జిలేబీ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. 'బ-భ' ప్రాస? ***** రాజేశ్వర రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శాంతి భూషణ్ గారూ, మన మలరంగ జేసిన మీ అంగరంగ వైభవ వర్ణన బాగున్నది. అభినందనలు.
సీసము: ఉదయమ్ముననులేచి మదినిండ హాయితో భోగిమంటల చుట్టు తిరిగి తిరిగి ఆముదమ్ము చెవుల నాముదమ్మున వేసి దూదుండలను లోన దూర్చిదూర్చి కుంకుళ్ళ రసముతో గొనిరేగుపండ్లను వేసి నీటిని తలపైన పోసిపోసి కళ్ళుమండెడువేళ గండ్రుప్పు నేనోట నయముగానేయుంచి నాన్ చి నాన్ చి
సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** విట్టుబాబు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. 'వచ్చెను'ను 'ఒచ్చెను' అన్నారు. "పండుగలు వచ్చె నాలుగు" అనవచ్చు. 'వెలగాలి' అన్నది వ్యావహారికం. అక్కడ "మన। కండగ వెలుగవలె ననుచు నాచారములే" అనండి. మీరు పేర్కొన్న పంచభూతాల చాటుపద్యం చాలా ప్రసిద్ధమైనది. ***** సీతాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శాంతి భూషణ్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** హనుమచ్ఛాస్త్రి గారూ, మీ సీసపద్యం అద్భుతంగా ఉన్నది. అభినందనలు. "...వేసి నీటిని దలఁ బోసి పోసి" అనండి. లేకుంటే గణదోషం.
అన్నపరెడ్డి వారూ, మీ తేటగీతిక మనోహరంగా ఉన్నది. అభినందనలు. ***** గురుమూర్తి ఆచారి గారూ, మీ పద్యం హృద్యంగా ఉన్నది. అభినందనలు. ***** కామేశ్వర రావు గారూ, మీ పద్యం ఉత్కృష్టంగా ఉన్నది. అభినందనలు.
మిస్సన్న గారూ, అద్భుతమైన సీసపద్యాన్ని అందించారు. అభినందనలు. ***** శ్రీధర రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. 'గొప్పగా నాడి...' అనండి. ***** బాపూజీ గారూ, చక్కని పద్యం. అభినందనలు.
వెలుదండ వారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'పడుచుల నల్లుళ్ళ' టైపాటు అనుకుంటాను. ***** సహదేవుడు గారూ, అద్భుతమైన సీసపద్యాన్ని అందించారు. అభినందనలు. ***** విజయ కుమార్ గారూ, మీ పద్యం మనోహరంగా ఉన్నది. అభినందనలు.
రఘురామ్ గారూ, మీ సీసపద్యం బాగుంది. అభినందనలు. 'కాల మొదలు వేళ' అన్నది బాగుగా లేదు. "ఉత్తరాయణమున కొదుగు వేళ" అనండి. 'రంగవల్లులు+ఇంటి = రంగవల్లు లింటి' అవుతుంది. యడాగమం రాదు. "రంగవల్లులె యింటి..." అనండి. 'వాడు+ఆడువేళ = వా డాడువేళ' అవుతుంది. యడాగమం రాదు. "బుడుబుడుక్కలవార లాడువేళ" అనండి. అలాగే "కొలువైన వేళను" అనండి. ***** డా. ఉమాదేవి గారూ, మీ ఆరు పద్యాలు బాగున్నవి. అభినందనలు. మూడవ పూరణ మూడవ పాదంలో గణదోషం. 'మంచి' పదాన్ని తొలగించండి. నాల్గవ పూరణ మొదటి పాదంలో యతి తప్పింది. "వానలు కురియ చక్కగ వసుమతిపయి" అందామా?
