జిలేబీ గారూ, పూరణ బాగున్నది. అభినందనలు. "గట్టిగ నెచ్చట..." అనండి. ప-బ లకు ప్రాసమైత్రి లేదు. మీ సవరణ ప్రకారం చూసినా ఆ పాదంలో యతి తప్పింది. సవరించండి. అనంతుని పద్యం "ప్రాసకు హల్సామ్యం ఉంటే చాలు. వాటిమీది అచ్చులతో సంబంధం లేదు" అని చెప్తున్నది. అంటే బ-బి లకు యతి చెల్లదు కాని ప్రాస చెల్లుతుంది. బ-పై లకు యతి చెల్లుతుంది కాని ప్రాస చెల్లదు.
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. వారికి అభినందనలు. ***** జిలేబీ గారూ, అది 'జంబులింగం' కాదు. Jumbling కు తెలుగు రూపం 'జంబులింగు'. జిపియెస్ వారికిచ్చిన సమస్యలో యతి తప్పింది.
ఈనాటి ఆకాశవాణి వారి సమస్యాపూరణంలో మీ పద్యం చదవలేదు కాని పేరు చదివారు. వచ్చే వారానికి సమస్య... "మకరముఁ బట్టినంత రస మంజుల భావము లుద్భవించవో" మీ పూరణలను గురువారంలోగా padyamairhyd@gmail.com కు పంపించండి.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2580 సమస్య :: *బైబిలు లో ఖురానుఁ గని భాగవతమ్ము రచించె నింపుగన్.* బైబిలులో ఖురాన్ ను చూచి చక్కగా భాగవతాన్ని రచించినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం అని అందరికీ సులభంగానే తెలుస్తూ ఉంది. సందర్భం :: ఉపవాసం అంటే భగవంతునికి సమీపంలో ఉండటం అని అర్థం. తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి అని భాగవతం చెబుతుంది. ఖురాను చెబుతుంది. బైబిలు కూడా చెబుతుంది. అన్ని మతాల గ్రంథాలను చదివి వాటిలోని సారాన్ని గ్రహించిన శ్రీ రామకృష్ణ పరమహంస *’’ బాబూ ! మార్గాలు వేఱైనా ఉన్న భగవంతు డొక్కడే ‘’* అని బోధించగా వినిన ఒకవ్యక్తి సర్వ మత సారాన్ని సమన్వయపరచుకొంటూ , బైబిలులో ఖురాన్ ను చూస్తూ , భాగవతాన్ని వ్రాసినాడు అని చెప్పే సందర్భం.
ప్రభాకర శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఇప్పుడు అంతటా మార్కుల సిస్టం పోయి గ్రేడింగ్ విధానం వచ్చింది. మీ పద్యానికి నేనిచ్చే గ్రేడింగ్... B1.
బాబు పఠించె నెందునట? పావన క్రీస్తు చరిత్ర జెప్పుమా! బాబరు దేన్ని గాంచి కడు భక్తిని జూపును? పోతనార్యుడే ప్రాభవ మొల్కురీతి తను వ్రాసిన గ్రంథమదేది?యెవ్విధిన్ ? బైబిలు లో, ఖురాను గని, భాగవతంబు రచించె, నింపుగన్.
జిలేబి గారు నా భావ మేమి టనిన వివిధ కేంద్రాలలో నేక సమయమున ప్రసారమయ్యే కథనములు విడివిడిగా నొక దానిలో బైబిలులో.. యని; మరియొక దానిలో ఖురానుఁ గని... యని; మూడవ దానిలో భాగవతంబు రచించె.. యని వినిపించినవి యని.
క్రితం జమానా యువ పత్రిక లో రెండు మూడు రేడియో స్టేషన్లలో కలివిడిగా వచ్చే ప్రోగ్రామ్ ( ఫ్రీక్వెన్ సీ ప్ర్రాబ్లెమ్స్ వల్ల ) ఎట్లా వుంటుందో దాని మీద హాస్య రచనలు వచ్చేవి.
...........సమస్య బైబిలు పరికించి వ్రాసె భాగవతంబున్ ~~~~~~ సందర్భం: భాగవత మంటే ఆతని కిష్టం. దాన్ని చదివి వ్రాసుకునేవాడు. ఆతని చేతికి బైబిలు నిస్తే ( చదువనే లేదు) ఒకసారి చూచి (పరికించి) పక్కన పెట్టేశాడు. భాగవతాన్ని మాత్రం వ్రాశాడు. ~~~~~~ ఆ బమ్మెర కవి కవనము
రిప్లయితొలగించండిసాబిత్ జేసె జిలేబియు
బైబిలుఁ బరికించి, వ్రాసె భాగవతమ్మున్,
కాబిలగ గాంచి కందము,
శోభిల్లు విభుడు ప్రకృతియు సొబగుల నొకటే !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్యలోనే 'బైబిలు' అన్న అన్యదేశ్యం ఉన్నందున 'సాబిత్, కాబిల్' పదాల ప్రయోగం ఆమోదయోగ్యమే.
ఏబాస యందు పిలిచిన
రిప్లయితొలగించండినాబాసనె వల్కు నాత్మ నరవర వినుమా!
కాబోలు! పోతన మదిని
బైబిలుఁ బరికించి వ్రాసె భాగవతమ్మున్!
"యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ భజామ్యహమ్|"
తొలగించండి
తొలగించండిపోతన కాలానికి బైబిలు ఆంగ్లము దేశం లో వచ్చి ఉంటుందంటా రా :)
జిలేబి
కాబోలు! పోతన "మదిని"
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిగాబర యేల, యేసు కథ గట్టిగ యెచ్చట జూడ మేలగున్ ?
