5, జనవరి 2018, శుక్రవారం

దత్తపది - 130 (నది-మది-పది-గది)

నది - మది - పది - గది
పై పదాలను ఉపయోగిస్తూ
గురుశిష్య సంబంధాన్ని వివరిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో శివరామకృష్ణ గారు ఇచ్చిన దత్తపది)

72 కామెంట్‌లు:

  1. పదిలమ్మైనది సత్య
    మ్మది కనుగొనగ దినదినము మక్కువ తోడన్
    హృదిలో దాగిన గురువే
    వెదకును ప్రియ శిష్యునిచట వేడుక మీరన్

    రిప్లయితొలగించండి
  2. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
    ఉపదేక్ష్యన్తి తే ఙ్ఞానం ఙ్ఞానినతత్వదర్శనః

    గురుపదమది మది నిలుపుచు
    పరిప్రశ్నల సేవజేసి పదిలముగోరన్
    పరవశమున దివ్యంబగు
    పరతత్వము బోధజేయు వరముగ దినమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యోస్మి గురుదేవా!నమస్సులు!!

      తొలగించండి
    3. పరిప్రశ్నయే పరతత్త్వబోధ కలిగిస్తుంది... చక్కని పద్యం... నమోనమః
      శ్రీమతి సీతాదేవి గారికి అభినందనలు...... మురళీకృష్ణ

      తొలగించండి
    4. ధన్యవాదములు మురళీకృష్ణగారూ!నమస్సులు!!

      తొలగించండి
  3. (తిక్కనమహాకవి నెల్లూరు నగరంలో పినాకినీనదీతీరంలో శిష్యుడైన గురునాథునితో}
    శిష్య!గురునాథ!మననది జేరినాము;
    మదికి సంతోష మాయెను;మహితమతివి;
    పదిలముగ గంటమును దాళపత్రములను
    బట్టి ,తెలుగది వ్రాయుము భారతమ్ము.

    రిప్లయితొలగించండి
  4. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశం :: దత్తపది (సంఖ్య-130)
    ఇచ్చిన పదాలు :: *నది* *మది* *పది* *గది*
    విషయము :: గురు శిష్య సంబంధము
    ఛందస్సు :: ఏ ఛందస్సులోనైనా పద్యం వ్రాయవచ్చు.
    సందర్భం :: *అజ్ఞాన తిమిరాంధస్య ,జ్ఞానాఞ్జన శలాకయా ।చక్షు రున్మీలితం యేన , తస్మై శ్రీ గురవే నమః।।*
    అని మనం గురువుకు నమస్కరిస్తాం. ఎందుకంటే గురువు తన జ్ఞాన మనే తేజస్సుతో మన అజ్ఞాన మనే అంధకారాన్ని పారద్రోలుతాడు.
    * కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు*
    అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా పరతత్వాన్ని గురించి బోధిస్తాడు. తద్వారా బ్రహ్మానందాన్ని అందిస్తాడు.
    శిష్యుడు గురువుగారి బోధనలను భక్తిశ్రద్ధలతో *శ్రవణం* చేసి క్రమంగా *మననం* మొదలైనవాటిని చేస్తూ జ్ఞానిగా మారుతాడు. ఇలా తమ ధర్మములను చక్కగా నిర్వహిస్తే గురుశిష్యుల బంధం పెరుగుతుంది. ఆదర్శవంత మౌతుంది అని వివరించే సందర్భం.

    *మది* నజ్ఞానపు చీకటిన్ దునుము, శ్రీమద్ జ్ఞానతేజమ్మునన్,
    *పది* లమ్మౌ పరతత్వ బోధ నిడు శోభన్ శిష్యవర్గానికిన్,
    ముద మందింప *గ , ది* వ్య మార్గముల జూపున్ , సద్గురుం డెన్న ; వి
    *న్నది* శ్రద్ధన్ మననమ్ము జేయు మదిలోనన్ శిష్యుడున్ భక్తితో ,
    నిది పెంచున్ *గురుశిష్యబంధము* ను వర్ణింపంగ నాదర్శమౌ.
    *కోట రాజశేఖర్ నెల్లూరు.* (5.1.2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోట రాజశేఖర్ గారూ,
      మీ పూరణ ఉత్తమంగా, ఆదర్శంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. సవరణ :: మూడవపాదంలో {శోభన్ శిష్య వర్గానికిన్ అనేదానికి బదులుగా} *శోభన్ గూర్చు శిష్యాళికిన్* అని మార్పు చేసి చదువ ప్రార్థన. కోట రాజశేఖర్.

      తొలగించండి
    3. శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు హృదయపూర్వక ప్రణామాలు. కోట రాజశేఖర్.