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం నేటి అంశము :: నిషిద్ధాక్షరి ( శ ష స అనే అక్షరాలు లేకుండా పద్యాలు వ్రాయాలి.) విషయం ::సంక్రాంతి సంబరాలు. ఛందస్సు :: ఏ ఛందస్సులోనైనా సరే పద్యాలు వ్రాయవచ్చు. సందర్భం :: సుస్పష్టము ఛందస్సు :: మత్తకోకిల
చెంగునన్ మకరమ్ము లోనికి చేరు భానుడు హంగుగా రంగవల్లులు వేయుచుందురు రాగముల్ చిగురింపగా పొంగలిన్ దిన జేయుచుందురు పూర్తిగా ధన మందగా పొంగి పెద్దల పూజ జేతురు మ్రొక్కి పెద్దల పండుగన్. రచన కోట రాజశేఖర్ నెల్లూరు. (14.01.2018)
పండుగ వేడుక లందున
రిప్లయితొలగించండిమెండుగ యానం దింప మీరిన ప్రోదిన్
రండిక నూతన జంటలు
దండిగ కానుకల నంది తన్మయ మొందన్
అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. "మెండుగ నానందమంద మీరిన..." అనండి.
పండుగ వేడుక లందున
తొలగించండిమెండుగ నానంద మంద మీరిన ప్రోదిన్
రండిక నూతన జంటలు
దండిగ కానుకల నంది తన్మయ మొందన్
సోదర సోదరీ మణు లందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిపండుగ దినములు వచ్చెను
రిప్లయితొలగించండిరెండింటిని కోళ్ళు పెంచి రీతిగ నేడే
దండిగ నూరుము కత్తులు
మెండుగ నేతలను పిల్చి మేపర నరుడా!!!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండి🙏కవిమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 💐
భోగిమంటను గనుటయే యోగమంట !
పెద్దపండుగ మన యింటి పిండివంట !
కనుమ మనకిడు భోగభాగ్యమ్ములంట !
అందరొకచోట జేర నానందమంట !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారూ,
తొలగించండిపెద్దపండుగ వేడుకలను చక్కగా వర్ణించారు. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి
తొలగించండికొక్కొరోకో యను కోడికూతకు లేచి
నిత్యకృత్యమ్ముల నెఱపి యంత ,
క్రొత్త బట్టలు గట్టి కూరిమి బెద్దల
పాదమ్ములకు మ్రొక్కి పాలు త్రాగి ,
గోమాత నుదుటను కుంకుమదీర్చియు
భోగిమంటను జేరి మోదమంది ,
ముంగిట దీర్చిన రంగవల్లిక జూచి
పులకించి , నెమ్మది ముదమునంది .,
హరిలొ రంగా యను నాలాపనము విని
పరుగెత్తుకొని వచ్చి పలకరించి ,
గంగిరెద్దులవాని గమనించి పాతదౌ
పట్టుచీరనొకటి వానికిచ్చి ,
బుడబుక్కమని చేతిమునివ్రేళ్లతో డప్పు
వాయించు వానికి బట్టలిచ్చి ,
వంటింటి ఘుమఘుమల్ వడ్డింపగా దిని
మేలు మా యమ్మంచు మెచ్చి మెచ్చి ,
నవ్వు పువ్వుల రువ్వి యానందమంది ,
దాన ధర్మమ్ములొనరించి ధన్యత గొన ,
పదుగురొకచోట జేరుట పండుగ యగు !
తెలుగు లోగిళ్ల కొంగ్రొత్త వెలుగులమరు !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండిఅదురహో ! మైలవరపు వారు
మా బ్లాగులో అట్టేసుకున్నాము :)
జిలేబి
ఎట్టేసుకొని కట్టేసుకోండి.. మీ అభిమానమునకు నా నమోవాకములు... సంక్రాంతి శుభాకాంక్షలు....
తొలగించండిమురళీకృష్ణ
రిప్లయితొలగించండిఅంబ నడపు మంగళమున్!
అంభోభృత్పథ విహారి యానందంబున్
దంబర! అందరికి మజ క
దంబింపన్ వేళ వచ్చె దవథువు తొలుగన్!
