిన రీతిగఁ దోచె తంత్రముల్
పాశము వీడలేక మన భారతమందున వారసత్వమున్
కోశము నింప నేర్చిరయ గూల్చఁగ జూచుచు భావి భారతిన్
నాశము నాప దూకుమయ నాటి తరమ్ముల త్యాగమెంచుచున్
సహదేవుడు గారూ,
తొలగించండిప్రశస్తమైన పూరణ. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిదేశము దైవామ్శమ్మే
రిప్లయితొలగించండినాశము గావించ మన వినాశము గలుగున్
పాశము వికటించిన సం
కోశము లేదు భువి నష్ట కూర్పున బడటే !
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దైవాంశమ్మే...' టైపాటు. 'సంకోశము'...?
రిప్లయితొలగించండివాలయమును లోబడి ధర్మ పాశమునకు
హృదయకోశమున పరుల హితముఁ గోరి
స్వార్థ గుణమును సతము నాశమొనరించి
దేశ సంరక్షణ కొరకు దీక్షఁబూను!
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘వనపర్తి☘
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిదేశము నీది నాది సయి దేవళ మై వెలి గెన్ జనాళికిన్
కోశము వేద వాక్కుకును కోరిరి దేవతలున్ ప్రభూతి కా
వేషము లెల్ల తీర గను;పెక్కు వినాశములన్నెదుర్కొనెన్
భూషణ చేయు పాశముగ భూరిగ దీటుగ జైజవాన్! కిసాన్!
జై హింద్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
'వాక్కునకు కోరిరి...' అనండి.
తవద్భిచింతితంమదిం సుపాశభీషణౌత్కటిం
రిప్లయితొలగించండిప్రదేశమీశమానసం ఇయంసునాకసంస్థితం
నిరీహదైత్యనాశనం సమృద్ధి సిద్ధిదాయకం
అశోకకోశసంచితం జయత్వమిండియా సదా |
ఎంత యత్నం చేసినా, యతి మైత్రి అమరలేదు. అది సరిఅయితే, పంచచామరం అవుతుంది.. మా'స్టారు' పాస్ చేస్తారని ఆశ
వెంకటేశ్ ప్రసాద్ గారూ,
తొలగించండిమీ పంచచామరం బాగున్నది. ఇది సంస్కృత భాషలో ఉన్నది కనుక యతి ప్రాసల ఇబ్బంది లేదు.
అయితే నాకు సంస్కృత పాండిత్యం శూన్యం కనుక ఇందలి వ్యాకరణాంశాలను చెప్పలేను.
ధన్యవాదాలు సార్
తొలగించండిలేదది సందియంబు లవలేశము కోశము వేదమేథకే
రిప్లయితొలగించండిమీదగు శౌర్యధైర్యముల
మిన్నులనంటగ క్షాత్రధర్మమున్
కాదగు పాశమందముగ కామితమిచ్చెడి భూమితోడుతన్
చేదగు పాపనాశమది చేరగ ప్రీతిని
కాశిలోపలన్
సాధనజేయగా నిదియె సత్యము జాడను జేకొనంగనే
వాదన మేలరా మనకు భారత దేశము వర్ధిలన్నిటన్!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏🙏
తొలగించండిగురువు గారికి నమస్సులు
రిప్లయితొలగించండినాసందేశమువినుడీ
శ్రీ సంహిత పాశముదార శ్రీశ్రీ లవియున్
నీసంకుల సంకోశం
నా సంగతినందునే వినాశము కొరకే!
నీ నా అనే బేధమున్న దేశము నాశనమగునని భావము తో వ్రాసినాను.
వెంకట నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
రెండవ పాదంలో గణదోషం. 'సంకోశం'?
రిప్లయితొలగించండిదేశమాయెను భారతమ్ముర దేవభూమిగ వెల్గుచున్
కోశమాయెను వేదవిద్యకు కోరి పుట్టిరి దేవతల్
నాశమయ్యిరి దుష్టులున్ను సనాతనమ్మును గూల్చగన్
పాశమున్ గొని దీటుగానటు పాజమున్ గొన మేలగున్
జిలేబి
బాగుందండీ, పాజమనగా ?
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
దేశము నాకిచ్చినట్టియీ దేహమనిన
రిప్లయితొలగించండిపంచకోశముల సదన పాశుపతము
ఎన్ని జన్మల పాశము లిటులముడిని
వేసె!దీని నాశముగోర వేటు వేతు!!
చేపూరి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. సవరించండి.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
దేశము నస్థిర బఱచెడి
పాశము లల్లుచు చరించు పగతుల నెల్లన్
నాశము జేయుచు పవరుల
కోశమునౌ నీ పుడమిని కూయి నునుచుమా!
( కోశము=ఇల్లు/నిలయము; కూయి=రక్షణ)
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పవరుల'?
రిప్లయితొలగించండిదేశ మేమిచ్చెననకు నే దేశమునట
నెగడు కోశముగా నిల్ప నీమమున్ గొ
ని పని జేసి వినాశమున్నింకు జేయ
నేమి చేసితి పాశము నేర్వ దగును !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిబాగున్నది మీ పూరణ. అభినందనలు.
రిప్లయితొలగించండికం:దేశము నందలి పగతురు
కోశములను దోచనెంచి కూరిమి విడుచున్
నాశము చేయగ చూతురు
పాశములనుమరచి సతము వసుధా స్థలిలో.