      తొలగించండి


  5. గంగానదివలె ప్రవహిం
    పంగన్ జ్ఞానము గురువులు పదిలముగా నే
    ర్పంగన్నింగియె హద్దుయ
    నంగ దినదినము మదిమది నమతుడు వటువున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. మననంబన్నది నేర్పున్
    తనశిష్యులకు, పదిలముగ తరియింపన్ జే
    యునది మన మది, నిషంగది
    మన గురువులుగ దినదినము మన్నిక గూర్చున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'హద్దు+అనంగ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

      తొలగించండి
  7. వరమది గద చైతన్యపు
    పరమోన్నత స్థాయి చేర్చి పదిలపరుచగా
    గురువు గదిత విలువైనది
    తరియించెను జ్ఞాన జన్మ ధన్యుడ నేనై ౹౹
    (గదిత = మాట, పలుకు)

    రిప్లయితొలగించండి
  8. జ్ఞాన రవళియె నినదించ చారుతరము
    గురువు పాదద్వయమదియె గుండె నిలుపు!
    ఇంపుగమది,బాప దిశాంత నిరుల నెపుడు
    చెలగ దివ్యమౌ గురుశిష్య చెలిమి లోన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      గురు శిష్య చెలిమి.... దుష్టసమాసం. "గురువు శిష్యుల చెలిమియెః" అందామా?

      తొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    చదివినది గురువులు తెలిపి
    నది మది గది పదిలబరచినన్ దృఢతరమౌ
    పది రెట్లు మెచ్చు గురువది ,
    యిది శిష్యునికందజేయు నిహ పర సుఖమున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  10. ధర్మమది శిష్యునకు సదా ధరణిపైన
    తనధిషణ పెంచిన గురువు తలచుకొనుచు
    పదిలముగ మానసమ్మున ముదముగొనుట
    తరగదీ భక్తి బ్రతికినంతవరకుభువి

    రిప్లయితొలగించండి
  11. కం: మదిలో శంకల దీర్చుచు
    నది సాగర మందు చేరు నడత దెలుపుచున్
    పది మందికి కృప కురియును
    గదిలోన తపమ్ము నుండి కదలక కూడన్
    (నది సాగరమందు చేరు నడత అనగా ముక్తి మార్గం. మహనీయుడైన గురువు ఎవరితోనూ ముఖతః ఎక్కువ మాట్లాదక పోయినా కృపని వర్షిస్తూ ఉంటాడు )

    రిప్లయితొలగించండి
  12. కందం
    గదిలో విజ్ఞాన ఝరిని
    నదిలా పారించి తనను నమ్మిన శిష్యుల్
    మదిలో దైవమ్ము వలెను
    పదిలమ్ముగనిడు త్రిమూర్తి వరుడే గురువౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      చక్కని పూరణ. అభినందనలు.
      'వలె'ను 'లా' అనడం వ్యావహారికం. అక్కడ "నదివలె" అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.
      కందం
      గదిలో విజ్ఞాన ఝరిని
      నదివలె పారించి తనను నమ్మిన శిష్యుల్
      మదిలో దైవమ్ము వలెను
      పదిలమ్ముగనిడు త్రిమూర్తి వరుడే గురువౌ

      తొలగించండి


  13. నిషంగదియె కందివరులు! నెమ్మ దిన్ సదా
    విషక్తముగ నిచ్చు ! భళి కవీశ్వరుండితం
    డు! సంఘమును జేర్చెనదియె డోల నమ్ములా
    డ! శంకరుని కొల్వు పదికుడా! రమించుమా !

    డిండిమ
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ డిండిమ వృత్త పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిషంగది, విషక్తము' శబ్దాల అర్థాలకోసం ఆంధ్రభారతిని సంప్రదించవలసి వచ్చింది!

      తొలగించండి


    2. కంది వారు

      నెనరుల్ !


      జిలేబి వరుసల్ భళిభళి చిత్రమయ్యెనే :)


      జిలేబి

      తొలగించండి
  14. పదిలమైనవిద్య పదుగురి మేలుకై
    గురుకులాన గదిని గురువు తెల్పు;
    నదియు తెలిసి కొనుచు నానా విధమ్ముల
    మంచి శిష్యుడెపుడు మదిన నిల్పు.