సాబుతు గా మహమ్మదు ప్రసారము దేశము లెట్లు గాంచెనౌ ?
ఓపము వీడి చెప్పుమిక బొప్పన భట్టు రచించె నేమియో ?
బైబిలులో; ఖురానుఁ గని; భాగవతంబు రచించె నింపుగన్!
జిలేబి
బొప్పన భట్టు రచన భాగవతము - ఆంధ్ర భారతి ఉవాచ
"పా"కును షోకుగన్ మరియు "బా" కును ప్రాసను గూర్చితే భళా!
తొలగించండి
తొలగించండిఓబను వీడి అని చదువుకొనుడు మరీ స్ట్రిక్ట్ అయినచో :)
ఓబ - మూసకట్టు
జిలేబి
స్త్రిక్టది నేను కాదుగద శ్రీగురు భీకర శంకరుల్ సదా!
తొలగించండి
తొలగించండిప బ లకు ప్రాస నిజంగానే లేదంటారా ?
జిలేబి
నేనేమన్నా లాక్షణికునా? సారు ఇలాటివి వీలైనంత వరకు avoid చేయమంటుంటారు కదా!
తొలగించండి
తొలగించండినాకూ తెలియదండి !
తెలిసిన వారు వివరించ గలరు ;
పరువడి ప్రాసములు సమా
క్షరసంశోభితములయిన జాలును మరి త
త్స్వరవైసాదృశ్యంబులు
పరిహరణీయంబు లందు పంకజనాభా !
కొట్టుకొచ్చినది
అనంతామాత్యుని ఛందో దర్పణము
జిలేబి
*ఈ పుస్తకము జిలేబికి ఉభయము గానిచ్చినవారు కష్టేఫలే శర్మ గారు
జిలేబి
👏👏👏🌹🌹🌹👌👌👌
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండిపూరణ బాగున్నది. అభినందనలు.
"గట్టిగ నెచ్చట..." అనండి.
ప-బ లకు ప్రాసమైత్రి లేదు.
మీ సవరణ ప్రకారం చూసినా ఆ పాదంలో యతి తప్పింది.
సవరించండి.
అనంతుని పద్యం "ప్రాసకు హల్సామ్యం ఉంటే చాలు. వాటిమీది అచ్చులతో సంబంధం లేదు" అని చెప్తున్నది. అంటే బ-బి లకు యతి చెల్లదు కాని ప్రాస చెల్లుతుంది. బ-పై లకు యతి చెల్లుతుంది కాని ప్రాస చెల్లదు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిమా బడి పిల్లగాడొకడమాయకుడింటరు జంబులింగులో
నాబగ ప్రక్కవానిని సహాయము కోర నతండు వ్రాయగా
బైబిలు వాక్యమున్, మరొక ప్రక్కన ముస్లిము వ్రాయఁ జూచి తా
బైబిలులో ఖురానుఁ గని భాగవతంబు రచించె నింపుగన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండిఅదురహో 'జంబులింగము' మైలవరపు వారు ;)
జిలేబి
జిలేబీ గారికి నమోవాకములు... మీకు కూడా 🙏
తొలగించండి...మైలవరపు వారు
తొలగించండిజీపీయెస్ వారికి వృత్తము
అల్లాక్రీస్తులు రామచంద్రు సుతులై పాలించిరే లోకమున్
చీర్స్
జిలేబి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. వారికి అభినందనలు.
తొలగించండి*****
జిలేబీ గారూ,
అది 'జంబులింగం' కాదు. Jumbling కు తెలుగు రూపం 'జంబులింగు'.
జిపియెస్ వారికిచ్చిన సమస్యలో యతి తప్పింది.
తొలగించండిఅల్లాక్రీస్తులు రామచంద్రు సుతులయ్యా శాస్త్రి! సేవించుమా!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిధన్యవాదాలు.
"అల్లా రామునకు పుత్రుఁ డయ్యా శాస్త్రీ"
లేదా...
"అల్లా క్రీస్తులు రామచంద్రు సుతు లయ్యా శాస్త్రి! సేవింపుమా"
ఈ సమస్యను 3-2-2018 నాటికి షెడ్యూల్ చేశాను.
క్వొశ్చెన్ పేపర్ లీకయింది. మీకు పూరించడానికి వారం రోజుల టైముంది.
తొలగించండిసార్! కొద్ది సేపటిలో నా పూరణ కూడా ఇచ్చట లీకు కానున్నది..
తొలగించండి😂😂😂
ముల్లాయొక్కడు తా మసీదు తలుపుల్ మూయించి "కాదో"యనెన్:
తొలగించండివిల్లాలో దొరగారొకండు పయిపున్ పీల్పించి "కాదో"యనెన్ :
గుళ్ళోబాపడు దీపమార్పి చెవులన్
గోకించి "నిక్కమ్మ"నెన్:
"అల్లా క్రీస్తులు రామచంద్రు సుతు లయ్యా శాస్త్రి! సేవింపుమా!"
ఏ బడి యందు నేర్చిననదేమి ? జగమ్మును రక్షజేయు వా...
తొలగించండిడే బలవంతుడందురతడే హరి క్రీస్తు , ప్రవక్త , మువ్వురిన్
ధీ బలంతుడొక్కడు గ్రథించెను పొత్తమునందు , గాంచుమా !
బైబిలులో ఖురాను గని భాగవతమ్ము రచించె నింపుగన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండిజీపీయెస్ వారి పూరణకు సాటి లేదిలలో
అదురహో ! అదురహో అదురహో
ఇంతగా చెవుల మూయించి వాయించి గోకించి తే ఒప్పుకోక చస్తాడా మానవుడు !