...కం:దేశపు రాబడి నెల్లను
కోశములకు చేర్చి ప్రజకు కూడును గుడ్డన్
పాశముతోడనొసంగగ
నాశముకానట్టి కీర్తి నాయకునకగున్.
తే.గీ:బంధు పాశము పూనుచు వసుధయందు
వారి కోశము లెల్లను వాసిగాను
నింపు కొనుచు దేశము గూర్చి నెమ్మనమున
చింత చేయక నాశము చేతు రకట
కొందరు మదిని సతతము కూర్మి బాసి.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
వాట్సప్ లో సవరణ సూచించాను. చూడండి.
రిప్లయితొలగించండిదేశమున్ జనాళి దేవళమ్ముగ జూడ
వలె వినాశ మెల్ల వదుల వలెను!
కోశ మవగ వేద ఘోష జిలేబియ
పాశము గను మేలు బాంధవమ్ము !
జిలేబి
- [ ]
తొలగించండిపారగా ఘనభక్త్యపార ప్రవాహమై జనయిత్రిపై
మీరగా దనివారగా జనుమెచ్చగా
నఖిలంబుగా
తీరుగా పలుమారుగా పలుతీరులన్
రచియించగా
వారెవా నిటజూడగాను సవాలుజేసె జిలేబిగా!
హద్దులేని మీ కవితాప్రవాహానికి జోహార్లు! 👏👏👏👌👌👌🙏🙏🙏
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
******
సీతాదేవి గారూ,
జిలేబీ గారిని ప్రశంసించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
🙏🙏🙏🙏🙏
తొలగించండి
తొలగించండిసీతాదేవి గారికి
నమో నమః మత్తకోకిలాద్భుతః
జిలేబులూరుచున్నది :)
మీ ఆప్యాయతకు ప్రొత్సాహానికి నెనరులు సహిత
సావేజిత
జిలేబి
1). పద్మముఖి::ప్రయత్నము,, భభభభభ గ, యతి10వ.
రిప్లయితొలగించండిదేశములోపలదాగిన ధీయుతులందఱుమీ
కోశమునింపకజేయుడికొంచెముమేలిక పై
పాశమువేయుచు లోకపు బాదలబాపుట కై
నాశముచేయగరండిక నాయకరూపమునన్
2). కం||
దేశము నందున దాగిరి
కోశములను నింపుకొనుచు కొందఱు గనుడీ
పాశము సు పాలనకు బడె
నాశనమౌన్యాయమిచట నాయకులారా!
ముమ్మడి చంద్రశేఖరాచార్యులు. పెంట్లవెల్లి.
ముమ్మడి వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
దేశమన్నది గొప్పదౌనుర దేశవాసులు తాము హృ
రిప్లయితొలగించండిత్కోశమందున దేశభక్తిని కోరి నిండుగ నింపగన్
పాశమన్నది స్వచ్ఛ భారతఁ పల్లెపల్లెన చేర్చుటే
నాశమున్నది బీదసాదల నష్టకష్టము లెన్నగన్ ౹౹
రఘురామ్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
రిప్లయితొలగించండితే.గీ.
కోశము విశాల భారత దేశమవగ
నాశయనెడి యా పాశమునాక్రమించ
తెల్లవారు, స్వతంత్రమునకై తెంపు జేసి
శాంతి యోధులు రిపుల నాశమును జేస్రి
రిప్లయితొలగించండితే.గీ.
కోశము విశాల భారత దేశమవగ
నాశయనెడి యా పాశమునాక్రమించ
తెల్లవారు, స్వతంత్రమునకై తెంపు జేసి
శాంతి యోధులు రిపుల నాశమును జేస్రి
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జేస్రి' అనడం సాధువు కాదు.
ధన్యవాదములు సార్
తొలగించండి
రిప్లయితొలగించండిఛందస్సులో గణితాంశములు రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D
http://eemaata.com/em/issues/201209/1991.html?allinonepage=1
పద్యరచన మొదలిడే వారికి ఏ ఛందం తేలికగా ఉంటుంది..
రిప్లయితొలగించండిఆట వెలది
తొలగించండిమూలం:.
తొలగించండివేమన శతకం
ధన్యవాదాలు సార్..
తొలగించండికం. దేశము నాశము కోరక
రిప్లయితొలగించండిపాశము వీడక నిలుచునుపార్ధుని తెరగున్
నాశము ద్రోహుల చేయుచు
కోశము కాపాడువాని కోసము నిలరే
దేశమున ద్రోహచింతన
రిప్లయితొలగించండికోశములను నింపగోరు, కోర్కెలు తీరన్
నాశమె గోరెడు వారల
పాశములన్ని జేరు పాపపు జగతిన్
రిప్లయితొలగించండి..........దత్తపది
దేశము.. కోశము.. పాశము.. నాశము
ఈ పదాలతో దేశభక్తి.
~~~~~~~
సందర్భం: ప్రభుత్వం దోషుల (నేరస్థుల) పాలిట యమపాశంలా ప్రవర్తించాలి. లేకపోతే సమాజంలో శాంతి నాశన మౌతుంది. కోశంలోని ధనాన్ని తగినంత వెచ్చించి శాంతిని పరిరక్షించాలి.
~~~~~
దేశము యొక్క ప్రభుత యమ
పాశము కావలయు దోష పాళికి, లేదేన్
నాశము గాదె ప్రశాంతత!
కోశము వెచ్చించి శాంతి కూర్పగ వలయున్
~ డా.వెలుదండ సత్యనారాయణ
satyam garu! manchi post.dhanyavadalu!
రిప్లయితొలగించండి