అందరికి
" సమ " క్రాంతి శుభాకాంక్షలతో
జిలేబి
తొలగించండిఅంభోభృత్పథము- ఆకాశము
అంభోభృత్పథ విహారి - సూర్యుడు
భోగి మంటల ధగధగ ల్ రేగు చుండ
రిప్లయితొలగించండిరంగు రంగుల ముగ్గులు ర హి ని బెంచ
గంగిరెద్దుల నాట్యాలు కాను పింప
వచ్చె పండుగ మురిపాలు తెచ్చునిజము
రిప్లయితొలగించండిగంగిరెద్దు గెంతంగ,పతంగులు నెగ
రంగ,భోగి మంటలు నెగయంగ,రంగు
రంగవల్లులు వేయంగ,నంగ రంగ
వైభవంగ జేయంగ పర్వంబు వచ్చె!
అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు....
తొలగించండిజిలేబీ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
'బ-భ' ప్రాస?
*****
రాజేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శాంతి భూషణ్ గారూ,
మన మలరంగ జేసిన మీ అంగరంగ వైభవ వర్ణన బాగున్నది. అభినందనలు.
రంగులు దిద్దిన ముగ్గులు
రిప్లయితొలగించండిముంగిళుల ముద్దబంతి పూవులు తోడై
బంగరుకాంతులుఁ జల్లగ
పొంగల్ పండుగ గృహమున ముదమునుఁ గూర్చెన్
సవరణ:
తొలగించండిరంగులు దిద్దిన ముగ్గులు
ముంగిళులన్ ముద్దబంతి పూవులు తోడై
బంగరుకాంతులుఁ జల్లగ
పొంగల్ పండుగ గృహమున ముదమునుఁ గూర్చెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపండుగ లొచ్చెను నాలుగు
రిప్లయితొలగించండిదండోరా వేయరండి దండిగ నేడే
నిండుగ జరపండిక మన
అండగ వెలగాలనుచును ఆచారములే
సేకరణ: పంతుల భాస్కర రావు
తొలగించండిపంచ భూతములతో సుందరకాండ.
కం.
అంచిత చతుర్థ జాతుడు
పంచమ మార్గమున నేగి ప్రథమ తనూజన్
గాంచి తృతీయం బప్పురి
నుంచి ద్వితీయంబు దాటి యొగి నృపు గాంచెన్!
ఎవరు రాశారో తెలియదు.
పంతుల భాస్కరరావుగారు మా నాన్నగారు.
😊
గురుదేవులకు, కవిమిత్రులందరికీ భోగభాగ్యాలనొసగే భోగిపండగ శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిగోద గోవిందుజేరిన గొప్పదినము
చీడపీడలు భూమిని వీడుదినము
భానుడేతెంచ నుత్తమ పథమునందు
పాడిపంటల నందించు పర్వదినము!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభోగినాడు మంటలు గీము బాగుపరచ
రిప్లయితొలగించండికనుమ దివసమునను గోదలను కొలవగ
మూడు దినములు మిక్కిలి ముదములిడగ
రమ్యముగ వెలుగులిడు పర్వంబు వచ్చె!
🌿🌿🌿ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘ వనపర్తి ☘
అందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిసీసము:
ఉదయమ్ముననులేచి మదినిండ హాయితో
భోగిమంటల చుట్టు తిరిగి తిరిగి
ఆముదమ్ము చెవుల నాముదమ్మున వేసి
దూదుండలను లోన దూర్చిదూర్చి
కుంకుళ్ళ రసముతో గొనిరేగుపండ్లను
వేసి నీటిని తలపైన పోసిపోసి
కళ్ళుమండెడువేళ గండ్రుప్పు నేనోట
నయముగానేయుంచి నాన్ చి నాన్ చి
తేటగీతి:
క్రొత్తబట్టల ధరియించి కోర్కెదీర
నల్వురందున దిరిగిన నాటి గురుతు
మరలనొకమారు తలపోసి మనమునందు
భోగిరోజును గడిపెదమోయి రండు.