జిలేబి
సూపర్
జిలేజిలేబి
🙏🙏🙏
తొలగించండి
తొలగించండివావ్ ! కంది వారు దీన్ని షెడ్యూల్ చేసారా ప్రచురణకు
నమో నమః
ఆల్ ది బెస్ట్ !
చీర్స్
జిలేబి
6/3/2017 సమస్య 2301
తొలగించండి“అరయగ రాముని కుమారు లల్లా క్రీస్తుల్”
లేదా
“ అల్లా క్రీస్తులు రామచంద్రు సుతులే యాశ్చర్య మేమిందులో”
తొలగించండిఅల్లా క్రీస్తులు రామచంద్రు సుతులయ్యా శాస్త్రి! సేవించుమా!
ఇల్లామల్లియదేలనమ్మ రొ జిలేబీ! ఓ వయారీ! యిలా
అల్లాటమ్ములవేల శంకరు సభాప్రాంగమ్ము నన్ వెళ్ళవే
పిల్లా! వెళ్ళుసుమా!యిలా పదములన్ బేర్చంగ మాకే సఖీ !
సాబలు'డేసు'ను దైవమె!
రిప్లయితొలగించండిబైబిలుఁబరికించి వ్రాసె భాగవతమ్ము
న్నాబగ తత్కథలెల్లను
ప్రాబల్యముఁగూర్ప పాప పరిహారముగన్
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిశోభిల్లు ననుకొని గ్రంధము
రిప్లయితొలగించండిబైబిలుఁ బరికించి వ్రాసె భాగవ తమ్మున్
యేభక్తి భావ మైనను
యీభూ మినిలేద నంగ భిన్నత్వ మటన్
శోభిల్లు ననుచు గ్రంధము
రిప్లయితొలగించండిఅక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని... బ-భ ప్రాసను ప్రయోగించారు. 'భాగవతమ్మున్ + ఏ, ఐనను+ఆ' అన్నపుడు యడాగమం రాదు. "భాగవతమ్ము। న్నేభక్తిభావ మున్నను। నీ భూమిని..." ఆనండి.
శోబిలు ననుకొని గ్రంధము
తొలగించండిబైబిలు బరికించి వ్రాసె భాగవ తమ్ము
న్నేబత్తి భావ మైనను
నీబూమిని లేద నంగ భిన్నత్వ మటన్
రాబోటు ను కని పెట్టి యు
రిప్లయితొలగించండితోబు ట్టు వు కీ య నతడు తోచిన రీతి న్
కీ బోర్డు తిప్పగా నది
బైబిలు పరి కించి వ్రాసె భాగ వ త మ్మున్
తొలగించండిసూపర్ !
జిలేబి
థాంక్స్
తొలగించండిరాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ప్రాభవదీప్తితో వెలుగు పావన యేసునుజూడు మిచ్చటన్,
రిప్లయితొలగించండిరేబవలున్నమాజుతమ రీతిగ జెప్పెప్రవక్త నెక్కడన్?
ఆభగవంతులీలలిల హాయిగ పోతన యెట్లుజెప్పెనో
బైబిలులో, ఖురానుగని, భాగవతంబు రచించె నింపుగన్
చేపూరి వారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
బ-భ ప్రాస వేశారు. "...నెక్కడ। న్నాభగవంతు..." అనండి.
కూబి యొకడు బల్కె నిటుల,
రిప్లయితొలగించండిబైబిలుఁ బరికించి వ్రాసె భాగవతమ్మున్
శాబకము క్రింద బడగా
నా బోయ యొకడు దశరధ నామము తోడన్
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురువర్యుల ఉవాచ...
రిప్లయితొలగించండిడాబు కవులకు సవాలిది!
మీ బాబులను తలచుకునె మిక్కిలిగా క్లి
ష్టంబౌ సమస్య నిడెదను
బైబిలు పరి కించి వ్రాసె భాగ వ త మ్మున్
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో ప్రాస తప్పింది. "మిక్కిలి కష్టం। బై బెదరించు సమస్యయె..." అందామా?
శతావధాని జి.యం. రామశర్మ గారి పూరణ.....
రిప్లయితొలగించండిధీబలసంపదన్ గనఁగ దేవుఁ డొకండె కదోది మిత్రమా!
యీ బహుదేవతాత్మక మహీతలమందు మతైక్యవాది మే
ధాబుధుఁ డొక్కఁ డొక్కట మతాల సమన్వయచర్చ చేయుచున్
బైబులో ఖురానుఁ గని భాగవతంబు రచించె నింపుగన్.
ఆబగ క్రైస్తవగురు విటు
రిప్లయితొలగించండిడాబుగ ప్రవచనమునందు డప్పులుగొట్టెన్
గంభీర వాక్కు హిందువు
బైబిలు బరికించి వ్రాసె భాగవతమ్మున్
లేదా
గాబర పడకుడు హిందువు
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాబిన్ ప్రవచించె సభన
రిప్లయితొలగించండిబైబిలుఁ బరికించి, వ్రాసె భాగవతమ్మున్
ప్రాభవ మొప్పెడు భంగిన
నా భాషన పోతనకవి నాణ్యపు కృతిగన్
విరించి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"భంగిని...భాషను.." అనండి.
రిప్లయితొలగించండిసవరణ:
గాబర యేల, యేసు కథ గట్టిగ యెచ్చట జూడ మేలగున్ ?
సాబుతు గా మహమ్మదు ప్రసారము దేశము లెట్లు గాంచెనౌ ?
ఓబను వీడి చెప్పుమిక బొప్పన భట్టు రచించె నేమియో ?
బైబిలులో; ఖురానుఁ గని; భాగవతంబు రచించె నింపుగన్!