    రిప్లయితొలగించండి
  15. నదికి వోలెను కలుషముల్ నాశమొంద
    మదికి చిద్భావనా సుధర్మంబుఁదెలిపి
    పదియు వందలు వేలు నేర్వంగ'మంచి'
    గదికి తలుపులు తెఱచెడు ఘనత నరయు
    పరమ గురు శిష్యు లమర ప్రభావ విదులు

    రిప్లయితొలగించండి
  16. గురువు బోధించి నది తాను మరువ కుండ
    మదిని నిల్పు చు శిష్యుడు మహి ని వెలుగు
    పది ల మగు పాత్ర త కలిగి భవి త యందు
    బాగు పడగ దివ్య ము గ నుండు భాగ్యమబ్బు

    రిప్లయితొలగించండి
  17. గురువు బోధించునది వేగ కొరత లేక
    విషయమది యేది యైనను విని గ్రహించి
    మదిని పదిలము గావించిమనగ వలెను
    పరగ బెదిరింపు గదిరింపు బనికి రావు
    శిష్యునకును గురువు బోధ చేయు వేళ.

    రిప్లయితొలగించండి
  18. ఆచార్య రాణి సదాశివ మూర్తి గారి పూరణ..........

    సంస్కృతే అనుష్టుభి..

    నదితం మదిభశ్రోత్రే
    గదితం భవతాద్భుతమ్।
    పూతస్సపది దేవాహం
    ధన్యో మాన్యోఽభవమ్ భువి।।

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ గురుభ్యోన్నమః!! శ్రీ రాణి సదాశివమూర్తిగారు మద్గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణ ప్రకాశానంద భారతీస్వామివారి పుత్రులు!!
      గురుప్రస్తావనతో సమస్యనిడిన ఈ రోజే వారి పేరు పూరణ చూడగలగడం మహద్భాగ్యము! ధన్యోస్మి!! వారి దివ్యచరణములకు ప్రణామాలు!!

      తొలగించండి
  19. పదిలముకాగ శిక్ష్యునెడ పావనమై చను భావనమ్ములన్
    మది నిలుపంగగావలెను మాటికినొజ్జ గురుండుకిన్కతో
    గదిమెనటంచు కత్తులను గైకొని ఖండనసేయ పాపమౌ
    నది గురుశిక్ష్యబంధన మనాదిగ నుత్తమమౌను దల్పగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ష్య'కు బదులుగా 'క్ష్య' టైపు చేశారు.

      తొలగించండి
  20. పదిలమైనదిగురుశిష్యబంధమిలను
    గురువుబోధించుగదితలునిరతమతడు
    మదిని మననజేయుచునుండుమానకుండ
    నదియబంధమువారిదియనుటదగును

    రిప్లయితొలగించండి
  21. పదిలమ్ముగ విని సద్గురు
    వదనచ్యుత నిగదితములు పరిచర్యలు నె
    మ్మది నాచరించ శిష్యులు
    నదీతటీన్యాయమునఁ జనవలె గురువులున్

    [దరి నదికి రక్ష, నది దరికి నిత్యము సన్నిహితము.
    సమర్థంబులగు పదంబు లేకపదం బగుట సమాసంబు కావున “నదీతటీన్యాయము” పరస్పరానుబంధమను నర్థమున నన్యార్థప్రయోగమని నా భావన.]

    రిప్లయితొలగించండి
  22. దినదిన మెలమిని తీరిచి దిద్దును
    .....బాధ్యత లెరిగిన పౌరునిగను
    మదిమది బోధించి మంచిచెడులలోని
    .....తారతమ్యము నేరు దారి జూపు
    పదిలముగా గురు వాక్కుల మదినుంచి
    .....జ్ఞానుల బాటలో సాగి పోవు
    గదితలో సౌమ్యత యెదలోన స్వచ్ఛత
    .....నెరపుచు బెంచును గురుని పరువు

    కొడుకు కన్న మిన్న గురువుకు ఛాత్రుడు
    తల్లి తండ్రి పిదప దైవ మతడె
    శిష్యునకును వసుధ చెప్పగా నింకేల
    నిట్టి వారి బంధ మిలకు రక్ష.

    రిప్లయితొలగించండి
  23. గురు శిష్యుల బంధమ్మది
    పరువంబును బెంచ గలుగు|పదిలముగానే|
    గురువే దైవంబన్నది
    సరిపడ?దాగదిక|మంచి సంస్కృతిమనలో|

    రిప్లయితొలగించండి
  24. సమ్మతి యగు గురువునకు సంతతమ్ము
    శిష్యుని ప్రగతి తనదిగా చేసికొనుట
    దారి చూప, దినమురాత్రి తగఁ జదివిన
    గురువునకు నది యిచ్చును కరము తృప్తి

    రిప్లయితొలగించండి
  25. నది ప్రవహించు నటులనే
    మది పరుగిడ జేసి గురువు మాన్యుడు కాగా
    గదికే పరిమిత మవకన్
    పది మందికి జ్ఞాన మోసగవలె శిష్యుడొగిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జ్ఞాన మొసగ..' టైపాటు.