గోలి వారూ,
తొలగించండిఇది ఈనాటి నిషిద్ధాక్షరికి వ్రాసిన పద్యమా? లేక పండుగ ప్రాశస్త్యాన్ని తెలిపే పద్యమా? ఎందుకంటే నిషిద్ధమైన సకారం రెండు మూడు చోట్ల కనిపించింది.
మాస్టరుగారూ! ఇది పండుగ శుభాకాంక్షల పద్యం ...ధన్యవాదములు.
తొలగించండిసూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
విట్టుబాబు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
'వచ్చెను'ను 'ఒచ్చెను' అన్నారు. "పండుగలు వచ్చె నాలుగు" అనవచ్చు. 'వెలగాలి' అన్నది వ్యావహారికం. అక్కడ "మన। కండగ వెలుగవలె ననుచు నాచారములే" అనండి.
మీరు పేర్కొన్న పంచభూతాల చాటుపద్యం చాలా ప్రసిద్ధమైనది.
*****
సీతాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శాంతి భూషణ్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ సీసపద్యం అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
"...వేసి నీటిని దలఁ బోసి పోసి" అనండి. లేకుంటే గణదోషం.
ధన్యవాదాలు గురువుగారు
తొలగించండి🙏
: పంట లన్నియు చేరగ నింటి కడకు
రిప్లయితొలగించండివింత గాకోడె దూడలు గంతులేయ
కన్నియల్ చల్లి కలయంపి చెన్నుగాను
ముగ్గులను పెట్టి ముందర ముదముతోడ
గొబ్బియలు బెట్టి పువ్వుల గూర్చి పైన
చెన్నగు నగల నుడుపులఁ జెంగ లింప
రంగురంగుల పండుగ క్రాంతి తెచ్చె
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,
అంగనలు ముదముగ గృహప్రాంగణముల
రంగరించి చక్కనగు వర్ణముల నెన్నొ ,
రంగవల్లుల దీర్చిరి రమ్యముగను |
గాలి పటములు కదలాడె గగన మందు |
చెక్క భజనలు రవళించె దిక్కు లందు |
పందెపున్ గో ళ్ళెగిరె వాడ వాడ లందు |
కాలి గజ్జియల లయను మేళవించి
కానిపించె కోలాటముల్ కదము తోడ |
" హరిలొ రంగ హరి " యను దాహరుల యొక్క
భక్తి గేయాలు వినిపించె రక్తి గట్టి |
మంగళప్రద వాద్యముల్ మందిరముల
వినగ వచ్చెను వీనుల విందు గూర్చి
{ దా హ రి = దా స రి }
గురుదేవులకు సకలాస్థాన కవి పుంగవులకు సంక్రాంతి శుభాకాంక్షలతో
రిప్లయితొలగించండిమండలి మంచి క్రమణము మకరమందు నుత్తరాయణ మగు నుర్వి నందు
కాంతులు వెదజల్లు కలుగఁ బంటలు హాలికులకును భోగిమంట లలరుఁ బురి
రంగవల్లుల నెల్ల రమణీమణు లలరుదురు పూజ లింపుగ జరుగు నిండ్ల
గాలిపటములు నాకమునఁ జెలంగుఁ బ్రభల తీర్థములు తమిఁ బరిఢవిల్లు
భోగిపళ్ళ గొబ్బెమ్మలఁ బుడమి నిండు
పిండివంటల ఘుమఘుమ లుండు నెల్ల
క్రొత్త బట్టల నింపుగఁ జిత్త మలరు
మంచి క్రాంతి ముదకరమ్ము మానవులకు
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిరంగ వల్లుల కాంతులు రంగు లీను
భోగ భాగ్యాల నెలవులు భోగి పర్వ
ముకద కనరిట నవ్యాంధ్ర మురిపెములును
పంటలకు గిట్టు ధరలను పడతి కోరె
పాదయాత్ర లో ఉన్నాను.బాటరీ లౌ ఉంది.
వెంకట నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
అన్నపరెడ్డి వారూ,
రిప్లయితొలగించండిమీ తేటగీతిక మనోహరంగా ఉన్నది. అభినందనలు.