జిలేబి
సవరించారు బాగుంది... మరి మూడవ పాదం యతి?
తొలగించండి
రిప్లయితొలగించండిఏమండోయ్ జీపీయెస్ వారు
ఆకాశవాణి సమస్యాపూరణ వచ్చే వారమున కేమి ?
ఈ వారపు విశేషాలేమిటి ?
జిలేబి
ఈనాటి ఆకాశవాణి వారి సమస్యాపూరణంలో మీ పద్యం చదవలేదు కాని పేరు చదివారు.
తొలగించండివచ్చే వారానికి సమస్య...
"మకరముఁ బట్టినంత రస మంజుల భావము లుద్భవించవో"
మీ పూరణలను గురువారంలోగా padyamairhyd@gmail.com కు పంపించండి.
తొలగించండివాహ్ క్యా బాత్ హై :)
వికసిత కోమలాంగి యెద వేగము గాంచదె పూవుబోడియా,
చెకుముకి రాయి కైపుల సచేతన గల్గదె మానసంబునన్,
పకపక నవ్వులన్ మగడు పక్కకు వచ్చుచు నింబునివ్వ, లే
మ! కరముఁ బట్టినంత రస మంజుల భావము లుద్భవించవో!
జిలేబి
కరన్యాసము అదిరింది!!! మరి అంగన్యాసమో?
తొలగించండి
తొలగించండిబాలక్ కీ రమణ్ ! కీ కొరే బుజాయ్ లాగే
జాగ్రత జాగ్రత! క్రిందనున్న అవధాని విజయ కుమార్ గారు వంగ భాషా కోవిదులు!
తొలగించండిజిలేబీ గారి కరవిన్యాసముపై స్పందన:
తొలగించండి"చాలా బాగుంది"
...గుమ్మా నాగమంజరి
జిలేబీ గారికి:
తొలగించండివికలములైన మానసపు వీణలు మ్రోగక భీతి నొందగా
సకలము మానవాళియు నిశాచరులౌచును సంతసించగా
చకచక పానశాలన విచారము దీర్చు మధూళి లాహిరీ
మకరముఁ బట్టినంత రస మంజుల భావము లుద్భవించవో!
తొలగించండిజీపీయెస్ వారు
బాగు బాగు
పంపించారా ఆకాశవాణి వారికి?
జిలేబి
అబ్బే! లేదు లేదు .. సరదాకి మాత్రమే!!!
తొలగించండిరూబేను భాగవతమును
రిప్లయితొలగించండిరాబడికై వచనమందు వ్రాయదలంచెన్!
ధీ బలము పొంద ముందుగ
బైబిలుఁ బరికించి, వ్రాసె భాగవతమ్మున్
విజయకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
శోభగ కృష్ణుని క్రీస్తుని
రిప్లయితొలగించండిశ్రీభగవల్లీలల దన చిన్మయదృష్టి
న్నా బమ్మెరకవి మదిలో
బైబిలు బరికించి,వ్రాసె భాగవతమ్మున్.
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2580
సమస్య :: *బైబిలు లో ఖురానుఁ గని భాగవతమ్ము రచించె నింపుగన్.*
బైబిలులో ఖురాన్ ను చూచి చక్కగా భాగవతాన్ని రచించినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం అని అందరికీ సులభంగానే తెలుస్తూ ఉంది.
సందర్భం :: ఉపవాసం అంటే భగవంతునికి సమీపంలో ఉండటం అని అర్థం. తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి అని భాగవతం చెబుతుంది. ఖురాను చెబుతుంది. బైబిలు కూడా చెబుతుంది. అన్ని మతాల గ్రంథాలను చదివి వాటిలోని సారాన్ని గ్రహించిన శ్రీ రామకృష్ణ పరమహంస *’’ బాబూ ! మార్గాలు వేఱైనా ఉన్న భగవంతు డొక్కడే ‘’* అని బోధించగా వినిన ఒకవ్యక్తి సర్వ మత సారాన్ని సమన్వయపరచుకొంటూ , బైబిలులో ఖురాన్ ను చూస్తూ , భాగవతాన్ని వ్రాసినాడు అని చెప్పే సందర్భం.
బాబు ! ఖురాను జెప్పె నుపవాస మవశ్య మటంచు చక్కగా,
బైబిలు బోధ యందు నుపవాస మవశ్య మటంచు దెల్పె, రా
వా బతు కౌను ధన్య మనె భాగవత మ్ముపవాస రీతి, జీ
వా ! బహు మార్గవర్తి ! భగవాను డొకం డని రామకృష్ణుడే
ధీ బల సంపదన్ బలుక , దీని నొకండు సమన్వయించుచున్,
*బైబిలులో ఖురాను గని భాగవతమ్ము రచించె నింపుగన్.*
*కోట రాజశేఖర్ నెల్లూరు.* (27.01.2018)
తొలగించండిఅద్భుతః
జిలేబి
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
👌
తొలగించండి"మహతః పరమవ్యక్తం
రిప్లయితొలగించండిఅవ్యక్తాత్పురుషః పరః
పురుషాన్నపరం కించిత్
సా కాష్ఠా సా పరా గతిః"
"లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్"
*****************************
ఆ భగవంతుడే వెలసె నాత్మకు రూపుల వేరువేరుగా
శ్రీ భగవానుడే మురిసె చీకటికావల వెల్గుగా మది
న్నా బుధమూర్తినే దలచి యాకవి బమ్మెర గ్రామమందు నన్
బైబిలులో ఖురానుఁ గని భాగవతంబు రచించె నింపుగన్
****************************
సార్! "బ" "భ" ల ప్రాస తప్పలేదు. 20 మార్కులకన్నా ఎక్కువ కట్ చేయ వలదు.... బెంగాలీ వాడిని...