      తొలగించండి
  26. .......................దత్త పది.
    నది మది పది గది
    ఈ పదాలతో గురుశిష్య సంబంధం
    **************************************
    సందర్భం: జ్ఞానమే యెంతో విలువైనది. సిరి సంపద లె న్నున్నా మనశ్శాంతి సున్న. ఈ లోకంలో ధైర్యవంతునిగా పై లోకంలో దివ్యునిగా మానవుని తీర్చిదిద్దడానికి గురువు తప్ప మరెవ్వరూ లేరు.
    ==============================

    విలువైనది జ్ఞానంబే!
    కలుము ల వెన్నైన శాంతి
    కలదే మదిలో!..
    నెలకొలుప దిటవరిగ నరు
    నిల దిద్దగ దివ్యునిగ
    మరెవ్వరు? గురువే!...

    మరొక పూరణము:

    సందర్భం: గురువు శివునివంటివాడు కావాలి. శిష్యుడు భగీరథుని వంటి వాడు కావాలి. శ్రద్ధతో ప్రార్థించాలి. అప్పుడు జ్ఞాన మనే గంగ దిగి వస్తుంది. మన ముందు తరాల వారు కూడ ఆ జ్ఞాన ధారలో జలకాలాడి పవిత్రులై స్వర్గానికి వెళ్ళగలరు.
    ==============================

    పరమ శివునివంటి గురువు దొరికెనేని
    అవని జ్ఞాన గంగా నది యవతరించు-
    శిష్యు డా భగీరథు నట్లు చెలగి, మదిని
    శ్రద్ధ గలిగి ప్రార్థనమును సలుపగ దిగు-
    నఘములు నశింప దివమున కరుగుచుంద్రు
    తరతరాల వా రా జ్ఞాన ధార మునిగి...

    ✒~ డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెలుదండ వారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  27. పదిలముగ దివ్యమంగళు నెదను గొలుచు
    నటుల విద్యల నేర్పెడి నయ్యవారి
    పొగడు శిష్యుని కనుగొన దిగులు వీడి
    తనదు ప్రేమ దిగదుడు పనెనట గురువు !

    రిప్లయితొలగించండి
  28. పది తడవలు చెప్పగ నే
    నది నీ మది కెక్కదు గద నరవర సుతుడా!
    గదిరించిన లొంగవుగా!
    చదువెందుకు నీకు నాకు చతికిల బడనా?

    రిప్లయితొలగించండి
  29. పదిమందికి విజ్ఞానము
    నదివలె ప్రవహింపజేయు నాచార్యుండే
    మదిగదిలో గొలువుండెడు
    కుదురగు దైవమ్ము గాదె కువలయమందున్!!!

    రిప్లయితొలగించండి
  30. నదివలె గలగల పారుచు
    మదినిండుగ భక్తి తోన మర్మము లేకన్
    గదిరించిన గురు వన్నను
    పదిలము గాసేవ జేయు భాగ్యము పొందన్

    రిప్లయితొలగించండి
  31. నదివలె గలగల పారుచు
    మదినిండుగ భక్తి తోన మర్మము లేకన్
    గదిరించిన గురు వన్నను
    పదిలము గాసేవ జేయు భాగ్యము పొందన్ [ నొందన్ ]

    రిప్లయితొలగించండి
  32. కం:-
    మదినిండా జ్ఞానమలరి
    పదిమందికి బోధజేయ బదరకమనమున్
    గదిరించకహర్నిశము మ
    నదికి దగిన మార్గమొసగు నరుడే గురుడౌ!!!

    @ మీ పాండురంగడు*
    ౦౭/౦౧/౨౦౧౮

    రిప్లయితొలగించండి
  33. కం:-
    మదినిండుగ జ్ఞానమలరి
    పదిమందికి బోధజేయ బదరకమనమున్
    గదిరించకహర్నిశము మ
    నదికి దగిన మార్గమొసగు నరుడే గురుడౌ!!!

    @ మీ పాండురంగడు*
    ౦౭/౦౧/౨౦౧౮

    రిప్లయితొలగించండి
  34. నది..పది...మది..గది
    చెప్పినది చేసి బ్రతుకు టే జీర్ణ మవ్వు
    ఒప్ప చెప్పు పదిల వాక్కు ఓర్పు యవ్వు
    గొప్ప దైనది మదియేను తీర్పు యవ్వు
    పప్పులుడకని గదిలోన భయము యవ్వు

    రిప్లయితొలగించండి