*****
గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం హృద్యంగా ఉన్నది. అభినందనలు.
*****
కామేశ్వర రావు గారూ,
మీ పద్యం ఉత్కృష్టంగా ఉన్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురుదేవులకు వినమ్రవందనములు
రిప్లయితొలగించండికవి పండితులకు మరియు బ్లాగు వీక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు
కుంటి చోదకు డేడు గుర్రాల పూన్చిన
రిప్లయితొలగించండి.....రథమును నడుపగ కదలు వాడు
నొంటి చక్రపు తేరు కంటి కానని రీతి
.....నొడుపుగ పరుగిడ నురుకు వాడు
నంటియు నంటక నఖిలాండముల పైన
.....ప్రభవిల్లు మార్గాన బరచు వాడు
నలు పన్న దెరుగక నిలకు రేబవళుల
.....నొనరించి నిత్యము తనియు వాడు
కాంతు లీనుచు పద్మినీ కాంతు డెలమి
నుత్తరాయణ దీధితు లుర్వి దనర
మకర నికరమునకు మంగళకరముగను
చకచకా నేగు తరుణ మీ చంక్రమణము.
అద్భుతమైన సూర్యస్తుతి మిస్సన్నగారూ!
తొలగించండినమోనమః!🙏🙏🙏🙏
ధన్యవాదాలు సీతా దేవి గారూ.
తొలగించండిమిస్సన్న గారు నమస్సులు. మకర సంక్రమణమును ధనుచ్ఛంక్రమణముగా నభివర్ణించితిరి మహాద్భుతముగ. మహదానంద మైనది మీ పూరణమును చదివి నప్పుడు. అభినందనలు ధన్యవాదములు.
తొలగించండికామేశ్వరరావు గారూ మీ ఆత్మీయాభినందవలను శారదాశిషములుగా భావిస్తున్నాను. నమస్సులు.
తొలగించండిముద్రణ సవరణ : ధనుశ్చంక్రమణము
తొలగించండిక్రొత్త ధాన్య మింటను జేరికొనగ నదియె
రిప్లయితొలగించండిపెద్ద పండుగనె నిచటి పేద రైతు!
రంగవల్లులు మురిపింప రమణు లంత
గొప్పగా యాడి పాడిరి గొబ్బి యాట!
గంగిరెద్దుల నాడించు సంగదాసు;
రిప్లయితొలగించండిఅక్కబావల నలరించు నమల,కమల;
వెచ్చదుప్పట్ల చలికాచు పెద్దజంట;
ఉత్తరాయణ కాలాన నొదిగినారు.
👌👌👌
తొలగించండి"సంగదాసు"?
శాస్త్రి గారూ,
తొలగించండిధన్యవాదాలు. నేను గమనించలేదు.
ఉన్నవ వారి 'మాలపల్లి'నవలలోని నాయకుడండీ!
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి"స" నిషిద్ధముగదా?
తొలగించండిగమనించలేదండీ!"గంగరాజు"అని అందాం.ధన్యవాదాలు.
తొలగించండిశంకరార్యులకు,కవిమిత్రులకు స్వర్ణసంక్రాంతి శుభాభినందనలు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతమైన సీసపద్యాన్ని అందించారు. అభినందనలు.
*****
శ్రీధర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
'గొప్పగా నాడి...' అనండి.
*****
బాపూజీ గారూ,
చక్కని పద్యం. అభినందనలు.
ధన్యవాదాలు గురువు గారికి.
తొలగించండి.............నిషిద్ధాక్షరి
రిప్లయితొలగించండిశ, ష ,స రాకుండా సంక్రాంతి సంబరాలు
==============================
పెద్దదియైన పండు గిది
ప్రేమల బంచెడు బంధు మిత్రులున్
ముద్దుగ వచ్చు పండు గిది
ముచ్చట దీర్చెడు పండు గిద్దియే!...
ఎద్దుల యాట చూడగల,
మింపుగ నా హరియొక్క పాటలన్
వ ద్దను వార లెవ్వ రిక
బాగుగ విందుము నేటి పండుగన్..