🙏🙏🙏
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ మార్కుల గోలయేమి టీచరుగారూ?🤔🤔🤔🤔
తొలగించండికోరిన వారికి సార్ మార్కులు కూడా వేస్తారు... గమనించలేదా?
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇప్పుడు అంతటా మార్కుల సిస్టం పోయి గ్రేడింగ్ విధానం వచ్చింది.
మీ పద్యానికి నేనిచ్చే గ్రేడింగ్... B1.
🙏🙏🙏
తొలగించండిA1 : 96-100 / A2 : 91-95 / A3 : 86-90 / A4 : 81-85 / A5 : 76-80
తొలగించండిB1 :71-75 / B2 : 66-70 / B3 : 61-65 / B4 : 56-60 / B5 : 51-55
C1 : 46-50 / C2 : 41-45 / C3 : 36-40 / C4 : 31-35 / C5 : 26-30
D1 : 21-25 / D2 : 16-20 / D3 : 11-15 / D4 : 6-10 / D5 : 1-5
E : 0
👏👏👏
తొలగించండిప్రభాకర శాస్త్రి గారు బహు చతురులు
తొలగించండిడిసిప్లిన్ లేదని 10 మార్కులు కోసినట్లున్నారు గదా!
తొలగించండినేనూ జిలేబీ గారూ రౌడీలమే మరి..
🙌🙌🙌
తర్వాత స్నాతకోత్సవమూ పట్టాప్రదానమూ కూడ ఉంటాయా? కోర్సు సమయమెంత?
తొలగించండిఇక్కడ రోజూ పండగే!
తొలగించండిపదములు పాదాలుగనయె*
తొలగించండిచదువులు చెప్పెడి గురువులు చదువరు లయ్యెన్*
పదపడి పద్యాలల్లుచు*
ముదముగ సందడిని జేసె ముచ్చట నిచటన్*
పిల్లల మాదిరి పెద్దలె*
కొల్లలు పద్యాల తోడ గోలను చేయన్*
అల్లన నవ్వులు చిందుచు*
మెల్లగ దండింప జూచు మిక్కిలి ప్రేమన్*
శంకరుల వంటి గురువులు*
నింకెరముగ విద్య నేర్ప నియమము తోడన్*
వంకలు జూపక వ్రాయుచు*
నింకొందరు ముందు బెంచి నిష్టము చూపున్*
బాలల వలె పండితులను*
చాలగ హాస్యమును పంచ సరదా పుట్టెన్*
ఆలించుచు వీరి పలుకు*
లీలలు వేయుచును చూస్తి నిక్కడ నేనున్*
సందడిగ తోచె నిచ్చట*
అందరి ముచ్చటల చదివి యానందముతోన్*
విందయె మనసుకు నిండుగ*
సుందరమౌ పద్య గరిమ సుమధుర మయ్యెన్*
***నాగమంజరి గుమ్మా***
ఆబల్లన యేసు వార్తను
రిప్లయితొలగించండి"బైబిలుఁ బరికించి వ్రాసె, భాగవతమ్మున్"
శోభిల్లు పద్యమొక్కటి
యా బుడతడె వ్రాసెనచ్చట తరగతి గదిన్
బోర్డు అనే పదానికి బల్ల సమానార్థకమని వ్రాసితిని!
☺️
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. "ఆ బల్లను ప్రభు వార్తను" అనండి.
నాల్గవ పాదంలో గణ యతి దోషాలున్నవి. "...యా బుడతడె వ్రాసె నచట నా తరగతిలోన్/గదిలోనన్" అనండి.
ధన్యవాదాలు గురువుగారూ!
తొలగించండిఆఫీసుకెళ్ళే హడావుడిలో "బ"ను లఘువుగా పొరపడి తప్పు చేశా!☺️
డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
రిప్లయితొలగించండివైభవ మొప్పు క్రైస్తవుల ప్రార్థన లెచ్చట గాంతురో గదా?
లోభము మాని ముస్లిములు లోపము లేక పఠింతురేదియో??
శోభన మూర్తి గోపవిభు జ్యోత్స్నలు పోతన నేమి జేసెనో ???
బైబిలులో;ఖురానుగని; భాగవతంబు రచించె నింపుగన్
చారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బ-భ ప్రాసను ప్రయోగించారు.
బాబు పఠించె నెందునట? పావన క్రీస్తు చరిత్ర జెప్పుమా!
రిప్లయితొలగించండిబాబరు దేన్ని గాంచి కడు భక్తిని జూపును? పోతనార్యుడే
ప్రాభవ మొల్కురీతి తను వ్రాసిన గ్రంథమదేది?యెవ్విధిన్ ?
బైబిలు లో, ఖురాను గని, భాగవతంబు రచించె, నింపుగన్.
విరించి గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
'దేనిఁ గాంచి" అనండి.
డాబుగ యేసు కథ నొకడు
రిప్లయితొలగించండిబైబిలుఁ బరికించి వ్రాసె;భాగవతమ్ము
న్నా బావను భేదించుచు
తాబూనికతో రచించె ధర పోతనయే!
నిన్నటి దత్తపది కి నా పూరణ
నాశము కులమత భావము ;
దేశమునకు సేవజేయ ధీయు తుడయి యే
కోశము నైన దురాశా
పాశమునన్ బడక యుంట పర మోత్తమమౌ
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'ఆ బావను'...?
రిప్లయితొలగించండిమరో ప్రయత్నం
బాబయ! ఐలయా! గలదె భారత దేశపు మూల మెచ్చటన్ ?
సాబుతు జేసి నావటగ శంకరు డుండెను మక్క లోనెటుల్ ?
పోబడి గాంచినావటగ పోతన గాదకొ బొప్పనయ్యటన్?
బైబిలులో; ఖురానుఁ గని; భాగవతంబు రచించె నింపుగన్!
జిలేబి
👌
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆబగ చదివించెడు నిది
రిప్లయితొలగించండియీ బిగి కృతినా రచయిత యెవ్విధి వ్రాసెన్?
దాబూని పోతన నలచె;
బైబిలు బరికించి వ్రాసె ; భాగవతమ్మున్.
****++++****
నలచు = వ్రాయు
****)()(****
డాబుయు దర్పమున్ మఱియు డంబము వద్దని చెప్పిరెందులో?
ఆ బకరీదు పర్వమునె యార్తిగ జేతురె యెవ్విధంబుగన్ ?
దూబకు నైన బోధ పడు ధోరణి యొప్పగ పోతనార్యుడే!
బైబిలులో ; ఖురాను గని ; భాగవతంబు రచించె నింపుగన్.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'డాబును దర్పమున్...' అనండి.
కం:-
రిప్లయితొలగించండిఆబాలవృద్ధమునెపుడు
ప్రభాసితంబగు నసదృశ భాగవతమ్మున్
నే బాలుడీ విదమ్మున
బైబిలుఁ బరికించి వ్రాసె భాగవతమ్మున్ !!!
@ మీ పాండురంగడు*
౨౭/౦౧/౨౦౧౮
పాండురంగారెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"భాగవతమ్ము। న్నే బాలుడీ..." అనండి.
🙏🙏🙏
తొలగించండికం:-
ఆబాలవృద్ధమునెపుడు
ప్రభాసితంబగు నసదృశ భాగవతమ్ము
న్నే బాలుడీ విదమ్మున
బైబిలుఁ బరికించి వ్రాసె భాగవతమ్మున్ !!!
@ మీ పాండురంగడు*
౨౭/౦౧/౨౦౧౮
అన్ని పాదాలలోనూ మొదటి అక్షరం గురువై ఉండాలి.
తొలగించండిగురువులు క్షమించగలరని మనవి 🙏🙏🙏
తొలగించండికం:-
ఆబాలవృద్ధమునలరు
ప్రాబల్యంబగు నసదృశ భాగవతమ్ము
న్నే బాలుడీ విదమ్మున
బైబిలుఁ బరికించి వ్రాసె భాగవతమ్మున్ !!!
@ మీ పాండురంగడు*
౨౭/౦౧/౨౦౧౮
గురువులు క్షమించగలరని మనవి 🙏🙏🙏
తొలగించండికం:-
ఆబాలవృద్ధమునలరు
ప్రాబల్యంబగు నసదృశ భాగవతమ్ము
న్నే బాలుడీ విదమ్మున
బైబిలుఁ బరికించి వ్రాసె భాగవతమ్మున్ !!!
@ మీ పాండురంగడు*
౨౭/౦౧/౨౦౧౮
ఆబగ నన్ని గ్రంధ ము ల నాతత మౌపరిశీలనంబు గా
రిప్లయితొలగించండిబాబొకరు oడుదా చదివె భక్తి పుర స్సరమైన బుద్ది తో
డా బు గ వ్రాసె నయ్యే డ ల డం బ ము నొప్పగ నవ్య రీతి గ న్
బైబిలు లో ఖురాను గని భాగవతం బు రచించె నింపు గ న్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
శంకరాభరణము
రిప్లయితొలగించండినేటిసమస్యాపూరణం; బైబిలు పరికించి వ్రాసె భాగవతమ్మున్.
బాబూ! దేవుని దూతయె
బైబిలు పరికించి వ్రాసె; భాగవతమ్మున్
చే బూని వ్రాసె భక్తిన్
ధీ బలమున్ పోతన మన తేటతెలుగునన్.
మేడిచర్ల హరినాగభూషణం,గద్వాల.
హరినాగభూషణం గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"ద్జీబలమున" అనండి.
మాబడి లోన పిల్లలము మాష్టరు లేనిది జూసి నెమ్మదిన్
రిప్లయితొలగించండి*టాబున* జూడజొచ్చితిము డాబులు జూపెడి *డోరెమానుషో*
*నోబిత* చెప్పెనందు తన నోటను చిత్రము *డోరెమానుడే*
*బైబిలులో ఖురానుఁ గని భాగవతంబు రచించె నింపుగన్*
జాబిలి వోలెశాంతినిడు సామియె యేసని వ్రాసెనెందులో?
సాబుగ మారెనెద్దిగని సంతసమంది దిలీపుడక్కటా?
రేబవలున్ శ్రమించితను ప్రీతిగ పోతన వ్రాసెనెద్దిరా?
*బైబిలులో! ఖురానుఁ గని! భాగవతంబు రచించె నింపుగన్!*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
*దిలీప్ కుమార్=AR రెహమాన్
*సాబు=సాహెబ్
శ్రీహర్ష గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు చాలా బాగున్నవి. అభినందనలు.
ఊబియ సంసారమ్మని
రిప్లయితొలగించండియేఁబది యేండ్లవి రయముగ నిలఁ బ్రాయము దాఁ
బైఁబడ మతేతరుఁ డొకఁడు
బైబిలుఁ బరికించి వ్రాసె భాగవతమ్మున్
[భాగవతము = భగవంతుని చరిత్ర]
తాఁ బలుకంగ నింపు జనతా రత మంచు తలంచి యన్ని గా
రాబపుఁ గేంద్ర రాజములు రాజిల నిత్యము దూరవాణులన్
రేబవలెల్ల సాఁగెడు తరిన్ వినిపించెను ముక్క ముక్కలై
బైబిలులో, ఖురానుఁ గని, భాగవతంబు రచించె నింపుగన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండి
తొలగించండిఈ వృత్త పద్యానికి అర్థమేమిటండి ?