~వెలుదండ సత్యనారాయణ
గడప గడపయు ముగ్గుల గడియ బెట్టు
రిప్లయితొలగించండిగంగిరెద్దుల గంటలు గళము విప్ప
భాను కిరాణాల తిరునాల పరుగు లందు
ఆడ పడచుల నల్లళ్ళ నీడ జాడ
జరుపు పండగ నేడిల మరువ తరమ?
గురుదేవులకు మరియు కవిమిత్రులందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిసీ.
నింగి చుక్కల ద్రుంచి నేలపై ముగ్గేయ
హరికీర్తనమ్ముల నలరె పుడమి!
భోగిమంటల వెల్గు ముంగిల్ల గొబ్బిళ్లఁ
తళుకు మనుచు గాంచి తనరి నంత!
బ్రహ్మయ్యనే వచ్చి బాపడై తా నిల్చి
వేదమంత్రమ్ముల వినఁగ జెప్ప!
గంగిరెద్దుల వాడె కఱివేల్పు తానైన
నటరాజు పూనిన నంది యాడ!
బావలక్కలు వచ్చి పండుగన్ దెచ్చిన
పిండివంటలు తీపి విందుఁ జేయ!
నేలదీరిన ముగ్గు నింగిలో వెలయంగ
గాలిపటాలట తేలి యాడ!
ఆ. వె.
పచ్చదనముఁ దెచ్చి పంటలే యద్దిన
గడపలందు చెఱకు గడలు నిలువ!
ప్రకృతి పులకరించ భానుడే మకరాన
తీరు పర్వదినఁపు దీప్తిఁ 'గనుమ'
సూపర్.. అభినందనలు సహదేవుడు గారూ.
తొలగించండిధన్యవాదములు సర్ 🙏🙏🙏
తొలగించండిపూసపాటివారీమధ్య కన్పించుటలేదేమో??!!
రిప్లయితొలగించండిబొమ్మలు, గొబ్బెమ్మలు, పం
రిప్లయితొలగించండిదెమ్ముల కుక్కుటములు, కడు తీపి యపూపాల్
కమ్మటి కలయిక లారం
భమ్మగు పో భోగి పెద్ద పండుగలందున్
👏👏👏🙏🙏🙏👌👌👌
తొలగించండిధన్యవాదాలండి 🙏
తొలగించండిసంక్రాంతి సంబరాలను తినుబండారాలను చక్కగా వర్ణించారండీ విజయకుమార్ గారూ! ప్రణామాలు. కోట రాజశేఖర్
తొలగించండివెలుదండ వారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పడుచుల నల్లుళ్ళ' టైపాటు అనుకుంటాను.
*****
సహదేవుడు గారూ,
అద్భుతమైన సీసపద్యాన్ని అందించారు. అభినందనలు.
*****
విజయ కుమార్ గారూ,
మీ పద్యం మనోహరంగా ఉన్నది. అభినందనలు.
సీ౹౹
రిప్లయితొలగించండిమకరమందున రవి హంగుగా తాఁ జేర
…..నుత్తరాయణ కాల మొదలు వేళ
రంగురంగుల నద్ది రంగవల్లులు యింటి
…..ముంగిట గొబ్బితో మురియు వేళ
పొంగించి పాలను బొబ్బట్లు పులిహోర
…..బూరె గారె లమరు భోజనంబె
గంగిరెద్దులవారు కంచు గజ్జెలతోను
…..బుడుబుడుక్కలవాడు యాడు వేళ
ఆ౹౹
కొండపల్లి బొమ్మ కొలువైన వేళన
రేగిపళ్ళు చెరకు రెబ్బ లలరె
పండుగలన పెద్ద పండుగే తెలుగింట
జరుపుకొండ్రు లెల్ల చక్కగాను ౹౹
రిప్లయితొలగించండిఆ.వె:మూడు దినములందు ముంగిళ్ళముందట
అలికి పేడతోడ అందమైన
ముగ్గు లేయు చుండ మురియగ పెద్దలు
రంగవల్లికాంతి రహిని గూర్చు.