జిలేబి గారు నా భావ మేమి టనిన వివిధ కేంద్రాలలో నేక సమయమున ప్రసారమయ్యే కథనములు విడివిడిగా నొక దానిలో బైబిలులో.. యని; మరియొక దానిలో ఖురానుఁ గని... యని; మూడవ దానిలో భాగవతంబు రచించె.. యని వినిపించినవి యని.
తొలగించండి
తొలగించండిఅహ్హహ్హా ! బాగుందండీ !
క్రితం జమానా యువ పత్రిక లో
రెండు మూడు రేడియో స్టేషన్లలో కలివిడిగా వచ్చే ప్రోగ్రామ్ ( ఫ్రీక్వెన్ సీ ప్ర్రాబ్లెమ్స్ వల్ల ) ఎట్లా వుంటుందో దాని మీద హాస్య రచనలు వచ్చేవి.
దానిని గుర్తుకు తెస్తోంది !
నెనరులు సమయం తీసుకుని వివరించినందులకు
జిలేబి
ఆ బరమాత్ముడౌ హరియు,నవ్విధి క్రీస్తు,మహమ్మదొక్కరే
రిప్లయితొలగించండిబైబిలుయున్,ఖురానుయును,భాగవతమ్మదియొక్కటంచు వా
వేబలుకున్ వివేక రసవేద్యుడొకండతిమోదమందుచున్
బైబిలులో, ఖురానుఁ గని, భాగవతంబు రచించె నింపుగన్
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,
ఒక పంతులయ్య బైబిలు , ఖురాను కూడ చదివి భాగవతము
వ్యాశాడట. !
మా బడి పంతులయ్య యగు " మారుతి ". యన్ని మతాల గ్రంధముల్
తా c బరికించు చక్కని బుధప్రవరుండు | గ్రహించి వస్తువున్
బైబిలు లో , ఖురాను గని , భాగవతంబు రచించె నింపుగా న్ |
" ప్రాబుల " మేమి లేదు , వచనం | బొక పద్యము గూడ లేదుగా !
{ ప్రాబులము = ఒక విద్యార్థి అంటున్న మాటలు . విద్యార్థులు
సహజంగా మధ్యలో ఆంగ్ల పదాలు ఉపయోగిస్తారు కదా ! }
ఆ బల్లిదులు మహమ్మదు
రిప్లయితొలగించండిప్రాబల్యమె మెత్తురు తమ భావములెల్లన్
వేబలికి వ్రాయమన కవి
బైబిలు పరికించి వ్రాసె భాగవతంబున్
కందం
రిప్లయితొలగించండిరేబగలుఁ జూచి పోతన
యేబాటయు వ్యాస పథమునెదిరించదనన్
ప్రాబల్యము గలిగినదౌ
బైబిలుఁ బరికించి వ్రాసె భాగవతమ్మున్
యేబలమీ జగంబునడు పేబలుడిచ్చును రక్షకత్వము
రిప్లయితొలగించండిన్నేబలమర్కచంద్రులను నిశ్చితరూపున నిల్పగాదగు
న్నాబలమే తలంచమను నన్నిటనంచును గానగామదిన్
బైబిలులో ఖురానుగని భాగవతము రచించె నింపుగన్!
నా “శ్రీమదాంధ్ర సుందర కాండ” చతుఃపఞ్చాశ సర్గమున నేటి పద్యములలో నొకటి.
రిప్లయితొలగించండిసుతల త్రికూట శిఖ రా
గ్ర తల స్థిత హరి గజారి రాజిలె నచటన్
నుత కిరణాలీన నిభమ
సి తానల జ్వాల వాల చిత్రము తోడన్
మూలము:
త్రికూటశృఙ్గాగ్రతలే విచిత్రే
ప్రతిష్ఠితో వానరరాజసింహః.
ప్రదీప్తలాఙ్గూలకృతార్చిమాలీ
వ్యరాజతాదిత్య ఇవాంశుమాలీ৷৷5.54.44৷৷
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
ప్రాబలుకుల ధర్మంబుల
నాబంధముగా వెలార్చునట్టి పొత్తముల
న్నాబమ్మెరకవి కూర్చుచు
బైబిలు పరికించి వ్రాసె భాగవతమ్మున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ బలమంత నేనె యని మించిన తీరుగఁ బల్కె యేసు తాఁ,
రిప్లయితొలగించండిబాబరునా తురుష్కులును ప్రార్థనఁ జేతురు దేనిఁ గాంచి వి
ద్యాబల భూషితాత్ముఁడు బుధానుఁడు పోతన నేర్పుమీరగన్
బైబిలులో, ఖురానుఁ గని,భాగవతంబు రచించె నింపుగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్రాబల్యం క్రైస్తవులకు
రిప్లయితొలగించండిబైబులు!బరికించి వ్రాసె భాగవతమ్మున్
శ్రీ బాలకృష్ణ లీలలు
దోబూచుల భక్తి రసము తొణకిసలాడెన్ !
మాబడిదరినొకబాలుడు
రిప్లయితొలగించండిసొబగుందనమ్ములులేకసూటిగబలికె
న్బాబయ పిన్నులతోడన
బైబిలుపరికించివ్రాసెభాగవతమ్మున్
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిశోభగ డేవిడ్ రచయిత
బైబిలు పరికించి వ్రాసే, భాగవతమ్మున్
రాo భట్టు సోదరుల్ జ్ఞా
నాంబుల్ వికసిత మగునటు నామది దోచెన్.