ఆ.వె:భోగి పండు గిడును భోగ భాగ్యంబుల
ననుచు పెద్దలనగ నాదరాన
వాయనముల నిచ్చి బ్రాహ్మల దీవెన
లందుచుందు రతివ లవని యందు.
తే.గీ: జనవరి నెలలో ప్రతియింట జగతియందు
ముదిత లుకలాపిజల్లుచు ముగ్గులిడుచు
రంగవల్లికలందున మంచి రంగు నింప
ముదముతోనెల్లవారలు మురియుచుంద్రు.
తే.గీ:వానలుకురియ చక్కగ నవని యందు
అన్నదాతలకెల్లను హర్ష మొదవ
పంటలిలుచేర ,నేతెంచ బంధువులును
రంగ వల్లుల కాంతితో క్రాంతి వచ్చె.
ఆ.వె:.తోకతోడ తాను తుర్రున నెగిరెడు
గాలిపటమునిదియె గనుడు గనుడు
దారముంచి చేత దాష్టికమును జూప
రివ్వు మంచు నెగురురిక్క వరకు.
ఆ.వె:.రాచఠీవి తోడ రంజన మొనరించు
గాలిపటము లివిగొ ఘనము గాను
నేనె గొప్ప యనుచు నింగిపై కెగరంగ
చూడచూడ వీని జోరు హెచ్చె.
రఘురామ్ గారూ,
రిప్లయితొలగించండిమీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
'కాల మొదలు వేళ' అన్నది బాగుగా లేదు. "ఉత్తరాయణమున కొదుగు వేళ" అనండి. 'రంగవల్లులు+ఇంటి = రంగవల్లు లింటి' అవుతుంది. యడాగమం రాదు. "రంగవల్లులె యింటి..." అనండి. 'వాడు+ఆడువేళ = వా డాడువేళ' అవుతుంది. యడాగమం రాదు. "బుడుబుడుక్కలవార లాడువేళ" అనండి. అలాగే "కొలువైన వేళను" అనండి.
*****
డా. ఉమాదేవి గారూ,
మీ ఆరు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మూడవ పూరణ మూడవ పాదంలో గణదోషం. 'మంచి' పదాన్ని తొలగించండి.
నాల్గవ పూరణ మొదటి పాదంలో యతి తప్పింది. "వానలు కురియ చక్కగ వసుమతిపయి" అందామా?
"వసుమతి"?
తొలగించండిశాస్త్రి గారూ,
తొలగించండినిజమే. ఆ పదం అక్కడ పొసగదు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండినేటి అంశము :: నిషిద్ధాక్షరి ( శ ష స అనే అక్షరాలు లేకుండా పద్యాలు వ్రాయాలి.)
విషయం ::సంక్రాంతి సంబరాలు.
ఛందస్సు :: ఏ ఛందస్సులోనైనా సరే పద్యాలు వ్రాయవచ్చు.
సందర్భం :: సుస్పష్టము
ఛందస్సు :: మత్తకోకిల
భోగిమంటలు వేయుచుందురు ముంగిటన్ గన వెచ్చగా
వేగ బొమ్మల కొల్వు లుండును పిల్ల లందరు మెచ్చగా
భోగి పళ్లను పోయుచుందురు ముద్దుబిడ్డలు చేరగా
భోగిపండుగ చూడగా నిల భోగమున్ కలిగించుగా.
చెంగునన్ మకరమ్ము లోనికి చేరు భానుడు హంగుగా
రంగవల్లులు వేయుచుందురు రాగముల్ చిగురింపగా
పొంగలిన్ దిన జేయుచుందురు పూర్తిగా ధన మందగా
పొంగి పెద్దల పూజ జేతురు మ్రొక్కి పెద్దల పండుగన్.
రచన కోట రాజశేఖర్ నెల్లూరు. (14.01.2018)
మధుర లయాన్వితము 👏
తొలగించండికోట రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ రెండు మత్తకోకిలా వృత్తాలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.