వ్రాసె గ చదువ ప్రార్థన
రిప్లయితొలగించండిదోచెన్ గు బదులుగా వెలుగన్ గా చదువ ప్రార్థన. నాకు సి లేక డి గ్రేడ్ వచ్చునా గురువు గారు తెల్పుడు.
రిప్లయితొలగించండిమీ బలవంతపు బోధన
రిప్లయితొలగించండిమీబుద్ధునిభూమిమీదనెందుకుచెప్మా
మాబమ్మెరపోతనయే
బైబిలుఁ బరికించి వ్రాసె భాగవతమ్మున్?(ఎవరినీ ఉద్దేశించ పూరించలేదు.కేవలం పూరణకోసమే)
ఉత్పలమాల
రిప్లయితొలగించండితా బలమైన దీక్షగొని తామరకంటి మహత్వ లీలలన్
రేబవలుల్ శ్రమించి ఘన ప్రేరణ మందిన పోతరాజటన్
బ్రాబలుకుల్ మదించి ముని వ్యాస విరుద్ధపు భాష్యమెంచవన్
బైబిలులో ఖురానుఁ గని భాగవతంబు రచించె నింపుగన్ .
రిప్లయితొలగించండిగ్రేడుల్జేర్చిరి గురువుల్
మాడర్న్ కాలేజిలో సమస్యల కెల్లన్
గాడిన్ బెట్టుచు పూరణ
లే డమడమ జేయగాను లేమ! జిలేబీ :))
జిలేబి
బాబాయి శ్రద్ధ తోడుత
రిప్లయితొలగించండిబైబిలు పరికించి వ్రాసె , భాగవతమ్మున్
చేబట్టి చదువుడని , ఆ
బైబిలు లో జ్ఞాన మెల్ల ప్రాతదె యనుచున్
రిప్లయితొలగించండి...........సమస్య
బైబిలులో ఖురానుఁ గని
భాగవతంబు రచించె నింపుగన్
~~~~~~~
సందర్భం: యోబుకలు తేల్చినారు "లోఁ గని రచింపవలె" నని. అప్పుడే అన్ని జాతుల వారికీ పనికివస్తుంది.
లో.. అంటే కనిపించనిది.. తత్వము.. అని. కని.. అంటే చూచి.. గ్రహించి.. అని. రచించె.. అంటే తగినట్టుగ వ్రాసె.. అని.
"తత్త్వము నెఱిగి వ్రాయవలె" నని సారాంశం.
ఐతే యీ పదాలు మూడూ విడిపోయి చెల్లా చెదురై, మూడు పుస్తకా లక్క డుంటే వాటి పక్కన పడిపోయినవి.
పై మూడు గ్రంథాలూ "యోబుక"లు చెప్పినట్లే కూర్చ బడినవి.
ఇంతకూ.. "యోబుక" లంటే యెవరు? యోగులు బుధులు కవులు.. అని.
చివరికి వాక్యం మాత్రం ఇలా తయా రయింది. "బైబిలులో ఖురానుఁ గని భాగవతంబు రచించె.."
~~~~~~~
... "యోబుక" లెల్ల తేల్చి రట!
రిప్లయితొలగించండియుర్విని "లోఁ గనియే రచింప మే
లౌ బహుళంపు జాతుల" క
టంచును-- "లో"యన "కానరాని"దౌ
లే!"బలమైన తత్త్వ" మది
లే!"కని" యన్న "గ్రహించి","చూచి" కా
గాఁ, బదమౌ "రచించె" నన
గాఁ దగి నట్టుల "వ్రాసె"- నీ పదా
లే బలె.. మూడు చెల్ల చెదు
రే యయి, గ్రంథము లుండ మూ డటన్
సోబన మౌనటుల్ పడెను
సుమ్మి! యమాంతము వాటి పక్కలో..
బైబిలు, నా ఖురాను మరి
భాగవతంబులు తత్త్వ దర్శినుల్-
"యోబుక" లాన తిచ్చి నటు
లొప్పుగఁ గూర్చిరి; యోగులున్,బుధుల్
"యోబుక" లన్ననున్ గవులు;
నొప్పని దయ్యెను వాక్య మిట్టులన్..
"బైబిలు *లో* ఖురానుఁ *గని*
భాగవతంబు *రచించె* నింపుగన్"
~డా.వెలుదండ సత్యనారాయణ
రిప్లయితొలగించండి...........సమస్య
బైబిలు పరికించి వ్రాసె భాగవతంబున్
~~~~~~
సందర్భం: భాగవత మంటే ఆతని కిష్టం. దాన్ని చదివి వ్రాసుకునేవాడు.
ఆతని చేతికి బైబిలు నిస్తే ( చదువనే లేదు) ఒకసారి చూచి (పరికించి) పక్కన పెట్టేశాడు. భాగవతాన్ని మాత్రం వ్రాశాడు.
~~~~~~
ఆ బమ్మెర కవి కవనము
తా బాగుగ చదివి, వ్రాయు
ధన్యుని కీయన్
బైబిలును.. చూచె.. నంతే!...
బైబిలు పరికించి,,.... వ్రాసె
భాగవతంబున్...
~డా.వెలుదండ సత్యనారాయణ
బాబిట శేఖరున్ గలిసి భారత మాతకు నంకితమ్ముగా
రిప్లయితొలగించండినోబులు ప్రైజుగోరుచును నోటరి నొక్కని ఫర్మయించగా...
సైబుడు క్రైస్తవుండిటను శాస్త్రిని గూడుచు నిశ్చయించగన్...
బైబిలులో ఖురానుఁ గని భాగవతంబు రచించె నింపుగన్